ప్రపంచ నంబర్ 1 కంపెనీ యాపిల్ కొన్ని ఉత్పత్తులను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ 14, ఐఫోన్ ఎస్‌ఈ(3వ తరం) ఫోన్లను యూరప్‌లో నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రామాణికంగా ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు ఉండాలనేలా యూరప్ ప్రభుత్వం(EU) నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని తెలిసింది.
యూరప్ ప్రభుత్వం అన్ని మోబైళ్లలో ప్రామాణికంగా యూఎస్‌బీ టైప్-సీ(Type-C) పోర్ట్‌తో ఉన్న ఛార్జింగ్ సదుపాయం ఉండాలనేలా నిబంధనలు తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం అధికారికంగా వాడుకలో ఉన్న ఐఫోన్ 14, ఐఫోన్ ఎస్‌ఈ(3వ తరం) ఫోన్లలో ప్రత్యేకంగా యాపిల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇది యూరప్ నిబంధనలకు విరుద్ధం. దాంతో స్థానికంగా ఈ మోడళ్లను నిలిపేస్తున్నట్లు యాపిల్(Apple) ప్రకటించింది.
ఇదీ చదవండి: స్వల్ప స్థాయిలోనే కదలికలు
యాపిల్ ఐఫోన్ 14 తర్వాత విడుదల చేసిన మోడళ్లలో టైప్-సీ పోర్ట్‌ను తీసుకొచ్చింది. దాంతో ఐఫోన్ 15తోపాటు తదుపరి మోడళ్లకు ఈ సమస్య లేదు. ఇప్పటికే ఐఫోన్(IPhone) 14 వాడుతున్నవారికి ఇబ్బంది ఉండదు. కానీ కొత్తగా ఈ మోడల్ కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి మాత్రం యూరప్‌లో అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఐఫోన్ 16 మోడల్‌ను విడుదల చేయడంతో చాలామంది ఈ మోడల్‌ను కొనుగోలు చేస్తున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి. యూరప్‌కు చెందిన వినియోగదారులకు 2025 ప్రారంభంలో యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌తో ఐఫోన్ ఎస్‌ఈ(IPhone SE) మోడల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment