Charging a cell phone
-
యాపిల్ ఐఫోన్ 14, ఎస్ఈ నిలిపివేత..కారణం..
ప్రపంచ నంబర్ 1 కంపెనీ యాపిల్ కొన్ని ఉత్పత్తులను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ 14, ఐఫోన్ ఎస్ఈ(3వ తరం) ఫోన్లను యూరప్‌లో నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రామాణికంగా ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు ఉండాలనేలా యూరప్ ప్రభుత్వం(EU) నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని తెలిసింది.యూరప్ ప్రభుత్వం అన్ని మోబైళ్లలో ప్రామాణికంగా యూఎస్బీ టైప్-సీ(Type-C) పోర్ట్‌తో ఉన్న ఛార్జింగ్ సదుపాయం ఉండాలనేలా నిబంధనలు తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం అధికారికంగా వాడుకలో ఉన్న ఐఫోన్ 14, ఐఫోన్ ఎస్ఈ(3వ తరం) ఫోన్లలో ప్రత్యేకంగా యాపిల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇది యూరప్ నిబంధనలకు విరుద్ధం. దాంతో స్థానికంగా ఈ మోడళ్లను నిలిపేస్తున్నట్లు యాపిల్(Apple) ప్రకటించింది.ఇదీ చదవండి: స్వల్ప స్థాయిలోనే కదలికలుయాపిల్ ఐఫోన్ 14 తర్వాత విడుదల చేసిన మోడళ్లలో టైప్-సీ పోర్ట్‌ను తీసుకొచ్చింది. దాంతో ఐఫోన్ 15తోపాటు తదుపరి మోడళ్లకు ఈ సమస్య లేదు. ఇప్పటికే ఐఫోన్(IPhone) 14 వాడుతున్నవారికి ఇబ్బంది ఉండదు. కానీ కొత్తగా ఈ మోడల్ కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి మాత్రం యూరప్‌లో అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఐఫోన్ 16 మోడల్‌ను విడుదల చేయడంతో చాలామంది ఈ మోడల్‌ను కొనుగోలు చేస్తున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి. యూరప్‌కు చెందిన వినియోగదారులకు 2025 ప్రారంభంలో యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌తో ఐఫోన్ ఎస్ఈ(IPhone SE) మోడల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. -
చార్జింగ్కు పెట్టి ఫోన్లో మాట్లాడిన యువతి, అక్కడికక్కడే..
ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు ఉపయోగించకూడదని, ఆ సమయంలో కాల్స్ మాట్లాడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే అలా ఫోన్ చార్జింగ్ పెట్టి ఉపయోగిస్తుంటే.. అందులోంచి మంటలు రావడం, బ్యాటరీ పేలి.. గాయపడిన ఘటనలు బోలెడు ఉన్నాయి. తాజాగా ఓ యువతి ఫోన్‌కు చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందింది. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. అయితే ఆ దేశంలో ఈ తరహా ఘటన జరగడం ఇది మూడో సారి. అది కూడా ఒక వారంలోనే. ది సన్‌లో వచ్చిన సమాచారం ప్రకారం.. 18 ఏళ్ల రాడ్జా తన ఫోన్‌ని ఉపయోగిస్తుండగా, శాంటారెమ్‌లోని తన ఇంటిపై పిడుగుపడింది. దీంతో ఆమె విద్యుత్ షాక్‌కు గురై స్పృహ కోల్పోయింది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, రాడ్జా అప్పటికే మృతి చెందింది. గతవారం కూడా అపొలినారియా జిల్లాలో చార్జింగ్ పెట్టి ఫోన్ ఉపయోగించి పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి చనిపోయాడు. అలాగే కౌన్సిలర్ రాయ్‌ముండో బ్రిటో కూడా ఇలాగే చార్జింగ్ పెట్టి ఫోన్ ఉపయోగించి.. పిడుగుపాటుకు గురయ్యాడు. దీంతో.. ఫోన్ చార్జింగ్ పెట్టి.. ఎవ్వరూ కాల్స్ ఎత్తకూడదని.. ఫోన్ ఉపయోగించకూడదని.. బ్రెజిల్ ప్రభుత్వ అధికారులు ప్రజలను హెచ్చరించారు. చదవండి: Fact Check: హెలికాప్టరుకు ఉరేసి ఉరేగించిన తాలిబన్లు?.. అసలు నిజం ఇది! -
చెమటతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్...!
Charging With Finger Strip: మానవ పరిణామ క్రమంలో చక్రం నుంచి మొదలైన ఆవిష్కరణలు ఎన్నో ఇతర ఆవిష్కరణలకు దారితీశాయి. తన మేధ సంపత్తితో అనేక విషయాలను జయించాడు. రాబోయే విపత్తులను తెలుసుకోవడంలో, ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని తన మునివేళ్లపై తెచ్చుకున్నాడు. రకరకాల ఆవిష్కరణలతో సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నాడు. మానవుడి ఆవిష్కరణలో భాగంగా చెప్పుకోదగిన ఇన్నోవేషన్ మొబైల్ ఫోన్. సాధారణంగా మొబైల్ ఫోన్లు ఎదుర్కోంటున్న ప్రధాన సమస్య ఛార్జింగ్. ఫోన్లలో బ్యాటరీ పూర్తిగా ఐపోతే ఎందుకు పనికిరాదు. కాగా ఛార్జింగ్ సమస్యను కూడా పరిష్కరించడం కోసం సైంటిస్టులు ఇప్పటికే ప్రయత్నాలను మొదలుపెట్టారు.తాజాగా మానవ శరీరం నుంచి వెలువడే చెమటతో మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ చేయవచ్చునని పరిశోధకులు నిరూపించారు. చెమటతో ఛార్జింగ్ చేసే ప్రత్యేక ఆవిష్కరణను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు ఆవిష్కరించారు. పరిశోధకుల ప్రకారం.. చేతి వేళ్లకు ఒక ప్రత్యేకమైన స్ట్రిప్‌ను ఉంచుకోవడం ద్వారా మానవ శరీరం నుంచి వెలువడే చెమటనుపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. 10 గంటల పాటు స్ట్రిప్‌ను ధరించడంతో సుమారు 400 మిల్లీజౌల్స్ వరకు శక్తిని ఉత్పత్తి చేయవచ్చునని పరిశోధనలో తేలింది. ఈ శక్తితో ఒక స్మార్ట్‌వాచ్ 24 గంటలపాటు నడుస్తుందని తెలిపారు. అంతేకాకుండా చేతి వేళ్లకు, మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యేక ఏర్పాటుతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చేయవచ్చునని సైంటిస్టులు పేర్కొన్నారు. -
చార్జింగ్ పెడుతూ.. నవ వరుడు మృతి
పెద్దవూర: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం శిర్సనగండ్లకు చెందిన కంభంపాటి నరేష్ (24) శుక్రవారం రాత్రి సెల్‌కు చార్జింగ్ పెడుతుండగా.. చా ర్జర్ పిన్‌కు విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి కింద పడిపోయాడు. దీం తో తల వెనుక భాగం గోడకు బలంగా తాకడంతో మృతిచెందాడు. విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడు నరేష్‌కు గత నెల 23 న వివాహం జరిగింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
గ్రామంలో 50 ఇళ్లకు విద్యుత్ షాక్
సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఒకరి మృతి జిన్నారం: హై ఓల్టేజీ కారణంగా గ్రామంలోని సుమారు 50 ఇళ్లకు విద్యుత్ షాక్ వచ్చింది. ఈ సమయంలో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ విద్యుత్ఘాతానికి గుైరె ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలం ఊట్లలో చోటు చేసుకుంది. గ్రామంలో బుధవారం రాత్రి ట్రాన్స్ఫార్మర్కు సరఫరా అయ్యే న్యూట్రల్ వైర్ తెగి హైఓల్టేజీ విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో ఇళ్లలోని ఫ్యాన్లు, బల్బులు పెద్ద శబ్దంతో పగిలిపోయాయి. ఈ సమయంలో గ్రామానికి చెందిన చాకలి రాజు (32) సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా.. విద్యుత్ఘాతానికి గురై మృతి చెందాడు.