గ్రామంలో 50 ఇళ్లకు విద్యుత్ షాక్ | 50 houses in the village of electric shock | Sakshi
Sakshi News home page

గ్రామంలో 50 ఇళ్లకు విద్యుత్ షాక్

Published Fri, Mar 27 2015 1:38 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

50 houses in the village of electric shock

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఒకరి మృతి

జిన్నారం: హై ఓల్టేజీ కారణంగా గ్రామంలోని సుమారు 50 ఇళ్లకు విద్యుత్ షాక్ వచ్చింది. ఈ సమయంలో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ విద్యుత్‌ఘాతానికి గుైరె  ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలం ఊట్లలో చోటు చేసుకుంది. గ్రామంలో బుధవారం రాత్రి  ట్రాన్స్‌ఫార్మర్‌కు సరఫరా అయ్యే న్యూట్రల్ వైర్ తెగి హైఓల్టేజీ విద్యుత్ సరఫరా అయ్యింది. 

దీంతో ఇళ్లలోని ఫ్యాన్లు, బల్బులు పెద్ద శబ్దంతో పగిలిపోయాయి. ఈ సమయంలో గ్రామానికి చెందిన చాకలి రాజు (32) సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా.. విద్యుత్‌ఘాతానికి గురై మృతి చెందాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement