high voltage
-
వైరల్ వీడియో: రైల్వే టీసీపై తెగిపడిన హైఓల్టేజ్ తీగ
-
11కేవీ హైఓల్టేజ్ కరెంట్ తీగలపై స్టంట్స్
-
11కేవీ హైఓల్టేజ్ కరెంట్ తీగలపై స్టంట్స్.. వీడియో వైరల్
లక్నో: మన ఇంట్లోని సింగిల్ పేస్ కరెంట్ షాక్ తగిలితేనే ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి 11 కేవీ విద్యుత్తు వైర్లను తాకితే ఏమైనా ఉందా? స్పాట్లోనే మాడి మసైపోతాం. కానీ, ఓ వ్యక్తి ప్రమాదకర సహసానికి పూనుకున్నాడు. 11కేవీ విద్యుత్తు తీగలపై స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్ నగరంలో జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సెప్టెంబర్ 24న నగరంలోని అమారియా ప్రాంతంలో నౌషద్ అనే వ్యక్తి ఈ ప్రమాదకర సాహసం చేశాడు. ఇళ్ల పైకప్పుపైకి ఎక్కి విద్యుత్తు తీగలపైకి చేరుకున్నాడు. ఊయల మాదిరిగా ఊగుతూ అందరిని షాక్‌కు గురిచేశాడు. అయితే.. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్తు సరఫరా నిలిపివేయటం.. అతడికి అదృష్టంగా మారింది. లేకపోతే.. కాలి బూడిదయ్యేవాడు. హైఓల్టేజ్ తీగలపై వేలాడుతున్న వ్యక్తిని చూసిన కొందరు వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను అలర్ట్ చేశారు. విద్యుత్తు సరఫరా ప్రారంభించవద్దని సూచించారు. వెంటనే అక్కడికి చేరుకున్న విద్యుత్తు అధికారులు.. నౌషద్‌ను బలవంతంగా కిందకు దించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారితో పంపించారు. నౌషద్ ప్రస్తుతం బండిపై గాజులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. అయితే, ఇలా ఎందుకు చేశాడో నౌషద్ చెప్పలేదు. అప్పుడప్పుడు ఇలా ప్రవర్తిస్తుంటాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇదీ చదవండి: Viral Video:రాహుల్‌ని చూసి భావోద్వేగం.. వెక్కి వెక్కి ఏడ్చిన యువతి: వీడియో వైరల్ -
స్టేట్.. సెంటర్.. సెప్టెంబర్ 17.. తెలంగాణలో హైవోల్టేజీ పాలిటిక్స్
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17.. నిజాం నవాబు నుంచి తెలంగాణ స్వాతంత్య్రం పొందిన రోజు. ఇప్పుడదే రోజున రాష్ట్రంలో హైవోల్టేజీ రాజకీయానికి రంగం సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఈ నెల 17న ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి పోటీ పడుతున్నాయి. ఆ రోజు నాటికి తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమై 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ ఏట అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆ రోజు నుంచి ఏడాది పాటు తెలంగాణ విలీన వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చదవండి: బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేలా.. ఈ మేరకు శనివారం నాటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున అధికారికంగా మళ్లీ తెలంగాణ విలీన దినం నిర్వహించాల్సిన అవసరం లేదంటూ.. ఇప్పటివరకు కేవలం పార్టీ కార్యాలయంలో మాత్రమే టీఆర్ఎస్ జాతీయ జెండా ఆవిష్కరిస్తూ వస్తోంది. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈసారి అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు హాజరయ్యేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఆ రోజు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వేడెక్కిన రాజకీయం.. ఈ నెల 17న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పోటా పోటీ ఉత్సవాలతో మరింత వేడెక్కే సూచనలు కన్పిస్తున్నాయి. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. అధికారికంగా ‘విమోచన’ ఉత్సవాలు -
అధికారుల నిర్లక్ష్యం..బాలుడి మృతి
వికారాబాద్ జిల్లా: పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట్ గ్రామంలో విషాదం అలుముకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ తల్లికి శోకం మిగిల్చింది. గ్రామంలో గత కొన్ని రోజులుగా హైవోల్టేజీ సమస్య ఉంది. ఈ విషయం గురించి గ్రామస్తులు పలుమార్లు విద్యుత్ విభాగ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. అయితే శనివారం గ్రామానికి చెందిన ఓ బాలుడికి ఇంట్లో రైస్ కుక్కర్ నుంచి అన్నం తీస్తున్న సమయంలో హైవోల్టేజీ కారణంగా కరెంటు సరఫరా జరిగి షాక్ కొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గత రెండు రోజులుగా గ్రామంలో హైవోల్జేజీ కారణంగా పలు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా దగ్ధమైయాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
కోతి తెచ్చిన తంటా
వెలుగోడు: ఓ కోతి చేసిన ఆకతాయి పనికి ఇళ్లలోని విద్యుత్ మీటర్లు, టీవీలు, ఫ్రీజ్‌లు కాలిపోయిన ఘటన వెలుగోడులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పట్టణంలోని ఏరాసు అయ్యపురెడ్డి నగర్లో ఏర్పాటు చేసిన 11 కేవీ విద్యుత్ తీగలపై కోతి వేలాడటంతో ఆ తీగ తెగి మరో తీగలపై పడింది. దీంతో ఒక్క సారిగా హై ఒల్టేజీ రావడంతో కాలనీలోని 50 ఇళ్లలో విద్యుత్ మీటర్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, లైట్లు కాలిపోయాయి. దీంతో బాధితులు విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఎస్ఐ సుబ్బరామిరెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. విద్యుత్ అధికారులతో చర్చించి కొత్త మీటర్లు ఇచ్చేందుకు ఒప్పించడంతో బాధితులు శాంతించారు. -
హైఓల్టేజీతో ఇళ్లకు షాక్
శింగనమల: నాగులగుడ్డం తండాలోని పలు ఇళ్లకు బుధవారం సాయంత్రం విద్యుత్ సరఫరా అయింది. హైఓల్టేజీ కారణంగా ఇళ్ల గోడలకు విద్యుత్ సరఫరా కావడంతో ఐదుగురు గాయపడ్డారు. వారిలో వెంకటేసు నాయక్, దేవమ్మ, అనిత, నీలాబాయి, సాలమ్మ బాయి ఉన్నారు. వెంటనే వారిని 108లో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. -
లోకేశ్ ప్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్
-
హైటెన్షన్ వైర్లు తెగిపడి 11మంది మృతి
గౌహతి: అసోంలోని టిన్సుకియా జిల్లాలో నిరసనకారుల ఆందోళన పెను ప్రమాదానికి దారి తీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హై వోల్టేజీ కేబుల్ తెగిపడిన దుర్ఘటనలో 11మంది మరణించగా, మరో 20మందికి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..మూడు రోజుల క్రితం జరిగిన జంట హత్యలకు కారకులైన వారిని తమకు అప్పగించాలంటూ కొంతమంది...స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కత్తులు, కర్రలతో విధ్వంసం సృష్టించారు. పరిస్థితి అదుపు తప్పటంతో ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు. అయితే గాల్లోకి దూసుకుపోయిన కొన్ని బుల్లెట్లు దగ్గరలో వున్న కరెంట్ పోల్‌కు తాకడంతో అది కుప్పకూలింది. అది నేరుగా ఆందోళన చేస్తున్న వారిపై పడటం, హై వోల్టేజి కేబుల్ వైర్లు వారిని తాకడం క్షణాల్లో జరిగిపోయింది. ఘటనా స్థలంలోనే 9 మంది చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనలో మరి కొంతమందికి బుల్లెట్ గాయాలు తగిలాయి. కాగా పరిస్థితి చేయి దాటడంతో గాల్లోకి, ఆందోళనకారులపై కాల్పులు జరపాల్సివ చ్చిందని డీజీపీ ముఖేష్ సహాయ్ చెప్పారు.కేంద్ర పారామిలిటరీ దళాలు, పోలీసు బలగాలను సంఘటనా స్థలానికి తరలించిన సీనియర్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు. -
హైఓల్టేజీతో 200 ఇళ్లల్లో కాలిపోయిన పరికరాలు
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : ఫలక్‌నుమా నాగులబండ అంబేద్కర్ నగర్లో శనివారం ఉదయం హై వోల్టేజీ కారణంగా దాదాపు 200 ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. ఉదయం 9.25 గంటల సమయంలో ఇళ్లల్లో పెద్ద ఎత్తున శబ్ధాలు రావడంతో స్థానికులు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగెత్తారు. ఆ సమయంలో వైర్లు కాలుతూ టీవీలు, ఫ్రిజ్‌ల నుంచి పొగలు రావడం గమనించారు. ఈ సమయంలో మిక్సీ ఉపయోగిస్తున్న 7వ తరగతి విద్యార్థిని అఖిల(12) విద్యుదాఘాతానికి గురైంది. ఆమెను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫలక్‌నుమా ఇన్చార్జ్ ఏడీఈ అన్నయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు నష్టపరిహారం అందించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. బస్తీలోని ట్రాన్స్ఫార్మర్ను తొలగించిన అధికారులు దానిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపి దాని స్థానంలో మరో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి సాయంత్రానికి విద్యుత్‌ను పునరుద్ధరించారు. -
గ్రామంలో 50 ఇళ్లకు విద్యుత్ షాక్
సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఒకరి మృతి జిన్నారం: హై ఓల్టేజీ కారణంగా గ్రామంలోని సుమారు 50 ఇళ్లకు విద్యుత్ షాక్ వచ్చింది. ఈ సమయంలో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ విద్యుత్ఘాతానికి గుైరె ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలం ఊట్లలో చోటు చేసుకుంది. గ్రామంలో బుధవారం రాత్రి ట్రాన్స్ఫార్మర్కు సరఫరా అయ్యే న్యూట్రల్ వైర్ తెగి హైఓల్టేజీ విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో ఇళ్లలోని ఫ్యాన్లు, బల్బులు పెద్ద శబ్దంతో పగిలిపోయాయి. ఈ సమయంలో గ్రామానికి చెందిన చాకలి రాజు (32) సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా.. విద్యుత్ఘాతానికి గురై మృతి చెందాడు. -
క్షణ క్షణం.. భయం.. భయం!
ఒంగోలు టౌన్ : కలెక్టరేట్ ఉద్యోగులు క్షణ క్షణం భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ క్షణాన ఎప్పుడు ఎక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. షార్ట్ సర్క్యూట్ దెబ్బకు అధికారులు, సిబ్బంది విధులపై పూర్తి స్థాయిలో ఏకాగ్రత చూపలేకపోతున్నారు. ఒకవైపు కీలకమైన ఫైళ్లు, ఇంకోవైపు షార్ట్ సర్క్యూట్ రూపంలో తరుముకొస్తున్న భయంతో సీట్లలో కూడా కుదురుగా కూర్చోలేకపోతున్నారు. కలెక్టరేట్లో వారం వ్యవధిలో మూడుసార్లు షార్ట్ సర్క్యూట్ కావడమే ఇందుకు కారణం. ఇసుకను తమ వద్ద సిద్ధంగా ఉంచుకుంటున్నారంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా శుక్రవారం అడిషనల్ జాయింట్ కలెక్టర్ చాంబర్ ఎదురుగా ఉన్న డిస్పాచ్ రూమ్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూటైంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సమీపంలో ఉన్న పలువురు సిబ్బంది హుటాహుటిన అక్కడకు ఇసుకతో చేరుకొని మంటలు వ్యాపించకుండా ఆర్పి వేశారు. కలెక్టరేట్లోనే తరచూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతున్నా కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాశిం, కలెక్టరేట్ పరిపాలనాధికారి గాంధీలు పట్టించుకోకపోవడంపై అక్కడ పనిచేసే ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. హై ఓల్టేజీ వస్తే హడలే కలెక్టరేట్లోని విద్యుత్ లైన్‌కు హై ఓల్టేజీ వచ్చిందంటే అక్కడ పనిచేసే అధికారుల నుంచి సిబ్బంది వరకు అందరూ హడలిపోతున్నారు. ఒక్కసారిగా హై ఓల్టేజీ రావడం, విద్యుత్ వైర్లు కాలిపోవడం జరుగుతోంది. ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ చాంబర్‌తో సహా, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్లలో స్వల్పంగా మంటలు వచ్చి ట్యూబులైట్లు కాలిపోయాయి. కీలకమైన అధికారుల చాంబర్లలో ట్యూబ్‌లైట్లు కాలిపోయిన వెంటనే యుద్ధప్రాతిపదికన కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు తప్పితే సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. కలెక్టర్ విజయకుమార్ తన చాంబర్‌కు వచ్చినప్పుడు మాత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం లేదు. ఆయన ఉన్న సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగితే స్వయంగా పరిస్థితిని తెలుసుకునే వీలుంటుంది. ఆయన తన చాంబర్లో లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం, అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేయడం సర్వసాధారణమైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా షార్ట్ సర్క్యూట్‌తో పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే ప్రమాద నివారణ చర్యలు తీసుకుంటే మంచిదని ఉద్యోగులు చెబుతున్నారు. కలెక్టర్ విజయకుమార్ సత్వరం స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.