Air India
-
విమానంలోనూ వైఫై
దేశీయ ప్రయాణం కోసం విమానం ఎక్కుతున్నామంటే మన మొబైల్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాల్సిందే. నో సిగ్నల్స్.. నో ఇంటర్నెట్... సెల్‌ఫోన్‌ని మడిచి లోపల పెట్టుకోవాల్సిందే. ఇది ఒకప్పటి మాట. కానీ ఇకమీదట... విమానంలో ప్రయాణిస్తూ ఇంటర్నెట్ ద్వారా సినిమాలు చూడొచ్చు. మీ బంధువులు, స్నేహితులతో వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. ఆఫీస్ పని చేసుకోవచ్చు. ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఎయిర్ ఇండియా.దేశీయ విమాన ప్రయాణికులకు కొత్త ఏడాదిలో సరికొత్త కానుక అందిస్తోంది ఎయిర్ ఇండియా. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. తమ విమానాల్లో ప్రయాణించే దేశీయ ప్రయాణికులకు వైఫై ద్వారా జనవరి 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభ ఆఫర్లా ఈ సదుపాయాన్ని కొంతకాలం ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని సర్వీసులకే పరిమితమైన ఈ సౌకర్యం త్వరలో ఎయిర్ ఇండియాలోని అన్ని విమానాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తారట. ఒకరు ఒకే సమయంలో ఒకటికంటే ఎక్కువ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటివాటితోనూ కనెక్ట్ కావొచ్చు. ఇప్పటికే ఎయిర్ఇండియా న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వెళ్లే విదేశీ విమానాల్లో పైలట్ ప్రోగ్రామ్‌గా ఈ సదుపాయం అందిస్తోంది.ఎయిర్ ఇండియా వైఫై ఇలా..ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే ప్రయాణికులు వైఫై ఆన్ చేసి, సెటింగ్స్‌లో ‘ఎయిర్ ఇండియా వైఫై నెట్వర్క్’ ఎంపిక చేసుకోవాలి. ఎయిర్ ఇండియా పోర్టల్‌కు వెళ్లాక పీఎన్ఆర్ వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తరవాత ఇంటర్నెట్ సేవలు వాడుకోవచ్చు.ఏయే విమానాల్లో..?అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్‌బస్ ఎ350, బోయింగ్ 787–9, ఎంపికచేసిన ఎ321 నియో నియో విమానాలువిమానంలో నెట్ ఎలా?భూమ్మీద నెట్ వాడాలంటే మన చేతిలో ఒక ఫోనో ల్యాప్‌టాపో ఉండి.. సమీపంలో సెల్ టవర్ ఉంటే సరిపోతుంది. కానీ విమానం అలా కాదు కదా. విమానాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్ రావాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. భూమిపై ఉండే సెల్ టవర్లు. దీన్నే ఎయిర్ టు గ్రౌండ్ (ఏటీజీ) టెక్నాలజీ అంటారు. ఇక రెండోది శాటిలైట్ ఆధారిత కనెక్షన్. ఈ రెండూ పనిచేయాలంటే విమానం లోపలా, బయటా ప్రత్యేక యాంటెనాల వంటి కొన్ని పరికరాలు అమర్చాలి. వైఫై లేనప్పుడు మన సమీపంలో ఎవరికైనా నెట్ కావాలంటే ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో హాట్‌స్పాట్ ఆప్షన్ ఆన్ చేసి నెట్ ఇస్తాం. మన ఫోన్ మరొకరికి హాట్ స్పాట్‌లా ఎలా మారుతుందో.. యాంటెనాలూ, సర్వర్లు, రౌటర్ల వంటి వాటితో ఉన్న విమానం వందలాది మంది ప్రయాణికులకు ఒక హాట్ స్పాట్‌లా మారిపోతుంది.సెల్ టవర్ సిగ్నల్స్ఈ సిగ్నళ్లు అందుకోడానికి విమానం కింది లేదా అడుగు భాగంలో యాంటెనాలు ఏర్పాటు చేస్తారు. విమానం భూమి మీద బయలుదేరగానే ఆ యాంటెనాలు.. సమీపంలోని సెల్ టవర్ల నుంచి సిగ్నళ్లు అందుకుంటాయి. ఆ సిగ్నళ్లు క్యాబిన్ సర్వర్‌కు, అక్కడి నుంచి రౌటర్‌కు వెళ్తాయి. అక్కడి నుంచి ప్రయాణికులకు వెళ్లి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాయి.శాటిలైట్ సిగ్నల్స్సెల్ టవర్ల ద్వారా సిగ్నల్ అందు తున్నంతసేపూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సముద్రాలు, ఎడారి ప్రాంతాల వంటి వాటి పైనుంచి వెళ్లేటప్పుడు సెల్ టవర్ సిగ్నళ్లు అందవు. శాటిలైట్ సిగ్నళ్ల సాయం కావాల్సిందే. ఇందుకోసం విమానం పై భాగంలో యాంటెనా లు ఏర్పాటుచేస్తారు. అవి తమకు అత్యంత సమీపంలోని శాటిలైట్‌తో అనుసంధానమవుతాయి. ప్రయాణికుల ఫోన్లు, ల్యాప్‌టాపుల వంటివి విమాన క్యాబిన్లో ఉండే వైఫై యాంటెనాకు కనెక్ట్ అవుతాయి.ఆ పరికరాల నుంచి ఈ యాంటెనాలకు వచ్చే సిగ్నళ్లు విమానంలోని సర్వర్‌కు వెళ్తాయి. విమానం పైన ఉండే యాంటెనా ద్వారా ఆ సిగ్నళ్లు శాటిలైట్‌కు వెళతాయి. శాటిలైట్ వాటిని భూమిపై ఉండే స్టేషన్ లేదా టెలిపోర్టుకు పంపితే అక్కడి నుంచి తిరిగి సిగ్నళ్లు శాటిలైట్‌కు అందుతాయి. వాటిని విమానానికి పంపుతుంది శాటిలైట్. శాటిలైట్ సిగ్నళ్లు విమానంలోకి క్యాబిన్ సర్వర్‌కు, అక్కడి నుంచి రౌటర్‌కు వెళ్తాయి. అలా ప్రయాణికులు నెట్ వాడుకోవచ్చు.ఏటీజీ – శాటిలైట్ఏటీజీ ద్వారా ఇంటర్నెట్ అంటే చాలా పరిమితులు ఉంటాయి. అంతరాయాలు ఎక్కువ, స్పీడు కూడా తక్కువ ఉండొచ్చు. కానీ, శాటిలైట్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్లో అంతరాయాలు తక్కువని, స్పీడు కూడా ఎక్కువని అంతర్జాతీయ విదేశీ ప్రయాణికుల అనుభవాలు చెప్తున్నాయి.2003లో మొదటిసారిగా...⇒ 2003 జనవరి 15న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ మొట్టమొదటగా తమ అంతర్జాతీయ విమానంలో ప్రయాణికులకు ఇంటర్నెట్ అందించింది.⇒ దేశీయ విమాన ప్రయాణికులకు (2013లో) ఇంటర్నెట్ అందించిన మొదటి సంస్థ అమెరికాకు చెందిన జెట్ బ్లూ.⇒ ప్రపంచంలో ప్రస్తుతంవైఫై ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న కొన్ని విమానయాన సంస్థలు నార్వేజియన్ ఎయిర్‌లైన్స్, ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్, ఫిజి ఎయిర్వేస్, జెట్ బ్లూ, ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్వేస్, డెల్టా ఎయిర్వేస్, మొదలైనవి.‘ప్రయాణాల్లో ఇప్పుడు ‘కనెక్టివిటీ’ తప్పనిసరి అవసరమైపోయింది. కొంతమంది సరదాకోసం, షేరింగ్ కోసం ఇంటర్నెట్ వాడితే, మరికొందరు తమ వృత్తి, వ్యాపార అవసరాల కోసం వాడుతుంటారు. ఎయిర్ ఇండియా ఈ సదుపాయం తీసుకొచ్చి విమానాల్లో సరికొత్త ప్రయాణ అనుభూతి అందిస్తోంది. – ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అధికారి రాజేష్ డోగ్రా -
విమానాల్లో వైఫై.. ఫ్రీగా ఇంటర్నెట్
విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) దేశీ, విదేశీ రూట్లలో నడిపే ఫ్లయిట్స్‌లో వైఫై (Wi-Fi) ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసులను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఎయిర్‌బస్ ఏ350, బోయింగ్ 787–9 రకం విమానాలతో పాటు నిర్దిష్ట ఎయిర్‌బస్ ఏ321నియో ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.దేశీయంగా ఫ్లయిట్స్‌లో వైఫై సర్వీసులను ప్రవేశపెట్టిన తొలి విమానయాన సంస్థ తమదేనని ఈ సందర్భంగా కంపెనీ తెలిపింది. దేశీ రూట్లలో ప్రస్తుతానికి వీటిని కాంప్లిమెంటరీగా అందిస్తున్నట్లు వివరించింది. క్రమంగా అన్ని విమానాల్లోనూ ఈ సేవలు ప్రవేశపెడతామని పేర్కొంది.విమానాలు 10,000 అడుగుల ఎత్తు దాటాకా ప్రయాణికులు తమ ల్యాప్ టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను వైఫైకి కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ సేవలు ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించించింది.ఎయిర్ ఇండియా అంతర్జాతీయ రూట్లలో పైలట్ ప్రోగ్రామ్‌గా గతంలో ఈ సర్వీసును ప్రారంభించింది. వీటిలో న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి ప్రధాన గమ్యస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు దేశీయ రూట్లలో కూడా దీన్ని అమలు చేస్తున్నారు. వై-ఫై సేవలను క్రమంగా ఇతర విమానాలకు కూడా విస్తరిస్తారు. -
అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది?
చూస్తుండగానే 2024 వెళ్లిపోయింది. 2025లోకి మనం ప్రవేశించాం. జనవరి ఒకటి సందర్భంగా ప్రపంచమంతా సంబరాలు జరుపుకుంటోంది. ఇదేవిధంగా నాటి 1978 నూతన సంవత్సరం తొలి రోజున ప్రపంచమంతా ఉత్సవవాతావరణంలో మునిగి తేలులోంది. ఇంతలో పిడుగులాంటి వార్త వినిపించింది. దీంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ముంబైకి మూడు కిలోమీటర్ల దూరంలో1978, జనవరి ఒకటిన ముంబైకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఘోర విమాన ప్రమాదం(plane crash) చోటుచేసుకుంది. దుబాయ్‌కి బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే నిప్పులను ఎగజిమ్మింది. విమానంలోని పరికరాలు లోపభూయిష్టంగా ఉండటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ విమాన ప్రమాదం అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఒకటిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ప్రమాదంలో 213 మంది ప్రయాణికులు మృతిచెందారు.అంతా అనుభవజ్ఞులే..1978, జనవరి ఒకటిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855(Air India Flight 855) ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. అప్పట్లో ఈ విమానాశ్రయాన్ని శాంటా క్రజ్ విమానాశ్రయంగా పిలిచేవారు. తరువాత దాని పేరు సహర్ విమానాశ్రయంగా మార్చారు. ఈ విమానాన్ని 51 ఏళ్ల కెప్టెన్ మదన్ లాల్ కుకర్ నడిపారు. ఆయన 1956లో ఎయిర్ ఇండియాలో చేరారు. పైగా అతనికి 18,000 గంటల విమానయాన అనుభవం ఉంది. ఫ్లైట్ ఇంజనీర్ అల్ఫ్రెడో ఫారియా(53) 955లో ఎయిర్ ఇండియాలో చేరారు. అతనికి 11,000 గంటల అనుభవం ఉంది. అలాగే వింగ్ కమాండర్ ఇందు వీరమణి(42) భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నుండి పదవీ విరమణ పొందారు. అతనికి 11,000 గంటల విమానయాన అనుభవం ఉంది. అనుభవజ్ఞులైన వీరంతా అదే విమానంలో ఉన్నారు.ఉండాల్సినంత ఎత్తును చేరుకోలేక..ఈ విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాత, విమానం అకస్మాత్తుగా ఎడమవైపుకు తిరగడం ప్రారంభించింది. ఆ తర్వాత విమానం ఉండాల్సినంత ఎత్తును చేరుకోలేకపోయింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ నుండి అందిన డేటా ప్రకారం చూసుకుంటే విమానం ఎత్తును తెలిపే సూచిక పాడైపోయింది. దీంతో కెప్టెన్ ఎత్తును అంచనా వేయలేకపోయారు. చీకటిగా ఉండటానికి తోడు, కింద అరేబియా సముద్రం ఉండడంతో విమనం నడుపుతున్న సిబ్బందికి విమానం ఎత్తు, స్థానం గురించి సమాచారం లభించలేదు.ఇన్పుట్లు సక్రమంగా లేకపోవడంతో..విమానాన్ని రోలింగ్ చేసి నిఠారుగా చేసేందుకు కెప్టెన్ ప్రయత్నించగా, ఇంతలోనే అది సముద్రంలో కూలిపోయింది. విమానం 35 డిగ్రీల కోణంలో అరేబియా సముద్రాన్ని తాకింది. విమానంలోని 190 మంది ప్రయాణికులు, 23 మంది సిబ్బంది ఈ ప్రమాదంలో మృతిచెందారు. విమాన శిథిలాలను పరిశీలించగా అధికారులకు అక్కడ ఎలాంటి పేలుడు లేదా అగ్ని ప్రమాదం లేదా ఎలక్ట్రానిక్ వైఫల్యం(Electronic failure) గురించిన సమచారం లభించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన దరిమిలా.. పైలట్‌కు అందిన ఇన్పుట్లు సక్రమంగా లేవు. ఫలితంగా అతను విమానం ఎత్తును గుర్తించలేకపోయాడు. ఈ నేపధ్యంలోనే ప్రమాదం జరిగిందని వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: New Year 2025: మనీ ఆర్డర్ పుట్టిన వేళ.. గ్రామగ్రామాన సంబరాలు -
చేతులు మారిన కంపెనీలు.. ఈ ఏడాది బిగ్ డీల్స్ ఇవే..
ఈ కేలండర్ ఏడాది(2024)లో మీడియా, సిమెంట్, ఎయిర్‌లైన్స్ తదితర రంగాలలో భారీ కొనుగోళ్లు, విలీనాలు జరిగాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్– డిస్నీ ఇండియా (Reliance-Disney) డీల్తోపాటు.. ఎయిర్ ఇండియా (Air India Deal), విస్తారా విలీనం, అదార్ పూనావాలా– థర్మ ప్రొడక్షన్స్ డీల్, భారత్ సీరమ్స్‌ను సొంతం చేసుకున్న మ్యాన్‌కైండ్ ఫార్మా, అంబుజా సిమెంట్స్ చేతికి పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ తదితరాలు చేరాయి. వివరాలు ఇలా..భారీ మీడియా సంస్థగా డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా సంస్థలు, గ్లోబల్ దిగ్గజం వాల్ట్ డిస్నీకి చెందిన దేశీ విభాగంతో రూ. 70,000 కోట్ల విలువైన విలీనానికి తెరతీశాయి. తద్వారా గ్లోబల్ మీడియా సంస్థ ఆవిర్భావానికి ఊపిరిపోశాయి. వెరసి 2024 నవంబర్ 14కల్లా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేశాయి. దీనిలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 16.34 శాతం, వయాకామ్18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు లభించాయి.టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ 2022లో ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను చేజిక్కించుకున్న టాటా గ్రూప్ దిగ్గజం విస్తారాను విలీనం చేసుకుంది. 2024 అక్టోబర్‌లో ఏఐఎక్స్ కనెక్ట్‌తో చౌక టికెట్ ధరల ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను విలీనం చేసిన తదుపరి విస్తారాతో ఎయిర్ ఇండియాను మరింత విస్తరించింది. వెరసి ప్రస్తుతం ఎయిర్ ఇండియా 5,600 వీక్లీ విమానాలతో 90కుపైగా ప్రాంతాలను కలుపుతూ సర్వీసులు అందిస్తోంది. విలీనంలో భాగంగా కొత్త సంస్థలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ 25.1 శాతం వాటాను పొందింది.వ్యాక్సిన్ల సంస్థ మీడియావైపు వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్‌కు చెందిన థర్మ ప్రొడక్షన్స్ అండ్ థర్మాటిక్ ఎంటర్టైన్మెంట్పై దృష్టి పెట్టారు. వెరసి పూనావాలా 50 శాతం వాటా దక్కించుకోగా.. కరణ్ జోహార్ వాటా 50 శాతంగా కొనసాగుతోంది. కరణ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఫార్మా చేతికి వ్యాక్సిన్లు హెల్త్‌కేర్ రంగ లిస్టెడ్ కంపెనీ మ్యాన్‌కైండ్ ఫార్మా వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్‌తో డీల్ కుదుర్చుకుంది. భారత్ సీరమ్స్‌ను రూ. 13,768 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా మహిళా ఆరోగ్య పరిరక్షణ, ఫెర్టిలిటీ ఔషధాలలోనూ కార్యకలాపాలు విస్తరించేందుకు మ్యాన్‌కైండ్ ఫార్మాకు తోడ్పాటునిచ్చింది.సిమెంటింగ్ డీల్ డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ సంస్థకు చెందిన అంబుజా సిమెంట్స్ విస్తరణపై కన్నేసింది. దీనిలో భాగంగా పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ను రూ. 10,422 కోట్లకు సొంతం చేసుకుంది. తద్వారా 2024 ఆగస్ట్ 16కల్లా పెన్నా సిమెంట్‌ను పూర్తి అనుబంధ కంపెనీగా మార్చుకుంది. మరోవైపు ఓరియంట్ సిమెంట్‌లో దాదాపు 47 శాతం వాటాను 45.1 కోట్ల డాలర్ల(రూ. 3,800 కోట్లు)కు కొనుగోలు చేసే బాటలో సాగుతోంది. విస్తరణలో భాగంగా దక్షిణాది మార్కెట్లో విస్తరించే ప్రణాళికల్లో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్.. ఇండియా సిమెంట్స్‌పై గురి పెట్టింది. తొలుత 23 శాతం వాటాను సొంతం చేసుకున్న అల్ట్రాటెక్ తదుపరి ప్రమోటర్ల నుంచి మరో 32.72 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు దాదాపు రూ. 4,000 కోట్లవరకూ వెచ్చించింది. దీంతో ఇండియా సిమెంట్స్‌లో వాటాను 55 శాతానికి చేర్చుకుంది. ఈ బాటలో తాజాగా ఓరియంట్ సిమెంట్‌లో 8.69 శాతం వాటాను రూ. 851 కోట్లకు చేజిక్కించుకుంది. -
గాలిలో ప్రాణాలు
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో వైమానిక భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. గత ఐదారేళ్లుగా అత్యంత ఘోరమైన ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది... టేకాఫ్ అయిన కాసేపటికే... గత ఐదేళ్లలో అత్యంత విషాదకరమైన, చర్చనీయమైన విమాన ప్రమాదం లయన్ ఎయిర్ ఫ్లైట్ 610. 2018 అక్టోబర్ 29న ఇండోనేసియాలోని జకార్తా నుంచి పాంగ్‌కల్ పినాంగ్‌కు బయలుదేరిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే జావా సముద్రంలో కూలిపోయింది. 189 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది చనిపోయారు. విమానంలోని ఆగ్మెంటేషన్ సిస్టమ్ (ఎంసీఏఎస్)లో లోపమే ప్రమాదానికి కారణమని తేలింది. బోయింగ్ విమానాల రూపకల్పన, ఏవియేషన్ రెగ్యులేటర్లు, ముఖ్యంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్ఏఏ) పర్యవేక్షణలో తీవ్ర లోపాలను ఈ దుర్ఘటన ఎత్తిచూపింది. ఐదు నెలలకే మరోటి... లయన్ ఎయిర్ ప్రమాదం జరిగిన ఐదు నెలలకే మరో బోయింగ్ 737 మ్యాక్స్ కూలిపోయింది. 2019 మార్చి 10న ఇథియోపియా ఎయిర్‌లైన్స్ విమానం 302 అడిస్ అబాబా నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది చనిపోయారు. దీనికీ ఎంసీఏఎస్ వ్యవస్థే కారణమని తెలిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన అధికారులు మాక్స్‌ను నిలిపివేశారు. బోయింగ్ చట్టపరమైన, ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంది. సముద్రంలో కూలిన విమానం... 2021 జనవరి 9న ఇండోనేషియాలోని జకార్తాలో విమాన ప్రమాదం జరిగింది. సోకర్నో–హట్టాలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాంటియానాక్కు బయలుదేరిన బోయింగ్ 737–500 విమానం సముద్రంలో కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సముద్రంలో కూలిపోవడంతో అందులో ఉన్న 62 మంది చనిపోయారు. ఇండోనేషియాలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇది. యాంత్రిక వైఫల్యం, మానవ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విమానంలోని ఆటోథ్రోటిల్ సిస్టమ్‌లో లోపం వల్ల విమానం ఇంజన్లు అసమతుల్యం కావడంతో అదుపు తప్పి కూలిపోయింది. పైలట్ పరిస్థితికి తగిన విధంగా స్పందించడంలో విఫలమయ్యారని తేలింది. ఈ ప్రమాదం పాత విమానాల నిర్వహణలో అప్రమత్తతను, విమానాల అప్‌గ్రేడేషన్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. యాంత్రిక వైఫల్యాలు తలెత్తినప్పుడు ప్రతిస్పందించడానికి విమానయాన సిబ్బంది అందరికీ శిక్షణ ఇవ్వాలని ఉద్ఘాటించింది.ఇళ్లపైనే కూలిన విమానం.. 2020 మే 22న పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఫ్లైట్ 8303, ఎయిర్‌బస్ ఎ 320 కరాచీలోని ఇళ్లపై కూలిపోయింది. లాహోర్ నుంచి బయలుదేరిన ఈ విమానంలో 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ల్యాండింగ్ సమయంలో పైలట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ల్యాండింగ్ గేర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా విమానం రన్ వేపైకి దూసుకెళ్లడంతో ఇంజన్లు ధ్వంసమయ్యాయి. చివరకు అదుపు తప్పిన విమానం నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లింది. పైలట్లుప్రామాణిక అత్యవసర విధానాలను పాటించలేదని విమానం బ్లాక్ బాక్స్ వెల్లడించింది. ఈ ప్రమాదం పైలట్ల శిక్షణ, నియంత్రణ పర్యవేక్షణలో లోతైన లోపాలను బహిర్గతం చేసింది. పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీలో శిక్షణ నాణ్యతపై విచారణకు దారితీసింది, రన్‌వే నుంచి జారి లోయలో పడి... గత ఐదేళ్లలో భారత్‌లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం 1344ది. దుబాయ్ నుంచి వచి్చన ఈ విమానం 2020 ఆగస్టు 7న కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 165 మంది ఉండగా.. 21 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా రన్‌వే తడిసిపోయి ఉంది. ఇక్కడ రన్‌వే పొడవు కూడా తక్కువగా ఉండటంతో ల్యాండ్ అయిన విమానం జారి లోయలో పడిపోయింది. వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదం, రన్ వే మౌలిక సదుపాయాల సరిగా లేకపోవడం వల్ల జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదం తరువాత దేశంలోని విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను సమీక్షించారు. రన్‌వే నుంచి జారి..నేపాన్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పొఖారాకు బయల్దేరిన విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. 18 మంది మృతి చెందగా, పైలట్ కెపె్టన్ ఎంఆర్ షాక్యా తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రన్‌వే దక్షిణం వైపు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా, రెక్కల కొన భూమిని తాకడంతో ఒక్కసారిగా పలీ్టలు కొట్టింది. దీంతో వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి.మంచు కారణంగా... ఈ సంవత్సరం బ్రెజిల్ విమానయాన సంస్థకు చెందిన వోపాస్ 2283, ఏటీఆర్ 72 ట్విన్ఇంజన్ టర్బోప్రాప్ ఆగస్టు 9న కూలిపోయింది. 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమానం.. సావోపావో సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారంతా మరణించారు. విమాన ప్రమాదానికి మంచు కారణమని తేలింది. పండుగ రోజున ప్రమాదం.. ఇటీవలే.. క్రిస్మస్ పర్వదినాన అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ప్రమాదం జరిగింది. అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజీ్నకి వెళ్తుండగా కాస్పియన్ సముద్ర సమీపంలో కూలిపోయింది. విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా 38 మంది మరణించారు. ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులను తిప్పికొడుతున్న రష్యా వైమానిక రక్షణ దళాలు విమానాన్ని కూలి్చవేశాయని రష్యా అంగీకరించింది. దాడి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్ క్షమాపణ చెప్పారు. వీడని మిస్టరీ.. చైనాలో జరిగిన అత్యంత విషాద ఘటనల్లో ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంయూ 5735 కుప్పకూలడం ఒకటి. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737–800.. 2022 మార్చి 21న దక్షిణ చైనాలోని పర్వతాల్లో కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది సహా విమానంలో ఉన్న 132 మంది మరణించారు. విమానం ఎత్తునుంచి కిందికి దించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తాత్కాలిక దర్యాప్తులో తేల్చారు. విమానం వేగంగా, ఉద్దేశపూర్వకంగా ల్యాండ్ చేసినట్లు బ్లాక్ బాక్స్ డేటా వెల్లడించింది. ఈ ప్రమాదం యాంత్రిక వైఫల్యమా, మానవ తప్పిదమా అనే విషయంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ విపత్తుకు అసలు కారణం మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎయిర్ఇండియా విమానంలో ప్రయాణికుల బాహాబాహీ
న్యూఢిల్లీ:ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్‌రెస్ట్ కోసం కొట్టుకున్నారు. డెన్మార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం ఎకానమి తరగతిలో సీటు పక్కన చేయి పెట్టుకునే ఆర్మ్‌రెస్ట్ విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య తొలుత వాగ్యుద్ధం జరిగింది. విమానంలోని క్యాబిన్ సిబ్బంది వారి సమస్యను పరిష్కరించి అందులో ఒకరికి దూరంగా మరో సీటు కేటాయించారు. ఆదివారం(డిసెంబర్22) ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత వేరే సీటుకు వెళ్లిపోయిన ప్రయాణికుడు తన లగేజ్ కోసం తన పాత సీటు వద్దకు మళ్లీ వచ్చాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మళ్లీ వాగ్యుద్ధం స్టార్టయింది. ఈసారి గొడవ ఏకంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్లింది. అయితే ఈ గొడవ చివరకు సమసిపోయిందని, ఇద్దరు స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకుని ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయారని ఎయిర్ఇండియా అధికారులు తెలపడం గమనార్హం. -
శంషాబాద్‌లో చెన్నై-పూణే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో Air India విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వాతావరణం అనుకూలించని కారణంగా విమానం శంషాబాద్‌లో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. చెన్నై-పూణే ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం శంషాబాద్‌లో అత్యవసరంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం దాదాపు మూడు గంటల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. అనంతరం, పైలట్ విమానాన్ని శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు సమాచారం. ఇక, ఎయిర్ ఇండియా విమానంలో 180 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.An Air India exp flight from Chennai to Pune has diverted to Hyd. Nearly 3 hrs in the air. pic.twitter.com/ywnbnMtG50— Mahesh (@Hanumanbhakt000) December 21, 2024 -
విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఉన్నత చదువుల కోసం దేశంలో ఇతర ప్రాంతాలతోపాటు, ఇతర దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులకు విమాన ధరలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అదనంగా 10 కిలోల వరకు బ్యాగేజ్‌ను కూడా అనుమతిస్తున్నట్లు పేర్కొంది.అర్హతలు ఇవే..దేశీయ ప్రయాణాలు చేయాలనుకునే విద్యార్థుల వయసు 12 ఏళ్ల వరకు ఉండాలి. అదే అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు 12-30 ఏళ్ల వయసు వరకు ఉండొచ్చు. అడ్మిషన్ పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ప్రభుత్వ గుర్తింపు పొందిందై ఉండాలి. విద్యార్థులు కనీసం ఒక విద్యాసంవత్సరం ఫుల్ టైమ్ కోర్సులో చేరి ఉండాలి.ఇదీ చదవండి: యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై సెబీ కొరడాఎక్కడ బుక్ చేసుకోవాలి..?ఈ ఆఫర్ వినియోగించుకోవాలనుకునే విద్యార్థులు ఎయిరిండియా అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, కస్టమర్ కాంటాక్ట్ సెంటర్, ఎయిర్పోర్ట్ టికెటింగ్ కార్యాలయాల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఎయిరిండియా బ్యాంకు పార్టనర్లు జారీ చేసిన క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే అందనంగా ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. అధికారిక వెబ్సైట్ నుంచి బుక్ చేసుకునే విద్యార్థులకు కన్వినియెన్స్ ఛార్జీల రూపంలో ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయబోమని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. దానివల్ల దేశీయ విమానాల్లో ప్రయాణించే విద్యార్థులు రూ.399, అంతర్జాతీయ విమానాల్లో వెళ్లేవారు రూ.999 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. -
మరో 100 విమానాలకు ఎయిరిండియా ఆర్డరు
విమానయాన సంస్థ ఎయిరిండియా మరో 100 ఎయిర్‌బస్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. వీటిలో వైడ్–బాడీ ఏ350 రకం ఎయిర్‌క్రాఫ్ట్‌లు 10, ప్రాంతీయ రూట్లలో ఉపయోగించే నారో–బాడీ ఎ320 రకం విమానాలు 90 ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలకు ఇచ్చిన 470 విమానాలకు ఇవి అదనం.అలాగే ఎ350 ఎయిర్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలు, నిర్వహణ సహకారం కోసం ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిరిండియా తెలిపింది. తాజా ఆర్డరుతో కలిపి ఎయిర్‌బస్ నుంచి ఎయిరిండియా కొనుగోలు చేసే మొత్తం ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 350కి చేరుతుంది. 2023లో కంపెనీ 250 విమానాల కోసం ఆర్డరిచ్చింది."భారత ప్రయాణికుల వృద్ధి ప్రపంచంలోని ఇతర దేశాలను అధిగమించడం, గణనీయంగా మెరుగుపడుతున్న దేశ మౌలిక సదుపాయాలు, ఆకాంక్షతో కూడిన యువ జనాభా అంతర్జాతీయంగా ఎదుగుతుండటం వంటి పరిణామాలతో ఎయిర్ ఇండియా విస్తరణకు స్పష్టమైన సందర్భాన్ని చూస్తున్నాం" టాటా సన్స్, ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియాలోకి మరో 100 ఎయిర్‌బస్ విమానాలు
టాటా గ్రూప్ యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' (Air India) మరో వంద కొత్త విమానాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇందులో 10 ఏ350 వైడ్‌బాడీ, మరో 90 ఏ320 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి.ఎయిర్ ఇండియా గతేడాది ఎయిర్‌బస్‌కు 250 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 40 ఏ350 విమానాలు, 210 ఏ320 విమానాలు ఉన్నాయి. కొత్తగా చేరనున్న విమానాలతో కలిపి ఎయిర్‌బస్‌కు ఇచ్చిన ఆర్డర్ల సంఖ్య 350కి చేరింది.కొత్త విమానాల కోసం ఆర్డర్ చేయడం మాత్రమే కాకుండా.. ఎయిర్ ఇండియా ఏ350 విమానాలను సంబంధించిన విడి భాగాలు, నిర్వహణ కోసం ఎయిర్‌బస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్‌బస్‌తో 250 విమానాల కోసం గతంలో ఆర్డర్ చేసినప్పుడే.. 220 విమానాల కోసం బోయింగ్‌తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కంపెనీ ఆర్డర్ చేసిన మొత్తం కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 570కి పెరిగింది.కొత్త విమానాలకు ఆర్డర్ చేసిన సందర్భంగా టాటా సన్స్ అండ్ ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. మన దేశంలో మౌలిక సదుపాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. చదువుకోవడానికి లేదా ఉద్యోగం కోసం చాలామంది యువత ఇతర దేశాలకు వెళ్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎయిర్ ఇండియాలో విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు, సేవలను ప్రపంచ నలుమూలలకు విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.100 more @Airbus aircraft! ✈️We are happy to announce new orders for 10 A350s and 90 A320 Family aircraft, adding 100 more aircraft to our firm orders for 250 Airbus aircraft placed last year.With this, the total number of new aircraft we have ordered rises to 570, of which… pic.twitter.com/OmfSWbJwbi— Air India (@airindia) December 9, 2024 -
విశాఖ, గన్నవరంలో పొగ మంచు.. గాల్లోనే విమానాల చక్కర్లు!
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. ఈ క్రమంలో పొగ మంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తడంతో తాజాగా ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.వివరాల ప్రకారం.. గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పొగ మంచు కారణంగా శనివారం తెల్లవారుజామున ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో, ప్రయాణీకులు కొంత ఆందోళనకు గురైనట్టు సమాచారం. ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో హైదరాబాద్‌కు దారి మళ్లించినట్టు తెలుస్తోంది.మరోవైపు.. విశాఖ ఎయిర్‌పోర్టులో కూడా పొగ మంచు అలుముకుంది. పొగ మంచు కారణంగా అనేక విమానాలను దారి మళ్లిస్తున్నారు అధికారులు. బెంగళూరు నుంచి విశాఖ రావాల్సిన రెండు ఇండిగో విమానాలను హైదరాబాద్‌కు డైవర్ట్ చేశారు. ఢిల్లీ నుంచి విశాఖ రావాల్సిన ఇండిగో విమానం భువనేశ్వర్‌కు దారి మళ్లించారు.దారి మళ్లించిన విమానాల వివరాలు..- 6E 581/881 VOMM - VTZ - VOMM (Chennai - Vizag - Chennai) ETA 0615 (1145 IST)- 6E 7064/7063 VOTP -VTZ - VOTP (Tirupati - Vizag - Tirupati) ETA 0840 (1410 IST)- 6E 917/6089 VOMM - VTZ- VOMM (Chennai - Vizag - Chennai) ETA1140 (1710 IST) are cancelled for the day -
విస్తరణ బాటలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ .. గల్ఫ్, మధ్య ప్రాచ్యంలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు ఆగ్నేయాసియాలోనూ తమ కార్యకలాపాలను విస్తరించనుంది. బ్యాంకాక్, సింగపూర్, కొలంబో తదితర కొత్త రూట్లను పరిశీలిస్తున్నట్లు సంస్థ ఎండీ అలోక్ సింగ్ తెలిపారు. 2025 మార్చి వేసవి షెడ్యూల్లో ఖాట్మండూ రూట్లో సరీ్వసులు మొదలుపెడతామని, వచ్చే ఆర్థిక సంవత్సరం లేదా ఆపై సంవత్సరం వియత్నాంకి ఫ్లయిట్స్‌ను ప్రారంభించే అవకాశం ఉందని ఆయన వివరించారు. ప్రధానంగా 5.5–6 గంటల ప్రయాణ దూరం ఉండే రూట్లు, ద్వితీయ .. తృతీయ శ్రేణి నగరాలకు సరీ్వసులపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా కోల్‌కతా నుంచి ఢాకాకు డైరెక్ట్ ఫ్లయిట్స్ ప్రణాళికను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి నాటికి తమ విమానాల సంఖ్యను ప్రస్తుతమున్న 90 నుంచి 100కి పెంచుకోనున్నట్లు సింగ్ చెప్పారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం దేశీయంగా 36, అంతర్జాతీయంగా 15 గమ్యస్థానాలకు నిత్యం 400 ఫ్లయిట్స్ నడుపుతోంది. -
ఎయిరిండియా సేవలపై ఆర్కే రోజా అసహనం
సాక్షి, తిరుపతి: ఎయిర్ ఇండియా సేవలపై ఎక్స్‌లో మాజీ మంత్రి ఆర్కే రోజా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘డిసెంబర్ 2న ఖాట్మండు నుంచి నా ఫ్లైట్ A1 2162 రెండు గంటలు ఆలస్యం అయ్యింది. దీనివల్ల చెన్నై AI 2835 ఫ్లైట్ మిస్ అయ్యాను. నాకు కన్ఫర్మ్ అయిన టికెట్ ఎలాంటి కారణం లేకుండా రద్దు చేశారు.’’ అంటూ రోజా ట్వీట్ చేశారు.డిస్ ప్లే డెస్క్ వద్ద ఉన్న దీపిక, నిధి అహంకారంగా ప్రవర్తించారు. కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. జవాబుదారీతనం లేదు. ఫ్లైట్ అలస్యానికి కనీసం సంజాయిషీ లేదు. క్షమాపణ కూడా చెప్పలేదు. నాకు న్యాయం జరగాలి. టాటా సంస్థ పరివర్తన అంటే ఇదేనా...?’’ అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.Deeply disappointed with #AirIndian 's service on 2nd Dec 2024. Privatization was sold as the magic wand for efficiency, but @airindia 's ground staff at Delhi has proven otherwise.On Dec 2nd my Flight AI216 from Kathmandu was delayed by 2hrs, causing me to miss AI2835 to…— Roja Selvamani (@RojaSelvamaniRK) December 3, 2024 -
బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అదుర్స్
అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్లాక్ ఫ్రైడే సేల్స్ సంస్కృతి ఇప్పుడు భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించింది. దసరా–దీపావళి డిస్కౌంట్ సేల్స్‌కు దీటుగా ఈసారి రిటైల్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో పలు ఉత్పత్తులపై ఏకంగా 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్‌ను ఇస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఐఆర్టీసీ దగ్గర నుంచి ఆన్లైన్ రిటైల్ సంస్థలు, గృహోపకరణాల సంస్థలు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ సందర్భంగా ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీలోపు విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎయిర్ ఇండియా 12 నుంచి 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణ టికెట్ చార్జీలపై 12 శాతం, దేశీయ టికెట్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఐఆర్టీసీ అయితే ఈ ఆఫర్ సమయంలో కన్వేనియన్స్ ఫీజులను తొలగించడంతోపాటు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. – సాక్షి, అమరావతి బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటే..» అమెరికాలో రైతులు తమ పంటల దిగుబడి పూర్తయినందుకు సంతోషంగా ప్రతి ఏడాది నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్’ పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆమెరికాలో జాతీయ సెలవు దినం. » ‘థాంక్స్ గివింగ్ డే’ మరుసటి రోజు వచ్చే శుక్రవారాన్ని ‘బ్లాక్ ఫ్రైడే సేల్స్’ పేరుతో షాపింగ్ కోసం కేటాయిస్తారు.» డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపార సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తాయి. » అమెరికాలో అత్యధికంగా అమ్మకాలు జరిగేది ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లోనే. » ఇప్పుడు ఈ సంస్కృతి నెమ్మదిగా మన దేశంలోకి కూడా విస్తరించింది.ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, మింత్రా వంటి ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా శామ్సంగ్, షియోమీ, సోనీ, హెచ్‌పీ వంటి సంస్థలు కూడా డిస్కౌంట్ ఆఫర్స్‌ను ప్రకటించాయి. సామ్సంగ్ తన గెలాక్సీ ఫోన్లపై రూ.12,000 వరకు, రెడ్మీ అయితే రూ.15,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే అదనపు తగ్గింపును వర్తింపజేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు 35 నుంచి 40శాతం వరకు పెరుగుతాయని ఈ–కామర్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 2న ‘సైబర్ మండే’తో ఈ డిస్కౌంట్ అమ్మకాలు ముగుస్తాయి. -
హైదరాబాద్ నుంచి విస్తారా విమానాలు!
ఎయిర్ ఇండియాలో విలీనమైనప్పటికీ విస్తారా ఎయిర్వేస్కు చెందిన ఏ320 విమానాల సేవలు కొనసాగనున్నాయి. వీటిని దేశంలోని ఐదు కీలకమైన మెట్రో-టు-మెట్రో రూట్లలో నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ముంబైకి ఈ విమానాలు నడుస్తాయి.ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్, ముంబై-బెంగళూరు, ముంబై-హైదరాబాద్ మార్గాల్లో ఏ320 విమానాల సేవలు ఉంటాయని, బిజినెస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ క్లాస్‌లలో ప్రయాణం చేయొచ్చని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. ఈ విమాన సర్వీసులు ఏ12 కోడ్‌తో ప్రారంభమవుతాయని, టికెట్ల బుకింగ్ సమయంలో గమనించాలని సూచించింది.టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో విస్తారా విలీన ప్రక్రియ ఈనెల ప్రారంభంలోనే పూర్తయింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 208 విమానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 67 వైడ్ బాడీ విమానాలు ఉన్నాయి. -
ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శీతాకాల షెడ్యూల్లో భాగంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి తన విమాన సర్వీసులను గణనీయంగా పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పట్టణాల నుంచి వారానికి 173 విమాన సర్వీసులు నడుస్తుండగా, 250కు (45 శాతం అధికం) పెంచుతున్నట్టు తెలిపింది.విశాఖపట్నం, విజయవాడ, గ్వాలియర్‌తో హైదరాబాద్‌కు నేరుగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, హైదరాబాద్ నుంచి బెంగళూరు, కోచికి సర్వీసులు పెరగనున్నట్టు ప్రకటించింది. సర్వీసుల పెంపు ఈ ప్రాంతాల వారికి సౌలభ్యంగా ఉంటుందని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ పేర్కొన్నారు. ప్రతి వారం 200 సర్వీసులతో తమ నెట్ వర్క్‌లో హైదరాబాద్ మూడో అతిపెద్ద కేంద్రంగా ఉన్నట్టు చెప్పారు.హైదరాబాద్ నుంచి నేరుగా 17 దేశీయ విమానాశ్రయాలకు, సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లకు సర్వీసులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ నుంచి ఎయిర్ ఇండియా ఒక్కటే అంతర్జాతీయ సర్వీసులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి ప్రతి వారం 28 విమాన సర్వీసులను దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఎయిర్ ఇండియా నడుపుతోంది. ఇక దేశవ్యాప్తంగా ఈ శీతాకాల సీజన్లో ఎయిర్ ఇండియా 400 రోజువారీ విమాన సర్వీసులు నిర్వహించనున్నట్టు తెలిపింది. గతేడాది ఇదే సీజన్లో 325 రోజువారీ సర్వీసులు నిర్వహించింది. -
రెండు సంస్థలదే ఆధిపత్యం!
దేశంలో మరిన్ని విమానయాన సంస్థలు కార్యకలాపాలు సాగించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం రెండు ప్రముఖ కంపెనీలే అధిక వ్యాపార వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు. విమానయాన రంగంలో రెండు సంస్థలే ఆధిపత్యం కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈటీ ఇండియా అసెండ్స్ ఈవెంట్లో నాయుడు పాల్గొని మాట్లాడారు.‘ఏ పరిశ్రమలోనైనా పోటీ ఉండాలి. దాంతో వినియోగదారులకు తక్కువ ధరలకే సేవలందుతాయి. కానీ విమానయాన పరిశ్రమలో కేవలం రెండు సంస్థలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ రంగం ఈ సంస్థలకే పరిమితం కావడం సరైందికాదు. మరిన్ని కంపెనీలు ఈ విభాగంలో సేవలందించాలి. దాంతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందుతాయి. విమాన ప్రయాణం అందుబాటు ధరలో ఉండేలా ప్రభుత్వం టిక్కెట్ ధరలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నా ప్రభుత్వం విభిన్న పాలసీలను తయారుచేస్తోంది. ఈ రంగాన్ని మరింత ఉత్తమంగా ఎలా చేయగలమో ఆయా సంస్థలతో చర్చిస్తోంది. ఏదైనా విమానయాన సంస్థ దివాలా తీయడం లేదా పరిశ్రమను వదిలివేయడం మాకు ఇష్టం లేదు. ఈ పరిశ్రమలోకి కొత్త విమానయాన సంస్థలు ప్రవేశించేలా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రైవేట్ మూలధనం ద్వారా కార్యకలాపాలు సాగించే కొత్త కంపెనీలు దివాలా దిశగా వెళితే ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఎయిరిండియా గ్రూపులో ఇటీవల విస్తారా విలీనం అయింది. దాంతో దేశీయ విమానయాన మార్కెట్ వాటాలో 80 శాతం ఇండిగో, ఎయిరిండియాలే సొంతం చేసుకుంటున్నాయి. రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 2023లో మరో పదేళ్ల కాలంపాటు అంటే 2033 వరకు ఈ పథకాన్ని పొడిగించారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్(ఉడాన్) పథకంలో భాగంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడం, విమానయానాన్ని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు
ఇండోనేషియా బాలీలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో బూడిద కమ్ముకుని పలు విమానాలు రద్దయ్యాయి. బాలీలోని ‘మౌంట్ లెవోటోబి లకీ-లకీ’ అనే అగ్నిపర్వతం రెండోసారి పేలడంతో దాదాపు 10 కిలోమీటర్ల(32,808 అడుగులు) ఎత్తులో దట్టంగా బూడిద కమ్ముకుందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు ప్రమాదకరమని చెప్పారు. దాంతో కొన్ని సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసినట్లు పేర్కొన్నారు.బాలీలోని ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో ఉన్న మౌంట్ లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం నవంబర్ 3న మొదట విస్ఫోటనం చెందింది. తిరిగి మంగళవారం పలుమార్లు భారీ స్థాయిలో బద్దలవ్వడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఇండిగో ప్రకటన విడుదల చేసింది. ‘బాలీలో ఇటీవలి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాంతో వాతావరణంలో భారీగా బూడిద మేఘాలు ఏర్పడ్డాయి. దానివల్ల ఆ ప్రాంతానికి వచ్చిపోయే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని తెలిపింది. ఇండిగో సంస్థ బెంగళూరు నుంచి ఇండోనేషియా బాలీకి రోజువారీ సర్వీసు నడుపుతోంది.ఢిల్లీ-ఇండోనేషియా మధ్య ప్రయాణించే రోజువారీ విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ధ్రువీకరించింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా బుధవారం ఇండోనేషియాకు ప్రయాణించే విమాన ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.ఇదీ చదవండి: గుడ్‌బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటనబాలీ నుంచి దాదాపు 800 కి.మీ దూరంలో ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో నవంబర్ 3న లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం మొదట విస్ఫోటనం చెందింది. దానివల్ల తొమ్మిది మంది మరణించారు. తాజాగా మంగళవారం మళ్లీ పలుమార్లు విస్ఫోటనం చెందింది. మొదటిసారి ఘటన జరిగిన సమయంలో నవంబర్ 4 నుంచి 12 వరకు సింగపూర్, హాంకాంగ్, కొన్ని ఆస్ట్రేలియన్ నగరాల నుంచి బాలీకి ప్రయాణించే 80 విమానాలు రద్దు చేశారు. -
గుడ్‌బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటన
ఎయిరిండియాలో విలీనానికి ముందు నడిచిన చివరి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో విమాన సిబ్బంది ‘గుడ్‌బై విస్తారా’ అంటూ భావోద్వేగ ప్రకటన చేశారు. ఇటీవల నడిచిన చివరి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ కెప్టెన్ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.కెప్టెన్ సుధాన్షు రైక్వార్, నేహల్ చేసిన ప్రకటనకు సంబంధించిన షార్ట్ క్లిప్‌ను ఎక్స్ వేదికలో పంచుకున్నారు. ‘చివరి విస్తారా సర్వీస్ బ్రాండ్‌గా మీకు అత్యుత్తమ భద్రత, సేవలను అందించే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నాం. కొన్నేళ్లుగా విస్తారా వివిధ ఖండాల్లో విస్తరించి, విభిన్న సంస్కృతులు కలిగిన ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసింది. ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. అంకితభావం, భద్రత, విశ్వసనీయతతో మీకు సేవ చేయడం మా లక్ష్యం. విస్తారా చివరి సర్వీస్ ఈ రోజు మేము అదే ఉన్నత ప్రమాణానికి కట్టుబడి ఉన్నాం. గుడ్‌బై విస్తారా. మేము ఎంతో మిస్ అవుతాం’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.Captain Capt Sudhanshu Raikwar and First Officer @Nehal_404 made an emotional yet confident announcement yesterday, marking their final flight as cockpit crew with @airvistara . #Aviation #Avgeek #Pilot #vistaraflight #Vistara https://t.co/G3rvMkTSRE pic.twitter.com/OvmZSmA2JT— Aman Gulati 🇮🇳 (@iam_amangulati) November 12, 2024ఇదీ చదవండి: ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓపదేళ్లుగా కార్యకలాపాలు సాగించిన విమానయాన సంస్థ విస్తారా నవంబర్ 11 నుంచి తన సేవలు నిలిపేసింది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!
టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త యాజమాన్యంలోని విస్తారా నవంబర్ 11 నుంచి ఎయిరిండియా ఎయిర్‌లైన్స్‌లో విలీనం అవుతుంది. ఈ విలీనం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా సర్వీసులో ఉన్న పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విస్తారా, ఎయిరిండియాలో పనిచేస్తున్న పైలట్ల రిటైర్మెంట్ వయసే అందుకు కారణమని తెలియజేశారు.నవంబర్ 11 నుంచి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిరిండియాలో విలీనం అవుతుంది. ఈమేరకు గతంలోనే ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఎయిరిండియా పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఎయిరిండియా పైలట్ల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉంది. ఇప్పటివరకు విస్తారాలో పని చేసిన పైలట్లు రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగా ఉంది. ఒకే సంస్థలో, ఒకే స్థానంలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసులో తేడా ఉండడంపై ఎయిరిండియా పైలట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎయిరిండియా యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలట్లు తమకు 65 ఏళ్లు వచ్చేవరకు సేవ చేయవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో ఎయిరిండియా ఎంపిక చేసిన పైలట్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదవీ విరమణ తర్వాత 65 ఏళ్ల వరకు సర్వీసు పొడిగించే పాలసీని ప్రకటించింది.ఇదీ చదవండి: పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!రూ.2,058.50 కోట్ల డీల్పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఈరోజు నుంచి కనుమరుగు కానుంది. నవంబర్ 11 నుంచి విస్తారా సేవలు నిలిపేయనుంది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
హైదరాబాద్ లో అలెర్ట్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు
-
విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్
న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్ కనిపించడం కలకలం రేపింది. దేశీయ విమానయాన సంస్థలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్న వేళ్ల చోటుచేసుకున్న ఈ ఘటన అలజడి సృష్టించింది. నంబర్ ఏఐ 916 ఎయిరిండియా విమానం అక్టోబర్ 27వ తేదీన దుబాయ్ నుంచి న్యూఢిల్లీలోని అంతర్జాతీయ వి మానాశ్రయంలో ల్యాండయ్యింది. ప్ర యాణికులంతా సురక్షితంగా కిందికి దిగి న తర్వాత ఒక సీటుపైనున్న బుల్లెట్ల కాట్రిడ్జ్‌ను సిబ్బంది గమనించారు. దీనిపై వెంటనే వారు విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి వాటిని విమానంలోకి తీసుకురావడం పూర్తి నిషేధం ఉంది. ఇప్పటికే 400కు పైగా విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు రావడం..అవన్నీ ఉత్తుత్తివేనని తేలడం తెలిసిందే. భద్రతా చర్యలను తనిఖీలను ముమ్మరం చేసినా పేలుడు సామగ్రి కనిపించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా ఉండగా, సోమవారం నేపాల్‌లోని త్రిభువన్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు అందింది. విమానాశ్రయం అధికారులు వెంటనే సిబ్బందిని కిందికి దించి పూర్తి స్థాయిలో సోదాలు జరిపారు. ఎటువంటి ప్రమాదకర వస్తువులు లేకపోవడంతో కొద్ది సేపటికి విమానం టేకాఫ్ తీసుకుంది. -
60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..
టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా సంస్థ కొన్ని రూట్లలో తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 60 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. నిర్వహణ సమస్యల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.ఎయిరిండియా తాజా ప్రకటన వల్ల యూఎస్ సర్వీసులపై ప్రభావం పడనుందని అధికారులు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ, సప్లై చెయిన్ పరిమితుల వల్ల కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇతర ప్రత్యామ్నాయాలు చూపుతున్నామని వివరించారు. ఈమేరకు ప్యాసింజర్లకు సమాచారం అందించామని చెప్పారు.వైడ్ బాడీ విమానాలు లేవు..‘ఎయిరిండియా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, న్యూయార్క్ వంటి నగరాలకు నడిపే 60 విమానాలను రద్దు చేసింది. ఈ రూట్లలో నడపడానికి తగినన్ని వైడ్ బాడీ విమానాలు అందుబాటులో లేవు. దాంతోపాటు కొన్ని నిర్వహణ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రయాణికులు అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఒక సీనియర్ అధికారి చెప్పారు.ఇదీ చదవండి: టపాసులా పేలుతున్న బంగారం ధర!ఈ ప్రాంతాల నుంచి యూఎస్‌కు విమానాలుఎయిరిండియా దిల్లీ-వాషింగ్టన్ మధ్య ఐదు విమానాలను నడుపుతుండగా, దిల్లీ నుంచి న్యూయార్క్, ముంబై నుంచి న్యూయార్క్ వరకు వారానికి ఏడు విమానాలు నడుపుతోంది. దిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి నేరుగా ఫ్రాన్సిస్కోకు విమానాలున్నాయి. దిల్లీ నుంచి చికాగో మార్గంలో ప్రతి వారం ఏడు విమానాలను నడుపుతోంది. -
అదిరిపోయే ఆఫర్.. విమానం ఎక్కేయండి చవగ్గా!
పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌లైన్ 'ఫ్లాష్ సేల్' ఆఫర్ల కింద కేవలం రూ. 1606 ప్రారంభ ధరతో విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.దీని ద్వారా ప్రయాణికులు దేశంలోని ప్రధాన నగరాల మధ్య తక్కువ ధరలో ప్రయాణించే అవకాశం ఉంది. గౌహతి-అగర్తలా, కొచ్చి-బెంగళూరు, చెన్నై-బెంగళూరు, విజయవాడ-హైదరాబాద్ వంటి ప్రముఖ మార్గాలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.ఫ్లాష్ సేల్ కింద బుకింగ్ 27 అక్టోబర్ 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణ తేదీలు నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు ఉంటాయి. కొత్త గమ్యస్థానంలో పండుగను ఆస్వాదించాలనుకునే ప్రయాణీకులకు ఇది గొప్ప అవకాశం.ఇతర ఆఫర్లుఫ్లాష్ సేల్‌తో పాటు ఎయిర్‌లైన్ ఎక్స్‌ప్రెస్ లైట్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. దీనిలో విమాన టిక్కెట్లను బుకింగ్ చేయడానికి ప్రారంభ ధర కేవలం రూ.1456. దీని కింద ప్రయాణికులకు అందనంగా జీరో కన్వీనెన్స్ ఫీజు ప్రయోజనం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్ లైట్ అదనపు 3 కిలోల క్యాబిన్ సామాను ఉచిత ప్రీ-బుకింగ్, చెక్-ఇన్ బ్యాగేజీ ధరలపై తగ్గింపు వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే లాయల్టీ సభ్యులు 50% తగ్గింపు రుసుముతోనే బిజినెస్ సీట్లకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 'గౌర్మెట్' హాట్ మీల్స్, సీట్లపై 25% తగ్గింపు, ఎక్స్‌ప్రెస్ ఎహెడ్ ప్రాధాన్యతా సేవలను కూడా పొందవచ్చు. అలాగే విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సిబ్బంది ఎయిర్‌లైన్ వెబ్సైట్లో ప్రత్యేక తగ్గింపుతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. -
‘నవంబరు 1-19 వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దు’
దేశంలో విమానలకు గత కొన్ని రోజులుగా వరుసగా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల వేళ ఖలిస్థానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ.. విమానాలకు సంబంధి హెచ్చరికలు చేయడం తీవ్ర కలకలం రేపింది. నవంబరు 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని గురుపత్వంత్ సింగ్ ప్రయాణికులను హెచ్చరించాడు.భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని, కావును ఆయా తేదీల్లో ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కాగా సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్జేఎఫ్) వ్యవస్థాపకుడైన పన్నూ ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇది మొదటి సారి కాదు. గతేడాది కూడా నవంబర్ నెలలోనే ఇలాంటి బెదిరింపులే చేశాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని సూచించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించాడు. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తాం. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది’ అని పేర్కొన్నాడు.అంతేగాక నవంబరు 19న దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని, దాని పేరు కూడా మార్చేస్తామని గతేడాది అతడు ఓ వీడియోలో హెచ్చరించాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద భారత ప్రభుత్వం పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతడికి కెనడాతోపాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది.