టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ‘ఫ్లాష్ సేల్’ని ప్రారంభించింది. రూ.932కే విమాన టికెట్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈ ధర కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే వర్తిస్తుందని చెప్పింది. సెప్టెంబర్ 16, 2024లోపు బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, మార్చి 31, 2025 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.
రూ.932తో ప్రారంభమయ్యే బేస్ ఛార్జీలతో పాటు, వివిధ మార్గాల్లో రూ.1,088 నుంచి టికెట్‌లను విక్రయిస్తోంది. తక్కువ ధరకు ఆఫర్ చేసే రూట్లలో ఢిల్లీ-గ్వాలియర్, గౌహతి-అగర్తలా, బెంగళూరు-చెన్నై, కొచ్చి-బెంగళూరు తదితరాలు ఉన్నాయి. airindiaexpress.com ద్వారా తమ టిక్కెట్‌లను బుక్ చేసుకునే కస్టమర్‌లు ప్రత్యేక రాయితీ కలిగిన ‘ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌ప్రెస్ లైట్’ ఛార్జీలను పొందవచ్చని పేర్కొంది. ఉచితంగా 3 కిలోల కేబిన్ బ్యాగేజీని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని చెప్పింది.
ఇదీ చదవండి: రుణాలు పీక్... డిపాజిట్లు వీక్
చెక్-ఇన్ బ్యాగేజీ ధరలను దేశీయ విమానాల్లో 15 కిలోలకు రూ.1000, అంతర్జాతీయ విమానాల్లో 20 కిలోలకు రూ.1300గా నిర్ణయించారు. విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సభ్యులకు సంస్థ ప్రత్యేక తగ్గింపు ధరలు అందిస్తుంది. ఇదిలాఉండగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన విమానాల సంఖ్యను పెంచబోతున్నట్లు గతంలో పేర్కొంది. ప్రతి నెలా దాదాపు నాలుగు కొత్త విమానాలను ప్రారంభిస్తామని తెలిపింది. ఏయిర్ ఏషియాతో విలీన ప్రక్రియ ప్రారంభించిన అక్టోబర్ 2023 నుంచి ఇప్పటివరకు 30కి పైగా కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment