Flight Crash
-
అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది?
చూస్తుండగానే 2024 వెళ్లిపోయింది. 2025లోకి మనం ప్రవేశించాం. జనవరి ఒకటి సందర్భంగా ప్రపంచమంతా సంబరాలు జరుపుకుంటోంది. ఇదేవిధంగా నాటి 1978 నూతన సంవత్సరం తొలి రోజున ప్రపంచమంతా ఉత్సవవాతావరణంలో మునిగి తేలులోంది. ఇంతలో పిడుగులాంటి వార్త వినిపించింది. దీంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ముంబైకి మూడు కిలోమీటర్ల దూరంలో1978, జనవరి ఒకటిన ముంబైకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఘోర విమాన ప్రమాదం(plane crash) చోటుచేసుకుంది. దుబాయ్‌కి బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే నిప్పులను ఎగజిమ్మింది. విమానంలోని పరికరాలు లోపభూయిష్టంగా ఉండటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ విమాన ప్రమాదం అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఒకటిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ప్రమాదంలో 213 మంది ప్రయాణికులు మృతిచెందారు.అంతా అనుభవజ్ఞులే..1978, జనవరి ఒకటిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855(Air India Flight 855) ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. అప్పట్లో ఈ విమానాశ్రయాన్ని శాంటా క్రజ్ విమానాశ్రయంగా పిలిచేవారు. తరువాత దాని పేరు సహర్ విమానాశ్రయంగా మార్చారు. ఈ విమానాన్ని 51 ఏళ్ల కెప్టెన్ మదన్ లాల్ కుకర్ నడిపారు. ఆయన 1956లో ఎయిర్ ఇండియాలో చేరారు. పైగా అతనికి 18,000 గంటల విమానయాన అనుభవం ఉంది. ఫ్లైట్ ఇంజనీర్ అల్ఫ్రెడో ఫారియా(53) 955లో ఎయిర్ ఇండియాలో చేరారు. అతనికి 11,000 గంటల అనుభవం ఉంది. అలాగే వింగ్ కమాండర్ ఇందు వీరమణి(42) భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నుండి పదవీ విరమణ పొందారు. అతనికి 11,000 గంటల విమానయాన అనుభవం ఉంది. అనుభవజ్ఞులైన వీరంతా అదే విమానంలో ఉన్నారు.ఉండాల్సినంత ఎత్తును చేరుకోలేక..ఈ విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాత, విమానం అకస్మాత్తుగా ఎడమవైపుకు తిరగడం ప్రారంభించింది. ఆ తర్వాత విమానం ఉండాల్సినంత ఎత్తును చేరుకోలేకపోయింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ నుండి అందిన డేటా ప్రకారం చూసుకుంటే విమానం ఎత్తును తెలిపే సూచిక పాడైపోయింది. దీంతో కెప్టెన్ ఎత్తును అంచనా వేయలేకపోయారు. చీకటిగా ఉండటానికి తోడు, కింద అరేబియా సముద్రం ఉండడంతో విమనం నడుపుతున్న సిబ్బందికి విమానం ఎత్తు, స్థానం గురించి సమాచారం లభించలేదు.ఇన్పుట్లు సక్రమంగా లేకపోవడంతో..విమానాన్ని రోలింగ్ చేసి నిఠారుగా చేసేందుకు కెప్టెన్ ప్రయత్నించగా, ఇంతలోనే అది సముద్రంలో కూలిపోయింది. విమానం 35 డిగ్రీల కోణంలో అరేబియా సముద్రాన్ని తాకింది. విమానంలోని 190 మంది ప్రయాణికులు, 23 మంది సిబ్బంది ఈ ప్రమాదంలో మృతిచెందారు. విమాన శిథిలాలను పరిశీలించగా అధికారులకు అక్కడ ఎలాంటి పేలుడు లేదా అగ్ని ప్రమాదం లేదా ఎలక్ట్రానిక్ వైఫల్యం(Electronic failure) గురించిన సమచారం లభించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన దరిమిలా.. పైలట్‌కు అందిన ఇన్పుట్లు సక్రమంగా లేవు. ఫలితంగా అతను విమానం ఎత్తును గుర్తించలేకపోయాడు. ఈ నేపధ్యంలోనే ప్రమాదం జరిగిందని వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: New Year 2025: మనీ ఆర్డర్ పుట్టిన వేళ.. గ్రామగ్రామాన సంబరాలు -
179 మంది మృతి..‘నాదే పూర్తి బాధ్యత’
దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయం(Muan International Airport)లో జరిగిన జెజు ఎయిర్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటానని సంస్థ సీఈఓ కిమ్ ఇబే తెలిపారు. దక్షిణ కొరియాలో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో 179 మంది మృతి చెందారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. విమానం ల్యాండింగ్ గేర్ వైఫల్యం అవ్వడంతో రన్‌వేపై జారుతూ ఎయిర్పోర్ట్ రక్షణ గోడను ఢీకొట్టి ఈ ప్రమాదం జరినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై జెజు ఎయిర్(Jeju Air) సీఈఓ స్పందిస్తూ కారణంతో సంబంధం లేకుండా పూర్తి బాధ్యత వహిస్తారని తెలిపారు.థాయ్‌లాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియాలోని సియోల్‌కు 290 కిలోమీటర్ల దూరంలోని ముయాన్కు జెజు ఎయిర్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్(Aircraft) ఆదివారం బయలుదేరింది. ఉదయం 9 గంటల సమయంలో ముయాన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతుండగా విమానం ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ తెరుచుకోలేదు. అప్పటికే ల్యాండింగ్‌కు ముందు ఏటీసీ నుంచి పైలట్లకు ‘బర్డ్స్ట్రైక్’ వార్నింగ్ ఇచ్చారు. కానీ అప్పిటికే పరిస్థితి చేదాటిపోయిందని పైలట్ సిగ్నల్ పంపించారు. విమానం ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో రన్‌వేపై జారుతూ వెళ్లిన విమానం ఎయిర్పోర్ట్ రక్షణ గోడను ఢీకొని క్షణాల్లో మంటలు అంటుకుని పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు.ఇదీ చదవండి: యాపిల్ ఐఫోన్ 14, ఎస్ఈ నిలిపివేత..కారణం..ఘటనపై జెజు ఎయిర్ సీఈఓ కిమ్ ఇబే స్పందిస్తూ..‘ఈ విషాదకరమైన సంఘటన తీవ్రంగా కలచివేసింది. కారణంతో సంబంధం లేకుండా, ఘటనకు నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదంపై చేపడుతున్న విచారణకు అన్నివిధాలా సహకారం అందిస్తాం’ అని చెప్పారు. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతోంది. -
ఎనిమిదేళ్ల నాటి విమానం మిస్సింగ్ మిస్టరీ.. కూలిందా? కూల్చారా!
మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్ 370 విమానం 2014 మార్చి 8న మిస్సయ్యింది. ఆ విమానం ఆచూకీ కోసం గాలించినా... కనిపించకపోయేసరికి కూలిపోయిందనే నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఐతే ఇప్పుడూ ఆ విమానం కూలిందా? ఉద్దేశ్వపూర్వకంగా కూల్చేశారా అను పలు అనుమానాలు తలెత్తేలా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ఆ విమానంలో సుమారు 239 మంది ప్రయాణికులతో మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తుండగా..ఆ విమానం ఆచూకీ కానరాకుండా పోయింది. దీంతో అప్పటి నుంచి ఆ విమానం మిస్సింగ్ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు నిపుణులు. ఆ విమానానికి సంబంధించిన శకలాలను వెతికే పలు ప్రయత్నాలు చేశారు. ఆ బోయింగ్ 777 విమానం శకలాలు మడగాస్కన్ మత్స్యకారులకు లభించాయి. 2017లో వచ్చిన ఉష్ణమండల తుపాను ఫెర్నాండో నేపథ్యంలో మడగాస్కన్ సముద్ర తీరానికి విమాన శకలాలు కొట్టుకు రావడంతో టాటాలీ అనే మత్స్యకారుడు ఆ శిధిలాల భాగాన్ని గుర్తించినట్లు బ్రిటిష్ ఇంజనీర్ రిచర్డ్ గ్రాండ్ ఫ్రే చెబుతున్నారు. అతను నుంచి సేకరించిన శకలాల ఆధారంగా... ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని సముద్రంలోకి కూల్చివేసినట్లు విమాన శకలాలను గాలించే నిపుణుడు అమెరికన్ బ్లెయిన్ గిబ్సన్, బ్రిటిష్ ఇంజనీర్ రిచర్డ్ గాడ్ ఫ్రే చెబుతున్నారు. అందుకు సాక్ష్యం ఆ మత్స్యాకారుడి వద్ద ఉన్న ల్యాండింగ్ బోర్డు గేర్ని చూస్తే తెలుస్తుందంటున్నారు ఆ నిపుణులు. ఎందుకంటే క్రాష్ అయినప్పుడు.. విమానాన్ని వీలైనంతగా మునిగిపోయేలా చేసేలా.. ల్యాండింగ్ బోర్డు గేర్ని పొడిగించిన విధానమే అసలైన ఎవిడెన్స్ అని చెప్పారు. ఎందుకంటే ల్యాండింగ్ సమయంలో ఏ పైలెట్ సాధారణంగా ల్యాండింగ్ గేర్‌ను తగ్గించరు. విమానం ముక్కలుగా విరిగిపోయే ప్రమాదం ఉండటమే గాక నీటిలో సులభంగా మునిగిపోతుంది. ప్రయాణికులు ఎవరు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు గిబ్సన్, ఇంజనీర్ రిచర్డ్ గాడ్ ఫ్రే చెబుతున్నారు. (చదవండి: చైనాకు ఎదరు తిరిగితే అంతే...ఆ యువతి ఇంకా నిర్బంధంలోనే..) -
ఘోర ప్రమాదం.. సరస్సులో కూలిపోయిన విమానం
దార్ ఎస్ సలాం: ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. బుకోబా నగరంలో ల్యాండింగ్ కావాల్సిన కొద్ది సమయానికి ముందే వాతావరణం అనుకూలించకపోవటంతో సరస్సులో పడిపోయింది. ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ‘ప్రెసిషన్ ఎయిర్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఎయిర్‌పోర్ట్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న నీటిలో పడిపోయింది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ప్రయాణికులను రక్షించేందుకు భద్రతా బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.’ అని రీజనల్ పోలీస్ కమాండర్ విలియమ్ వాంపఘేల్ తెలిపారు. మరోవైపు.. విమానంలో ప్రయాణికులు 49 మంది ఉన్నట్లు స్థానిక మీడియాలు నివేదించగా.. ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉడొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. టాంజానియా ఆర్థిక రాజధాని దార్ ఎస్ సలాం నుంచి బుకోబాకు ప్రయాణిస్తోంది. ప్రెసిషన్ ఎయిర్ సంస్థ టాంజానియాలో అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ. విమాన ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన చేసింది. ప్రమాద ఘటనా స్థలానికి సహాయక బృందాలను పంపామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఉత్తర టాంజానియాలో సఫారీ సంస్థకు చెందిన విమాన ప్రమాదంలో 11 మంది చనిపోయిన 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రమాదం జరిగింది. Precision Air plane crashes into Lake Victoria while trying to land in Tanzania; no word on casualties pic.twitter.com/EpRrgPvAVB — BNO News (@BNONews) November 6, 2022 ఇదీ చదవండి: వారెవ్వా.. సరికొత్త గిన్నిస్ రికార్డ్.. ‘కీహోల్’లోంచి ఏడు బాణాలు! -
ఫ్లైట్ చోరీ చేసి కూల్చేస్తానని పైలట్ బెదిరింపులు.. ఊరంతా ఖాళీ!
వాషింగ్టన్: ఓ మినీ విమానాన్ని చోరీ చేసిన పైలట్..నగరంపై చక్కర్లు కొడుతూ హల్చల్ సృష్టించాడు. రద్దీ ప్రాంతంలో విమానాన్ని కూల్చేస్తానని బెదిరింపు సందేశం పంపించాడు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ సంఘటన అమెరికాలోని మిస్సిసీపీ రాష్ట్రం ఈశాన్య నగరం ‘టుపెలో’లో జరిగింది. నగరంలోని వాల్‌మార్ట్ స్టోర్స్‌పై కూల్చేస్తాని హెచ్చరించాడని, దాంతో స్టోర్స్‌ను ఖాళీ చేయించినట్లు పోలీసులు తెలిపారు. పైలట్‌తో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ‘పరిస్థితులు సద్దుమణిగే వరకు ఆ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని ప్రజలకు సూచించాం. ఆ విమానం మొబిలిటీ ప్రకారం డెంజర్ జోన్ టుపెలో కంటే పెద్దగా ఉంటుంది.’ అని టుపెలో పోలీస్ విభాగం ఓ ప్రకటన చేసింది. ప్రజలు వాల్‌మార్ట్ స్టోర్స్ నుంచి దూరంగా వెళ్లిపోవాలని సూచించారు. అన్ని అత్యవసర సేవలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. టుపెలో ఎయిర్పోర్ట్ నుంచి ‘బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 90’ అనే మినీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పైలట్ ఎత్తుకెళ్లినట్లు తెలిసిందన్నారు. ఆ విమానం డబుల్ ఇంజిన్ 9 సీటర్‌గా తెలిపారు. Currently we have a 29yr old who stole this plane & is threatening to crash it into something. Polices ,ambulances ,& fire trucks are everywhere. Everything is shutdown rn pic.twitter.com/AzebdIa3tP — City King (@CityKing_Gank_) September 3, 2022 ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఎయిర్‌హెస్టెస్.. ఆమె ఏం చేసిందంటే? -
చైనా విమాన ప్రమాదంలో సంచలన విషయాలు.. పైలెట్లు కావాలనే అలా...
బీజింగ్: చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. విమానాన్ని పైలట్లే ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. బ్లాక్‌బాక్స్ డేటా విశ్లేషణలో ఈ విషయం తెలిసింది. విమానం ఎత్తు ఒక్కసారిగా తగ్గడాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గుర్తించి.. వెంటనే పైలట్లను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. కానీ, పైలట్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు తెలిపారు. దీనిని బట్టి కాక్‌పిట్‌లో ఉన్న సిబ్బందే కావాలని విమానం ఎత్తును ఒక్కసారిగా కిందకు దించి కూల్చేసి ఉంటారని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై బోయింగ్ గానీ, చైనా అధికారుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బోయింగ్ 737 మార్చి 21న గుయాంగ్జీ ప్రాంతంలో కుప్పకూలింది. 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. చదవండి👇 మీరొస్తానంటే.. నేనొద్దంటా! చైనాలో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 132 మంది మృతి! -
చైనాలో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 132 మంది మృతి!
బీజింగ్: చైనా దక్షిణ గ్వాంగ్జీ ఝువాంగ్ ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 132 మందితో వెళ్తున్న ఒక పాసింజర్ విమానం సోమవారం ఈ ప్రాంతంలో కుప్పకూలిందని అధికార వర్గాలు ప్రకటించాయి. ప్రమాదంలో అంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ గ్వాంఝుకు వెళ్లేందుకు కున్మింగ్ నుంచి స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 1.10కి బయలుదేరింది. 2.52 కు గమ్యస్థానం చేరాల్సి ఉండగా వుఝు సమీపంలోని టెంగ్జియాన్ కౌంటీ ప్రాంతంలోకి రాగానే కొండను ఢీకొని కూలిపోయింది. మంటలను అదుపులోకి తెచ్చామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. నిట్టనిలువునా కూలింది ప్రమాద దృశ్యాలు దగ్గర్లోని మైనింగ్ కంపెనీ సెక్యూరిటీ కెమెరాలో రికార్డయ్యాయి. విమానం అదుపు తప్పి నిట్టనిలువుగా కూలిపోతూ కన్పించింది. 29వేల అడుగుల ఎత్తు నుంచి వేగంగా పడిపోతూ కేవలం 2.15 నిమిషాల్లో 9 వేల అడుగులకు చేరింది. మరో 20 సెకన్లలో 3,225 అడుగులకు దిగిందని ఫ్లైట్ రాడార్ వెల్లడిస్తోంది. అంతెత్తునుంచి విమానం నేలను తాకడానికి దాదాపు 30 నిమిషాలు పడుతుంది. కానీ 3 నిమిషాల్లో నేలకూలడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. విమాన భద్రతలో చైనా ట్రాక్ రికార్డు గొప్పగా ఉంది. చైనాలో చివరిసారి 2010లో విమాన ప్రమాదం జరిగింది. బోయింగ్ విమానాలపై నిఘా: భారత్ ప్రమాద వార్త తెలియగానే భారత్‌లోని బోయింగ్ 737 విమానాలన్నింటిపై మరింత నిఘా పెట్టినట్లు డీజీసీఏ ప్రకటించింది. 2018, 2019ల్లో అంతర్జాతీయంగా జరిగిన బోయింగ్ ప్రమాదాల తర్వాత దేశంలో బోయింగ్ 737 మాక్స్ విమానాలను డీజీసీఏ నిషేధించింది. సాంకేతిక మార్పుల తర్వాత గత ఆగస్టు నుంచి తిరిగి అనుమతించింది. ప్రస్తుతం దేశంలో స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా వద్ద బోయింగ్ 737 విమానాలున్నాయి. ప్రమాదంపై బోయింగ్ స్పందించలేదు. చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ తమ ఆధీనంలోనిబోయింగ్ విమానాలన్నింటినీ నిలిపివేసింది. #China Unconfirmed new video appears to show the crash site of the Boeing 737 with significant fire in the mountains. pic.twitter.com/S62uOQ0uqn — Shane B. Murphy (@shanermurph) March 21, 2022 #BREAKING: On footage from social networks - presumably crashed in southern #China Boeing 737. There were 133 people on board, according to Chinese television. pic.twitter.com/uE2gmfA8dh — Newsistaan (@newsistaan) March 21, 2022 #China Unconfirmed new video appears to show the crash site of the Boeing 737 with significant fire in the mountains. pic.twitter.com/S62uOQ0uqn — Shane B. Murphy (@shanermurph) March 21, 2022 #China If you search #MU5735 that’s where all the newest footage is popping up. pic.twitter.com/KdmUsMDizi — Shane B. Murphy (@shanermurph) March 21, 2022 -
ఊహించని పరిణామం.. రష్యాకు మరో షాకిచ్చిన ఉక్రెయిన్ సైనికులు
ఉక్రెయిన్ నగరాలలో రష్యన్ బలగాలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. యుద్ధం మొదలై ఎనిమిది రోజులైనప్పటికీ మారణహోమం మాత్రం ఆగడం లేదు. రష్యా తరపున సైనికులు, ఉక్రెయిన్ తరపున సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. మొదట్లో రష్యా ఆధిపత్యం చెలాయించినా, గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్‌తో పాటు రష్యా కూడా తీవ్ర నష్టాలను చవి చూస్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి: Russia Ukraine War: ‘భారతీయులు తక్షణమే ఖార్కివ్‌ను వీడండి.. లేదంటే’ ) తాజాగా రష్యాకు మరో గట్టి షాక్‌నిచ్చారు ఉక్రెయిన్ సైనికులు. ప్రపంచంలోనే అత్యంత శక్తి సామర్థ్యా లు కలిగిన యుద్ధ విమానం సుఖోయ్ (ఎస్‌యూ-30 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్) రష్యా సైనిక పటాలంలో శత్రు దేశాలను ఇట్టే భయపెట్టే ఎయిర్ క్రాఫ్ట్. ఈ యుద్ధ విమానాన్ని కూల్చడం అంత ఈజీ కాదు. రష్యా కంటే సాంకేతిక పరిజ్ఞానంలో మెరుగ్గా ఉంటే తప్పించి అది సాధ్యం కాదు. అయితే చిన్న దేశమైనప్పటికీ ఉక్రెయిన్.. తన గగన తలం మీదకు వచ్చిన రష్యా సుఖోయ్ విమానాన్ని ఒక్క దెబ్బకు కూల్చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ సైనిక బలగాల కమాండర్ ఇన్ ఛీప్ లెఫ్ట్ నెంట్ జనరల్ వాలేరీ జాలుజ్నియి కాసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ సైనికులు రష్యా సుఖోయ్ను కూల్చడంలో పర్ఫెక్ట్గా పనిచేశారని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు యుద్ధంతో ఏడు లక్షల మంది దేశం విడిచి పారిపోతుండగా.. వాళ్లకు ఆశ్రయం ఇచ్చేందుకు చాలా దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా యుద్ధం ఆపేందుకు ఇరుదేశాలు జరిపిన మొదటి దశ చర్చలు ఫలించాలేదు. తాజాగా బెలారస్ బ్రెస్ట్ ప్రాంతంలో చర్చలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. -
ఆ వీడియో వాస్తవమేనా..?
Bipin Rawats Chopper Crash Video: ఆర్మీ హెలికాప్ట్టర్ ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు తీసిన వీడియో వాస్తవమేనా అన్న పరిశోధన సాగుతోంది. ఈ వీడియో చిత్రీకరించిన నాజర్ అనే వ్యక్తి వద్ద క్యూబ్రాంచ్ వర్గాలు విచారణ జరుపుతున్నాయి. ఈమేరకు ఘటనా స్థలంలోని కార్మికుల వద్ద ఆదివారం విచారణ సాగింది. వివరాలు.. నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని ఆర్మీ హెలికాçప్టర్ కుప్పుకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన విషయం తెలిసిందే. (చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!) ఈ ఘటనపై ఓ వైపు ఆర్మీ వర్గాలు, మరోవైపు రాష్ట్ర పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో హెలికాప్ట్టర్ కుప్పకూలేందుకు ముందుగా చిట్ట చివరి దృశ్యం అంటూ ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎంత వరకు వాస్తవం అన్నది పసిగట్టేందుకు క్యూబ్రాంచ్ రంగంలోకి దిగింది. విచారణను ముమ్మరం చేయగా, ఆ వీడియోను కోయంబత్తూరుకు చెందిన నాజర్ చిత్రీకరించినట్టు ఆదివారం వెలుగు చూసింది. దీంతో ఆయన వద్ద విచారణ జరుపుతున్నారు. తాము పరాట్యక ప్రాంత సందర్శనకు వెళ్లిన సమయంలో ఆ వీడియో చిత్రీకరించినట్టు ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, రైల్వే ట్రాక్ వైపుగా నడుచుకురావాల్సిన అవసరం ఏమిటో అన్న ప్రశ్నలతో నాజర్ వద్ద విచారణ చేపట్టారు. అలాగే, ఆయన సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, ఆ వీడియో వాస్తవమేననా అన్నది నిగ్గుతేల్చేందుకు కోయంబత్తూరులోని పరిశోధన కేంద్రంలో çపరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్మీ వర్గాల నేతృత్వంలో సంఘటన జరిగిన ప్రదేశం పరిసరాల్లో మరోమారు పరిశీలన సాగింది. అయితే, ఆ పరిసరాల్లో 60 కుటుంబాలు ఉండగా, ఇందులో 12 మంది ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినట్టు సమాచారం. దీంతో హెలికాప్టర్ గాల్లో నుంచి కింద పడ్డ అనంతరం పేలిందా..? లేదా, గాల్లోనే ఏదేని మంటలు చెలరేగినట్టుగా కింద పడిందా...? అన్న కోణంలో వారిని ప్రశ్నించినట్లు సమాచారం. పాకిస్తానీ ట్విట్టర్లపై చెన్నై సైబర్ క్రైం కేసు పాకిస్తానీ ట్విట్టర్ ఖాతాదారులు పలువురిపై సీబీసీఐడీ సైబర్ క్రైం ఆదివారం కేసులు నమోదు చేసింది. బిపిన్‌రావత్ మరణం, హెలికాప్ట్టర్ ప్రమాద ఘటనపై పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ట్విట్టర్ ఖాతాల ద్వారా తప్పుడు సమాచారం, ఆధార రహిత ఆరోపణలు, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే రీతిలో సంభాషణలు సాగినట్టు తమిళనాడు సీబీసీఐడీ అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ఖాతాలపై చర్యలకు తగ్గట్టు ట్విట్టర్ మీద ఒత్తిడి తెచ్చే విధంగా కేసులు నమోదు చేశారు. (చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్!) -
గంటన్నర టెన్షన్
కర్ణాటక, హుబ్లీ: ప్రతికూల వాతావరణం వల్ల హుబ్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ల్యాండింగ్‌కు ఆదివారం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆకాశం దట్టంగా మేఘావృతం కావడంతో పాటు వర్షం కురుస్తుండడంతో విమానాలను ల్యాండ్ చేయడానికి పైలట్లు తటపటాయించారు. బెంగళూరు నుంచి బయలుదేరిన ఇండిగో విమానం ఉదయం 8.55 గంటలకు హుబ్లీ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే తీవ్రమైన వాతారణ ప్రతికూల పరిస్థితుల వల్ల దిగడానికి సిగ్నల్ దొరక్క ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ఒకవేళ ఇక్కడ సాధ్యం కాకపోతే మంగళూరు, లేదా గోవా విమానాశ్రయాలలో దించాలని అనుకున్నారు. చివరకు సిగ్నల్ లభించడంతో 10.25 గంటలకు సురక్షితంగా ల్యాండింగ్ సాధ్యమైంది. దీంతో సుమారు గంటన్నర పాటు విమానంలోను, విమానాశ్రయంలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ విమానంలో మాజీ కేంద్రమంత్రి, ఎంపీ అనంతకుమార్ హెగ్డేతో పాటు 49 మంది ప్రయాణికులున్నారు. కాగా, మరో 2 విమానాలు దిగకుండానే బెంగళూరుకు వెనుదిరిగాయి. -
వాలంటీర్లకు పోలీసు సెల్యూట్.. విచారణకు ఆదేశం
మలప్పురం: కేరళలో ఇటీవల విమానం కూలిన సమయంలో, బాధితులకు సహాయం అందించిన వాలంటీర్లకు ఓ పోలీసు అధికారి సెల్యూట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా, పోలీసు ఉన్నతాధికారులు ఈ చర్యపై విచారణకు ఆదేశించారు. ప్రమాద సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ పోలీస్ ఏ. నిజార్, సాయం చేసిన యువతకు సెల్యూట్ చేశారు. ప్రమాదంలో మరణించిన ఓవ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలడంతో వీరందరిని కొండట్టిలో క్వారంటైన్లో ఉంచారు. (కళ్లెదుటే ముక్కలైంది) దీనిపై మలప్పురం పోలీస్ చీఫ్ అబ్దుల్ కరీమ్ మాట్లాడుతూ.. పోలీసులు ఎవరికి సెల్యూట్ చేయాలనే విషయంపై ప్రొటోకాల్ ఏమీ లేదని, అందువల్ల నిజార్ చేసిన చర్య చట్ట వ్యతిరేకమని చెప్పలేమన్నారు. అతనిపై ఏ చర్యలూ ఉండకపోవచ్చని అన్నారు. మలప్పురం జిల్లా కలెక్టర్ సైతం పోలీసు చర్యను క్షమించాలని అన్నారు. ప్రమాదం సమయంలో సాయమందించిన వారికి ఎయిర్ ఇండియా కూడా ధన్యవాదాలు తెలిపింది. చదవండి: కేరళ ప్రమాద స్థలంలో విదారక దృశ్యం -
‘అన్నయ్య చనిపోయినట్టు వదినకు చెప్పలేదు’
లక్నో/తిరువనంతపురం: కేరళలో ఎయిరిండియా విమాన ప్రమాదం పలువురి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ‘ఇప్పుడే ల్యాండ్ అయ్యాం’ అని తమవారి నుంచి కబురు బదులు, వారి చావు వార్త వినాల్సి వచ్చింది. అయితే, విమాన ప్రమాదంలో మృతి చెందిన కో-పైలట్ అఖిలేష్ శర్మ (32) కుటుంబానికి మాత్రం పగవాడికీ రాని పరిస్థితి ఎదురైంది. మృతుడు అఖిలేష్ భార్య మేఘ (29) నెలలు నిండిన గర్భిణి కావడమే దీనికి కారణం. మరో 15 రోజుల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీంతో భర్త మరణవార్తను కుటుంబ సభ్యులు ఆమెకు తెలియనివ్వలేదు. అఖిలేష్ ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుంటున్నాడని మాత్రమే చెప్పామని అతని సోదరుడు లోకేష్ శర్మ తెలిపాడు. అతను మాట్లాడుతూ.. ‘కోళీకోడ్‌లో విమాన ప్రమాదం జరిగిందని, విధుల్లో ఉన్న అన్నయ్య అఖిలేష్‌కు గాయాలు అయ్యాయని తొలుత సమాచారం అందింది. రాత్రి పొద్దుపోయాక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు తెలిసింది. మా వదిన నిండుగర్భిణి అవడంతో ఈ విషయం ఆమెకు చెప్పలేదు. విమాన ప్రమాదంలో అన్నయ్య గాడపడ్డారని, ఆస్పత్రిలో కోలుకుంటున్నారని చెప్పాం. మరో అన్నయ్య భువనేష్, బావమరిది సంజీవ్ శర్మ కోళీకోడ్‌కు బయల్దేరి వెళ్లారు’అని లోకేష్ పేర్కొన్నాడు. కాగా, 2017లో అఖిలేష్ పైలట్‌గా విధుల్లో చేరాడు. మేఘాతో అతనికి 2018 లో వివాహమైంది. వారి కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో నివాసం ఉంటోంది. ఇక శుక్రవారం సాయంత్రం జరిగిన కేరళ విమాన ప్రమాదంలో పైలట్, కో-పైలట్‌తో సహా 21 మంది ప్రాణాలు విడిచారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. -
ఇళ్ల మధ్యలో కూలిన విమానం; 23 మంది మృతి
గోమా : ఎయిర్పోర్ట్ నుంచి అప్పుడే టేకాఫ్ తీసుకున్న విమానం ఇళ్ల మధ్య కూలడంతో 23 మంది చనిపోయారు. ఈ విషాదకర ఘటన మధ్య ఆఫ్రికా దేశంలోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆప్ కాంగోకి చెందిన గోమా సిటీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు .. గోమా ఎయిర్పోర్ట్ నుంచి జిబీ బి విమానయాన సంస్థకు చెందిన డోర్నియర్-228 విమానం ఆదివారం ఉదయం 9 గంటలకు బెనీకి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే గోమాలోని నివాస ప్రాంతాల వద్దకు రాగానే విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 17 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. కాగా, విమానంలో ఉన్నవారెవరూ ప్రాణాలతో బయటపడలేదని పోలీసులు పేర్కొన్నారు. విమానం హఠాత్తుగా కుప్పకూలడానికి సాంకేతిక లోపమే కారణం కావొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు 6 మృతదేహాలను బయటికి తీసినట్లు వెల్లడించారు. Smoke rises from the wreckage of a small plane which crashed on takeoff into a densely populated area of Goma in the Democratic Republic of Congo pic.twitter.com/31BXU7qrG0 — AFP news agency (@AFP) November 24, 2019 -
‘మాటలకు అందని విషాదం.. కానీ నవ్వుతూనే ఉండాలి’
‘ప్రాణం కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నా.. నువ్వు లేకపోతే నేను బతకలేను.. నీ ఙ్ఞాపకాలతో జీవితాంతం బతికేస్తా.. ’సాధారణంగా ప్రతీ ప్రేమ జంట చేసుకునే బాసలు ఇవి. అయితే నిజమైన ప్రేమికులు మాత్రమే ఈ బాసల్ని నిలబెట్టుకుంటారు. నిలువెత్తు ప్రేమకు నిదర్శనంగా నిలుస్తారు. ఇండోనేషియాకు చెందిన సయారా కూడా ఈ కోవకు చెందిన వారే. అందుకే తనకు కాబోయే భర్త భౌతికంగా దూరమైనప్పటికీ తన మనసులో మాత్రం సజీవంగా ఉన్నాడని భావిస్తున్నారు. అతడి ఙ్ఞాపకాలతోనే జీవిస్తున్నారు. ఇండోనేషియాకు చెందిన సయారా, డాక్టర్ నంద ప్రతామా చిన్ననాటి స్నేహితులు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అనుమతి పొందిన అనంతరం.. నవంబరు 11న పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం పంగ్కల్ పినాంగ్ సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పెళ్లి బట్టలు కూడా కొనేశారు. ఈ క్రమంలో... నందా జకార్తాలో జరిగే ఓ కాన్ఫరెన్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. కానీ అదే వారి పాలిట శాపంగా మారింది. విమాన ప్రమాదంలో నందా మరణించడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. అసలేం జరిగిందంటే.. అక్టోబరు 29న జకార్తా నుంచి పంగ్కల్ పినాంగ్ సిటీకి బయల్దేరిన లయన్ ఎయిర్ జెట్ విమానం జావా సముద్రంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. బయల్దేరిన 13 నిమిషాలకే చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 189 మంది మరణించారు. ఇంతవరకు వారిలో చాలా మంది ఆనవాళ్లు కూడా లభించలేదు. వారిలో నందా కూడా ఒకరు. ఈ ఘటన సయారా జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పది రోజుల్లో పెళ్లి జరుగుతుందని ఎన్నో కలలుగన్న ఆమెకు ఊహించని షాక్ ఇచ్చింది. నువ్వు చెప్పావు కదా.. అందుకే ఇలా.. కాన్ఫరెన్సు ముగించుకున్న తర్వాత జకార్తా నుంచి బయల్దేరే ముందు నందా సయారాకు ఫోన్ చేశాడు. ప్రమాదాన్ని ముందే ఊహించాడో ఏమో... అందుకే తానెంతో ముచ్చట పడి కొన్న పెళ్లి గౌనులో ఫొటోలు దిగి తనకు పంపించాలని కోరాడు. సరేనన్న సయారా... నందా కోసం వెడ్డింగ్ గౌన్ వేసుకుని, తెల్ల గులాబీలతో కూడిన బొకే చేతిలో పట్టుకుని పెళ్లికూతురిలా అలంకరించుకుని.. ఆ ఫొటోలను నందాకు పంపింది. ఇదంతా జరిగిన కొన్ని గంటల తర్వాత నందా ప్రయాణించే విమానం సముద్రంలో గల్లంతయ్యిందనే వార్త సయారా ఆశల్ని చిదిమేసింది. నందా ఇక లేడన్న విషయం తెలిసి ఆమె స్పృహ తప్పి పడిపోయింది. తను లేకుంటేనేం.. నందా తనకు భౌతికంగా దూరమయ్యాడే తప్ప తన మనసులో సజీవంగానే ఉన్నాడు కదా భావించిన సయారా... నవంబరు 11న తమ పెళ్లి జరగాల్సి ఉండటంతో మరోమారు పెళ్లి దుస్తులు ధరించి ఫొటోలు దిగింది. ‘మాటలకు అందని విషాదం నాది. కానీ నీ కోసం నేను నవ్వుతూనే ఉండాలి. ఏడుపు ముఖంతో ఉండాలనుకోవడం లేదు. ధైర్యంగా ఉండాలని నువ్వు చెప్పావు కదా. అలానే ఉన్నాను’ అనే క్యాప్షన్‌తో సయారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. 26 ఏళ్ల ప్రాయంలో సయారా జీవితంలో చోటుచేసుకున్న విషాదం నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. ఆమెకు వచ్చిన కష్టం పగవాళ్లకు కూడా రావొద్దంటూ వారు తమ సానుభూతి తెలియజేస్తున్నారు. -
విమాన ప్రమాదం: అది ఫేక్ న్యూస్
జకార్తా: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌కు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తప్పుడు వార్తలను ట్రెండ్ చేస్తూ చాలామందిని తప్పుదోవ పట్టిస్తున్నారు. గత సోమవారం ఇండోనేసియాలో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో 189 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ పసిపాప ప్రాణాలతో బయటపడిందని ఓ వార్త గత రెండు రోజులుగా హల్చల్ చేస్తోంది. ఆ పసిపాకు సంబంధించిన ఫొటో కూడా విపరీతంగా ట్రెండ్ అయింది. ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే ఈ వార్తకు సంబంధించిన పోస్ట్ ఐదు వేల సార్లు షేర్ కావడం గమనార్హం. (చదవండి: సముద్రంలో కూలిన విమానం) ఈ పోస్ట్‌లో .. ‘ఈ పాపను రక్షించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు. జేటీ610 విమాన ప్రమాదంలో బతికిన చిన్నారి. ఆమె తల్లి లైఫ్ జాకెట్‌తో కవర్ చేయడంతో ప్రాణాలతో బయట పడింది. దురదృష్టవశాత్తు ఆ పాప తల్లిని ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు.’ అని క్యాప్షన్‌గా పేర్కొంటు ఓ పసిపాప ఫొటోను ట్రెండ్ చేశారు. (లయన్ విమాన ప్రమాదం : కెప్టెన్‌గా ఢిల్లీ వాసి) అయితే ఆ పాప ఈ ఏడాది జూలైలో ఇండోనేషియాలోనే చోటుచేసుకున్న నౌక ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన పాపని, ఆ ఫొటోనే తాజా ప్రమాదానికి ముడిపెడుతూ వైరల్ చేశారని ఆదేశ విపత్తు ఉపశమన సంస్థ అధికార ప్రతినిధి సుటోపా ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ఇది ఒక గాలివార్తని, ఇలాంటి పుకార్లను నమ్మి, ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సులవేసి నుంచి సెలయార్ తీరానికి వస్తుండగా నౌక మునిగిపోవడంతో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక నకిలీ వార్తలు ప్రచారం కావడం ఇదే తొలిసారేం కాదు. గతంలో చాలాసార్లు ట్రెండ్ అయ్యాయి. భారత్‌లో కేరళను వరదలు ముంచెత్తినప్పుడైతే ఈ నకిలీ వార్తలకు అడ్డుఅదుపే లేకుండా పోయింది. అలాగే పిల్లలను ఎత్తుకుపోతున్నారనే వాట్సాప్ మెసేజ్‌లతో చాలా మందిపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. (చదవండి: వరదల్లో ఫేక్ న్యూస్ బురద) కేరళ వరదలు: రోనాల్డో 72.. కోహ్లి 82 కోట్లట! -
సముద్రంలో కూలిన విమానం
జకార్తా: ఇండోనేసియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని జకార్తా నుంచి సోమవారం ఉదయం 6.20 గంటలకు 189 మందితో పంగ్కల్ పినాంగ్ సిటీకి బయల్దేరిన ‘లయన్ ఎయిర్’ జెట్ విమానం జావా సముద్రంలో కుప్పకూలింది. బయల్దేరిన 13 నిమిషాలకే జకార్తాకు 32 మైళ్ల దూరంలో, కెరవాంగ్ సముద్ర తీరానికి దగ్గర్లో సముద్రంలో కూలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న 182 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన ‘బోయింగ్ –737 మాక్స్’ జేటీ 610 విమానానికి భారతీయుడైన భవ్య సునేజా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. ఫ్లైట్ డేటా ప్రకారం.. ఆకాశంలోకి వెళ్లాక వేగం పుంజుకుని 5 వేల అడుగుల పైకి చేరుకున్న కాసేపటికి, రాడార్ సంకేతాలను కోల్పోయి, కంట్రోల్ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయి, వేగంగా నేలవైపు దూసుకువచ్చిన విమానం క్షణాల్లో సముద్రంలో కుప్పకూలింది. అంతకుముందు, కొన్ని క్షణాల ముందే, తిరిగి జకార్తాకు తిరిగిరావాల్సిందిగా ఆ విమాన పైలట్‌ను కంట్రోల్ సెంటర్ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ప్రమాద సమాచారం తెలియగానే అధికారులు సహాయచర్యలు చేపట్టారు. తమకు లభించిన ఆనవాళ్ల మేరకు ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ బ్రతికే అవకాశం లేదని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారి బంబాంగ్ సుర్యొ అజి తెలిపారు. విమానం నీళ్ల లోపలికి వేగంగా దూసుకువెళ్లడాన్ని పలువురు ప్రత్యక్ష సాక్షులు కూడా చూశారన్నారు. 40 మంది డైవర్లు సహా 150 మంది సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. సముద్రంలో 30 నుంచి 40 మీటర్ల లోతులో విమాన శకలాలను గుర్తించారు. ఈ ఆగస్ట్‌లోనే ఈ విమానాన్ని సర్వీస్‌లోకి తీసుకున్నామని లయన్ ఎయిర్ సంస్థ తెలిపింది. కొద్ది రోజుల క్రితం స్వల్ప మరమ్మతులకు గురైందని వెల్లడించింది. బాలిలో మరమ్మతులు జరిపి ఇటీవలే మళ్లీ జకార్తా తీసుకువచ్చామని, సోమవారం ఉదయం టేకాఫ్‌కు ముందు కూడా ఇంజనీర్లు స్వల్ప మరమ్మతులు చేశారని, అయితే, అది సాధారణంగా చేసే ప్రక్రియేనని లయన్ ఎయిర్ చీఫ్ ఎడ్వర్డ్ సైరాయిత్ వివరించారు. ఫ్లైట్ డేటా రికార్డర్, వాయిస్ రికార్డర్ లభిస్తే ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు. ఈ ప్రమాదంపై విమాన తయారీ సంస్థ బోయింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరో గంటలో గమ్యస్థానానికి.. మరో గంటలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన పంగ్కల్ పినాంగ్ సిటీకి ఈ విమానం చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలియగానే జకార్తా విమానాశ్రయం చేరుకున్న ప్రయాణీకులు తమవారి ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న హృదయ విదారక దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ‘నా కుమార్తె చనిపోయి ఉంటే కనీసం ఆమె ఖననమైనా సరిగ్గా జరగా లని కోరుకుంటున్నాను’ అని ఆ విమాన ప్రయాణఙ కురాలి తల్లి ఒకరు కన్నీళ్లతో చెప్పారు. ఇండోనేసియా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ వివరాల మేరకు.. ప్రమాదానికి గురైన విమానంలో 178 మంది పెద్దలు, ఒక పాప, ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు విమాన సహాయక సిబ్బంది ఉన్నారు. వారిలో దాదాపు 20 మంది ఇండోనేసియా ఆర్థిక శాఖ ఉద్యోగులున్నారు. తన స్నేహితులు చాలామంది అందులో ఉన్నారని ఆలస్యం కావడంతో విమానాన్ని అందుకోలేకపోయిన సోనీ సెతియావన్ చెప్పారు. 2015 ఆగస్ట్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా ఇండోనేసియాకే చెందిన త్రిగణ ఎయిర్‌లైన్స్ విమానం కూడా ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 54 మంది ప్రయాణికులు చనిపోయారు. ఏడాదిక్రితం ఎయిర్ ఏసియా విమాన ప్రమాదలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. తక్కువ ధరలకే విమాన ప్రయాణం కల్పించే సంస్థగా పేరున్న లయన్ ఎయిర్‌కు చెందిన పలు విమానాలకు కూడా గతంలో ప్రమాదాలకు గురైన చరిత్ర ఉంది. 1999లో ప్రారంభం లయన్ ఎయిర్ సంస్థను 1999లో ప్రారంభించారు. ప్రయాణికుల సంఖ్య పరంగా ఇండోనేసియాలో ఇది అతి పెద్ద విమానయాన సంస్థ. అంతర్జాతీయంగానే కాకుండా, దేశీయంగా వేలాది ద్వీపాలకు డజన్ల సంఖ్యలో విమానాలను నడుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా చూసినా, మలేసియాకు చెందిన ఎయిర్ఏషి యా తరువాత చవకైన ఎయిర్‌లైన్ ఇదే. ఈ సంస్థ నడుపుతున్న విమానాల్లో అత్యధికం బోయింగ్ 737 రకానివే. ఈ ఏడాది మొదట్లో 6.24 మిలియన్ డాలర్లతో 50 బోయింగ్ విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. భారత్‌లో సేఫే: డీజీసీఏ భారత్‌లో విధుల్లో ఉన్న బోయింగ్ 737 మాక్స్ విమానాల్లో సాంకేతికపరమైన ఎలాంటి లోపాలు ఇప్పటివరకు తలెత్తలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించింది. భారత్‌లో స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ సంస్థలు భారత్‌లో ఈ రకానికి చెందిన ఆరు విమానాలను నడుపుతున్నాయి. ఎందుకు ఇక్కడే ప్రమాదాలు ఎక్కువ? సుహార్తో నాయకత్వం కింద సైనిక పాలనలో ఉన్న ఇండోనేసియా 1997లో ప్రజాస్వామ్యానికి మళ్లింది. పర్యాటక రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 2000లో విమానయాన రంగంలో ప్రైవేటు సంస్థలకు తలుపులు తెరిచింది. దాంతో అనేక సంస్థలు ఇక్కడ నుంచి సర్వీసులు ప్రారంభించాయి. ప్రస్తుతం దాదాపు 60 విమానయాన సంస్థలు ఇక్కడ పని చేస్తున్నాయి. సంస్థలు ఎక్కువ కావడంతో పోటీ పెరిగి ధరల యుద్ధానికి దారి తీసింది. టికెట్ల రేట్లు పోటీ పడి తగ్గిస్తున్న సంస్థలు నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడుతున్నాయి. దీనిపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా కొరవడింది. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. 2000 నుంచి తాజా ప్రమాదం వరకు లెక్కిస్తే ఇండోనేసియాలో మొత్తం 45 భారీ ప్రమాదాలు జరిగాయి. 1950–1999 మధ్య 35 ప్రమాదాలు జరిగాయి. ఒక్క 1997లో జరిగిన వివిధ ప్రమాదాల్లో మొత్తం 380 మంది చనిపోయారు. ఇండోనేసియా విమానయాన సంస్థల నిర్వహణలో భద్రతాపరమైన లోపాలున్నాయంటూ యూరోప్ దేశాలకు అక్కడి నుంచి విమాన సర్వీసులు నడపొద్దంటూ యూరోపియన్ యూనియన్ జూన్ 2016లో నిషేధం విధించింది. అమెరికా కూడా దశాబ్దం పాటు విధించిన నిషేధాన్ని 2016లో తొలగించింది. పైలట్ భారతీయుడు ప్రమాదానికి గురైన విమాన ప్రధాన పైలట్ భారతీయుడైన భవ్య సునేజా(31) అని, ఈ ప్రమాదంలో ఆయన కూడా దుర్మరణం చెందారని అక్కడి భారతీయ ఎంబసీ ప్రకటించింది. ఈ విమాన కో పైలట్‌గా హర్వీనో వ్యవహరించారు. సునేజాకు 6 వేల గంటలు, కో పైలట్ హర్వీనోకు 5 వేల గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవం ఉంది. సునేజా ఢిల్లీకి చెందిన వారు. మయూర్ విహార్‌లోని ఆల్కాన్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. 2009లో బెల్ ఎయిర్ ఇంటర్నేషనల్ నుంచి పైలట్ లైసెన్స్ పొందారు. లయన్ ఎయిర్ సంస్థలో 2011 మార్చ్‌లో చేరారు. అంతకుముందు ఎమిరేట్స్‌లో ట్రైనీ పైలట్‌గా చేశారు. లయన్ ఎయిర్ సంస్థను విడిచి భారత్‌కు వచ్చి ఇక్కడి సంస్థలో పని చేయా లని సునేజా భావించా రని భారత్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ వైస్ ప్రసిడెంట్ ఒకరు తెలిపారు. అందుకోసం తమను సంప్రదించాడని, అనుభవజ్ఞుడైన అలాంటి పైలట్ తమకూ అవసరమేనని భావించి, తాము కూడా సుముఖంగానే స్పందించామని చెప్పారు. అయితే, ఆయన ఢిల్లీ పోస్టింగ్ అడగడంతో, సర్వీస్‌లో చేరిన ఏడాది తరువాత ఢిల్లీ పోస్టింగ్ ఇస్తామని చెప్పామని వివరించారు. పైలట్ భవ్య సునేజా -
కుప్పకూలిన విమానం
డ్యురాంగో: భారీ వడగళ్ల వానకు ఉత్తర మెక్సికోలో ఏరోమెక్సికోకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. డ్యురాంగో నుంచి మెక్సికోకు వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వడగళ్ల వానలో విమానం చిక్కుకుంది. దీంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించడంతో విమానం కుప్పకూలింది. వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 99 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఇద్దరు విమాన సిబ్బంది కలిపి మొత్తం 103 మంది అందులో ఉన్నారు. వారిలో 97 మందికి గాయాలయ్యాయి. పైలట్లు ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం విశేషం. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. విమాన సిబ్బంది ఎంతో చాకచక్యంగా, నేర్పరితనంతో విమానాన్ని భారీ ప్రమాదం నుంచి తప్పించారని ఎయిర్‌లైన్స్ డైరెక్టర్ జనరల్ ఆండ్రెస్ కొనేసా అభినందించారు. విమానం భద్రతా ప్రమాణాల వల్లే.. ఏరోమెక్సికో విమాన ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడానికి కారణం దాన్ని తయారుచేసిన విధానం, భద్రతా ప్రమాణాల వల్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. విమానం లోపలి భాగాలు మంటలు అంటుకుని కాలిపోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందని, ఎలాంటి హానికరమైన వాయువులు విడుదల కాకపోవడం వల్లే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. -
క్యూబాలో ఘోర విమాన ప్రమాదం!
హవానా: క్యూబాలో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ విమానయాన సంస్థ క్యూబానాకు చెందిన ఓ విమానం రాజధాని హవానాలోని జోస్ మార్టి విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉండగా ఎంతమంది మరణించిందీ కచ్చితంగా తెలియరాలేదు. బోయింగ్ 737 రకం విమానం హవానా నుంచి హోల్గ్యిన్ పట్టణానికి వెళ్తుండగా హవానాకు దగ్గర్లోనే పంట పొలాల్లో కూలి కాలిపోయింది. ప్రమాదం వల్ల దట్టమైన పొగ కమ్ముకున్న ఆ ప్రాంతానికి సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్–కేనెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మరణించిన వారి సంఖ్య భారీగానే ఉంటుందని చెప్పారు. -
సిద్దిపేట జిల్లాలో కూలిన విమానం
-
కుప్పకూలిన శిక్షణ విమానం
సాక్షి, సిద్దిపేట: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ ట్రైనీ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా దుద్దెడ శివారులో జరిగింది. హైదరాబాద్ హకీంపేటకు చెందిన బ్రిగేడియర్ రాజీవ్ రైనా కుమార్తె.. రాశి రైనా (24) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (హకీంపేట అకాడమీ)లో శిక్షణ పొందుతోంది. రోజువారీగా శుక్రవారం 4 ఎయిర్‌క్రాఫ్ట్‌లలో రాశి, ఇతర సహచరులు సిద్దిపేట వైపు వచ్చారు. రాశి ఉన్న శిక్షణ విమానం దుద్దెడ సమీపంలోని దర్గా బందారం కమాన్ సెంటర్ వద్ద చక్కర్లు కొట్టింది. దీంతో వెంటనే ఆమె అప్రమత్తమై సహచరులకు సమాచారం అందించింది. అనంతరం ప్యారాచూట్ సహాయంతో కిందికి దిగేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో హెలికాప్టర్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్యారాచూట్‌కు రంధ్రాలు పడ్డాయి. భూమికి 50 ఫీట్ల ఎత్తుకు రాగానే ప్యారాచూట్ మూసుకుపోయింది. ఈ క్రమంలో రాశి రాజీవ్ రహదారిపై పడటంతో చెయ్యి, కాలు విరిగాయి. ఎయిర్‌క్రాఫ్ట్ పెద్ద శబ్దంతో కిందకు పడిపోవడంతో ఇంజిన్ కాలిబూడిదైంది. కాగా, అదే సమయంలో అక్కడే పనిచేస్తున్న గ్రామస్తులు వెంటనే 108కు సమాచారం అందించారు. రాశిని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందచేశారు. విషయం తెలుసుకున్న ఇండియన్ ఎయిలైన్స్ అధికారులు, మెడికల్ సిబ్బంది హుటాహుటిన సిద్దిపేటకు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో బాధితురాలిని హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. శిక్షణ విమాన శకలాలు, రాశి వస్తువులు సేకరించారు. -
అమెరికాలో కుప్పకూలిన విమానం
-
అమెరికాలో కుప్పకూలిన విమానం
నెవెడా: అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఉత్తర నెవెడాలో ఎయిర్ అంబులెన్స్ విమానం కూలిపోవడంతో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న రోగిని ఉతాహ్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు ఇంజిన్లు కలిగిన ఈ విమానం కాసినో సమీపంలోని ప్రైవేటు మైనింగ్ కంపెనీకి చెందిన పార్కింగ్ ప్రదేశంలో కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రోగితో పాటు విమానంలో ఉన్న ముగ్గురు సిబ్బంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళ కూడా ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగానే విమానం కూలిపోయివుంటుందని అనుమానిస్తున్నారు. ఈ విమానం రెనోకు చెందిన అమెరికన్ మిడ్ ఫ్లైట్ సంస్థకు చెందినది. ప్రమాదంపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తామని మిడ్ ఫ్లైట్ సంస్థ తెలిపింది. అయితే మృతుల పూర్తి వివరాలు వెల్లడికాలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
భార్య వదిలేస్తే.. విమానాన్ని కూల్చేస్తా: పైలట్
భార్య తనను వదిలేస్తే.. 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని కూల్చేస్తానని ఓ ప్రబుద్ధుడు బెదిరించాడు. అతడు ఎవరో కాదు.. సాక్షాత్తు ఆ విమానం నడిపే పైలట్!! రోమ్ నుంచి జపాన్ వెళ్లే విమానానికి పైలట్‌గా వ్యవహరిస్తున్న సదరు వ్యక్తి ఈ మేరకు తన భార్యకు ఎస్ఎంఎస్ పంపాడు. భర్తను వదిలిపెట్టి వెళ్లిపోతానని ఆమె చెప్పడంతో.. అలా చేస్తే విమానాన్ని కూల్చేస్తానని అతగాడు అన్నాడట. గత సంవత్సరం జనవరిలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, విమానం టేకాఫ్ తీసుకోడానికి కొన్ని నిమిషాల ముందు అతడిని పోలీసులు ఆపేశారు. అతడు తనకు ఎస్ఎంఎస్ పంపిన విషయాన్ని పైలట్ భార్య వెంటనే అధికారులకు చెప్పడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. 'నువ్వు గనక నన్ను వదిలేస్తే నేను ఆత్మహత్య చేసుకోవడమే కాదు.. విమానంలో ఉన్న అందరినీ చంపేస్తా' అని అతడు బెదిరించాడట. ఆ విషయం ముందే అధికారులకు తెలియడంతో వెంటనే అతడి బదులు మరో పైలట్‌ను ఆ విమానం నడిపేందుకు పంపారు. ప్రయాణికులెవ్వరికీ ఈ విషయం తెలియనివ్వలేదు. ఇప్పటివరకు కూడా దాన్ని రహస్యంగానే ఉంచారు. తన భర్త తనను సరిగా చూసుకోవడం లేదంటూ అంతకుముందు ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఆ పైలట్.. మానసిక చికిత్స పొందుతున్నాడు. జర్మన్ పైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ కావాలనే జర్మన్వింగ్స్ విమానం ఎ 320ని ఆల్ప్స్ పర్వతాల్లో కూల్చేసి 149 మందిని చంపేసిన రెండు నెలల ముందు ఈ ప్రమాదం తప్పింది. -
విమానం కుప్పకూలి.. నలుగురి మృతి
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ విమానం కుప్పకూలి ఇద్దరు పిల్లలు సహా నలుగురు మరణించారు. ఈ ప్రమాదం కాలేజి స్టేషన్‌కు ఆగ్నేయంగా గల నవసోటాలో జరిగింది. నాలుగు సీట్లు మాత్రమే ఉన్న సింగిల్ ఇంజన్ సైరస్ ఎస్ఆర్-20 రకం విమానం సిటీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే ప్రయత్నాలలో ఉండగా అది కూలిపోయిందని సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఎయిర్ అఖ్తర్ సంస్థ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్న ఈ విమానం.. డేవిడ్ వేన్ హూక్స్ ఎయిర్‌పోర్టు నుంచి హ్యూస్టన్‌కు బయల్దేరింది. కానీ నవసోటా సమీపంలో ఓ విమానంలో వెళ్తున్న పైలట్.. ఈ విమానం కూలిపోయి ఉండటాన్ని గుర్తించాడు. అందులో నలుగురు ప్రయాణికులు మరణించిన విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) విచారణ జరుపుతోంది. -
వేగం పెంచి మరీ కూల్చేశాడు!
పారిస్: ఫ్రాన్స్‌లో జర్మన్వింగ్స్ విమానాన్ని కూల్చేసిన కో-పైలట్ లూబిట్జ్.. విమానాన్ని కూల్చేసేందుకు పదే పదే వేగాన్ని పెంచినట్లు ఫ్రాన్స్‌కు చెందిన విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ బీఈఏ తెలిపింది. ప్రమాద ప్రాంతంలో గురువారం దొరికిన ఆ విమానపు రెండో బ్లాక్ బాక్స్‌లో నమోదైన సమాచారం ఈ విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. కో-పైలటే విమానాన్ని కావాలని కూల్చేసినట్లు తొలి బ్లాక్‌బాక్స్ సంభాషణల ద్వారా తెలియగా ఈ అనుమానాలకు తాజాగా రెండో బ్లాక్ బాక్స్‌లో లభ్యమైన సాంకేతిక సమాచారం బలం చేకూరుస్తోందని బీఈఏ పేర్కొంది. కో-పైలట్ ఆటోమాటిక్ పైలట్ వ్యవస్థను నియంత్రిస్తూ విమానాన్ని నేల దిశగా వేగంగా ప్రయాణించేలా చేశాడంది. -
బ్లాక్‌బాక్సులను అప్పగించిన రష్యా రెబల్స్
విమాన దుర్ఘటన జరిగిన దాదాపు వారం రోజులకు ఎట్టకేలకు బ్లాక్ బాక్సులు అధికారుల చేతికి వచ్చాయి. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో విమానం కూలిన ప్రాంతంలో ఉన్న వీటిని మలేషియన్ అధికారులకు రష్యాన్ తిరుగుబాటుదారులు అందించారు. డోనెట్స్క్ ప్రాంతంలో వీటిని తమ అధికారులకు ఇచ్చినట్లు మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ వెల్లడించారు. వీటిని తదుపరి విశ్లేషణ కోసం నిపుణులకు పంపుతామని ఆయన చెప్పారు. విమాన దుర్ఘటన విషయంలో ఇప్పుడు మరో కొత్త వాదన మొదలైంది. ఉక్రెయిన్‌కు చెందిన ఓ ఫైటర్ జెట్ విమానం గాలిలోంచి గాలిలోకి ప్రయోగించి క్షిపణులతో ఎంహెచ్-17 విమానాన్ని వెంబడించినట్లు రష్యా సైన్యానికి చెందిన సీనియర్ అధికారులు తాజాగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి తమకు ఉపగ్రహ చిత్రాల సాక్ష్యాలు ఉన్నాయని, ఆ ఫైటర్ విమానం ఎక్కడినుంచి ఎక్కడు వెళ్లిందో వివరించాలని ఉక్రెయిన్ను నిలదీస్తున్నారు. -
'ఎమ్హెచ్ 17 మృతులందరిని గుర్తించాం'
ఎమ్హెచ్ 17 విమాన ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన 298 మందిని గుర్తించినట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. మృతుల వివరాలను శనివారం కౌలాలంపూర్‌లో మలేషియా ఎయిర్‌లైన్స్ విడుదల చేసింది. మృతుల్లో 192 మంది డచ్ దేశస్తులని... వారిలో ఒకరు నెదర్లాండ్స్ / యూఎస్ పౌరసత్వం కలిగి ఉన్నారని పేర్కొంది. 15 మంది విమాన సిబ్బంది, ఇద్దరు చిన్నారులతో మొత్తం 44 మంది మలేషియన్లు ఉన్నారని చెప్పింది. 27 మంది ఆస్ట్రేలియన్లు, ఓ శిశువుతో సహా12 మంది ఇండోనేషియన్లు ఉన్నారని వివరించింది. దక్షిణ ఆఫ్రికా పౌరసత్వం కలిగిన ఓ ప్రయాణికుడితోపాటు 9 మంది బ్రిటన్ దేశస్తులు ఉన్నారని తెలిపింది. నలుగరు జర్మన్, నలుగురు బెల్జియం, ముగ్గురు పిలిప్పీన్స్, ఒకరు కెనడా, మరోకరు న్యూజిలాండ్ దేశస్తుడని మలేషయా ఎయిర్‌లైన్స్ విశదీకరించింది. -
370... 130... 17
అదేంటో గాని మలేషియా ఎయిర్ లైన్స్ విమానాలని ప్రమాదాలు నిడలా వెంటాడుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం మన జ్ఞాపకాల దొంతర నుంచి చెరిగిపోక మునుపే గురువారం సాయంత్రం ఎమ్హెచ్ 17 విమానం కుప్పకూలింది. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం గురువారం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విమానంలోని మృతుల్లో అత్యధికులు అంటే సగానికి సగం మంది డచ్ దేశానికి చెందిన వారే ఉన్నారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరింది. బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ దొరకలేదు. దాంతో తమ బంధువుల ఆచూకీ తెలుసుకోవడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమాన ప్రయాణికుల బంధువులు స్నేహితులు మలేషియా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. మలేషియా ప్రభుత్వానికి ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ కనుగోవడం పెద్ద తల నొప్పిగా తయారైంది. అంతలో నిన్న సాయంత్రం మరో విమానం ప్రమాదం జరగడంతో మలేషియా ప్రభుత్వం తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ రెండు విమాన ప్రమాదాలు కేవలం 130 రోజులు తేడాలో జరిగాయి. -
9/11 తరువాత అతి పెద్ద ప్రమాదం
మలేషియా విమానం ఉక్రేన్ గగన తలంలో మిసైల్ కి బలైపోయిన సంఘటన 9/11 సంఘటన తరువాత జరిగిన అతి పెద్ద విమాన ప్రమాద సంఘటన. 9/11 లో నాలుగు విమానాలు హైజాక్ కి గురై న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగన్ లను ఢీకొన్నాయి. ఇంకో విమానం కూడా కుప్పకూలింది. ఆ తరువాత జరిగిన అతి పెద్ద విమాన ప్రమాద ఘటన ఉక్రేన్ లో జరిగిన మలేషియా విమాన ప్రమాదం. ఈ సంఘటనలో 298 మంది చనిపోయారు. 9/11 సంఘటనలో 2996 మంది చనిపోయారు. -
మలేషియాకి మళ్లీ విషాదం....
-
క్షిపణితో మలేసియా విమానం కూల్చివేత
-
ఉక్రెయిన్ గగనతలంపై భద్రత లేదా ?
-
విమాన మృతుల్లో ప్రముఖ ఎయిడ్స్ పరిశోధకులు
మలేషియా విమాన ప్రమాదంలో ఎయిడ్స్ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న పలువురు ప్రముఖులు మరణించారని అంతర్జాతీయ ఎయిడ్స్ సోసైటి (ఐఏఎస్) శుక్రవారం తన అధికారి వెబ్సైట్లో పేర్కొంది. ఐఏఎస్ మాజీ అధ్యక్షుడు, ఎయిడ్స్ వ్యాధిపై సుదీర్ఘ కాలంగా పరిశోధనలు చేస్తున్న ప్రముఖ పరిశోధకుడు జోపి లాంజ్ కూడా మృతుల్లో ఉన్నారని వెల్లడించింది. 20వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సు ఆదివారం ఆస్ట్రేలియా రాజధాని మెల్బోర్న్లో ప్రారంభం కానుంది. ఆ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న పలువురు మలేషియా విమానంలో ఆస్ట్రేలియా బయలుదేరారు. రష్యా సరిహద్దుల్లోని చేరుకున్న ఆ విమానాన్ని ఉక్రెయిన్‌లో తిరుగుబాటు దారులు క్షిపణులతో దాడి చేయడంతో కూలిపోయింది. ఆ ప్రమాదంలో విమానంలోని 295 మంది మరణించారు. మృతుల్లో ఎయిడ్స్ పరిశోధకులు ఉన్నారు. మలేషియా విమానం మృతువు రూపంలో తమ సహచరులు, సన్నిహితులను కబళించివేసిందని ఐఏఎస్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. -
ఎం హెచ్ 17: గతంలోనూ ఇలాంటి విమాన ప్రమాదాలు జరిగాయి...
యుద్ధంలో విమానాల్ని కూల్చేయడం మామూలు. కానీ పౌర విమానాలను సైనికులు లేదా గెరిల్లాలు కూల్చేయడం చాలా అరుదు. ఇప్పటి దాకా ఇలాంటి సంఘటను 24 సార్లు జరిగాయి. అయితే మలేషియా విమానాన్ని మిసైల్ తో కుప్పకూల్చేసిన సంఘటన మాత్రం చరిత్రలోనే అతి పెద్దది. * ప్రపంచ చరిత్రలో ఇలాంటి సంఘటన తొలి సారి 1943 లో జరిగింది. నాజీ జర్మనీ సైనలు లిస్బన్ నుంచి లండన్ వెళ్తున్న బ్రిటిష్ విమానాన్ని కుప్పకూల్చేశారు. అయితే నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియన్ విమానాన్ని కూల్చిన సంఘటన మాత్రం పూర్తిగా భిన్నమైనది. నెదర్లాండ్స్, మలేషియాలకు ప్రస్తుతం ఉక్రేన్ లో జరుగుతున్న యుద్ధానికి ఎలాంటి సంబంధమూ లేదు. * 2001 అక్టోబర్ లో సైబీరియా ఎయిర్ లైన్స్ కి చెందిన ఒక విమానాన్ని ఉక్రేన్ సైనికులు కుప్ప కూల్చేశారు. ఈ సంఘటనలో 64 మంది యాత్రీకులు, 12 మంది సిబ్బంది చనిపోయారు. ఈ సంఘటన తరువాత ఉక్రేన్ రక్షణ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. * 1983 లో రష్యా దక్షిణ కొరియాకి చెందిన ఫ్లైట్ 007 ను రష్యా గగనతలం మీద నుంచి ప్రయాణిస్తూండగా కుప్పకూల్చేసింది. ఈ సంఘటనలో 269 మంది చనిపోయారు. దీని వల్ల రష్యాకు అంతర్జాతీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. * 1988 లో ఇరాన్ కి చెందిన ఫ్లైట్ 655 ను అమెరికా గురిపెట్టి కాల్చింది. ఈ సంఘటనిరాన్, ఇరాక్ యుద్ధం జరుగుతున్న సందర్భంగా జరిగింది. అమెరికా ప్రభుత్వం ఇరాన్ కి నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది. * 1980 లో ఇటావియా ఫ్లైట్ కుప్పకూలింది. ఈ సంఘటన టిరెనెయన్ సముద్రంలో సిసిలీకి దగ్గర జరిగింది. ఒక మిసైల్ తాకడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతారు. అయితే ఎందుకు, ఎలా ఈ ప్రమాదం జరిగిందన్న విషయం మాత్రం ఇప్పటికీ తేలలేదు. * ఎల్ ఆల్ ఫ్లైట్ కూల్చివేత సంఘటన జులై 1955 లో జరిగింది. బల్గేరియా గగన తలంలో ఇజ్రాయిల్ కి చెందిన విమానాన్ని కూల్చేశారు. దీనిలో 58 మంది చనిపోయారు. ఈ సంఘటనలో బల్గేరియా ఇజ్రాయిల్ కి నష్టపరిహారం చెల్లించింది. * 1954 లో చైనా సైనికులు ఒక కాథే పసిఫిక్ విమానాన్ని కూల్చేశారు. విమానం బ్యాంకాక్ నుంచి హాంకాంగ్ వస్తూండగా ఈ సంఘటన జరిగింది. చైనా హాంకాంగ్ కు ఈ సంఘటన తరువాత క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. * 1973 లో లిబియాకు చెందిన పౌర విమానం దారి తప్పి ఇజ్రాయిల్ అధీనంలో ఉన్న మౌట్ సినాయ్ ప్రాంతంలోకి వచ్చింది. దీన్ని ఇజ్రాయిలీలు కూల్చేశారు. ఈ సంఘటనలో 108 మంది ప్రయాణికులు చనిపోయారు. -
'మారణ హోమం సృష్టిస్తున్నారు'
రష్యన్ వేర్పాటు వాదులు ఉక్రెయిన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. తమ డిమాండ్లను సాధించుకునేందుకు హింసతో పాటు, నిత్య మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌కు చెందిన పలు మిలటరీ విమానాలను రష్యా అనుకూల తిరుగుబాటు దారులు పేల్చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్‌ను ఆందోళనల ద్వారా గద్దె దించేసిన తర్వాత రెండు దేశాల మద్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్-రష్యా సరిహద్దులోని కొంత భూభాగాన్ని రష్యా ఇటీవల స్వాధీనం చేసుకుంది. ఆక్రమించుకున్న ప్రాంతం నుంచే పంజా విసురుతున్న వేర్పాటు వాదులు నెత్తుటి వ్యూహాలతో రక్త చరిత్రను లిఖిస్తున్నారు. ఎంహెచ్ 17 విమానం నేలకొరిగిన గ్రాబోవో కూడా రష్యన్ వేర్పాటు వాదుల ఆధీనంలో ఉంది. దీంతో గగనతలం నుంచి దాడులు చేస్తున్నారనే అనుమానంతో సాయుధ తిరుగుబాటు దళాలే విమానాన్ని పేల్చేసి ఉంటారని సర్వత్రా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ గగనతలం కూడా ప్రమాదకరంగా మారిపోయింది. కాగా ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి కౌలాలంపూర్ వెళుతున్న మలేసియా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777 విమానం గురువారం సాయంత్రం రష్యా సరిహద్దులో యుద్ధరంగంగా మారిన ఉక్రెయిన్ భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో 15 మంది సిబ్బందితోపాటు మొత్తం 295 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మలేసియాకే చెందిన ఎంహెచ్ 370 విమానం మార్చిలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. గత నాలుగు నెలల్లో ఇది రెండో విమాన ప్రమాదం. -
ఆ ప్రాంతమే ప్రమాదకరం!
రష్యా క్షిపణులతో ఉక్రెయిన్ గగనతలంలో కరువైన భద్రత పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చేసిన తిరుగుబాటుదారులు ఆధిపత్య పోరుతో విషమించిన పరిస్థితి రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా.. అదే రోజున మలేసియా విమాన దుర్ఘటన ఉక్రెయిన్‌లో తిరుగుబాటుదారులకు మద్దతుగా రష్యా అందజేస్తున్న క్షిపణులే ప్రమాదకరంగా మారాయా? వాటివల్లే ఉక్రెయిన్ గగనతలం ఏమాత్రం భద్రత లేనిదిగా తయారైందా? ఇలాంటి ప్రశ్నలు తలెత్తడానికి కారణం.. ఆ దేశంలో కొద్ది రోజులుగా చోటు చేసుకున్న ఘటనలే! ఉక్రెయిన్‌లో అంతర్యుద్ధం కారణంగా.. ప్రభుత్వ సైన్యానికి, రష్యా అనుకూల తిరుగుబాటుదారులకు మధ్య తీవ్ర పోరు జరుగుతోంది. ఈ క్రమంలో తిరుగుబాటుదారులు రష్యా విమాన విధ్వంసక క్షిపణులతో పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చివేశారు. గత నాలుగు రోజుల్లోనే ఐదు యుద్ధ విమానాలను కూల్చేశారు. సోమవారం తిరుగుబాటు దారులు ఉక్రెయిన్ యుద్ధ విమానాన్ని కూల్చివేయగా, బుధవారం తమ ఎస్‌యూ-25 విమానాన్ని రష్యా కూల్చివేసిందని ఉక్రెయిన్ పేర్కొంది. అంతేగాకుండా బుధవారం రెండు, మంగళవారం ఒక ఉక్రెయిన్ యుద్ధవిమానాలను తాము పేల్చివేసినట్లు తీవ్రవాదులు ప్రకటించారు కూడా. దీంతో యుద్ధ విమానాలకే కాదు, పౌర విమానాలకు కూడా ఆ దేశ గగనతలం ప్రమాదకరంగా మారింది. కాగా.. అంతర్యుద్ధంతో కుతకుతలాడుతున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతం మీ దుగా విమానాల రాకపోకలను నిలిపివేయాలని భారత వైమానిక సంస్థలు నిర్ణయించి నట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థల సలహా ప్రకారం తాము నడుచుకోనున్నట్లు ఎయిరిండియా అధికారి తెలిపారు. పతనమైన అమెరికా మార్కెట్లు.. రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఆంక్షలు విధించిన రోజే మలేసియా విమానాన్ని ఉక్రెయిన్‌లో కూల్చివేశారనే వార్త లు రావడంతో.. అమెరికా స్టాక్‌మార్కెట్లలో దడ పుట్టించింది. డౌజోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ సూచీలన్నీ ప్రస్తుత సెషన్లో అతి తక్కువ స్థాయిని తాకాయి. ఈ సందర్భంగా న్యూయార్క్‌లోని మెరిడియన్ ఈక్విటీ ఎండీ జోసెఫ్ గ్రెసో మాట్లాడుతూ.. ‘మలేషియా విమానంఘటనపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ రోజే అమెరికా అధ్యక్షుడు ఒబామా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించా రు. పలు హెచ్చరికలు కూడా చేశా రు. విమానం ఘటన నేపథ్యంలో ఇదో వివాదమయ్యే అవకాశముంది..’ అని వ్యాఖ్యానించారు. -
క్షిపణితో మలేసియా విమానం కూల్చివేత!
కీవ్/మాస్కో/వాషింగ్టన్/ కౌలాలంపూర్: రెండు దేశాల ఆధిపత్య పోరులో 295 మంది అమాయక ప్రయాణికులు బలయ్యారు. 295 మందితో అమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై పేల్చేశారు. రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్ ప్రభుత్వ దళాలు, రష్యా అనుకూల తిరుగుబాటుదారుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతంలో.. ఆ విమానం కూలిపోయింది. ఘటనలో విమానంలో ఉన్న 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది.. మొత్తం 295 మంది మరణించారు. పేల్చివేతపై ఇప్పటివరకూ ఎవరూ బాధ్యత తీసుకోలేదు. కానీ ఉక్రెయిన్ దళాలే పేల్చేశాయని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పేర్కొంటుండగా.. అది తిరుగుబాటుదారుల పనేనంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ప్రయాణీకుల విమానాన్ని కూల్చివేయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నాలుగు నెలల క్రితం హిందూ మహాసముద్రంలో అంతు చిక్కని రీతిలో అదృశ్యమైన ఎంహెచ్ 370 విమాన ఘటనను మరచిపోకముందే ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ఈ రెండు విమానాలు మలేసియన్ ఏర్‌లైన్స్‌కు చెందినవే కావడం గమనార్హం. సమాచారం అందగానే హుటాహుటిన అత్యవసర సహాయ దళాలు ఘటనాప్రాంతానికి బయల్దేరాయని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనను విమాన విపత్తుగా పేర్కొన్న ఉక్రెయిన్ ప్రధానమంత్రి వెంటనే విచారణకు ఆదేశించారని సమాచారం. విమానం కూలిపోయిన ప్రాంతంలో 22 మృతదేహాలను లెక్కించినట్లు ఘటనాస్థలానికి చేరిన జర్నలిస్ట్ ఒకరు తెలిపారు. 10 కిమీల ఎత్తున మలేసియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 ప్యాసెంజర్ విమానం గురువారం సాయంత్రం ఉక్రెయిన్‌లోని, సంక్షోభ ప్రాంతమైన దొనెస్క్లో ఉన్న షక్తర్క్ పట్టణ పరిసరాల్లోకి రాగానే రాడార్ సంకేతాలకు దూరమైంది. అది రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతం. ఆ సమయంలో ఆ విమానం ఉక్రెయిన్ గగనతలంపై 30 వేల అడుగుల (దాదాపు 10 కిమీల) ఎత్తున ఉంది. దీన్ని భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణితో పేల్చేశారని భావిస్తున్నారు. కాలిపోతు న్న శకలాలు, మృతదేహాలు రష్యా సరిహద్దుకు 40 కిమీల దూరంలోని గ్రబావొ గ్రామ సమీపంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మీరంటే మీరు.. గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌కు చెందిన పలు మిలటరీ విమానాలను రష్యా అనుకూల తిరుగుబాటు దారులు పేల్చేస్తున్నారు. బుధవారం కూడా తమ యుద్ధవిమానాన్ని పేల్చేశారని ఉక్రెయిన్ ప్రకటించింది. తిరుగుబాటుదారులకు రష్యా అన్నిరకాలుగా సహకరిస్తోందని, అత్యాధునిక క్షిపణులను వారికి అందిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ సాయుధ దళాలు గగన లక్ష్యాలపై ఎలాంటి దాడులు చేయలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకొ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించారు. ఉక్రెయిన్ వైమానిక దళమే మలేసియా ప్యాసెంజర్ విమానాన్ని పేల్చేసిందని తిరుగుబాటుదారుల నేత అలెక్జాండర్ బొరొదాయి ఆరోపించారు. విమాన ప్రమాద వార్త వినగానే షాక్‌కు గురయ్యానని, దీనిపై తక్షణమే విచారణకు ఆదేశించానని మలేసియా ప్రధానమంత్రి నజిబ్ రజాక్ ప్రకటించారు. ఒబామా ఆరా విమాన ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆరా తీశారు. రష్యాపై అమెరికా తాజాగావిధించిన ఆంక్షల విషయంపై ఫోన్లో మాట్లాడుతూ.. ప్రమాద విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాగా, ప్రమాద ఘటనపై జాతీయ భద్రత బృందం ఒబామాకు వివరాలందించింది. గురువారం సాయంత్రం ఎప్పుడేం జరిగింది.. 7:45: ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి కౌలాలంపూర్ వెళుతున్న మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్17(బోయింగ్ 777 రకం)తో రాడార్ సంబంధాలు తెగిపోయాయి. మొత్తం 295 మందీ చనిపోయి ఉంటారని రష్యన్ వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్ వెల్లడించింది. 7.45: ఉక్రెయిన్ గగనతలంలో తమ విమానంతో సంబంధాలు కోల్పోయినట్లు మలేసియా ఎయిర్‌లైన్స్ సంస్థ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. 7.45: విమానం 33వేల అడుగుల ఎత్తులో వెళుతుండగా భూమిపై నుంచి మిసైల్‌తో కూల్చేశారని ఉక్రెయిన్ హోంమంత్రికి సలహాదారుడు ఆంటన్ గెరాషెంకో తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. 7.46: మీడియా కథనాలు తమ దృష్టికి వచ్చాయని, సమాచారం సేకరిస్తున్నామని బోయింగ్ కంపెనీ ప్రకటించింది. 7.49: మలేసియా విమాన ప్రమాదంపై వెంటనే దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రధాని ప్రకటించారు. 7.50: మలేసియా విమానం కూల్చివేతలో ఉక్రెయిన్ రక్షణ దళాల ప్రమేయం లేదని ఆ దేశాధ్యక్షుడిని ఉటంకిస్తూ ఇంటర్‌ఫ్యాక్స్ వార్తా సంస్థ కథనం. 7.50: దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలో విమాన శకలాలు పడ్డాయని, దాదాపు వంద వరకు చిధ్రమైన మృతదేహాలు కనిపిస్తున్నట్లు ఘటనా స్థలానికి వెళ్లిన ఎమర్జెన్సీ సహాయక బృందం వెల్లడి. 7.50: అమెరికా అధ్యక్షుడు ఒబామాకు విషయం తెలిసినట్లు వైట్‌హౌజ్ ప్రకటన 7.53: తక్షణ దర్యాప్తునకు ఆదేశించిన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ 7.57: ఉక్రెయిన్ ప్రభుత్వమే విమానాన్ని కూల్చివేసిందని అక్కడి వేర్పాటువాద నేత అలెగ్జాండర్ బోరోదోయ్ ఆరోపణ. ఖండించిన ప్రభుత్వ వర్గాలు. 7.57: ఘటనపై ఉక్రెయిన్ అధికారులతో నిరంతర సంప్రదింపులు జరపాలని సీనియర్ అమెరికన్ అధికారులను ఆదేశించిన ఒబామా 8.04: మలేసియా విమానాన్ని రెబెల్స్ కూల్చివేశారని ఉక్రెయిన్ సర్కారు ఆరోపణ 8.04: ఈ ఘటనపై ఒబామాతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చించినట్లు ఆ దేశ వార్తా సంస్థ వెల్లడి 8.07: మృతులకు బోయింగ్ కంపెనీ సంతాపం. అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటన -
విమాన ప్రమాదంపై విచారణకు ఆదేశం
మలేషియా విమాన ప్రమాదంపై విచారణకు మలేషియా ప్రధాని ఆదేశించారు. ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు విమానం కూలిన ఘటనపై ఉక్రెయిన్ ప్రధాని కూడా విచారణకు ఆదేశించారు. విమానం కూలడానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అయితే, ఉక్రెయిన్ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర ఘర్షణాత్మక వాతావరణం ఉన్న ప్రాంతంలోనే ఈ విమానం కుప్పకూలింది. (చదవండి: కుప్పకూలిన మలేషియా విమానం: 295 మంది మృతి) కాగా, గత నాలుగు నెలల్లో మలేషియాకు ఇది రెండో విమాన ప్రమాదం. మార్చి 8వ తేదీన 239 మందితో వెళ్తున్న మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి హిందూ మహాసముద్రంలో గల్లంతైంది. నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు దాని ఆచూకీ తెలియలేదు. తాజా విమానం మాత్రం భూమికి పదివేల మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుండగా రాడార్‌తో దాని సంబంధాలు తెగిపోయాయి. -
కుప్పకూలిన మలేషియా విమానం: 295 మంది మృతి
మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి ఉక్రెయిన్‌లో కుప్పకూలింది. అమెరికాలోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తున్న ఈ విమానం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్‌లో ఉండగా కుప్పకూలింది. ఈ విమానంలో 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్లంతా మరణించినట్లు మలేషియా హోం శాఖ నిర్ధారించింది. ఎంహెచ్-17 విమానంతో సంబంధాలు తెగిపోయాయని, ఆ తర్వాత అది కూలిపోయినట్లు తెలిసిందని, మొత్తం అందులో ఉన్నవారంతా మరణించారని మలేషియన్ ఎయిర్ లైన్స్ సంస్థ కూడా తెలిపింది. గురువారం మధ్యాహ్నం 12.14 గంటలకు బయల్దేరిన ఈ విమానం శుక్రవారం ఉదయం 6.10 గంటలకు కౌలాలంపూర్ చేరుకోవాల్సి ఉంది. ఆలోపే ఈ ప్రమాదం జరగడంతో మొత్తం ప్రయాణికులు, సిబ్బంది అంతా మరణించారు. అయితే, రష్యా మిసైల్ వల్లే ఈ విమానం కూలినట్లు ఉక్రెయిన్ హోం మంత్రి ఆన్టోన్ తెలిపారు. విమానం 10వేల మీటర్ల ఎత్తులో ఉండగా రష్యా దాన్ని మిసైల్‌తో కూల్చేసిందన్నారు. గత రెండు వారాల్లో తమ దేశ యుద్ధ విమానాలను కూడా రష్యా కూల్చేసిందని ఆయన వివరించారు. ఈ బోయింగ్ 777 విమానం గంటకు 950 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. రెండు ప్రాంతాల మధ్య దూరం ఎక్కువ కాబట్టి ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. ప్రమాద విషయాన్ని అందరికంటే ముందుగా రష్యా వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ బయటి ప్రపంచానికి తెలిపింది. ఆ తర్వాతే మలేషియన్ ఎయిర్ లైన్స్ కూడా నిర్ధారించింది. -
రన్‌వేపై త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం
ఒక ఇండిగో విమానం గాల్లోకి లేస్తోంది.. అప్పుడే మరో ఎయిరిండియా విమానం రన్‌వే మీదకు దిగుతోంది. సరిగ్గా ఆ రెండూ ఒకదాన్ని ఒకటి దాదాపు ఢీకొట్టుకోబోయాయి. అంతే.. రెండింటిలో ఉన్న దాదాపు 250 మంది ప్రయాణికులు గుండెలు అరచేతిలో పట్టుకుని ప్రాణాలు ఉగ్గబట్టుకున్నారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్లోని బగ్డోరాలో జరిగింది. రెండు విమానాలకూ ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎయిరిండియా విమానంలో 120 మంది ప్రయాణికులున్నారు. అది రన్‌వే మీదకు దిగుతోంది. ఇండిగో విమానం బగ్డోరా నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకోబోతోంది అందులో 130 మందిప్రయాణికులున్నారు. రెండు విమానాల మధ్య కనీసం కిలోమీటరు దూరం ఉండాలన్న నిబంధనకు విరుద్ధంగా ఈ రెండూ చాలా సమీపానికి వచ్చేశాయి. అయితే, రెండు విమానాల పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ముందుగా ఇండిగో విమాన కెప్టెన్‌కు ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ నుంచి హెచ్చరిక వచ్చింది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం కెప్టెన్ వెంటనే విమానాన్ని కిందకు దించేశాడు. ఎయిరిండియా విమానం కూడా అలాగే కుడివైపు తిరిగిపోయింది. ఇద్దరు కెప్టెన్లకు 'క్లియర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్' సందేశం రాగానే వాళ్లు మళ్లీ విమానాలను మామూలు స్థితికి తీసుకొచ్చారు. ఈ సంఘటనపై డీజీసీఏ విచారణ చేపట్టింది. -
కాశ్మీర్ లో కూలిన మిగ్-21, పైలట్ దుర్మరణం
భారత వైమానిక దళంలో మృత్యు విహంగంగా పేరొందిన మిగ్-21 మరో పైలట్ ప్రాణాలను బలిగొంది. జమ్ము కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా బిజ్బెహరా ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలింది. దాంత పైలట్ అక్కడికక్కడే మరణించాడు. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా వెళ్లిన ఈ విమానం పొలాల్లో కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. విమాన పైలట్ రఘు వంశీ ఈ ప్రమాదంలో మరణించారు. మంగళవారం ఉదయం టెక్నికల్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ ఉదయమే ఈ మిగ్-21 విమానం టేకాఫ్ తీసుకుంది. అది ఎందుకు కూలిపోయిందన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. భారత వైమానిక దళం అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.