179 మంది మృతి..‘నాదే పూర్తి బాధ్యత’ | Jeju Air CEO Kim E-bae made a heartfelt statement the tragic crash Regardless of the cause take full responsibility | Sakshi
Sakshi News home page

179 మంది మృతి..‘నాదే పూర్తి బాధ్యత’

Published Mon, Dec 30 2024 11:20 AM | Last Updated on Mon, Dec 30 2024 11:32 AM

Jeju Air CEO Kim E-bae made a heartfelt statement the tragic crash Regardless of the cause take full responsibility

దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయం(Muan International Airport)లో జరిగిన జెజు ఎయిర్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటానని సంస్థ సీఈఓ కిమ్‌ ఇబే తెలిపారు. దక్షిణ కొరియాలో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో 179 మంది మృతి చెందారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. విమానం ల్యాండింగ్‌ గేర్‌ వైఫల్యం అవ్వడంతో రన్‌వేపై జారుతూ ఎయిర్‌పోర్ట్‌ రక్షణ గోడను ఢీకొట్టి ఈ ప్రమాదం జరినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై జెజు ఎయిర్‌(Jeju Air) సీఈఓ స్పందిస్తూ కారణంతో సంబంధం లేకుండా పూర్తి బాధ్యత వహిస్తారని తెలిపారు.

థాయ్‌లాండ్‌ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియాలోని సియోల్‌కు 290 కిలోమీటర్ల దూరంలోని ముయాన్‌కు జెజు ఎయిర్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌(Aircraft) ఆదివారం బయలుదేరింది. ఉదయం 9 గంటల సమయంలో ముయాన్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతుండగా విమానం ముందు భాగంలోని ల్యాండింగ్‌ గేర్‌ తెరుచుకోలేదు. అప్పటికే ల్యాండింగ్‌కు ముందు ఏటీసీ నుంచి పైలట్లకు ‘బర్డ్‌స్ట్రైక్‌’ వార్నింగ్‌ ఇచ్చారు. కానీ అప్పిటికే పరిస్థితి చేదాటిపోయిందని పైలట్‌ సిగ్నల్‌ పంపించారు. విమానం ముందు భాగంలోని ల్యాండింగ్‌ గేర్‌ వైఫల్యంతో రన్‌వేపై జారుతూ వెళ్లిన విమానం ఎయిర్‌పోర్ట్‌ రక్షణ గోడను ఢీకొని క్షణాల్లో మంటలు అంటుకుని పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: యాపిల్‌ ఐఫోన్‌ 14, ఎస్‌ఈ నిలిపివేత..కారణం..

ఘటనపై జెజు ఎయిర్ సీఈఓ కిమ్ ఇబే స్పందిస్తూ..‘ఈ విషాదకరమైన సంఘటన తీవ్రంగా కలచివేసింది. కారణంతో సంబంధం లేకుండా, ఘటనకు నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదంపై చేపడుతున్న విచారణకు అన్నివిధాలా సహకారం అందిస్తాం’ అని చెప్పారు. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement