Shirisha Brutally Murdered In Vikarabad District - Sakshi
Sakshi News home page

వికారాబాద్‌లో దారుణం.. పాపం శిరీష..

Published Sun, Jun 11 2023 6:00 PM | Last Updated on Sun, Jun 11 2023 6:20 PM

Shirisha Murdered In Vikarabad District - Sakshi

సాక్షి, పరిగి: వికారాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి దారుణ హత్యకు గురైంది. నిన్నటి నుంచి కనిపించని యువతి శిరీష(19) హత్యకు గురై నీటికుంటలో రక్తపు మరకలతో మృతదేహం కనిపించింది. గుర్తు తెలియని దుండగులు యువతి కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసి, కాళ్లు, చేతి నరాలను కత్తితో కోశారు.

వివరాల ప్రకారం.. పరిగి మండలం కాలాపూర్‌ గ్రామంలో శిరీష దారుణ హత్యకు గురైంది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు టెన్షన్‌ పడ్డారు. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించారు. దీంతో, పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం.. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటికుంటలో రక్తపు మరకలతో శిరీష మృతదేహం కనిపించింది. 

కాగా, గుర్తు తెలియని దుండగులు శిరీషను దారుణంగా హత్య చేశారు. ఆమె కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసి, కాళ్లు, చేతి నరాలను కత్తితో కోశారు. దుండగలు యువతిని హత్య చేసి నీటికుంటలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక, శిరీష ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్‌ శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల బాలిక తల్లికి గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తల్లి అనారోగ్య సమస్య కారణంగా శిరీష రెండు నెలల క్రితం చదువు మానేసింది. ఈ క్రమంలో ఇలా దారుణ హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.  

మరోవైపు.. ఈ హత్య కేసులో మరో​ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. నిన్న శిరీషపై ఆమె అక్క భర్త అనిల్‌ చేయిచేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. శిరీష గొంతుపై పోలీసులు గాట్లను గుర్తించారు. శిరీష తండ్రి, తమ్ముడికి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, శిరీషను అక్క భర్త అనిల్‌ కొట్టడం వల్లే మనస్తాపానికి గురైనట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: బిగ్‌ ట్విస్ట్‌.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement