
న్యూఢిల్లీ: దేశీ, విదేశీ రూట్లలో వచ్చే నెల నుంచి కొత్త విమాన సర్వీసులను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా బుధవారం తెలిపింది. వేసవి సెలవుల దృష్ట్యా జూన్ 1 నుంచి వారానికి అదనంగా 3,500 సీట్లను ముంబై– దుబాయ్– ముంబై మార్గంలో, జూన్ 2 నుంచి వారానికి అదనంగా 3,500 సీట్లను ఢిల్లీ–దుబాయ్–ఢిల్లీ మార్గంలో రెండు కొత్త బీ787 డ్రీమ్‌లైనర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు తెలియజేసింది.
ప్రమోషనల్ ధరలో భాగంగా 2019 జూలై 31 వరకు దుబాయ్‌కు ఒకవైపు ఎకానమీ క్లాస్ ధరను రూ7,777గా నిర్ణయించినట్లు తెలియజేసింది. దేశీయంగా ఢిల్లీ–భోపాల్–ఢిల్లీ రూట్‌లో వారానికి 14 విమాన సర్వీసుల నుంచి 20 విమాన సర్వీసులకు అదేవిధంగా ఢిల్లీ–రాయ్‌పూర్–ఢిల్లీ రూట్‌లో ఉన్న వారానికి 7 విమాన సర్వీసులను వారానికి 14 విమాన సర్వీసులకు పెంచామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment