చూస్తుండగానే 2024 వెళ్లిపోయింది. 2025లోకి మనం ప్రవేశించాం. జనవరి ఒకటి సందర్భంగా ప్రపంచమంతా సంబరాలు జరుపుకుంటోంది. ఇదేవిధంగా నాటి 1978 నూతన సంవత్సరం తొలి రోజున ప్రపంచమంతా ఉత్సవవాతావరణంలో మునిగి తేలులోంది. ఇంతలో పిడుగులాంటి వార్త వినిపించింది. దీంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
ముంబైకి మూడు కిలోమీటర్ల దూరంలో
1978, జనవరి ఒకటిన ముంబైకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఘోర విమాన ప్రమాదం(plane crash) చోటుచేసుకుంది. దుబాయ్‌కి బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే నిప్పులను ఎగజిమ్మింది. విమానంలోని పరికరాలు లోపభూయిష్టంగా ఉండటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ విమాన ప్రమాదం అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఒకటిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ప్రమాదంలో 213 మంది ప్రయాణికులు మృతిచెందారు.
అంతా అనుభవజ్ఞులే..
1978, జనవరి ఒకటిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855(Air India Flight 855) ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. అప్పట్లో ఈ విమానాశ్రయాన్ని శాంటా క్రజ్ విమానాశ్రయంగా పిలిచేవారు. తరువాత దాని పేరు సహర్ విమానాశ్రయంగా మార్చారు. ఈ విమానాన్ని 51 ఏళ్ల కెప్టెన్ మదన్ లాల్ కుకర్ నడిపారు. ఆయన 1956లో ఎయిర్ ఇండియాలో చేరారు. పైగా అతనికి 18,000 గంటల విమానయాన అనుభవం ఉంది. ఫ్లైట్ ఇంజనీర్ అల్ఫ్రెడో ఫారియా(53) 955లో ఎయిర్ ఇండియాలో చేరారు. అతనికి 11,000 గంటల అనుభవం ఉంది. అలాగే వింగ్ కమాండర్ ఇందు వీరమణి(42) భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నుండి పదవీ విరమణ పొందారు. అతనికి 11,000 గంటల విమానయాన అనుభవం ఉంది. అనుభవజ్ఞులైన వీరంతా అదే విమానంలో ఉన్నారు.
ఉండాల్సినంత ఎత్తును చేరుకోలేక..
ఈ విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాత, విమానం అకస్మాత్తుగా ఎడమవైపుకు తిరగడం ప్రారంభించింది. ఆ తర్వాత విమానం ఉండాల్సినంత ఎత్తును చేరుకోలేకపోయింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ నుండి అందిన డేటా ప్రకారం చూసుకుంటే విమానం ఎత్తును తెలిపే సూచిక పాడైపోయింది. దీంతో కెప్టెన్ ఎత్తును అంచనా వేయలేకపోయారు. చీకటిగా ఉండటానికి తోడు, కింద అరేబియా సముద్రం ఉండడంతో విమనం నడుపుతున్న సిబ్బందికి విమానం ఎత్తు, స్థానం గురించి సమాచారం లభించలేదు.
ఇన్‌పుట్‌లు సక్రమంగా లేకపోవడంతో..
విమానాన్ని రోలింగ్ చేసి నిఠారుగా చేసేందుకు కెప్టెన్ ప్రయత్నించగా, ఇంతలోనే అది సముద్రంలో కూలిపోయింది. విమానం 35 డిగ్రీల కోణంలో అరేబియా సముద్రాన్ని తాకింది. విమానంలోని 190 మంది ప్రయాణికులు, 23 మంది సిబ్బంది ఈ ప్రమాదంలో మృతిచెందారు. విమాన శిథిలాలను పరిశీలించగా అధికారులకు అక్కడ ఎలాంటి పేలుడు లేదా అగ్ని ప్రమాదం లేదా ఎలక్ట్రానిక్ వైఫల్యం(Electronic failure) గురించిన సమచారం లభించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన దరిమిలా.. పైలట్‌కు అందిన ఇన్‌పుట్‌లు సక్రమంగా లేవు. ఫలితంగా అతను విమానం ఎత్తును గుర్తించలేకపోయాడు. ఈ నేపధ్యంలోనే ప్రమాదం జరిగిందని వెల్లడయ్యింది.
ఇది కూడా చదవండి: New Year 2025: మనీ ఆర్డర్ పుట్టిన వేళ.. గ్రామగ్రామాన సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment