parigi
-
వికారాబాద్: ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
సాక్షి, వికారాబాద్ జిల్లా: పరిగిలో ఘోర ప్రమాదం తప్పింది. పల్లవి కాలేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సును సైడ్‌కు ఆపే క్రమంలో మట్టి కూరుకుపోయిన బస్సు.. బోల్తా కొట్టింది. బస్సులో ఉన్న మహిళల తలలకు గాయాలు కాగా.. పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరు క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.బస్సులో మొత్తం 100 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. 30 మందికి స్వల్ప గాయాలు కాగా, నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిగి నుంచి షాద్ నగర్ వెళ్తుండగా ఘటన జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అంటున్నారు. -
Lagcherla Incident: పరిగి డీఎస్పీ కరుణసాగర్‌పై వేటు
సాక్షి, వికారాబాద్ జిల్లా : దుద్యాల మండలం లగచర్లలో ఈ నెల 11న అధికారులపై జరిగిన దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి ఘటనలో ఉన్నతాధికారులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పరిగి డీఎస్పీగా కరుణసాగర్‌రెడ్డిపై వేటు వేసింది. డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిగి కొత్త డీఎస్పీగా శ్రీనివాస్‌ను నియమించింది.మరోవైపు కలెక్టర్‌పై దాడి కేసులో కొత్తకోణం చేసుకుంది. దాడి ఘటనలో పంచాయితీ సెక్రటరీ రాఘవేందర్ కీలక పాత్ర ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం సంగయ్య పల్లి పంచాయితీ సెక్రటరీగా పనిచేస్తున్న రాఘవేందర్ రైతుల్ని రెచ్చగొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరుణంలో సంగయ్యపల్లి పంచాయితీ సెక్రటరీపై రాఘవేందర్‌పై వేటు వేస్తూ సంబంధిశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. Attack On #DistrictCollector in #TelanganaTension erupts in #Lagcherla village in #Dudyala mandal of #Vikarabad district, as villagers were attacked with sticks on District Collector Prateek Jain and govt officials and pelted stones on their vehicles.The officials today… pic.twitter.com/LjKtlrTujC— Surya Reddy (@jsuryareddy) November 11, 2024 -
బీఆర్ఎస్లో విషాదం.. మాజీ మంత్రి హరీశ్వర్ రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి(76) కన్నుమూశారు. శ్వాస సరిగ్గా ఆడక కార్డియాక్ అరెస్ట్ అయి హరీశ్వర్ రెడ్డి మృతి చెందారు. వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పరిగిలో నివాసముంటున్న ఆయనకు శుక్రవారం రాత్రి 10.10 గంటల సమయంలో గుండెపోటు వచ్చిందని, వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. హరీశ్వర్ రెడ్డి.. సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు. ఇక, హరీశ్వర్‌రెడ్డి 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికలలో పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన హరీశ్వర్‌రెడ్డి పరిగి ఉపసర్పంచ్‌గా, 1978లో సర్పంచ్‌గా, సమితి వైస్ చైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పరిగిలో నిర్వహించనున్నారు. హరీశ్వర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేశ్‌రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్ సంతాపం.. మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి సీఎం సంతాపం వ్యక్తం చేశారు. పరిగి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాభిమానం పొందిన నాయకుడు హరీశ్వర్‌రెడ్డి అని సీఎం కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. హరీశ్వర్‌రెడ్డి కుమారుడు ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
కొలిక్కి వచ్చిన వికారాబాద్ శిరీష మృతి కేసు.. ఆ ఇద్దరే హంతకులు!
సాక్షి, వికారాబాద్: నర్సింగ్ విద్యార్థిని శిరీష అనుమానాస్పద కేసును పోలీసులు చేధించారు. శిరీషను హత్య చేసింది ఆమె బావ అనిల్, అతని స్నేహితుడు రాజుగా పోలీసులు తేల్చారు. మద్యం మత్తులో శిరీష బావ, అతని ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించారు. కాగా మొదటి నుండి బావ చుట్టే కేసు తిరుగుతున్నప్పటికీ గత మూడు రోజులుగా అనిల్ పోలీసుల ఎదుట నోరు మెదపలేదు. చివరికి అనిల్ కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు అతని స్నేహితుడినిసైతం అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ ఇద్దరిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. బావ అనిల్, అతని స్నేహితుడు కలిసి శిరీషను అత్యంత దారుణంగా హతమార్చినట్లు తెలిసింది. చెప్పిన మాట వినడం లేదని.. ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉంటుందని శిరీషతో బావ అనిల్ వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో మరో రూంలోకి వెళ్ళి శిరీష ఆత్మహత్యాయత్నం చేయగా.. గది గడియ విరగొట్టి శిరీషను బయటకు తీసుకొచ్చిన అనిల్.. ఆమెపై చెయ్యి చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆమె బావ పరిగి వెళ్ళిపోయాడు. మనస్థాపానికి గురైన యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. శిరీష ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఆమె సోదరుడు శ్రీను.. అనిల్‌కు ఫోన్ చేసి చెప్పాడు. అప్పటికే తన మిత్రుడితో కలిసి ఫుల్‌గా మద్యం సేవించిన అనిల్.. మరో బీరు తీసుకొని ఫ్రెండ్‌తో కలిసి కాడ్లాపూర్ బయలుదేరాడు. ఊరు శివారులో ఉన్న మైసమ్మ గుడి దగ్గర శిరీష కనిపించడంతో ఆగ్రహంతో ఆమెపై అనిల్ చెయ్యి చేసుకున్నాడు. అంతేగాక అతని ఫ్రెండ్ రాజు, శిరీషను అక్కడే ఉన్న కుంటవైపు లాకెళ్ళి వెంటతెచ్చుకున్న బీరు బాటిల్‌తో తల పగల గొట్టి కళ్ళల్లో గుచ్చినట్లు సమాచారం. తనను వదిలేయండి అంటూ శిరీష ఎంత ప్రదేయపడ్డా క్రూరులు వదల్లేదని, మోకాలు లోతు నీళ్ళున్న కుంటలో ఆమెను ఇద్దరు కలిసి విసిరేసినట్లు తెలిసింది. శిరీష చనిపోయే వరకు ఆమె దేహంపై అనిల్ ఫ్రెండ్ నిలుచున్నట్లు తెలుస్తోంది. చనిపోయిందని నిర్దారించుకొని అక్కడ ఆనవాళ్ళను మాయం చేసి ఎవరి దారిన వారు వెళ్లి మళ్ళీ శిరీష కోసం వెతికినట్లు నాటకం ఆడారు. కాగా ఇద్దరు నిందితులు ఇంకా పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. మరి కొన్ని గంటల్లో పోలీసులు దీనికి సంబంధించి అధికారికంగా పూర్తి సమాచారాన్ని వెల్లడించనున్నారు. చదవండి: లండన్‌లో హైదరాబాద్ యువతి దారుణ హత్య -
శిరీషది హత్యా.. ఆత్మహత్యా?.. తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం
పరిగి, సాక్షి న్యూఢిల్లీ: పారా మెడికల్ విద్యార్థి శిరీష మృతిపై మిస్టరీ వీడలేదు. యువతిది హత్యా.. ఆత్మహత్యా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాళ్లాపూర్ శివారులోని నీటి కుంటలో ఆదివారం మధ్యాహ్నం శిరీష (19) మృతదేహం లభ్యమైంది. ఒంటిపై పలు చోట్ల గాయాలు ఉండటం, రెండు కళ్లనూ పొడిచి ఉండటంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. పలువురు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా సోమవారం గ్రామానికి చేరుకున్న వైద్యులు శిరీష మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. యువతి శరీరంపై గాయాలు ఉన్నట్లు ధ్రువీకరించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. శిరీషది ముమ్మాటికీ హత్యేనని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతురాలి తండ్రి జంగయ్య, బావ అనిల్‌పై వారు మండిపడ్డారు. శిరీష మృతికి వారే కారణమంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు కల్పించుకుని త్వరలోనే పూర్తి వాస్తవాలు తెలుస్తాయని, అప్పటివరకు ఓపిక పట్టాలని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. తన చెల్లిని చంపిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని మృతురాలి తమ్ముడు శ్రీకాంత్ కోరాడు. పోలీసుల అదుపులో మరో ఇద్దరు శిరీష అంత్యక్రియలు ముగిసిన తర్వాత తండ్రి జంగయ్య, బావ అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతి తండ్రి జగయ్యను పోలీసులు వదిలేయగా.. బావ అనిల్‌ను విచారిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. కేసు దర్యాప్తులో ఉందని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. మూడు రోజుల్లో రిపోర్టు పంపండి: తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం శిరీష దారుణ హత్యను జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది. స్క్రూ డ్రైవర్‌తో బాలిక కళ్లు పీకి, బ్లేడ్‌తో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటనపై ఢిల్లీలోని ఎన్సీడబ్ల్యూ సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. అంతేగాక మూడు రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను పంపించాలని తెలంగాణ డీజీపీకి సూచించింది. తెలంగాణలో బాలికలు, యువతులు, మహిళలపై పెరిగిపోతున్న నేరాలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. -
వికారాబాద్‌లో దారుణం.. పాపం శిరీష..
సాక్షి, పరిగి: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి దారుణ హత్యకు గురైంది. నిన్నటి నుంచి కనిపించని యువతి శిరీష(19) హత్యకు గురై నీటికుంటలో రక్తపు మరకలతో మృతదేహం కనిపించింది. గుర్తు తెలియని దుండగులు యువతి కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసి, కాళ్లు, చేతి నరాలను కత్తితో కోశారు. వివరాల ప్రకారం.. పరిగి మండలం కాలాపూర్ గ్రామంలో శిరీష దారుణ హత్యకు గురైంది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు టెన్షన్ పడ్డారు. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించారు. దీంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం.. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటికుంటలో రక్తపు మరకలతో శిరీష మృతదేహం కనిపించింది. కాగా, గుర్తు తెలియని దుండగులు శిరీషను దారుణంగా హత్య చేశారు. ఆమె కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసి, కాళ్లు, చేతి నరాలను కత్తితో కోశారు. దుండగలు యువతిని హత్య చేసి నీటికుంటలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక, శిరీష ఇంటర్మీడియట్ పూర్తి చేసి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల బాలిక తల్లికి గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తల్లి అనారోగ్య సమస్య కారణంగా శిరీష రెండు నెలల క్రితం చదువు మానేసింది. ఈ క్రమంలో ఇలా దారుణ హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. ఈ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న శిరీషపై ఆమె అక్క భర్త అనిల్ చేయిచేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. శిరీష గొంతుపై పోలీసులు గాట్లను గుర్తించారు. శిరీష తండ్రి, తమ్ముడికి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, శిరీషను అక్క భర్త అనిల్ కొట్టడం వల్లే మనస్తాపానికి గురైనట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్.. -
శివస్వాముల అరెస్ట్.. పరిగి సబ్ జైల్ వద్ద హైడ్రామా
సాక్షి, వికారాబాద్: పరిగి సబ్ జైల్ వద్ద హైడ్రామా నెలకొంది. మూడు రోజుల క్రితం యాలాల్ మండలం దేవనూరులో జరిగిన గొడవలో ఐదుగురు శివస్వాములను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. శనివారం ఉదయం ఆ శివ స్వాములను రిమాండుకు తరలించేందుకు పరిగి సబ్ జైలుకు తీసుకొచ్చారు తాండూరు పోలీసులు. ఈ క్రమంలో అక్కడ హైడ్రామా నెలకొంది. శివ స్వాములు మాలలు తీసి వేస్తేనే జైల్లోకి అనుమతి ఇస్తామని జైలు సిబ్బంది తాండూరు పోలీసులకు తేల్చి చెప్పారు. దీంతో.. స్వాములను మళ్ళీ జైలు బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. మాయమాటలు చెప్పి తమను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని శివ స్వాములు చెప్తున్నారు. శివమాలలు తీయబోమని స్వాములు చెప్పడంతో.. పోలీసులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయారు. మీడియాతో సహా జైలు ఆవరణలో ఎవరినీ ఉండకుండా పంపించేస్తున్నారు పోలీసులు. -
వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు దగ్గర ఉద్రిక్తత
-
లైన్‌మెన్‌తో గొడవ, రైతుకు షాకిచ్చిన విద్యుత్ సిబ్బంది, ఏకంగా రూ.65వేల బిల్లు
సాక్షి, వికారాబాద్: ఓ సామాన్య రైతు ఇంటికి సంబంధించి నెలకు రూ.65వేల విద్యుత్ బిల్లు రావడంతో ఆ రైతు అవాక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. మండల పరిధిలోని సొండేపూర్ మైసమ్మ చెరువుతండాకు చెందిన రెడ్యానాయక్ వ్యవసాయ కూలీ.. రోజు కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఇంటికి సర్వీస్ నంబర్ 58లో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. ప్రతినెల విద్యుత్ బిల్లు సక్రమంగానే చెల్లిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం లైన్మెన్.. రెడ్యానాయక్‌తో మీటర్ బాగాలేదు వేరే మీటర్ బిగించాలని చెప్పడంతో రైతు.. లైన్మెన్కు రూ.2వేలు ఇచ్చాడు. డబ్బులిచ్చి సంవత్సరం దాటినా కొత్త మీటర్ బిగించకపోవడంతో రెడ్యానాయక్ గత నెల (జూన్)లో లైన్మెన్ను నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు లైన్మెన్ వచ్చే నెల చూడు నీ కరెంటు బిల్లు ఎంత వస్తుందో అని రైతుకు చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం జూలై నెలకు సంబంధించి ఏకంగా రూ.65,240 బిల్లు వచ్చింది. దీంతో ఏమి చేయాలో తోచక రైతు విద్యుత్ ఉన్నతాధికారులను ఆశ్రయిస్తే కాలుస్తేనే అంత బిల్లు వస్తదిగా అని నిర్లక్షంగా సమాధానం ఇచ్చారు. ఎన్నడూ రానంతగా ఇంతమొత్తంలో విద్యుత్ బిల్లు వస్తే ఎం చేయాలని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతినెల రూ.100లోపు బిల్లు వచ్చేదని దానిని నిర్ణీత గడువులోపు చెల్లిస్తూనే ఉన్నాని.. లైన్మెన్ కావాలనే బిల్లు ఎక్కువ వచ్చేలా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై విద్యుత్ ఏఈ ఖజాను వివరణ కోరగా 2014నుంచి రైతు మినిమం బిల్లును ప్రతి నెల కడుతున్నాడని అందుకే రీడింగ్ జామ్ అయ్యి అంత బిల్లు వచ్చిందన్నారు. రైతుకు బిల్లులో రూ.33వేలు తగ్గించామని చెప్పారు. -
బాలికకు దెయ్యం పట్టిందని చిత్రహింసలు పెట్టిన ఓ బాబా
-
దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు.. నిప్పులపై నడిపించి
పరిగి: ఇంటర్ చదువుతున్న బాలిక.. అనారోగ్యానికి గురైంది.. ఆమెకు దెయ్యం పట్టిందని ఓ బాబా భయపెట్టాడు.. భూతవైద్యం చేస్తానంటూ ఆమెను నిప్పులపై నడిపించాడు.. చిత్రహింసలు పెట్టాడు.. పాదాలు కాలిపోయి తీవ్రగాయాలతో ఆమె ఆస్పత్రి పాలైంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో ఐదు రోజుల కింద జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. భూత వైద్యం చేస్తానని.. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం కుక్కింద గ్రామానికి చెందిన మంజుల వెంకటయ్య కుమార్తె అశ్విని(17) వికారాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె ఇటీవల అనారోగ్యానికి గురైంది. పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన వారి సమీప బంధువు.. తమ గ్రామంలోని దర్గా సమీపంలో ఓ బాబా (భూత వైద్యుడు) ఉన్నాడని, ప్రతి శుక్రవారం భూత వైద్యం చేస్తాడని అశ్విని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ క్రమంలో గత శుక్రవారం బాలికను అతడి వద్దకు తీసుకువెళ్లగా బాలికకు దెయ్యం పట్టిందని నమ్మబలికాడు. దెయ్యం వదిలిస్తానంటూ బాలికను చిత్రహింసలకు గురిచేశాడు. మండే నిప్పులపై బాలికను నడిపించాడంతోపాటు ఆమెపై కాళ్లుపెట్టి నిల్చున్నాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు తమ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ పట్లోళ్ల రాములుకు ఈ విషయం తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన.. బాలికను వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగోలేదని.. పాదాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఘటన విషయం తెలిసిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్ బాధిత బాలికను పరామర్శించారు. సదరు భూత వైద్యుడిని అరెస్టు చేయాలని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. -
వికారాబాద్ బాలిక ఘటన అసలు ఏం జరిగిందంటే...?
-
వికారాబాద్ విద్యార్థిని హత్యాచారం కేసు.. ప్రియుడే హంతకుడు
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ పదో తరగతి విద్యార్థిని అత్యాచారం, హత్య కేసును పోలీసులు చేధించారు. హత్య చేసింది ప్రియుడు మహేందరేనని పోలీసులు నిర్ధారించారు. మద్యం మత్తులో అత్యాచారానికి ఒడిగట్టినట్లు, ఆపై హత్యకు పాల్పడినట్లు తేల్చారు. ఈ మేరకు విద్యార్థిని హత్యాచారం ఘటనకు సంబంధించిన వివరాలను వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ‘వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామానికి చెందిన పదిహేనేళ్ల విద్యార్థినితో.. నిందితుడు మహేందర్‌కు ఏడాదిగా పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే ఇద్దరు కలుసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. ఇద్దరూ సోమవారం ఉదయం బయట కలుసుకున్న క్రమంలో.. శారీరకంగా కలవాలని బాధితురాలిపై మహేందర్ ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ పెనుగులాటలో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను బలంగా నెట్టడంతో పక్కనే ఉన్న చెట్టుకు తల తగిలి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై శరీరంలో చలనం లేకపోవడంతో విషయం బయటపడుతుందని గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత తనకేమీ తెలియనట్లు ఇంటికి వెళ్లి పడుకున్నాడు. ఈ కేసులో క్లూస్ టీం, పోలీసుల విచారణ, డాక్టర్ల ఒపీనియన్ ఆధారంగా ఘటన జరిగిన 48 గంటల్లోనే కేసును చేధించాం. విచారణను పూర్తి చేసి నిందితుడిని బుధవారం సాయంత్రం కోర్టులో ప్రవేశ పెడతాం’ అని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. చదవండి: ప్రేమ వివాహం.. భార్యను బతికుండగానే పూడ్చిపెట్టాడు -
వికారాబాద్ లో దారుణం..విద్యార్థినిపై అత్యాచారం
-
విద్యార్థిని హత్యాచార ఘటన.. ఆదివారం రాత్రి పార్టీ చేసుకున్న నిందితులు?
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని పూడురు మండలం అంగడి చిట్టంపల్లిలో 16 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సోమవారం ఉదయం 5.30 నిమిషాల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి 500 మీటర్ల నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించిందన్నారు. నిర్మానుష్య ప్రాంతంలో బాలిక దుస్తులు చెల్లా చెదురుగా పడి ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే బాలిక అరుపులు కూడా ఎవరికీ వినిపించలేదని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో సామూహిక అత్యాచారం? కాగా ఈ కేసులో ఇదే గ్రామంలో ఉండే ముగ్గురు యువకులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నివాసముండే మహేందర్ అలియాస్ నాని అనే యువకుడిపై బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్న క్రమంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నానితో పాటు అశోక్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే నాని నివాసంలో ఆదివారం రాత్రి పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో తెల్లవారుజామున వరకు మద్యం సేవించి మద్యం సేవిస్తూ ఉన్నారని, మద్యం మత్తులోనే యువకులు బాలికపై సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంబంధిత వార్త: వికారాబాద్‌లో విద్యార్థినిపై అత్యాచారం, ఆపై హత్య ఇదిలా ఉండగా హత్యకు గురైన మైనర్ బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. పరిగి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలిక మృతదేహాన్ని చిట్టంపల్లి గ్రామానికి తీసుకొని వచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. దోషులను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న మహేందర్ అలియాస్‌నాని పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో ఆయన తండ్రి లక్ష్మయ్య వాదన మరో విధంగా ఉంది. చదవండి: తండ్రి కళ్లెదుటే ఘోరం.. ప్రేమతో కొనిచ్చిన స్పోర్ట్స్ బైక్ మీదే ప్రాణం పోయింది నా కొడుకు అమాయకుడు తన కొడుకు అమాయకుడని తెలిపారు. బాలిక ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుండే వాడని, అవసరం ఉన్నపుడు సహాయం కోసం వాళ్ళు పిలుస్తారని పేర్కొన్నారు. ఆ అమ్మాయికి తన కొడుక్కి పరిచయం ఉందని తెలిపిన లక్క్ష్మయ్య.. అయితే వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసిందన్నారు. కానీ ఈ విషయం తనకు ముందు తెలీదన్నారు. ఉదయం సంఘటన జరిగినపుడు కొడుకు తమ ఇంట్లోనే ఉన్నాడని, రాత్రి ఇంట్లో ఫంక్షన్ జరిగిందన్నారు. తన కొడుకు గొడవలు పడే మనిషి కాదని, ఇలాంటి తప్పుడు పనులు చేయడని తెలిపారు. తప్పు ఎవరు చేసినా వాళ్ళకి ఉరిశిక్ష పడాలని తెలిపారు. -
పరిగి టీఆర్ఎస్ లో గ్రూపులాట
-
డ్రంక్ అండ్ డ్రైవ్: ‘ఒక్క బీర్ మాత్రమే తాగిన సార్.. ఒట్టు’
సాక్షి, పరిగి(వికారాబాద్): ఓ మందు బాబు పరిగిలో హల్చల్ చేశాడు. పోలీసుల డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి ఒక్కబీరు మాత్రమే తాగానని, వదిలిపెట్టాలని పోలీసులను సతాయించాడు. వివరాలు.. పట్టణంలో ఆదివారం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా షాద్‌నగర్‌కు చెందిన భీష్మాచారి కారులో షాద్‌నగర్ వైపు వెళ్తున్నాడు. పోలీసులు కారును ఆపి బ్రీత్ అనలైజర్‌తో తనిఖీ చేసేందుకు యత్నించారు. ఆయన గాలి ఊదినట్లు నటించాడు. దీంతో పోలీసులు గట్టిగా ఊదాలని చెప్పగా ఒక్కబీరు మాత్రమే తాగాను సార్.. ఒట్టు అని చెప్పాడు. చివరకు పోలీసులు తనిఖీ చేసి కేసు నమోదు చేశారు. ఇతను అంతకు ముందు పరిగిలోని ఓ బార్లో మిత్రులతో కలిసి నిర్వాహకులతో గొడవకు దిగాడు. ఫుడ్‌లో పిన్ వచ్చిందని నానా హంగామా చేశాడని స్థానికులు తెలిపారు. చదవండి: ప్రాణం తీసిన టైర్ ముక్క.. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. యువకుడి బలవన్మరణం తలకొండపల్లి: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తలకొండపల్లిలో సోమవారం జరిగింది. ఎస్ఐ వరప్రసాద్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పాపయ్య, యాదమ్మ దంపతుల పెద్ద కుమారుడు అశోక్(22) అటోమెకానిక్. ఇటీవల పొలం అమ్మి నూతనంగా ఇల్లు నిర్మాణం చేపట్టాడు. ఈ విషయంలో అశోక్ తల్లిదండ్రులతో గొడవపడి మనస్తాపానికి గురయ్యాడు. వీరి ఇంటికి కొద్దిదూరంలో అశోక్ నానమ్మ చెన్నమ్మ ఇల్లు ఉంది. ఆదివారం చెన్నమ్మ పనినిమిత్తం వేరే గ్రామానికి వెళ్లగా అశోక్ ఆమె ఇంట్లో నిద్రించాడు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన అశోక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం అశోక్ తండ్రి పాపయ్య ఇంటికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: భార్య మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని ఉరేసి చంపి.. ఏమీ ఎరగనట్లు! -
సెల్ఫీ సరదా ప్రాణాలు తీసింది
పరిగి/ మిడ్జిల్: సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఆదివారం వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వికారాబాద్ నగరంలోని సూరారం కాలనీకి చెందిన వీరరాజు(25) ఆదివారం ఉదయం అనంతగిరి అందాలను వీక్షించేందుకు ఎనిమిది మంది స్నేహితులతో కలిసి కారులో వచ్చారు. తిరుగు ప్రయాణంలో పరిగి సమీపంలో లక్నాపూర్ ప్రాజెక్టు అలుగు వద్దకు వెళ్లారు. అక్కడ స్నేహితులతో కలసి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు వీరరాజుతో పాటు మరో ఇద్దరు పడిపోయారు. వీరరాజుకు ఈతరాకపోవడంతో నీటమునిగిపోయాడు. పక్కనే ఉన్న మత్స్యకారులు బయటకు తీయగా, స్నేహితులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ వీరరాజు మృతి చెందాడు. మరో ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుందేళ్ల శివప్రసాద్ (23) జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని ఓ ఫార్మస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో బాబాయి కూతుళ్లతో కలిసి సమీప దుందుబీవాగు పరిధిలోని చెక్‌డ్యాం వద్దకు వెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడి నీట మునిగి మృతి చెందాడు. కాగా, శివప్రసాద్ తండ్రి కృష్ణయ్య మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి యశోద ప్రస్తుతం కుమారుడిపైనే ఆధారపడి ఉంది. -
ఐదు రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఘోరం
ఒక్కగానొక్క కూతురు.. గారాబంగా పెరిగింది.. బంధుత్వంలోనే సంబంధం కుదిరింది.. భాగస్వామితో జీవితం తలచుకుని ఎన్నో కలలు కనింది.. ఐదు రోజుల్లో పెళ్లి..ఇల్లంతా సందడి.. లాంఛనాలిచ్చేందుకు వరుడి ఇంటికి తానూ వస్తానంటూ తండ్రితో కలిసి పయనమైంది.. అదే ‘చివరి పయనం’ అవుతుందని ఊహించలేకపోయింది. హిందూపురం/పరిగి: హిందూపురం సమీపంలోని మోత్కుపల్లి బ్రిడ్జి వద్ద శనివారం ద్విచక్ర వాహనాన్ని సిమెంట్ లారీ ఢీ కొనడంతో ఐదు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువతి అర్ధంతరంగా తనువు చాలించింది. ఆమె తండ్రి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాల మేరకు.. హిందూపురం మండలం సంతేబిదనూరు గ్రామానికి చెందిన నరసింహమూర్తి, గంగరత్నమ్మల కుమార్తె చైతన్య(21)కు పరిగి మండలం బీచిగానిపల్లికి చెందిన బంధువుల అబ్బాయితో పెళ్లి కుదిరింది. చైతన్య డిగ్రీ పూర్తి చేసింది. ఒక్కగానొక్క కుమార్తె కావడంతో వివాహం వైభవంగా చేయాలని తల్లిదండ్రులు భావించారు. వరుడు కూడా సమీప బంధువే కావడంతో అతని ఇంటి వద్దే సెపె్టంబరు రెండున వివాహ వేడుక జరిపించాలని నిర్ణయించారు. పెళ్లి రోజు సమీపిస్తుండడంతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. బంధువులందరికీ పత్రికలు పంచారు. పెళ్లి కుమార్తెకు కొత్త దుస్తులు కొన్నారు. వరుడికి పెళ్లి లాంఛనాలు, దుస్తులు ఇవ్వడంతో పాటు బీచిగానిపల్లిలోనే ఉన్న బంధువులకు పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు శనివారం నరసింహమూర్తి బయలుదేరాడు. తానూ వస్తానంటూ చైతన్య కూడా తండ్రి బైక్‌పై పయనమైంది. మోత్కుపల్లి బ్రిడ్జిపై వెళుతుండగా వెనుక నుంచి సిమెంట్ లారీ (ఏపీ 04బీడబ్ల్యూ7462) వేగంగా ఢీకొట్టింది. తండ్రీ కూతురు కింద పడిపోగా.. లారీ టైర్లు చైతన్య పైనుంచి వెAళ్లాయి. దీంతో కాళ్లు రెండూ నుజ్జునుజ్జయ్యాయి. అరగంట పాటు నరకం చూసింది. నరసింహమూర్తికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే చైతన్య చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నరసింహమూర్తిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. హిందూపురం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకున్నారు. బాగేపల్లికి చెందిన లారీ డ్రైవర్ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: కులం నుంచి వెలివేశారని వస్తే.. ఎస్సై బూతులు తిట్టారు.. -
పెళ్లి ఖర్చులకు చిల్లిగవ్వ లేదు.. యువతి బలవన్మరణం
పరిగి: అప్పుల బాధతో తండ్రి ఉరివేసుకున్నాడు... అన్న రోడ్డు ప్రమాదంలో మరణించాడు... ఉన్నత చదువులు చదివి ఎన్నాళ్లు ఎదురు చూసినా ఉద్యోగం రాలేదు.. చివరకు పెళ్లి కుదిరిందన్న ఆనందమూ మిగల్లేదు... అప్పు చేస్తే తప్ప పెళ్లి జరిగే పరిస్థితి లేదు... కానీ పెళ్లి చేసుకుంటే అప్పు తీర్చేవారు లేరు... ఈ సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారమని భావించిన ఓ యువతి రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉందనగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్‌పల్లిలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్‌పల్లికి చెందిన వడ్ల అనిత (29) పీజీతోపాటు బీఈడీ చేసింది. అప్పుల బాధతో తండ్రి పదేళ్ల క్రితం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసే సోదరుడు 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీనికితోడు ఆస్తిపాస్తులు ఏమీ లేకపోవడం, తల్లి బయటకు వెళ్లి పని చేసే స్థితిలో లేకపోవడంతో అనిత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు. ఇటీవల పెళ్లి కుదరగా మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే పెళ్లి ఖర్చులకు చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో అప్పు చేస్తే తప్ప చేసుకోలేని పరిస్థితి ఆమెకు నెలకొంది. కానీ ఒకవేళ అప్పు చేసినా దాన్ని తిరిగి తీర్చేవారు కూడా లేరని భావించిన అనిత తీవ్ర మనస్తాపానికి గురైంది. తన ఆవేదనను సూసైట్ నోట్లో రాసుకొని గురువారం ఉదయం తల్లిని పాల కోసం పక్కింటికి పంపించింది. ఆమె వచ్చేలోగా ఇంట్లోని దూలానికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లి వచ్చి చూసేలోగా మృతిచెందింది. సూసైట్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. చదవండి: నాలుగు రోజుల్లో పెళ్లి.. అంతలోనే కరోనాకు బలి -
జాలిలేని దేవుడు.. కష్టాలకే కన్నీళ్లొచ్చె..
కూతుళ్లు పుడితే ఇంటికే వెలుగు అనుకుంటాం.. మహాలక్ష్మిగా భావిస్తాం.. ఆ ఇంట ఇద్దరు లక్ష్మిలు జన్మించారు. తల్లిదండ్రులు మురిసిపోయారు.. మురిపెంగా చూసుకున్నారు.. చిన్నకూతురికి ఏడాదిలోపే తల్లి దూరమైంది.. తండ్రి అన్నీ తానే అయ్యాడు. ఆలనాపాలనా చూసుకుంటుంటే.. అంతలోనే అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. ఆదరణ కరువైంది. ఆకలేస్తే అన్నం లేదు.. తలదాచుకోను ఇల్లులేదు. ఎటు వెళ్లాలో దిక్కుతోచలేదు. చెల్లిని చదివించేందుకు అక్క చదువు మానేసింది. కూలిపనులకెళ్లి పూట గడుపుకుంటున్నారు. ఎవరైనా ఆపన్నహస్తం అందిస్తే.. బాగా చదువుకుంటామని అక్కాచెల్లెల్లు చెప్తున్నారు. పరిగి: కొడిగెనహళ్లి పంచాయతీ ఎస్సీ కాలనీకి చెందిన కూలీ కె.హనుమంతప్ప, నరసమ్మ దంపతులు. వీరికి యశోద, ఐశ్వర్య కుమార్తెలు. చిన్నమ్మాయికి ఏడాది వయసున్నపుడు అంటే 14 ఏళ్ల కిందట తల్లి అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి కూతుళ్ల ఆలనాపాలనా హనుమంతప్పే చూసుకుంటూ వచ్చాడు. ఐదేళ్ల కిందట ఆయన కూడా ఆరోగ్యం క్షీణించి మృత్యువాతపడ్డాడు. అప్పటికి యశోద ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లోనే ఉంటూ వచ్చారు. ఇక పోషించేవారు లేకపోవడంతో చిన్నాన్నకు చెందిన ఓ చిన్న గదిలో అక్కచెల్లెల్లిద్దరూ తలదాచుకుంటున్నారు. స్నానం చేసుకోవడానికి కూడా సరైన వసతి లేదు. చిన్నపాటి వర్షం వచ్చినా కారుతోంది. ఇద్దరూ చదువుకోవాలంటే సాధ్యపడదని గ్రహించిన యశోద చదువు మానేసింది. చెల్లి చదువు కోసం.. చెల్లి ఐశ్వర్యనైనా చదివిద్దామని యశోద నిర్ణయించుకుంది. కుటుంబ భారం, చెల్లి చదువును తన భుజానకెత్తుకుంది. అర కిలోమీటరు దూరంలో ఉన్న ఓ నర్సరీలో మొక్కలకు నీరు పెట్టేందుకు వెళ్తోంది. అయితే అక్కడ నీరు పెట్టినందుకు రోజుకు రూ.50 మాత్రమే ఇస్తున్నారు. ఆ మొత్తంతోనే రోజులు నెట్టుకుంటూ వస్తున్నారు. చెల్లి ఐశ్వర్య సేవామందిరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మేమున్నామని.. మీకేం కాదని.. తల్లిదండ్రుల ఆలనాపాలనకు నోచని అమ్మాయిల కష్టం గురించి తెలుసుకున్న తహసీల్దార్ సౌజన్యలక్ష్మీ, ఎంపీడీఓ రామారావు, ఎస్ఐ శ్రీనివాసులు, పలువురు స్వచ్ఛంద సంస్థ, ప్రజాసంఘాల ప్రతినిధులు శుక్రవారం కొడిగెనహళ్లి అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం వేదికగా స్పందించారు. వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అమ్మాయిల సంరక్షణ బాధ్యతలను తాను తీసుకుంటానని సర్పంచ్ శ్రీరామప్ప హామీ ఇచ్చారు. యశోద, ఐశ్వర్యలకు అండగా ఉంటామని దివ్య ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ పరిగి వేణుగోపాలరావు తక్షణసాయంగా రూ.10 వేల నగదు అందజేశారు. అదే విధంగా ప్రముఖ సామాజక కార్యకర్త, వైఎస్సార్సీపీ నేత శివరామిరెడ్డి తన వంతుగా రూ.10 వేలు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మారుతీరెడ్డి సైతం రూ.5 వేలు తక్షణ సాయంగా అందజేశారు. హిందూపురం కౌన్సిలర్ సతీష్, ఆర్టీసీ డిపో కంట్రోలర్ బాబయ్య సంయుక్తంగా రూ.5 వేలు ఇచ్చారు. భగత్‌సింగ్ సేవాసమితి రూ.5 వేలు, ఇరిగేషన్ పెనుకొండ డీఈ గోపి రూ.3 వేలు, జెడ్పీ స్కూల్ హెచ్ఎం దిల్షాద్ బేగం రూ.5 వేలు, విశ్రాంత హెచ్ఎం ఓబులేసు, ఏఎం లింగణ్ణ కాలేజ్ అధ్యాపకుడు రామాంజి తనవంతుగా రూ. 2 వేలతో పాటు నిత్యావసర సరుకులను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. బాగా చదువుకుంటాం అమ్మ, నాన్న లేని జీవితం మాకు శూన్యంగా అనిపించింది. ఆలన, పాలన చూడాల్సిన వారు లేకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిసింది. దాతలు సహకరిస్తే బాగా చదువుకుంటాం. – యశోద, ఐశ్వర్య ఆర్థికసాయం అందించాలనుకుంటే... పేరు : కె.యశోద అకౌంట్ నంబర్ : 31382210019948 కెనరా బ్యాంకు, కొడిగెనహళ్లి బ్రాంచి. ఐఎఫ్ఎస్సీ: సీఎన్ఆర్బీ0013138 చదవండి: ‘బిడ్డా... లే నాన్న... నువ్వు తప్ప మాకు దిక్కెవరే..’ -
పాలకులు మరిచారు.. రైతులే నిర్మించుకున్నారు!
సాక్షి, రంగారెడ్డి: పరిగి మండలంలోని చిగురాల్‌పల్లి గ్రామ సమీపంలోని వాగుపై వంతెన లేక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన సగం మంది రైతుల వ్యవసాయ భూములు వాగు అవతలివైపు ఉన్నాయి. వారు వాగు దాటే పొలాలకు వెళ్లాలి. సమీప గ్రామమైన రుక్కుంపల్లికి వెళ్లాలన్నా ఆ వాగు దాటాల్సిందే. వర్షాకాలంలోనైతే ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటుతుంటారు. తమ కష్టాలు తీర్చాలని ప్రజాప్రతినిధులకు, నాయకులకు దశాబ్దకాలంగా మొరపెట్టుకుంటునే ఉన్నారు. (తెలంగాణలో 1873 పాజిటివ్, 9 మంది మృతి) వాగుపై వంతెన నిర్మిస్తామని నాయకులు హామీ ఇస్తున్నా.. అమలు చేయడం లేదు. ఇక.. ఎవరికోసమే చూడడం కంటే తామే వంతెన వేసుకోవాలని రైతులంతా నిర్ణయించకున్నారు. అందరూ చేయిచేయి కలిపి కర్రలు, తాళ్లతో సుమారు 50 మీటర్ల పొడవుతో తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. మనుషులు, మేకలు, గొర్రెలు ఆ తాళ్ల వంతెనపై నుంచి వెళుతుఉండగా.. బరువు ఎక్కువగా ఉండే ఎద్దులు, గేదెలు వాగులోంచి వెళుతున్నాయి. -
గడువు తీరిన బీర్ల విక్రయం!
పరిగి : కొంతమంది మద్యం దుకాణాల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కాలం చెల్లిన బీర్లు విక్రయిస్తూ యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై విని యోగదారులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం సాయంత్రం పరిగికి చెందిన కొందరు పరిగిలోని న్యూ పరిగి వైన్స్‌లో బీర్లు కొనుగోలు చేశారు. వీటిపై డేట్ చూడగా గడువు ముగిసినట్లు గుర్తించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే కాలం చెల్లిన బీర్లు అమ్మారంటూ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మద్యం దుకాణం వద్దకు చేరుకున్న అధికారులు కాటన్ బీర్లకు సంబంధించిన విక్రయ గడువు ముగిసినట్లు గుర్తించారు. 12 బీరు సీసాలను ఎక్సైజ్ ఠాణాకు తరలించి దుకాణం సీజ్ చేశారు. ఈ మేరకు వైన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం స్టాక్ వివరాలు నమోదు చేసే ఎక్సైజ్ అధికారులు దీన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నిస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. లాక్డౌన్ సమయంలోనూ దుకాణంలో ఉన్న మద్యం నిల్వలు తరలించారని ఆరోపణలు వచ్చినా.. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవరించారని మండిపడుతున్నారు. -
‘ఆ ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది’
సాక్షి, విజయవాడ: లాక్డౌన్లో విధులు నిర్వర్తిస్తూ కరోనా తో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ... బాధిత కుటుంబానికి చెక్ అందజేసినట్లు చెప్పారు. దేశంలోనే యాభై లక్షల పరిహారం ప్రకటించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని గౌతమ్‌సవాంగ్ కొనియాడారు. దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. (‘నాడు-నేడు’పై సీఎం జగన్ సమీక్ష) కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగవని హితవు పలికారు. వ్యవసాయ కార్యకలాపాలు, పరిశ్రమలకు అనుమతిచ్చినట్లు తెలిపారు. అన్ని శాఖలతో పోలీసుల వారు సమన్వయం చేసుకుంటున్నారని, పోలీసులకి పీపీఈ కిట్లకోసం 2.89 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇక ఏపీకి విదేశాల నుంచి 28000 మంది, ఢిల్లీ జమాత్ నుంచి 1185 మంది వచ్చారని తెలిపారు. వారందరిని క్వారంటైన్లో ఉంచినట్లు చెప్పారు. (అష్ట దిగ్భందంలో పాతపట్నం) -
వివాహేతర సంబంధం గుట్టురట్టు
సాక్షి, పరిగి: గుట్టుగా కాపు కాసిన భార్య.. భర్త వివాహేతర సంబంధాన్ని రట్టు చేసింది. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవటం కలకలం రేపింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి టీచర్స్ కాలనీలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామానికి చెందిన సతీష్ ఖమ్మంలోని స్వరాజ్ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్‌గా విధులు నిర్వహించే వాడు. ఇతనికి 2006లో ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన భవానితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా సతీష్ ఉద్యోగ రీత్యా గత ఏడాదిన్నర క్రితం కొత్తగూడెం బదిలీ అయ్యాడు. అక్కడ మరో మహిళతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్ది రోజుల తర్వాత భార్యకు విషయం తెలియడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో అతను తన ఉద్యోగాన్ని వికారాబాద్ జిల్లా పరిగిలోని స్వరాజ్ ట్రాక్టర్ షోరూంకు బదిలీ చేయించుకున్నాడు. కొంత కాలంగా పరిగిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటూ తన భార్యను కొత్తగూడెంలోనే ఉంచి, పరిగిలో తన ప్రేయసితో సహజీవనం చేస్తున్నాడు. విషయం పసిగట్టిన భార్య గురువారం పరిగికి చేరుకుని అతను అద్దెకు ఉండే గదికి వెళ్లింది. డోర్ పెట్టి ఉండటంతో తీయమని కోరింది. వారు డోర్ తీయకపోవటంతో 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని డోర్ తెరిపించారు. గదిలోంచి సతీష్‌తో పాటు తాను సహజీవనం చేస్తున్న మహిళ బయటకు వచ్చింది. వెంటనే సతీష్ భార్య తన భర్తతో ఉంటున్న మహిళ జుట్టు పట్టుకుని గొడవకు దిగింది. ఇద్దరూ జుట్లు పట్టుకున్నారు. ఈ క్రమంలో మహిళా పోలీసులు లేకపోవటంతో మగ పోలీసులే అతని భార్య చేతులు పట్టుకుని లాగి పడేశారు. దీంతో ఆమె తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆమెను పట్టించుకోకుండా తననే లాగి పడేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం వారిని పోలీసులు పరిగి పీఎస్‌కు తరలించారు. ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని తనకు తన భర్త వస్తే చాలు అనడంతో పోలీసులు ముగ్గురినీ వదిలేశారు. -
దోపిడీకి గేటు తీశారు!
ప్రతి జీపీలో వన నర్సరీ ఏర్పాటు ఆ అధికారికి వరంగా మారింది. నర్సరీల్లోని మొక్కలను జంతువుల బారినుంచి రక్షించేందుకు గేట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. స్థానికంగా మంచి నాణ్యతతో ఒక్కో గేటు రూ.6 నుంచి 7 వేలకు తయారు చేయించవచ్చు. సదరు అధికారి మాత్రం ఒక్కోగేటును రూ. 14 వేలకు తయారు చేయించినట్లు జీపీల నుంచి చెక్కులు తీసుకున్నారు. దీనికి ఎంపీడీఓలను పావులుగా వినియోగించుకున్నారు. ఇలా సగానికి సగం నిధులను బొక్కేశారు. స్థానికంగా తయారు చేయించాల్సిన గేట్లను నిజామాబాద్, హైదరాబాద్‌లో తయారు చేయించడంలో మతలబు ఊహించుకోవచ్చు. జిల్లాలోని 553 జీపీలకు సంబంధించి దాదాపు రూ.70 లక్షల మేర చెక్కులు తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షి, పరిగి: పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయి. 14వ ఆర్థికసంఘం నిధులను వన నర్సరీ గేట్ల పేరుతో దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాస్థాయి ఉన్నతాధికారి ఒకరు లోపాయికారిగా వ్యవహరించి నిధులను బొక్కేశారని జిల్లాలోని ఆయా మండలాల సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పల్లెలను పచ్చని పందరిగా మార్చాలని భావించింది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ ఆ బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించింది. ఇందుకోసం 14వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవచ్చని చెప్పింది. జంతువులు, మేకలు, గొర్రెల నుంచి నర్సరీల్లోని మొక్కలను కాపాడేందుకు గేట్లు బిగించుకోవాలని జీపీల సర్పంచ్‌లకు అధికారులు సూచించారు. అయితే, ఇందులో తన పవర్‌ను వినియోగించి ఓ జిల్లాస్థాయి అధికారి నిధులను బొక్కేసేందుకు ప్రణాళిక రచించారు. రూ. 6–7 వేలకు తయారయ్యే ఒక్కో గేట్లకు ఏకంగా రెండింతల నిధులు వెచి్చంచారు. రూ.14 వేలతో ఒక్కో గేటును కొనుగోలు చేశారు. వాటిని ఏకంగా హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్‌లో తయారు చేయించారు. సర్పంచ్‌లకు ఎలాంటి సమాచారం ఇవ్వ కుండానే గేట్లను పంపించారు. జిల్లాలోని 553 పంచాయతీల్లో ఈ గేట్ల కోసం సుమారు 70 లక్షలను వెచి్చంచారు. ఈమేరకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల నుంచి చెక్కులు తీసేసుకున్నారు. ఇందులో సగానికిపైగా సదరు ఉన్నతాధికారి కమీషన్ రూపంలో మింగేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ గేట్ల వ్యహహారం అనుమానాస్పదంగా ఉండటంతో కుల్కచర్లలోని కొందరు సర్పంచ్‌లు తామే సొంతంగా తయారు చేయించుకున్నారు. అందుకోసం ఒక్కో గేటుకు రూ. 6–7 వేలు వెచి్చంచి అదే నాణ్యతతో స్థానికంగానే తయారు చేయించుకున్నారు. నిజామాబాద్ అడ్డాగా కుంభకోణం జిల్లాలో వెలుగు చూసిన అవకతవకల వ్యవహారం ఆనవాళ్లు నిజామాబాద్, హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయి. నర్సరీకి బిగించే ఒక్కో గేటుకు రూ.14 వేల ఖర్చు అవుతుందని లోపాయికారిగా సదరు ఉన్నతాధికారి కొటేషన్ తయారు తయారు చేయించారు. స్థానికంగా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు ఏ మాత్రం తెలియకుండా సగం గేట్లను హైదరాబాద్‌లోని రాజధాని వెల్డర్స్ దగ్గర, మిగతా సగం గేట్లు నిజామాబాధ్లోని శ్రీకర్ మల్టీ సర్వీసెస్ వద్ద తయారు చేయించారు. ఈ విషయం ఎంపీడీఓలకు చెప్పి వారితో జీపీలకు సమాచారం చేరవేశారు. ఒకేచోట గేట్లు తయారు చేయించాం.. ఒక్కో గేటుకు రూ.14 వేలు చెక్కుల రూపంలో ఇవ్వాలని సర్పంచ్‌లు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. వారితో గుట్టుగా 14వ, ఆర్థిక సంఘం నిధుల నుంచి చెక్కులు రాయించుకుని రూ. లక్షల్లో కమీషన్లు బొక్కేశారు. ఈ గేట్లను స్థానిక వెల్డర్లకు చూయిస్తే ఒక్కో గేటు రూ. 6– 7 వేలకు తయారు చేస్తామని చెబుతుండటంతో సర్పంచ్‌లు, కార్యదర్శులు నోళ్లు వెల్లబెట్టారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు. -
ఆ బాలికను దత్తత తీసుకుంటా.. ఎమ్మెల్యే
రంగారెడ్డి, పరిగి: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం అర్ధరాత్రి పరిగిలోని బీసీ కాలనీలో ఈ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బీసీ కాలనీలో నివసించే సాయి (24) అదే కాలనీలో నివసించే బాలిక (11)పై కన్నేసి శనివారం రాత్రి 10 గంబాలికను తన వెంట తీసుకెళ్లాడు. బాలికను ఇంటికి కొంతదూరంలో ఉన్న ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. అరిస్తే చంపేస్తానంటూ బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన బాలిక ఏడుస్తూ ఇంటికొచ్చి జరిగిన విషయం చెప్పింది. వెంటనే చుట్టుపక్కల వారితో కలిసి కుటుంబసభ్యులు ఆ యువకుడిని వెతికి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆదివారం డీఎస్పీ శ్రీనివాస్, సీఐ మొగులయ్య, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు కృషి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోక్సో, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్పీ సాయంతో జిల్లా జడ్జితో మాట్లాడించి ఫాస్ట్రుటాక్ కోర్టు ఏర్పాటుచేసి త్వరితగతిన శిక్షపడేలా చేస్తామని పరిగి సీఐ మొగులయ్య తెలిపారు. బాలికను దత్తత తీసుకుంటా: ఎమ్మెల్యే ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించదని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన ఇలాంటి ఘటనలు జరగడ బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత బాలికను దత్తత తీసుకుని పెద్దయ్యే వరకు ఆమెను చదివిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వికారాబాద్‌లోని సఖి కేంద్రంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి బాలికను పరామర్శించారు. అయితే ఈ ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరా తీశారు. -
విషాదం: ప్రాణం తీసిన గాలిపటం
సాక్షి, పరిగి: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ గురై బాలుడు మృతి చెందిన ఘటన పరిగి మండలం బాహర్పేటలో జరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎంతో సంతోషంగా ఇద్దరు బాలురు గాలిపటం ఎగరవేయడానికి భవనంపైకి వెళ్ళారు. గాలిపటం కరెంట్ వైర్లకు చిక్కుకోవడంతో.. పైపు గొట్టంతో తీయడానికి బాలుడు ప్రయత్నించగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడి చేతికి షాక్ తగలడంతో తీవ్రం గాయపడ్డాడు. బాలుడిని పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రమైన శబ్దంతో కరెంట్ వైర్లు తెగిపడి కింద మరో వ్యక్తికి మీద పడ్డాయి. ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. -
డ్రైవర్ మృతితో అట్టుడికిన పరిగి
సాక్షి, పరిగి: ఆర్టీసీ డ్రైవర్ మృతితో వికారాబాద్ జిల్లా లోని పరిగి పట్టణం అట్టుడికింది. పరిగి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తోన్న వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని మందిపల్ గ్రామానికి చెందిన సంగంశెట్టి వీరభద్రప్ప శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. వీరభద్రప్ప తన భార్య నందిని, పిల్లలు వైష్ణవి(6), బుజ్జి(3) తో కలసి పరిగిలో అద్దె ఇంటిలో ఉంటున్నాడు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మూడు నెలలుగా వేతనాలు అందకపోవడం, ఇతడికి మరే ఆధారం లేకపోవడంతో ఆర్థికంగా చితికిపోయాడు. ఈక్రమంలో రెండ్రోజుల క్రితం అస్వస్థతకు లోనయ్యాడు. శుక్రవారం ఉదయం గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు అతన్ని వికారాబాద్‌లోని మహవీర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు వీరభద్రప్ప మృతదేహంతో పరిగి డిపో వద్ద ధర్నా నిర్వహించారు. హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నిరసనకారులు బారికేడ్ల ను తొలగించే ప్రయత్నం చేయడంతో పోలీసులతో వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు డీఆర్వో వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తా మని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. -
తాత్కాలిక కార్మికులతో రోడ్డెక్కిన బస్సులు
సాక్షి, తాండూరు: జిల్లాలో మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది. తాత్కాలిక కార్మికులతో అధికారులు బస్సులను నడిపిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఈనెల 5నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. తాత్కాలికంగా కండక్టర్లు, డ్రైవర్లతో బస్సులను తిప్పుతోంది. అయితే, ఆర్టీసీకి మాత్రం తీవ్ర నష్టాలు వస్తున్నాయి. తాత్కాలిక సిబ్బంది అందిన కాడికి జేబులు నింపుకోవడంతో పరిస్థితి దారుణంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో జిల్లాలో సదరు సంస్థకు రూ.60 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. మన జిల్లాలో పరిగి, వికారాబాద్, తాండూరు పట్టణాల్లో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ మూడు డిపోల్లో కలిసి మొత్తం 254 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. సుమారు 700 మందికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తుండేవారు. నిత్యం దాదాపు రూ.22 లక్షల ఆదాయాన్ని సంస్థ ఆర్జిస్తుండేది. ఈనెల 5నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. బస్సులను ఎలాగైనా తిప్పాలనే తలంపుతో డిపోలను పోలీసుశాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 5వ తేదీన జిల్లాలో 86 బస్సులు, మరుసటి రోజు 143 బస్సులు, సోమవారం 151 బస్సులను నడిపించారు. జిల్లాలో దాదాపు 90 మంది అద్దె కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు. ఇందులో కొన్ని అద్దె బస్సులు ఉన్నాయి. మూడురోజులు బస్సులను తిప్పినా జిల్లా మొత్తం రూ.4 లక్షలే రావడం గమనార్హం. సందట్లో సడేమియా అన్నచందంగా ప్రైవేట్ వాహనదారులు అందిన కాడికి ప్రయాణికులను దోచుకుంటున్నారు. బస్సుల్లోనూ చార్జీలకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల భద్రత నడుము బస్సులు నడుస్తున్నాయి. కొన్ని చోట్ల ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. సోమవారం పరిగిలో డ్రైవర్లు, కండక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి బస్‌డిపో వద్ద నిరసన వ్యక్తం చేసే యత్నం చేశారు. 144 సెక్షన్ అమలులో ఉండటంతో పోలీసులు వారిని అడ్డుకొని ఠాణాకు తరలించారు. దీంతో కార్మికులు ఠాణా ఎదుటే బైఠాయించారు. కేసీఆర్ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. తగ్గేది లేదంటున్న కార్మికులు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు భీష్మించారు. కార్మికులతో చర్చలు జరిపేది లేదని సర్కారు స్పష్టం చేస్తోంది. ఇటు ఆర్టీసీ, అటు సర్కారు పంతానికి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఆర్టీసీ కార్మికులకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఆదాయం తక్కువే.. మన జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూరు ఆర్టీసీ డిపోల ద్వా రా ఇప్పటివరకు 151 బస్సులను రోడ్డుపైకి తీసుకొచ్చాం. అయితే, ప్రయాణికులు సంఖ్య పెరగడం లేదు. గతంలో నిత్యం రూ.22లక్షల ఆదాయం సమకూరేది. ప్రస్తుతం మూడు రోజుల్లో కేవలం జిల్లా మొత్తంలో ఆర్టీసీకి కేవలం రూ.4 లక్షలు మాత్రమే వచ్చాయి. – రమేష్, డీవీఎం, వికారాబాద్ జిల్లా -
ఆయకట్టుకు గడ్డుకాలం
సాక్షి, పరిగి: జిల్లాలో రెండో అతిపెద్దదైన లఖ్నాపూర్ ప్రాజెక్టు నీరులేక వెలవెలబోతోంది. గత రెండేళ్ల వరకు ప్రాజెక్టు నీటితో కళకళలాడింది. ఈసారి పరిగి నియోజకవర్గంలో లోటు వర్షపాతంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది ఓ మోస్తరు వర్షాలు కురిసినా ప్రాజెక్టులోకి ఆశించినస్థాయిలో నీరు రాలేదు. ప్రస్తుతం ఒక అడుగు మేర మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఖరీఫ్ సాగు ప్రారంభించకుండానే సీజన్‌కు ముగింపు పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. రబీలోనైనా పంట వేద్దామనుకుంటే నీరు లేని దుస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసినా నియోజకవర్గంలో పరిస్థితి మరోలా ఉంది. ఈ ఏడాది ఇక్కడ భారీ వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. పరిగి మండలంలోని లఖ్నాపూర్, మిట్టకోడూర్ గ్రామాలతో పాటు ధారూరు మండల పరిధిలోని మోమిన్‌కలాన్, రాజాపూర్, ఐనాపూర్ తదితర ఎనిమిది గ్రామాల రైతులు ఈ ప్రాజెక్టు ఆయకట్టులో సాగు చేస్తుంటారు. బీళ్లుగా మారిన భూములు ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మిగతా ప్రాంతంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో ఉండగా ఇక్కడ భిన్నంగా ఉంది. గడిచిన వేసవిలో ఏప్రిల్, మే మాసాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురవగా ప్రస్తుత వర్షాకాల సీజన్లో పరిగి ప్రాంతంలో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. అగస్టులోనూ అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. 50 శాతానికి మించి వర్షాలు పడలేదు. ఈ నేపథ్యంలో తగ్గిన వర్షపాతం లఖ్నాపూర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. కొత్తగా ప్రాజెక్టులోకి కనీసం ఒక ఫీటు నీరైనా చేరలేదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో దాదాపు 2,600 ఎకరాల ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వర్షాకాలం ముగుస్తుండటం, ఇక భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా సన్నగిల్లడంతో రబీ సీజన్‌పైనా కర్షకులు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులకు తీవ్రనష్టం ఖరీఫ్‌లో వర్షాలు విరివిగా కురుస్తే వరి సాగు చేద్దామనుకున్న రైతుకు నిరాశే మిగిలింది. మామూలుగా కురిసిన వర్షాలు మెట్ట పంటలకే సరిపోయాయి చెరువుల్లోకి ఏమాత్రం నీరు వచ్చి చేరలేదు. దీంతో లఖ్నాపూర్ ప్రాజెక్టు ఆయకట్టు కూడా వెలవెలబోయింది. సాగు చేయకుండానే ఖరీప్ సీజన్ ముగుతోంది. కాస్త ఆలస్యంగానైనా ప్రాజెక్టు నిండితే రబీతోపాటు వేసవిలో వరి పండించుకోవచ్చని ఆశపడ్డ రైతుల ఆశ నెరవేరేలా లేదు. భారీ తుఫాన్లు వస్తేగాని ప్రాజెక్టులోకి నీరు వచ్చేలా కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. రూ. 12 కోట్ల నష్టం.. లఖ్నాపూర్ ప్రాజెక్టు ఆయకట్టులో దాదాపు 2,600 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టులోకి కొత్త నీరు చేరకపోవడంతో ఖరీఫ్, రబీ సీజన్లో సాగు చేసే పరిస్థితి లేదు. దీంతో భూములు బీళ్లుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సీజన్లలో కలిపి దాదాపు రూ. 12 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుందని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్లో ఆయకట్టులో వరి సాగు చేస్తే దాదాపు రూ. 6 కోట్ల పైచిలుకు విలువ చేసే ధాన్యం పండుతుందని ఇక్కడి రైతులు అంటున్నారు. రెండు సీజన్లలో సుమారు రూ. 12 కోట్లకు పైగా నష్టం తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. -
వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్!
పేదల బియ్యం పక్కదారి పట్టాయి.. వేలాది క్వింటాళ్లు అక్రమర్కుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ దందాకు పరిగి అడ్డాగా మారింది. ఇప్పటి వరకు రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేస్తూ దండుకోగా.. ఇప్పుడు కొంతమంది అక్రమార్కులు తమ దందాకు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. పేదలు తినే బియ్యాన్ని సేకరించి.. కోళ్ల దాణా తయారీలో వాడుతున్నారు. వందలాది టన్నుల రేషన్ బియ్యాన్ని నూకల పేరుతో కోళ్ల దాణా తయారీ కోసం నిల్వ చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఈ విషయం బట్టబయలైంది. పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట్ గేట్ సమీపంలో ఉన్న నాగార్జున ఫీడ్ ఫ్యాక్టరీ ఈ దందాకు వేదికైంది. రేషన్ బియ్యాన్ని కోళ్ల దాణాలో కలిపి సొమ్ము చేసుకుంటున్న ముఠా వ్యవహారం గుట్టురట్టయ్యింది. సాక్షి, పరిగి: పేదల కడుపునింపే వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యం కోళ్ల దాణాగా మారుతున్నాయి. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కొంతమంది గుట్టుగా ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం రాత్రి 10 గంటల తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. రూప్‌ఖాన్‌పేట్ సమీపంలోని నాగార్జున ఫీడ్స్ (కోళ్ల దాణా తయారు చేసే ఫ్యాక్టరీ)పై దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 2వేల పైచిలుకు బస్తాల (100 టన్నులకు పైగా) రేషన్ బియ్యం గుర్తించి సీజ్ చేశారు. కోళ్ల దాణాలో నూకలు మాత్రమే కలపాల్సి ఉండటంతో రికార్డుల్లో మాత్రం నూకల పేరుతో వీటిని కొనుగోలు చేసినట్లు చూపించారు. రైస్ మిల్లులు కేంద్రంగా సరఫరా... ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని.. కోళ్ల దాణాకు ఎవరు సరఫరా చేశారు..? ఇందులో సూత్రధారులు ఎవరు... ఎవరి పేరున కొనుగోలు చేశారు..? అనే విషయాలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. ఫ్యాక్టరీలో ఉన్న రికార్డులు, రిజిస్టర్లు, బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. దోమ మండల పరిధిలోని పోలెపల్లికి చెందిన భాగ్యలక్ష్మి రైస్ మిల్లు మరియు పరిగికి చెందిన ఓ ట్రేడర్ ద్వారా రేషన్ బియ్యాన్ని కోళ్ల దాణా ఫ్యాక్టరీకి సరఫరా చేసినట్లు గుర్తించారు. అయితే ఫ్యాక్టరీ నిర్వాహకులు కొనుగోలు చేసింది, రేషన్ బియ్యమే అయినా.. నూకల పేరుతో బిల్లులు ఇవ్వటం గమనార్హం. దందాలో పలువురి పాత్ర.... ఈ దందాలో పలువురి పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది. నిఘావర్గాలపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టడం వెనక కొందరు రేషన్ డీలర్ల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. మరో వైపు రైస్ మిల్లుల నిర్వాహకులు చిన్న స్థాయిలో బియ్యం దందా చేసే వారి నుంచి రేషన్ బియ్యం సేకరించి.. డంపులుగా మార్చి.. ఇలా దాణా ఫ్యాక్టరీలకు.. ఇతర చోట్లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా పలు శాఖల అధికారుల సహకారంతోనే జరిగినట్లు తెలుస్తోంది. దాడుల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ చంద్రమౌలి, ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఫేక్ ఫయాజ్ అహ్మద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ నోముల మురళి సంఘట స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక సర్పచ్ నర్సింహ్మ, బీజేపీ నాయకులు పెంటయ్యగుప్త, హరికృష్ణ, సీపీఎం నాయకులు వెంకటయ్య, సీపీఐ నాయకులు పీర్ మహ్మద్ వెంకటేశ్ తదితరులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేస్తాం రికార్డుల్లో దొరికిన వివరాల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. నాగార్జున ఫీడ్ కంపెనీ యజమాని రాజేందర్‌రెడ్డి, ట్రేడర్ కిరణ్, భాగ్యలక్ష్మి రైస్‌మిల్ ఓనర్ నారాయణపై కేసులు నమోదు చేస్తాం. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీజ్ చేసి గోదాంకు తరలిస్తున్నాం. – నోముల మురళి, విజిలెన్స్ అడిషనల్ ఏఎస్పీ -
నిండు చూలాలు దారుణ హత్య
సాక్షి, పరిగి: నిండు చూలాలును దారుణంగా హతమార్చి రోడ్డు పక్కన పడేసిన సంఘటన పరిగి మండలం రంగంపల్లి శివారులో గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. రంగంపల్లి శివారులోని హైదరాబాద్– బీజాపూర్ రహదారి పక్కన గుంతల్లో కాలిపోయిన స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. పరిగి డీఎస్పీ రవీంద్రారెడ్డి, ఎస్ఐ చంద్రకాంత్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఒక్క ఎడమకాలి పాదం మినహా పూర్తిగా ఆమె శరీరం కాలిపోయి ఉంది. 20 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతి అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాళ్లకు మెట్టెలు, మెడలో మంగళసూత్రంలాంటివి లేకపోవడం, ఆమె జననాంగాలకు ఆనుకుని గర్భస్థ శిశువు పడి ఉంది. ఎక్కడో హత్య చేసిన దుండగులు బుధవారం రాత్రి ఇక్కడ పడవేసి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారై ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను తప్పుతోవ పట్టించేందుకే ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారా..? అని భావిస్తున్నారు. వాహనం తచ్చాడిన గుర్తులను బట్టి కారులో తీసుకువచ్చి పడేసి ఉంటారని గుర్తించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు.. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పరిగి లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఆయా పోలీస్స్టేషన్లకు పంపించి మిస్సిం గ్ కేసుల విషయంలో ఆరా తీస్తున్నారు. చుట్టు పక్కల పోలీస్స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అబార్షన్ వికటించిందా..? లభ్యమైన మృతదేహం గర్భవతి కావడంతో పాటు అవివాహితగా అనుమానిస్తున్న పోలీసు లు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాం పక్కన ఆస్పత్రిలో పేషెం ట్లకు కప్పే బట్ట లభ్యం కావడం సంఘటన వెనక మరో కోణాన్ని వెలుగులోకి తెస్తోంది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో గుట్టుగా అబార్షన్ చేయిం చేందుకు ప్రయత్నించి అది వికటించడంతో యువతి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. మృతి చెందాక మృతదేహాన్ని, శిశువును తీసుకువచ్చి ఇక్కడ పడేసి నిప్పంటించి పరారై ఉంటారా...? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా కనిపించకుండాపోయిన వారు ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. 94406 27360, 94406 27275లలో తమను సంప్రదించాలని సూచించారు. -
అడవిలో వృద్ధురాలు బందీ
సాక్షి, పరిగి(అనంతపురం) : మండలంలోని శాసనకోట పంచాయతీ కొడిగెనహళ్లి సమీపంలో ఉన్న ఓ అటవీ ప్రాంతంలో ఆదివారం మ ధ్యాహ్నం ఓ వృద్ధురాలిని ఆమె చీరతోనే చెట్టుకు కట్టేసిన వైనం వెలుగు చూసింది. అటుగా వెళ్లిన గొర్రెల కాపరుల నుంచి విషయం తెలుసుకున్న గ్రామస్తుల సమాచారం మేరకు విలేజ్ కానిస్టేబుల్ వీరేష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే వర్షంలో 85 ఏళ్ల పండు ముదుసలి తడిసి ముద్దైపోయింది. చలికి వణుకుతూ అచేతనంగా పడి ఉంది. అప్పటికే ఆమె శరీరంపై గండుచీమలు గాయపరిచిన గాయాలు ఉన్నాయి. రోడ్డుకు దాదాపు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో అటవీ ప్రాంతంలో కట్టిపడేసిన వృద్ధురాలని కానిస్టేబుల్ తన చేతులపై మోసుకొచ్చి, అనంతరం ద్విచక్ర వాహనంపై కొడిగెనహళ్లికి తరలించారు. ఉర్దూలో మాట్లాడుతుండడంతో ఆమె ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారై ఉంటారని భావిస్తున్నారు. అయితే తన వివరాలు సక్రమంగా తెలపలేకపోతుండడంతో సేవామందిరంలోని ప్రశాంతి వృద్ధాశ్రమంలో చేర్పించారు. కానిస్టేబుల్ వీరేష్‌ను ఈ సందర్భంగా హిందూపురం రూరల్ సీఐ ధరణీకిషోర్, ఎస్ఐ శ్రీనివాసులు అభినందించారు. -
సుల్తాన్‌పూర్‌లో దొంగల బీభత్సం
సాక్షి, పరిగి : తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని దొంగలు బీభత్సం సృష్టించారు. పక్కన ఇళ్లకు గొళ్లాలు పెట్టి మరీ దొంగతనానికి పాల్పడ్డారు. బీరువాలు పగలగొట్టి దొరికిన కాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటన పరిగి మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మౌలానా కుటుంబసభ్యులు మంగళవారం బంధువుల ఇంటికి వెళ్లగా ఆయన ఒక్కడే రాత్రి ఓ గదికి తాళం వేసి పక్క గదిలో పడుకున్నాడు. అతను పడుకున్న గదికి గొళ్లెం పెట్టి పక్కగది తాళాలు విరగ్గొట్టారు. బీరువాను పగలగొట్టి రూ.30 వేల నగదు, తులం బంగారం ఎత్తుకెళ్లారు. ఇల్లంతా చిందరవందర చేశారు. మౌలానా తెల్లారి లేచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా ఇంటికి గొళ్లెం పెట్టి ఉంది. దీంతో ఆయన పక్కింటి వారికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో వారు వచ్చి గొళ్లెం తీశారు. అదే గ్రామానికి చెందిన సాయి అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. అతనొక్కడే గ్రామంలో ఉంటుండగా తల్లిదండ్రులు కూలి పనుల కోసం హైదరాబాద్‌కు వలసవెళ్లారు. సాయి మంగళవారం రాత్రి ఇంటికి తాళం వేసి పక్కింట్లో స్నేహితుడి వద్ద నిద్రించడానికి వెళ్లాడు. అయితే తెల్లారి లేచి చూస్తే ఇల్లు తెరచి ఉంది. లోపలకు వెళ్లి చూడగా ఇంట్లో ఉన్న రూ.10,500, అరతుల బంగారం కనిపించలేదు. అదే గ్రామానికి చెందిన ఎండీ ఖాజా ఇంటి తాళాలు కూడా పగలగొట్టారు. కాని ఇంట్లో ఏమి దొరకకపోవటంతో వస్తువులు చిందరవందర చేసి వదిలేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
బరితెగించిన బీకే పార్థసారథి
సాక్షి, పరిగి: అధికార బలంతో ఏదైనా చేయడానికి వెనకాడని పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీకే పార్థసారథి తన దుర్బుద్దిని మరోసారి చాటారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలను తుంగలో తొక్కి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పరిగి మండలంలోని కాలువపల్లి వద్ద ఉన్న నిషా డిజైన్స్ గార్మెంట్స్ పరిశ్రమకు బుధవారం సాయంత్రం వచ్చి దాదాపు అరగంటకు పైగా గార్మెంట్‌లో పనిచేస్తున్న మహిళలను సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. లోపలికి వెళ్లిన ఆయన తన అనుచరులతో కలిసి కలియతిరిగారు. పరిశ్రమ యాజమాన్యంతో ఉన్న చొరవతోనే లోపలికి ప్రవేశించి ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారు. ప్రతి ఒక్క మహిళతో తనకు గెలిపించాలని కోరినా అక్కడున్న మహిళలు పెద్దగా స్పందించకవడంతో అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడి చేరుకొని వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఎస్ఐ గణపవరం శివ లోపలికి వెళ్లగా లోపలున్న పార్థసారధి అక్కడి నుంచి తన వాహనంలో ఉడాయించారు. ఆయనకు సిగ్గు మానం లేదు:గోరంట్ల మాధవ్, వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి పెనుకొండ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి తను సీనియర్ రాజకీయ నాయకుడన్న విషయమే మరిచిపోయాడని, సమయం దాటినా ప్రచారం నిర్వహించి మహిళలతో తరిమించుకున్నాడని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. పరిగి మండలం కాలువపల్లి గార్మెంట్ పరిశ్రమ వద్దకు చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహించిన పార్థసారథి తీరును ఖండించారు. డబ్బులు ఎరచూపి, గందరగోళం సృష్టించి ఫ్యాక్టరీలోకి ప్రవేశించాడన్నారు. అక్కడున్న మహిళలు వెంటబడి తరిమితే సిగ్గులేకుండా పరిగెత్తిపోయాడన్నారు. అలాగే హిందూపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ సంతలో పశువులను కొంటున్నట్లు విచ్చలవిడిగా డబ్బుపంచాడని ధ్వజమెత్తారు. వెంటనే వైఎస్సార్సీపీ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ, ముఖ్య ఎలక్షన్ ఏజెంట్ మాలగుండ్ల రవీంద్ర, పరిగి మండల కన్వీనర్ జయరాం తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలవడం ఖాయం
సాక్షి, పరిగి: టీఆర్ఎస్ 16 లోక్‌సభ స్థానాలు గెలవటం ఖాయమని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పరిగి నియోజకవర్గం గండేడ్ మండల పరిధిలోని సంగాయిపల్లి, కంచన్‌పల్లి, వెంకట్‌రెడ్డిపల్లి, చిన్నాయిపల్లి, షేక్‌పల్లి, బొమ్మికుంటతండా, మంగంపేట్, ధర్మాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్లకుర్మల అవసరాలను గుర్తించి వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత కేసీఆర్ సారథ్యంలోని మా టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కేసీఆర్ హయాంలో గ్రామీణ వృత్తులకు పెద్దపీట వేశారని ఆయన పేర్కొన్నారు. పేదలకు ఎంతో సేవ చేసిన మా టీఆర్ఎస్ ప్రభుత్వానికే ఓటు అడిగే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తూ వస్తుందని తెలిపారు. వంచించిన పార్టీలను ప్రజలు నమ్మరని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఇదే టీఆర్ఎస్ గెలుపుకు బాటలు వేస్తుందని తెలిపారు. ప్రజలకు ఏది అవసరమో గుర్తించింది కేవలం మా ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన ఘనత కేవలం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
కారు జోరు.. కాంగ్రెస్ బేజారు
సాక్షి, పరిగి: చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ ప్రాభవం రోజురోజుకూ తగ్గుతోంది. కనుచూపు మేరలో కూడా తమ పార్టీకి భవిష్యత్తు కనిపించకపోవడంతో ప్రధాన నాయకులు హస్తం వీడి కారెక్కేందుకు పోటీ పడుతున్నారు. ప్రధానంగా చేవెళ్ల పరిధిలో 2009 సార్వత్రిక ఎన్నికల నుంచి ఇటీవలి అసెంబ్లీ ఎలక్షన్ల వరకు నమోదైన ఓటింగ్ సరళిని చూస్తే కాంగ్రెస్ పరిస్థితి ఇట్టే తెలిసిపోతుంది. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హవాలో మంచి ఊపుమీదున్న కాంగ్రెస్ చేవెళ్ల లోక్‌సభ పరిధిలో పూర్తి ఆధిక్యాన్ని కనబర్చి విజయం సొంతం చేసుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికలు వచ్చే వరకు 2009 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు 90 వేల పైచిలుకు ఓట్లకు గండిపడింది. 2009లో కాంగ్రెస్ హవా.... 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నూతనంగా ఆవిర్భవించింది. 2009లో సార్వత్రిక ఎన్నికలు జరగగా ఇద్దరు ఉద్దండులైన స్థానికేతర నేతలు ఇక్కడ బరిలో దిగారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సూదిని జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీలో నిలవగా.. టీఆర్ఎస్, టీడీపీల ఉమ్మడి అభ్యర్థిగా జితేందర్‌రెడ్డి పోటీపడ్డారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జైపాల్‌రెడ్డి 18,532 ఓట్ల మెజార్టీతో జితేందర్‌రెడ్డిపై విజయం సాధించారు. ఆ సమయంలో టీఆర్ఎస్కు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా దక్కలేదు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీ పాగా వేశాయి. 2014లో సీన్ రివర్స్... 2014 సార్వత్రిక ఎన్నికలు వచ్చే సరికి సీన్ పూర్తిగా మారిపోయింది. టీఆర్ఎస్ తరఫున ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ చేయగా.. కాంగ్రెస్ తరఫున పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి బరిలో నిలిచారు. ఇదే సమయంలో టీడీపీ తరఫున వీరేందర్‌గౌడ్ పోటీ చేశాడు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 73,023 ఓట్ల మెజార్టీతో కార్తీక్‌రెడ్డిపై గెలుపొందారు. ఈ లెక్కన 2009 ఎన్నికలతో పోలిస్తే 2014లో కాంగ్రెస్ పార్టీలోని 90 వేల ఓట్లకు గండి పడింది. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి అధికార టీఆర్ఎస్ 1,43,900 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇలా రోజరోజుకు కాంగ్రెస్ ప్రాభవం తగ్గుతూవస్తోంది. ఇదే సమయంలో కారు జోరు పెరుగుతోంది. కారుగుర్తు వర్సెస్ కొండా ఇమేజ్.. సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా రెండు పార్టీల మధ్య లేదా ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంది. కానీ ప్రస్తుతం చేవెళ్ల లోక్‌సభ స్థానంలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ చేస్తుండగా అధికార టీఆర్ఎస్ తరఫున పౌల్ట్రీ వ్యాపారి రంజిత్‌రెడ్డి రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్తున్నా.. కొండా మాత్రం తన సొంత ఇమేజ్‌ని నమ్ముకుంటున్నారు. ఎలాగైనా విజయం సా«ధించాలనే సంకల్పంతో వినూత్న వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఇదే సరళిని అనుసరిస్తున్నారు. దీనికి తోడు టీఆర్ఎస్ తరఫున కొత్త అభ్యర్థి బరిలో దిగితే తనకు కొంత కలిసి వస్తుందని నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా కేసీర్ చరిష్మా, కారు గుర్తులే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే అసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు తమ పార్టీ అభ్యర్థికి విజయాన్ని కట్టబెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు పెత్తనం అవసరమా?
సాక్షి, వికారాబాద్ : హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల కాలంలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా ఎందుకు పెట్టలేక పోయారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న స్వరాష్ట్రంలో వలసవాదుల పెత్తనం అవసరమా అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్న సమయంలో కరెంటు చార్జీలు పెంచినప్పుడే తెలంగాణ కోసం పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ గుర్తుచేశారు. యుద్దం ఇంకా ముగియలేదని.. తెలంగాణ వ్యతిరేక శక్తులు మనపై దండయాత్రకు వస్తున్నాయని.. వారికి తిప్పి కొట్టేవరకు పోరాటం సాగుతుందని పేర్కొన్నారు. వివిధ సర్వేల ఫలితాల ప్రకారం టీఆర్ఎస్కు వందకుపైగా సీట్లు వస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా పరిగికి సాగు నీరు అందిస్తున్నామని, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు రాస్తున్న చంద్రబాబు పార్టీకి ఓట్లు ఎందుకు వెయ్యాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చంద్రబాబును భుజానకెత్తుకుని వస్తున్నారని మండిపడ్డారు. -
రెండు చావులకు నా భార్యే కారణం: భర్త సూసైడ్ నోట్
సాక్షి, పరిగి: ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన పరిగిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. చావుకు తన భార్యే కారణమని సూసైడ్ నోట్ సైతం రాశాడు. పోలీసులు, గ్రామస్తులు వివరాల ప్రకారం.. పరిగి పట్టణంలోని బాహర్పేట్ వల్లభనగర్‌కు చెందిన ముకుంద్ శ్రీనివాస్ (35) సహకార సంఘం కార్యాలయంలో ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గతంలో అతనికి వేరొక మహిళతో వివాహం జరగ్గా మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. నాలుగేళ్ల క్రితం శ్రీనివాస్ కొడంగల్‌కు చెందిన భాగ్యలక్ష్మిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో 15 రోజుల క్రితం శ్రీనివాస్ తల్లి సత్తెమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో గత మూడు రోజుల క్రితం కొడంగల్‌లోని అత్తవారింటికి శ్రీనివాస్ భార్య పిల్లలతో కలిసి నిద్ర చేసేందుకు వెళ్లాడు. అక్కడ భార్యభర్తలు గొడవపడ్డారు. గురువారం భార్య పిల్లలను అక్కడే వదిలి తన నివాసానికి చేరుకొని ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందాడు. రాత్రి 11 గంటల సమయంలో చుట్టు పక్కల వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి అతని వద్ద లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు చావులకు నా భార్యే కారణం.. మృతుడు శ్రీనివాస్ రాసిన సూసైడ్ నోట్లోని సారాంశం ఇది.. ఈ నెల 10న మా అమ్మ ఉరి వేసుకుని మృతి చెందింది. దీంతో దశదిన ఖర్మ అయిపోయాక 21వ తేదీన భార్య పిల్లలతో కలిసి కొడంగల్‌లోని అత్తవారింటికి వెళ్లాను. అక్కడ రాత్రి సమయంలో నా కూతురు తినకుండా మారాం చేసింది. ఆ సమయంలో నేను ఆ పక్కనే ఉన్నాననే విషయం మరిచిపోయి నా భార్య కూతురును బెదిరించింది. నీ నాయనమ్మను ఉరేసి చంపాను. నిన్ను. మీ నాన్నను కూడా చంపేస్తాను అని బెదిరించింది. వెంటనే వెళ్లి నేను మా అమ్మను ఎందుకు చంపావని తనని నిలదీశా. కోపంతో నన్ను కింద తోసేసింది. అవును మీ అమ్మను చంపాను. నిన్ను చంపుతాను.. ఏంచేస్తావంటూ బెదిరించింది. ఇంట్లోకి తీసుకు వెళ్లి రాత్రి బయటకు రానివ్వలేదు. మరుసటి రోజు 22న ఎలాగోలా బయటకు వచ్చి పరిగికి చేరుకున్నాను. ఇక బతకి ప్రయోజనం లేదని ఆత్మహత్య చేసుకుంటున్నా. అంత్యక్రియలకయ్యే ఖర్చుకు రూ. 500 పక్కింటి వారి దగ్గర ఉన్నాయి తీసుకుని అంత్యక్రియలు జరిపించండి. నా ఇద్దరు కూతుళ్లు నవ్యశ్రీ, సాత్వికలను మా అక్క సంరక్షణలో ఉంచండి. మా అమ్మతో పాటు నా చావుకు కారణమైన నా భార్యను విచారించి శిక్షించి పోలీసులు న్యాయం చేయాలంటూ ముగించాడు. -
కు.ని. క్యాప్సూల్స్ ఇక మగాళ్లే మింగాలి!
‘‘ఎన్నో విషయాల్లో స్త్రీలు సమానత్వాన్ని సాధించారు. కానీ, కుటుంబ నియంత్రణ విషయంలో మాత్రం 99 శాతం భారం స్త్రీలే మోస్తున్నారు. ఈ బాధ్యతని మగవారు కూడా పంచుకోవాలని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కుటుంబ నియంత్రణ మాత్రలు కనుక్కోవాలని ప్రయోగాలు ప్రారంభించి సఫలమయ్యాం’’ అని చెప్పారు షమీమ్ సుల్తానా. తెలంగాణ, వికారాబాద్‌లోని పరిగికి చెందిన షమీమ్ అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటలో ఐదేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. యూనివర్సిటీ పరిశోధనలో భాగంగా పురుషులకు కుటుంబ నియంత్రణ మాత్రలు కనిపెట్టిన శాస్త్రవేత్తల బృందానికి షమీమ్ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచం గుర్తించే పనిలో మన తెలుగు యువతి షమీమ్ సుల్తానా ప్రధాన భూమికగా ఉండటం దేశానికే గర్వకారణం. టీ క్యాంటీన్ నుంచి పరిగి బస్‌స్టాండులో ఓ చిన్న క్యాంటీన్ నడుపుకునే సయ్యద్ మగ్బూల్ కూతురు షమీమ్. ఆయనకు 21 మంది సంతానం. షమీమ్ పదేళ్లు దాటే వరకు బడి గడప తొక్కింది లేదు. క్యాంటీన్లో చాయ్‌లు అందిస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ పెరిగింది. పిల్లలందరినీ చదివిస్తూ ఈమెనొక్కదాన్నే ఇంటిపట్టున ఉంచి పనులు చేయించటం ఎందుకనుకున్న తండ్రి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని సాయంతో షమీమ్ 12వ ఏట నేరుగా 6వ తరగతిలో చేర్చాడు. అప్పటి వరకు పుస్తకాల ముఖం చూడని షమీమ్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అ, ఆ.. లతో మొదలు పెట్టి ఏడాది తిరక్కుండానే అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించి ప్రతిభావంతురాలు అనిపించుకుంది. ఐదేళ్లలోనే 10వ తరగతి పూర్తి చేసి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఆమె పట్టుదలను గుర్తించిన తల్లిదండ్రులు పరిగి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివించారు. ‘బంగారు’ తల్లి పరిగిలో డిగ్రీ కళాశాల లేకపోవటంతో హైదరాబాద్‌లోని వనిత కళాశాలలో చేరింది షమీమ్. మొదట్నించి చురుకుగా ఉండే షమీమ్ డిగ్రీలోనూ మంచి మార్కులతో పాస్ అయింది. పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకున్నప్పటికీ షమీమ్ ప్రతిభను గుర్తించి ఉన్నత చదువుల వైపే మొగ్గు చూపారు తల్లీదండ్రి. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో చేరిన షమీమ్ తన ప్రతిభను మరోసారి రుజువు చేసుకుంది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఇద్దరు గవర్నర్లు రంగరాజన్, రామేశ్వర్ ఠాకూర్ల చేతుల మీదుగా ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడల్ అందుకుంది. ఇదే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంటు కూడా చదువు కొనసాగించటానికి దోహదపడిందని షమీమ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ప్రస్తుత ఐఐసీటీలో పీహెచ్‌డి పూర్తి చేసి డాక్టరేట్ పొందారు. పరిగి టు అమెరికా షమీమ్ పట్టుదల తెలిసినవారంతా ఆమెను ఇంకా చదివిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందన్నవారే. దీంతో ఎంత కష్టమైనా సరే కూతుర్ని విదేశాలలో ఉన్నత చదువులు చదివించాలని నిర్ణయించుకున్నాడు మగ్బూల్. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటలో షమీమ్‌కు పరిశోధనలలో అవకాశం రావడంతో అక్కడకు పంపించాడు. అక్కడే కాలేజ్ ఆఫ్ ఫార్మసి మెడికల్ కెమిస్ట్రీలో పరిశోధనలు ప్రారంభించారు షమీమ్. ఆరుగురు సభ్యుల బృందానికి టీంలీడర్‌గా వ్యవహరిస్తూ అనుకున్న సమయానికి ముందుగానే పరిశోధనలను అధికారుల ముందుంచారు. ‘కుటుంబ నియంత్రణ పాటించేందుకు ఆడవారికి 1960 నుంచే మాత్రలు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత ట్యూబెక్టమీ, డీపీఎల్.. లాంటి ఇతర కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అందుబాటులోకి వచ్చాయి. కుటుంబ నియంత్రణ కోసం మగవారు పాటించే వాసెక్టమి ఆపరేషన్ అందుబాటులో ఉన్నప్పటికీ ఆ ఆపరేషన్ చేయించుకునే వారి సంఖ్య 1 శాతానికి మించిన దాఖలాలు లేవు. కుటుంబ నియంత్రణ బాధ్యత పూర్తిగా మహిళలే మోస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ నియంత్రణ బాధ్యతను పురుషులకు కూడా పంచాలని భావించింది మా శాస్త్రవేత్తల బృందం. ఆపరేషన్ ద్వారా శుక్ర కణాలను నిలిపివేసే కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించటాన్ని పురుషులు అంగీకరించటంలేదనే సత్యాన్ని గ్రహించాం. అందుకే తాత్కాలిక పద్ధతిలో మాత్రలను పురుషులకు పంచితే స్త్రీల ఆరోగ్యం బాగుంటుందని, అంతేకాకుండా మగవారూ దీనిని అంగీకరించి స్వాగతించే అవకాశం ఉందనే అభిప్రాయానికి వచ్చాం. దీంతో పురుషులు వేసుకునే కుటుంబ నియంత్రణ మాత్రలు తయారు చేయాలని నిర్ణయించి పరిశోధనలు ప్రారంభించి, సక్సెస్ అయ్యాం. అధికారిరంగా ఇది వెలుగులోకి రావాల్సి ఉంది’’ అని వివరించారు షమీమ్. మరింత వివరంగా ‘‘ఆఫ్రికాలోని ఓ అరుదైన మొక్కనుంచి లభించే ఒవాబిన్ పదార్థాన్ని గుండె జబ్బులు తగ్గించటంతో పాటు, కొన్ని రకాల రోగాలకూ ఇప్పటికే వినియోగిస్తూ వస్తున్నారు. ఈ పదార్థాన్ని వినియోగించే పురుషుల కుటుంబ నియంత్రణ మాత్రలను తయారు చేయాలని సంకల్పించాం. ఈ మొక్కలోని రసాయనాలు కేవలం శుక్రకణాల్లో మాత్రమే ఉండే ఎక్స్–4 ను అచేతన పరిచి, వాటి పరుగును మందగింపజేస్తుంది. దీంతో శుక్రకణాలు అండంతో ఫలదీకరణ చెందడం ఆగిపోతుంది. అయితే, ఈ ఎక్స్–4.. వృద్ధి చెందిన శుక్ర కణాలను మాత్రమే అడ్డుకుంటుంది. కొత్తగా వృద్ధి చెందే శుక్రకణాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ మాత్రలు వేసుకున్నప్పుడు మాత్రమే కుటుంబ నియంత్రణ జరుగుతుంది. వేసుకోవటం మానేస్తే తిరిగి సంతానాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందవచ్చు. ఈ మాలిక్యూల్ పురుషులకు తాత్కాలిక కుటుంబ నియంత్రణ వ్యవస్థగా ఉపయోగపడనుంది. మా బృందం తయారు చేసిన కుటుంబ నియంత్రణ మాలిక్యూల్‌ను మొదటి దశలో ఎలుకలు, తరువాత దశలో కుందేళ్లపై ప్రయోగించి సఫలీకృతమయ్యాం. ప్రస్తుతం కోతులపై ఈ ప్రయోగం జరుగుతోంది. అనంతరం మనుషులపై ప్రయోగించి ఈ మందును మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ మందు తయారీ విషయంలో ఇప్పటికే మా శాస్త్రవేత్తల బృందం పేటెంట్ హక్కులు సైతం పొందింది’’ అని తెలిపారు షమీమ్ సుల్తానా. ఇష్టపడి చదివాను పరిగి నుంచి అమెరికా వరకు ప్రతి అడుగులోనూ నా తల్లిదండ్రుల కృషి ఉంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ పై చదువులు చదివించారు. ఆడపిల్ల అని వెనుకంజ వేయకుండా అమెరికా యూనివర్సిటీలో చేరడానికి ప్రోత్సహించారు. ప్రపంచ స్థాయి సైంటిస్టుగా గుర్తింపు పొందటానికి మరో అడుగు దూరంలో ఉన్నాను. ఇప్పటికే అమెరికాలోని ప్రసారమాధ్యమాల్లో మా ప్రయోగాలకు సంబంధించిన వార్తలు ఎన్నో వచ్చాయి. – షమీమ్ సుల్తానా, సైంటిస్టు చదువే పరిష్కారం పరిగి బస్‌స్టాండులో 16 ఏళ్లపాటు క్యాంటిన్ నడిపాను. నా కుటుంబం పెద్దది. కుటుంబం బాగుపడాలంటే చదువొక్కటే మార్గమని నమ్మినవాడిని. ఎంత కష్టమైనా ఆడా మగ తేడా లేకుండా పిల్లలందరినీ చదివించాను. టిఫిన్లు, చాయ్‌లు అమ్ముతూనే పిల్లలందరినీ ఉన్నత విద్యావంతులను చేశాను. ఈ రోజు వారందరూ ప్రయోజకులయ్యారు. ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా, వ్యాపారవేత్తలుగా, డాక్టర్లుగా ఇండియాతో పాటు ప్రపంచంలోని ఆయా దేశాల్లో స్థిరపడ్డారు. షమీమ్ సైంటిస్టుగా అమెరికాలో స్థిరపడింది. ప్రస్తుతం పరిగిలోనే ఓ కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాను. నా బిడ్డ సాధించిన విజయానికి నాకెంతో గర్వంగానూ, ఆనందంగానూ ఉంది. -
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
సాక్షి, పరిగి (రంగారెడ్డి): అప్పుల బాధతో చె ట్టుకు ఉరివేసికుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పరిగి మండల పరిధిలోని నజిరాబాద్తండాలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసు లు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నజిరాబాద్తండాకు చెందిన కాళ్యానాయక్కు నలుగురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు సంతోష్ (22) డిగ్రీ మధ్యలో ఆపి త్రండికి తోడు గా ఇంటి పనులు చూసుకుంటున్నాడు. ఇద్దరు అక్కల వివాహం కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో మంగళవారం తెల్లవారు జాము న సంతోష్ పొలానికి వెళ్లి చింతచెట్టుకు ఉరివేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉద యం చింతకాయలు కోసేందుకు పొలానికి వెళ్లిన తండా యువకులు సంతోష్ చెట్టుకు వేలాడుతుండటాన్ని చూసి పరుగున వెళ్లి కుటుంబీకులకు సమాచారం అందించారు. కుటుంబీకులు వచ్చి చూడగా అప్పటికే మృతిచెందాడు. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అందజేశారు. మృతుడి తండ్రి కాళ్యానాయక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
రాజకీయం.. పరిగిడుతోంది!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలో ఎమ్మెల్యే టికెట్ల రేసు మొదలైంది. ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉండటంతో ఆశావహుల సంఖ్య అధికమవుతోంది. ప్రధానంగా పరిగి శాసనసభ టికెట్‌కు పోటీ తీవ్రమవుతోంది. టీఆర్ఎస్ జిల్లా రాజకీయాలన్నీ ప్రస్తుతం దీని చుట్టే తిరుగుతున్నాయి. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అనారోగ్యానికి గురికావడంతో ఆయన కుమారుడు, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న మహేశ్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అధికార పార్టీ తరఫున గత ఎనిమిది నెలలుగా అన్ని బాధ్యతలు మోస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో పక్క నియోజకవర్గాల నేతల కన్ను పరిగిపై పడింది. ఓ పక్క కొప్పుల కుటుంబానికి అనుయాయులుగా ఉంటూనే మరో వైపు టికెట్ రేసులో తాము సైతం ఉన్నామంటూ పావులు కదుపుతూ.. గులాబీ గూటిలో వేడి పుట్టిస్తున్నారు. పరిగి : అధికార పార్టీ తరఫున పరిగి అసెంబ్లీ టికెట్‌పై పలువురు నేతలు కన్నేశారు. నియోజకవర్గంలో ప్రస్తుతం మహేష్‌రెడ్డి టీఆర్ఎస్ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే విద్యా మౌలిక వనరులు, అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్‌గా కొనసాగుతున్న నాగేందర్‌గౌడ్, కుల్కచర్ల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బుయ్యని మనోహర్‌రెడ్డి, గండేడ్ మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు శైలేశ్‌రెడ్డి తదితరులు పరిగి టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని యోచిస్తే.. ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా ఈ స్థానాన్ని ఆశిస్తారని సమాచారం. ఇలా పరిగి టికెట్‌కు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఉనికికోసం ప్రయత్నాలు... తమ ఉనికిని చాటుకోవడం కోసం ఆశావహులు తలోరకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ రేసులో ఉన్న నాగేందర్‌గౌడ్ తనకు సమయం చిక్కినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఒకరిద్దరు స్థానిక బీసీ నేతలతో లోలోపల సత్సంబంధాలు నెరుపుతూ బీసీ కార్డుతో టికెట్ కోసం కృషి చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గం చేవెళ్ల, ప్రస్తుతం నివాసముంటున్న వికారాబాద్ నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్ కావడం, తాండూరులో మంత్రి పాగా వేయడం, కొడంగల్‌లో తనకెలాంటి పట్టు లేకపోవటం, అక్కడి నుంచి ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి సైతం టికెట్ ఆశిస్తుండటంతో నాగేందర్‌గౌడ్‌కు వేరే ప్రత్యామ్నాయం లేక పరిగిపై దృష్టి కేంద్రీకరించారు. ఇక కుల్కచర్ల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మనోహర్‌రెడ్డి సైతం తనకు తెలిసిన వారితో అధిష్టానానికి దగ్గరయ్యే ప్రతయత్నం చూస్తూనే.. సేవా కార్యక్రమాల పేరుతో ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సీనియర్ జర్నలిస్టు శైలేశ్‌రెడ్డి సైతం తనకు అధిష్టానం ఆశీస్సులున్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో నియోజకవర్గ గులాబీ గూటిలో వేడి రాజుకుంది. బలమైన కేడర్... అధికార టీఆర్ఎస్ పార్టీకి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పరిగిలో బలమైన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో అనూహ్య రీతిలో కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఓటమిపాలైనా స్థానిక సంస్థల్లో విజయఢంకా మోగించారు. నియోజకవర్గంలో ఐదింటికి ఐదు జెడ్పీటీసీ స్థానాలు, ఐదింటిలో నాలుగు ఎంపీపీలు, అత్యధిక సర్పంచులు, పీఏసీఎస్‌లు, ఎంపీటీసీ స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని రాజకీయంగా దీటుగా ఎదుర్కొంటూ వస్తున్నారు. మహేష్‌రెడ్డికే అవకాశం... టీఆర్ఎస్ అధిష్టానం, పార్టీ, ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం నిర్వహించినా మహేశ్‌రెడ్డి పర్యవేక్షణలోనే కొనసాగుతోంది. పలువురు నేతలు టీఆర్ఎస్ పరిగి టికెట్ కోసం పావులు కదుపుతుండగా.. నియోజకవర్గంలోని కేడర్ మాత్రం హరీశ్వర్‌రెడ్డి కుటుంబానికే మద్దతుగా నిలుస్తోంది. ఆయన అనార్యోగానికి గురై.. మహేశ్‌రెడ్డి కీలకంగా వ్యవరించడానికి పట్టిన సంది కాలంలోనూ పార్టీ శ్రేణులు మాత్రం హరీశ్వర్‌రెడ్డికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చాయి. ప్రస్తుతం వీరంతా టికెట్ రేసులో ముందున్న మహశ్రెడ్డిని అనుసరిస్తున్నారు. హరీశ్వర్‌రెడ్డి కోలుకున్నప్పటికీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం మాత్రం ఇతని తనయుడికే ఎక్కువగా ఉన్నాయి. రైతు సమన్వయ సమితి పగ్గాలు చేపట్టిన రోజు నుంచి మహేశ్‌రెడ్డి సైతం నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఒక్కో రోజు పదికి మించి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు చేరువయ్యేందుకు శ్రమిస్తున్నారు. ఒకవేళ హరీశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే.. మంత్రివర్గం కూర్పులో మహేందర్‌రెడ్డికి పోటీ అయ్యే అవకాశం ఉంది. దీంతో హరీశ్వర్‌రెడ్డి కాకుండా.. మహేశ్‌రెడ్డి బరిలో నిలిస్తే.. మహేందర్‌రెడ్డి సైతం మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పరిగి నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా మహేష్‌రెడ్డికే ఉన్నాయనడంలో సందేహంలేదు. -
పరిగిలో వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభం
పరిగి వికారాబాద్ : పార్టీ నాయకులు ఎల్లవేళలా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ స్ఫూర్తితో పేదల పక్షాన నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మతిన్ సూచించారు. పరిగిలోని శ్రీనివాసనగర్ కాలనీలో పార్టీ పరిగి నియోజకవర్గ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల పక్షాన నిలబడే వారికి గుర్తింపు ఉంటుందని.. వారిని ప్రజలే ఆదరిస్తారని తెలిపారు. ఇది వైఎస్సార్ నిరూపించారని గుర్తుచేశారు. నేటికి ఆయన ప్రజల గుండెల్లో ఉండడమే దానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షు డు కోళ్ల యాదయ్య, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అహ్మద్ ఖాద్రీ, అధికార ప్రతినిధి నరేందర్ పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం
పరిగి: మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని జాపర్‌పల్లిలో నిర్మించిన మెయిన్ గ్రిడ్ ట్రయల్ రన్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. అంతకుముందు గ్రామంలోని అంబేడ్కర్, జ్యోతిరావుపూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జాపర్‌పల్లి నుంచి తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు రూ,1,100 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయని ఆనందం వ్యక్తంచేశారు. త్వరలోనే ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతుందని స్పష్టంచేశారు. మహిళల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగేలా అనేక పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి తిరుగులేదని తెలిపారు. ఆయనతో పాటు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొప్పుల మహేశ్‌రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. మానవ హక్కుల సంఘం కృషి అభినందనీయం... తాండూరు: హక్కుల పరిరక్షణకు.. మానవ హక్కుల సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తాండూరులోని సమద్ ఫంక్షన్హాల్లో ఆదివారం ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఫోరం ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కుల సంఘం ఏర్పాటుచేసి ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయమన్నారు. పౌర హక్కులకు భంగం కలిగితే మానవ హక్కుల సంఘాలు కాపాడతాయన్నారు. ప్రజలు సేవాభావాలను అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర అంతర్జాతీయ పీస్ అంబాసిడర్ ఎం.ఎ.నజీబ్ మాట్లాడుతూ.. దేశంలో కులమతాలకతీతంగా మెలిగినప్పుడే శాంతి స్థాపన సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ సునీత, అసోషియేషన్ చైర్మన్ ఎం.ఎ.ముజీబ్ పటేల్, హైకోర్టు న్యాయవాది కదర్‌ఉన్నీసా, వెల్ఫేర్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు గులాం ముస్తఫా పటేల్, తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ జుబేర్‌లాల, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్, మాజీ కౌన్సిలర్ ముక్తర్ తదితరులు ఉన్నారు. -
పాఠాలు బోధిస్తూ కుప్పకూలిన ఉపాధ్యాయుడు
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్) : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకుడిగా పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ చారి (32) పాఠాలు బోధిస్తూనే గుండెపోటుతో మృతిచెందారు. కళాశాల వర్గాలు తెలిపిన వివరాలు ప్రకారం.. సుభాష్ చంద్రబోస్ చారి రోజులాగే బుధవారం విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా గుండె పోటుకు గురయ్యాడు. వెంటనే తోటి అధ్యాపకులు పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో డాక్టర్ ఆయనను పరిశీలించి ఇంజెక్షన్ ఇచ్చాడు. కొద్దిసేపటికి నొప్పి అధికం కాగా సుభాష్ చంద్రబోస్ మృతి చెందాడు. అయితే తోటి అధ్యాపకులు హుటాహుటిన జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు సుభాష్ చంద్రబోస్ చారి వికారాబాద్ జిల్లా పరిగి గ్రామానికి చెందిన వారు. ఆయనకు భార్య, కూతురు, 8 నెలల బాబు ఉన్నారు. సుభాష్‌చంద్రబోస్ మృతి తెలియగానే ఆయన కుటుంబసభ్యులు, బంధువులు పరిగి నుంచి బయలుదేరి రాత్రికి నిజామాబాద్ ఆస్పత్రికి చేరుకున్నారు. అధ్యాపకులు, విద్యార్థుల కంటతడి.. డిచ్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ జువాలజీ విభాగంలో సుభాష్ చంద్రబోస్ 2012 లో కాంట్రాక్టు అధ్యాపకుడిగా చేరాడు. నాణ్యమైన బోధన అందిస్తూ విద్యార్థులకు చేరువయ్యారు. ఆయన మృతిని చూసి తట్టుకోలేకపోయిన అధ్యాపకులు, విద్యార్థులు కంట తడి పెట్టారు. ఒత్తిడితోనే గుండెపోటు..? సొంత జిల్లాకు బదిలీ చేయాలని సుభాష్ చంద్రబోస్ ఉన్నతాధికారులకు పలు మార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భార్యాపిల్లలకు దూరంగా ఉండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతిచెందారని తోటి అధ్యాపకులు వాపోయారు. మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ప్రిన్సిపాల్ రామదాస్, అధ్యాపకులు కోరుతున్నారు. -
సరదాగా కాల్చేస్తుండ్రు!
బడాబాబుల కాల్పుల సరదా మూగజీవుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. పూడూరు మండల పరిధిలోని ఫాంహౌస్‌ల సమీపంలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో నాటు తుపాకీతో కుక్కలను కాల్చి.. ఈ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వేటగాళ్లు..అప్పట్లో సంచలనం సృష్టించారు. గత శనివారం మళ్లీ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎన్కెపల్లి శివారులో కాడెద్దుపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సంపన్న వర్గాలకు చెందిన వారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుండటంతో పోలీసులు, అధికారులు అటువైపు తొంగి చూడటం లేదు. రక్తం మరిగిన పులుల్లా గన్ కల్చర్‌కు అలవాటుపడిన దుండగులు మనుషులపై ఎక్కుపెట్టే రోజు రాకముందే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిగి : అసాంఘిక కార్యకలాపాలు, కాల్పుల సంఘటనలు జరిగిన సమయంలో హల్చల్ చేస్తున్న పోలీసులు ఆ తర్వాత మిన్నకుండిపోతున్నారు. ప్రధాన కేసులన్నీ ఇలాగే నీరుగారుతుండటం.. వీరి పని తీరుపై విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులన్నింటిలో బడాబాబులు, ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధుల హస్తం ఉంటుండటంతో పోలీసుల విచారణ సైతం ఎక్కడో ఒక చోట ఆగిపోతోందనే ఆరోపణలున్నాయి. సరదా కోసం కొందరు బడాబాబులు గన్‌తో కుక్కలు, ఎద్దులను వేటాడి చంపుతున్న ఘటనలు చోటుచేసుకోవడం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరు మండల పరిసరాలు దీనికి వేదికవుతున్నాయి. కాల్పల ఘటనలే కాకుండా అసాంఘిక కార్యకలాపాలు, నేరస్తులు తలదాచుకోవటం తదితర కార్యకలాపాలకు ఈ ప్రాంతం అడ్డాగా మా రిందని ప్రజలు చెబుతున్నారు. ఇది తమను ప్ర మాదంలో పడేస్తోందని ఆవేదన వ్యక్తంచేసు ్తన్నా రు. ఏడాది క్రితం తుపాకీతో కుక్కలను వేటాడి.. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంఘటన జరిగి ఏడాదిన్నర కావస్తుండగా.. సరిగ్గా ఇలాంటి సంఘటనే మళ్లీ జరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఎద్దును గన్‌తో కాల్చి చంపి కళేబరాన్ని మాయం చేసిన ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కుక్కల వేట.. కొందరు బడా బాబులు తమ సరాదా కోసం అటుగా వెళ్లే పెంపుడు కుక్కలను గన్‌తో వేటాడి చంపారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ విషయం రెడ్‌క్రాస్ సొసైటీ దృష్టికి వెళ్లడంతో.. కేంద్ర మంత్రి మేనకాగాంధీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందో వివరాలు సేకరించాలని ఆమె సొసైటీ ప్రతినిధులకు సూచించారు. పోలీసుల సహకారంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సంఘటన జరిగింది పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ సమీపంలోని ఓ ప్రైవేటు ఫాంహౌస్‌లో అని ప్రా థమి కంగా గుర్తించారు. అనంతరం చన్గొముల్ పోలీసులను ఆశ్రయించటంతో వారు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత చేవెళ్ల డీఎస్పీ శృతకీర్తి రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులతో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కానీ ఇప్పటి వరకూ దీనిపై చార్జిషీట్ వేయలేదు. తాజాగా ఎద్దుపై కాల్పులు.... తాజాగా గన్‌తో ఎద్దుపై కాల్పులు జరిపి చంపిన ఘటన స్థానికంగా మరో సారి సంచలనం రేపింది. పూడూరు మండల పరిధిలోని ఎన్కెపల్లి శివారులో ఎద్దుపై తుపాకితో కాల్పులు జరపగా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే ఈ విషయమై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాధిత రైతు ముందుగా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. కాల్పులకు పాల్పడిన వ్యక్తులు ఎద్దును కొనిస్తామని చెప్పడంతో అతను మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మృతిచెందిన ఎద్దును వెంటనే అక్కడ నుంచి మాయం చేశారు. స్థానికుల్లో ఆందోళన... కాల్పుల ఘటనలకు పాల్పడింది బడాబాబులు, పలుకుబడి, ఆర్థికంగా బాగా ఉన్న వారు కావటంతో కేసు ముందుకు సాగటంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పై నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగానే ఈ కేసు దర్యాప్తులో పురోగతి కనిపించటంలేదని సమాచారం. ఏది ఏమైనా.. గన్ కల్చర్ మంచిది కాదని.. ప్రభుత్వం, పోలీసులు ఈ సంఘటనను కుక్కలు, పశువులపై వేటగానే చూడకుండా తీవ్రంగా పరిగణించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీరిని ఉపేక్షిస్తే మున్ముందు మరిన్ని దుర్ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని పేర్కొంటున్నారు. ఫిర్యాదు అందలేదు ఇటీవల ఎద్దుపై తుపాకీతో కాల్పులు జరిపి చంపేశారనే విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా కేసు నమోదు చేసి విచారణ చేస్తాం. గతంలో గన్‌తో కుక్కలను వేటాడిన కేసుకు సంబంధించి పురోగతి సాధించాం. త్వరలోనే దీనిపై చార్జిషీటు వేస్తాం. – శ్రీనివాస్, డీఎస్పీ, పరిగి -
అధికారుల నిర్లక్ష్యం..బాలుడి మృతి
వికారాబాద్ జిల్లా: పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట్ గ్రామంలో విషాదం అలుముకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ తల్లికి శోకం మిగిల్చింది. గ్రామంలో గత కొన్ని రోజులుగా హైవోల్టేజీ సమస్య ఉంది. ఈ విషయం గురించి గ్రామస్తులు పలుమార్లు విద్యుత్ విభాగ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. అయితే శనివారం గ్రామానికి చెందిన ఓ బాలుడికి ఇంట్లో రైస్ కుక్కర్ నుంచి అన్నం తీస్తున్న సమయంలో హైవోల్టేజీ కారణంగా కరెంటు సరఫరా జరిగి షాక్ కొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గత రెండు రోజులుగా గ్రామంలో హైవోల్జేజీ కారణంగా పలు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా దగ్ధమైయాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ఒక్క చెరువూ నింపలేకపోయారు
సాక్షి, పరిగి : ‘ఒక్క చెరువునూ నీటితో నింప లేకపోయారు. రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన టీడీపీని బంగాళాఖాతంలో కలిపేయండి’ అంటూ ప్రజలకు వైఎస్సార్సీపీ అనంతపురం, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తలు తలారి రంగయ్య, నదీం అహమ్మద్, పెనుకొండ సమన్వయకర్త ఎం.శంకరనారాయణ పిలుపునిచ్చారు. పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి మండలంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.శంకరనారాయణ నేతృత్వంలో చేపట్టిన రెండు రోజుల పాదయాత్ర ప్రారంభత్సోవానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మండలంలోని కొడిగెనహళ్లి శ్రీఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర శాసనకోట, నేతులపల్లి, సంగమేశ్వరంపల్లి, ఊటుకూరు, యర్రగుంట, తిరుమలదేవరపల్లి, విట్టాపల్లి వరకూ 16 కిలోమీటర్ల మేర సాగింది. పరిగి మండలంలోని అన్ని చెరువులకూ నీరందించాలని, రైతులకు పంట వేయక మందే ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించాలనే డిమాండ్లపై ప్రజలను చైతన్య పరుస్తూ చేపట్టిన పాదయాత్రకు అన్ని గ్రామాల్లో ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఊటుకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నదీం అహమ్మద్, రంగయ్య మాట్లాడుతూ.. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతుంటే ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుందని విమర్శించారు. మోసపూరిత వాగ్ధానాలతో మరోసారి ముందుకు వస్తారని, వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ కూడగట్టుకున్న అవినీతి సొమ్మంతా ప్రజలదేనని ఎన్నికల్లో ఎంత డబ్బిచ్చినా తీసుకుని విలువైన ఓటు హక్కుతో సీఎం చంద్రబాబును సాగనంపాలని కోరారు. ఇసుక దగ్గర నుంచి ఇండస్ట్రీస్ వరకూ అన్నింటా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. శంకరనారాయణ మాట్లాడుతూ... నియోజకవర్గంలోని ప్రతి చెరువుకూ హంద్రీనీవా కాలువ ద్వారా నీరందిస్తామన్న ఎమ్మెల్యే బీకే పార్థసారథి.. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క చెరువునూ నింపలేకపోయారని అన్నారు. హంద్రీ–నీవా పనుల్లో కమీషన్ల కోసం కక్కుర్తిపడి టీడీపీని ఓ దొంగల పార్టీగా మార్చేశారన్నారు. కనీసం రేషన్‌కార్డుల మంజూరులో కూడా నిబద్ధత చూపలేకపోయారన్నారు. చెరువులకు నీరిమ్మంటే అవే చెరువులను పెత్తందార్లకు అమ్మేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేనురాను బిడ్డో..!
పరిగి వికారాబాద్ : సర్కారు దవాఖానాలపై ప్రజలు రోజురోజుకు నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఆస్పత్రులపై నమ్మకాన్ని పాదుగొల్పేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలేవీ పెద్దగా ఫలితాలనివ్వటంలేదు. చివరకు పేద నిరుపేదలు సైతం ప్రభుత్వ ఆస్పత్రులకు దూరమవుతున్నారు. మందుబిల్లల కోసమో.. సూదిమందు కోసమో అయితే ప్రభుత్వాసుపత్రి పరవాలేదనుకుంటున్నారు కాని .. ఆస్పత్రిలో అడ్మిట్ కావటం, కాన్పులు లాంటివి చేసుకోవటమంటే జంకుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిని నమ్మి తమ జీవితాలను ఫణంగా పెట్టలేమని చెప్పకనే చెబుతున్నారు. సర్కారు దవఖానాల్లో ఆయా వైద్యం కోసం వచ్చి వెళుతున్న రోగుల గణాంకాలే ఈ విషయాలను నిరూపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సహకాలు ప్రకటించినా.. కేసీఆర్ కిట్లు ఇస్తున్నా.. కాన్పుల సంఖ్య పెరగటంలేదు. ప్రధానంగా ప్రభుత్వ దవాఖానాలకు పాయిజన్ కేసులు, ప్రమాదాలు జరిగే సమయంలో ప్రథమ చికిత్సలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు తప్పిస్తే సాధారణ రోగాలతో ఎవరూ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరటంలేదు. ప్రసవాలు అంతంతే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల కోసం చేరుతున్న వారి సంఖ్య మొత్తం కాన్పుల్లో 20 శాతం కూడా ఉండటంలేదు. 70నుంచి 80 శాతం వరకు ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. పేదలు సైతం అప్పు చేసైనా ప్రైవేటు ఆస్ప్రతుల్లోనే చేరుతున్నారు. ఇప్పటికీ గ్రామీణ, గిరిజన తండాల్లో 10 శాతానికి పైగా ఇళ్ల వద్దే కాన్పులు అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు పరిగి మండలంలో ప్రతి నెలా కొత్తగా 300 నుంచి 400 వరకు గర్భిణులు నమోదవుతున్నారు. ఇదే క్రమంలో నెలలో సరాసరి 300 పై చిలుకు మహిళలు ప్రసవిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో సగటున 50 మించి కాన్పులు కావడంలేదు. కేసీఆర్ కిట్ పథకం ప్రాభుత్వం ప్రారంభించక ముందు పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు నెలల్లో 246 కాన్పులు కాగా.. పథకం ప్రారంభించాక ఆరు నెలల్లో 240 కాన్పులు జరిగాయి. పరిగి లాంటి క్లస్టర్ స్థాయి ఆస్పత్రిలో మహిళా వైద్య నిపుణులు లేకపోవటం కూడా ప్రసవాల తగ్గుదలకు కారణమని స్పష్టమవుతోంది. మండల కేంద్రాల్లోని దవఖానాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ప్రతి సర్కారు డాక్టర్‌కు ప్రైవేటు క్లీనిక్ ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యుల్లో 90శాతానికి పైగా వారి సేవలను ప్రైవేటు ఆస్పత్రులకు అందిస్తున్నారు. ఇందులో కొందరు నర్సింగ్ హోంలు నిర్వహిస్తుండగా మరి కొందరు క్లీనిక్‌లు, వేరే ప్రైవేటు ఆస్పత్రులలో పనిచేయం సర్వసాధారణమైపోయింది. పరిగిలో ప్రధానంగా పది క్లీనిక్‌లు, నర్సింగ్ హోంలలో ఒకటి రెండు మినహా అన్నింటిలోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులే నిర్వహిస్తుండటం గమనార్హం. ఓ రకంగా చెప్పాలంటే గుర్తింపుకోసమే వారు ప్రభుత్వ ఆస్పత్రులలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం లక్షలు వెచ్చించి పంపిణీ చేస్తున్న వైద్య పరికరాలు సైతం చిన్నచిన్న కారణాలతో మూలకు పడేస్తున్నారు. పర్యవేక్షణ గాలికి.. ప్రభుత్వ ఆస్పత్రుల పర్యవేక్షణ పూర్తిగా గాలికొదిలేశారు. గతంలో క్లస్టర్ స్థాయిలో ఎస్పీహెచ్ఓ పేరుతో ప్రతి క్లస్టర్‌కు ఒక పర్యవేక్షణాధికారి ఉండేవారు. తెలంగాణా ప్రభుత్వం చిన్న జిల్లాలతో పాలన ప్రజలకు చేరువవుతుందంటూ ఊదరగొడుతూనే జిల్లాకో డీఎంఅండ్ హెచ్ఓను నియమించి క్లస్టర్ స్థాయి ఎస్పీ హెచ్ఓ పోస్టులకు ఉద్వాసాన పలికింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పర్యవేక్షణ కరువైంది. వైద్యులు, వైద్య సిబ్బందికి తమనడిగేవారెవరున్నారులే అని అడిందే ఆట పాడిందే పాటగా తయారయ్యింది. -
సారూ..నా భర్తను విడిపించండి
పరిగి : పోలీసులు అరెస్టు చేసిన తన భర్తను విడిపించాలని పరిగి మండల పరిధిలోని జాఫర్‌పల్లికి చెందిన పద్మ అనే మహిళ మంత్రి మహేందర్‌రెడ్డికి విన్నవించింది. మంగళవారం మండల పరిధిలోని జాఫర్పల్లిలో ఏర్పాటు చేసిన గోదాముల ప్రారంభోత్సవానికి మంత్రి విచ్చేయగా ఆయనకు మొరపెట్టుకుంది. అయితే మంత్రి వచ్చే కంటే ముందే గోదాములు నిర్మించిన సమయంలో చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జాఫర్‌పల్లికి చెందిన పీఏసీఎస్ డైరక్టర్ లాల్‌కృష్ణ ప్రసాద్ మంత్రి కార్యక్రమానికి ముందు హల్చల్ చేశాడు. తనతో పాటు గ్రామస్తులకు చేసిన పనులు, మెటీరియల్‌కు సంబంధించి కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వాలని పేర్కొన్నాడు. డబ్బులు ఇవ్వకుండా గోదాములు ప్రారంభిస్తే తమ డబ్బులు ఎవరిస్తారని అక్కడే ఉన్న కాంట్రాక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న కొందరు టీఆర్ఎస్ నాయకులు కల్పించుకుని మంత్రి కార్యక్రమంలో గొడవ చేయొద్దని ఏమైనా ఉంటే తరువాత చూసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో వాగ్వాదం ఎక్కువైంది. మరికొద్దిసేపట్లో మంత్రి వస్తాడనగా పోలీసులు లాల్‌కృష్ణను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తలరించారు. కొద్దిసేపటికే మంత్రి రావటంతో లాల్‌కృష్ణ ప్రసాద్ భార్య తన భర్తను విడిపించాలని మంత్రిని కలిసి మొరపెట్టుకుంది. పోలీసులతో మాట్లాడతానని మంత్రి చెప్పి కార్యక్రమం ముగించుకని వెళ్లి పోయారు. ఇద్దరిపై కేసు నమోదు మంత్రి పర్యటన సమయంలో కాంట్రాక్టర్‌ను బెదిరించటంతో పాటు అతనితో గొడవకు దిగారనే కారణంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయటంతో పాటు వారిపై కేసు నమోదు చేశారు. జాఫర్‌పల్లికి చెందిన లాల్‌కృష్ణప్రసాద్, అదే గ్రామానికి చెందిన వెంకటయ్యలపై కేసు నమోదు చేశామని ఎస్సై కృష్ణ తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. -
సంతానం లేదని వివాహిత ఆత్మహత్య
పరిగి : సంతాన భాగ్యానికి నోచుకోలేకపోయానని మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని బిందూనగర్‌కు చెందిన గాజుల వ్యాపారి నాగబూషణకు కర్ణాటక రాష్ట్రం దొమ్మతమర్రికి చెందిన చంద్రకళ(27)తో పదేళ్ల క్రితం వివాహమైంది. ఇన్నేళ్లయినా వీరికి సంతానం కలగలేదు. చివరకు టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నం చేశారు. వైద్యపరీక్షల్లో గర్భసంచి దెబ్బతినిందని తేలింది. పిల్లలు కలిగే అవకాశం లేదని వైద్యులు స్పష్టం చేశారు. మానసికంగా కుమిలిపోయిన చంద్రకళ శనివారం సాయంత్రం భర్త లేని సమయంలో పైకప్పు ఇనుపతీరుకు చీరతో ఉరివేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఇంటికొచ్చిన భర్త గమనించి ఇరుగుపొరుగు సాయంతో ఆమెను కిందకు దింపి హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆదివారం ఉదయం సమాచారం అందడంతో పోలీసులు గ్రామానికెళ్లి ఆరా తీశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెడ్‌కానిస్టేబుల్ షర్ఫుద్దీన్ తెలిపారు. -
సోదరుడు ఫోన్ లాక్కున్నాడని..
పరిగి: సోదరుడు ఫోన్ లాక్కున్నాడని మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని ఖుదావంద్‌పూర్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నసీర్ కూతురు నౌసిన్బేగం(17) పరిగిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో ఏడాది చదువుతోంది. ప్రస్తుతం దోమ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షిక పరీక్షలు రాస్తుంది. బుధవారం పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అయితే, మంగళవారం ఆమె ఇంట్లో చదువుకుంటుంది. ఈక్రమంలో నౌసిన్బేగం తన అన్న ఫోన్ తీసుకుని స్నేహితురాలితో మాట్లాడింది. విషయం గమనించిన ఆయన ‘తెల్లారితే పరీక్ష పెట్టుకుని ఫోన్‌తో ఆటలేంట’ని మందలించి నౌసిన్బేగం నుంచి ఫోన్ లాక్కుని బయటకు వెళ్లిపోయాడు. మృదుస్వభావి అయిన ఆమె మనస్తాపానికి గురై ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబీకులు స్థానికుల సాయంతో మంటలు ఆర్పి వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 80 శాతం శరీరం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స నిర్వహించి ఉస్మానియాకు రెఫర్ చేశారు. చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్న నౌసిన్బేగం నుంచి న్యాయమూర్తి భారతి వాగ్మూలం సేకరించారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా విద్యార్థిని మార్గంమధలో మృతి చెందింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. -
విద్యతోనే ఖైదీల్లో సత్ప్రవర్తన
పరిగి: ఖైదీలు ప్రతిఒక్కరూ చదువుకోవాలని ఎస్పీ అన్నపూర్ణ సూచించారు. శుక్రవారం రాత్రి ఆమె పరిగి సబ్‌జైల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలతో ఆమె మాట్లాడారు. జైలులో అందుతున్న సదుపాయాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఆమె ఖైదీలకు పలకలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ అన్నపూర్ణ మాట్లాడుతూ.. ఖైదీలు ప్రతిఒక్కరూ విద్యావంతులు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. చదువుకుంటేనే సమాజంలో ఏది మంచో.. ఏది చెడో తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. చదువు మనకు విజ్ఞానాన్ని అందజేస్తుందన్నారు. చదువుతోనే మనం నాగరికులుగా మారగలమని వివరించారు. ఈ భూ ప్రపంచంలో మిగతా ప్రాణుల మనిషిని ఉన్నతస్థాయిలో నిలిపింది చదువేనని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మనిషి విద్యావంతుడైనప్పుడు ఆత్మగౌరవం పెరుగుతుందని ఆమె వివరించారు. జైలులో ఉన్న ప్రతిఖైదీ చదువుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ అన్నపూర్ణ సూచించారు. ఇక్కడ నేర్చుకున్న చదువును తమ ఇళ్లకు వెళ్లిన తర్వాత కొనసాగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అశ్ఫక్, ఎస్ఐ కృష్ణ, జైలు సూపరింటెండెంట్ తిర్మల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ గదిలో మృతదేహం
పరిగి(పెనుకొండ) : పరిగిలోని సాంఘిక సంక్షేమ వసతి గహం (హాస్ట ల్) గదిలో గుర్తు తెలియని ఓ వద్ధుడి(60) మృతదేహాన్ని శనివారం కనుగొన్నట్లు ఎస్ఐ అంజనయ్య తెలిపారు. హాస్టల్ లోపలి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తమకు సమాచారం అందించారన్నారు. వెంటనే తమ సిబ్బందితో అక్కడికెళ్లి చూడగా.. మృతదేహం ఉందన్నారు. అయితే బాగా ఉబ్బిపోయి ఉండడంతో గుర్తు పట్టేందుకు కూడా వీల్లు కాలేదన్నారు. మతుడు ఇదే ప్రాంతంలో పగలంతా భిక్షాటన చేసి, రాత్రిళ్లు హాస్టల్‌కు వచ్చి నిద్రపోయేవాడని పేర్కొన్నారు. రెం డు, మూడు రోజుల కిందట చనిపోయి ఉంటాడని, అది అనారోగ్యంతో అయి ఉంటుందని భావిస్తున్నారు. గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో... గుత్తి(గుంతకల్లు) : గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. మతుడు ఎవరైందీ తెలియరాలేదన్నారు. అతని వయస్సు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని వివరించారు. వారం రోజులుగా ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో సంచరిస్తుండేవాడని స్థానికులు చెప్పారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకని విచారిస్తున్నట్లు తెలిపారు. -
ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్
– గొల్లపల్లి ప్రాజెక్టు వైఎస్ ఘనత – రైతు ధర్నాలో జిల్లా అధ్యక్షులు శంకర్‌నారాయణ పరిగి : రెండేళ్లుగా ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ప్రకటించకుండా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ అన్నారు. రైతులకు ఇంత వరకూ ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై శుక్రవారం పరిగి తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాయలసీమను పట్టి పీడిస్తున్న కరువును శాశ్వతంగా పారద్రోలేందుకు నడుం బిగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం వల్లే గొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తయిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ పేర్కొన్నారు. రాయలసీమను పట్టి పీడిస్తున్న కరువును శాశ్వతంగా పారద్రోలడంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం వల్లే గొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తయిందన్నారు. హంద్రీ–నీవా కాలువ పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయినా ప్రస్తుత ప్రభుత్వం తూతూ మంత్రంగా నీరు తెప్పించి మొత్తం తామే సాధించినట్లుగా గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. దమ్ముంటే పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలని సవాల్ విసిరారు. జిల్లాలో సుమారు 10లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే కేవలం 2 లక్షల మందికి మాత్రమే అరకొరగా రుణమాఫీ జరిగిందన్నారు. జిల్లాలో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారందరికీ ధైర్యాన్ని నింపుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టారన్నారు. కానీ, టీడీపీ నాయకులు ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోలేదన్నారు. ప్రభుత్వ పథకాలు టీడీపీ కార్యకర్తలకే అందుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రుణాలను కూడా జన్మభూమి కమిటీల్లో రాబందుల్లా దోచుకుతింటున్నారని దుయ్యబట్టారు. కుమారుడిపై ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజలపై లేదన్నారు. ధనార్జనే ధ్యేయంగా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల సొమ్మును కాజేస్తుంటే కంచే చేను మేసిన చందంగా ఉందని, ఇక రైతాంగాన్ని ఎలా కాపాడుతారన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ సుబ్బారెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో పరిగి మండల కన్వీనర్ జయరాం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మారుతీశ్వర్‌రావు, అరుణ్‌రెడ్డి, నారాయణరెడ్డి, నరసింహారెడ్డి, మూర్తి, బాలు, మోహన్, నాగేంద్రరెడ్డి, ఎస్సీ సెల్ శంకరప్ప, మహిళా నాయకురాలు చౌడమ్మ, కిరణ్, మల్లికార్జున, తిమ్మారెడ్డి, రామాంజి, హర్షారెడ్డి, మల్లికార్జున, అనిల్, నరేష్, శివ, గణేష్, వెంకటేష్, ఈశ్వరప్ప, తదితరులు పాల్గొన్నారు. -
ఇసుకదిన్నె పడి కూలీ మృతి
పరిగి (పెనుకొండ రూరల్) : పరిగి మండలం కోనాపురం సమీపంలో సోమవారం ఇసుక దిబ్బపడి కూలీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మణేసముద్రం గ్రామానికి చెందిన గౌరప్ప(48) దినసరి కూలీ. సోమవారం ట్రాక్టర్ పనులకు వెళ్లాడు. ట్రాక్టరుకు ఇసుక లోడు వేసి కూలీలు పంపారు. అనంతరం ఇసుకను కింది భాగంలో ఒక చోటుకు చేర్చుతుండగా పైనుంచి ఒక్కసారిగా ఇసుకదిన్నెలు విరిగి మీద పడటంతో గౌరప్ప ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'దుర్భాషలాడిన ఎమ్మెల్యేను తొలగించండి'
కరెంటు బిల్లు కట్టనందుకు పవర్ కట్ చేసిన లైన్మెన్ను దుర్భాషలాడిన పరిగి ఎమ్మెల్యే టీ రాం మోహన్ రెడ్డిను కాంగ్రెస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన్ మైనార్టీల సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి శుక్రవారం బహిరంగ లేఖ రాసింది. పార్టీకి చెందిన కొంతమంది నేతలు బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారని.. ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్న దళిత బహుజన్లు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని లేఖలో పేర్కొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న బహిరంగ సభలు విఫలమవడానికి ప్రధానకారణం పరిగి ఎమ్మెల్యే రాం మోహన్ రెడ్డేనని చెప్పింది. ఒక సామాజికవర్గానికి రాం మోహన్ కొమ్ముకాయడం వల్లే చీలికలు వస్తున్నాయని పేర్కొంది. ఆయన ప్రవర్తన కారణంగా పార్టీలోని సీనియర్ నాయకులంతా వలసపోతున్నారని.. దళితల బహుజనుల సంగతి ప్రత్యేకంగా చెప్పవసరం లేదని లేఖలో తెలిపింది. రాష్ట్రంలో పార్టీ పరిస్ధితి అధిష్టానం దృష్టికి తీసుకురాకతప్పడం లేదని.. పరిస్ధితి చేయిదాటిపోతోందని పేర్కొంది. గురువారం విధి నిర్వహణలో ఉన్న వ్యక్తిని కులం పేరుతో రాం మోహన్ రెడ్డి దూషించారని తెలిపింది. ఎమ్మెల్యేను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. -
ఐక్యతతోనే రాణింపు
పరిగి (పెనుకొండ రూరల్) : ఐక్యత ఉన్నప్పుడే ఏరంగంలో నైనా రాణించ గలమని మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, గురునాథ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రజాకవి యోగివేమన శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. యువతరం పోటోలు, సెల్ఫీలపై దృష్టి పెట్టకుండా రాజ్యధికారం కోసం ముందుండి నడిపించాలన్నారు. దీనివల్ల పది మందికి సాయం చేయవచ్చునన్నారు. అనైక్యత అభివృద్ధి నిరోధకమన్నారు. కర్ణాటక డిప్యూటీ స్పీకర్ శివశంకరరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ తోపుదుర్తి కవిత, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ శివశంకరరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రజల బాధ్యతను సరళ భాషలో విశదీకరించిన మహనీయుడు వేమన అని కొనియాడారు. రెడ్డి వర్గీయులు పార్టీల కతీతంగా భావితరాలకు అభివృద్ధి చిహ్నంగా ఉండాలన్నారు. అంతకుముందు వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజాకవి యోగివేమన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రెడ్డి సంక్షేమ కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేసి శంకుస్థానన న చేశారు. స్థలదాత ఆదినారాయణరెడ్డి, గౌరిబిదనూర్ మాజీ ఎమ్మెల్యే అశ్వర్థనారాయణరెడ్డి, మడకశిర మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకరరెడ్డి, ఏడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ ఆనందరంగారెడ్డి, ఇండిన్ ఒలిపిక్ అసోషియేసన్ అధ్యక్షులు జేసి పవన్‌కుమార్‌రెడ్డి, పెనుకొండ మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటరామిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి మారుతీరెడ్డి తదితర నాయకులు,రెడ్డి సామాజికవర్గంవారు పాల్గొన్నారు. -
కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షడు శంకరనారాయణ పరిగి(పెనుకొండ రూరల్) : ఆర్థికంగా వెనుకబడిన కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని భీరలింగేశ్వరస్వామి ఆలయం వద్ద కురుబ కులస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కురుబలను ఎస్టీల్లో చేరుస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ ...ఆ తర్వాత ఆ విషయాన్నే మరిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే పార్థసారథి కూడా కురుబలను పూర్తిగా విస్మరించారన్నారు. కురుబలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే విద్యతోనే అది సాధ్యమని, అందువల్ల కురుబలంతా తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలను చదివిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లేనన్నారు. కురుబలు కర్ణాటకలో ఎస్టీ జాబితాలో ఉన్నారనీ, రాష్ట్రంలో కూడా ఎస్టీ జాబితాలో చేర్చేలా సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కేటీ శ్రీధర్, వైఎస్సార్సీపీ బీసీ సెల్ నాయకులు వెంకటరమణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు పరిగిలో కనకదాసు జయంతి
హిందూపురం రూరల్ : పెనుకొండ తాలూకా పరిధి పరిగి మండల కేంద్రంలో ఆదివారం భక్త కనకదాస జయంతి మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు. పరిగిలోని బీరలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు బైక్‌ర్యాలీ, 9 గంటలకు మహిళలతో జ్యోతుల ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపులో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. ముఖ్య అతిథులుగా పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ, కురుబసంఘం జిల్లా అధ్యక్షుడు రాగేపరుశురాం, రాయలసీమ కురుబసంఘం అధ్యక్షులు పీటీ నరసింహారెడ్డి, బోరంపల్లి ఆంజినేయులు, పెనుకొండ కాంగ్రెస్ ఇన్చార్జ్ కేటీ శ్రీధర్, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ హాజరవుతారని తెలిపారు. -
ఇష్టారీతిన విద్యుత్ కోతలు
అనధికారిక కోతలతో ఇబ్బందుల్లో స్థానికులు యథేచ్చగా చెట్ల నరికివేత రోజంతా కరంట్ కట్ ఫోన్ చేస్తే దురుసుగా సమాధానం ఆన్ లైన్ సేవలన్నీ బంద్ పరిగి: విద్యుత్ పనుల పేరిట ఇష్టారీతిలో అనధికారికంగా విద్యుత్ కోతలు విధిçస్తున్నారు. విద్యుత్ లైన్లు లాగడం కోసం వందల చెట్లు నరికేస్తున్నారు. ఇదేంటని సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం చెబుతున్నారు. కోతలు లేవంటూనే దర్జాగా పదిగంటలు విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నారు. ఇష్టామొచ్చినట్లు విద్యుత్‌ను తీసేస్తున్నారు. వారంలో రెండు సార్లు పదిగంటలకంటే అధికంగా కోతలు విధిస్తూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కోతలు విధిం చిన ప్రతిసారి 8 నుంచి 10 గంటలు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. ఒక్కోసారి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎల్సీ తీసుకుని, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు కూడా కాంట్రాక్టర్లు లైన్ ను క్లియర్ చేయడంలేదు. ఆ శాఖ అధికారులు విని యోగదారుల బాధలు పట్టించుకోకుం డా కాంట్రాక్టర్లకే వంతపాడుతున్నారు. 32 కేవీ లైన్లు సైతం ఇళ్ల మధ్య నుంచి, దుకాణ సముదాయాల నుంచి తీసుకెళ్తూ ప్రమాదాలను నెత్తినపెడుతున్నారు. ఇప్పటికే పట్టణవాసులు, ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించడంలేదు. ఆన్ లైన్ సేవలన్నీ బంద్.. అనధికార కోతలతో ఆన్లైన్ సేవలన్నీ బందయ్యాయి. ఏడాది కాలంగా అనధికారికంగా కోతలు కొనసాగుతూనే ఉ న్నాయి. వారంలో ఒకటీ, రెండు సార్లు రోజంతా కోతలు విధించడం పరిగిలో సర్వసాధారణమైంది. దుకాణ సముదాయాలకు ఆనుకుని విద్యుత్ స్తంభాలు పాతుతున్నారు. ఎవరైనా అడిగితే సాధ్యమైనంతవరకు వారే సమాధానం చెబుతున్నారు. లేదంటే కొందరు నాయకుల చేత మాట్లాడించి, భయపెట్టిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కోతల కారణంగా జిరాక్స్ సెంటర్లు, ఇంటర్ నెట్ సెంటర్లు, మీసేవ, తదితర ఆన్ లైన్ సర్వీసులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో బ్యాంకులు, కార్యాలయాలు, ఇతర సంస్థల్లో ఆన్ లైన్ సేవలు నిలిచిపోతున్నాయి. విద్యుత్ సరఫరా లేక అధికారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. కొందరైతే ఆన్ లైన్ సేవలు పనిచేయక అత్యవసరం ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవటానికి గడువు లేని వారు వికారాబాద్ తదితర పక్క మండలాలకు వెళ్తున్నారు. -
కుంగ్‌ఫూలో పరిగి విద్యార్థికి బంగారు పతకం
పరిగి : మండల పరిధిలోని జాఫర్‌పల్లి మోడల్ స్కూల్ విద్యార్థి జే రిషి జిల్లా స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు. ఫ్రీడమ్ ఫైటర్ ఆల్ ఇండియా కుంగ్‌ఫూ మరియు కరాటే ఆధ్వర్యంలో శంషాబాద్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి టోర్నమెంటులో రిషి ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకాన్ని సాధించారు. అతడిని పరిగి న్యూ మ్యాక్స్ కుంగ్‌ఫూ మాస్టర్ రమేష్, ప్రిన్సిపాల్ యాదయ్య, పీఈటీ శ్రీకాంత్‌లు అభినందించారు. -
భాగ్యనగరంలో భారీవర్షం
హైదరాబాద్: భారీ వర్షంతో భాగ్యనగరం తడిసిముద్దవుతోంది. బుధవారం ఉదయం నుంచి నగరంలో భారీ వర్షం మొదలైంది. పొద్దున్నే వర్షం రావడంతో పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ మందగొడిగా సాగుతోంది. ఈసీఎల్, ఉప్పల్, ఎల్ బీ నగర్, కోటి, పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మేఘాలు దట్టంగా అలముకోవడంతో రాత్రిని తలపిస్తోంది. నగరమంతా చీకటి వాతావరణం కమ్ముకుంది. దీంతో వీధి దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. వాహనదారులు లైట్లు వేసుకుని డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. ఉదయం 8 గంటలు దాటినా వెలుగు రాలేదు. మేఘాలు దట్టంగా అలుముకోవడంతో వర్షం మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అటు రంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు కాలనీలు నీట ముగిగాయి. పరిగి, ఇబ్రహీంపట్నం, తాండూరు, వికారాబాద్ లో రహదార్లు జలమయం అయ్యాయి. -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ పరిగి: అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ, పరిగి ప్రాజెక్టు అధ్యక్షురాలు మంజుల, ప్రధాన కార్యదర్శి సత్యమ్మ అన్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పరిగి ప్రాజెక్టు పరిధిలోని నాలుగు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు పరిగి ఐసీడీఎస్ సీడీపీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీడీపీఓ ప్రియదర్శినికి వినతి పత్రం అందజేశారు. ఎన్నిసార్లు ధర్నాలు, ఆందోళనలు, వినతి పత్రాలు సమర్పించినా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం్ంలేదని వారు పేర్కొన్నారు. ప్రతి నెలా వేతానాలు ఇవ్వటంతో పాటు పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని వారు కోరారు. సెంటర్లకు రాయితీ గ్యాస్ కోసం ప్రభుత్వం డబ్బులు మంజూరు చేయాలన్నారు.వంట పాత్రలు, పొయ్యిలు అందజేయాలన్నారు. సెంటర్లకు బీరువాలు, బకెట్లుతదితర సామాగ్రి అందజేయాలన్నారు. 2015 నుంచి పెండింగ్‌లో ఉన్న యూనిఫారాలు అందజేయాలన్నారు. ప్రతి నెలా బియ్యం, పప్పు, వంటనూనే, గుడ్లు, బాలామృతం పంపిణీ చేయాలన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు సెంటర్ల అద్దె డబ్బులు చెల్లించాలన్నారు. పెండింగ్ టీఏ, డీఏలు వెంటనే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు స్వరూప, సక్కుబాయి పాల్గొన్నారు. -
చిరుత కాదు.. కుక్కే!
పరిగి: గ్రామ సింహాన్ని చూసిన ఓ వ్యక్తి చిరుతపులి కనిపించిందని చెప్పడంతో రంగారెడ్డి జిల్లా పరిగిలో సోమవారం జనం రాత్రంతా జాగారం చేశారు. పోలీసులు, ఫారెస్టు అధికారులు రంగంలోకి దిగి అది కుక్క అని తేల్చడంతో అంతా అవాక్కయ్యారు. పరిగి వల్లభనగర్‌కు చెందిన ఓ యువకుడు సోమవారం రాత్రి 11 గంటలకు చిరుతను చూశానంటూ చెప్పాడు. ఈ విష యం ఊరంతా తెలిసింది. దీంతో పెద్దసంఖ్యలో జనం గుమిగూడారు. పోలీసులు హుటాహుటిన తరలి వచ్చా రు. చిరుత వల్లభనగర్ సమీపంలోని మసీద్ పక్క ఇళ్లలోకి వెళ్లిందని ఆ యువకుడు చెప్పడంతో సీఐ ప్రసాద్ ఎస్ఐలు నగేష్, హన్మంతు టార్చిలైట్లతో గాలించారు. అక్కడ కనిపించిన పాదముద్రలను పరిశీలించగా.. కాస్త అటు ఇటుగా చిరుత అడుగుల్లాగే కనిపించాయి. దీంతో వారి సందేహం మరింత బలపడి, అది చిరుతేనని నమ్మారు. మంగళవారం ఉదయం వరకు జనం అక్కడే జాగారం చేశారు. ఫారెస్టు అధికారులు వచ్చి పరిశీలిస్తుం డగా అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కుక్కను తీసుకొచ్చాడు. అది దాదాపు చిరుత సైజులోనే ఉంది. దాని అడుగులు పరిశీలించగా రాత్రి చూసిన పాద ముద్రలతో సరిపోయాయి. దీంతో రాత్రి యువకుడు చూసింది చిరుత కాదు కుక్కే అని నిర్ధారణకు వచ్చారు. -
శ్రీవాణిపై చర్యలు తీసుకుంటాం: సీఐ
-
శ్రీవాణిపై చర్యలు తీసుకుంటాం: సీఐ
వికారాబాద్ : అన్న భార్యపై దాడి చేసిన కేసులో పోలీసుల విచారణకు బుల్లితెర నటి శ్రీవాణి గైర్హాజరు అయింది. ఈ సందర్భంగా వికారాబాద్ మహిళాa పోలీస్ స్టేషన్ సీఐ నిర్మల మాట్లాడుతూ విచారణకు హాజరు కావాలని శ్రీవాణికి ఫోన్ చేశామన్నారు. అయితే ఆమె రాలేదని, విచారణకు శ్రీవాణి సహకరించడం లేదన్నారు. శ్రీవాణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. అవసరం అయితే అరెస్ట్ తప్పదన్నారు. మరోవైపు పోలీసుల విచారణకు అనూష హాజరు అయ్యింది. కాగా షూటింగ్ ఉన్నందునే విచారణకు హాజరు కాలేకపోయానని శ్రీవాణి తెలిపింది. కాగా రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన అనూష, శ్రీవాణి ఇంటి స్థలం విషయంలో గొడవకు దిగడంతో పాటు ఘర్షణ పడి పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐ నిర్మల నిన్న వివాదాస్పద ఇంటి స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. స్థానికులతో మాట్లాడి ఆరా తీశారు. నటి శ్రీవాణి పలుమార్లు సదరు ఇంటి స్థలాన్ని సందర్శించిందని, వదిన అనూషపై బెదిరింపులకు పాల్పడిందని సీఐకి వివరించారు. దీంతో వారందరి వాంగ్మూలాలను సీఐ నమోదు చేశారు. -
ఇల్లు కూల్చివేతలో నా ప్రమేయం లేదు
టీవీనటి శ్రీవాణి తాండూరు: తనపై తప్పుడు కేసు పెట్టారని, టీవీ నటినైనందునే తనను అప్రతిష్ట పాలు చేస్తున్నారని బుల్లి తెర నటి శ్రీవాణి స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. తన అన్న బాబ్జీ గత నెలలో చనిపోయాడని, నాన్న కోటేశ్వర్రావుకు ఐదుగురు కూతుళ్లమని, తమకు పరిగిలో ఇల్లు, ఒక ఎకరం భూమి ఉందన్నారు. తాము ఆ ఇల్లు కూల్చివేసినట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. తన వదిన అనూషను వేధింపులకు గురి చేశానని ఆరోపించడంలో నిజం లేదన్నారు. ఇల్లు కూల్చివేతలో తన ప్రమేయమే లేదని, అది ఏడాది క్రితమే జరిగిందన్నారు. ఇతరులను తీసుకువచ్చి దాడి చేయించాననడం అబద్ధమని, తనపైనే దాడి జరిగిందని చెప్పారు. శ్రీవాణి తండ్రి కోటేశ్వర్రావు మీడియాతో మాట్లాడుతూ పరిగిలో ఐదారు కోట్ల ఆస్తి తన పేరుతో ఉందన్నారు. శ్రీవాణితోపాటు తన కుటుంబసభ్యులపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఆస్తిలో ఐదుగురు కూతుళ్లతో పాటు కోడలుకు సమానంగా వాటా ఉంటుందని చెప్పారు. -
నాపై అనవసర ఆరోపణలు: శ్రీవాణి
వికారాబాద్: రంగారెడ్డి జిల్లా పరిగి గ్రామంలో స్థల వివాదం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను బుల్లితెర నటి శ్రీవాణి ఖండించింది. తాను ఎవరిపైనా దాడి చేయలేదని ఆమె స్పష్టం చేసింది. వదిన అనూష తమపై అనవసర ఆరోపణలు చేస్తోందని శ్రీవాణి వ్యాఖ్యానించింది. తండ్రి ఆస్తిలో తమకు హక్కుందని ఆమె తెలిపింది. పోలీసులు విచారణకు సహకరిస్తానని శ్రీవాణి పేర్కొంది. మరోవైపు శ్రీవాణి వదిన అనూషకు స్థానికులు మద్దతుగా నిలిచారు. అనూషపై శ్రీవాణి దౌర్జన్యం చేస్తోందని పరిగి సర్పంచ్ సుదర్శన్ అన్నారు. గతంలో కూడా అనూషపై దాడికి యత్నించడమే కాకుండా వేధింపులకు గురి చేసినట్లు దాడికి యత్నించిందని తెలిపారు. తనను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో శ్రీవాణిని ఉందన్నారు. శ్రీవాణి తండ్రి గతంలోనే ఐదెకరాల భూమిని అమ్మి ఆమెకు డబ్బులు ఇచ్చారని, మళ్లీ ఇప్పుడు ఆస్తిని కాజేయాలని చూస్తోందని సుదర్శన్ అన్నారు. కాగా మరోవైపు ఈ కేసుపై సీఐ నిర్మల మాట్లాడుతూ అనూష ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామన్నారు. శ్రీవాణి దౌర్జన్యం చేసినట్లు స్థానికులు చెబుతున్నారన్నారు. గతంలో కూడా అనూషను శ్రీవాణి వేధించారని సీఐ తెలిపారు. చదవండి... (బుల్లితెర నటి శ్రీవాణి విలనిజం) -
బుల్లితెర నటి శ్రీవాణి విలనిజం
-
బుల్లితెర నటి శ్రీవాణి విలనిజం
పరిగి: రీల్ లైఫ్‌లోనే కాదు...రియల్ లైఫ్‌లోనూ బుల్లితెర నటి తన విలనిజాన్ని చూపించింది. సోదరుడి ఆస్తిపై కన్నేసిన ఆమె...వదినపై అమానుషంగా ప్రవర్తించింది. అన్నచనిపోవడంతో వదిన ఉంటున్న ఇల్లును జేసీబీతో కూల్చేసింది. ఆస్తి తమకే దక్కుతుందని అనుచరులతో వీరంగం సృష్టించింది. టీవీ సీరియల్ ఎపిసోడ్‌కు ఏమాత్రం తీసిపోలేదు. చంద్రముఖి సీరియల్ ఫేం శ్రీవాణి సోదరుడు బాబ్జీ అనారోగ్యంతో కొంతకాలం క్రితం మరణించాడు. అయితే సోదరుడికి పిల్లలు లేకపోవడంతో తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా వస్తుందంటూ శ్రీవాణి తన సోదరి శ్రీకన్యతో కలిసి సోమవారం రంగారెడ్డి జిల్లా పరిగిలో హల్చల్ చేశారు. వేరే వారిని ఆ స్థలాన్ని విక్రయించేందుకు యత్నించగా అందుకు బాబ్జీ భార్య అనూష అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా శ్రీవాణి అసభ్య పదజాలం ఉపయోగించడమే కాకుండా, తన భర్త ఆదిత్యరెడ్డి సాయంతో ఆ ఇంటిని కూల్చివేసింది. దీంతో అనూష పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిగి పోలీసులు శ్రీవాణిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు అనూషపై శ్రీవాణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అనూష ఉంటున్న ఇంటి స్థలంలో తమకు కూడా వాటా ఉందని అడిగేందుకు వెళితే తమపై దాడికి యత్నించిందని శ్రీవాణి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. విచారణకు హాజరు కావాలని శ్రీవాణిని సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు అనూషకు స్థానికులు బాసటగా నిలిచారు. అనూష భర్త చనిపోయి బాధలో ఉంటే వేధించడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అమాయకురాలైన అనూషకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఇంటి స్థలం కోసం శ్రీవాణి యత్నించిందని, అయితే ఆ ప్రయత్నాలను తాము అడ్డుకున్నట్లు స్థానికులు తెలిపారు. చదవండి....(బుల్లితెర నటి శ్రీవాణిపై ఫిర్యాదు) -
బాలిక అదృశ్యం
పరిగి (రంగారెడ్డి): తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లొచ్చేలోపు ఇంట్లో ఉన్న బాలిక అదృశ్యమైంది. రంగారెడ్డి జిల్లా పరిగి మండల పరిధిలోని రూప్ఖాన్పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ హన్మంతు తెలిపిన వివరాల ప్రకారం... గుడిసె రాములు, భార్యతో కలసి ఈ 3వ తేదీన కూలీ పనులకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి రాగా కుమార్తె ఉమారాణి(15) కనిపించలేదు. బంధువులు, తెలిసినవారి వద్ద విచారించినా ఆచూకి లభించలేదు. దీంతో ఆదివారం పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ హన్మంతు తెలిపారు. శేఖర్ అనే యువకుడు తన బైక్‌పై బాలికను తీసుకెళ్లినట్టు తెలిసిన వారు చెప్పడంతో... పోలీసులు అతడ్ని విచారించారు. తన బండిపై వచ్చిన మాట వాస్తవమేనని తరువాత పరిగిలో దిగి ఎటు వెళ్లిందో తెలియదని అతడు పోలీసులకు వివరణ ఇచ్చాడు. దీంతో బాలిక అదృశ్యం మిస్టరీగా మారింది. -
పెళ్లి డీసీఎం నడిపింది మైనర్!
పరిగి: పెళ్లి డీసీఎం బోల్తా ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. ఇప్పటి వరకు పరిగి మండల పరిధిలోని సయ్యద్‌పల్లికి చెందిన డ్రైవర్ సైదప్పనే డీసీఎం నడిపాడని.. అతడే తొమ్మిది మంది మృతికి కారణమని అందరూ భావించారు. ఇప్పుడు పోలీసులు మరో వ్యక్తిని తెరపైకి తెచ్చారు. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు పొట్టిగారి రాజు(16) సైదప్ప దగ్గర డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లి డీసీఎం నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని పోలీసులు నిర్ధారించి అతడిని రాజేంద్రనగర్ సమీపంలోని సాతంరాయి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, పోలీసులు మాత్రం అరెసుట చూపలేదు. అయితే, సైదప్ప ఇంకా పరారీలోనే ఉన్నాడు. సైదప్ప పుణె లేదా ముంబై పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గేర్ వేయబోయి.. హ్యాండ్ బ్రేక్ వేయడంతో.. వికారాబాద్ మండలం ద్యాచారం గ్రామానికి చెందిన పెళ్లిబృందం గతనెల 30న వివాహం నిమిత్తం డీసీఎం వ్యాన్‌ను కిరాయికి తీసుకున్నారు. ఓనర్ నసిరొద్దీన్ డ్రైవర్ సైదప్పను పురమాయించి అతడికి వాహనం అప్పగించాడు. అయితే, సైదప్ప వెళ్లకుండా అతని స్థానంలో గత నెల రోజులుగా డీసీఎం నేర్చుకుంటున్న బాలుడు రాజుకు వాహనం అప్పగించాడు. అయితే, బాలుడు వాహనం ద్యాచారం నుంచి తీసుకొని పరిగి వరకు వస్తే.. అక్కడి నుంచి తాను డ్రైవ్ చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ పూర్తిగా తెలియని రాజు పెళ్లి బృందాన్ని ఎక్కించుకుని ఎలాగోలా పరిగి సమీపంలోకి వచ్చాడు. అయితే డ్రైవింగ్ సరిగా తెలియని రాజు గేర్ మార్చేక్రమంలో హ్యాండ్ బ్రేక్ వేయటంతో డీసీఎం అదుపుతప్పి బోల్తాపడినట్లు అతడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అయితే, ఈ ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు మృతి చెందగా తర్వాత ముగ్గురు చనిపోయారు. -
మహిళపై లైంగిక దాడి.. హత్య !
* గుర్తుతెలియని వికలాంగురాలిని చంపేసిన దుండగులు * రంగారెడ్డి జిల్లా పరిగిలో దారుణం పరిగి: గుర్తుతెలియని వికలాంగురాలిపై దుండగులు లైంగికదాడికి పాల్పడి చంపేశారు. శనివారం ఉదయం 7 గంటలకు పరిగికి చెందిన కొందరు మినీస్టేడియం గ్రౌండ్లో వాకింగ్ చేస్తుండగా పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల వెనకాల ఓ మహిళ హత్యకు గురైనట్లు గుర్తించారు. చేవెళ్ల డీఎస్పీ రంగారెడ్డి, సీఐ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుడికాలుకు వైకల్యం ఉన్న ఆ మహిళ నీలి రంగు చీర, తెలుపురంగు జాకెట్ ధరించి ఉంది. ఓ పెద్ద బండరాయి ముఖంపై ఉంది. సమీపంలో కండోమ్ ప్యాకెట్లు ఉండటం.. అక్కడున్న పరిస్థితిని బట్టి మహిళపై దుండగులు అత్యాచారం చేసి చంపేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలి వయస్సు 40-45 ఏళ్లు ఉండొచ్చన్నారు. హతురాలి ఒంటిపై కడియాలు, మెట్టెలు ఉన్నాయి. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం వివరాలు సేకరించాయి. జాగిలం పరిగిలోని గంజ్‌రోడ్డు, మార్కెట్ యార్డు, బస్‌స్టాండు తదితర ప్రదేశాలు తిరుగుతూ అనంతరం సాయిబాబ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు వెళ్లింది. హత్యకు గురైన మహిళ వారం రోజులుగా పరిగిలోనే తిరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. -
పల్లె బస్సుకు ‘గులాబీ’ వెలుగు!
పల్లెవెలుగు బస్సు కలర్ మారింది. తెలుపు, లైట్ గులాబీ, పచ్చ కలర్‌తో బస్సులు కొత్తగా కనిపిస్తున్నాయి. గురువారం కొత్తగా రంగులద్దిన ఓ బస్సు రంగారెడ్డి జిల్లా పరిగిలో కనిపించింది. దీనిపై టీఆర్ఎస్ మార్క్ కన్పిస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. - పరిగి -
ముక్కలుగా నరికి బోరుబావిలో వేశారు
పరిగి: రంగారెడ్డి జిల్లాలో ఆరు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శనివారం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం చీగురాలపల్లి గ్రామంలో వెలుగు చూసింది. వివరాలు.. మండలంలోని నారాయణపూర్‌కు చెందిన ముక్తార్(22) పరిగిలో నెట్ సెంటర్ నిర్వహిస్తుంటాడు. కాగా, గత నెల 27న చీగురాలపల్లిలో తన స్నేహితుడు రాఘవేంద్రను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ముక్తార్ తిరిగి కనిపించలేదు. దీంతో 30 వతేదీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయట పడింది. ముక్తార్‌ను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి చీగురాలపల్లి గ్రామంలోని ఒక బోరుబావిలో వేసినట్లు నిందితులు తెలిపారు. దీంతో పోలీసులు బోరు బావిలో నుంచి ముక్తార్ దేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్నున్నారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
పరిగి: అప్పుల బాధతో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రూప్ఖాన్పేట గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గోపాల్(38) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, తన నాలుగు ఎకరాల పొలంలో ఈ ఏడాది మొక్కజొన్న పంట వేశాడు. అయితే, వర్షాలు సరిగా లేకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. కాగా, రైతు శుక్రవారం బ్యాంకు వెళ్లి క్రాప్ లోన్ ఇవ్వాలని కోరగా, ప్రభుత్వం రుణమాఫీ సొమ్ము మాకు ఇంకా అందలేదని..లోన్ కావాలంటే పాత బకాయి వడ్డీ చెల్లించాలని బ్యాంక్ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో రైతు మనస్తాపం చెంది శనివారం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. -
చంపేసి.. కాల్చేసి..
⇒ గుర్తుతెలియని మహిళ దారుణ హత్య ⇒ ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం ⇒ క్లూస్‌టీం, జాగిలాలతో వివరాల సేకరించిన పోలీసులు పరిగి:గుర్తు తెలియని ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగులు మహిళను చంపేసి మృతదేహాన్ని కాల్చేశారు. పోలీసులు క్లూస్‌టీం, జాగిలాలతో వివరాలు సేకరించారు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో సోమవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపూర్-మిట్టకోడూర్ మార్గంలోని అటవీప్రాంతంలో ఓ మృతదేహం పూర్తి గా కాలిపోయి ఉంది. ఈ విషయమాన్ని గమనించిన మిట్టకోడూర్కు చెందిన పశువుల కాపర్లు గ్రామస్తులకు తెలిపారు. ఘటన ఇబ్రహీంపూర్ రెవెన్యూ పరిధిలో జరగడంతో ఆ గ్రామ సర్పంచ్ అనంతయ్య ఫిర్యాదు మేరకు పరిగి సీఐ ప్రసాద్, ఎస్ఐ శంషొద్దీన్ సిబ్బం దితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా కాలిపోయింది. గుర్తుపట్టే వీలులేకుండా పోయింది. చేతులకు ఉన్న గాజుల ఆధారంగా హత్యకు గురైంది మహిళ అని పోలీసులు గుర్తించారు. ముఖానికి స్కార్ఫ్ చుట్టి ఉంది. మహిళ 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహానికి బెండింగ్ వైర్లు చుట్టి ఉన్నాయి. దగ్గరలో ఓ అగ్గిపెట్టె పడి ఉంది. మహిళ కాళ్లకు మెట్టెలు లేకపోవడంతో పెళ్లి కాని యువతి కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలో కారు తిరిగిన ఆనవాళ్లు కనిపించాయి. దీనిని బట్టి దుండగులు యవతిని వేరే ప్రాంతంలో హత్య చేసి శనివారం రాత్రి మృతదేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి పడేసి..కాల్చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు క్లూస్‌టీం సాయంతో ఆధారాలు సేకరించారు. పోలీసు జాగిలాలు ఘటనా స్థలం నుంచి సమీపంలో ఉన్న మట్టిరోడ్డు వరకు వెళ్లి ఆగింది. మృతదేహం పూర్తిగా కాలిపోవటంతో డాక్టర్ అపూర్వ ఘటనా స్థలంలో పోస్టుమార్టం నిర్వహించారు. యువతి హత్య విషయమై సమీపంలోని మహబూబ్‌నగర్ పోలీసులతో పాటు అన్ని ఠాణాలకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దా‘రుణం’
⇒ అప్పుల బాధతో రైతన్న బలవన్మరణం ⇒ మూడు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు.. ⇒ బావిలో అత్తెసరు నీటితో పంటలసాగు.. ⇒ అవి ఎండిపోవడంతో మనోవేదన ⇒ అప్పులు తీరేమార్గం లేదని ఉరివేసుకొని ఆత్మహత్య ⇒ వికారాబాద్ మండలం కొటాలగూడ లాల్‌సింగ్ తండాలో ఘటన వికారాబాద్ రూరల్: వ్యవసాయాన్నే నమ్ముకున్న ఆయన అప్పులు చేసి మూడు బోర్లు తవ్వించినా చుక్కనీరు పడలేదు. ఓ బావి తవ్వించగా వచ్చిన అత్తెసరు నీటితో సాగుచేసిన పంటలు ఎండిపోయాయి. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి.. ఇక అప్పులు తీర్చేమార్గం లేదని మనోవేదనకు గురైన ఓ రైతు ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర సంఘటన వికారాబాద్ మండలం కొటాలగూడ అనుబంధ లాల్‌సింగ్ తండాలో గురువారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన రామవత్ తార్యా(35),చాందిబాయి దంపతులకు కుమారులు రమేష్, శంకర్, కూతుళ్లు లక్ష్మి, రోజాలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల వివాహం జరిగింది. కుమారులిద్దరు వికారాబాద్‌లో ఉంటున్నారు.పెద్ద కొడుకు పనిచేస్తుండగా చిన్న కొడుకు శంకర్ చదువుకుంటున్నాడు. తార్యా దంపతులు తమకున్న మూడు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గతంలో అప్పు లు చేసి పొలంలో మూడు బోర్లు వేయించినా చుక్కనీరు కూడా పడలేదు. దీంతో ఏడాది క్రితం అప్పు చేసి బావిని తవ్వించగా కొద్దిపాటి నీరు వచ్చింది. ఇటీవల రబీసీజన్‌లో సాగు చేసిన పూల తోట, వరిపంటకు సరిగా నీరు అందకపోవడంతో ఎండుముఖం పట్టా యి. తార్యా పెట్టుబడుల కోసం గొల్కోండ గ్రామీణ బ్యాంక్‌లో రూ. 80 వేలు తీసుకున్నాడు. బోర్లు, బావి తవ్వించేందుకు మొత్తం రూ. 3 లక్షల వరకు అప్పులు అయ్యాయి. పంటలు ఎండుముఖం పట్టడంతో ఇక అప్పులు తీరేమార్గం లేదని మనోవేదనకు గురైన ఆయన.. గురువారం మధ్యాహ్నం పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీ సులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య చాందిబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. అప్పుల బాధతో వ్యవసాయకూలీ ఆత్మహత్య పరిగి: అప్పుల బాధతో మనస్తాపం చెం దిన ఓ వ్యవసాయకూలీ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని సయ్యద్‌పల్లిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎదిరె సైదప్ప(48), భీమమ్మ దంపతులు తమకున్న ఎకరంన్నర పొలంలో వ్యవసాయం చేసుకుంటూ మిగతా సమయంలో కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఏడాది క్రితం సైదప్ప అప్పు చేసి కుమార్తె పెళ్లి చేశాడు. పరిగి ఏడీబీ బ్యాంకులో రూ.లక్ష అప్పు ఉండగా, కుటుంబ పోషణ ఇతర అవసరాలకు తెలిసిన వారి వద్ద మరో రూ. 3లక్షలు అప్పు చేశాడు. అప్పులు తీర్చేమార్గం లేకపోవడంతో మనస్తాపం చెందిన బుధవారం పొలానికి వెళ్లాడు. సాయంత్రం గ్రామానికి చెందిన రైతు మోహన్‌రెడ్డి బావిలో దూకాడు. కొద్దిసేపటికి గమనించిన గ్రామస్తులు సైదప్పను బయటకు తీయగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి కుటుంబాన్ని బుధవారం రాత్రి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరామర్శించారు. గురువారం పరిగి ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ కృష్ణ పేర్కొన్నారు. -
విద్యావంతుడి విషాదాంతం
- బైకును డీసీఎం వ్యాన్ - ఢీకొనడంతో ప్రమాదం పరిగి: డీసీఎం వ్యాన్ బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ విద్యావంతుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని సయ్యద్‌మల్కాపూర్ సమీపంలో పరిగి-షాద్‌నగర్ రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ శంషొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన కోస్గి సత్యనారాయణ(26) పీజీ పూర్తి చేశాడు. ప్రస్తుతం గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అతడు ఆదివారం పనినిమిత్తం పరిగికి బైక్‌పై వచ్చాడు. రాత్రి 10 గంటల సమయంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈక్రమంలో సయ్యద్‌మల్కాపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ అతడి బైక్‌ను ఢీకొంది. ప్రమాదంలో సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. వాహనదారులు గమనించి అతడిని పరిగి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే సత్యనారాయణ మృతిచెందినట్లు నిర్ధారించారు. సోమవారం పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. సత్యనారాయణ మృతితో అతడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడి తండ్రి సూర్యప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షేక్‌శంషొద్దీన్ తెలిపారు. -
త్వరలో రైతు జేఏసీ ఏర్పాటు
పరిగి: రాష్ట్రంలో విడివిడిగా ఉన్న రైతు సంఘాలన్నింటినీ ఏకం చేసి త్వరలో రైతు జేఏసీ ఏర్పాటు చేస్తామని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. పరిగిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నం పెట్టే రైతన్న అభివృద్ధి చెందితే దేశమైనా, రాష్ట్రమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లేనన్నారు. నేడు రైతులు ఆత్మహత్యలవైపు మొగ్గుచూపుతుండటం వారి దుర్భరస్థితిని, అప్పుల వెతలను తెలియజేస్తుందన్నారు. రైతులు సంఘటితంగా ఉండాలని, అప్పుడే వారికి మంచి రోజులు వస్తాయన్నారు. రైతును మార్కెట్ శక్తులు దోపిడీ చేస్తున్నాయని తెలిపారు. చెట్టుకు చెద పురుగులు పట్టినట్లుగా రైతులను మార్కెట్ శక్తులు పట్టి పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేస్తున్న ఉత్పత్తులకు రైతులు తప్ప.. ఇతర రంగాల్లో ఉత్పత్తి చేసిన వస్తువులకు ధర నిర్ణయిస్తుండగా.. రైతు పండించిన పంటలకు ధర నిర్ణయించే అధికారం ఇతర శక్తులు లాగేసుకుంటున్నాయన్నారు. అన్నం పెట్టే రైతన్నకు ప్రభుత్వ మద్దతు కూడా అందడం లేదన్నారు. బడ్జెట్లో రైతుకు న్యాయం జరగాలన్నారు. చిన్న,సన్నకారు రైతులకు అవసరమైన విధానాలు రూపొందించాలన్నారు. నాసిరకం ఎరువులు, విత్తనాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయన్నారు. రైతులందరూ ఏకమై తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తేనే సమస్యలను నుంచి గట్టెక్కుతారని తెలిపారు. రైతులు చేసే ఏ ప్రయత్నానికైనా జేఏసీ అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంత రైతులపై వివక్ష చూపటమే కాకుండా విధ్వంసం సృష్టించాయని తెలిపారు. మార్చి చివరి వారంలో రైతు సదస్సు.. మార్చి చివరివారంలో పరిగిలో రైతు సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు. రైతులు, రైతుల సంఘాలు ఎవరికి వారు కాకుండా ఒక్క తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. పరిగి మార్కెట్ యార్డులో నిర్వహించనున్న ఈ రైతు సదస్సుకు రైతులు, రైతు సంఘాలన్నీ హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, నియోజకవర్గ కన్వీనర్ బసిరెడ్డి, జేఏసీ నియోజకవర్గ కో- ఆర్డినేటర్ ఆంజనేయులు, రైతు సంఘాల నాయకులు మిట్టకోడూర్ బాబయ్య, వెంకట్రాంరెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలికపై అత్యాచారయత్నం
వరుసకు బాబాయే నిందితుడు పరిగి: బాబాయి వరుసయ్యే ఓ వ్యక్తి పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా పరిగి మండల పరిధిలోని మల్లెమోనిగూడలో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలిక(10) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. గత గురువారం మధ్యాహ్నం సంక్రాంతి రోజున కుటుంబీకులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో ఆమెకు వరుసకు బాబాయి అయ్యే అల్లాడి వెంకటేష్(25) ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారయత్నం చేశాడు. భయపడిన బాలిక కేకలు వేయడంతో కుటుంబీకులు వచ్చారు. అంతలోనే వెంకటేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. పండగ ఉండటంతో గ్రామస్తులు, బంధువుల ఒత్తిడి మేరకు బాధితురాలి కుటుంబీకులు అదేరోజు ఫిర్యాదు చేయలేకపోయారు. ఎట్టకేలకు ధైర్యం చేసి సోమవారం పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు త్వరలోనే నిందితుడిని పట్టుకొని రిమాండుకు తరలిస్తామని ఎస్ఐ కృష్ణ తెలిపారు. -
రోడ్డెక్కిన పండుటాకులు
పరిగి: తమకు పింఛన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వృద్ధులు, వితంతువులు రోడ్డెక్కారు. పరిగి పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుపై శనివారం బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తాము అన్ని రకాలుగా అర్హులమైనప్పటికీ పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరమ్ సర్టిఫికెట్లు ఉన్నా పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మూడు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్న అధికారులు పింఛన్ల విషయం మాత్రం తేల్చడం లేదన్నారు. ఈ ఆందోళనతో రోడ్డుపై భారీ మొత్తంలో వాహనాలు స్తంభించాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. బీజేపీ మండల అధ్యక్షుడు పెంటయ్యగుప్తా, ప్రధాన కార్యదర్శి రాంచందర్‌లు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. అనంతరం ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చూస్తామని ఎంపీడీఓ విజయప్ప హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. -
నేనూ పేదింట్లోనే పుట్టాను
- బాగా చదివా.. ఉన్నత స్థాయికి వచ్చా.. - కూలిపనులు చేస్తూ పిల్లల్ని చదివించడం అభినందనీయం - సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ పరిగి: ఆయనో సీనియర్ ఐపీఎస్ అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు పరిగి మండలం నస్కల్‌కు వచ్చారు. ఇంతలో ఆ కార్యక్రమానికి వెళ్లకుండా స్థానిక ఎస్సీ కాలనీలోకి నడిచారు. గ్రామం చివరలో ఉన్న సీనయ్య, సాయమ్మ దంపతులు ఇంటి తలుపు తట్టారు. రెక్కాడితే గాని డొక్కాడని దయనీయ పరిస్థితి ఆ కుటుంబానిది. ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. ఓ కుమారుడు.. ఎప్పటిలాగే పిల్లలకు వంట చేసి సద్ది కట్టుకుని కూలిపనులకు పోదామని తయారయ్యారు ఆ దంపతులు. అదే సమయంలో అనుకోని అతిథి వారింటి ఇంటి గడప దాటి లోపలికి రావడంతో వారు ఆశ్చర్యచకితులయ్యారు.. ఆశ్చర్యంలోంచి తేరుకునేలోపే.. అమ్మా.. పెద్దాయనా.. బాగున్నరానే అంటూ ఆయన ఆప్యాయంగా పలకరించారు.. మీరెవరో గుర్తొస్తలేరు.. ఎవరు నాయనా మీరు.. మేం గుర్తుపట్టలేదు అంటూ వారు అనుమానంగా పలకరించారు. ఇంతలో ఆ గ్రామానికి చెందిన చదువుకున్న యువకుడు వెళ్లి సీనయ్య దంపతుల చెవిలో విషయం చెప్పాడు. ఆయన ప్రవీణ్‌కుమార్ సార్ అని పెద్దసారు.. మన ఇండ్లల్ల ఎంట్ల బతుకుతున్నరు.. పిల్లల్ని మంచిగ చదివిస్తున్నారా లేదా అని తెలుసుకోనీకే వచ్చిండు.. అని చెప్పటంతో వారు అవాక్కయ్యారు. ఏం మాట్లాడాలో.. ఏంచేయాలో వారికి తోచలేదు.. ఇంతలో ప్రవీణ్‌కుమార్ కల్పించుకుని మీరు ఏం పని చేస్తరు.. అని అడిగారు. కూలిపనులు చేస్తం సారు అని సమాధానమిచ్చారు.. రోజుకు ఎంతిస్తరు..? నాకు రెండు నూర్లు.. మా ఆవిడకు నూరు ఇస్తరు.. పొలం ఉందా?.. లేదు సారు.. మీకెంతమంది పిల్లలు..? ముగ్గురు పిల్లలు బాబూ అని చెప్పారు సీనయ్య దంపతులు. వారు ఏం చదివారు ప్రవీణ్‌కుమార్ అడగడంతో.. పెద్దమ్మాయిని డిగ్రీ చదివించినం.. ఇప్పుడు ప్రైవేటు దవాఖాన్ల నర్సు ఉద్యోగం చేస్తోంది. చిన్నబిడ్డ.. కొడుకు పరిగిల కాలేజ్‌కి పోతున్నరు.. అంటూ ఆ దంపతులు ప్రవీణ్‌కుమార్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. సీనయ్య ఇంట్లో ప్రవీణ్‌కుమార్ గంటసేపు ఉన్నారు. వారితో చాయ్ పెట్టించుకుని తాగారు. వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీల్లో సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఆయన ఆరా తీశారు. నేనూ.. మీలాగే పేదింట్లో పుట్టాను.. చదువుకోవటంవల్లే ఈ స్థాయికి వచ్చానని వివరించారు. కూలిపనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్న ఆ దంపతులను ఆయన కొనియాడారు. వెలుపల ఉన్న పరిగి సీఐ ప్రసాద్, ఎస్ఐలు కృష్ణ, శంషుద్దీన్లను ఇంట్లోకి పిలిపించారు. వారు కష్టపడి చదువుకుని పైకి ఎలావచ్చారో చెప్పించారు. అనంతరం అక్కణ్నుంచి వెళ్లిపోయారు. -
ఆ ఇంట ఆనందిని
పరిగి, కుల్కచర్ల: బోరుబావిలో పడిన బాలిక క్షేమంగా బయటపడింది. బావిలోని ఓ రాయి ఆ చిన్నారి ప్రాణం నిలిపింది. బోరుబావిలో 10 ఫీట్ల లోతులో ఉన్న రాయి చిన్నారిని మరింత కిందకు జారకుండా ఆపింది. దీంతో సహాయక చర్యలు వేగంగా చేపట్టి జిల్లా యంత్రాంగం నందిని అలియాస్ అంజలిని(6) ప్రాణాలతో కాపాడగలిగింది. మంగళవారం సాయంత్రం జిల్లాలో సంచలనం రేపిన ఈ సంఘటన చివరకు సుఖాంతమైంది. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గీ మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి తండాకు చెందిన లక్ష్మణ్, బుజ్జిబాయి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆ నలుగురిలో నందిని(6) వారికి చివరి సంతానం. బతుకుదెరువు కోసం లక్ష్మణ్ దుబాయికి బుజ్జిబాయి పూణె వలస వెళ్లారు. అయితే కుమారులు పెద్దవాళ్లు కావడంతో ముదిరెడ్డిపల్లి తండాలోనే ఉంటూ చదువుకుంటున్నారు. ఇక ఇద్దరు కుమార్తెలు చిన్నవారు కావడంతో వారిని గోవిందుపల్లిలోని తన తల్లిగారింట వదిలి బుజ్జిబాయి వలస వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం అమ్మమ్మ సీతాబాయి, తాత భోజ్యానాయక్‌లు తండా సమీపంలోని పొలంలో పనికి వెళ్లగా నందిని(6) కూడా వారితోపాటే వెళ్లింది. అప్పటివరకు అక్కడ ఆడుకున్న బాలిక సాయంత్రం సమయంలో కనిపించలేదు. ఇంటికి వెళ్లి ఉండవచ్చని ఊహించి వారిద్దరూ తండాకు వచ్చారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా అక్కడ చిన్నారి జాడ లేకపోవడంతో ఆందోళనకు గురైన వృద్ధులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుక్కుంటూ మళ్లీ పొలానికి వెళ్లారు. పొలంలో ఉన్న బోరుబావిలో శబ్దాలు వినిపించగా అందులో పరిశీలించారు. ఆ బావి నుంచి మరింత స్పష్టంగా నందిని ఏడుపు వినిపిస్తుండటంతో చిన్నారి అందులో పడిపోయిందని స్పష్టమైంది. రెండున్నర గంటలపాటు సహాయక చర్యలు చిన్నారి బావిలో చిక్కుకున్న వార్త మీడియాకు తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చిన్నారి ప్రాణాలకు కోసం ప్రార్థించారు. కొన్ని రోజుల క్రితం మంచాలలో జరిగిన బోరుబావి ఘటన మరవక ముందే జిల్లాలో మరో ఘటన చోటు చేసుకోవడం జిల్లా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. గతంలో మంచాలలో కొన్ని రోజులపాటు సాగిన సహాయక చర్యల్లో చివరికి చిన్నారిని ప్రాణాలతో కాపడలేకపోయారు. ఇక ఇక్కడ కూడా ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని జిల్లావాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే బావిని గతంలో పూడ్చడానికి యత్నించినా పని పూర్తి చేయలేదు. ఇక బోరుబావిలో పది ఫీట్ల కింద ఉన్న రాయి చిన్నారి మరింత లోతుకు జారకుండా అడ్డుకుంది. చిన్నారి బోరుబావిలో పడిందన్న విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ రాములు హుటాహుటినా పోలీసులకు, 108కు సమాచారం అందించారు. ఇక రాత్రి 7 గంటల వరకు జేసీబీ, పోలీసులు, 108 వాహనం ఘటనా స్థలానికి చేరకున్నాయి. 108 సిబ్బంది బోరుబావిలో చిన్నారికి ఆక్సిజన్ అందించగా జేసీబీ బోరుబావికి సమాంతరంగా తవ్వకం ప్రారంభించింది. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బోరుబావి నుంచి చిన్నారిని విజయవంతంగా బయటకు తీశారు. అయితే చిన్నారి ప్రాణాలకు ఎలాంటి అపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ వెంటనే చిన్నారిని 108లో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
సెల్‌ఫోన్ సంభాషణలే ప్రాణం తీశాయి..
* భార్యను చంపిన భర్త అరెస్టు * తల్లి హత్య.. తండ్రి జైలుపాలవడంతో అనాథలైన పిల్లలు పరిగి: భార్యను చంపిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. భార్య సెల్ఫోన్లో మరో వ్యక్తితో మాట్లాడుతుండడంతో అనుమానించి హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. పరిగి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ప్రసాద్ కేసు వివరాలు వెల్లడించారు. కుల్కచర్ల మండలం చాకల్‌పల్లి అనుబంధ మొగుల్లపల్లికి చెందిన ఫకీరయ్య కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మాణెమ్మ(30)తో వివాహం జరిగింది. దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్యాభర్తలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఫకీరయ్య కొంతకాలంగా భార్యను అనుమానిస్తున్నాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై గతంలో ఓసారి గ్రామ పెద్దల ముందు పంచాయతీ పెట్టడంతో వారు సర్దిచెప్పారు. ఇటీవల మాణెమ్మ ఇంట్లో ఫోన్లో మాట్లాడుతూ భర్తకు కనిపించింది. ఫోన్ ఎక్కడిది..? ఎవరు కొనిచ్చారు.. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావ్..? అంటూ ఫకీరయ్య భార్యతో గొడవపడ్డాడు. అప్పుడు ఏదోటి చెప్పిన మాణెమ్మ విషయం దాటవేసింది. అప్పటి నుంచి ఫకీరయ్య భార్యను మరింత అనుమానించసాగాడు. ఈక్రమంలో ఈనెల 1న ఉదయం మాణెమ్మ బహిర్భూమికి వెళ్లగా ఫకీరయ్య ఆమెను అనుసరించాడు. మాణెమ్మ చెట్ల పొదల్లోకి వెళ్లి ఫోన్లో మాట్లాడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావని ఫకీరయ్య భార్యను గద్దించాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకు సెల్‌ఫోన్ కొనిచ్చాడని, అతడితోనే మాట్లాడుతున్నానని మాణెమ్మ చెప్పింది. మాణెమ్మకు అతడితో వివాహేతర సంబంధం ఉందని ఫకీరయ్య అనుమానించాడు. ఈ విషయం తిరిగి పంచాయతీ పెట్టగా భార్యాభర్తలకు పెద్దలు నచ్చజెప్పారు. అనంతరం అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన దంపతులు మళ్లీ గొడవపడ్డారు. మాటామాట పెరగడంతో ఆగ్రహానికి గురైన ఫకీరయ్య ఇంట్లో ఉన్న గొడ్డలితో మాణెమ్మను తలపై నరికాడు. తీవ్రంగా గాయపడిన మాణెమ్మ అక్కడికక్కడే మృతిచెందగా ఫకీరయ్య పరారయ్యాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఫకీరయ్యను గురువారం అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా హత్యకు దారితీసిన పైవిషయాలు తెలిపాడు. తల్లి హత్యకు గురవడం, తండ్రి జైలుపాలు కావడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. సమావేశంలో కుల్కచర్ల, పరిగి ఎస్ఐలు ఉన్నారు. -
కేసీఆర్ సర్కార్ వివక్ష చూపుతోంది...
హైదరాబాద్ : ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధుల విడుదలలో కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి పంచాయతీ రాజ్ శాఖ రూ. 1952 కోట్లు విడుదల చేస్తూ జీవో 36 ఇచ్చిందన్నారు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల లోపు మంజూరు చేసిన ప్రభుత్వం... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేసిందని రామ్మోహన్ రెడ్డి అన్నారు. కేసీఆర్...అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య తేడా చూపరాదని ఆయన సూచించారు. -
‘సౌర’భాలు
పరిగిలో మొదలైన సోలార్ విద్యుదుత్పత్తి సర్కారుకు కరెంటును విక్రయిస్తున్న ప్లాంట్ నిర్వాహకులు రూ.40 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం.. రోజుకు 5.8 మెగావాట్ల విద్యుదుత్పత్తి.. మరో రెండు సోలార్ పవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వ యోచన ఒక్కోదాని సామర్థ్యం 10 మెగావాట్లు .. రెండింటికీ రూ.150 కోట్ల వ్యయంతో పనులు పవర్ జనరేటింగ్ హబ్‌గా మారనున్న పరిగి పరిగి: ‘సౌర’భాల వెలుగుజిలుగులకు పరిగి మండలం చిరునామా అయింది. జిల్లాలోనే సోలార్ పవర్ ప్రాజెక్టులకు కేంద్రస్థానంగా మారింది. ఇప్పటికే ఓ పవర్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా.. ఇక్కడ మరో రెండు సోలార్ పవర్ ప్రాజెక్టులకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో పరిగి ప్రాంతం రానున్న రోజుల్లో సోలార్ పవర్ జనరేటింగ్ హబ్‌గా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మండలంలోని కాళ్లాపూర్ శివారులో ఆరు నెలల క్రితం ప్రారంభమైన సోలార్ పవర్ జనరేటింగ్ ప్లాంట్ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. దీంతో విద్యుదుత్పత్తి ప్రారంభించిన ప్రాజెక్టు నిర్వాహకులు వారంరోజుల క్రితం ట్రయల్ రన్ నిర్వహించారు. రె ండ్రోజులుగా ప్రాజెక్టులో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన ఎస్జే పవర్ కంపెనీ ప్రతినిధులు కాళ్లాపూర్ రెవెన్యూ పరిధిలోని 24వ సర్వే నంబర్లో ప్లాంటు నిర్మించారు. రెండు నెలల క్రితమే విద్యుదుత్పత్తి ప్రారంభం కావాల్సి ఉండగా భూ కొనుగోళ్లు, అనుమతుల్లో నెల కొన్న పలు వివాదాల నెలకొన్నాయి. ఈ కారణంగా ప్లాంటు పనులు పూర్తయినా విద్యుదుత్పత్తిలో రెండు నెలలపాటు ఆలస్యం జరిగింది. 33 కేవీ విద్యుత్ లైన్ ద్వారా సరఫరా రూ.40 కోట్లతో 46 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ సోలార్ పవర్ ప్రాజెక్టు ద్వారా రోజుకు 5.8 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. దీనిని నేరుగా ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. ఇందుకోసం ముందుగానే ప్రభుత్వంతో ప్రాజెక్టు నిర్వాహకులు అగ్రిమెంటు చేయించుకున్నారు. దీని ప్రకారం ప్రస్తుతం పవర్‌ను ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. ఉత్పత్తి అయిన ఒక్కో యూనిట్ విద్యుత్‌ను రూ.6.48 పైసల లెక్కన సర్కారుకు అమ్ముతున్నారు. ఒక్కో మెగావాట్ కోటిన్నర లక్షల యూనిట్లతో సమానం కావడంతో.. ప్రస్తుతం పరిగిలో ఉత్పత్తి ప్రారంభమైన ప్రాజెక్టులో ఏడున్నర లక్షల యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ ఉత్పత్తి అయిన కరెంటును33 కేవీ లైన్ ద్వారా పరిగి సమీపంలోని 133 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సరఫరా చేయనున్నారు. అక్కడినుంచి మిగతా ప్రాంతాలకు సరఫరా అవుతుంది. మరో రెండు పవర్ ప్లాంట్లకు అవకాశం.. పరిగిలో ఇప్పటికే 5.8 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల సోలార్ పవర్ ప్రాజెక్టు అందుబాటులోకి రాగా.. ఈ ప్రాంతంలోనే మరో రెండు సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటుచేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో ప్రాజెక్టు 10 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.150 కోట్ల వ్యయం చేయనున్నారు. ఇందులో 10 మెగావాట్ల సామర్థ్యం గల ఓ ప్రాజెక్టును ఇప్పటికే 5 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మించి విద్యుదుత్పత్తి ప్రారంభించిన ఎస్జే పవర్ కంపెనీ వారు తీసుకోగా మరో ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఓ ప్రాజెక్టు కోసం ఇప్పటికే కొంతమేర భూసేకరణ కూడా ఆ కంపెనీ వారు చేశారు. ఈ ప్రాజెక్టులు సైతం కాళ్లాపూర్, సయ్యద్‌మల్కాపూర్, రాఘవాపూర్ శివారు ప్రాంతాల్లోనే నెలకొల్పనున్నారు. -
పీఎస్‌లో ఏఎస్ఐ మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా పరిగి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఏఎస్ఐ శ్రీరాములు గుండెపోటుతో మృతి చెందారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆయనకు గత అర్థరాత్రి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. దాంతో పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి... ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. శ్రీరాములు మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. దీంతో శ్రీరాములు మృతదేహన్ని ఆయన నివాసానికి తరలించారు. శ్రీరాములు మృతి పట్ల ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోకనాథ్ సంతాపం తెలిపారు. -
అంగన్వాడీల ‘చలో అసెంబ్లీ’కి పోలీసుల బ్రేక్
పరిగి: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పరిగిలో మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలను తీసుకెళ్లవద్దని ప్రైవేటు వాహనదారులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను హెచ్చరించారు. హైదరాబాద్‌కు వెళ్లే ప్రతీ బస్సును తనిఖీ చేసి పంపిం చారు. దీన్ని నిరసిస్తూ వారంతా హైదరాబాద్ -బీజాపూర్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ డివిజన్ కార్యదర్శి వెంకటయ్య, అంగన్వాడీ సంఘం నాయకులు స్వరూప, మంజుల, సక్కుబాయి తదితరులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.15వేలు, హెల్పర్లకు రూ. 10వేల వేతనం చెల్లించాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను మూడో తరగతి ఉద్యోగులుగా, హెల్పర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించటంతో పాటు రెగ్యులరైజ్ చేయాలన్నారు. రిటైర్‌డమెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. త్వరలో అంగన్వాడీల్లో ఖాళీలు భర్తీ చేయనున్న నేపథ్యంలో ఎంపికలో పారదర్శకత పాటించాలని వారు కోరారు. ఐసీడీఎస్‌లలో స్వచ్ఛంద, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల జోక్యం ఉండొద్దన్నారు. కార్యక్రమంలో వెంకటమ్మ, విజయలక్ష్మి, వెంకట్రాంలు తదితరులు పాల్గొన్నారు. మోత్కూర్ గేటు వద్ద 3 గంటల పాటు రాస్తారోకో దోమ: ‘చలో అసెంబ్లీ’కి తరలివెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను మంగళవారం పరిగి- మహబూబ్‌నగర్ ప్రధాన రోడ్డుపై మండల పరిధిలోని మోత్కూర్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కుల్కచర్ల, గండేడ్, దోమ మండలాలకు చెందిన 50మందికిపైగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుం డా తమ ఆందోళనను కొనసాగించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వం తమకు కనీస వేతనం రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్ర త కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలన్నారు. ప్రభుత్వం స్పం దించి సమస్యలను పరిష్కరించే దాకా తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. 3 గంటలపాటు కొనసాగిన రాస్తారోకోతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి మధ్యాహ్నం ఒంటిగంటకు ఎట్టకేలకు కార్యకర్తలు ఆందోళన విరమించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఉపాధ్యాయుడి దాష్టీకం
పరిగి: ఓ ఉపాధ్యాయుడు డౌట్ అడిగిన విద్యార్థి చెవిపై బూటుకాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా తరగతి గదిలో చితకబాదాడు. ఈ సంఘటన పరిగి విద్యారణ్యపురిలోని గురుకుల పాఠశాలలో ఆలస్యంగా సోమవారం వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత విద్యార్థి కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం డివిజన్ యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన ప్రశాంత్(14) పరిగి విద్యారణ్యపురి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు గత శనివారం లీజర్ పీరియడ్ ఉండడంతో కాంట్రాక్ట్ హిందీ అధ్యాపకుడు సత్యనారాయణ 9వ తరగతిలోకి వెళ్లాడు. తమకు ఇష్టమైన సబ్జెక్ట్ పుస్తకాలు చదువుకోవచ్చని ఆయన చెప్పాడు. దీంతో ప్రశాంత్ జీవశాస్త్రం చదువుకుటుండగా అతడికి ఓ సందేహం వచ్చింది. దీంతో అతడు వెళ్లి సత్యనారాయణను అడిగాడు. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన టీచర్ ‘సైన్స్ సబ్జెక్ట్‌కు సంబంధించిన డౌట్ హిందీ టీచర్‌ను అయిన నన్ను అడుగుతావా..?’ అంటూ విద్యార్థి చెవిపై బూటుకాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా క్లాస్‌రూంలో చితకబాదాడు. ప్రశాంత్ ఏడుస్తూ వరండాలోకి వెళ్లగా.. మరోమారు కొట్టాడు. విద్యార్థి విషయం ప్రిన్సిపాల్ సాయినాథ్కు చెప్పడంతో ఆయన గుట్టుగా హిందీ టీచర్ సత్యనారాయణను ఇంటికి పంపారు. అదే రోజు పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించుకున్నా చెవి వినిపించడం లేదని ప్రశాంత్ తెలిపాడు. సోమవారం ఇంచార్జి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లును ‘సాక్షి’ వివరణ కోరగా.. విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్స చేయించామన్నారు. హిందీ టీచర్ సత్యనారాయణను ఇంటికి పంపినట్లు తెలిపారు.. కాగా ఇదే సమయంలో విద్యార్థి ప్రశాంత్ చురుకైన, మంచి విద్యార్థి అని ఇంచార్జి ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థి సంఘాల ఆందోళన.. విద్యార్థిపై దాడి విషయం బయటకు పొక్కడంతో సోమవారం విద్యార్థి జేఏసీ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాల నాయకులు గురుకుల పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ విచక్షణ మరిచిపోయి విద్యార్థిపై బూటుకాలుతో తన్నడం హేయమని మండిపడ్డారు. హిందీ టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ఇదే సమయంలో పాఠశాలలో సమస్యలు ఉన్నాయని విద్యార్థులు విద్యార్థి నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, నీటి సమస్య ఉందని, మరుగుదొడ్డు ఉన్నా ప్రయోజనం లేదని వాపోయారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ రవికుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీర్ మహ్మద్, పీడీఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం తదితరులున్నారు. -
తక్కువ నీరు.. ఎక్కువ సేద్యం
పరిగి రూరల్: బిందుసేద్యంతో నీటి వృథాను అరికట్టడమే కాకుండా తక్కువ నీటితో ఎక్కువ సేద్యం చేసేందుకు వీలుంటుందని తెలంగాణ రాష్ట్ర సూక్ష్మ నీటి పారుదల శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని బసిరెడ్డిపల్లిలో కావలి మల్లేష్ వ్యవసాయ పొలంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బిందుసేద్యంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకే గ్రామీణ ప్రాంతాల్లో డ్రిప్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులు ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు సాగు చేస్తున్నారన్నారు. కాల్వల ద్వారా పొలాలకు నీరందిస్తూ వ్యవసాయం చేయడం వల్ల నీరు వృథా అవుతోందన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న డ్రిప్ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డ్రిప్ కావాల్సిన రైతులు ఆల్‌లైన్‌లో కూడా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. బిందు సేద్యం ద్వారా పొలాలకు నీరందిస్తున్న రైతులు మూడు నెలలకోసారైనా డ్రిప్ పైపుల్లో పట్టిన నాచును తొలగించేందుకు యాసిడ్ ట్రీట్మెంట్ చేయాలన్నారు. అనంతరం యాసిడ్ ట్రీట్మెంట్ చేసే విధానం గురించి రైతులకు అర్థమయ్యేలా చేసి చూపించారు. అవగాహన సదస్సులో మైక్రో ఇరిగేషన్ జిల్లా కో ఆర్డినేటర్ బిచ్చయ్య, నెటాఫిమ్ కంపెనీ ప్రతినిధులు మధుప్రసాద్, జీవన్‌రెడ్డి, ఏరియా ఆఫీసర్ రాంరెడ్డి విజయ్, రాజనర్సింహులు, బాగన్న, శ్రీశైలం, జగన్మోహన్రెడ్డి, నర్సింహారెడ్డి, వెంకట్‌రెడ్డి, వినాయకరెడ్డి, నర్సింహులు,వెంకటయ్య, రామకృష్ణ పాల్గొన్నారు. -
రోజురోజుకూ పెరుగుతున్న బాలకార్మికుల సంఖ్య
పరిగి: బాల్యం పిల్లల హక్కు.. పిల్లలుండాల్సిన చోటు పాఠశాలలే.. బడికెళ్లని పిల్లలందరూ బాలకార్మికులే.. పెద్దలు పనికి, పిల్లలు బడికి.. ఇవి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న సూత్రాలు... గోడలపై రాసుకున్న రాతలు. అయితే వీటితో ప్రభుత్వం రాజీపడుతోంది. ఈ నినాదాలు సమావేశాలు, సదస్సులు దాటి కార్యాచరణకు నోచుకోవడం లేదు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి తెచ్చిన విద్యాహక్కు చట్టం వచ్చాక బాలకార్మికుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం మరో విశేషం. తూతూమంత్రంగా కార్యక్రమాలు.... ఎన్రోల్మెంట్డ్రైవ్, చదువుల పండగ, బడిబాట, విద్యా వారోత్సవాలు, విద్యా పక్షోత్సవాలు, విద్యా సంబురాలు ఇలా పది సంవత్సరాలుగా బాలకార్మికులను బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు. అయితే వీటిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయకపోవడంతో బాలకార్మికుల సంఖ్య పెరగడమేగాని తగ్గడం లేదు. విద్యాహక్కుచట్టం(2009) అమల్లోకి వచ్చి ఆరు సంవత్సరాలు కావస్తున్నా.. ఇప్పటికీ సంచారంలో, ఇటుక బట్టీల్లో, హోటళ్లలో, దాబాల్లో, దుకాణాల్లో , వెట్టిచాకిరీలో చిన్నారులు మగ్గుతూనే ఉన్నారు. పరిగిదే మొదటి స్థానం బాలకార్మికుల సంఖ్యలోనూ, నిరక్షరాస్యతలోనూ జిల్లాలో పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల, గండేడ్, దోమ మండలాలే ముందుస్థానంలో ఉన్నాయి. పరిగి, పూడూరు మండలాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. పలు స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం కుల్కచర్లలో 600 మంది, గండేడ్‌లో 500 పై చిలుకు బాలకార్మికులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఒక్క పరిగి పట్టణవలోనే 300 వరకు బాలకార్మికులు ఉన్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. వేల సంఖ్య లో బాలకార్మికులు బడిబయట ఆయా పనుల్లో కొనసాగుతున్నా వారిని బడిలో చేర్పించేందుకు ప్రత్యేకమైన వింగ్ లేకపోవడం దురదృష్టకరం. కళ్ల ఎదుటే బాలకార్మికులు కనిపిస్తున్నా ఇటు విద్యాశాఖ, అటు లేబర్ ఆఫీసర్లకుగాని పట్టడంలేదు. పొంతన లేని లెక్కలు..... బడిబయటి పిల్లల్ల గుర్తింపుకోసం నిర్వహిస్తున్న సర్వేలు ఒకదానితో ఒకదానికి పొంతన లేకుండా ఉన్నాయి. బడిబయట ఉన్న పిల్లల పేర్లు బడిలోకి వస్తున్నాయే తప్పా పిల్లలు మాత్రం బడులకు దూరంగానే ఉంటున్నారు. జిల్లాలో 2 వేల మంది బాలకార్మికులు ఉన్నట్లు విద్యా శాఖ అధికారులు చెబుతుండగా ఆరువేల మంది ఉన్నారని గతేడాది సాక్షరభారత్ కార్యకర్తలు నిర్వహించిన సర్వేలో బయటపడింది. అదే సమయంలో ఎంవీ ఫౌండేషన్‌లాంటి స్వచ్ఛంద సంస్థలు చెబుతున్న లెక్కల ప్రకారం రూరల్, అర్బన్ ఏరియాల్లో కలిపి దాదాపు 10 వేల మంది పిల్లలు బడికు దూరంగా ఉంటూ పనులు చేసుకుంటున్నారని సమాచారం. నెలరోజులు రెగ్యులర్‌గా ఓ విద్యార్థి బడికి రాకుంటే బాలకార్మికునిగా గుర్తించి బడికి రప్పించే చర్యలు చేపట్టాలని సర్వశిక్ష అభియాన్ చెబుతుండగా వాస్తవంలో ఆరు నెలలకు పైగా బడిబయట ఉన్న పిల్లలను కూడా బాలకార్మికులుగా గుర్తించటంలేదు. దీనికితోడు సంచార జాతుల్లో దాదాపు పిల్లలందరూ బాల కార్మికులుగానే కొనసాగుతున్నారు. విద్యాశాఖ అధికారుల లెక్కల్లో కనీసం వీరు పరిగణలోకి కూడా రావడం లేదు. అయితే ఐదేళ్లు నిండిన పిల్లలందరూ బడుల్లోనే ఉండాలనే సామాజిక నియమం వస్తే తప్పా బాలకార్మిక వ్యవస్థను రూపుమాపలేమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బడిబయటి పిల్లలందర్ని బడిలో చేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయినప్పటికీ స్వచ్ఛంద సంస్థలు, యువజన సవఘాలు, మహిళా సంఘాలు, సామాజికవేత్తలు, ప్రజాప్రతినిధులు తదితర వర్గాలు కూడా పిల్లలందర్నీ బడిలో చేర్పించేలా ప్రజలను చైతన్య పరిస్తే తప్పా బాల కార్మిక వ్యవస్థ నుంచి మన సమాజం బయట పడదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
తల్లీతమ్ముడే చంపేశారు..
పరిగి: ఇటీవల పరిగిలో వెలుగుచూసిన ‘అస్థిపంజరం’ కేసు మిస్టరీ వీడింది. హత్యకు గురైంది పరిగికి చెందిన ఆరెకటికె రాకేష్(22)గా పోలీసులు గుర్తించారు. వేధింపులు తాళలేక అతడిని తల్లీ, తమ్ముడే చంపేశారు. సోమవారం పరిగి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ప్రసాద్ కేసు వివరాలు తెలిపారు. పరిగి బాహర్పేట్ కాలనీకి చెందిన ఆరెకటికే బాలాజీకి భార్య బుజ్జీబాయి, కుమారులు రాకేష్(22), కమాల్ ఉన్నారు. బుజ్జీబాయి, చిన్నకొడుకు కమాల్‌తో కలిసి పరిగిలోని కల్లు దుకాణం వద్ద బజ్జీలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేది. భర్త, పెద్ద కుమారుడు ఖాళీగా తిరుగుతూ మద్యం తాగుతుండేవారు. డబ్బులు అవసరమైన ప్రతిసారి తండ్రీకొడుకులు బుజ్జీబాయి ని వేధించడమో.. లేక చిన్నచిన్న చోరీలు చేస్తుండేవారు. ఈక్రమంలో వారు గతంలో జైలుకు కూడా వెళ్లివచ్చారు. వేధింపులు భరించలేక.. ఆరునెలలుగా తండ్రీకొడుకులు బాలా జీ, రాకేష్‌లు డబ్బుల కోసం బుజ్జీబాయి, కమాల్‌ను తీవ్రంగా వేధించసాగారు. ఈక్రమంలో బాలాజీ ఇటీవల గండేడ్ మండలంలో మేకల చోరీకి పాల్పడడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఆయనకు బెయిల్ ఇప్పించేం దుకు డబ్బులు ఇవ్వాలని రాకేష్ తల్లిని వేధించాడు. దీంతో బుజ్జీబాయి కొంతడబ్బు పోగుచేసి ఇటీవల బెయిల్‌కు సంబంధించిన ఫీజు ఇచ్చింది. అయినా రాకేష్ డబ్బులు అడుగుతూనే ఉన్నాడు. వేధింపులు భరించలేని కమాల్, బుజ్బీబాయిలు ఎలాగైనా రాకేష్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం మనసు మార్చుకున్నారు. మద్యం తాగి వచ్చిన ప్రతీసారి రాకేష్ కుటుంబీకులను వేధించడంతో బుజ్జీబాయి, కమాల్ అతడి కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో ఉన్న టేబుల్‌కు కట్టేసి తమ పనులు చూసుకునేవారు. ఈ విషయం ఇరుగుపొరుగు వారికి కూడా తెలుసు. హత్యకు దారితీసిన పరిస్థితి.. ఈనెల 1న ఉదయం 10 గంటల సమయంలో రాకేష్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తల్లీతమ్ముడిని దూషించి వారిపై దాడికి యత్నించాడు. దీంతో ఎప్పటిమాదిరిగానే బుజ్జీబాయి చిన్నకొడుకు కమాల్‌తో కలిసి రాకేష్ కాళ్లుచేతులు కట్టేసి ఇంట్లో ఉన్న టేబుల్‌కు బిగించి తమ పనుల్లో నిమగ్నమైపోయారు. రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత తల్లీకొడుకులు రాకేష్ కట్లు విప్పారు. అనంతరం రాకేష్ తమ్ముడు, తల్లితో గొడవకు దిగాడు. అతడి వేధింపులు భరించలేని వారు రాకేష్‌పై దాడిచేశారు. ఈక్రమంలో అతడు కిందపడిపోవడంతో బుజ్జీబా యి రాకేష్ కాళ్లను గట్టిగా పట్టుకుంది. కమాల్ గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అర్ధరాత్రి తల్లీకొడుకులు రాకేష్ శవాన్ని గోనెసంచిలో తీసుకెళ్లి సమీపంలో ఉన్న గుంతలో పడేశారు. మృతదేహంపై కిరోసిన్ పోసి తగులబెట్టారు. మరుసటి రోజు ఉదయం కమాల్ వెళ్లి చూడగా మృతదేహం పూర్తిగా కాలిపోలేదు. దీంతో గడ్డి వేసి మరోసారి నిప్పంటించాడు. అప్పటికీ శవం పూర్తిగా కాలిపోకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో పక్కనే ఉన్న గ్లోబల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ముజీబ్ వెళ్లి చూడగా శవం కనిపించింది. ఏదో జంతువు కళేబరం అయి ఉండొచ్చని భావించిన ఆయన గత మంగళవారం పంచాయతీ కార్మికులతో తగులబెట్టించారు. అయినా దుర్వాసన తగ్గకపోవడంతో ప్రిన్సిపాల్ గత గురువారం ఘటనా స్థలానికి వెళ్లి చూశాడు. కొన్ని ఎముకలు, పుర్రె కనిపించటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు ఇలా ఛేదించారు.. వైద్యులు పుర్రె, ఎముకలు మనిషివేనని నిర్ధారించారు. కాగా దుస్తులు లేకపోవడం.. అప్పటికే కుళ్లిపోవడంతో ఆడా.. ? మగా.. అనే విషయం తెలియలేదు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు ప్రారంభించారు.అస్థిపంజరం బయటపడటంతో అప్రమత్తమైనబుజ్జీబాయి తన కొడుకు కనిపించటంలేదని బంధువులకు, తెలిసిన వారితో చె ప్పటం ప్రా రంభించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈక్రమంలో స్థానికులను విచారించారు. రాకేష్ ప్రవర్తన.. అతడి కుటుంబీకుల గురించి తెలుసుకున్నారు. దీంతో అనుమానించి బుజ్జీబాయి, కమాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం అంగీకరించి పైవిషయాలు తెలిపారు. ఈమేరకు నిందితుల్ని సోమవారం రిమాం డుకు తరలించారు. కేసును ఛేదించిన ఎస్ఐలు కృష్ణ, శంషొద్దీన్, కానిస్టేబుళ్లు పాండుగౌడ్, చంద్రశేఖర్‌లను ఈ సందర్భంగా సీఐ ప్రసాద్ అభినందించారు. -
మాకే అమ్మాలె!
పరిగి: తాము పండించిన మక్కలు, ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోతోంది. రైతులు పెట్టుబడుల కోసం తీసుకున్న అప్పులు.. వాళ్ల రాబడికి ఎసరు పెడుతున్నాయి. మార్కెట్లో కమీషన్ ఏజెంట్లు(అడ్తిదారులు)గా పనిచేస్తున్న వారే వడ్డీ వ్యాపారుల అవతారమెత్తి రైతులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలతో పోలిస్తే క్వింటాలుకు రూ.200 నుంచి రూ. 300 తక్కువైనా అడ్తాదారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ కారణంగా సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతు లు మద్దతు ధర దక్కే పరిస్థితి కన్పిం చడం లేదు. పరిగిలో మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన నాటి నుంచి అటు కొనుగోలు కేంద్రాలకు, ఇటు పరిగి వ్యవసాయ మార్కెట్లో అడ్తీదారుల వద్దకు వస్తున్న రైతు ఉత్పత్తులే ఇందుకు నిదర్శనం. మార్కెట్‌కు ఒక్కరోజే నాలుగు వేల క్వింటాళ్ల మక్కలు.. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు పరిగిలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి 15రోజులైంది. వేల కొలది ఖాళీ సంచులు సైతం అందుబాటులో ఉంచారు. ఐదారుగురు సిబ్బంది, కూలీలను కొనుగోలు కేంద్రం వద్ద ఉంచుతున్నారు. కానీ 15 రోజుల్లో కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చి విక్రయించిన మక్కలు కేవలం 500 క్వింటాళ్లు మాత్రమే. అదే గత శుక్రవారం ఒక్కరోజే ఆ పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్లో అడ్తీల వద్దకు 4వేల క్వింటాళ్ల మక్కలు వచ్చాయి. కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు రూ.1,310 చెల్లిస్తుండగా.. మార్కెట్లో రూ.1000 నుంచి రూ.1,150 మాత్రమే ఇస్తున్నారు. రైతులు క్వింటాలుకు రూ.200 నుంచి రూ.300 వరకు నష్టపోతున్నారు. ఇప్పటికే రైతులు ఇలా రూ.10 లక్షల వరకు నష్టపోయారు. అధికారికంగా మాత్రమే ఈ లెక్కులు. పరిగిలో జీరో మార్కెట్ నిర్వహిస్తున్నందున.. ఆ సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉంది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడమే కారణం రైతులు కొనుగోలు కేంద్రాలకు విక్రయించకుండా అడ్తీదారులకు విక్రయిస్తూ ప్రభుత్వ మద్దతు ధర పొందక పోవడానికి ఈ సారి బ్యాంకులు రుణాలివ్వకపోవటమే ప్రధాణ కారణంగా చెప్పవచ్చు. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు అడ్తాదారుల వద్ద, ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్ల వద్ద అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో తప్పని పరిస్థితితో పండించిన పంటను అడ్తీదారుల వద్దకు తీసుకు వెళ్లి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. అప్పులు ఇచ్చిన అడ్తీదారులు, వ్యాపారులు పండించిన పంటను తమకే విక్రయించాలని ముందే కండీషన్ పెట్టడడంతోపాటు వందకు నెలకు రూ. మూడు.. అంతకంటే ఎక్కువ వడ్డీ కూడా వసూలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో సవాలక్ష నిబంధనలు.. మొక్కజొన్నలు, ధాన్యానికి మద్దతు ధరలు ప్రకటించిన ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అనేక నిబంధనలు పెట్టింది. తేమశాతం మొక్కజొన్నలకు 14, ధాన్యానికి 17 ఉండాలనే నిబంధన ఉంది. ఏమాత్రం తేమశాతం ఎక్కువగా ఉన్నా కొనడం లేదు. బీ, సీ గ్రేడ్ మక్కులు సైతం కొనుగోలు చేస్తామని ప్రకటించినా వాటిని రెండో, మూడో గ్రేడ్లలోకి నెట్టేస్తున్నారు. ఒక వేళ తేమ శాతం నిర్దేశించిన విధంగా ఉండి కొనుగోలు చేసినా డబ్బులు 15 రోజుల తర్వాత చెల్లిస్తారు. ఒక్కోసారి నెలలు పడుతుంది. పండించిన ఉత్పత్తులు తమవేనని రెవెన్యూ అధికారులతో ధ్రువీకరించాలి. ఇవన్నీ దాటుకుని కొనుగోలు కేంద్రంలో విక్రయించినా.. డబ్బులు చెక్కురూపంలో ఇస్తారు. ఆ చెక్కును మార్చుకునేందుకు బ్యాంకులకు వెళితే అధికారులు పాత బకాయిల కింద జమచేసుకుంటారనే భయం. ఇవన్నీ రైతులకు మద్దతు ధరను దూరం చేయడంతోపాటు వ్యాపారుల ఉచ్చులో చిక్కుకునేలా చేస్తున్నాయి. -
పరిగిలో వంద పడకల ఆస్పత్రి
పరిగి, పరిగి రూరల్: వెనుకబడి ఉన్న పరిగిలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని రవాణా శాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆసరా పథకంలో బాగంగా నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన పరిగి సర్పంచ్ విజయమాల ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో , మండల పరిధిలోని సయ్యద్‌మల్కాపూర్‌లో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ ప్రారంభ సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ శాఖ మంత్రితో మాట్లాడి పరిగి పంచాయతీ భవనానికి కోటి రూపాయలు మంజూరు చేయిస్తానన్నారు. తెలంగాణా ఆర్టీసీని దేశంలోనే ముందు వరుసలో నిలబెడతామని తెలిపారు. రూ. 150 కోట్లతో 500 బస్సులు, ఇందులో 100 ఏసీ బస్సులు త్వరలో కొనుగోలు చేసి ఆర్టీసీకి అందిస్తామన్నారు. ఈవారంలో పరిగి డిపోకు ఐదు బస్సులు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 1300 గ్రామాలకు రోడ్లులేని కారణంగా బస్సులు నడవడం లేదని గుర్తించామన్నారు. ఆ గ్రామాలన్నింటికి రోడ్లు వేసి బస్సులు నడుపుతామన్నారు. ఆర్అండ్బీ రోడ్ల కోసం రూ. 10 వేల కోట్లు, పంచాయతీ రాజ్ రోడ్ల కోసం రూ.ఐదు వేలకోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆరు నుంచి తొమ్మిది నెల ల్లో ఈ రోడ్ల పనులు పూర్తి చేస్తామన్నారు. జిల్లాకు చెందిన నాలుగు పశ్చిమ నియెజకవ ర్గాల్లో ఉద్యానవన పంటలతో పాటు పాడి, పౌల్ట్రీ పరిశ్రమలను అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో చెరువుల పునరుద్దరణ, ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు, తాగు నీరు అందిస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో పరిగి నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందన్నారు. వ్యవసాయానికి , గృహ అవసరాలకు 24 గంటల నిరంతర కరంటు ఇచ్చేవిధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 7కోట్ల రూపాయలను పింఛన్ల కోసం వెచ్చించగా కొత్త పింఛన్లతో రూ.27 కోట్లకు పెంచామన్నారు. జిల్లాలో 2.40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. పేదలకు ఇళ్లు, ‘కళ్యాణ లక్ష్మి’ పథకాలు వెంటనే ప్రారంభమవుతాయన్నారు. -
వీరికి తెలిసింది ‘రెఫర్’ ఒక్కటే
పరిగి: రోగం.. నొప్పి.. ఇంకేదైనాసరే.. పరిగి ప్రభుత్వ వైద్యులను ఆశ్రయించే వారు చెప్పేది ఒక్కటే ‘రెఫర్’. ప్రతి కేసును రెఫర్ చేయడం డాక్టర్లకు పరిపాటు అయిందని స్థానికులు మండిపడుతున్నారు. కాన్పు కోసం ఓ మహిళ ఆస్పత్రికి వస్తే పరీక్షించకుండానే వైద్యులు ఉస్మానియాకు రెఫర్ చేశారు. గంటలోపే స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మహిళకు నార్మల్ డెలివరీ జరిగింది. వివరాలు.. పరిగి గౌరమ్మ కాలనీకి చెందిన లలిత తన కూతురు మంజుల(28)ను కాన్పు కోసం శనివారం తెల్లవారుజామున పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చింది. డ్యూటీ డాక్టర్, నర్సులు పరీక్షించి బీపీ ఎక్కువగా ఉంది.. కాన్పు చేయటం వీలుకాదని ఉస్మానియాకు రెఫర్ చేశారు. డబ్బులు లేక సర్కారు ఆస్పత్రికి వచ్చాం.. అంతదూరం ఎలా వెళ్తామని మంజుల కుటుంబీకులు వైద్యులను నిలదీశారు. చేసేది లేక పక్కనే ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. గంటలోపే అక్కడ నార్మల్ డెలివరీ జరిగింది. తల్లిపిల్ల క్షేమంగా ఉన్నారు. బిల్లు మాత్రం రూ.10 వేలు అయింది. అంత డబ్బు తామెక్కడి నుంచి తీసుకురావాలి.. సర్కార్ వైద్యులే ప్రసవం చేస్తే సరిపోయేదని బాలింత కుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. మంజుల పరిస్థితి విషమిస్తే ప్రైవేట్ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీ ఎలా జరుగుతుందని మండిపడ్డారు. రూ. 10 వేలు మీరే చెల్లించాలని పట్టుబట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని సముదాయించారు. దీంతో చేసేది లేక మంజుల కుటుంబీకులు వెళ్లిపోయారు. ఈ విషయమై డ్యూటీ డాక్టర్ కిశోర్‌ను వివరణ కోరగా.. మంజులకు బీపీ ఎక్కువగా ఉండడంతో ఉస్మానియాకు రెఫర్ చేద్దామనుకున్నాం.. అంతలోపే వారు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. -
వైఎస్ఆర్ స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేస్తాం
పరిగి: పేదల గుండెల్లో చిరస్మరణీయుడిగా మిగిలిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ స్ఫూర్తితో తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రుక్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జగన్మోహన్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల ఆధ్వర్యంలో తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తెస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సంక్షేమ పథకాలను అర్హులకు కూడా దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. చేవెళ్లలో ఈనెల 9న నిర్వహించే పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతుకుముందు చేవెళ్ల రాష్ట్ర సదస్సు పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కుముదిని, యాదయ్య, అజీజ్, యాకబ్, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
‘అవి ప్రభుత్వ హత్యలు’
పరిగి: రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని డీసీసీ ఉపాధ్యక్షుడు సుభాష్‌చందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నారాయణ్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు లాల్‌కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. అప్పుల బాధతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దోమ మండలం బొంపల్లి తండాకు చెందిన రాములునాయక్ మృతదేహంతో నాయకులు, మృతుడి బంధువులు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. బస్‌స్టాండు ఎదుట హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ నాయకులు కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ పిట్టలా నేలరాలుతున్నా సర్కార్‌కు చీమకుట్టినట్లు కూడా కావడంలేదని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకులు కొర్రీలు పెడుతూ రుణాలివ్వకున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. బ్యాంకులు అప్పులివ్వక.. కరెంట్ లేక పంటలు కళ ్లముందే ఎండిపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నాయకులు తెలిపారు. రైతుల మృతితో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే రైతు సమస్యలపై దృష్టిసారించి సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. గంటకు పైగా నిర్వహించిన రాస్తారోకోతో రోడ్డుపై వాహనాలు స్తంభించిపోయాయి. సీఐ ప్రసాద్, ఎస్ఐ కృష్ణ, శంషొద్దీన్‌లు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేసే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పరిగి తహశీల్దార్ విజయ్‌కుమార్‌రెడ్డి అక్కడికి చేరుకొని వారిని సముదాయించారు. రాములునాయక్ ఆత్మహత్య విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, మృతుడి కుటుంబీకులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతుడి కుటుంబీకు లు, నాయకులు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించారు. దీంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంపల్లి రాములు, రవీంద్ర, రామకృష్ణ, ఎర్రగడ్డపల్లి కృష్ణ, సర్వర్, అక్బర్, ఆంజనేయులు, టీ.వెంకటేష్, సమద్, షాహెద్, శివకుమార్ తదితరులు ఉన్నారు. -
పరిగిలో టీడీపీ నేతల దౌర్జన్యం
వైఎస్ఆర్ సీపీ నేతపై దాడి పరిగి : మరుగు దొడ్డి నిర్మాణ సామగ్రిని రోడ్డుపై కాకుండా పక్కకు ఉంచుకోవాలని సూచించిన పాపానికి వైఎస్ఆర్ సీపీ నేతపై టీడీపీ నేతలు దాడి చేశారు. బాధితుడు అనిల్‌కుమార్ తెలిపిన మేరకు... పి.నరసాపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మాణాన్ని అదే గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారు సర్పంచ్ వర్గీయులు శుక్రవారం చేపట్టారు. అందుకు సంబంధించిన సామగ్రిని వారు రోడ్డుపై ఉంచుకుని పనులు చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన వైఎస్ఆర్ సీపీ నేత అరుణ్‌కుమార్ రోడ్డుకు అడ్డంగా ఉంచిన సామగ్రిని పక్కకు వేసుకోవాలని సూచించాడు. ఆ సమయంలో వాగ్వాదం చోటు చేసుకుని అరుణ్‌కుమార్‌పై వారు దాడి చేశారు. ఘటనపై అదే రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఘటనకు బాధ్యులను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తామని పోలీసులు చెప్పి పంపారు. శనివారం ఉదయాన్నే అరుణ్‌కుమార్‌పై సర్పంచ్ వర్గీయులు మరోసారి దాడికి తెగబడ్డారు. వారి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ వైపు అరుణ్‌కుమార్ పరుగు తీశాడు. జరిగిన విషయాన్ని ఎస్ఐ రంగడుకు వివరించారు. విషయం తెలుసుకొన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ పరిగి పోలీస్ స్టేషన్లో ఉన్న అరుణ్ కుమార్‌ను పరామర్శించి, దాడికి గల కారణాలను అడిగి తెలుసుకొన్నారు. ఎస్ఐతో చర్చించారు. సర్పంచు వర్గీయులు కావాలనే తమ పార్టీ నాయకుడిపై దాడి చేసారన్నారు. వెంటనే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ న్యాయం జరగకపోతే విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళతామని అన్నారు. దాడి చేసిన వారిపై తప్పక చర్యలు తీసుకొంటామని ఎస్ఐ తెలిపారు. -
ఇసుక దందా ఆపేవారెవరు?
పరిగి: ఇసుక మాఫియా రోజురోజుకు విజృంభిస్తోంది. పంట పొలాలు, బీడు భూములు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అని తేడాలేకుండా యథేచ్ఛగా ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ నాయకులను, అధికార యంత్రాంగాన్ని ఇసుక మాఫియా శాసిస్తోంది. వాగులు, నదుల నుంచి ఇసుక తీసుకు రావటానికి అడ్డంకులు ఎదురవుతుండటంతో స్థానికంగా ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసుకుని ఇసుక దందా కొనసాగిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఫిల్టర్లు ఏర్పాటు చేసి ఫిల్టర్ చేసిన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి నిల్వ చేస్తున్నారు. ఆ ఇసుకను లారీల ద్వారా రవాణా చేస్తూ కాసుల పంట పండించుకుంటున్నారు. చట్టాలన్నీ చుట్టాలే... సహజ వనరుల దుర్వినియోగ నియంత్రణ చట్టం(వాల్టా), నాన్ అగ్రికల్చర్ ల్యాండ్(నాలా), ఫారెస్టు పరిరక్షణ చట్టాలన్నింటినీ ఇసుక మాఫియా చుట్టాలుగా మార్చుకుంటోంది. గండేడ్, కుల్కచర్ల మండలాల్లో వాగు ల్లో ఇసుకను తవ్వి రవాణా చేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తుండగా, పరిగి, దోమ మండలాల్లో పొలాలు, బీడు భూములు అని తేడా లేకుండా మట్టిని తవ్వుతూ ఫిల్టర్లకు వినియోగిస్తూ నాలాకు తూట్లు పొడుస్తున్నారు. ఇసుక తయారీకి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. కుంటులు, చెరువుల్లోని నీటిని ఇసుక తయారీకి వినియోగిస్తున్నారు. అరుునా ఏ ఒక్క శాఖ అధికారులు కూడా ఇసుక మాఫియాను నియంత్రించలేకపోతున్నారు. అటవీ భూముల్లోనూ ఇసుక ఫిల్టర్లు... పరిగి మండల పరిధిలోని గడిసింగాపూర్, రూప్‌ఖాన్‌పేట్, రంగంపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉన్న అటవీ భూములు ఇసుక ఫిల్టర్లకు అడ్డాలుగా మారాయి. వీరు అటవీ భూముల్లో సైతం తవ్వకాలు జరుపుతూ ఇసుకను కొల్లగొడుతున్నా సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూలేకుండా పోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానాలకు ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. గండేడ్ మండల పరిధిలోని ధర్మాపూర్, శేఖపల్లి, గాధిర్యాల్, చిన్నవార్వాల్, పెద్దవార్వాల్, రంగారెడ్డిపల్లి, పగిడ్యాల్ ప్రాంతాల్లో ఇసుక నిల్వ ఉంది. దోమ మండల పరిధిలోని పలుగ్రామాల్లో ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అధికారులు, పోలీసులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి స్వల్పంగా జరిమానాలు విధించి మామూళ్లు తీసుకొని వదిలి పెట్టడంతో వ్యాపారులకు ఇసుక తరలింపు మంచి వ్యాపారంగా మారింది. -
పరిగి ఆలయంలో చోరీ!
-
టీఆర్ఎస్ నేతల అలక..
పరిగి: జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి వైఖరిపై పరిగి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు అలకబూనారు. సోమవారం గండేడ్ మండల సర్వసభ్యసమేవేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీ.రామ్మోహన్‌రెడ్డి(టీఆర్ఆర్)తో కలిసి ఆయన నివాసంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయటం నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపింది. టీఆర్ఎస్కు సంబంధించి నియోజకవర్గం నుంచి ఐదుగురు జెడ్పీటీసీలు, సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ప్రాధాన్యతనివ్వటంపై వారు ఆవేదనకు గురవుతున్నారు. మంత్రి ఎదుట గోడు.. ఈ విషయంపైనే మంగళవారం నియోజకవర్గం నుంచి 50 మందికి పైగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఓ దశలో కేసీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆయన అపాయింట్మెంటు కోసం కూడా యత్నించినట్లు సమాచారం. అయితే ముందుగా ఓ మాట జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డికి చెబితే బాగుంటుందని పరిగికి చెందిన సీనియర్ నాయకుడి సలహాతో అందరు వెళ్లి ఆయనను కలిసినట్లు తెలిసింది. గంటపాటు ఆయనతో చర్చించగా మరో సారి అలా జరగదని మంత్రి మహేందర్‌రెడ్డి హామీ ఇవ్వటం తో పరిగి శ్రేణులు వెనుదిరిగి వచ్చినట్లు సమాచా రం. ఇదే సమయంలో గతంలో ప్రసాద్‌కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో అప్పటి పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి కలిసి కార్యక్రమాల్లో, ప్రెస్మీట్లలో పాల్గొన్నారనే విషయంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. -
ఖాకీలకు క్వార్టర్లు కరువు..!
పరిగి: పరిగి పోలీసులు క్వార్టర్స్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఐ, ఇద్దరు ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కూడా అద్దె ఇళ్లల్లోనే తల దాచుకోవాల్సిన పరిస్థితి. పదన్నోతులు, బదిలీల సమయంలో పోలీసులు పరిగికి వచ్చిన వెంటనే ముందుగా ఇళ్లు వెతుక్కునే పనిలో పడాల్సి వస్తోంది. గతంలో పరిగిలో పోలీస్ క్వార్టర్స్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే స్థలం అందుబాటులో లేకపోయే సరికి ఆ నిధులు వెనక్కి వెళ్లాయి. అయితే నాలు గేళ్ల క్రితం పోలీసు క్వార్టర్స్ నిర్మించేం దుకు పరిగి గ్రామపంచాయితీ స్థలం కేటాయించింది. కాని ప్రభుత్వం ఇప్పు డు నిధులు మంజూరు చేయడం లేదు. మండలాల్లో అంతా అస్తవ్యస్తం... పరిగిలోనే కాకుండా నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లో కూడా పోలీసుల క్వార్టర్స్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కొన్నిచోట్ల క్వార్టర్లు లేకుండా ఉంటే, మరికొన్ని చోట్ల క్వార్టర్లు ఉన్నప్పటికీ అవి నివాసయోగ్యంగా లేకపోవడంతో పోలీసులు అద్దె ఇళ్లలో నివసించక తప్పని పరిస్థితి. పూడూరు, దోమ మండలాల్లో క్వార్టర్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. గండేడ్ మండలం మహ్మదాబాద్‌లోని క్వార్టర్లు కాస్త బాగుండటంతో మెజార్టీ జవాన్లు, ఎస్సై అక్కడే ఉంటున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో పోలీసులు వికారాబాద్, పరిగిల్లో నివాసముంటూ విధులకు హాజరవుతున్నారు. అయితే అత్యవసర సమయాల్లో వీరు స్టేషన్‌ను రావడానికి సమయం తీసుకుంటుండటంతో తీవ్ర ఇబ్బందిగా మారింది. అంతేకాకుండా కొత్తగా విధుల్లో చేరుతున్న పోలీసులకు మాత్రం అద్దె ఇళ్లు తీవ్ర భారంగా మారాయి. వీరికి హెచ్ఆర్ఏ తక్కువగా ఉండటంతో అద్దె చెల్లించడానికి తీవ్ర ఇబ్బందిగా ఉందని వారు చెబుతున్నారు. -
వాటర్ ‘గ్రిడ్’గండం!
పరిగి: కొత్త ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ‘వాటర్‌గ్రిడ్’ ప్రతిపాదన కారణంగా పరిగి నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు ఉద్దేశించిన నీటి తరలింపు పథకానికి అడ్డంకులు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా పరిగి నియోజకవర్గ ప్రజలకు తాగునీరందించేందుకు గత ప్రభుత్వ హయాంలో నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు 0.5 టీఎంసీల నీటి కేటాయింపు కూడా జరిగిపోయింది. రూ. 50 లక్షలు మంజూరు చేసి సర్వే చేయించారు. రూ. 150 కోట్ల అంచనాలతో టెండర్లకు రంగం సిద్ధం చేసిన సమయంలో ఎన్నికలు రావటంతో.. ప్రాసెస్ నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా జిల్లాలో వాటర్ గ్రిడ్ అమలు చేస్తే... కోయిల్‌సాగర్ కథ కంచికి చేరినట్లేనని అంటున్నారు. గ్రిడ్ ద్వారా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు తాగు నీరందుతుంది కాబట్టి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అటు స్థానిక ప్రజల్లోనూ ఇటు ప్రజాప్రతినిధుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు పథకం ప్రారంభించి పూర్తి చేస్తే 18నెలల్లో పరిగికి తాగునీరు అందుతుంది. కానీ గ్రిడ్ అమలు కావాలంటే కొన్నేళ్లు పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కోయిల్ సాగర్‌ను గ్రిడ్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పథకానికి రూపకల్పన ఇలా... పరిగి నియోజకవర్గంలో గత దశాబ్ద కాలంగా వేసవి వచ్చిందంటే తీవ్ర నీటిఎద్దడి ఏర్పడుతూ వస్తోంది. ఇదే క్రమంలో 20కి పైగా గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య కూడా ఉందని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి గత ఐదారు సంవత్సరాలుగా కోయిల్‌సాగర్ నుంచి నీళ్లందించేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రులకు , మంత్రులకు వినతి పత్రాలు ఇస్తూ వచ్చారు. దీంతో ప్రభుత్వం కోయిల్‌సాగర్ నుంచి నీరందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించింది. రంగంలోకి దిగిన అధికారులు నియోజకవర్గ పరిధిలోగల 442 ఆవాసాలకు నీరందించాలంటే 0.5 టీఎంసీల నీరు అవసరమని తేల్చారు. ఇందుకోసం రూ. 300 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. మొదటి విడతగా 243 ఆవాసాలకు నీరందించేందుకు నిర్ణయించి రూ. 150 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు తయారు చేశారు. రూ.50 లక్షలు మంజూరు చేయటంతో సర్వే పనులు పూర్తిచేసి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేశారు. ఈదశలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పనులకు బ్రేక్‌పడింది. వాటర్‌గ్రిడ్‌పై కసరత్తుతో... పరిగికి కోయిల్‌సాగర్ నీరందించేపథకానికి త్వరలో టెండర్లు పిలుస్తారని, పనులు ప్రారంభమవుతాయని పరిగి ప్రజలు కలలుగంటున్న తరుణంలో ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌ను తెరపైకి తెచ్చింది. జిల్లా యూనిట్‌గా తీసుకుని వాటర్‌గ్రిడ్‌కు ప్రతిపాదనలు తయారు చేసే పనిలో నిమగ్నమైన అధికారులు జిల్లాలో ఉన్న సుమారు 50 లక్షల మందికి 10 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయని అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇందుకోసం మంజీరా, నాగార్జునసాగర్, జూరాల, సింగూర్ ప్రాజెక్టుల్లో ఎక్కడి నుంచి నీళ్లు తేవటం సులువవుతుందనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో పరిగి నియోజకవర్గానికి కోయిల్ సాగర్ నీరందించే పథకం కథ కంచికి చేరినట్లైంది. -
ఇన్పుట్ ఎప్పుడు?
పరిగి: పంటలు నష్టపోయి ఏడాది కావస్తున్నా రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ విషయంలో స్పష్టత రావటంలేదు. 2009 నుంచి గత సంవత్సరం వరకు ఉన్న పెండింగ్ నిధులతోపాటు 2013 సంవత్సరంలో జరిగిన అపార పంట నష్టానికి సంబంధించి జిల్లాకు ఇన్పుట్ సబ్సిడీగా రూ.31 కోట్లు వచ్చాయని నాయకులు హడావిడి చేస్తుండగా అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో కేంద్రం నిబంధనల మేరకు హెక్టారుకు రూ.10 వేలు ఇవ్వాలని ఉండగా రాష్ట్ర నిబంధనలు ఎలా ఉన్నాయనే విషయంపై అధికారుల్లోనూ స్పష్టత లేదు. ఇన్పుట్ సబ్సిడీని యాక్సిస్ బ్యాంకు ఖాతాలో వేశామని ప్రభుత్వం చెబుతుండగా జిల్లా ఖాతాలోకి మాత్రం ఇంకా డబ్బులు రాలేదని అధికారులు అంటున్నారు. మరో పక్క వ్యవసాయశాఖ అధికారులు గ్రామస్థాయి అధికారులకు ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలు ఇవ్వడంతో రైతులు కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే మరో 15 రోజుల వరకు ఏమీ చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది లెహర్, ఫైలిన్, హెలెన్ రూపంలో మూడు తుపాన్లు విరుచుకుపడి రైతులను అతలాకుతలం చేయగా ఏయే తుపాన్లకు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇస్తున్నారనే విషయంలోనూ అధికారులు స్పష్టతనివ్వటంలేదు. తప్పని ఎదురుచూపులు.. పంటలకు నష్టం వాటిల్లి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పరిహారం అందించకుండా ప్రభుత్వం రైతులతో పరిహాసమాడుతోంది. 2013 అక్టోబర్‌లో ఫైలిన్ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలతోపాటు రెండు మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న నష్టపరిహారం అందించటంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అటు ఈ సం వత్సరం వ్యవసాయ పంటరుణాలు అందక.. ఇటు గతఏడాది నష్టపోయిన పంట లకు పరిహారమూ అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎట్టకేలకు రెవెన్యూ, వ్యవసాయ, అర్థగణాంక శాఖలు సంయుక్తంగా సర్వేలు నిర్వహించి పంట నష్టంపై పూర్తిస్థాయి అంచనాలు తయారు చేశారు. వీటిని ప్రభుత్వానికి పంపి కూడా ఎనిమిది నెలలు గడిచింది. ఇప్పటికీ పరిహారం మాత్రం రైతులకు అందలేదు. 7,497 హెక్టార్లలో పంట నష్టం.. ఫైలిన్ తుపాన్ ప్రభావంతో పరిగి వ్యవసాయ డివిజన్లో జరిగిన పంటల నష్టం వివరాలతో కూడిన నివేదికలు అప్పట్లో పై అధికారులకు స్థానిక అధికారులు అందజేశారు. పరిగి మండలంలో వరి 120 హెక్టార్లు, మొక్కజొన్న 1520 హెక్టార్లు, పత్తి 1800 హెక్టార్లు, దోమ మండలంలో వరి 380 హెక్టార్లు, మొక్కజొన్న 900 హెక్టార్లు, కుల్కచర్ల మండలంలో వరి 1083 హెక్టార్లు, గండేడ్ మండలంలో వరి 1694 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. అంటే మొత్తం వ్యవసాయ డివిజన్లో 7497 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది. గతంలోలా సమస్యలు తలెత్తకుండా సర్వే వివరాలు, నష్టంపోయిన రైతుల జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించారు కూడా. ఆ వెంటనే పంటనష్టం పరిహారం అందజేస్తామని పలుమార్లు చెబుతూ వచ్చిన గత ప్రభుత్వం ఎన్నికలు వచ్చే నాటికి ఆ విషయం మరిచిపోయింది. తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా పంట నష్టం పరిహారం ఊసెత్తకపోవటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం సత్వరమే స్పందించి పంటనష్టానికి పరిహారం. ఇన్పుట్సబ్సిడీలను అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
బంగారు తల్లి భవితవ్యం ఏంటి?
పరిగి:బంగారు తల్లి పథకానికి బాలారిష్టాలు దాటకముందే అడ్డంకులు మొదలయ్యాయి. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పథకాన్ని కొనసాగిస్తుందా లేదా అనే విషయంలో ఇప్పటికి సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో బంగారు తల్లుల్ని కన్న తల్లిదండ్రులు ఆందోళనకు గరరవుతున్నారు. ఈ పథకం ప్రారంభించి ఏడాది కావస్తుండగా.. తొమ్మిది నెలలుగా లబ్ధిదారులకు డబ్బులు చెల్లించడం నిలిపి వేశారు. బాలికల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని భరోసా కల్పిస్తూ 2013 మేలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అమ్మాయి పుట్టింది మొదలు.. డిగ్రీ వరకు ఆమె చదువు తదితర ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఈ పథకాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టారు. పుట్టినప్పటినుంచి ఏడాదివారీ ఖర్చుల నిమితం బాలిక డిగ్రీ పూర్తి చేసే సమయానికి మొత్తం రూ. 2.16 లక్షలు అందజేయడమే ఈ పథకం లక్ష్యం. అయితే ఇంతలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, కొత్త ప్రభుత్వం ఈ పథకంపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. అంతేకాకుండా ఈ పథకానికి నిధుల కేటాయింపు కూడా లేకపోవడంతో ఆడపిల్లలు జన్మించిన వెంటనే పేర్లు నమోదు చేయించుకుంటున్నా.. పథకం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. అయినప్పటికీ ఆడపిల్లలని కన్నవారు ఇప్పటికీ బంగారుతల్లి పథకానికి పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. ‘బంగారు తల్లి పథకం’ కింద తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం నుంచి ఈ పథకంపై స్పష్టత కరువైనా అధికారులు మాత్రం బంగారు తల్లి పథకం కింద పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇంకా అవగాహన కరువు బంగారు తల్లి పథకం కొనసాగుతుందా లేదా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదు. దీనికితోడు ప్రజలకు కూడా ఈ పథకంపై అవగాహన కరువైంది. పథకం ప్రారంభమైన నాటినుంచి జిల్లాలో ఇప్పటి వరకు 26,362 మంది బాలికలు జన్మించారు. అయితే వారిలో 2,432 మంది మూడో కాన్పులో పుట్టడం, కుటుంబ సభ్యులు పింక్ కార్డు కలిగి ఉండటంతో వారిని ఈ పథకానికి అనర్హులుగా తేలారు. కాగా మిగిలిన 22 వేల మంది బాలికలు బంగారు తల్లి పథకానికి అర్హులైనప్పటికీ అందులో రెండొంతుల మంది కూడా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 9685 మంది మాత్రమే బంగారు తల్లి పథకం కోసం ఐకేపీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3763 మందికి బ్యాంకుల నుంచి మొదటి ఇనిస్టాల్మెంట్ కింద డబ్బులు అందాయి. -
విద్యుత్ కోతలకు బాబే కారణం
పరిగి: తెలంగాణలో విద్యుత్ కోతలకు చంద్రబాబే కారణమని, గత పాలన లో ఇక్కడి వనరులను తరలించుకెళ్లి సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పారని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన తాండూరులో కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారా వు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మేని ఫెస్టోలో పేర్కొన్న విధంగా అధికారం చేపట్టిన 11 వారాల్లోనే 43 అంశాలపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికే దళితులకు మూడెకరాల భూమి పథకం ప్రారంభమైంద ని, రూ.మూడు లక్షలతో ఇంటి నిర్మా ణం పథకం త్వరలో కార్యరూపం దాల్చనుందని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ ప్రాంతంలోని తాగు, సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నెట్టెం పాడు, బీమా-1, బీమా-2, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టి త్వర లో పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, బాల్‌రాజ్‌లు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఒకేరోజున నాలుగున్నర కోట్ల ప్రజల వివరాలు సేకరించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రతిపక్షాలు అవగాహనా రాహిత్యంతో చవకబారు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తుంటే ఇక్కడి టీడీపీ నాయకులు కనీస అవగాహన లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం 2009 నుంచి ఇప్పటివరకు పంటనష్ట పరిహారం చెల్లించకుండా జాప్యంచేస్తే తమ ప్రభుత్వం అన్నికలిపి ఒకేసారి చెల్లిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొప్పుల మహేష్‌రెడ్డి, కొప్పుల నాగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు భాస్కర్, పార్టీ సీనియర్ నాయకులు సురేందర్, వెంకటయ్య, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు హుళక్కి
పరిగి: పెళ్లికి ముందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న చట్టపరమైన నిబంధన అమలు కావడం లేదు. దీనివల్ల బాల్యవివాహాలు, స్త్రీల అక్రమరవాణా వంటి సాంఘిక దురాచారాలు ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాకే పెళ్లిళ్లు జరిపించుకోవాలి. ఈ నిబంధన చట్టంలో చాలాకాలం నుంచి ఉన్నప్పటికీ ఆ చట్టం సమగ్రంగా లేనందున ఎక్కడో ఓ చోట తప్ప అమలు కావడంలేదు. అంతకు ముందు ఈ నిబంధనకు కొన్ని మినహాయింపులు ఉండగా మతమేదైనా మ్యారేజ్ రిజిస్టేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుని దానికి 2012 ఫిబ్రవరిలో చట్టబద్ధత కల్పించింది. చట్టం వచ్చిన మొదట్లో కొద్దిరోజులు హల్చల్ చేసిన పంచాయతీ అధికారులు తరువాత దాని ఊసెత్తటం మానేశారు. మ్యారేజ్ రిజిస్టేషన్ చేసుకోవాలంటూ పంచాయతీల ముందు బోర్డులు సైతం ఏర్పాటు చేసినవారు తరువాత వాటిని పీకి అవతల పడేశారు. ఇదీ నిబంధన.. 2002లో ప్రభుత్వం ముందస్తు వివాహ రిజిస్ట్రేషన్ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే దీని అమలుకు ప్రచారం , అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. కనీసం పంచాయతీలకు సర్య్కులర్లు కూడా పంపలేదు. దీంతో చట్టం వచ్చిన విషయం ఎవరికీ తెలియకుండానే మరుగున పడిపోయింది. అయితే బాల్యవివాహాల నిర్మూలనకు పనిచేస్తున్న పలు స్వచ్చంద సంస్థలు ఈ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో 2002 క్లాజ్ 12 ప్రకారం వివాహానికి ముందు తప్పనిసరిగా గ్రామపంచాయతీల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని 2006 వ సంవత్సరంలో ప్రభుత్వం పీఆర్ 193 జీఓను విడుదలచేసింది. రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతను గ్రామపంచాయతీలకు కట్టబెట్టింది. బాల్యవివాహాల నియంత్రణకు ప్రభుత్వం కొన్ని కమిటీలను కూడా వేసింది. కాని చట్టంలో ఉన్న లొసుగులు , అభ్యంతరాలవల్ల ఏఒక్కచోటా ఇది అమలుకు నోచుకున్న పాపాన పోలేదు. 2012లో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో రిజిస్ట్ట్రేషన్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలు కలిగినా కార్యాచరణ అంతంతమాత్రమే. 30 శాతం బాల్య వివాహాలే.... బాల్యవివాహాలను సాంఘిక దురాచారంగా గుర్తించిన కందుకూరి వీరేశలింగం వంటి వారు వాటిపై ఉద్యమించినా నేటికీ బాల్యవివాహాలు జరుగుతూనే ఉండటం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వివాహాల్లో 30నుంచి 30 శాతం బాల్యవివాహాలే ఉంటున్నాయని ఎంవీ ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంద సంస్థల లెక్కలు చెబుతున్నాయి. పుట్టిన ప్రతీబిడ్డకు వెంటనే జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటంతోపాటు తప్పనిసరిగా ముందస్తు వివాహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు జరిగితే బాల్యవివాహాలు పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉందని అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పేర్కొంటూ వస్తున్నారు. అలాగే మహిళలకు రక్షణ చేకూరనుంది. గతంలో వివాహాలు జరుగకున్నా మెడలో తాళి వేసి మహిళలను, బాలికలను విదేశాలకు, వేరే రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసేవారు. అయితే తప్పనిసరి రిజిస్ట్రేషన్ అమలైతే అక్రమ రవాణాను అరికట్టవచ్చునని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం
వికారాబాద్: రంగారెడ్డి జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు రూట్లలో బస్సుల సర్వీసులను రద్దు చేశారు. జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూర్‌లో భారీవర్షం నమోదైంది. భారీ వర్షానికి వాగులు పొంగాయి. భారీ వర్షం కారణంగా పరిగి-మహబూబ్‌నగర్, పరిగి-షాద్‌నగర్, తాండూర్-మహబూబ్‌నగర్ రూట్లలో బస్సులు సర్వీసులు రద్దు చేశారు. దాంతో ప్రయాణికులు ఇబ్బందికి లోనవుతున్నారు. -
సమగ్ర సర్వేకు ఫారాల కొరత
పరిగి: సమగ్ర కుటుంబ సర్వేకు ఫారాల కొరత ఏర్పడింది. వారం పదిహేను రోజులుగా కసరత్తు చేస్తున్నా సర్వే రోజున గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ప్రధానంగా సర్వే ఫారాల కొరతతో ఎన్యూమరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్వే కోసం ముందుగా ఇళ్లకు నంబర్లు సక్రమంగా వేయకపోవటంతో ఈ వివాదం తలెత్తింది. ప్రధానంగా ఈ సమస్య అన్ని గ్రామాల్లోనూ కనిపించినప్పటికీ పరిగి పట్టణంతో పాటు పరిగి అనుబంధ గ్రామమైన మల్లెమోనిగూడలో గ్రామస్తులు ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. మల్లెమోనిగూడలో ఏకంగా రోడ్లపైకి వచ్చి అధికారుల తీరుపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఒక ఇంట్లో ఐదారు కుటుంబాలు ఉండగా సరైన సమాచారం తీసుకోకుండా ఒక నంబర్ మాత్రమే వేశారు. అదే జాబితాను ఎన్యూమరేటర్లకు అందజేశారు. లిస్టులో లేని ఇళ్లను సర్వే చేసేందుకు నిరాకరించటంతో ఆగ్రహించిన ప్రజలు ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శంషుద్దీన్ తదితరులు మల్లెమోనిగూడను సందర్శించి పరిస్థితి సమీక్షించారు. అనంతరం స్పందించిన అధికారులు అదనంగా ఫారాలు పంపించి అందరి ఇళ్లు సర్వే చేసేలా చూస్తామని హామీ ఇవ్వటంతో గ్రామస్తులు శాంతించారు. ఇదే సమయంలో అదనంగా 1500 సర్వే ఫారాలు జిరాక్స్ తీయించి పరిగితో పాటు కొరత ఉన్న మండల పరిధిలోని గ్రామాలకు పంపించారు. -
ఇక వెలుగుల ‘సౌర’భం
పరిగి: ఇక సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ప్రాజెక్టు రూపుదిద్దుకుని ఫలితాలనివ్వబోతోంది. పరిగి ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అయ్యే రోజు అతి సమీపంలో ఉంది. పరిగి మండలం కాళ్లాపూర్ శివారులో రెండు నెలల క్రితం ప్రారంభమైన సోలార్ పవర్ జనరేటింగ్ ప్లాంట్ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే కావాల్సిన సామగ్రిని ప్లాంటు వద్దకు చేర్చారు. ప్రస్తుతం సాంకేతిక నిపుణులు ఫ్రేంలపై సోలార్ పలకలు (ప్లేట్లు), ట్రాన్స్ ఫార్మర్లు, జనరేటింగ్ సిస్టం తదితర పరికరాలు బిగించే పనిలో నిమగ్నమయ్యారు. పనులు వేగం పుంజుకున్న నేపథ్యంలో మరో నెల రోజుల్లో పవర్ జనరేట్ కానుందని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు పొందిన ఎస్జే పవర్ కంపెనీ ప్రతినిధులు కాళ్లాపూర్ రెవెన్యూ పరిధిలోని 24వ, సర్వే నెంబర్లో ఈ ప్లాంటు నిర్మిస్తున్నారు. నిజానికి ఇప్పటికే పవర్ జనరేటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా పవర్ ప్లాంటు ఏర్పాటుచేస్తున్న భూమిలో రెండు మూడు చోట్ల విద్యుత్ వైర్లు ఉండడంతో పనులను కొ న్నాళ్లు నిలిపేయాల్సి వచ్చింది. ఇదే స మయంలో హనుమాన్ దేవాలయం భూమిని కొంత మేర కబ్జాచేసి, పక్కనే ఉన్న అసైన్డ్ భూమిని కొంతమేర ఆక్రమించుకుని ప్రాజెక్టును నిర్మిస్తున్నారని గ్రామస్తులు, పూజారులు ఆరోపిస్తున్నారు. ఆదిలోనే అడ్డంకులు.. కొందరు స్థానిక రెవెన్యూ అధికారులు, నాయకులు సృష్టించిన గందరగోళంతో ప్రాజెక్టుకు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రాజెక్టు నిర్వాహకులు ప్లాంటుకోసం కొనుగోలు చేసిన భూమి చుట్టూ అసైన్డ్ భూమి ఉండడం, ప్రాజెక్టుకు కేటాయించిన భూమిలోంచే రెండు దేవాలయాలకు వెళ్లేందుకు దారిఉండడం, భూమి సరిహద్దు విషయంలో రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్ స్పష్టత ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ప్లాంటు నిర్వాహణను అడ్డుకునేందుకు స్థానికులు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత వారం నిర్వాహకులు కొనుగోలు చేసిన పొలంలో పాతిన ఫెన్సింగ్ కడీలు విరగ్గొట్టారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి పనులు నిర్వహించుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దేవాలయం భూమిని ఆక్రమించి ప్లాంటు వేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. 5.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 46 ఎకరాల్లో రూ. 40 కోట్లతో ఏర్పాటు అవుతున్న ఈ సోలార్ పవర్ ప్రాజెక్టు ద్వారా 5.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉత్పత్తిచేసిన విద్యుత్తును నేరుగా ప్రభుత్వానికి విక్రయిస్తారు. ఇందుకోసం ముందుగానే ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేయించుకుని పవర్ ప్రాజెక్టు పనులు చేస్తున్నారు. ఉత్పత్తి అయిన ఒక్కో యూనిట్ విద్యుత్‌ను రూ.6.49 లెక్కన ప్రభుత్వానికి విక్రయించనున్నట్టు తెలిసింది. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్ 33 కేవీ విద్యుత్ లైన్ ద్వారా పరిగి సమీపంలో ఉన్న 133 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సరఫరా కానుంది. అక్కడినుంచి మిగతా ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. పరిగికి నిరంతర కరెంట్.. కాళ్లాపూర్ సమీపంలోని లొంక హనుమాన్ దేవాలయం వెనకాల నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తయితే పరిగి ప్రజలకు కరెంటు కష్టాలు తీరుతాయి. పవర్ ప్రాజెక్టులో తయారైన విద్యుత్‌ను నిలువ చేయడం వీలుకాదు. దీంతో తయారయ్యే విద్యుత్ ఎప్పటికప్పుడు విద్యుత్ ఫీడర్లతో అనుసందానం చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి అయిన కరెంటును మిగతా కరెంటుతో అనుసంధానం చేసేందుకైనా సరే పరిగిలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాల్సి ఉంటుంది. -
హతమయ్యాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షం
పరిగి: చనిపోయాడనుకున్న వ్యక్తి ఏడాది తర్వాత ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఇదే సమయంలో అప్పట్లో పోలీసులు ప్రవర్తించిన తీరుపై జనం మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా పరిగి మండలం కోనాపురం శివారులోని జయమంగళి నదిలో 2013 మార్చి 20న గుర్తు తెలియని వ్యక్తి వృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అప్పటి హిందూపురం రూరల్ సీఐ వేణుగోపాల్, పరిగి ఎస్ఐ సుధాకర్‌యాదవ్ కేసు నమోదు చేశారు. విచారణ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు బతికున్న వ్యక్తినే చనిపోయాడని చెప్పి అమాయకులను కేసులో ఇరికించారు. గ్రామానికి చెందిన దాళప్ప బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లగా.. జయమంగళి నదిలో లభించిన మృతదేహం అతడిదేనని తేల్చేశారు. అదే గ్రామానికి సత్యనారాయణ అలియాస్ సత్తి, నరసింహమూర్తి, మోదా గేటుకు చెందిన జిక్రియా అతడిని చంపారని.. వారిని నిందితులుగా గుర్తించి ఈ ఏడాది జనవరి 23న కోర్టులో హాజరు పరిచారు. హత్యకు గురయ్యాడని పోలీసులు చెప్పిన దాళప్ప బుధవారం ప్రత్యక్షం కావడంతో అంతా అవాక్కయ్యారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు నిందితులుగా ఉన్న వారు, వారి కుటుంబసభ్యులు తెలిపారు. -
క్రీడల అభివృద్ధికి కృషి
పరిగి: క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని పరిగి ఎమ్మెల్యే తమ్మన్నగారి రామ్మోహన్‌రెడ్డి (టీఆర్ఆర్) అన్నారు. బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక మినీస్టేడియంలో జోనల్ స్థాయి క్రీడాకారుల ఎంపికలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో క్రీడాకారులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు అండగా ఉంటానన్నారు. మోడల్ స్కూళ్లు, ఇండోర్ స్టేడియాలు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడతానని తెలిపారు. ఈ ప్రాంత విద్యార్థులెవరైనా ఇంజినీరింగ్ చదవాలనుకుంటే తమ కళాశాలల్లో ఉచితంగా సీట్లు ఇస్తానని తెలిపారు. పరిగి నంబర్- 1 ఉన్నత పాఠశాలకు క్రీడా సామగ్రి కోసం టీఆర్ఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ. 20వేలు అందజేస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జోనల్ సెక్రటరీ భాస్కర్‌రెడ్డి, జీహెచ్ఎంలు గోపాల్, రాములు, పీడీలు గాంగ్యానాయక్, సునీత, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం మాజీ అధ్యక్షుడు రాములు, నాయకులు నారాయణ్‌రెడ్డి, ఎర్రగడ్డపల్లి కృష్ణ, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
‘నోటు బుక్స్’ పాట్లు!
పరిగి: పాఠశాలలు పునఃప్రారంభమై నెలరోజులు దాటినా బీసీ సంక్షేమ శాఖ అధికారులు నిద్రమత్తు వీడటంలేదు. ఈ విద్యా సంవత్సరానికి ముందు వేసవి సెలవుల్లోనే పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందజేసిన అధికారులు హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై నెలరోజులు దాటడంతో ఓ పక్క విద్యార్థులపై ఉపాధ్యాయుల ఒత్తిడి పెరుగుతోంది. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. తప్పని పరిస్థితిలో ఒకటి రెండు నోటు పుస్తకాలు తల్లిదండ్రులతో కొనిపించుకుని అన్ని సబ్జెక్టులు అందులోనే రాస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఇప్పటికే నోటు పుస్తకాలు అందివ్వగా ఒక్క బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో మాత్రమే నోటు పుస్తకాలు ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదేమని అధికారులను అడిగితే.. తెలంగాణ ఎంబ్లం(గుర్తు)తో కూడిన నోటు పుస్తకాలు ముద్రిస్తున్నాం.. అందుకే ఆలస్యమవుతోందని కారణం చెబుతూ దాటవేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 47 బీసీ సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటిలో 4,200 విద్యార్థులు ఉంటున్నారు. ఇప్పటివరకూ ఓ ఒక్క హాస్టల్లోనూ నోటు పుస్తకాలు ఇవ్వలేదు. 9, 10 తరగతులకు 12 లాంగ్ నోటు బుక్స్ (200 పేజీలు) 7, 8 తరగతులకు ఆరు చిన్నవి, ఆరు పెద్దవి నోట్సు, 5, 6 తరగతులకు ఆరు పెద్దవి, మూడు చిన్నవి మొత్తం తొమ్మిది నోటు పుస్తకాలు ఇప్పటి వరకు ఇస్తూ వస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో మొత్తం 50 వేల నోటు పుస్తకాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సిలబస్ మారిన నేపథ్యంలో పాఠశాలల్లో గైడ్లు పూర్తిగా నిషేధించారు. ప్రతి సబ్జెక్టుకు క్లాస్‌రూం రన్నింగ్ నోట్సుతోపాటు ఫెయిర్ నోటు పుస్తకాలు అవసరం. దీంతో విద్యార్థులకు గతంలో ఇచ్చే నోటు పుస్తకాలకంటే ఇప్పుడు పెంచాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. మరో వారం రోజులు ఆగాల్సిందే ఇప్పటికే పాఠశాలలు పునఃప్రారంభమై నెల రోజులు దాటగా మరో వారం రోజులకుగాని నోటుపుస్తకాలు రావని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో బీసీ సంక్షేమ వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులు కొంచెం అటూ ఇటూగా నెల పదిహేను రోజుల నుంచీ నోటు పుస్తకాలు లేకుండానే కాలం వెల్లదీస్తున్నారు. నెల రోజులకు సంబంధించిన సిలబస్‌ను ఒకేసారి రాయాల్సి వస్తుందని.. దీంతో విద్యార్థులు చదువుపై ధ్యాస మరిచి రాయటంపైనే దృష్టిపెట్టాల్సి వస్తుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వెంటనే నోటు పుస్తకాలు అందజేయాలని అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ విషయమై బీసీ సంక్షేమ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ రమణారెడ్డిని వివరణ కోరగా.. మరో వారం రోజుల్లో నోటు పుస్తకాలు అందేలా చూస్తామని తెలిపారు. -
మళ్లీ ‘మైక్రో’ భూతం!
పరిగి: సూక్ష్మ రుణాల (మైక్రో ఫైనాన్స్) భూతం మళ్లీ తన అసలు రూపాన్ని ప్రదర్శిస్తోంది. రుణ గ్రహీతలను వేధింపులకు గురి చేస్తోంది. కొంతకాలం క్రితం ప్రభుత్వ చర్యలతో కాస్త వెనక్కి తగ్గినట్లుగా కనిపించినా ప్రస్తుతం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రజలను మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం వేసిన కమిటీలు నామమాత్రంగా మారడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిటీల నియామకంతోనే మమ అనిపించిన సర్కారు సూక్ష్మ రుణ సంస్థల వేధింపుల్ని మాత్రం అరికట్టలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా రుణమాఫీ విషయంలో జరుగుతున్న జాప్యం కారణంగా బ్యాంకులు రుణలివ్వకుండా వెనకాడుతుండటాన్ని ఆసరాగా చేసుకుని మైక్రో ఫైనాన్స్ కంపెనీలు మళ్లీ గ్రామాల్లోకి అడుగుపెడుతున్నాయి. పాత అప్పులు చెల్లిస్తే అంతకంటే ఎక్కువ రుణాలిస్తామని నమ్మబలుకుతూ వసూళ్లు ప్రారంభిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల పరిగి మండలంలోని సోండేపూర్ తండాకు చెందిన పలువురికి నోటీసులు అందజేయడంతోపాటు ఓ వ్యక్తిపై కేసు కూడా నమోదు చేశారు. సుమారు రూ. 20 కోట్ల రుణాలు పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరు, పరిగి, దోమ, కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో ఎల్అండ్టీ, ఎస్కేఎస్, స్పందన తదితర సూక్ష్మ రుణాల సంస్థలు సుమారు రూ. 20 కోట్ల వరకు రుణాలు ఇచ్చాయి. బ్యాంకుల నుంచి తమకు అవసరమైన మేర రుణాలివ్వనందునే ప్రజలు ఆయా సంస్థలను ఆశ్రయిస్తుండడం ఇందుకు ప్రధాన కారణం. నియోజకవర్గంలో ప్రభుత్వరంగ బ్యాంకులు సంవత్సర కాలంలో ఇస్తున్న రుణాలకు దీటుగా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు అధికంగా ఇచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా మైక్రో సంస్థలు 24 శాతం వడ్డీ అని చెబుతూ.. చక్రవడ్డీ, బారువడ్డీల పేరుతో 45 నుంచి 55 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్లు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆదుకోని ఆర్థిక చేకూర్పు మైక్రో ఫైనాన్స్ కంపెనీలు సైతం రుణాలిచ్చేందుకు మహిళా సంఘాలనే ఎంచుకుంటున్నాయి. మహిళల అవసరాలు పూర్తిస్థాయిలో తీర్చి ఇతర ప్రైవేటు అప్పుల నుంచి విముక్తి కలిగించడంలో భాగంగా గతంలో ప్రభుత్వం ఐకేపీ ద్వారా ప్రారంభించిన సంపూర్ణ ఆర్థిక చేకూర్పు పథకం మహిళలను ఆదుకోవడంలో విఫలమైంది. 10 నుంచి 15 మంది ఉన్న ఒక్కో సంఘానికి, విడివిడిగా ఒక్కో మహిళకు ఏయే అవసరాలున్నాయనే దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనంచేసి అవసరమైన మేరకు రుణాలివ్వాలని ప్రభుత్వం సంపూర్ణ ఆర్థిక చేకూర్పు పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఐకేపీ సిబ్బంది ప్రణాళిక తయారు చేశారు. కానీ ఆ ప్రణాళికను ఇప్పటివరకు సమర్థంగా అమలు చేయకపోవడంతో మహిళా సంఘాలు మైక్రో సంస్థల్ని ఆశ్రయించక తప్పడం లేదు. -
అవగాహన లోపం.. రైతులకు శాపం..!
పరిగి, న్యూస్‌లైన్: ఎరువుల వాడకంలో రైతుల్లో అవగాహన లోపించింది. నేలల స్వభావం, భూసారాన్ని బట్టి ఎరువులను వినియోగించాల్సి ఉండగా రైతులు ఆ విషయూన్ని పట్టించుకోవడం లేదు. రైతుల కోసం చైతన్య యాత్రలు, అవగాహన సదస్సులు, పొలంబడి తదితర అనేక కార్యక్రమాలు వ్యవసాయ శాఖ చేపడుతున్నప్పటికీ అన్నదాతలకు ఈ విషయుమై ప్రాథమిక సమాచారం కూడా అందిన దాఖలాలు కనిపించడం లేదు. జిల్లాకు చెందిన నేలల భూసారం, నేల స్వభావాన్ని బట్టి ఈ ప్రాంతంలో డీఏపీని(అడుగు మందు) దుక్కిలోనే వేయాలని శాస్త్రవేత్తలు చెబుతుండగా ఐదుశాతం రైతులు కూడా ఈ విధానాన్ని పాటించడం లేదు. కేవలం పసుపు, మొక్కజొన్న పంటలకు మాత్రమే డీఏపీనీ రైతులు దుక్కి మందుగా వాడుతున్నారు. డీఏపీని కూడా యూరియా వూదిరి పైపాటి ఎరువుగా వాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యవసాయు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖరీఫ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎరువుల వినియోగంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం.. మోతాదుకు మించి డీఏపీ వాడకం నేల స్వభావం, భూసారంపై రైతులకు అవగాహన లేకపోవడంతో డీఏపీని రైతులు మోతాదుకు మించి వాడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశ్చివు జిల్లాలోని నేలల్లో భాస్వరం మధ్యస్తంగా, పొటాషియం ఎక్కువగా, నత్రజని తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంత నేలలను బట్టి ఎకరానికి పంటకాలంలో 50 కేజీల డీఏపీ మాత్రమే వాడాలని శాస్త్రవేత్తలు చెబుతుండగా రైతులు ఎకరానికి 100 నుంచి 150 కేజీల వరకు డీఏపీని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ మందును పైపాటుగానే వేస్తున్నందునా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నియోజక వర్గంలో ఇలా వాడుతున్నారు రెండు మూడు సంవత్సరాలుగా పరిగి నియోజక వర్గానికి ఖరీఫ్ ఆరంభంలోనే 4 వేల నుంచి 5 వేల టన్నుల ఎరువులను వ్యవసాయ శాఖ అధికారులు సరఫరా చేస్తూ వస్తున్నారు. ఇందులో మెజార్టీ భాగం డీఏపీనే ఉంటోంది. కాగా సరఫరా అవుతున్న ఎరువుల్లో 20 శాతం కూడా జూలై మాసంలో వాడటంలేదు. అంటే విత్తుకునే సమయంలో దుక్కి ఎరువుగా రైతులు డీఏపీని వాడటంలేదని అర్థవువుతోంది. జిల్లా భూముల సారాన్ని బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎరువుల మోతాదు ఈ విధంగా ఉండాలని పేర్కొంటున్నారు. డీఏపీ ఎరువు ప్రతి ఎకరానికి 50 కిలోలు వాడాలి. దీన్ని తప్పని సరిగా దుక్కి ఎరువుగానే వాడాలి. డీఏపీలో భాస్వరం ఎక్కువగా ఉన్నందునా ఈ ఎరువును పైపాటుగా వేస్తే ఉపయోగం ఉండదు. పత్తి పంటకు విత్తే కంటే ముందు మూడు నుంచి నాలుగు అంగులాల లోతులో డీఏపీ వేయాలి. మిగత అన్ని ఖరీప్పంటలకు కూడా ఎకరానికి 50 కేజీలే వాడాలి. యూరియా ప్రతి ఎకరానికి వందకిలోలు వాడాలి. ఈ ప్రాంతంలో నత్రజని శాతం తక్కువగా ఉన్నందునా యూరియా మోతాదు ఎక్కువగా వాడాలి. యూరియాను పైపాటు ఎరువుగా వాడవచ్చు. పత్తికి యూరియా విత్తిన 20 రోజుల నుంచి ఐదుసార్లు వాడాలి. వాడిన ప్రతి సారి 30 కేజీల వరకు వేయవచ్చు. వరికి యూరియా నాలుగు సార్లు వాడాలి. కలుపుతీసే సమయంలో తరువాత 20 రోజులకు, 30 రోజులకు, 50 రోజులకు యూరియాను వరి పైరుకు వాడాల్సి ఉంటుంది. -
7 కాదు 3 గంటలే!
పరిగి, న్యూస్‌లైన్: విద్యుత్ కోతలు అన్ని వర్గాలను గుండెకోతకు గురిచేస్తున్నాయి. ఇటు వ్యవసాయంపై, అటు చిన్నతరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవంగా అందుతున్నది మాత్రం మూడు గంటల కరెంటే. కొన్ని ప్రాంతాల్లోనైతే 2 గంటల విద్యుత్తుతోనే రైతులు సరిపెట్టుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వరి నాట్ల సమయంలో విధించిన కోతలతో పొలాలకు నీరందడంలేదు. ప్రస్తుతం కరెంటు కోతలతో బోరుబావుల కింద కూరగాయాలు తదితర పంటలు సాగు చేస్తున్న రైతులు విలవిల్లాడుతున్నారు. పైనుంచే మూడు గంటలకు మించి కరెంటు రాకపోతుండగా స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో రైతులు మరింత నష్టపోతున్నారు. ఈ విషయం గురువారం నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో స్పష్టంగా కనిపించింది. కోతలకు బయపడి రైతులు ఎకరం, అరెకరం మాత్రమే సాగు చేసుకుంటుండగా.. సాగు చేసిన కాస్త పొలంకూడా పారటంలేదు. దీంతో నియోజకవర్గంలో సాగు ప్రమాదంలో పడింది. పరిగి నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి కరెంటు కోతలపై నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. మండలానికి ఓ గ్రామం చొప్పున ఎంచుకుని రైతుల ద్వారా సమాచారం సేకరించగా ఎక్కడా మూడు గంటలకు మించి కరెంటు సరఫరాచేసిన దాఖలాలు లేవు. పరిగి మండలంలోని మిట్టకోడూర్‌లో కేవలం మూడు గంటలు మాత్రమే త్రీఫేజ్ కరెంటు రాగా అందులోనూ ఐదారుసార్లు ట్రిప్పయ్యింది. పూడూరు మండల పరిధిలోని మీర్జాపూర్లో మొత్తం 110 బోరుబావులు, బావులు ఉన్నాయి. వీటికింద 250 ఎకరాల వరకు పంటలు సాగవుతున్నాయి. గురువారం ఆ గ్రామంలో రోజు మొత్తంలో రెండు గంటలు మాత్రమే కరెంటు సర ఫరా చేశారు. ఇదే తరహాలో కుల్కచర్ల మండలం అంతారంలో పరిశీలించగా అక్కడ కూడా ఏడు గంటలకు రెండు గంటలే వచ్చింది. దోమలో, గండేడ్ మండలం గాధిర్యాల్ గ్రామంలో పరిశీలించగా అక్కడ కూడా ఏడు గంటలకు మూడు నుంచి నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా చేశారు. ఆయా మండలాల్లోనూ ఐదు నుంచి ఎనిమిదిసార్లు మధ్యమధ్య ట్రిప్పయ్యింది. గ్రామాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ కరెంటు కోతల పరిస్థితి ఇలాగే నెలకొంది. దీంతో యువత మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రంలో ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు కుదేలవుతున్నాయి. విద్యుత్ లేకపోవడంతో వాటిని మూసివేసి ఉపాధి హామీ పనులుకు వెళ్లాల్సి వస్తోందని ఓ యువకుడు ‘న్యూస్‌లైన్’ పేర్కొన్నాడు. కరెంటు కోతలు, లోఓల్టేజీ సమస్యలతో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు సైతం పదేపదే కాలిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దివాలా దిశగా.. పరిగి పట్టణంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు కరెంటు కోతలతో దివాలా దిశగా పయనిస్తున్నాయి. వెల్డింగ్ షాపులు, మెకానిక్ షెడ్లు, జిరాక్స్, కంప్యూటర్ ఇనిస్టిట్యట్లు, మోటార్ వైండింగ్ దుకాణాలు తదితర చిన్న తరహా ఉపాధి పరిశ్రమలు కరెంటు కోతలతో గంటల తరబడి మూసివేసి ఖాళీగా కూర్చొవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితిలో దుకాణాలను తెరవడం కంటే పూర్తిగా మూసివేయడమే మేలంటున్నారు. రోజంతా ఇలా కోతలు విధిస్తే తమ దగ్గర పనిచేసే ఒకరిద్దరు సహాయకులకు వేతనాలు ఎలా ఇవ్వాలని యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
ఎంత ధాన్యమైనా కొంటాం
పరిగి, న్యూస్‌లైన్: ధాన్యం ఎంత మొత్తంలోనైనా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జేసీ ఎంవీ రెడ్డి అన్నారు. గురువారం ఆయన పరిగిలో డీసీఎమ్మెస్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం పరిగిలోని మీసేవ కేంద్రం, తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పలు సమస్యలపై అధికారులతో చర్చించారు. పింఛన్ లబ్ధిదారులు పడిగాపుల విషయంపై డీఆర్డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. పరిగి మండల వ్యవసాయ అధికారిణి రేణుకా చక్రవ ర్తి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జేడీఏ విజయ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆమెకు ఒకరోజు వేతనం కట్ చేయటంతో పాటు మెమో జారీ చేయాలని జేడీఏను జేసీ ఆదేశించారు. మీసేవ కేంద్రంలో రూ.300 తీసుకుని 160 రూపాయలకు మాత్రమే రసీదు ఇచ్చారని ఓ వ్యక్తి జేసీకి ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 25 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నామని తెలిపారు. 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నామని.. దీన్ని మించి ఎంతైనా కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 4100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులు కొందరు టార్పాలిన్ల గురించి అడగ్గా సరఫరా చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు సమయానికి లారీల కాంట్రాక్టర్ లారీలు పంపించకుంటే స్థానికంగా అద్దెకు మాట్లాడుకుని పంపించాలని డీసీఎమ్మెస్ అధికారులకు జేసీ సూచించారు. కుల్కచర్ల మండలం చౌడాపూర్‌లో డీసీఎమ్మెస్ కౌంటర్ ఏర్పాటు చేయాలని రైతులు కోరగా పరిశీలిస్తామన్నారు. జేసీ వెంట తహసీల్దార్ విజయ్‌కుమార్‌రెడ్డి, సివిల్ సప్లయ్ డీటీ అశోక్, డీసీఎమ్మెస్ పరిగి శాఖ మేనేజర్ శ్యాంసుందర్‌రెడ్డి, సిబ్బంది వెంకటేష్, రాములు తదితరులున్నారు. -
నిత్యం నిరీక్షణే!
పరిగి, న్యూస్‌లైన్: మీ పేరుమీద డబ్బులు రాలేదంటున్నారు.. నెలనెలా పింఛన్ ఇచ్చేటోళ్లు. ఎందుకు రాలేదని అడిగితే.. డేటా ఎంట్రీ చేయలేదని ఒకరు, రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని మరొకరు, మీరు ఫొటోలు దిగాల్సి ఉందని ఇంకొకరు సమాధానం చెబుతున్నారు. ఇన్నాళ్లూ వచ్చిన పింఛన్లు ఇప్పుడే ఎందుకు ఆగిపోయాయో ఏ అధికారీ చెప్పడం లేదు. నెలనెలా వచ్చే కొద్దిపాటి పింఛన్ డబ్బులతోనే వృద్ధులు మందులు కొనుక్కోవడంతోపాటు చిన్నచిన్న అవసరాలు తీర్చుకుంటారు. అవి రెండు నెలల నుంచి అందకపోవడంతో విలవిల్లాడుతున్నారు. మండల కేంద్రంలో దగ్గర ఉన్న వాళ్లు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వృద్ధులు గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కానీ వారికి సరైన సమాధానం చెప్పేవారే లేరు. వికలాంగులు, వితంతు పింఛన్లు కూడా నిలిచిపోయాయి. నిన్నమొన్నటి వరకు ఎలక్షన్లలో మునిగిపోయిన యంత్రాంగం అవి పూర్తయ్యాక కూడా పింఛన్‌దారులను పట్టించుకోవడం లేదు. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలట.. రెండు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వృద్ధులకు ఏ సమాచారం ఇవ్వని అధికారులు ఇటీవల కొత్త విషయాన్ని చెబుతున్నారు. పింఛన్లు ఆగిపోయిన వారంతా మరోమారు గ్రామంలోనే ఫొటోలు దిగాలని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సెలవిస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని వృద్ధులు, వికలాంగులు, ఇతర పింఛన్‌దారులు గ్రామ పంచాయతీల వద్ద ఫొటోలు దిగేందుకు పడిగాపులు కాస్తున్నారు. కానీ ఏ ఒక్క గ్రామంలో కూడా ఫొటోలు దించేందుకు అధికారులు ఎటువంటి ఏర్పాట్లూ చేయలేదు. సొంతంగా ఫొటోలు దిగి ఇవ్వాలా.. లేక అధికారుల తరఫున ఎవరైనా వచ్చి తీస్తారా.. అనే విషయంపైనా అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక పింఛన్‌దారులు తహశీల్దార్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వచ్చినవారికి వచ్చినట్టు.. ‘మీరు ఫొటోలు దిగితేనే డబ్బులు’ అని చెప్పి పంపిస్తున్నారు అధికారులు. కానీ ఫొటోలు తీసేవారిని మాత్రం ఏర్పాటు చేయడం లేదు. మూడో నెల పింఛన్ రాకుంటే.. అంతే! ఇప్పటికే పింఛన్ అందక రెండు నెలలైంది. నిబంధనల ప్రకారం వరుసగా మూడు నెలలు పింఛన్ ఇవ్వకపోయినా, తీసుకోకపోయినా ‘పర్మినెంట్ మైగ్రేటెడ్’గా గుర్తించి పింఛన్ రద్దు చేస్తారు. రద్దయిన వారికి మళ్లీ పింఛన్ రావాలంటే అదో పెద్ద తంతు. ఇప్పటికే పరిగి మండలంలోని ఏ గ్రామంలో కూడా పింఛన్లు 100 శాతం ఇవ్వడం లేదు. పరిగి పట్టణ విషయానికొస్తే 1,600 పింఛన్లు ఉండగా ఇప్పుడు కేవలం 500 మందికి సంబంధించిన వివరాలు రిజిస్ట్రేషన్‌చేసి పింఛన్లు ఇస్తున్నారు. మిగిలిన 1,100 మంది లబ్ధిదారులకు కూడా వచ్చే నెల నుంచి పింఛన్లు ఇవ్వాలంటే మరో రెండు రోజుల్లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఎంత త్వరితంగా వివరాల నమోదు ప్రక్రియను కొనసాగించినా 100 నుంచి 150 మంది పేర్లను ఎంట్రీ చేయగలరు. మిగిలిన వారి పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న. వారందరి పింఛన్లు రద్దవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
మన తెలంగాణను మనమే పాలించుకోవాలి
పరిగి అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్వర్‌రెడ్డి పూడూరు, న్యూస్‌లైన్: బంగారు తెలంగాణ నిర్మాణం కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని సోమన్గుర్తి, సిరిగాయపల్లి, కెవరెళ్లి, దేవనోనిగూడం, రాకంచర్ల, తిర్మలాపూర్, చీలాపూర్ తదితర గ్రామాల్లో శనివారం ఆయన ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నంత మాత్రాన మన ఆశయం నెరవేరదన్నారు. మన తెలంగాణను మనమే పాలించుకోవాలని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. హరీశ్వర్‌రెడ్డి సమక్షంలో రాకంచర్లకు చెందిన నాయకులు బీక్యా నాయక్ తదితరులు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అజీం, నాయకులు పుడుగుర్తి మల్లేషం, జి.రాములు, సత్యనారాయణ, అమ్రాది శ్రీనివాస్‌గుప్త, సర్పంచులు మధుసూదన్, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ పదవే సంతృప్తినిచ్చింది
పరిగి, న్యూస్‌లైన్: ‘ధన రాజకీయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయి. ఈ పరిస్థితి మారాలంటే ఎన్నికలు రాజకీయాలకతీతంగా నిష్పక్షపాతంగా జరగాలి.. అప్పుడే ప్రజలకు పారదర్శక పాలన చేరువవుతుంది. ప్రస్తుతం స్థానిక సంస్థలు మొదలుకుని చట్టసభల ఎన్నికల వరకూ వ్యాపార ధోరణి ప్రబలుతోంది. ఇది బాధాకరం. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్నికలు బాగా కాస్ట్లీ అయ్యాయి. అభ్యర్థులు గెలిచాక కూడా పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు. అభివృద్ధి పనులు సైతం నా వారు.. నీ వారు అంటూ విభజన చేస్తున్నారు. ఈ కుసంస్కృతి కారణంగా.. దేశానికి పట్టుగొమ్మలైన పల్లెసీమలు సైతం కుట్రలు, కుతంత్రాలతో కుళ్లిపోతున్నాయి’ అని పరిగి పంచాయతీ వార్డు సభ్యుడు, ఉప సర్పంచ్, సర్పంచ్, సమితి ప్రెసిడెంట్‌గా తన రాజకీయ ప్రస్థానంలో అంచలంచెలుగా ఎదిగి.. ఐదుసార్లు ఎమ్మెల్యే గెలిచిన ప్రస్తుత పరిగి శాసనసభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి నేటి రాజకీయాలు, ఎన్నికలపై ‘న్యూస్‌లైన్’తో తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు.. రూ.5 వేలతో సర్పంచ్‌నయ్యాను.. 1972 నుంచి 77 వరకు పరిగి ఉప సర్పంచ్‌గా ఆ తర్వాత 1977 నుంచి 83 వరకు సర్పంచ్‌గా పనిచేశాను. మొదటిసారి సర్పంచ్‌గా గెలిచినప్పుడు నామినేషన్ ఫీజు తప్ప ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ఫలానా హరీశ్వర్‌రెడ్డి అయితే బాగుంటుందని పెద్దలంతా కలిసి నన్ను ఎన్నికల బరిలో నిలబెట్టారు. వారే గెలిపించారు. రెండోసారి సర్పంచ్‌గా ఎన్నికైనప్పుడు చాయ్, బిస్కెట్లు.. నామినేషన్లకు కోసం రూ. 10 వేల వరకు ఖర్చు పెట్టాం. మొదటిసారిగా 1983లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు లక్షలోపే ఖర్చయ్యింది. అదికూడా డబ్బులు పంచేందుకు కాదు. చిన్నాచితకా ఖర్చులకే. అప్పట్లో ఎక్కువ శాతం ఎన్నికలు ఏకగ్రీవమే అయ్యేవి. పెద్దలే ఒకర్ని నిర్ణయిస్తే గ్రామస్తులంతా వారినే ఎన్నుకునేవారు. ఇప్పుడు చిన్నచిన్న పంచాయతీలకు సైతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మేజర్ పంచాయతీలకైతే రూ.10- 20 లక్షలు ఖర్చు చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఇక ఎమ్మెల్యే ఎన్నికలకైతే రూ. కోట్లలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వాళ్లు గెలిచింది మొదలు ఆ డబ్బు ఎలా సంపాదించుకోవాలని ఆరాటపడుతూ పనులు చేయటం మానేసి డబ్బుల సంపాదనకే ప్రాధాన్యమిస్తున్నారు. మార్పు రావాలి.. ప్రస్తుతం ఎమ్మెల్యే పదవి, అంతకుముందు డిప్యూటీ స్పీకర్ తదితర పదవుల కంటే పరిగికి సర్పంచ్‌గా చేసిన రోజుల్లోనే ఎక్కువ సంతృప్తి చెందాను. నిష్పక్షపాతంగానే ప్రజలు నన్ను గెలిపించారు. అభివృద్ధి పనులు సైతం అలాగే చేశాను. అందరు తెలిసినవారే. వారికి పనులు చేయటం ఎంతో తృప్తిగా ఉండేది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు ఉండేవి కావు. ఎన్నుకునే సమయంలో ఎవరూ ఏదీ ఆశించే వారు కాదు.. గెలిచాక పనులు కూడా అలాగే చేసే వాళ్లం. ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదు. రాజకీయాల్లో, ఎన్నికల్లో మార్పు రావాల్సిన అవసరముంది. అప్పుడే ప్రజాస్వామ్యానికి మనుగడ. -
కాయ్.. రాజా.. కాయ్!
పరిగి, న్యూస్‌లైన్: పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ జడలు విచ్చుకుంది. ఒక ప్పుడు పట్టణాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్‌లు నేడు పరిగికి కూడా పాకింది. ఈ జాడ్యం గత ఐపీఎల్ సీజన్లో ప్రారంభమవగా ప్రస్తుతం కొనసాగుతున్న టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో వేళ్లూనుకుంటోంది. ప్రస్తుతం జనమంతా ఎన్నికలో హడావుడిలో మునిగిపోగా క్రికెట్‌పై ఆసక్తి ఉన్న యువకులు బెట్టింగ్‌కు బావినసవుతూ రూ. వేలకువేలు వెచ్చిస్తున్నారు. బెట్టింగులు ఇలా.. క్రికెట్ బెట్టింగ్‌ల గురించి వినడమే గాని చాలా మందికి దానికి గురించి తెలియదు. బాల్ టూ బాల్... ఓవర్ టూ ఓవర్.. మ్యాచ్ టూ మ్యాచ్ ఇలా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. పలానా బాల్ పలానా బ్యాట్స్‌మన్ సిక్స్, లేదా ఫోర్ కొడతాడని ఫోన్లో బెట్ కట్టడం, లేదా పలానా బ్యాట్స్‌మన్ పలానా ఓవర్లో 10 పరుగులు, లేదా 20 పరుగులు ఆపైనా సాధిస్తాడు. లేదా దేశాల మధ్య జరిగే మ్యాచ్‌లో పలానా దేశం విజయం సాధిస్తుంది. పలానా బ్యట్స్‌మన్ హాఫ్ సెంచరీ సాధిస్తాడు.. ఇలా పలు రూపాల్లో బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతోంది. మ్యాచ్ టూ మ్యాచ్ బెట్ కట్టే వారు ముందుగానే మధ్యవర్తుల ఖాతాల్లో డబ్బులు వేయాల్సి ఉంటు ంది. గెలిస్తే చెల్లించిన డబ్బులకు డబుల్ అమౌంట్ నిర్వహకులు ఆన్లైన్లోనే చెల్లిస్తారు. లేదంటే ముందుగా కట్టిన డబ్బులు పోతాయి. ఓవర్ టూ ఓవర్, బాల్ టూ బాల్.. బెట్టింగ్ విషయానికి వస్తే ఓవర్‌కు ముందు, బాల్‌కు ముందు ఫోన్ చేసి బెట్ కట్టాల్సి ఉంటుంది. కొందరు నిర్వాహకులు బ్రోకర్‌ను నియమించి అతని ద్వారా లేవాదేవీలు జరుపుతుంటారు. గెలిస్తే మరుసటి రోజు అతను డబ్బులు తెచ్చి ఇస్తుంటాడు. ఓడితే డబ్బులు తీసుకువెళ్తాడు. పరిగిలో ప్రస్తుతం బెట్టింగ్ ఇలా కొనసాగుతోంది. యువత, ఉద్యోగులపై వల... బెట్టింగ్ నిర్వాహకులు హైదరాబాద్‌లో ఉండి కొందరు మధ్యవర్తుల ద్వారా ప్రధానంగా క్రికెట్ అంటే క్రేజ్ ఉన్న యువకులు, ఉద్యోగులను ఎంచుకుని ముగ్గులోకి దింపుతున్నారు. గత ఐపీఎల్ సీజన్లో పరిగికి చెందిన 30-50 మంది వరకు బెట్టింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఆ సంఖ్య మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అంతాజయమే
పరిగి, మొయినాబాద్, న్యూస్‌లైన్: జయనామ సంవత్సరానికి సోమవారం జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు. ఈ సంవత్సరం తమకు విజయాలు చేకూర్చాలని ఆకాంక్షించారు. ఉగాది పర్యదినం సందర్భంగా ప్రతి గ్రామంలో పంచా గ శ్రావణం నిర్వహించారు. తోరణాలతో ఇళ్లను అలంకరించారు. పిండివంటలు, పోలేలు, షడ్రుచులతో కూడిన పచ్చడిని ఆరగించారు. పరి గి, చేవెళ్ల, వికారాబాద్, శంషాబాద్, తాండూరు, మేడ్చల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలోని ఆలయాలు భక్త జనంతో కిటకిటలాడాయి. ఇదిలాఉంటే ప్రస్తుతం ప్రాదేశిక పోరు జరుగుతున్న నేపథ్యంలో పంచాంగ శ్రవణానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీచేస్తున్న అభ్యర్థులు తమ పేరున బలాలు, జాతకాలు ఎలా ఉన్నాయని ఆసక్తి అడిగి తెలుసుకున్నారు. పరిగిలో పండితులు సిద్దాంతి పార్థసారథి పంచాంగ పఠనం చేయగా పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పంచాంగ పఠనాన్ని ఆలకించారు. వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయి.. జయనామ సంవత్సరంలో అంతా జయమే జరుగుతుందని చిలుకూరు బాలాజీ దేవాలయ పూజారి రంగరాజన్ పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు పంచాగ శ్రవణం చేశారు. ఆలయ మండపంలో ఉత్సవమూర్తులను ప్రతిష్టించి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస రాఘవాచార్యు లు, ఆలయ మేనేజింగ్ కమిటీ చెర్మైన్ సౌదరరాజన్, కన్వీనర్ గోపాల కృష్ణస్వామిల సమక్షంలో పంచాగ శ్రవ ణం నిర్వహించారు. ఆలయ పూజారి రంగరాజన్ పంచాగ శ్రవణం చేస్తూ ఈ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా మనుషులు మాత్రం కలిసిమెలిసి ఉంటారని, ప్రేమానురాగాలు పంచుకుంటారని అన్నారు. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేసి, దేవాలయాల పరిరక్షణకుపాటు పడేవారే ఈ సారి ఎన్నికల్లో గెలుస్తారని, అలాంటి వారికే దేవుడు పట్టం కడతారని వివరించారు. పంచాయగ శ్రవణ కార్యక్రమంలో పూజారులు కన్నయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరణ తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాల పత్రికను సోమవారం ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస రాఘవాచార్యులు, పూజారులు ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల పత్రికలను స్వామివారి పాదాల వద్ద పెట్టి పూజలు నిర్వహించారు. ఈనెల 9 నుంచి 16 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్ తెలిపారు. -
వైరానికి రాం..రాం!
ఉత్తర దక్షిణ ధ్రువాలు ఒక్కటయ్యాయి. కొన్నేళ్లుగా ఒకరికొకరు ఎడమొహం పెడమొహంగా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు కలిసిపోయారు. వీరిద్దరి పేర్లలో మొదటి రెండక్షరాలను నిజం చేస్తూ.. తమ కలయికతో వర్గపోరుకు చరమగీతం పాడామనే సంకేతాన్ని పంపించారు. శనివారం మాజీ మంత్రి కమతం రాంరెడ్డి, పీసీసీ కార్యదర్శి టి.రాంమోహన్రెడ్డిల భేటీ పరిగిలో చర్చనీయాంశంగా మారింది. శనివారం పరిగిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం అనంతరం కమతం రాంరెడ్డిని తమ ఇంటికి రావాలని రామ్మోహన్‌రెడ్డి ఆహ్వానించారు. దీంతో ఆయన నేరుగా రాంమోహన్‌రెడ్డి ఇంటి వెళ్లారు. గత ఏడేళ్లుగా ఒకే పార్టీలో ఉంటూ ప్రత్యర్థులుగా వ్యవహరిస్తూ వస్తున్న వీరు ఒక్కసారిగా కలిసిపోవటం కాంగ్రెస్ కార్యకర్తల్లోనే కాకుండా నియోజకవర్గానికి చెందిన అన్ని పార్టీల నాయకుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఏ రోజూ రాంమోహన్‌రెడ్డి గడప తొక్కని రాంరెడ్డి.. ఆ వర్గానికి చెందిన కార్యకర్తలు సైతం ఆయనను అనుసరించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నప్పటికీ.. టికెట్ ఎవరికి వచ్చినా ఇద్దరం కలిసీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మిగతా పార్టీలతో పోలిస్తే అధికంగా ఉన్నప్పటికీ సొంత పార్టీలో కుమ్ములాటలు, వర్గపోరులాంటి సమస్యలతో ఇన్నాళ్లూ ఎమ్మెల్యే పదవిని ఇతరులు ఎగరేసుకుపోయారు. ఎన్నికల వేళ ఒక్కసారిగా ఇద్దరు ప్రధాన నేతలు కలవటంతో అటు కాంగ్రెస్ కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇటు ఇతర పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే వీరి చెలిమి ఏ మేరకు కొనసాగుతుందో వేచి చూడాల్సిందేనని గుసగుసలు మొదలయ్యాయి. -
తనిఖీల్లో రూ.24.68 లక్షలు స్వాధీనం
పరిగి, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వేర్వేరు చోట్ల పోలీసులు రూ. 24.68 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో 2.84 కిలోల వెండి నగలు పట్టుకున్నారు. పరిగిలో అధికంగా 15 లక్షలు పట్టుకున్నారు. పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. సాయంత్రం పరిగిలోని గంజ్ రోడ్డు వైపు నుంచి నంబర్ 02 ప్రభుత్వ ఉన్నత పాఠశాల వైపు కొందరు వ్యక్తులు ఓ బైకుపై అధిక మొత్తంలో డబ్బులు తరలిస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సీఐ వేణుగోపాల్‌రెడ్డి ముగ్గురు కానిస్టేబుళ్లతో రెండు బైక్‌లపై వారిని వెంబడించారు. స్కూల్ వెనుక చిన్నదారి గుండా వెళ్తున్న వారిని పట్టుకున్నారు. పరిగికి చెందిన ఎంఏ రహీం, దోమ మండలం శివారెడ్డిపల్లికి చెందిన ఆహ్మద్ఖాన్లు రూ. 15 లక్షలు తరలిస్తున్నట్లు గుర్తించి నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా తాము కాంట్రాక్టర్లమని రోడ్డుపనులకు సంబంధించి మెటీరియల్‌తో పాటు కూలీలకు చెల్లించేందుకు బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసి తీసుకెళ్తున్నట్లు అహ్మద్‌ఖాన్, రహీం పోలీసులకు తెలిపారు. వారు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్విలెన్స్ టీం సభ్యుడు సంగప్పకు సదరు డబ్బులను అప్పగించారు. సమావేశంలో ట్రెయినీ డీఎస్పీ సౌజన్య, పోలీసు సిబ్బంది పాండు, అంజనేయులు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. మరో ఘటనలో రూ. 2.5 లక్షలు పరిగి మండలం రాఘవాపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు రూ. 2.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన అశోక్ షాద్‌నగర్ నుంచి పరిగికి స్విఫ్ట్ కారులో వెళ్తున్నాడు. అతడి కారులో ఉన్న రూ. 2.5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బును స్టాటిక్ సర్విలెన్స్ టీంకు అప్పగించారు. ఘట్కేసర్లో రూ.5. 38 లక్షలు ఘట్కేసర్: వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘట్కేసర్ పోలీసులు శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించి రూ. 5.38 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఘట్కేసర్కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి స్కూటర్ డిక్కీలో ఈ డబ్బులు పట్టుబడ్డాయి. నగదు పెట్రోల్ పంపునకు చెందినవి ఆయన పోలీసులకు చెప్పాడు. సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదును ఐటీ అధికారులకు అప్పగించారు. అజీజ్‌నగర్ చౌరస్తాలో రూ.1.8 లక్షలు.. మొయినాబాద్: హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై మండల పరిధిలోని అజీజ్‌నగర్ చౌరస్తా వద్ద శుక్రవారం పోలీసుల తనిఖీల్లో ఓ కారులో రూ.1.8 లక్షలు పట్టుబడ్డాయి. వివరాలు.. నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన తిరుమలరెడ్డి తన కారులో చేవెళ్ల వైపునకు వెళ్తున్నాడు. వాహనంలో ఉన్న రూ.1.8 లక్షలను మొయినాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా తాను మహాలక్ష్మి బిల్డర్స్ యజమానిని అని, భూమి కొనుగోలుకు సంబంధించి నగరంలోని పేట్‌బషీరాబాద్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు లో శుక్రవారం ఉదయం రూ.5 లక్షలు డ్రా చేశానని, అందు లో నుంచి రూ.1.8 లక్షలు తీసుకెళ్తున్నట్లు అతడు పోలీసులకు తెలిపాడు. భూమికి సంబంధించిన పత్రాలు కూడా చూపించాడు. డబ్బుకు సంబంధించి అన్ని ఆధారాలు చూపిస్తేనే తిరిగి అప్పగిస్తామని, లేదంటే ఆదాయ పన్ను శాఖకు అప్పగిస్తామని పోలీసులు తిరుమలరెడ్డికి స్పష్టం చేశారు. ముడిమ్యాల చెక్‌పోస్టులో 2.84 కిలోల వెండి పట్టివేత చేవెళ్ల రూరల్: పోలీసుల తనిఖీల్లో రూ. 1.5 లక్షలు విలువ చేసే 2.84 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. చేవెళ్ల పోలీసుల కథనం ప్రకారం.. పరిగి మండల కేంద్రానికి చెం దిన మదులాపురం రవికుమార్ స్థానికంగా వెండి ఆభరణాల వ్యాపారం చేస్తున్నాడు. గురువారం రాత్రి ఆయన నగరం నుంచి పరిగికి బస్సులో వెళ్తున్నాడు. మండలంలోని ముడిమ్యాల చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో అతడి వద్ద ఉన్న బ్యాగులో 2.84 కిలోల వెండి ఆభరణాలు(పట్టాలు, రెండు వెండి బిస్కెట్లు) ఉన్నట్లు గుర్తించారు. తన దుకాణంలో అమ్ముకునేందుకు హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు రవికుమార్ పోలీసులకు చెప్పాడు. అతడి వద్ద ఓ తెల్లకాగితం రశీదు మాత్రమే ఉంది. దీంతో పోలీసులు అనుమానించి అతడిని ఠాణాకు తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో పాటు ఆర్డీఓ చంద్రశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం వెండి ఆభరణాలను కమర్షిల్ టాక్స్ శాఖ అధికారులకు అప్పగించారు. -
వేర్వేరు చోట్ల రూ. 6.45 లక్షలు పట్టివేత
పరిగి/చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో గురువారం వేర్వేరు రెండు ఘటనల్లో రూ. 6.45 లక్షలు పట్టుబడ్డాయి. పరిగి మండలం రాఘవాపూర్ చెక్‌పోస్టు వద్ద బస్సులోంచి రూ. 4 లక్షలు, చేవెళ్ల మండలం ముడిమ్యాల చెక్‌పోస్టు దగ్గర కారులో తరలిస్తున్న రూ. 2.45 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరిగి పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాఘవాపూర్ చెక్ పోస్టు వద్ద గురువారం మధ్యాహ్నం సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్ఐలు షేక్‌శంషొద్దీన్, జానకిరాంరెడ్డిలు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో షాద్‌నగర్ నుంచి పరిగి వస్తున్న ఆర్టీసీ బస్సు(ఏపీ 28 వై 3190)లో సూర్య(21), అర్జున్‌రావు(21) అనే ఇద్దరు యువకులు వస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో వారి వద్ద ఉన్న బ్యాగులో రూ. 4 లక్షలు పట్టుబడ్డాయి. ఈమేరకు వారిని అదుపులోకి తీసుకుని పరిగి ఠాణాకు తరలించారు. యువకులు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నివాసులుగా గుర్తించారు. వికారాబాద్‌లోని ఇండియా ఇన్ఫ్లెన్స్ లిమిటెడ్ సంస్థలో తాము కాల్ కస్టమర్ ఎగ్జిక్యూటీవ్లుగా పని చేస్తున్నట్లు తెలిపారు. వారు డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో సదరు నగదును ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. మరో ఘటనలో రూ. 2.45 లక్షలు.. చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల చెక్‌పోస్టు వద్ద గురువారం మారుతీ జెన్ కారు(ఏపీ 28 ఏడీ 9451)లో తరలిస్తున్న రూ. 2. 45 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ మండలం కవ్వగూడెంవాసి మెరుగు సిద్దేశ్వర్ వికారాబాద్‌కు వెళ్తున్నాడు. ఆయన కారులో ఉన్న రూ.2.45 లక్షలకు సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని, సదరు నగదును ఆదాయ శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్ఐ లక్ష్మీరెడ్డి చెప్పారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు రూ. 50 వేలకు మించి తీసుకెళ్తే దానికి సంబంధించిన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. -
వ్యక్తిని బలిగొన్న సిమెంట్ ట్యాంకర్
పరిగి : సిమెంట్ ట్యాంకర్ మోపెడ్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన పరిగి మం డల పరిధిలోని సుల్తాన్పూర్ గేట్ సమీపంలో హైదరాబాద్- బీజాపూర్ రోడ్డుపై శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇబ్రహీంపూర్‌కు చెందిన ఊరడి పాండు(35) పరిగి పట్టణంలోని తుంకలగడ్డలో సొంతంగా ఇల్లు నిర్మించుకొని అక్కడే భార్యాపిల్లలతో ఉంటున్నాడు. ఆయన అక్కడే ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో కాం ట్రాక్ట్ ప్రాతిపదికన వర్కర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం ఆయన పని నిమిత్తం మోపెడ్‌పై మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌కు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈక్రమంలో గ్రా మ సమీపంలో పరిగి వైపు నుంచి వస్తున్న సిమెంట్ ట్యాంకర్ వెనుక నుంచి మోపెడ్‌ను ఢీకొంది. ప్రమాదంలో మెపెడ్ ధ్వంసమై పాండు ట్యాం కర్ వెనుక చక్రాల్లో ఇరుక్కుపోయాడు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. మృతుడికి భార్య జయమ్మ, కుమారుడు మధుసూదన్(8), కూతురు మానస(4) ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంట్ కష్టాలకు చెక్
పరిగి, న్యూస్‌లైన్ : విద్యుత్ కోతలు చికాకుపరుస్తున్న తరుణంలో పరిగి ప్రాంతంలో రెండు సబ్స్టేషన్లు ఏర్పాటు కానుండటంతో కరెంట్ కష్టాలు తీరుతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాంతం విద్యుత్ వెలుగులు విరజిమ్ముతుందన్న ఆశలు వారిలో రేకెత్తుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి పరిశ్రమలను దూరప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో పరిగి ప్రాంతంలో 230, 400 కేవీ సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పరిగికి ఇప్పటికే 230 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు కాగా, ఇందుకోసం ప్రభుత్వం భూమిని సైతం కొనుగోలు చేసి సంబంధిత శాఖకు అప్పగించింది. నిర్మాణానికి రూ.50 కోట్ల నిధులు సైతం కేటాయించింది. టెండర్ ప్రక్రియ సైతం పూర్తి కావటంతో సంబంధిత కాంట్రాక్టర్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించాడు. ప్రస్తుతం 230కేవీ సబ్‌స్టేషన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరలో ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రానుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే పరిగికి 400కేవీ సబ్‌స్టేషన్ సైతం మంజూరు కాగా గత సంవత్సరం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.350 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. 400కేవీ సబ్‌స్టేషన్ కోసం పలుచోట్ల అధికారులు ప్రభుత్వ భూమిని పరిశీలించినప్పటికీ అవసరమున్న విధంగా భూమి లభించలేదు. దీంతో ప్రభుత్వం రూ.9కోట్లతో ప్రైవేటు భూమిని కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం పరిగి ప్రాంతంలో ఇప్పటికే పలు పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నందున ఈ రెండు సబ్స్టేషన్లు అందుబాటులోకి వస్తే మరిన్ని పరిశ్రమలు వచ్చేందుకు వీలౌతుంది. పశ్చిమ జిల్లాలో వికారాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు 111 జీఓ అడ్డుగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటుకు పరిగి ప్రాంతాన్ని ఎన్నుకోవడం అనివార్యంగా మారింది. ఇప్పటికే పరిగి మీదుగా హైదరాబాద్ - బీజాపూర్ అంతరాష్ట్ర రహదారి ఉండటం, దీన్ని జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపినందున రవాణా సౌకర్యం మరింత మెరుగుపడి పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా మారనుంది. పశ్చిమరంగారెడ్డితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు నాణ్యమైన విద్యుత్ సరఫరా పరిగి ప్రాంతంలో ఈ రెండు సబ్స్టేషన్ల ఏర్పాటుతో పశ్చిమ రంగారెడి ్డజిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్, కోస్గి, షాద్‌నగర్ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా మెరుగుపడనుంది. ప్రస్తుతం నాలుగు నియోజకవర్గాల పరిధిలో 400కేవీ సబ్‌స్టేషన్ లేనందున కర్ణాటకలోని రాయ్‌చూర్ నుంచి ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇక్కడ 400కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటయితే శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు నుంచి నేరుగా పరిగి సబ్‌స్టేషన్‌కు, ఇక్కడినుంచి మిగతా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలు కలుగుతుంది. ఇది పూర్తై ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలతోపాటు భవిష్యత్తులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలవుతుందని ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు. -
జోరుగా సిమెంట్ అక్రమ వ్యాపారం!
పరిగి, న్యూస్‌లైన్: కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అవుతున్న సిమెంట్‌ను డ్రైవర్లతో కుమ్మక్కైన కొందరు ట్యాంకర్లలోంచి దొంగిలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫ్యాక్టరీల నుంచి బయలుదేరుతున్న లారీలు గమ్యస్థానాల్లో సిమెంట్‌ను పూర్తిగా ఖాళీ చేయకుండా తిరిగి వస్తున్నారు. మార్గంమధ్యలో సదరు సిమెంట్‌ను అక్రమార్కులకు అడ్డగోలుగా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో పన్నులు చెల్లిస్తూ వ్యాపారం చేస్తున్న వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఐదారేళ్ల క్రితం పరిగి ప్రాంతంలో ప్రారంభమైన ఈ దందా ప్రస్తుతం వ్యాపారులను శాశించే స్థాయికి చేరుకుంది. వేళ్లూనుకున్న వ్యాపారం.. సిమెంట్ అక్రమ వ్యాపారం పరిగి ప్రాంతంలోని సుల్తాన్పూర్ గేటు, భవానీ థియేటర్, పూడూరు మండలం మన్నెగూడలో యథేచ్ఛగా సాగుతోంది. కొందరు ఏకంగా దుకాణాలు ఏర్పాటు చేసి దందాను నడుపుతున్నారు. కర్ణాటక రాష్ట్రం సేడెం, మల్కెడ్ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి నగరానికి ట్యాంకర్ల ద్వారా సిమెంట్‌ను తరలిస్తుంటారు. అయితే మార్గంమధ్యలోని పైప్రాంతాల్లో డ్రైవర్లు ట్యాంకర్ల నుంచి సిమెంట్‌ను తీస్తున్నారు. సిమెంట్ ట్యాంకర్ల డ్రైవర్లతో అక్రమార్కులు కుమ్మక్కై ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. నిత్యం 20-30 ట్యాంకర్ల నుంచి సిమెంట్‌ను అక్రమంగా విక్రయిస్తున్నారు. రూ. 200-250 చొప్పున ఓ బస్తా అమ్ముతున్నారు. దీనికి తోడు బ్యాగులో తక్కువ సిమెంట్ నింపి ప్రజలను మోసం చేస్తున్నారు. అది ఒరిజినల్ సిమెంటా.. కాదా అనేది దేవుడి తెలుసు. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు వస్తుండడంతో జనం ఎగబడుతున్నారు. ఈ క్రమమ దందాను పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. అక్రమార్కులు తమ పొట్టగొడుతున్నారని స్థానిక సిమెంట్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. తాము డబ్బు కట్టి ఏజెన్సీలు, లెసైన్సులు తీసుకొని దుకాణాలు నడుపుకొంటుంటే అక్రమార్కులు నష్టం కలిగిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రూప్ఖాన్పేట పంచాయతీ నిధుల గోల్మాల్
పరిగి, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి గోల్మాల్ జరిగింది. జాయింట్ ఖాతాలో రెండో వ్యక్తిగా ఉన్న ఈఓఆర్డీ సంతకం లేకుండానే ఎస్టీఓ కార్యాలయం నుంచి నిధులు డ్రాచేశారు. ఈఓఆర్టీ వెంకటేశం ఆరా తీయటంతో ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని రూప్ఖాన్పేట సర్పంచ్ బసమ్మ అనారోగ్యంతో మూడు నెలల క్రితం అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో పంచాయతీ జాయింట్ ఖాతాను ఈఓఆర్డీ వెంకటేశం, ఉపసర్పంచ్ నర్సింహులు పేర్లమీదకు డీపీఓ బదిలీ చేశారు. అయితే గత జనవరి మాసంలో పరిగి ఎస్టీఓ కార్యాలయంలోని పంచాయతీ ఖాతా నుంచి రూ.1,11,936లు డ్రాఅయ్యాయి. ఆ గ్రామ కార్యదర్శి, ఉపసర్పంచ్లు సంతకాలు చేసి డబ్బులు తీసుకున్నారు. బుధవారం ఈఓఆర్టీ వెంకటేశం ఎస్టీఓ కార్యాలయంలో వివరాలు సేకరించటంతో తన సంతకం లేకుండానే నిధులు డ్రాచేశారనే విషయం బయట పడింది. దీంతో ఎంపీడీఓ విజయప్ప, ఎస్టీఓ రాజ్గోపాల్చారిలు కావాలనే నిధులు డ్రాచేయించారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ఎస్టీఓను వివరణ కోరగా ఎంపీడీఓ లెటర్ ఇవ్వటం వల్లే నిధులు డ్రా చేయటానికి అనుమతిచ్చామన్నారు.ఎంపీడీఓ విజయప్పను వివరణ కోరగా జాయింట్ ఖాతాకు సంబంధించి డీపీఓ నుంచి వచ్చిన లెటర్‌ను ఎస్టీఓ కార్యాలయంలో ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఈఓఆర్డీదేనని అన్నారు. -
మళ్లీ ఆయిల్ ఇంజిన్లు!
పరిగి, న్యూస్‌లైన్: అధికారిక, అనధికారిక విద్యుత్ కోతలతో రైతులపై, చిరు వ్యాపారులపై ప్రభుత్వం భస్మాసుర హస్తం మోపింది. దీంతో ప్రత్యక్షంగా రైతులు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు నడిపుకొని పొట్ట పోసుకునే వ్యాపారులపై పెను భారం పడుతోంది. పరోక్షంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. కరెంట్ కోతలతో అటు పొలాలు తడవక.. ఇటు వ్యాపారాలు సాగక.. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వస్తుంది. గత పది, పదిహేను సంవత్సరాల క్రితం వరకు వినియోగించి.. కరెంట్ మోటార్ల రాకతో మూలన పడేసిన ఆయిల్ ఇంజిన్లు మళ్లీ ఇప్పుడు శరణ్యంగా మారాయి. అటు రైతులు, ఇటు వ్యాపారులు చేసేదేమీలేక.. మూలకు పడేసిన ఆయిల్ ఇంజిన్ల దుమ్ము దులుపుతున్నారు. విద్యుత్ కోతలు తీవ్రతరం చేసిన ప్రభుత్వం తమపై ఆర్థికంగా భారం మోపిందంటూ.. ఖర్చు అధికమైనా తప్పసరి పరిస్థితుల్లో వ్యవసాయానికి, చిరు వ్యాపారాలకు ఆయిల్ ఇంజిన్లనే వినియోగిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో.. కరెంటు కోతలతో సూక్ష్మ తరహా పరిశ్రమలు విలవిల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. కాస్తంతైనా ఉపశమనం పొందాలనే ఉద్దేశంతో ఆయిల్ ఇంజిన్ల బూజు దులుపుతున్నారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల యజమానులు ఆయిల్ ఇంజిన్లను ఆశ్రయిస్తున్నారు. రైతులు ఆయిల్ ఇంజిన్లను జనరేటర్లుగా ఉపయోగిస్తూ పొలాలకు నీరు పారిస్తున్నారు. జిరాక్స్ సెంటర్లు, సామిల్లుల యజమానులు, పిండి గిర్నీల నిర్వాహకులు, పంక్చర్ అతికేవారు.. ఇలా అన్ని వర్గాలవారూ ఆయిల్ ఇంజిన్లను వినియోగించక తప్పని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కరెంటుతో అయ్యే ఖర్చుతో పోలిస్తే ఆయిల్ ఇంజిన్‌కు వినియోగించే డీజిల్ ఖర్చు మూడింతలు ఎక్కువగా అవుతున్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో వాటిని వినియోగించాల్సి వస్తోందని సూక్ష్మ తరహా పరిశ్రమల యజమానులు పేర్కొంటున్నారు. కొనక తప్పడం లేదు.. జిరాక్స్ లాంటి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునే వారు గతంలో పొలాలకు నీళ్లుపారించేందుకు వాడిన పాత ఆయిల్ ఇంజిన్లు కొనుక్కుంటున్నారు. దానికి అదనంగా యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే ఓ చిన్న మోటారును బిగించుకుని జనరేటర్‌లా వాడుతున్నారు. అధిక ధర వెచ్చించి జనరేటర్లు కొనుక్కునే స్థోమతలేని చిన్నా చితక వ్యాపారులందరూ.. కరెంటు కోతలవల్ల ఇలాంటి ప్రత్యామ్నాయాలు చేసుకోక తప్పటంలేదు. ఇంతచేసినా వ్యాపారంలో ఏదో సంపాదిస్తున్నారనుకుంటే పొరపాటే. ఇదంతా చేసింది కేవలం తమ వద్దకు రెగ్యులర్‌గా వచ్చే గిరాకీని నిలబెట్టుకోవటానికేనంటున్నారు వారు. ఒక గంట సేపు ఆయిల్ ఇంజిన్ నడపాలంటే రూ.80 నుంచి రూ.100 ఖర్చు చేయాల్సిందే. ఇలా రోజుంతా కరెంటు కోతలు విధిస్తున్న నేపథ్యంలో.. ఎనిమిది, తొమ్మిది గంటలు ఆయిల్ ఇంజిన్ నడపాలంటే రూ. 500 పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేసినా వచ్చిన ఆదాయం మొత్తం దానికే పెట్టాల్సి వస్తుందంటున్నారు. రోజంతా కష్టపడితే చిల్లిగవ్వ కూడా మిగలటంలేదని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పాతకాలమే.. పట్టణాలు, మండల కేంద్రాల్లో చిరు వ్యాపారులందరూ ఆయిల్ ఇంజిన్లు, జనరేటర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. జిరాక్స్ సెంటర్లు, సామిల్లులు, ఫొటో స్టూడియోలు, చిన్న చిన్న ఇతర దుకాణాల్లో సైతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోక తప్పటంలేదు. రైతులు సైతం పొలాలకు నీళ్లు పారించేందుకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా జనరేటర్లు, ఆయిల్ ఇంజిన్లను వాడుతున్నారు. దీంతో పాటు కరెంటు సమస్యతో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లోనూ పనులు ముందుకు సాగటంలేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. -
దిగ్విజయ్‌కు టీఆర్ఆర్ ఆతిథ్యం
పరిగి, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు శుక్రవారం రాత్రి పరిగిలో పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. కర్ణాటకలోని గుల్బర్గాలో శనివారం నిర్వహించనున్న సోనియా సభకు వెళ్తూ ఆయన పరిగిలో గంటపాటు గడిపారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాత్రి 7.30 గంటలకు నేరుగా పరిగికి చేరుకున్న దిగ్విజయ్‌సింగ్ స్థానిక ఇందిరాగాంధీ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడే ఆయనకు కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన దిగ్విజయ్.. పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. రాత్రి భోజనంగా చపాతీ, నాన్‌వెజ్ కర్రీ తీసుకున్నారు. అనంతరం కాసేపు కార్యకర్తలతో ముచ్చటించారు. ఉద్యోగ సంఘాలు, విద్యార్థి జేఏసీ నాయకులు ఆయన్ను కలిసి తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పరిగి టికెట్ ఎవరికి ఇస్తారని కొందరు కార్యకర్తలు, విలేకరులు అడగ్గా ఆ విషయం మీకే తెలుసు అంటూనే.. ఎవరు బాగా పనిచేస్తే వారికే వస్తుందని సమాధానమిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకు డు భాస్కర్.. దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి పం చాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రెగ్యులరైజ్ చేసి న జీఓను ఆయన నుంచి తీసుకున్నారు. -
ఎన్నాళ్లకిస్తారో పరిహారం!
పరిగి, న్యూస్‌లైన్ : కూరగాయలు సాగుచేసే రైతులను ప్రోత్సహిస్తామని చెబుతున్న ప్రభుత్వం మాటలు వట్టివేనని తేలుతోంది. ఒక్కసారి పంట నష్టపోయిన రైతులు.. మళ్లీ సాగుకు సమాయత్తమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా నష్టపోతున్న కూరగాయల రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నష్టం వివరాలను రాసుకుని వెళ్తున్నారే తప్ప.. పైసా పరిహారం చెల్లించడం లేదు. వరితోపాటు ఇతర పంటల కు ఆరు నెలలు అటూఇటుగా పరిహారం అందజేస్తున్న అధికారులు కూరగాయల రైతుల విషయం లో వివక్ష చూపుతున్నారు. 2009లో పంటలు నష్టపోయిన రైతుల వివరాలను పంపామని, పరిహారం విడుదలైందని అధికారులు చెబుతున్నా అది ఇంతవరకు రైతులకు చేరలేదు. గత నాలుగేళ్లుగా అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా కూరగాయలు, పండ్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2010, 2011, 2012,13 సంవత్సరాల్లోనూ జిల్లాలో రైతులు భారీగా నష్టపోయారు. వీరంతా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. గత వేసవి సీజన్లో కురిసిన వడగళ్ల వానకు జిల్లాలో మూడు వేల పైచిలుకు ఎకరాల్లో కూరగాయల పంటలు నష్టపోయినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. కానీ పరిహారం ఊసు మాత్రం ఇంతవరకు లేదు. ఇదేనా ప్రోత్సాహం.. జిల్లాను కూరగాయల జోన్‌గా మారుస్తామని, కూరగాయల సాగును ప్రోత్సహిస్తామని, నిల్వ కోసం శీతల గిడ్డంగులు నిర్మిస్తామని, మార్కెట్ సౌకర్యం కూడా కల్పిస్తామని అధికారులు నాలుగైదు ఏళ్లగా ఊదరగొడుతున్నారు. కానీ చేసింది మాత్రం ఏమీ లేదు. పరిహారం అందిస్తేచాలని, సౌకర్యాలు తర్వాత అని రైతులు అంటున్నారు. 2009లో నాలుగు వేల ఎకరాల్లో పంటలు నష్టపోగా వాటికి సంబంధించి జిల్లాకు రూ.నాలుగు కోట్ల పరిహారం మంజూరైనట్టు అధికారులు చెబుతున్నారని, అది ఇంతవరకు తమ ఖాతాల్లో పడలేదని రైతులు చెబుతున్నారు. 2010, 2011 సంవత్సరాల్లో మూడు వేల ఎకరాల చొప్పున, 2012,13లలో అదే స్థాయిలో రైతులు నష్టపోయారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పండ్ల తోటల నష్టం.. నివేదికలే లేవు జిల్లాలో పండ్ల తోటల నష్టం వివరాలను సేకరించడంలో అధికారులు విఫలమయ్యారు. తెగుళ్లు సోకి నష్టం వాటిల్లితే దానికి పరిహారం ఇవ్వడం వీలుకాదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 8 వేలకుపైగా ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తుండగా అందులో ఆరు వేల పైచిలుకు ఎకరాలు పరిగి నియోజకవర్గంలోనే ఉన్నాయి. రెండేళ్లుగా పండ్ల తోటలకు తెగుళ్లు సోకి సుమారు నాలుగు వేల ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నాయని, జిల్లా వ్యాప్తంగా రైతు లు కోట్లాది రూపాయలు నష్టపోయారని తెలుస్తోంది. -
పండుగపూట దారుణం
పరిగి, న్యూస్‌లైన్: పండుగపూట దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఓ మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆమెపై అత్యాచారం చేసి చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన పరిగి సమీపంలోని తుంకలగడ్డ వాగులో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన కొందరు పట్టణవాసులకు ఓ మహిళ మృతదేహం తుంకులగడ్డ వాగులో కనిపించింది. అర్ధనగ్నంగా ఉంది. సమాచారం అందుకున్న పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి, చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్, ఎస్ఐ లకా్ష్మరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హతురాలి మెడకు చిన్న టవల్ బిగించి ఉంది. తలపై గాయాలు ఉన్నాయి. అర్ధనగ్నంగా పడిఉన్న ఆనవాళ్లను బట్టి ఆమెపై దుండగులు అత్యాచారం జరిపి హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసు జాగిలం పరిగి పట్టణంలోకి వచ్చి కాసేపు తెలుగుతల్లి విగ్రహం చౌరస్తాలో ఆగింది. అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లింది. దీనిని బట్టి.. దుండగులు మహిళను హత్య చే సిన తర్వాత పరిగి వరకు నడుచుకుంటూ వచ్చి అంబేద్కర్ చౌరస్తా నుంచి ఏదైనా వాహనంలో ఎక్కి వెళ్లి పోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హతురాలు ఆకపచ్చరంగు జాకెట్టు, పసుపురంగు చీర ధరించి ఉంది. ఆమెకు 40-45 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి పోలీసులు తెలిపారు. -
రైతు ఉసురు తీసిన అప్పులు..
పరిగి, న్యూస్‌లైన్: కుటుంబ కలహాలు, అప్పుల బాధ నేపథ్యంలో మనస్తాపం చెందిన ఓ రైతన్న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని కుటుంబీ కులు వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్లాపూర్ గ్రామానికి చెందిన రైతు పరిగి జంగయ్య(50)కు స్థానికంగా ఐదెకరాల పొలం ఉంది. ఖరీఫ్‌లో ఆయన పత్తిపంట సాగుచేయగా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. పెట్టుబడి, కుటుంబ అవసరాల కోసం ఆయన రూ. 2 లక్షలు బ్యాంకులో, తెలిసిన వారి వద్ద మరికొంత అప్పు చేశాడు. ఇటీవల కుటుంబ కలహాలు అధికమయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన జంగయ్య శనివారం సాయంత్రం పొలంలో పురుగుమందు తాగి ఇంటికి వచ్చాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే ఆయనను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రైతు ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఈమేరకు మృతుడి కొడుకు బాల్‌రాజ్ ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లకా్ష్మరెడ్డి తెలిపారు. వైద్యులతో కుటుంబీకుల వాగ్వాదం.. వైద్యుల నిర్లక్ష్యంతోనే జంగయ్య మృతిచెందాడని ఆరోపిస్తూ కుటుంబీకులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి విషమిస్తే ఉస్మానియాకు రిఫర్ చేయకుండా ఇక్కడే ఎందుకు చికిత్స అందించారని డ్యూటీ డాక్టర్ చంద్రశేఖర్‌తో పాటు ఎస్పీహెచ్ఓ(సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్) దశరథ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులకు పీఏసీఎస్ డైరక్టర్ లాల్‌కృష్ణప్రసాద్ మద్దతు పలికారు. జంగయ్య మృతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు సర్దిచెప్పారు. దీంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
పరిగి, న్యూస్‌లైన్: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఛాతీభాగంలో గాయం, మెడపై గాట్లు ఉన్నాయి. హత్యేనని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన పరిగిలో గురువారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన చాకలి శ్రీనివాస్(32) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సెలవుపై అతడు ఇటీవల ఇంటికి వచ్చాడు. గురువారం సాయంత్రం బయటకు వెళ్లిన శ్రీనివాస్ తిరిగి అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటి వచ్చాడు. అరగంట తర్వాత వాంతులు చేసుకున్నాడు. కడుపు, ఛాతీభాగంలో నొప్పిగా ఉందని కూలబడిపోయాడు. అతడిని వెంటనే 108 వాహనంలో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా శ్రీనివాస్ మృతిపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం పరిగికి చెందిన శ్రీనివాస్ స్నేహితులు నలుగురు ఇంటికి వచ్చి అతడిని తీసుకొని వెళ్లారని, పేకాట ఆడే క్రమంలో గొడవపడి మద్యం తాగించి తీవ్రంగా దాడి చేయడంతో మృతిచెంది ఉండొచ్చని ఆరోపించారు. నలుగురి పేర్లు సూచిస్తూ వారే తన భర్తపై దాడి చేసి హత్య చేశారని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా శ్రీనివాస్ ఛాతీభాగంలో కమిలిపోయినట్లుగా గాయం ఉంది. మెడభాగంలో గాట్లు ఉన్నాయి. ఇది కుటుంబీకుల ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. శ్రీనివాస్‌కు భార్య అనురాధ, కుమారుడు కార్తీక్(5), కూతురు స్వాతి(3) ఉన్నారు. మృతదేహానికి పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. -
ఒత్తిడే.. చిత్తు చేస్తోంది!
పరిగి, న్యూస్‌లైన్: మారుతున్న జీవన శైలి ప్రతి మనిషిని ఒత్తిడికి గురిచేస్తున్నది. ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో చూస్తున్న కొందరు ఆత్మహత్యకు మొగ్గుచూపుతున్నారు. అప్పుల బాధతో రైతు.. నాన్న తిట్టాడని కుమారుడు, ప్రేయసి ప్రేమకు అంగీకరించలేదని ప్రియుడు, ప్రేమించిన వాడు కాదన్నాడని ప్రియురాలు, భర్త తిట్టాడని భార్య, భార్య మాట వినలేదని భర్త... ఇలా ఎన్నో బలవన్మరణాలు. చిన్నచిన్న కారణాలే ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. పది నుంచి పదహారేళ్ల వయసున్న పిల్లలు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగించే అంశం. గడిచిన రెండుమూడేళ్లలో పరిగి ప్రాంతంలో ఆత్మహత్య కేసులు అనేకం నమోదయ్యాయి. ఆర్థిక సంబంధ కారణాలు కొన్నయితే.. సామాజికంగా అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత వంటిని మరికొన్ని కారణాలు. రైతుల ఆత్మహత్యల్లో, సాధారణ ఆత్మహత్యల్లో జిల్లాలోనే పరిగి ప్రాంతం మొదటి స్థానంలో ఉంది. ఆత్మహత్యల్లో 90శాతం వరకు విషం, పురుగు మందు తీసుకున్నవే ఉంటున్నాయి. పరిగి ప్రభుత్వాస్పత్రిలో నెలకు 50 నుంచి 80 వరకు విషం తీసుకుంటున్న కేసులు వస్తున్నాయి. నియోజకవర్గస్థాయిలో 100నుంచి 150 కేసులు నమోదవుతున్నట్లు ఆయా ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులను బట్టి తెలుస్తోంది. గడిచిన ఏడాదిలో నియోజకవర్గంలో 1,100 వరకు ఆత్మహత్యాయత్నాలు చోటుచేసుకోగా ఇందులో 172మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు 22 మంది. ఇవి పోలీస్ రికార్డుల్లో నమోదైనవి మాత్రమే. నమోదు కానివి ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిలో చాలా మందిని రక్షిస్తున్నా 20 శాతం మంది మాత్రం మృత్యుముఖం చూస్తున్నారు. ఒత్తిడే ప్రధాన కారణం ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో 90శాతం మంది ఒత్తిడికి తట్టుకోలేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మానసిక వైద్యులు చెబుతున్నారు. వృత్తిపరమైన, కుటుంబ పరమైన సమస్యలతో డిప్రెషన్లోకి వెళ్లే వారు రోజురోజుకు పెరుగుతున్నారని వారు పేర్కొంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం 20నుంచి 35 సంవత్సరాలలోపు వారే ఉంటున్నారు. తల్లిదండ్రులు ఆత్మహత్యలకు పాల్పడడంతో వారి పిల్లలు అనాథలైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఒత్తిడి జయించడమే మార్గం ఒత్తిడిని జయిస్తేనే ఆత్మహత్యలు తగ్గుతాయి. ఈ ప్రాంతంలో చిన్నచిన్న కారణాలతో కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబంలోని తల్లిదండ్రులు ఒత్తిడికిలోనయితే ఆ ప్రభావం పిల్లలపైనా పడుతుంది. సామాజిక అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత, ఆర్థిక పరిస్థితి తదితర కారణాలు ఆత్మహత్యల వైపు మళ్లడానికి కారణమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సమస్యను ఆత్మీయులతో పంచుకోవాలి. - వేణుగోపాల్‌రెడ్డి, పరిగి సీఐ సకాలంలో వస్తే కాపాడగలం విషం తాగిన వారికి సొంత వైద్యం చేయకుండా వెంటనే తీసుకురావాలి. సకాలంలో తీసుకొస్తేనే బతికే అవకాశాలు ఎక్కువ. సాధారణంగా ఆస్పత్రికి వస్తున్న ఆత్మహత్యాయత్నం కేసుల గురించి మేం ఆరా తీస్తాం.. దాని వెనుక చాలా చిన్నచిన్న కారణాలు ఉంటున్నాయి. సీరియల్ చూస్తున్నప్పుడు భర్త వద్దన్నాడని, భార్య అడిగిన కూర వండలేదని.. ప్రారంభమయ్యే గొడవలు ఆత్మహత్యల వరకూ వెళ్తున్నాయి. కొంచెం మనసును అదుపులో ఉంచుకుంటే వీటిని అధిగమించొచ్చు. - డాక్టర్ ధశరథ్ , ఎస్పీహెచ్ఓ పరిగి క్లస్టర్ బాంధవ్యాలు బాగుండాలి కుటుంబంలో అందరితో బాంధవ్యం బాగుండాలి. సమస్యను మనసు విప్పి చర్చించే వాతావరణం కుటుంబంలో ఏర్పడాలి. తల్లిదండ్రులతో ఎటువంటి విషయాన్నయినా చర్చించేందుకు పిల్లలు వెనకాడకుండే పరిస్థితి కల్పించాలి. ఒత్తిడిని జయించేందుకు పెద్దలు, పిల్లలు యోగా వంటివి చేయాలి. ప్రాణం విలువ, ఏ సమస్యకైనా పరిష్కారం ఉందన్న విషయాలను తెలియజెప్పాలి. సమస్య తీవ్రమైతే సైకాలజిస్టు వద్దకు వెళ్లడం మరవొద్దు. - సత్తిబాబు, సైకాలజీ అధ్యాపకులు -
విలువ తెలియక...
పరిగి, న్యూస్‌లైన్: ఎర్రచందనం దుంగలకు అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల రూపాయల విలువ పలుకుతోందని ఈ మధ్య ప్రచార మాధ్యమాల్లో వింటున్నాం.. చూస్తున్నాం. ఇంత డిమాండ్ ఉన్న ఈ మొక్కలను పెంచండని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నా రైతులు ముందుకు రావడం లేదు. దీంతో వన నర్సరీలో పెంచిన ఎర్రచందనం మొక్కలు వృథాగా పడిఉంటున్నాయి. వీటిని పెంచితే కేసులు పెడతారేమోనన్న భయం కొందరిదైతే.. వీటిని ఎవరు కొంటారు.. అనే సందేహం మరికొందరిది. ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులకు అందజేసేందుకు జిల్లాలోని నర్సరీల్లో 15లక్షల మొక్కలు పెంచారు. అందులో 14.5లక్షల టేకు మొక్కలున్నాయి. పరిగి మండలంలోని ఖుదావన్‌పూర్ వన నర్సరీలో మాత్రం 50వేల ఎర్రచందనం మొక్కలు పెంచారు. అధికారులు అన్ని మండలాల్లోని రైతులకు టేకుమొక్కలు అందజేసి పొలాల్లో, పొలంగట్లపై నాటించారు. అయితే ఖుదావన్‌పూర్ వన నర్సరీలోని ఎర్రచందనం మొక్కలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా వీటిని తీసుకెళ్లలేదు. ఈ విషయాన్ని ఉపాధి హామీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. మొక్కలు పెరిగిన తర్వాత ఎర్రచందనం దుంగలు విక్రయించుకునేందుకు ప్రభుత్వం నుంచి తామే అనుమతులు ఇప్పిస్తామని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని రైతులకు చెప్పడంలో వారు విఫలమయ్యారు. అందుకే ఇవి వృథాగా పడిఉన్నాయి. -
అవగాహనతోనే భద్రత సాధ్యం
పరిగి, న్యూస్‌లైన్: ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి మనిషి రోడ్డు ఎక్కితేగాని కుదరని పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన మనిషి తిరిగి వచ్చేంత వరకు నమ్మకం లేకుండాపోయింది. ప్రతి మనిషికి వాహనాలతో అవినాభావ సంబంధం ఏర్పడింది. ఏటా రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సేఫ్టీపై అవగాహన కల్పిస్తున్నప్పటికి ప్రమాదాలు జరుగుతూన ఉన్నాయి. సంస్థాగతమైన, సామాజికపరమైన మార్పులు చోటు చేసుకోనంత వరకు భద్రత అందనంత దూరంలోనే ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. చైనా లాంటి దేశాల్లో సైకిల్‌పై వెళ్లే వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలనే కచ్చితమైన నిబంధన ఉండగా మనం మోటార్ సైకిళ్లకే ఈ నిబంధనను వర్తింపజేయడంలో విఫలమవుతున్నాం. వాహనాలతో వచ్చే రెవెన్యూ కంటే ప్రమాదాల్లో నష్టపోయేదే ఎక్కువగా ఉంటోందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల భారం మన జీడీపీపై కూడా ఉంటోందని వారు అంచనా వేస్తున్నారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు కొనసాగనున్నాయి. కారణాలు - నివారణ మార్గాలు నేరాల సంఖ్యలో రోడ్డు ప్రమాదాల శాతమే ఎక్కువగా ఉందని గుర్తించిన ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10నుంచి 15 వేల కిలోమీటర్ల కొత్త రోడ్లు వేస్తున్నప్పటికి అవి మన అవరాలకు సరిపోవడం లేదు. రోజురోజు పెరుగుతున్న జనాభా, వాహనాల వాడకంతో పోలిస్తే రోడ్లు వేయటం, మనం అనుసరిస్తున్న విధానాలు ఏ మాత్రం సరిపోవటంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 70 శాతం నుంచి 80 శాతం వరకు రోడ్లు బాగాలేక, 15 శాతం అవగాహన లోపంతో, 5 శాతం మిగితా కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పని సరిగా వాడడం, పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండడం. జాగ్రత్తగా వాహనాలు నడపడం. (సేఫ్టీ ప్యాసింజర్ సిస్టం) రోడ్లపై ఆటోల్లో, ట్రాక్టర్లలో, లారీల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గడంతోపాటు రోడ్లపై (4 వీలర్) బస్సులు ప్రయాణికులకు సరిపోయే స్థాయిలో రావడం. ఆర్టీసీ తమ సామర్థ్యాన్ని మరింత పెంచడం ద్వారా ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంది. సంస్థాగతమైన మార్పులు అవసరం ప్రమాదాల నివారణలో రోడ్డు తనిఖీ విభాగం, రవాణా శాఖల్లో సంస్థాగతమైన మార్పులు వస్తే తప్ప ప్రమాదాల శాతం తగ్గించలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్టీఏ అధికారులను ఎక్కువ సంఖ్యలో నియమించడం ద్వారా రోడ్డు, వాహనాలను తనిఖీ చేయటం, విద్యార్థులకు, వాహనదారులకు అవగాహన కల్పించడం నిరంతర ప్రక్రియగా మార్చడం, అవగాహన కోసం స్వచ్చంద సంస్థలు ముందుకు రావడం వంటి సంస్థాగతమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. -
ఆధార్ మళ్లీ మొదటికి
పరిగి, న్యూస్‌లైన్: ఆధార్ నమోదు ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. గతంలో ఆధార్ నమోదులో జాప్యంపై రాస్తారోకోలు, ధర్నాలతో అట్టుడికిన పరిగిలో మళ్లీ ఆందోళనలు చోటు చేసుకుంటున్నా యి. ఆధార్ నమోదు చేసుకొని సంవత్సరం దాటి నా కార్డులు రాకపోవడంతో మళ్లీ ఫొటోలు దిగేందు కు సెంటర్ల వద్ద ప్రజలు క్యూ కట్టారు. పరిగిలో 110 శాతం ఆధార్ ప్రక్రియ పూర్తయ్యిందని అధికారులు చెబుతుండగా ఆధార్ కేంద్రం వద్ద రోజూ వందల సంఖ్యలో నమోదుకు బారులు తీరుతుండటం గమనార్హం. ప్రస్తుతం పరిగిలో ఒకే కంప్యూటర్‌తో ఆధా ర్ నమోదు చేస్తుండటం, తరచూ కరెంట్ పోతుండటంతో ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దీంతో విసిగిన ప్రజలు మంగళవారం రోడ్డెక్కారు. పరిగి - వికారాబాద్ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సముదాయించేందుకు వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అస్తవ్యస్తంగా ప్రక్రియ.. ఆధార్ నమోదు ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైం ది. నమోదు చేసుకున్న ఆరు నెలలకు గానీ కార్డులు రావటంలేదు. వచ్చాక పోస్టాఫీస్ సిబ్బంది అందజేయటంలోనూ ఆలస్యం చేస్తున్నారు. కేంద్రాల సిబ్బంది ఆధార్ నమోదుకు రూ.100-రూ.500 వరకూ తీసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫొటోలు దిగిన వారికి రసీదులు ఇవ్వ డం ఇవ్వడం లేదని, ఆన్లైన్లో నమోదు చేయడం లేదన్న విమర్శలున్నాయి. పరిగి మండలంలోని బాబాపూర్, రూప్‌ఖాన్‌పేట్ తదితర గ్రామాలకు చెందిన వారి ఆధార్ వివరాలు ఆన్లైన్లో లేకపోవడంతో మళ్లీ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. -
విజృంభిస్తున్న సారక్కసి
పరిగి, న్యూస్‌లైన్: సారా మహమ్మారి జనాన్ని మింగుతోంది. దానికి బానిసైన ప్రజలు మృత్యువాత పడుతున్నా సంబంధిత అధికారులు చేష్టలుడిగి నిమ్మకు నీరెత్తారు. కుటుంబాలు ఛిద్రమవుతున్నా ఎవరికీ పట్టడం లేదు. తరచు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే సారా ఇద్దరిని బలిగొంది. ఈ నెల 1న పరిగి పట్టణంలో సారా తాగి ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా మండల పరిధిలోని రావులపల్లిలో గుడుంబా తాగి ఓ వ్యవసాయ కూలీ దుర్మరణం పాలయ్యాడు. దీన్ని బట్టి సారా మహమ్మారి ఏ మేర తన ప్రతాపం చూపుతోందో అవగతమవుతోంది. హోటళ్లలా సారా దుకాణాలు గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా సారా విక్రయ కేంద్రాలు హోటళ్లలా వెలిశాయి. చిన్న గ్లాసుల నుంచి అర లీటర్, లీటర్ ప్యాకెట్లలో రూ. 10 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. కొందరు సారాను తండాల్లో తయారు చేస్తూ గ్రామాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఎక్సైజ్ అధికారులు విక్రయకేంద్రాలపై దాడులు చేసి ‘మమ..’ అనిపిస్తున్నారు. సారా తయారీదారుల నుంచి అధికారులు ‘అమ్యామ్యాలు’ తీసుకొని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. యువతకు లభించని మద్దతు.. సారా మహమ్మారిని పారద్రోలేందుకు యువత బాగానే ఉద్యమిస్తున్నా వారికి ప్రోత్సాహం లభించడం లేదు. మద్దతు ఇవ్వాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలుమార్లు యువజన సంఘాల సభ్యులు సారాను పట్టుకొని ధ్వంసం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో గ్రామాల్లో విక్రయిస్తున్న నాటు సారాను పట్టుకుని ధ్వంసం చేస్తున్నారు. సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి సామగ్రి ధ్వంసం చేస్తున్నారు. తరచు ఎక్సైజ్ కార్యాలయాల ఎదుటా ధర్నాలు నిర్వహిస్తున్నా వారికి సరైన మద్దతు లభించడం లేదు. సారా వ్యాపారులకు కొందరు నాయకులు సహకరిస్తున్నారని యువకులు ఆరోపిస్తున్నారు. జోరుగా నల్లబెల్లం దందా వ్యాపారులు జోరుగా నల్లబెల్లం, నవసాగరం విక్రయిస్తున్నారు. లొసుగులను అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా తమ దందా సాగిస్తున్నారు. పశువుల దాణా పేరుతో నల్లబెల్లం బెల్లం విక్రయిస్తున్నారు. అది సారా తయారీదారులకు వరంగా మారింది. సారా కోసమే వ్యాపారులు విక్రయాలు జరుపుతున్నారనేది బహిరంగ రహస్యం. ఇటీవల ఎస్పీ ఆదేశాల మేరకు పరిగిలో ఓ దుకాణంపై దాడి చేసిన స్పెషల్ పార్టీ పోలీసులు వందల క్వింటాళ్ల నల్లబెల్లం బస్తాలు, నవసాగరం కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. అయినా ఎటువంటి కేసు నమోదు కాలేదని సమాచారం. సారా విక్రయాలపై ఎక్సైజ్ అధికారులను వివరణ కోరగా విస్త్రృతంగా దాడులు నిర్వహిస్తున్నాం. నెలకు సగటున 60 కేసులు నమోదు చేస్తున్నామని చెబుతున్నారు. -
‘అమృతహస్తం’లో లోపాలు సరిదిద్దుతాం
పరిగి, న్యూస్‌లైన్: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, శిశువులకు పౌష్టికాహారం అందజేసేందుకు ఉద్దేశించిన అమృతహస్తం పథకంలో లోపాలను సరిదిద్ది పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ చిరంజీవి తెలిపారు. మంగళవారం పరిగితోపాటు మండల పరిధిలోని మిట్టకోడూర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. స్థానిక అధికారులు, సిబ్బందితోపాటు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన బాలింతలు, గర్భిణులతో మాట్లాడారు. అనంతరం పరిగి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృతహస్తం పథకం అమలులో అంగన్వాడీలు, ఐకేపీల మధ్య సమన్వయ లోపం ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు సమావేశాలు, కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణను ఇక ప్రతి రోజూ పర్యవేక్షించనున్నట్టు కమిషనర్ చెప్పారు. ప్రతి సెంటర్ నుంచి రోజువారీ నివేదికలు పంపించేందుకు వీలుగా అంగన్వాడీ కార్యకర్తలకు త్వరలో సిమ్ కార్డులు అందజేయనున్నట్టు తెలిపారు. పిల్లల్లో పోషకాహారలోపాన్ని అధిగమించేందుకు చర్యలు రాష్ట్రంలో ఇంకా 1.5 లక్షల మంది పిల్లలు ఉండాల్సిన బరువుకంటే తక్కువ ఉన్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ తెలిపారు. పిల్లల్లో పోషకాహార లోపం నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో నెలలో రెండుసార్లు ెహ ల్త్ అండ్ న్యూట్రిషన్ డేలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వారానికి నాలుగుసార్లు గుడ్లు, పౌష్టికాహారం సరుకులు అందజేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 406 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా అందులో 178 ప్రాజెక్టుల పరిధిలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కొత్తగా 3,218 అంగన్వాడీ భవనాల నిర్మాణం.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు 250 భవనాల చొప్పున మొత్తం 3,218 అంగన్వాడీ కొత్త భవనాలు నిర్మిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఒక్కో భవనానికి రూ.6.5లక్షల నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయన్నారు. మొత్తం రాష్ట్రంలో 91,307 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో 1,745 గ్రేడ్ -2, 655 గ్రేడ్-1 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటి భర్తీ కోసం పరీక్షలు నిర్వహించామని, అయితే కోర్టులో కేసు వల్ల ఫలితాలు వాయిదా పడ్డాయన్నారు. 106 సీడీపీఓ పోస్టుల భర్తీకి కూడా పరీక్షలు నిర్వహించామని, మరో 107 సీడీపీఓ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతిచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ రాజ్యలక్ష్మి, పీడీ శేషుకుమారి, సీడీపీఓ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బాగు చేయరు.. కొత్తది కొనరు!
పరిగి, న్యూస్‌లైన్: పరిగిలో ఉన్నది రెఫరల్ ఆస్పత్రి కావడంతో ప్రారంభంలో ప్రభుత్వం రోగులను తరలించేందుకు ఓ అంబులెన్స్‌ను కేటాయించింది. కొన్నాళ్లకే రిపేర్లు రావడంతో అధికారులు మరమ్మతులు చేయించకుండా మూలకు పడేశారు. ఏళ్లుగా దాన్ని పట్టించుకోక పోవడంతో అది మరింత పనికి రాకుండా పోయింది. అయితే నిధులు మంజూరు కావడంతో గత వేసవిలో బాగు చేయించారు. సుమారు రూ.20 వేల వరకు ఖర్చు వచ్చింది. కానీ నెలలోపే మళ్లీ షెడ్డుకు చేరింది. ఇక దీంతో పనికాదని, కొత్తది కొనాల్సిందేనన్న నిర్ణయానికొచ్చిన అధికారులు మరమ్మతులకు ముందుకు రాలేదు. మరమ్మతులు లేవు... కొత్తదీ రాదు సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రికి నిరుపేదలే వస్తుంటారు. వీరిని పరీక్షించి అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రికి తరలించాల్సి ఉంటుంది. ఈ ఆస్పత్రిలో అంబులెన్స్ ఉంటే డీజిల్ వంటి ఖర్చుకు కేవలం ఐదారు వందల్లో పని అయిపోయేది. కానీ ప్రైవేటు వాహనం మాట్లాడుకోవాలంటే కనీసం రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేలు అడుగుతున్నారు. అయినా భరించక తప్పని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్‌కు రెఫర్ చేసినా.. స్థానికంగానే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. అందరివీ.. కేవలం ‘హామీ’లే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ఆస్పత్రిని సందర్శించిన ప్రతిసారి అంబులెన్స్ ఇచ్చేస్తామని హామీలిచ్చారు. కానీ ఏ ఒక్కరూ ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇక స్థానిక అధికారులు చాలాసార్లు ప్రతిపాదనలు పంపామని చేతులు దులుపుకున్నారు. గతంలో ఓసారి మంత్రి ప్రసాద్‌కుమార్ పరిగి ఆస్పత్రిలో అదనపు గదులను ప్రారంభించేందుకు వచ్చారు. అంబులెన్స్ లేని విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. కొనుగోలుకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి సైతం అనేకసార్లు ఆస్పత్రిని సందర్శించిన సమయంలో అంబులెన్స్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ వీరిలో ఎవరూ హామీని నిలబెట్టుకోలేదు. -
షరతులు లేని ‘తెలంగాణ’ సాధించుకోవాలి
పరిగి, న్యూస్‌లైన్: షరతులులేని తెలంగాణ సాధించుకోవాలని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బిల్యానాయక్ అన్నారు. పరిగి చిల్లింగ్ సెంటర్ గెస్ట్‌హౌస్‌లో శనివారం ఆయా పార్టీలు, ప్రజాసంఘాల నాయకులతో తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిల్యానాయక్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరిగేలా తెలంగాణను నిర్మించుకోవటం ఇప్పుడు మన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. నాడు తెలంగాణ సాధనలో అడ్డుతగిలిన వారే నేడు వారి పదవులు, ప్రయోజనాల కోసం ముందు వరుసలో ఉంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఏర్పాటు కాకముందే తెలంగాణ సాధనకోసం 2,500 సమావేశాలు జరిగాయన్నారు. పేదల ఆకాంక్షలను నెరవేర్చే తెలంగాణను నిర్మించుకోవటంకోసం తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ ఉద్యమిస్తుందన్నారు. ఎన్నడూ తెలంగాణ గురించి మాట్లాడని జైపాల్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు సమావేశాలు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముస్లిం జేఏసీ ఉపాధ్యక్షుడు ఎంఏ బాసిద్ మాట్లాడుతూ.. ఆంగ్లేయులను పారద్రోలి స్వాతంత్య్రం తెచ్చుకుంటే ఆంధ్రావాళ్లు వచ్చి నెత్తిన కూర్చున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామని అనటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రసిద్ధిగాంచిన చార్మినార్, హైకోర్టు, సాలార్జంగ్ మ్యూజియం, ఉస్మానియా యూనివర్సిటీ, అసెంబ్లీ, సచివాలయం, గవర్నర్ భవన్ మీరే కట్టారా అని ప్రశ్నించారు. వందల ఎకరాల ఈ ప్రాంత భూములు కబ్జా చేయటం తప్ప చేసేందేమీ లేదన్నారు. కార్యక్రమంలో గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, ప్రొఫెసర్ రవీంద్రాచారి, సమతాసైనిక్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్‌రావ్, ఉపాధ్యక్షుడు రత్నయ్య, అడ్వకేట్ ఆనంద్‌గౌడ్, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి సునందబుగ్గన్నయాదవ్, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు యాదయ్యయాదవ్, విద్యార్థి జేఏసీ నియోజకవర్గ చైర్మన్ రవికుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీర్‌మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
అడ్డా మార్చారు...
పరిగి, న్యూస్‌లైన్: నగర శివారులో రిసార్టులపై పోలీసులు దాడుల నేపథ్యంలో ‘జల్సారాయుళ్లు’ తమ రూటు మార్చారు. గ్రామీణ ప్రాంతాలైతే సురక్షితంగా ఉంటుందని భావించి ఇక్కడి ఫాంహౌస్‌లలో తమ ‘కార్యకలాపాలు’ నిర్వహిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక పోలీసులు పరిగి మండల పరిధిలోని తొండపల్లి సమీపంలోని ఫాంహౌస్‌లో దాడి చేశారు. అశ్లీల నృత్యాలు, వ్యభిచారం నిర్వహిస్తున్న 20 మంది పురుషులతో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పచ్చని పల్లెల్లో ఇలాంటి ‘పాడుపని’ ఏమిటని స్థానికులు నిర్ఘాంతపోయారు. నింది తులు మద్యం మత్తులో నృత్యాలు చేస్తూ పేకాట ఆడుతున్నారు. నగర శివారు ప్రాంతాల్లో పోలీసులు రిసార్టులపై దాడులు చేస్తుండడంతో జల్సారాయులు రూటు మార్చినట్లుగా తెలుస్తోంది. పరిగి మండలం మారుమూల ప్రాంతమవడంతో వారు ఎంచుకున్నారు. సురక్షిత ప్రాంతమనే.. రియల్ బూమ్ సమయంలో నగరవాసులు చాలామంది పరిగి, పూడూరు మండలాల్లో భూములు కొనుగోలు చేసి తోటలు పెంచుతూ విలాసవంతమైన భవనాలు నిర్మించుకొని ఫాంహౌస్‌లను ఏర్పాటు చేసుకున్నారు. భారీ ఎత్తుగా ప్రహరీలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో లోపల ఏం జరుగుతుందనే విషయం స్థానికులకు తెలిసే ఆస్కారం లేకుండా పోయింది. దీంతో కొందరు జల్సారాయుళ్లు అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. పరిగి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో కలిపి దాదాపు 200-250 ఫాంహౌస్‌లు ఉన్నాయి. కాగా బిజీ జీవనంతో సతమతమమ్యే నగరవాసులు కొందరు ఫాంహౌస్‌లకు వస్తూ సేదతీరుతున్నారు. ఇటీవల ఫాంహౌస్‌లకు జంటల తాకిడి కూడా బాగా పెరిగిందని, వారిని స్ధానికులు ప్రశ్నిస్తే వాహనాలపై పరారవుతున్నారని చెబుతున్నారు. దీనిని బట్టి అసాంఘిక కార్యకలాపాలు ఏమేర సాగుతున్నాయో.. ఊహించుకోవచ్చు. ఫాంహౌస్‌ల నిర్వాహకులు కొందరు డబ్బుకు ఆశపడి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆందోళనలో స్ధానికులు.. పచ్చని పల్లెలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతుండడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పల్లె వాతావరణం కలుషితమవుతోందని చెబుతున్నారు. -
రేవ్ పార్టీ పై పోలీసుల దాడి, ప్రముఖులు పిల్లల అరెస్ట్!
-
ఊపిరి తీసుకుంటున్న సమాధి
-
రేవ్ పార్టీ పై పోలీసుల దాడి, ప్రముఖులు పిల్లల అరెస్ట్!
ముంబై, ఢిల్లీ మహనగరాల్లో జోరుగా సాగే రేవ్ పార్టీ సంస్కృతి భాగ్యనగరానికి కూడా పాకింది. ఈ మధ్యకాలంలో పోలీసులు రేవ్ పార్టీలపై ఆకస్మిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా పక్కా సమాచారంతో శనివారం రాత్రి జరిపిన దాడిలో 20 మంది పురుషులతోపాటు, ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం దొండపల్లిలో రేవ్ పార్టీలోని ఓ ఫామ్ హౌజ్ లో రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నగర ప్రముఖుల, రాజకీయ నేతల కొడుకులు ఉన్నట్టు సమాచారం. ఈ దాడిలో భారీగా మద్యం బాటిల్లను, నాలుగు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం నగర శివార్లలో జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి.. పెద్ద మొత్తంలో మద్యాన్ని, భారీ సంఖ్యలో మహిళల్ని, పురుషుల్ని అరెస్ట్ చేశారు.