ఎయిరిండియా సేవలపై ఆర్కే రోజా అసహనం | RK Roja Expressing Dissatisfaction On Air India Staff Behavior, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా సేవలపై ఆర్కే రోజా అసహనం

Published Tue, Dec 3 2024 9:18 PM | Last Updated on Wed, Dec 4 2024 11:24 AM

Rk Roja Tweet On Air India Staff Behavior

సాక్షి, తిరుపతి: ఎయిర్ ఇండియా సేవలపై ఎక్స్‌లో మాజీ మంత్రి ఆర్కే రోజా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘డిసెంబర్ 2న ఖాట్మండు నుంచి నా ఫ్లైట్ A1 2162 రెండు గంటలు ఆలస్యం అయ్యింది. దీనివల్ల చెన్నై AI 2835 ఫ్లైట్ మిస్ అయ్యాను. నాకు కన్ఫర్మ్ అయిన టికెట్ ఎలాంటి కారణం లేకుండా రద్దు చేశారు.’’ అంటూ రోజా ట్వీట్‌ చేశారు.

డిస్ ప్లే డెస్క్ వద్ద ఉన్న దీపిక, నిధి అహంకారంగా ప్రవర్తించారు. కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. జవాబుదారీతనం లేదు. ఫ్లైట్ అలస్యానికి కనీసం సంజాయిషీ లేదు. క్షమాపణ కూడా చెప్పలేదు. నాకు న్యాయం జరగాలి. టాటా సంస్థ పరివర్తన అంటే ఇదేనా...?’’ అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement