ప్రతీకాత్మక చిత్రం
వికారాబాద్ జిల్లా: పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట్ గ్రామంలో విషాదం అలుముకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ తల్లికి శోకం మిగిల్చింది. గ్రామంలో గత కొన్ని రోజులుగా హైవోల్టేజీ సమస్య ఉంది. ఈ విషయం గురించి గ్రామస్తులు పలుమార్లు విద్యుత్ విభాగ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. అయితే శనివారం గ్రామానికి చెందిన ఓ బాలుడికి ఇంట్లో రైస్ కుక్కర్ నుంచి అన్నం తీస్తున్న సమయంలో హైవోల్టేజీ కారణంగా కరెంటు సరఫరా జరిగి షాక్ కొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
గత రెండు రోజులుగా గ్రామంలో హైవోల్జేజీ కారణంగా పలు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా దగ్ధమైయాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment