vikarabad
-
ఆస్తి కోసం మరిదిని చంపించిన వదిన..
బషీరాబాద్, వికారాబాద్ : మరిదిని చంపితే అతని వాటా ఆస్తి తమకు వస్తుందని హత్య చేయించింది ఓ వదిన. ఈ ఘటన వికారాబాద్ జిల్లా (Vikarabad District) బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో (Navalga Village) జరిగింది. పోలీసులు, హతుడి కుటుంబ సభ్యులు, తెలిపిన వివరాల ప్రకారం.. నవల్గాకు చెందిన మాల శ్యామప్ప (39) గ్రామ గేటు సమీపంలో హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు బషీరాబాద్ (Basheerabad) పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్డు తొలగిస్తే.. ఆస్తి దక్కుతుందని.. నవల్గాకు చెందిన మాల మల్లమ్మకు మాల నర్సిములు, శ్యామప్ప (39), శ్యామమ్మ సంతానం. అయితే శ్యామప్ప భార్య నాలుగేళ్ల క్రితం భర్తను వదిలేసి కూతురును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శ్యామప్ప తన చెల్లితో కలిసి ఉంటున్నాడు. అదే ఇంట్లోని రెండో భాగంలో అన్న నర్సిములు, వదిన సుగుణ నివసిస్తున్నారు. మరిదిని అంతమొందిస్తే ఇల్లు పూర్తిగా తమ సొంతం అవుతుందని భావించింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొత్త విజయ్, విశ్వనాథ్, శివకుమార్‌లతో కలిసి వారం రోజుల క్రితం శ్యామప్ప హత్యకు పథకం వేసింది. అతన్ని చంపితే రూ.50 వేలు ఇస్తానని చెప్పి, శనివారం అడ్వాన్స్‌గా రూ.10 వేలు అందజేసింది. ఈ క్రమంలో సుపారీ తీసుకున్న ముగ్గురు శ్యామప్ప హత్యకు పక్కా ప్లాన్ వేశారు. సోమవారం సాయంత్రం బషీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో గ్లౌజ్‌లు తీసుకున్నారు. మద్యం తాగేందుకని రాత్రి శ్యామప్పను తీసుకుని గ్రామ శివారులోని ఓ పొలంలోకి వెళ్లారు. మద్యం తాగిన తర్వాత శ్యామప్ప తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పొలానికి ఆనుకుని ఉన్న బషీరాబాద్– తాండూరు ప్రధాన మార్గం వద్దకు ఈడ్చుకెళ్లి పడేశారు. హత్య సమాచారం అందుకున్న ఎస్ఐ శంకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్ హత్య తీరును పరిశీలించారు.చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..హతుడి తల్లి మల్లమ్మ, సోదరి శ్యామమ్మను విచారించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాయి. అనుమానం వచ్చిన పోలీసులు వదిన సుగుణను ఠాణాకు తరలించి విచారించారు. హత్యకు సంబంధం ఉన్నట్లు గుర్తించిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా, వారు నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామని సీఐ మీడియాకు తెలిపారు. -
పరిగిలో బెట్టింగ్ పావురాల కలకలం
పరిగి: బెట్టింగ్ కోసం తీసుకువచ్చిన రేసింగ్ పావురాలు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో హాట్ టాపిక్‌గా మారాయి. వీటిని గాల్లోకి వదులుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం 7.30 గంటలకు పట్టణ కేంద్రంలోని లక్ష్మీనగర్‌కు ఇద్దరు వ్యక్తులు గూడ్స్ వాహనంలో వచ్చి రెండు బాక్స్‌లలో తెచ్చిన పావురాలను బయటకు వదిలారు. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు వారిని ప్రశ్నించగా.. తాము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని, ఇక్కడ వదిలిన పావురాలు తమతమ యజమానుల వద్దకు వెళ్తాయని చెప్పారు.పావురాల కాళ్లకు కోడ్ నంబర్లు ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఘటన స్థలానికి రావడానికి ఆలస్యం కావడంతో స్థానికులే పావురాలు ఉన్న వాహనాన్ని పీఎస్‌కు తరలించి, పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన మునావర్, బాబుజానీలుగా తెలిపారు.పది మంది యజమానులు తమ పావురాలను ఈ పోటీలో పెట్టారని, ఇక్కడ వదిలిన పావురాల్లో ముందుగా చేరుకున్న దాన్ని చిప్ సాయంతో విజేతగా గుర్తిస్తారని చెప్పారు. గోరంట్లకు చెందిన ప్రేంకుమార్ తమను పంపించారని, ఉదయం పావురాలను వదిలితే సాయంత్రం వరకు అక్కడికి వెళ్తాయని వివరించారు. మొత్తం 20 బాక్స్‌లలో 400 పావురాలను తీసుకువచ్చామని, ఇందులో రెండు బాక్స్‌లలోని పావురాలను వదిలామని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రూ. వేలల్లో ధర.. ప్రత్యేక శిక్షణ సాధారణంగా పావురాలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోటీల్లో వినియోగిస్తారు. ట్రైనింగ్ పొందిన కపోతాలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఎక్కడ వదిలినా గమ్య స్థానానికి చేరుకునేలా తరీ్ఫదునిస్తారు. ఉదయం వదిలితే సాయంత్రం వరకు గమ్యాన్ని చేరుకుంటాయి.ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పావురాల బెట్టింగ్‌లను అధికంగా నిర్వహిస్తారు. పోటీల్లో పాల్గొనే ఒక్కో పావురాన్ని కొనుగోలు చేసేందుకు వేలాది రూపాయలు వెచ్చిస్తారు. అనంతరం వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, బెట్టింగ్‌లలో పాల్గొంటారు. బెట్టింగ్ కాసిన ప్రదేశం నుంచి దాదాపుగా 500 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్లి వదులుతారు. వీటిలో ఎవరి పావురం ముందుగా అక్కడకు చేరుకుంటే వారే గెలిచినట్లు ప్రకటించి బహుమతులు అందజేస్తారు. -
నీ వెంటే వస్తున్నా బిడ్డా..!
కుల్కచర్ల(వికారాబాదు జిల్లా) : కొడుకు మరణాన్ని తట్టుకోలేక.. ఓ తల్లి గుండె ఆగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చూస్తుండగానే.. కుమారుడి శవం పక్కనే తుదిశ్వాస విడిచింది. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పీఎస్ పరిధిలోని చౌడాపూర్ మండలం లింగంపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మ్యాకల శ్రీశైలం (34) గత నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇదే ఊరికి చెందిన బాల్‌రాజ్, లక్ష్మణ్, రాములు కలిసి భూ తగాదాలతో తనను వేధిస్తున్నారని అంతకు ముందే సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. శ్రీశైలం మృతిని జీర్ణించుకోలేని తల్లి వెంకటమ్మ (52) కొడుకు శవం వద్ద రోదస్తూ కింద పడిపోయింది. అక్కడున్నవారు చూస్తుండగానే ప్రాణాలు విడిచింది. దీంతో తల్లీ కొడుకుల అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. శ్రీశైలం ఆత్మహత్యకు కారణమైన బాల్‌రాజ్, లక్ష్మణ్, రామును అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం వారిని రిమాండ్‌కు తరలించారు. పోలీసులకు సవాల్‌గా మారిన విజయ హత్య కేసు -
‘లగచర్ల’లో మళ్లీ భూసేకరణ..నోటిఫికేషన్ విడుదల
సాక్షి,వికారాబాద్: లగచర్లలో భూ సేకరణకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. శుక్రవారమే లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణ రద్దు చేసిన ప్రభుత్వం మరుసటి రోజే అక్కడ మల్టీపర్పస్ పారిశ్రామిక పార్క్ కోసం భూ సేకరణ నోటీస్ ఇచ్చింది. వికారాబాద్ జిల్లా దూద్వాల్ మండలం,పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.2013 చట్టం సెక్షన్ 6(2) కింద భూసేకరణను నోటిఫికేషన్ ఇచ్చారు.కాగా,వికారాబాద్ లగచర్లలో ఫార్మాసిటీ భూ సేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఉద్యమించిన విషయం తెలిసిందే. భూ సేకరణ విషయమై గగ్రామానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌పై దాడికి యత్నించడం సంచలనంగా మారింది.ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రభుత్వం లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిందని అంతా భావించారు. అయితే ఇంతలోపే మళ్లీ భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడం చర్చకు దారి తీసింది.ఇదీ చదవండి: లగచర్ల ‘ఫార్మా’ రద్దు -
పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్:లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. కొడంగల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండడంతో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు వికారాబాద్ కోర్టు తెలిపింది.తదుపరి విచారణను వికారాబాద్ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.నరేందర్‌రెడ్డిని 7 రోజుల పాటు తమ కస్టడీ కి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరగనుంది.ఈ పిటిషన్‌పై కోర్టు వాదనలు విననుంది.మరోవైపు కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి వేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. -
లగచర్ల ఘటన కుట్ర కాదు.. తిరుగుబాటు: పైలట్ రోహిత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:లగచర్ల ఘటన రైతుల బాధతో జరిగిన తోపులాటే కానీ కుట్ర కానే కాదని బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శనివారం(నవంబర్ 16) ఈ విషయమై రోహిత్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘లగచర్ల గ్రామం చుట్టుపక్కల పచ్చని పంటపొలాలు,అధిక దిగుబడినిచ్చే పంట పొలాలు ఉన్నాయి.ప్రభుత్వం మొండితనంతో ముందుకు వెళ్తోంది. దాడి జరిగిన రోజు కలెక్టర్‌కు పోలీసులు భద్రత ఎందుకు కల్పించలేదు. బాధతో తిరగబడితే రైతులపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆ సంఘటన జరిగిన రోజు అక్కడ లేడు. నరేందర్ రెడ్డిని కుట్రతోనే జైల్లో వేశారు.బీఆర్ఎస్ సర్కార్ గతంలో 14 వేల ఎకరాల భూమిని ఫార్మా సిటీకి కేటాయించింది. మళ్ళీ ఇప్పుడు ఫార్మాసిటీకి కొత్తగా భూసేకరణ ఎందుకు.జిల్లాకు పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్న పట్నం మహేందర్ రెడ్డి ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు? నరేందర్ రెడ్డి జైలుకి వెళ్ళడం వెనుక మహేందర్ రెడ్డి హస్తం ఉంది.నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి.పట్నం కుటుంబంపై నిజంగా మహేందర్‌రెడ్డికి ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ పదవికి,చీఫ్ విప్ పదవికి రాజీనామా చేయాలి’అని రోహిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అన్న వాళ్లే ఫినిష్ అయ్యారు -
లగచర్ల ఘటనపై సమీక్ష.. పరారీలో ఉన్నవారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు
-
కలెక్టర్‌పై దాడి కేసు.. బీఆర్ఎస్ నేత నరేందర్‌రెడ్డికి రిమాండ్
సాక్షి,రంగారెడ్డిజిల్లా: వికారాబాద్ కలెక్టర్‌పై కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన దాడి కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి బుధవారం(నవంబర్13) కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఫార్మా కంపెనీ భూ సేకరణ జరుపుతున్న క్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్ సోమవారం లగచర్ల వెళ్లారు.ఈ సమయంలో కలెక్టర్‌పై పలువురు గ్రామస్తులు దాడి చేశారు. దాడి నుంచి కలెక్టర్ తప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ దాడి ఘటనలో వెనుక ఉండి నడిపించింది బీఆర్ఎస్ నేత నరేందర్‌రెడ్డి అనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు.దీంతో కోర్టు నరేందర్‌రెడ్డికి ఈనెల 27 వరకు రిమాండ్ విధించింది. దీంతో నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.లగచర్ల ఘటనలో మంగళవారం 16 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు బుధవారం మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సురేశ్ సోదరుడితో పాటు మరో ముగ్గురు ఉన్నారు.ఇదీ చదవండి: పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్.. అప్డేట్స్ -
కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే: కోమటిరెడ్డి
హైదరాబాద్, సాక్షి: వికారబాద్ ఐఏఎస్‌పై దాడి కేసీఆర్,కేటీఆర్ కలిసి చేయించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమకు భవిష్యత్తు లేదని దాడులకు కుట్ర చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘రేసింగ్ వ్యవహారంలో అనుమతులు లేకుండా డబ్బు బదిలీ చేశారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం ఉంది’’అని అన్నారు. -
లగచర్ల దాడి కేసు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్‌లోని లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ దాడి కేసులో ఏ1గా బోగమోని సురేష్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నట్టు రిపోర్టులో పోలీసులు తెలిపారు.కలెక్టర్‌పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టు ఇలా.. ఈ దాడికి సంబంధించి బూంరాస్‌పేట్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. 153/2024 క్రైం నెంబర్ కేసు.. సెక్షన్ 61(2), 191(4),132,109,121(1) 126(2)324 r/w190BNS Sec 30Of pdpp act, 128Of bnss కింద కేసులు నమోదయ్యాయి. అలాగే.. హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ కూడా కేసులు నమోదు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ దాడి కేసులో మొత్తం 46మందిని నిందితులుగా చేర్చారు.ఇదీ చదవండి: నరేందర్ రెడ్డిని తొక్కేయాలని రేవంత్ కుట్రఎఫ్ఐఆర్లో బోగమోని సురేష్‌ను ప్రధాన నిందితుడుగా(ఏ1) పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16మందిని అరెస్ట్ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడిచేశారు. రాళ్లు, కర్రలు, కారంపొడి ముందే సిద్ధం చేసుకున్నారు. అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశాడు A1 నిందితుడు సురేష్. అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ పాటు 29 మంది పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు. దాడి కేసులో నిందితుడు సురేష్ కీలకంగా మారాడు. సురేష్ ప్లాన్ ప్రకారమే కలెక్టర్‌ను లగచర్లకు తీసుకెళ్లాడు’ అని పోలీసులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: లగచర్ల ఘటన: మార్నింగ్ వాక్‌లో పట్నం అరెస్ట్ -
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
-
కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతారో తెలుసు: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి,హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగిచర్లలో కలెక్టర్‌పై దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదిస్తామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈ విషయమై శ్రీధర్‌బాబు మంగళవారం(నవంబర్ 12) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.‘పరిశ్రమలు రాకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్ అశాంతిని రగులుస్తోంది.ప్రభుత్వ పరంగా ఎక్కడ తప్పు జరిగిందో తేల్చుతాం.లా అండ్ ఆర్డర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు.కేటీఆర్ అన్నంత మాత్రానా ఎవరికి ఎవరూ భయపడరు.రాజకీయాల కోసం దాడులకు తెగబడితే కఠిన చర్యలు తప్పవు.కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతారో అందరికీ తెలుసు.కేసుల నుంచి తప్పించాలని ఢిల్లీని వేడుకుంటున్నారు.అన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏటీఎంగా ఉందా..మోదీ ఆరోపణలన్నీ రాజకీయ లబ్ది కోసమే.బీజేపీ,బీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయి’అని శ్రీధర్‌బాబు ఆరోపించారు.కాగా కలెక్టర్‌పై దాడి ఘటన మీద జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్,ఐజీ సత్యనారాయణ,ఎస్పీ నారాయణ రెడ్డి హాజరయ్యారు.ఘటన వివరాలను శ్రీధర్‌బాబు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పోలీసుల తీరుపై శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఘటనపై రిపోర్టు ఇవ్వాలని డీజీపీ, సీఎస్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దాడిపై పోలీస్ శాఖ నివేదికను సిద్ధం చేస్తోంది. ఇదీ చదవండి: ఫార్మాపై రైతుల ఫైర్.. అధికారులపై దాడి -
చికిత్స పొందుతూ ఉపాధ్యాయురాలి మృతి
యాలాల: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఉపాధ్యాయురాలు చికిత్స పొందుతూ మృతి చెందారు. మండల పరిధిలోని బెన్నూరు ఉన్నత పాఠశాలలో దూది సవిత(47) స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ బోధిస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె 20 రోజులుగా పాఠశాలకు సెలవు పెట్టి చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందారు. సవిత భర్త శివప్రసాద్ పెద్దేముల్ మండలం కందనెల్లి జెడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయుడు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. సోమవారం సాయంత్రం తాండూరు పట్టణంలో సవిత అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె అకాల మరణం ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని పీఆర్టీయూ యాలాల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, రాములు అన్నారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. -
లగచర్ల ఘటన: ‘కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేత’
వికారాబాద్, సాక్షి: దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న(సోమవారం) ఫార్మా రైతుల ప్రజాభిప్రాయం సేకరణకు వచ్చిన అధికారులపై దాడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. దాడికి కారణమైన బీఆర్ఎస్ నేతలతో పాటు గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే వికారాబాద్ వెళ్లాళని ఏడీజీ మహేశ్ భగవత్‌కు రాష్ట్ర డీజీపీ ఆదేశించారు. దాడి ఘటనపై మహేశ్ భగవత్ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్నామని వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘‘లగచర్ల ఘటనలో మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్నాం. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై విచారణ చేస్తున్నాం. అధికారులపై దాడి చేసిన వారిలో బీఆర్ఎస్ నాయకుడు సురేష్ కీలకంగా వ్యవహరించారు. రాజకీయ కోణం ఏదైనా ఉందా? అని విచారణ చేస్తున్నాం. సురేష్ వెనక ఎవరు ఉన్నారనేది విచారణలో తేలుతుంది. కలెక్టర్‌పైకి దూసుకువచ్చే దృష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దాడిలో పలువురి అధికారులకు గాయాలయ్యాయి’’ అని అన్నారు. కలెక్టర్ ఘటన నేపథ్యంలో ఇవాళ.. దుద్యాల, కొడంగల్, బోంరాస్‌పేట మండలాల్లో భారీగా పోలీసులు పహారా కాస్తున్నారు.మరోవైపు.. లగచర్ల ఘటన ప్రభావం మిగతా చోట్ల పడేలా కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం గణేష్ పహాడ్‌లో ఉన్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. వికారాబాద్ కలెక్టర్ ఘటన నేపథ్యంలో అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న(సోమవారం) ఫార్మా రైతుల ప్రజాభిప్రాయం సేకరణకు వచ్చిన అధికారులపై దాడి ఘటనకు సంబంధించి అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అక్కడ పోలీసు బలగాలు ఇంకా మోహరించే ఉన్నాయి.లగచర్ల ఘటన ప్రభావం మిగతా చోట్ల పడేలా కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం గణేష్ పహాడ్‌లో ఉన్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. వికారాబాద్ కలెక్టర్ ఘటన నేపథ్యంలో అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో ఫార్మా నిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణపై గ్రామసభ నిర్వహించేందుకు దుద్యాల మండలం లగచర్లకు వచ్చిన అధికారులపై విరుచుకుపడ్డారు. పచ్చని పొలాల్లో విషం నింపొద్దని, తమ భూముల్లోకి ఫార్మాను రానిచ్చేది లేదంటూ మండిపడ్డారు.వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడా)’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో వెంటాడారు. వాహనాలను ధ్వంసం చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఓ మహిళా రైతు చేయి చేసుకోగా.. కొందరు ఆందోళనకారులు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పరుగెత్తిస్తూ వెంటపడి దాడి చేశారు. రైతుల ఆగ్రహాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. కానీ కొందరు రైతులు వెంబడించి రాళ్లు రువ్వడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనతో లగచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో 250 మందికిపైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.ఈ ఘటనను ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. కలెక్టర్ సహా అధికార యంత్రాంగంపై దాడికి నిరసన చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. -
Vikarabad: కలెక్టర్‌పై దాడి చేసిన రైతులు
-
TG: కలెక్టర్‌పై దాడి.. ప్రభుత్వం సీరియస్
సాక్షి,హైదరాబాద్:వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై లగచర్ల గ్రామంలో సోమవారం(నవంబర్ 11) ఉదయం జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. కలెక్టర్ మీద దాడి జరగడంపై రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్,డీజీపీలను ప్రభుత్వం ఆదేశించింది.కాగా, కలెక్టర్‌పై దాడి ఘటన మీద సీఎస్ శాంతికుమారి ఇప్పటికే ఆరా తీశారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో సీఎస్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఘటనపై నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎస్ ఆదేశించారు. కాగా, ఫార్మా కంపెనీల కోసం భూ సేకరణ విషయమై వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ లగచర్ల వెళ్లినపుడు గ్రామస్తులు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. ఇదీ చదవండి: వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి.. లగచర్లలో ఉద్రిక్తత -
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి.. లగచర్లలో ఉద్రిక్తత
వికారాబాద్, సాక్షి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు చేదు అనుభవం ఎదురైంది. దుద్యాల మండలం లగచర్లకు వెళ్లిన ఆయనకు నిరసన సెగ తగలడంతో పాటు గ్రామస్తులు దాడి చేశారు. లగచర్లలో సోమవారం ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ జరిగింది. దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల తాండలో ప్రజలతో చర్చించేందుకు కలెక్టర్ సహా అధికారులు వచ్చారు. అయితే ఫార్మా కంపెనీకి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై దాడి జరిగినట్లు సమాచారం. ఆపై గ్రామస్తులు పట్టరాని కోపంతో అధికారుల వాహనాలపై గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆ వెంటనే అధికారులంతా అక్కడి నుంచి వెళ్లేపోయే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లగచర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. భారీగా పోలీసులు మోహరించారు. -
మాకు రారా కొత్త టీచర్లు?
వాజేడు: చదువుకునేందుకు విద్యార్థులున్నా.. ఉపాధ్యాయులు లేని పాఠశాల అది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని జంగాలపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల బదిలీల్లో ఇక్కడ ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు కాచారం, మరొకరు మంగపేట మండలం చుంచుపల్లికి బదిలీ అయ్యారు. ఇక్కడ ఒక ఉపాధ్యాయినిని నియమించగా.. ఆమె బీఈడీ ఓడీలో ఉన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు రోజూ బడికి వచ్చి వెళ్తున్నారు. కాగా, పే సెంటర్ ఇన్చార్జ్ హెచ్ఎం కేశవరావు ఇతర పాఠశాలల ఉపాధ్యాయుల్లో రోజుకొకరిని జంగాలపల్లి పాఠశాలకు పంపిస్తూ నెట్టుకొస్తున్నారు. కొత్త డీఎస్సీలోనూ ఈ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.66 మందికి ఇద్దరే టీచర్లా?అధికారుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం.. పర్వత్‌పల్లి పాఠశాలకు తాళంబషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పర్వత్‌పల్లి ప్రాథమిక పాఠశాలకు గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేశారు. పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 66 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులే ఉన్నారని, అందులో భరత్ అనే ఎస్జీటీ ఉపాధ్యాయుడిని బుధవారం అధికారులు రిలీవ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కొత్త ఉపాధ్యాయులను నియమిస్తుంటే తమ గ్రామానికి ఎందుకు నియమించలేదని నిలదీశారు. టీచర్లు లేని పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తూ వారి భవిష్యత్‌ను పాడు చేయలేమని స్పష్టం చేశారు. కొత్తగా ఉపాధ్యాయులను నియమించే వరకు పిల్లలను బడికి పంపేదిలేదంటూ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాఠశాలలో సద్దాం హుస్సేన్, రవీందర్‌రెడ్డి అనే ఇద్దరు టీచర్లే లిఉన్నారని వీరు ఐదు తరగతులకూ పాఠాలు ఎలా బోధిస్తారో అధికారులే చెప్పాలన్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు చెప్పారు. మరోవైపు త్వరలో కొత్త టీచర్లు వస్తారని, విద్యార్థులను బడికి పంపాలని ఉపాధ్యాయులు, మండల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చూడండి: డీఎస్సీ–2024 ఉపాధ్యాయులు ఉరుకులు.. పరుగులు (ఫొటోలు) -
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్.. ముగ్గురి మృతి
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై పూడూరు గేట్ వద్ద ఆర్టీసీ బస్సు – బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను పూడూరు మండలం మేడికొండకు చెందిన వారిగా గుర్తించారు. ఓ ఇద్దరు యువకులు, ఓ బాలుడు కలిసి బైక్‌పై పూడూరు నుంచి మేడికొండ వైపు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ర్టీసీ బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సును పోలీసు స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మేడికొండ, ఒకరు గొంగుపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
దామగుండం రాడార్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన రాజ్‌నాథ్ (ఫొటోలు)
-
రాడార్ ప్రాజెక్ట్ పై అపోహలు వద్దు ఏదైనా ప్రమాదం ఉంటే..
-
‘రాడార్’కు అనుమతులిచ్చింది వారే : సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: దేశ రక్షణలో తెలంగాణ కీలక అడుగు వేస్తోందని, డిఫెన్స్, ఆర్మీ విభాగాల్లో హైదరాబాద్ వ్యూహాత్మక స్థానంలో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరై వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ ఏర్పాటు చేయనున్న వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌కు మంగళవారం(అక్టోబర్15) శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ‘వీఎల్ఎఫ్ స్టేషన్ పై కొందరు అపోహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో ఇలాంటి స్టేషన్ ఏర్పాటు చేసి 34 ఏళ్లు అవుతున్నా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. వివాదం చేసే వాళ్ళు దేశ రక్షణ కోసం ఆలోచన చేయాలి. అసలు బీఆర్ఎస్ హయాంలోనే రాడార్ స్టేషన్‌కు అనుమతులిచ్చారు. దేశ రక్షణపై వివాదాలు సృష్టించే వారికి కనువిప్పు కలగాలి. నేను, స్పీకర్ ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాం. దేశ రక్షణ కోసం రాజకీయాలను వదిలి కేంద్రానికి సహకరిస్తున్నాను. కేంద్ర రక్షణ మంత్రి వేరే పార్టీ అయినా... నేను వేరే పార్టీ అయినా దేశ రక్షణ కోసం అందరం ఒకటే. వీఎల్ఎఫ్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది’అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: ఓ వైపు మరణశాసనం..మరోవైపు సుందరీకరణ ఎలా: కేటీఆర్ -
ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య
ధారూరు: ఓ వివాహిత ఇద్దరు ప్రియులతో నెరపిన వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలీ తాలూకా కుంచావరం పీఎస్ పరిధిలోని జడి మల్కాపూర్ జలపాతం వద్ద చోటు చేసుకుంది. ధారూరు సీఐ భీంకుమార్, కోట్‌పల్లి ఎస్ స్రవంతి శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. చేవెళ్ల మండలం కౌంకుట్ల గ్రామానికి చెందిన అనితకు 15 ఏళ్ల క్రితం కోట్‌పల్లి మండలం అన్నాసాగర్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈమె వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న భర్త ఏడాది క్రితమే బలవన్మరణానికి పాల్పడ్డాడు. అన్నాసాగర్‌కు చెందిన శ్రీకాంత్(27), చౌట మల్లేశంతో ఒకరికి తెలియకుండా మరొకరితో అనిత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇటీవల విషయం తెలుసుకున్న శ్రీకాంత్ ఇద్దరినీ చంపేస్తానంటూ ఆమెను బెదిరించాడు. వివాహితుడైన శ్రీకాంత్‌ను వదిలించుకోవాలని భావించిన అనిత మనల్ని చంపేస్తానంటున్నాడని మల్లేశంకు చెప్పింది. దీంతో మల్లేశం తన మిత్రులైన జిన్నారం గ్రామానికి చెందిన మొల్ల బందెళ్లి, బంటూ బందెళ్లి, కోట్‌పల్లికి చెందిన అంజప్పతో కలిసి శ్రీకాంత్ హత్యకు పథకం వేశారు. సెప్టెంబర్ 25న శ్రీకాంత్‌ను అనిత, మల్లేశం అతని మిత్రులు లింగంపల్లి చౌరస్తాకు రప్పించారు.తమ కారులో అందరూ కలిసి జడి మల్కాపూర్ జలపాతానికి చేరుకున్నారు. శ్రీకాంత్‌కు ఫుల్‌గా మద్యం తాగించి మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం శవాన్ని జలపాతంలో పడేసి వెళ్లిపోయారు. మృతుడి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు ఎస్ స్రవంతి దర్యాప్తు చేపట్టారు. కోట్‌పల్లి బందయ్య సమాచారం మేరకు అనుమానితులైన మల్లేశం అతని మిత్రులు మొల్ల బందెళ్లి, బంటూ బందెళ్లి, అంజప్పలను విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను జలపాతం వద్దకు తీసుకెళ్లి శవం వెతికించినా వరద ప్రవహానికి లభ్యమవ్వలేదు. అనిత పరారీలో ఉండగా మిగిలిన నలుగురిని శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
జస్ట్ మిస్.. లేదంటే..!
-
వీకెండ్@ వికారాబాద్
మహానగరానికి దగ్గరగా.. కాలుష్యానికి దూరంగా.. పచ్చని రంగేసినట్లుండే కొండలు, వనాన్ని తలపించే వృక్షాలతో నిండిన అటవీ ప్రాంతం.. ఉదయం, సాయంత్రం పురివిప్పి నాట్యం చేసే నెమళ్లు, వందలాది పక్షిజాతులు.. కొండలు, గుట్టలు ఎక్కాలని కోరుకునే వారికి ట్రెక్కింగ్ ట్రాక్.. భక్తితో కొలిచే వారికి కొంగు బంగారంగా వెలుగొందుతున్న అనంతపధ్మనాభ స్వామి దేవాలయం.. ఇవన్నీ అనంతగిరి అటవీ ప్రాతం సొంతం. మరో అడుగు ముందుకేస్తే సరదా బోటింగ్.. కోట్‌పల్లి జలాశయంలో కాయాకింగ్ సదుపాయం.. ప్రకృతి ప్రేమికులకైనా.. వారాంతంలో సేదతీరేందుకు టూర్ ప్లాన్ చేసుకునే వారికైనా వికారాబాద్ తొలిప్రాధాన్యంగా కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఒక్కరోజులో ఎంజాయ్ చేసిరావచ్చు. వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతం నవాబుల కాలం నుంచి పర్యాటక ప్రాంతంగా, ఔషధ వనమూలికలు కలిగిన వృక్షాలకు నిలయంగా ప్రసిద్ధి. అనంతగిరి గుట్టపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక శాఖ హరిత రిస్సార్ట్ నిర్మించింది. స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, ప్లే ప్లేస్, గార్డెన్, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. రాత్రికి ఫైర్ క్యాంప్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుండటంతో ఇక్కడ స్టే చేయడం కోసం ముందస్తుగా గదులు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.వారాంతంలో అప్పటికప్పుడు స్టేయింగ్ దొరకాలంటే కష్టం. అటవీ శాఖకు చెందిన గెస్ట్ హౌస్ ఇక్కడే ఉంటుంది. సిబ్బందిని సంప్రదిస్తే ఉదయం ట్రెక్కింగ్‌కు తీసుకెళతారు. అడవిలో నలుదిక్కులు తిరిగి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఈ సీజన్(వర్షాకాలం)లో అనంతగిరి కొండల్లో జలపాతాలు పర్యాటకులను కనువిందుచేస్తాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో అనంతగిరి గుట్టపై వ్యూ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి అడవి మొత్తాన్ని చూడొచ్చు. ఈ ట్రిప్‌కి ఒక్కొరికీ రూ.3000 నుంచి రూ.5000 వరకూ ఖర్చు అవుతుంది.ఆధ్యాతి్మకంగానూ.. అనంతగిరిలో వెలసిన అనంతపధ్మనాభస్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్త్ర ప్రజలు గట్టిగా నమ్ముతారు. సుమారు 5వేల సంవత్సరాల క్రితం మార్కండేయుడు ఇక్కడ తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. సెలవు రోజుల్లో వేల సంఖ్యలో ఉంటారు.ఎలా వెళ్లాలి..హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు 65 కిలోమీటర్లు. మొయినాబాద్, చేవెళ్ల మీదుగా హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిలో మన్నెగూడ దగ్గర వికారాబాద్ వైపు తిరగాలి. గచి్చ»ౌలి, కూకట్పల్లి, పటాన్చెరువు, తదితర ప్రాంతాల ప్రజలు శంకర్పల్లి మీదుగా రావచ్చు. సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి మీదుగా రైలు సదుపాయం ఉంది.బోటింగ్..అనంతగిరి కొండల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కోట్‌పల్లి జలాశయం ఉంటుంది. ఇక్కడ బోటింగ్(కాయాకింగ్) చేయవచ్చు. వారాంతాలు, సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బోటింగ్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఒక్కరికి రూ.250, పెయిÆŠḥకి రూ.450 ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ బోటింగ్‌కు అనుమతిస్తారు. -
కొత్తపల్లిలో చిరుత కలకలం
-
వికారాబాద్ జిల్లా గడిసింగాపూర్ గ్రామంలో లారీ బీభత్సం
-
వాగులో కొట్టుకుపోయిన కారు
-
Ranga Reddy: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
అధికారంలోకి వచ్చినప్పటికీ.. కాంగ్రెస్ క్యాడర్లో అయోమయం కనిపిస్తోంది. హస్తం శ్రేణుల్లో కనిపించని ఆందోళనకు కారణమేంటీ ? కొత్త, పాత నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా? గ్రూపు తగాదాలు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ... కాంగ్రెస్ లోకి జంప్ అవుతారనే ప్రచారం క్యాడర్‌ను కునుకుపట్టనివ్వడం లేదు. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్‌ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉప్పప్పటికీ... పార్టీ రాష్ట్ర నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ్ల రాష్ట్ర నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామ అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండో సారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు.తాండూరు కాంగ్రెస్‌లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్‌లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది.ఎవరికి వారు అన్నదమ్ముళ్లు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కప్పుకున్న కండువా రంగులు మారుతున్నాయి తప్పా.. నేతలు మారడం లేదనే టాక్ వినిపిస్తోంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్ ను ఎలా సెట్ చేస్తారనేది చూడాలి. -
కాంగ్రెస్‌లో చేరిన వెంటనే.. ఆ జెడ్పీ చైర్‌పర్సన్‌పై బీఆర్ఎస్ అవిశ్వాసం
సాక్షి,రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డిపై 12 మంది జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. శుక్రవారమే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఆ మరుసటి రోజు శనివారం(ఫిబ్రవరి 17) ఆమెపై అవిశ్వాసం నోటీసు ఇవ్వడం వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ మేరకు అవిశ్వాసం నోటీసును 12 మంది బీఆర్ఎస్ సభ్యులు కలిసి జెడ్పీ సీఈవోకు అందించారు. సునీతామహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచే జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్పర్సన్ పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అవిశ్వాసం గనుక నెగ్గితే సునీతామహేందర్‌రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ పదవి కోల్పోవాల్సి ఉంటుంది. సునీతామహేందర్‌రెడ్డితో పాటు ఆమె భర్త మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌కు రేవంత్ బర్త్ డే విషెస్ -
నేవీ రాడార్ స్టేషన్ కోసం అటవీ భూములు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వికారాబాద్ మండలం పూ డూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ (రాడార్) స్టేషన్ ఏ ర్పాటు ఖరారయ్యింది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని తూర్పు నౌకాదళ కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ కలి శారు. వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటు కోసం అట వీ భూముల బదిలీ ఒప్పందంపై వికారాబాద్ డీఎఫ్‌వో, నా వల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు సంతకాలు చేశారు. దామ గూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. దేశంలోనే రెండోది భారత నావికాదళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేష న్ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్‌ను ఉపయోగిస్తుంది. దామగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసే స్టేష న్ దేశంలో రెండోది కాగా.. తమిళ నాడులోని తిరునల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిది. రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఎప్పుడో గుర్తించింది. 2010 నుంచే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావ రణ అనుమతులు, క్లియరెన్స్‌లన్నీ వచ్చినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. వాస్తవానికి 2014లోనే నేవీ ప్రతిపాదనలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లు కూడా నేవీ చెల్లించింది. అయితే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని దామగూడెం ఫారెస్ట్ ప్రొటెక్షన్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉండటంతో దానికి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు నేవీ అంగీకరించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం కూడా నౌకాదళ అధికారులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ దిశగా ముందడుగు పడింది. 2027లో పూర్తి దామగూడెంలో నేవీ స్టేషన్‌తో పాటు ఏర్పడే టౌన్షిప్లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. దాదాపు 600 మంది నావికా దళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది ఈ టౌన్షిప్లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడతారు. ప్రాజెక్టులో భాగంగా దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ. రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్ ఏర్పాటు పూర్తి కానుంది. -
వికారాబాద్: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
వికారాబాద్, సాక్షి: అనంతగిరి అడవుల్లో శనివారం మధ్యాహ్నాం ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. అడవుల్లోని పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. మరో 20 మందికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులను వికారాబాద్ నుంచి తాండూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అనంతగిరి గుట్ట దిగుతుండగా కెరెల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొదల్లోకి వెళ్లింది. ఆ సమయంలో బస్సులో వంద మంది ఉన్నట్లు తెలుస్తోంది. స్వల్ప గాయాలైన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. -
రోడ్డు కనబడక చెరువులోకి దూసుకెళ్లి..
అనంతగిరి: సరదాగా విహారయాత్ర కోసం బయలుదేరిన వారిని పొగమంచు కమ్మేసింది. దట్టంగా కమ్ముకున్న పొగమంచుతో రోడ్డు సరిగా కనబడక.. కారు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఐదుగురిలో నలుగురు ఈదుకుంటూ బయటికిరాగా.. ఒకరు నీట మునిగి మృతి చెందారు. వికారాబాద్ పట్టణ శివార్లలోని శివారెడ్డిపేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి బయటపడినవారు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి వెళదామని బయలుదేరి.. ఏపీలోని అనకాపల్లి జిల్లా దేవరాంపల్లి మండలం మామిడిపల్లికి చెందిన గుణశేఖర్ (24), వైజాగ్‌కు చెందిన సాగర్, రఘుపతి, చిత్తూరు జిల్లాకు చెందిన పూజిత, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోహన్ ఐదుగురూ స్నేహితులు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి అనంతగిరి గుట్టలకు విహారయాత్ర కోసం బయలుదేరారు. వికారాబాద్ పట్టణ శివార్లలోని శివారెడ్డిపేట్ చెరువు వద్ద ప్రయాణిస్తున్న సమయంలో పొగ మంచు దట్టంగా అలుముకుని ఉంది. దీనితో రోడ్డు సరిగా కనిపించక కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈత వచ్చిన రఘు నీట మునిగిపోతున్న సాగర్‌ను బయటికి తీసుకువచ్చాడు. కారు నడుపుతున్న మోహన్, పూజిత కూడా సురక్షితంగా బయటికి రాగలిగారు. గుణశేఖర్ నీటిలో మునిగిపోయాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితులను వికారాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రేన్ సాయంతో కారును బయటికి తీశారు. కారు చెరువులో పడిన సమయంలో తమను కాపాడాలని కేకలు వేసినా.. ఒడ్డున ఉన్న కొందరు సెల్ఫోన్లలో వీడియో తీసుకుంటూనే నిలబడ్డారని బాధితులు పేర్కొన్నారు. సుదీర్ఘ గాలింపు తర్వాత.. గజ ఈతగాళ్లతో గుణశేఖర్ కోసం గాలింపు చేపట్టారు. ప్రమాదం విషయం తెలిసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఘటనా స్థలికి చేరకుని సహాయక చర్యలను వేగిరం చేయాలని సూచించారు. సుమారు 11 గంటలపాటు గాలించిన తర్వాత సోమవారం సాయంత్రం గుణశేఖర్ మృతదేహం లభ్యమైంది. -
పొగ మంచు కారణంగా చెరువులోకి దూసుకెళ్లిన కారు
-
'టీటీఏ' ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్‌చైర్స్ పంపిణీ
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టీటీఏ)సేవాడేస్ కార్యక్రమాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. దివ్యాంగులకు ట్రై సైకిల్, వీల్ చైర్స్ పంపిణీ చేశారు. పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్‌ను రినోవేషన్ చేశారు. అధునాతన హంగులతో స్కూల్‌ను అందంగా తీర్చిదిద్దారు. టీటీఏ ఆధ్వర్యంలో అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డా.విజయపాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ కవితా రెడ్డి సహాకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ వంశీరెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్, పరిగి ప్రాంతంలో ఉన్న దివ్యాంగులకు రానున్న రెండు ఏళ్లలో 100శాతం మందికి వారికి అవసరమైన సహాయం టీటీఏ చేస్తుందని తెలిపారు. కాగా టీటీఏ సేవలను స్కూల్ టీచర్లు, గ్రామస్థులు కొనియాడారు. ఈ సందర్భంగా పలువురిని సత్కరించి, మెమెంటోలు అందించారు. -
Thandur: నారాయణ స్కూల్ బరితెగింపు
‘‘అడిగినంత కట్టకపోతే విద్యార్థుల పేర్లను బ్లాక్ లిస్టులో చేర్చుతాం.. కంప్లయింట్ చేస్తారా?.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి’’.. వికారాబాద్ జిల్లా తాండూరులో నారాయణ స్కూల్ యాజమాన్యం తీరు ఇది. అధిక ఫీజులతో వేధింపులకు పాల్పడుతుండడం తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగు చూసింది. దీంతో విద్యాశాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సదరు నారాయణ స్కూల్ యాజమాన్యం నిబంధనల్ని తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న తీరూ బయటపడింది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు అమలు చేసినా ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై నిబంధనలు ఉన్నా పాఠశాల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. వికారాబాద్ జిల్లా తాండూరులో నారాయణ పాఠశాల యాజమాన్యం బరితెగింపునకు దిగింది. ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై వేధింపులకు గురిచేస్తుంది. నిబంధనలుకు విరుద్ధంగా ఫీజులు కట్టాలని ఒత్తిడికి పాల్పడుతుంది. ఫీజులు కట్టక పోతే విద్యార్థుల పేర్లను బ్లాక్ లిస్టులో పెడతామని తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడుతోంది. తల్లిదండ్రులు ప్రశ్నిస్తే.. ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోండి.. అధికారులు మమల్ని ఏమీ చేయలేరంటూ జులుం ప్రదర్శిస్తోంది. పాఠశాల యాజమాన్యం తీరుపై విసుగెత్తిపోయిన తల్లిదండ్రులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసి మరీ.. పిల్లలకు అంగీకరించిన ఫీజుల కంటే ఎక్కువ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు వాళ్లు. తల్లిదండ్రులు కట్టమని చెబితే.. దుర్భాషలాడుతున్నారని, పిల్లల విద్యాసంవత్సరం నష్టపోయేలా చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫీజుల విషయంలో నిబంధనలు పాటించని నారాయణ స్కూల్ పిన్సిపాల్. యాజమాన్యంపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు.. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటికే స్కూల్‌కు అపాలజీ నోటీసు ఇవ్వడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ స్కూల్‌కు ఏడవ తరగతి వరకే అనుమతి ఉండగా.. పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తోంది. ఈ విషయంపై అధికారులు స్పందన దాటవేయడం గమనార్హం. -
కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఆగం కావొద్దు: కేసీఆర్
సాక్షి, వికారాబాద్ : కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. మూడు గంటల కరెంటు సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారని.. అలాంటి కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఓటు వేసి ఆగం కావొద్దని ప్రజలకు సూచించారు. కర్ణాటక ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ఐదు గంటల కరెంటే ఇస్తున్నారని సీఎం కేసీఆర్.. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఓటేస్తే మన గతి కూడా అంతే అవుతుందని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, పైలట్ రోహిత్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ధాన్యం కొనుగోలు కోసం 7500 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులకు 2 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. రూ.200 ఉన్న పింఛను రూ. 2వేలు చేశామని, రైతుల బాగోగుల కోసం రైతు బంధు ప్రవేశపెట్టామని చెప్పారు. మరోసారి అధికారంలోకి వస్తే రూ.16వేలు రైతుబంధు ఇస్తామన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ‘ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం వస్తుంది. కాంగ్రెస్ భూమాతను ప్రవదిశపెడతామని చెబుతోందని.. అది భూమేతే అవుతుంది. ఒకప్పుడు ప్రభుత్వం చేతిలో రైతుల బతుకు ఉండే. ఇప్పుడు మీ బొటనవేలు పెడితేనే భూ యజమాన్యం మారుతది. ముఖ్యమంత్రికి కూడా ఆ అధికారం లేదు. ప్రభుత్వం మీకు ధారపోసిన ఆ అధికారాన్ని పొడగొట్టుకుంటారా..? కాపాడుకుంటారా..? అనేది మీరే నిర్ణయించుకోవాలి. చదవండి: TSRTC: ఉద్యోగుల జీతాలు కట్.. ఈసీని కలిసిన టీఎస్ఆర్టీసీ జేఏసీ కరవు, వలసలతో గత కాంగ్రెస్ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అలాంటి పరిస్థితులు నేడు తెలంగాణలో లేవు. నీటిపన్ను రద్దు చేశాం. కత్తి ఒకరికి ఇచ్చియుద్ధం ఇంకొకరిని చేయమంటే ధర్మం కాదు కదా..? రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉండే వారి చేతిలో కత్తి పెడితేనే వాళ్లు మిమ్మల్ని కాపాడుతారు. 24 గంటల కరెంట్ ఉంటది రోహిత్ రెడ్డి గెలిస్తేనే లేదంటే కరెంట్ ఆగమైపోతది. కాబట్టి మీరు రోహిత్‌కు ఓటేయాలి. బీజేపీ నాయకులు నాయకులు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారు. వారిని పైలట్ రోహిత్‌రెడ్డి పట్టించారు. అందుకే ఆయన ఏ పనులు అడిగినా వెంటనే నిధులు మంజూరు చేశాను. 3500 తండాలను గ్రామ పంచాయతీలు చేయడంతో లంబాడీ బిడ్డలే సర్పంచులుగా రాజ్యమేలుతున్నారు. దాని వల్ల తాండూరు పరిధిలోని ప్రజలు చాలా మంది లబ్ధి పొందుతున్నారు. బంజారా గౌరవానికి చిహ్నంగా బంజారాహిల్స్‌లో బంజారా భవన్ నిర్మించాంజ’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
కేసీఆర్ మామకు మద్దతిద్దాం
వికారాబాద్: ఎట్టి పరిస్థితిల్లోనూ సంకీర్ణ సర్కారు రానివ్వం.. ఈ ఎన్నికల్లో కేసీఆర్ మామకు మద్దతిద్దాం.. ఆర్ఎస్ఎస్ అన్న రేవంత్‌రెడ్డిని ఇంట్లో కూర్చోబెడదామని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. మంగళవారం వికారాబాద్‌లోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో జరిగిన ముస్లింల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్‌గాందీ, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్ మూలాలు ఆర్ఎస్ఎస్లోనే ఉన్నాయని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదేశాలతోనే రేవంత్ ముందుగా టీడీపీలోకి ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లారని ఆరోపించారు. అందుకే అతన్ని కొడంగల్ ఇంటికే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. 2004, 2009 ఎన్నికల్లో గోషామహల్లో తమ సపోర్టు వల్లే కాంగ్రెస్ గెలిచిందన్నారు. అప్పట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో తమకున్న సత్సంబంధాల వల్లే సపోర్టు చేశామని ఓవైసీ తెలిపారు. బీజేపీకి లాభం జరగకూడదనేదే తమ ప్రధాన ఉద్దేశమనీ, తమ అంతిమ లక్ష్యం ఆర్ఎస్ఎస్ను నిలువరించడమేనని స్పష్టం చేశారు. గోషామహల్లో బీజేపీ గెలుపునకు దోహదం చేస్తోంది కాంగ్రెస్సేనని ఆరోపించారు. తాను బీజేపీ, కేసీఆర్ ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయానని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టారు. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మీరే జైలుకు పంపారని కాంగ్రెస్ నేతలనుద్దేశించి విమర్శించారు. వారి కోరిక మేరకే.. అప్పట్లో తాను జైలుకు వెళ్లి జగన్‌తో రాయబారం చేశానని, ఆయన మీతో కలిసేందుకు ఒప్పుకోలేదని వివరించారు. ఆ రోజు మీరు నాకెన్ని డబ్బులు ఇచ్చారని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. సిద్ధాంత పరంగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు. పాతబస్తీ ఏమైనా బండి జాగీరా తెలంగాణలో ఆర్ఎస్ఎస్ గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఓవైసీ ఆరోపించారు. అది ఎప్పటికీ జరగనివ్వమని స్పష్టం చేశారు. కర్ణాటకలో బుర్ఖా వేసుకుని పోటీ పరీక్షలకు హాజరుకావద్దని ఆర్డర్ ఇచ్చారని, అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉందా అని ఆయన ప్రశ్నించారు. మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందనీ, అందుకే ముస్లింలు కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాతబస్తీలో సర్జికల్ స్టైక్ చేయిస్తాం అంటాడు.. పాత బస్తీ ఏమైనా నీ జాగీరా? అని ప్రశ్నించారు. జిల్లాలోని నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ముస్లిం మైనార్టీలను కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అబ్దుల్ ఆది, హఫీజ్, మీర్‌మహేమూద్, రఫీ, తాహెర్‌అలీ, ఉస్మాన్, మోయిజ్, ఇబ్రహీ, షరీఫ్, అలీమొద్దీన్ పాల్గొన్నారు. -
వికారాబాద్: అవ్వ మిస్సింగ్, చివరకు..
సాక్షి, వికారాబాద్: ఆ అవ్వ ఆయుష్షు గట్టిదే. ప్రమాదవశాత్తూ ఓ పెద్ద కాలువలో పడినా.. రోజంతా అక్కడే గడిపి క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. వికారాబాద్ తాండూరు మున్సిపల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాండూర్ మున్సిపల్ పరిధిలోని గీతా మందిర్ సాయిపూర్ ప్రాంతానికి చెందిన కోస్గి భారతమ్మ (75) ఆదివారం మధ్యాహ్నాం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె మనవడు పట్టణంలో అంతా వెతికాడు. బస్టాండ్, రైల్వే స్టేషన్ అంతా గాలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఉదయం ఇంటి దగ్గర్లో ఉన్న ఓ మురుగు కాలువపై అతనికి అనుమానం వచ్చింది. రోడ్డు వెడల్పు కోసం చేపట్టిన నిర్మాణం అది. వెంటనే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను పిలిపించి అందులో వెతికించాడు. సోమవారం సాయంత్రం పెద్ద నాలాలో కింద మూలుగుతూ కూర్చున్న భారతమ్మ అతని మనవడికి కనిపించింది. మున్సిపల్ కార్మికుల సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చి. దగ్గర్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించగా.. ఆమె ప్రమాదవశాత్తు అందులో పడిందని మనవడు చెబుతున్నాడు. మరోవైపు.. అవ్వ మిస్సింగ్ కథ సుఖాంతం కావడంతో మృత్యువును జయించిదంటూ స్థానికులు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. -
ఇక్కడి బడి, గుడి నేను కట్టించినవే: రేవంత్ రెడ్డి
వికారాబాద్: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే దౌల్తాబాద్ అభివృద్ధి, సంక్షేమం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ కట్టిన బడి, గుడి, తాగునీరు తాను తీసుకొచ్చినవేనని చెప్పారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వికారాబాద్ జిల్లా దౌలతాబాద్‌లో నిర్వహించిన విజయభేరి యాత్రలో మాట్లాడారు. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, కాలేజీలు తెస్తామని బీఆరేస్ నేతలు చెప్పారు.. కానీ పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తామని పేర్కొన్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.' రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12 వేలు అందిస్తాం. ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తాం. చేయూత పథకం ద్వారా రూ.4వేలు పెన్షన్ అందిస్తాం.' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే.. -
ఇలాంటి పాలకులు అవసరమా?
వికారాబాద్: ‘అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే.. డిసెంబర్ 9న లాల్‌బహదూర్ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణం స్వీకారం చేయటం ఖాయం. ఆ రోజే ఆరు గ్యారంటీ స్కీంలపై తొలి సంతకం చేసి, తెలంగాణ ప్రజ లకు సోనియమ్మ, మల్లికార్జున ఖర్గే ఇచ్చిన హామీలను నేరవేరుస్తాం..’అని పీసీసీ అధ్య క్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగం కోసం చదివి చదివి వేసారిపోయిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే.. అసలు ఆమె దరఖాస్తే చేసుకోలేదని నిందలు వేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఆడబిడ్డపైన నిందలేయటానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పాలకులు అవసరమా? మనకు అని ప్రజలను ప్రశ్నించారు. సోమవారం రాత్రి వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిండా ముంచారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని రేవంత్ గుర్తుచేశారు.. అందుకే తాము కూడా ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచార శంఖారావం పూరిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ప్రచారం ప్రారంభిస్తే.. మనం వికారాబాద్ నుంచి విజయోత్సవ సభలు మొదలు పెడుతున్నామని అన్నారు. కేసీఆర్‌కు హుస్నాబాద్ కలిసొస్తదో.. కాంగ్రెస్‌కు వికారాబాద్ కలిసొస్తదో తేల్చుకుందాం అని సవాలు విసిరారు. అమరుల త్యాగాలకు చలించిపోయిన సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్ ప్రజలను నిండా ముంచారని ఆరోపించారు. నాడు వైఎస్సార్ ప్రాణహిత ప్రాజెక్టును డిజైన్ చేసి ప్రారంభించడంతో పాటు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశారని, కేసీఆర్ మాత్రం ప్రాజెక్టు డిజైన్ మార్చేసి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా నీళ్లిస్తామని కల్లబోల్లి మాటలతో కాలయాపన చేయడం తప్ప ఈ ప్రాంతానికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతానికి ఏమైనా ఆంధ్రోడు సీఎంగా ఉన్నా డా? లేక పక్క రాష్ట్రపోడు సీఎంగా ఉన్నాడా? అని ధ్వజమెత్తారు. తొలుత ఎన్నెపల్లిలోని సయ్యద్ యాసిన్, మాణెమ్మ, యాదయ్య ఇళ్లకు వెళ్లిన రేవంత్ ఆరు గ్యారంటీ పథకాల గురించి వివరించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేదలందరికీ వీటిని వర్తింపజేస్తామని తెలిపారు. మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్, ఎ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
Anu Emmanuel: వికారాబాద్ లో సినీ తార అను ఇమ్మాన్యుయల్ సందడి (ఫోటోలు)
-
స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 40 మంది చిన్నారులు..
సాక్షి, వికారాబాద్: స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు ఓ నీటి కుంటలోకి దూసుకెళ్లిన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 40 మంది పిల్లలకు తృటిలో ప్రమాదం తప్పడంతో పేరెంట్స్, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన వికారాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. 40 మంది స్కూల్ పిల్లలతో వెళ్తున్న ప్రైవేటు స్కూల్‌కు చెందిన మినీ బస్సు ప్రమాదానికి గురైంది. సుల్తాన్పూర్ వద్ద ఓ నీటి కుంటలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో నీటిలో ఉన్న బస్సులోకి నుంచి స్థానికులు.. విద్యార్థులను కాపాడారు. ఇక, సదరు బస్సును న్యూ బ్రిలియంట్ స్కూల్‌కు చెందిన వాహనంగా గుర్తించారు. కాగా, బస్సు స్టీరింగ్ పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్పుకొచ్చాడు. ఈ ప్రమాదం నేపథ్యంలో పాఠశాల యాజమాన్యంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నివేదిక వచ్చేవరకు జీవో 111కు కట్టుబడి ఉంటాం -
అనంతగిరి అడవుల్లో రేసింగ్ పై స్పందించిన పోలీసులు
-
అనంతగిరి అడవుల్లో రేసింగ్‌పై స్పందించిన పోలీసులు
సాక్షి, వికారాబాద్: అనంతగిరి అడవుల్లో రేసింగ్‌పై పోలీసులు స్పందించారు. రేసింగ్ నిర్వహించిన వారిలో కొందరిని గుర్తించామని వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మిగిలిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు స్వాతంత్ర్య దినోత్సవం బందోబస్తులో ఉండటంతో రేసింగ్‌కు పాల్పడ్డారని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేస్తామని ఎస్పీ అన్నారు. అనంతగిరి అడవుల్లో జరిగిన కార్, బైక్ రేసింగ్ విన్యాసాలకు సంబంధించిన ప్రాంతానికి వెళ్లి అటవీ శాఖ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు వివరాలు సేకరించారు ఒక కారు నంబర్ ను గుర్తించిన అధికారులు.. హైదరాబాద్ నుంచి ఇద్దరు ఆర్గనైజర్లు, 40 మందితో 16 కార్లు, రేసింగ్ బైకులు తీసుకొచ్చి విన్యాసాలు చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనంతగిరి అడవుల్లోకి వీరిని ఎవరు తీసుకొచ్చారు. ఎవరు సహకరించారనే విషయాలపై విచారణ చేపట్టారు. రేసింగ్‌లో పాల్గొన్న వాహనాల నంబర్ల ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు. చదవండి: 9 నంబర్లు వస్తే.. లిఫ్ట్ చేయొద్దు -
కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత.. బీజేపీకి బిగ్ షాక్
సాక్షి, వికారాబాద్: తెలంగాణలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కొంతకాలం అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌లోకి చంద్రశేఖర్‌ను ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలనకు ముగింపు పలకాలి. తెలంగాణకు కేసీఆర్ చీడపీడ. సీనియర్ నేత చంద్రశేఖర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాం. కేసీఆర్ లక్ష కోట్ల విలువైన పదివేల ఎకరాల భూమి కాజేశారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుదని ఆశించారు.. కానీ, అలా జరగకపోవడంతో బీజేపీకి రాజీనామా చేశారు. కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణలో భాగంగా చంద్రశేఖర్ కాంగ్రెస్‌లో చేరడానికి అంగీకరించారు. ఈనెల 18న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తోంది. దళితులకు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూముల యాజమాన్య పట్టాలు ఇవ్వడానిఇక హక్కులు ఇవ్వాలని చంద్రశేఖర్ కోరారు. భవిష్యత్తులో దీనిపై డిక్లరేషన్ చేస్తాం. దళితుల మధ్య వర్గీకరణ చిచ్చు లేకుండా పంచాయితీ తెంచుతాం అని తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పనిచేసిన చంద్రశేఖర్.. మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గత కొంత కాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న చంద్రశేఖర్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆయన.. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో కొత్త టెన్షన్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పొలిటికల్ వార్ -
తెలంగాణ బీజేపీకి షాక్.. మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా
సాక్షి, వికారాబాద్: జిల్లాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కొంతకాలం అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. పార్టీలో పనిచేసే వారిని ప్రోత్సహించడం లేదని చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లోకి చేరనున్నట్లు సమాచారం. గతంలో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పనిచేసిన చంద్రశేఖర్.. మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లనున్నారు. గత కొంత కాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న చంద్రశేఖర్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆయన.. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. చదవండి: 17 తర్వాత ఎప్పుడైనా.. బీఆర్ఎస్ జంబో లిస్ట్ -
టీచర్ మందలించారని.. తండ్రి తిట్టారని..
తిరుమలాయపాలెం (ఖమ్మం జిల్లా)/ తాండూరు (వికారాబాద్ జిల్లా): బాగా చదువుకోవాలని టీచర్ మందలించడంతో మనస్తాపం చెందిన ఓ ఇంటర్ విద్యార్థి, చెడు సావాసాలకు వెళ్లొద్దంటూ తండ్రి హెచ్చరించడంతో అవమానంగా భావించిన ఓ టెన్త్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో వేర్వేరు చోట్ల శనివారం జరిగిన ఈ ఘటనల వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని హైదర్‌సాయిపేటకు చెందిన గుగులోత్ కృష్ణ – రమి కుమారుడు విష్ణు(17) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చేరాడు. ఈనెల 7న టీసీ, ఇతర సర్టిఫికెట్ల కోసం తండ్రి కృష్ణతో కలిసి పదో తరగతి చదివిన పాఠశాలకు వచ్చాడు. ఈ క్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ పదో తరగతిలో ప్రవర్తన సరిగ్గా లేదని చెబుతూ ఇంటర్‌లోనైనా బాగా చదువుకోవాలని విష్ణును మందలించారు. తండ్రి, ఉపాధ్యాయుల ముందే తనను అవమానించారని భావించిన విష్ణు మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయాన గడ్డి మందు తాగాడు. కాసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలించారు. వైద్యం చేసినా లాభం లేదని అక్కడి వైద్యులు చెప్పడంతో తిరిగి ఖమ్మం తీసుకురాగా ఆరోగ్యం విషమించి శనివారం మృతిచెందాడు. తండ్రి మందలించాడని... తాండూరు మండల పరిధిలోని జినుగుర్తి గ్రామానికి చెందిన కంబంలి నర్సింలు, యాదమ్మల కుతూరు(15).. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇంటి పక్కనే ఉండే ఓ బాలుడితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన తండ్రి.. పాఠశాలకు వెళ్లి అందరిముందూ బాలికపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీన్ని అవమానంగా భావించిన బాలిక ఇంట్లో ఉన్న మాత్రలు మింగింది. అస్వస్థతకు గురైన ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. యాదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మొక్కజొన్న సాగుతో మంచి లాభాలు మరియు డిమాండ్ ఎక్కువ
-
వికారాబాద్: అది యాక్సిడెంట్ కాదు పక్కా మర్డర్!
సాక్షి, క్రైమ్: వికారాబాద్ మోమిన్ పేట్ లచ్చానాయక్ తండాలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి షాకింగ్ విషయాలను పోలీసులు వెల్లడించారు. తమ ఆధిపత్యానికి అడ్డు రావడమే కాకుండా.. పొలం విషయంలో అడ్డుపడుతున్నాడనే కోపంతో ఓ వ్యక్తిని చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు ఈ కేసును చేధించినట్లు జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మీడియాకు గురువారం ఆ వివరాలను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం లచ్చానాయక్ తాండకు చెందిన విఠల్ ఈ నెల(జులై) 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే.. మృతుడి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తూ మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఆ తాండాకే చెందిన అన్నదమ్ములు మేఘావత్ పవన్, మోతిలాల్, నరేందర్ లు మరో ఐదు మంది కలిసి ఈ నెల 2న సదాశివ పేట్ నుంచి వస్తుండగా వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం మేకవనంపల్లి సమీపంలో తుపాన్ వాహనంతో గుద్ది హత్య చేశారు. సదరు వాహనం కర్నాటక రిజిస్ట్రేషన్ నెంబర్ గలదని ఎస్పీ వెల్లడించారు. ఇక విచారణలో హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ హత్య కోసం కందికి చెందిన మహ్మద్ సల్మాన్ కు లక్ష రూపాయల సుఫారి ఇచ్చారని, ఈ నేరంలో పాల్గొన్న మేఘావత్ రాంచందర్, మేఘావత్ మోతిలాల్, మేఘావత్ నరేందర్, మహ్మద్ సల్మాన్, బానోవత్ జైపాల్, జంజు రాజు, మంగలి నరేష్, దేవాసు రమేష్ లను అరెస్టు చేసినట్లు తెలిపారాయన. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను తెలిపి.. నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు. ఘటన జరిగిన స్థలంలో సీసీటీవీ కెమెరాలు ఉండడం వల్లనే ఈ కేసు సాల్వ్ అయ్యిందని వెల్లడించారాయన. ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పిందని సజీవ సమాధి చేశాడు -
శారీరక సంబంధం..పెళ్లికి ఒప్పుకోలేదనే శిరీష హత్య
సాక్షి, వికారాబాద్:సంచలనం సృష్టించిన పారామెడికల్ విద్యార్థిని శిరీష హత్యకేసును పోలీసులు ఛేదించారు. శిరీషను దారుణంగా హత్య చేసింది ఆమె బావ అనిల్ అని పోలీసులు తేల్చారు. శారీరక సంబంధానికి ఒప్పుకోకపోవడం వల్లే ఆమెను హతమార్చినట్టు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలను వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వివరించారు. శిరీషకు శారీరకంగా దగ్గరై, ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని అనిల్‌కు దురాలోచన ఉంది. అయితే శిరీష అతనికి సహకరించలేదు. శిరీష తరచూ ఫోన్లలో మరో వ్యక్తితో చాటింగ్ చేయడం, మాట్లాడుతుండటంతో అనిల్‌లో కోపం పెరిగింది. ఈ విషయంలో ఆమె తండ్రి, సోదరుడు.. బావ అనిల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. పలుమార్లు అనిల్ ఆమెపై దాడి చేశాడు. హత్యకు ముందు రోజు సాయంత్రం అనిల్ కొట్టడంతో శిరీష ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. శిరీష వెనుకాలే ఆమెను అనుసరిస్తూ వెళ్లిన అనిల్ ఆమెతో గొడపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితుడు బీరు సీసాతో దాడిచేసి నీటికుంటలో ముంచి హతమార్చాడు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరుపుతామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో శిరీష పై అత్యాచారం జరగలేదని వెల్లడైనట్టు ఎస్పీ చెప్పారు. జరిగింది ఇదే.. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష (19) ఇంటర్ పూర్తిచేసింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. తల్లి యాదమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు శిరీష అన్న శ్రీకాంత్ హైదరాబాద్‌లో కొంతకాలంగా చికిత్స చేయిస్తున్నాడు. ఇంటి వద్ద తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్ ఉంటున్నారు. భోజనానికి ఇబ్బంది అవుతోందని భావించిన తండ్రి.. రెండు నెలల కిందట కుమార్తెను కాళ్లాపూర్‌కు రప్పించాడు. ఆమె తమ్ముడు శ్రీనివాస్ శనివారం రాత్రి పరిగిలో ఉంటున్న తన మరో అక్క భర్త అనిల్‌కు ఫోన్ చేసి.. శిరీష వంట చేయడంలేదని తెలిపాడు. దీంతో వెంటనే కాళ్లాపూర్ వచ్చిన అనిల్.. శిరీషను మందలించి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇదే విషయమై తండ్రి కూడా శిరీషను కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురై రాత్రి పదిన్నర తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం గ్రామానికి కిలోమీటరు దూరంలోని నీటికుంటలో విగతజీవిగా కనిపించింది. ఆమె రెండు కళ్లను పొడిచి, గొంతుకోసినట్లు, తలకు బలమైన గాయాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధానంగా శిరీష కుటుంబసభ్యులపైనే అనుమానం వ్యక్తం కావడంతో ఆమె తండ్రి జంగయ్య, అక్క భర్త అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బావపై అనుమానం బలపడటంతో, లోతుగా విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఇదీ చదవండి: భర్తతో విడిపోయినవాళ్లే ఆ బాబా టార్గెట్ -
కొలిక్కి వచ్చిన వికారాబాద్ శిరీష మృతి కేసు.. ఆ ఇద్దరే హంతకులు!
సాక్షి, వికారాబాద్: నర్సింగ్ విద్యార్థిని శిరీష అనుమానాస్పద కేసును పోలీసులు చేధించారు. శిరీషను హత్య చేసింది ఆమె బావ అనిల్, అతని స్నేహితుడు రాజుగా పోలీసులు తేల్చారు. మద్యం మత్తులో శిరీష బావ, అతని ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించారు. కాగా మొదటి నుండి బావ చుట్టే కేసు తిరుగుతున్నప్పటికీ గత మూడు రోజులుగా అనిల్ పోలీసుల ఎదుట నోరు మెదపలేదు. చివరికి అనిల్ కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు అతని స్నేహితుడినిసైతం అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ ఇద్దరిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. బావ అనిల్, అతని స్నేహితుడు కలిసి శిరీషను అత్యంత దారుణంగా హతమార్చినట్లు తెలిసింది. చెప్పిన మాట వినడం లేదని.. ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉంటుందని శిరీషతో బావ అనిల్ వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో మరో రూంలోకి వెళ్ళి శిరీష ఆత్మహత్యాయత్నం చేయగా.. గది గడియ విరగొట్టి శిరీషను బయటకు తీసుకొచ్చిన అనిల్.. ఆమెపై చెయ్యి చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆమె బావ పరిగి వెళ్ళిపోయాడు. మనస్థాపానికి గురైన యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. శిరీష ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఆమె సోదరుడు శ్రీను.. అనిల్‌కు ఫోన్ చేసి చెప్పాడు. అప్పటికే తన మిత్రుడితో కలిసి ఫుల్‌గా మద్యం సేవించిన అనిల్.. మరో బీరు తీసుకొని ఫ్రెండ్‌తో కలిసి కాడ్లాపూర్ బయలుదేరాడు. ఊరు శివారులో ఉన్న మైసమ్మ గుడి దగ్గర శిరీష కనిపించడంతో ఆగ్రహంతో ఆమెపై అనిల్ చెయ్యి చేసుకున్నాడు. అంతేగాక అతని ఫ్రెండ్ రాజు, శిరీషను అక్కడే ఉన్న కుంటవైపు లాకెళ్ళి వెంటతెచ్చుకున్న బీరు బాటిల్‌తో తల పగల గొట్టి కళ్ళల్లో గుచ్చినట్లు సమాచారం. తనను వదిలేయండి అంటూ శిరీష ఎంత ప్రదేయపడ్డా క్రూరులు వదల్లేదని, మోకాలు లోతు నీళ్ళున్న కుంటలో ఆమెను ఇద్దరు కలిసి విసిరేసినట్లు తెలిసింది. శిరీష చనిపోయే వరకు ఆమె దేహంపై అనిల్ ఫ్రెండ్ నిలుచున్నట్లు తెలుస్తోంది. చనిపోయిందని నిర్దారించుకొని అక్కడ ఆనవాళ్ళను మాయం చేసి ఎవరి దారిన వారు వెళ్లి మళ్ళీ శిరీష కోసం వెతికినట్లు నాటకం ఆడారు. కాగా ఇద్దరు నిందితులు ఇంకా పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. మరి కొన్ని గంటల్లో పోలీసులు దీనికి సంబంధించి అధికారికంగా పూర్తి సమాచారాన్ని వెల్లడించనున్నారు. చదవండి: లండన్‌లో హైదరాబాద్ యువతి దారుణ హత్య -
శిరీషది హత్యా.. ఆత్మహత్యా?.. తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం
పరిగి, సాక్షి న్యూఢిల్లీ: పారా మెడికల్ విద్యార్థి శిరీష మృతిపై మిస్టరీ వీడలేదు. యువతిది హత్యా.. ఆత్మహత్యా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాళ్లాపూర్ శివారులోని నీటి కుంటలో ఆదివారం మధ్యాహ్నం శిరీష (19) మృతదేహం లభ్యమైంది. ఒంటిపై పలు చోట్ల గాయాలు ఉండటం, రెండు కళ్లనూ పొడిచి ఉండటంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. పలువురు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా సోమవారం గ్రామానికి చేరుకున్న వైద్యులు శిరీష మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. యువతి శరీరంపై గాయాలు ఉన్నట్లు ధ్రువీకరించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. శిరీషది ముమ్మాటికీ హత్యేనని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతురాలి తండ్రి జంగయ్య, బావ అనిల్‌పై వారు మండిపడ్డారు. శిరీష మృతికి వారే కారణమంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు కల్పించుకుని త్వరలోనే పూర్తి వాస్తవాలు తెలుస్తాయని, అప్పటివరకు ఓపిక పట్టాలని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. తన చెల్లిని చంపిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని మృతురాలి తమ్ముడు శ్రీకాంత్ కోరాడు. పోలీసుల అదుపులో మరో ఇద్దరు శిరీష అంత్యక్రియలు ముగిసిన తర్వాత తండ్రి జంగయ్య, బావ అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతి తండ్రి జగయ్యను పోలీసులు వదిలేయగా.. బావ అనిల్‌ను విచారిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. కేసు దర్యాప్తులో ఉందని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. మూడు రోజుల్లో రిపోర్టు పంపండి: తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం శిరీష దారుణ హత్యను జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది. స్క్రూ డ్రైవర్‌తో బాలిక కళ్లు పీకి, బ్లేడ్‌తో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటనపై ఢిల్లీలోని ఎన్సీడబ్ల్యూ సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. అంతేగాక మూడు రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను పంపించాలని తెలంగాణ డీజీపీకి సూచించింది. తెలంగాణలో బాలికలు, యువతులు, మహిళలపై పెరిగిపోతున్న నేరాలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. -
మిస్టరీగా వికారాబాద్ శిరీష కేసు
సాక్షి, వికారాబాద్: కాండ్లాపూర్ నర్సింగ్ విద్యార్థిని శిరీష హత్య కేసు మిస్టరీగా మారుతోంది. యువతి మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించి కూడా పోలీసులు ఏం తేల్చలేకపోయారు. ఈ క్రమంలో కాండ్లాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శిరీష మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కాండ్లాపూర్ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. అంతకు ముందు శిరీష తండ్రిపైనా దాడి చేశారు. శిరీషను హత్య చేసిన ఆనవాళ్లే కనిపిస్తున్నాయని, వాస్తవాల్ని బయటపెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో యువతి చేయి, కాళ్లపై బ్లేడుతో కోసిన గాయలు ఉండడంతో పోలీసులు దాడిగా అనుమానిస్తున్నారు. లైంగిక దాడి జరిగిందా? అనే అనుమానాల నేపథ్యంలో మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం ఉదయం శిరీష ఇంటికి చేరుకున్న పోలీసులు.. డాక్టర్ వైష్ణవి నేతృత్వంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఇందులోనూ పోలీసులు ఏం తేల్చలేదు. ‘‘యువతి కళ్లకు కట్టెలు లేదంటే రాళ్లు గుచ్చుకుని ఉండొచ్చు. పరీక్ష రిపోర్టును ఎఫ్ఎస్ఎల్(FSL)కు పంపించాం. రిపోర్టు రావాలి’’ అని డాక్టర్ వైష్ణవి తెలిపారు. అయితే అత్యాచారం జరిగిందా? అనే ప్రశ్నకు ఆమె స్పష్టత ఇవ్వలేదు. రిపోర్ట్ వస్తేనేగానీ తెలియదు చెప్పారు. ఈ క్రమంలో ఆమె అక్కడి నుంచి హడావిడిగా వెళ్లిపోగా.. గ్రామస్తులు ఆగ్రహానికి లోనయ్యారు. ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును మూసేసే యత్నం జరుగుతుందని ఆరోపిస్తూ శిరీష బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ‘‘మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారు. రేపు మా వాళ్లకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాదని గ్యారెంటీ ఏంటి?. కేసును పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామ’’ని గ్రామస్తులు అంటున్నారు. శాంతింపజేసిన పోలీసులు శిరీష కేసులో ఆందోళన చేపట్టిన కాండ్లాపూర్ గ్రామస్తుల్ని పోలీసులు శాంతింపజేశారు. నచ్చజెప్పడంతో వాళ్లు నిరసనను ఆపినట్లు తెలుస్తోంది. నోరు విప్పని బావ ఇక శిరీష హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శిరీష బావ అనిల్ నోరు విప్పలేదు. ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులకు అనిల్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లోనే చేతిపై, గొంతు దగ్గర కోసుకుని తనను, ఆమె తండ్రిని బెదిరించిందని అనిల్ చెప్పాడు. ఈ క్రమంలో తాను ఆమె ఫోన్ లాక్కున్నాడని, ఆమె బయటి నుంచి గడియ పెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు అనిల్ పోలీసులకు చెప్పాడు. ఆపై ఆమె ఊరు శివారులో ఉన్న కుంటలో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తొలుత భావించారు. అయితే కళ్లు పొడిచి ఉండడం, కాళ్లు చేతులకు గాయాల నేపథ్యంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో.. ఇంట్లో గొడవ జరిగితే శిరీష తండ్రి మాత్రం పొంతన లేని సమాధానం చెప్తుండడం, మోకాళ్ళ లోతు నీటి కుంటలో ఆత్మహత్య ఎలా సాధ్యమవుతుందనే అనుమానాలు ఉన్నాయి. అసలు ఇంట్లో గొడవలకి కారణాలేంటన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: అప్సర మొదటి భర్త ఆత్మహత్య.. కార్తీక్ తల్లి సంచలన ఆరోపణలు -
శిరీష మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని గ్రామస్థుల ధర్నా
-
వికారాబాద్‌లో దారుణం.. పాపం శిరీష..
సాక్షి, పరిగి: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి దారుణ హత్యకు గురైంది. నిన్నటి నుంచి కనిపించని యువతి శిరీష(19) హత్యకు గురై నీటికుంటలో రక్తపు మరకలతో మృతదేహం కనిపించింది. గుర్తు తెలియని దుండగులు యువతి కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసి, కాళ్లు, చేతి నరాలను కత్తితో కోశారు. వివరాల ప్రకారం.. పరిగి మండలం కాలాపూర్ గ్రామంలో శిరీష దారుణ హత్యకు గురైంది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు టెన్షన్ పడ్డారు. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించారు. దీంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం.. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటికుంటలో రక్తపు మరకలతో శిరీష మృతదేహం కనిపించింది. కాగా, గుర్తు తెలియని దుండగులు శిరీషను దారుణంగా హత్య చేశారు. ఆమె కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసి, కాళ్లు, చేతి నరాలను కత్తితో కోశారు. దుండగలు యువతిని హత్య చేసి నీటికుంటలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక, శిరీష ఇంటర్మీడియట్ పూర్తి చేసి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల బాలిక తల్లికి గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తల్లి అనారోగ్య సమస్య కారణంగా శిరీష రెండు నెలల క్రితం చదువు మానేసింది. ఈ క్రమంలో ఇలా దారుణ హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. ఈ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న శిరీషపై ఆమె అక్క భర్త అనిల్ చేయిచేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. శిరీష గొంతుపై పోలీసులు గాట్లను గుర్తించారు. శిరీష తండ్రి, తమ్ముడికి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, శిరీషను అక్క భర్త అనిల్ కొట్టడం వల్లే మనస్తాపానికి గురైనట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్.. -
అనంతగిరి గుట్టలో షాకింగ్ విషయాలు
-
పేపర్ లీక్.. టెన్త్ పరీక్షలు వాయిదా?.. పాఠశాల విద్యాశాఖ క్లారిటీ
సాక్షి, వికారాబాద్: తాండూర్‌లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. సోమవారం ఉదయం 9 గంటలకు టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభం అవ్వగానే నిమిషాల వ్యవధిలో తెలుగు పేపర్ వాట్సాప్‌లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. దీంతో ప్రశ్నాపత్రం లీకైందంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో మిగతా పరీక్షల నిర్వహణపై సందిగ్దం నెలకొంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన క్లారిటీ ఇచ్చారు. రేపటి పదో తరగతి పరీక్ష యథాతథంగా జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని తెలిపారు. టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ బహిర్గతం కావడంపై జిల్లా కలెక్టర్, వికారాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న నలుగురు వ్యక్తులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. చట్టం 25/1997, CrPC సంబంధిత సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. ‘సెంటర్ నెం. 24033, గవర్నమెంట్, హైస్కూల్ నెం.1, తాండూరు, వికారాబాద్ జిల్లాలోని ఇన్విజిలేటర్ బందెప్ప పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి మరో ఉపాధ్యాయుడు సమ్మప్పకు ఉదయం 9.37 గంటలకు పంపినట్లు గుర్తించాం. పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం 9.30 తర్వాత బయటి వ్యక్తిని కేంద్రంలోకి రాలేదు. కేంద్రం నుంచి బయటకు ఎవరూ వెళ్లలేదు. పరీక్షా నిర్వహణ విషయంలో రాజీపడలేదు. విచారణ తర్వాత ఇది కేవలం ఇన్విజిలేటర్ బందెప్ప దుర్వినియోగమేనని నిర్ధారించాం’ అని చెప్పారు.. సస్పెండ్ అయ్యింది వీళ్లే.. 1. శివ కుమార్, GHM, ZPHS, ముద్దాయిపేట, యాలాల్(M) (చీఫ్ సూపరింటెండెంట్) 2. K. గోపాల్, SA, Govt., No.1 ఉన్నత పాఠశాల, తాండూరు (డిపార్ట్మెంట్ అధికారి) 3. S. బండప్ప, SA(BS), Govt., No. 1 ఉన్నత పాఠశాల, తాండూరు. (ఇన్విజిలేటర్) 4. సమ్మప్ప, SA(PS), ZPHS, చెంగోలు, తాండూరు మండలం (ఇన్విజిలేటర్) చదవండి: టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్.. -
టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్.. వారిపై వేటు
సాక్షి, వికారాబాద్: తాండూర్‌లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. సెల్‌ఫోన్‌ను లోపలికి అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్వశ్చన్ పేపర్ లీకేజ్‌పై నివేదిక ఇవ్వాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు సస్పెండ్ పేపర్ లీక్ ఘటనలో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది. ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్ బందప్ప, మరొకరిపై వేటు వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కాగా పేపర్‌ను వాట్సాప్ గ్రూప్‌లో లీక్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. 2017లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పాఠశాల గదిలో ఒక విద్యార్థినిని వేధించడంతో కేసు నమోదు చేశారు. బందప్ప భార్య అదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది. కేసు నమోదు టెన్త్ పేపర్ బయటకు పంపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అయితే పేపర్ ఎక్కడా లీక్ కాలేదని పోలీసులు చెబుతున్నారు. పరీక్ష మొదలైన తర్వాతే పేపర్ బయటకు వచ్చిందని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్‌ను మీడియా గ్రూప్‌లో పెట్టిన్నట్లు గుర్తించారు. ఉదయం 9:30 గంటలకు పదో తరగతి పరీక్ష ప్రారంభమవ్వగా.. 9:37 గంటలకు పేపర్‌ను వాట్సాప్ గ్రూప్‌లో షేర్‌చేశారని పోలీసులు తెలిపారు. ఎగ్జామ్ హాల్‌నుంచి పేపర్ పంపినందుకు ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. టెన్త్ పేపర్ లీక్ కలకలం ఆదివారం ఉదయం వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే తెలుగు పేపర్ తాండూరులో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పేపర్ బయటకు లీక్ కావడం, వాట్సప్‌లో వైరల్ కావడంపై తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై పోలీసు శాఖతోపాటు విద్యాశాఖ విచారణ ప్రారంభించింది. -
Tenth Class Exam Paper Leak: వాట్సాప్ గ్రూపుల్లో టెన్త్ పేపర్ చక్కర్లు.. లీక్?!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పేపర్ లీక్‌ల వ్యవహారం సంచలనంగా మారింది. రాష్ట్రంలో సోమవారం నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, పరీక్ష ప్రారంభమైన కాసేపటికే పరీక్ష పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టింది. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే(9 గంటల 37 నిమిషాలకు) తెలుగు పేపర్ తాండూరులో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తాండూరులో ప్రశ్నాపత్రం సర్క్యూలేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న టెన్త్ పేపర్‌పై పోలీసులు, విద్యాశాఖ ఆరా తీస్తోంది. పేపర్ ఎలా లీక్ అయ్యింది అని దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని ఎవరు ఫొటో తీశారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
Vikarabad: ‘లేడి కానిస్టేబుల్‌ను ప్రేమిస్తున్నాను.. నువ్వు అవసరం లేదు’
సాక్షి, వికారాబాద్: న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళనకు దిగింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తొండుపల్లికి చెందిన కుర్వ శ్రీశైలం హైదరాబాద్‌లోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మిట్టకోడూరు గ్రామానికి చెందిన అనితతో నవంబర్ 2021న వివాహం జరిగింది. శ్రీశైలం విధులు నిర్వహించే కార్యాలయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను పట్టించుకోవడంలేదని భార్య అనిత ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో పలుమార్లు పంచాయితీ పెట్టినా తీరులో మార్పురావడం లేదని అన్నారు. సోమవారం కూడా మరోసారి పంచాయితీ పెట్టి మాట్లాడగా ‘లేడి కానిస్టేబుల్‌ను ప్రేమిస్తున్నాను. . నువ్వు అవసరం లేదు’అని చెప్పడంతో ఇంటి ఎదుట ఆందోళనకు దిగినట్లు అనిత తెలిపారు. తనకు న్యాయం చేసేవరకు ఆందోళన విరమించేదిలేని భీష్మించి భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. ప్రస్తుతం తాను నాలుగు నెలల గర్భవతిని అని, ఇబ్బందులకు గురి చేస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. చదవండి: నిమ్స్‌లో నర్సుల మెరుపు సమ్మె.. నిలిచిపోయిన వైద్య సేవలు -
Viral Video: భయపెట్టిన వడగండ్ల వాన.. రండి బాబు రండి.. రూ. 100 కిలో!
-
వికారాబాద్ జిల్లాలో వడగండ్ల వాన (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలుచోట్ల వడగండ్ల వాన
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణశాఖ తెలిపిన విధంగా ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురుస్తోంది. ఇక, హైదరాబాద్‌లో గురువారం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నగరంలోని నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఇక, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, కామారెడ్డి, వికారాబాద్ జిల్లా జిల్లాలో వడగండ్ల వర్షం పడుతోంది. పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా అల్పపీడన ద్రోణి కారణంగా గంటకు 40 కిలోమీటర్ల బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో, వాతావరణ శాఖ నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జహీరాబాద్‌లో వడగళ్ల వాన#Telangana #Zaheerabad #TelanganaRains #HyderabadRains @HiHyderabad #Rain pic.twitter.com/NLT1R7vasY — Mothe Vikramreddy (@MVRBRS) March 16, 2023 #Hyderabad #HyderabadRains pic.twitter.com/PS9AR84u9i — R Rajinikanth (@RRajinikanthGo2) March 16, 2023 Hailstorm reported in Kohir, Sangareddy district with -
Vikarabad: ‘టీచర్ కొట్టడం వల్లే మా బిడ్డ చనిపోయాడు!’
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలం చిలాపూర్‌లో ఓ చిన్నారి మృతి కేసు వివాదాస్పదంగా మారింది. స్థానికంగా ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని టీచర్ కొట్టడంతోనే మృతిచెందాడని తల్లిదండ్రులు, అటువంటిదేం లేదని స్కూల్ యాజమాన్యం పరస్పరం ఆరోపణలకు దిగారు. చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి పాఠశాలలో సాత్విక్ అనే పిలగాడు మూడో తరగతి చదువుతున్నాడు. హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యాడతను. సమాచారం అందుకుని చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సాత్విక్ కన్నుమూశాడు. అయితే ఉపాధ్యాయుడు కొట్టడంతో తన కొడుకు మృతి చెందాడు అంటూ చెన్గోమల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు సాత్విక్ తండ్రి. అయితే.. అటువంటిదేం లేదని, బెడ్ పైనుంచి పడడంతో అతని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారని, ఆ తర్వాతే చనిపోయాడని కేశవరెడ్డి పాఠశాల యజమాన్యం చెబుతోంది. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. చిన్నారి సాత్విక్ స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామం. -
పర్వతారోహణలో శిక్షణకు తరలిన విద్యార్థులు
వికారాబాద్ అర్బన్: కళాశాల, వసతిగృహాల్లో చదువుతున్న వంద మంది విద్యార్థులకు పర్వతారోహణలో శిక్షణ ఇచ్చేందుకు శుక్రవారం భువనగిరి ఖిల్లాకు పంపించామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మూడు బస్సుల్లో విద్యార్థులను తరలించినట్లు తెలిపారు. పర్వతారోహణలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇప్పించి, వారి నైపుణ్యం ఆధారంగా ప్రోత్సహిస్తామని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, భీమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. వాహనాల పన్నుచెల్లించండి వికారాబాద్ అర్బన్: జిల్లాలోని వాహనదారు లు సకాలంలో పన్ను చెల్లించాలని జిల్లా రవా ణా శాఖ అధికారి శుక్రవారం వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 4,769 వాహనాలు పన్ను చెల్లించకుండా తిరుగుతున్న ట్లు పేర్కొన్నారు. పట్టుబడితే అపరాధ రుసుముతో మొత్తం రూ.300 చెల్లించాల్సి వస్తుందని స్పష్టంచేశారు. జిల్లాలో సుమారు రూ.3, 50,23,190 పన్ను బకాయి ఉన్నట్లు తెలిపారు. పెద్దఎత్తున బకాయిలు పేరుకుపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు తనిఖీలు చేపడుతూ వాహన పన్ను వసూలు చేస్తున్నట్లు చెప్పారు. వాహనాల వేలం పూర్తి వికారాబాద్ అర్బన్: వదిలివేయబడిన, క్లెయి మ్ చేయలేని వాహనాలను వేలం వేశామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ బహిరంగ వేలానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. బహిరంగ వేలంలో 11 త్రిచక్ర వాహనాలు, 18 ద్విచక్ర వాహనాలను వేలం వేశామన్నారు. వేలంలో పొందిన వాహనాలను ఉపయోగించకూడదని, డీమాలిష్ చేసి తీసుకెళ్లాలని తెలిపారు. పాతూరులో పశువైద్య శిబిరం వికారాబాద్ అర్బన్: పాడి పశువుల్లో గర్భకోశ వ్యాధులు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తాయని పశుసంవర్ధక శాఖ ప్రాంతీయ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణచందర్రావు తెలిపారు. పాతూరులో శుక్రవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ టి.ఉష ఆధ్వర్యంలో సుమారు వంద మూగజీవాలకు చికిత్సలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్లీనరీకి యూసుఫ్‌కు ఆహ్వానం కొడంగల్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ జిల్లాలో నిర్వహించను న్న కాంగ్రెస్ పార్టీ ప్లీన రీ సమావేశానికి రావా లని కొడంగల్‌కు చెందిన పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఆయనకు ఫోన్ చేశారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి యూసుఫ్ ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు.కొడంగల్‌లో మైనార్టీ నేతగా ఎదిగారు. ఈ మేరకు కాంగ్రెస్, మైనార్టీ నాయ కులు యూసుఫ్‌కు అభినందనలు తెలిపారు. గొర్రెలమందపైవీధికుక్కల దాడి30 గొర్రెపిల్లల మృతి ఆమనగల్లు: పోలెపల్లిలో శుక్రవారం సాయంత్రం గొర్రెల మందపై వీధికుక్కలు దాడిచేశాయి. ఈ ఘటనలో 30 గొర్రెపిల్లలు మృత్యువాతపడ్డాయి. రైతు ఎట్టయ్యయాదవ్ తన పొలం వద్ద గొర్రెలను ఉంచగా అదే సమయంలో కుక్కలు దాడిచేశాయి. మందలో ఉన్న 30 గొర్రెపిల్లలు మృతి చెందాయి. -
బడిలోనే ‘ఆధార్’
వికారాబాద్ అర్బన్: విద్యాశాఖలో మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలు, వసతిగృహాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. పాఠశాల స్థాయిలో కూడా ఈ పద్ధతిని కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రతీ విద్యార్థికి ఆధార్ నంబర్ ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా, మధ్యాహ్న భోజనం పథకంలో పిల్లల హాజరు శాతాన్ని ఎక్కువ చూపకుండా ఉండేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 50 శాతం మందికిపైగా విద్యార్థులకు ఆధార్ లేకపోవడంతో బయోమెట్రిక్ మిషన్లలో వేలిముద్రలు పడటం లేదు. కొందరికి ఆధార్ ఉన్నా పుట్టిన తేదీ, ఇంటి పేరు తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలు నెలకొన్నాయి. వీటిని సరిచేసేందుకు గాను విద్యార్థుల సౌకర్యార్థం ఆధార్ నమోదు, సవరణ, వేలిముద్రల అప్డేట్ కోసం పాఠశాలల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మండలానికో ఆపరేటర్ చొప్పున నియమించారు. వీరి ద్వారా జిల్లాలోని అన్ని స్కూళ్లలో విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలు స్వీకరిస్తున్నారు. ప్రయోజనాలివే.. బయోమెట్రిక్ హాజరు ద్వారా పాటు, పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా చూడటం, మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చేసి చూపే అవకాశం ఉండదు. సంక్షేమ వసతి గృహాల్లో పారదర్శకత పెరుగుతుంది. సరిచేసుకునే అవకాశం జిల్లాలో మొత్తం 1,030 పాఠశాలలు ఉండగా అందులో 91,898 మంది విద్యార్థులు చదువుతున్నారు. తల్లిదండ్రులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో మొదటి ఆధార్ తీసుకున్న సమయంలో చాలా వరకు తప్పుడు సమాచారం నమోదైంది. ప్రస్తుతం పాఠశాలలో నమోదు చేసిన, ఆధార్‌లో నమోదైన పుట్టిన తేదీలు వేర్వేరుగా ఉన్నాయి. కొందరు విద్యార్థుల వేలి ముద్రలు కూడా సరిపోలడం లేదు. వీరు రెసిడెన్షియల్, సంక్షేమ హాస్టళ్లలో చేరేందుకు వెళితే ఆధార్ వివరాలు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారు. వీటిని సరిచేసుకోవాలని పిల్లల తల్లిదండ్రులకు తెలిసినా దగ్గర్లో ఆధార్ కేంద్రాలు లేక నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనికి తోడు చాలా మంది విద్యార్థులకు అసలు ఆధార్ కార్డే లేకపోవడం గమనార్హం. ఫలితంగా వీరు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. విద్యార్థుల వివరాలను నమోదు చేయడం ఉపాధ్యాయులకు సైతం సమస్యాత్మకంగా మారింది. వీటన్నింటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాఠశాలల్లో ఆధార్ నమోదు డ్రైవ్ చేపట్టింది. కార్డు లేనివారికి ఉచితంగా ఆధార్ అందించడంతో పాటు, ఇప్పటికే ఉండి తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం విద్యార్థులు, తల్లిదండ్రుల వేలిముద్రలు, ఐరిస్ వంటి వివరాలు సేకరిస్తున్నారు. -
మెరుగైన సేవలకే అటెండెన్స్ యాప్
వికారాబాద్ అర్బన్: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే జిల్లాలో అటెండెన్స్ యాప్‌ను ప్రవేశపెట్టామని, ఇందులో అధికారులు, ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన చాంబర్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులందరూ రెగ్యులర్‌గా విధులు నిర్వహించి ప్రజలకు సత్వర సేవలు అందిస్తే జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపే అవకాశం ఉంటుందన్నారు. టాప్– 5 సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. సోమవారం నుంచి వందశాతం మంది అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు వేయాలని కోరారు. ఇరవై రోజులుగా ఈ విషయమై ప్రత్యేక దృష్టిసారించినప్పటికీ ఇంకా కొన్ని శాఖల సిబ్బంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకోలేదని, ఇది క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుందని హెచ్చరించారు. పలువురు అధికారులు స్పందిస్తూ షిప్టింగ్ డ్యూటీలు, ఇతర టెక్నికల్ సమస్యల కారణంగా యాప్ డౌన్లోడ్ చేసుకోలేదని కలెక్టర్‌కు వివరించారు. -
నువ్వా.. నేనా
తాండూరు టౌన్: తాండూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలను ఆదివారం నిర్వహించనున్నారు. పట్టణంలోని వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6గంటల లోపు ఫలితాలు వెల్లడిస్తారు. 2023– 25 సంవత్సరానికి గాను విడుదలైన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ప్రక్రియ గురువారం ముగిసింది. కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. శుక్రవారం ఉప సంహరణ గడువు ఉండగా ఎవరూ తమ నామినేషన్‌ను వెనక్కి తీసుకోలేదు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అబ్దుల్ గని, చిక్కాల శ్రీనివాస్ తుది పోరులో నిలిచారు. గనికి టైరు గుర్తు, శ్రీనివాస్‌కు పాన గుర్తును కేటాయించారు. అసోసియేషన్‌లో గుర్తింపు పొందిన 261 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సభ్యులందరూ తప్పకుండా అసోసియేషన్ జారీ చేసిన గుర్తింపు కార్డుతో రావాలని, ఎన్నికల నిబంధనలు పాటించని వారిని ఓటు వేసేందుకు అనర్హులుగా ప్రకటిస్తామని ఎన్నికల అధికారి, బీఆర్ఎస్ కార్మిక విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అడ్వకేట్ గోపాల్ తెలిపారు. తమను గెలిపిస్తే లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అభ్యర్థులిద్దరూ సభ్యులను కోరారు. -
రెండు ప్రైవేట్ ఆస్పత్రులు సీజ్
చేవెళ్ల: అనుమతులు లేకుండా గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేస్తున్న రెండు ప్రైవేటు ఆస్పత్రులను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి మండల కేంద్రంలో ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేశారు. సిద్దార్థ క్లీనిక్ పేరుతో హోమియోపతి డాక్టర్ హైమావతి నిర్వహిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో గర్భిణులకు స్కా నింగ్పరీక్షలు, లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో దాడులు చేశారు. క్లినిక్‌లో 12 మంది గర్భిణులు స్కానింగ్ కోసం రావడాన్ని అధికారులు గమనించారు. అనుమతులులేకుండా స్కానింగ్ చేసినందుకు మిషన్లను సీజ్ చేశారు. మరో ప్రైవేటు ఆస్పత్రి అయిన ప్రజావైద్యశాలలో కూడా ఇదేరకమైన స్కానింగ్ పరీక్షలు జరుగుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ రెండు ప్రైవేటు ఆస్పత్రులను సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఆకస్మిక తనిఖీల్లో వైద్యఅధికారులు రాకేశ్, శ్రీనివాస్‌రెడ్డి, దామోదర్‌లు, సీహెచ్ఓ గోపాల్‌రెడ్డి, చేవెళ్ల ఎస్ఐ హయ్యూం, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు. -
స్పేస్ సదస్సుకు మహేశ్వరం విద్యార్థులు
మహేశ్వరం: స్థానిక ప్రభుత్వ మోడల్ స్కూల్ నుంచి తొమ్మిది మంది విద్యార్థులకు అమెరికా టెక్సాస్ నగరంలో నిర్వహించే ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్‌కు ఆహ్వానం రావడం గర్వించదగ్గ విషయమని మంత్రి సబితారెడ్డి అన్నారు. అమెరికా నుంచి ఆహ్వానం అందుకున్న విద్యార్థులు శుక్రవారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ మోడల్ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆహ్వానం అందడం అభినందనీయమని, సర్కారు బడుల్లో నాణ్యతతో కూడిన విద్య అందుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బాబు, మాజీ ప్రిన్సిపాల్ బి. ధనుంజయ్, కేసీ తండా సర్పంచ్ మోతిలాల్ నాయక్, ఉప సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ రవి నాయక్, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు. -
భూ వివాదంలో 15 మందిపై కేసు
పరిగి: భూ వివాదంతో 15 మందిపై కేసు నమోదయ్యింది. ఈ సంఘటన పూడూర్ మండలం చన్గోముల్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై విఠల్‌రెడ్డి కథనం మేరకు.. చన్గోముల్ గ్రామ సర్వే నంబర్ 3 6లో 4 ఎకరాల భూమిని సంగారెడ్డికి చెందిన గడీల శ్రీనివాస్‌గౌడ్ గ్రామానికి చెందిన కమాల వీరమణి, కమల సోమలింగం వద్ద కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన పొలం చుట్టూ ఫెన్సింగ్ వేశాడు. అయితే గ్రామానికి చెందిన ఎండీ అజీం, అజారుద్దీన్, రహీస్ ఖాన్, జహీర్‌ఖాన్, నజీబ్ ఖాన్, కొంగి సత్తయ్య, కొమ్ము కృష్ణ, సిరాజుద్దీన్ ఫెన్సింగ్‌ను తొలగించారు. దీంతో బాధితుడు శ్రీనివాస్‌గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రయోగాత్మక విద్యతో లాభాలు కొత్తూరు: ప్రయోగ్మాతకంగా విద్యాబోధన చేపడితే విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థమవుతాయని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి (సీఎంఓ) కృష్ణయ్య సూచించారు. మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామ జెడ్పీహెచ్ఎస్లో పీఅండ్‌జీ పరిశ్రమ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమ ఆర్థిక సహకారంతో మైండ్ స్పార్క్ సంస్థ సమకూర్చిన కంప్యూటర్ మోడల్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు దృశ్య, వీక్షణ ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తే వారికి విషయ పరిజ్ఞానం పెరగడంతో పాటు చాలాకాలం వరకు గుర్తుంటాయన్నారు. కరోనా కారణంగా చదువులో వెనకబడిన విద్యార్థులకు ఇలాంటి బోధన ఎంతో ఉపయోగకరమని అన్నారు. కార్యక్రమంలో మైండ్ స్పార్క్ సంస్థ ప్రతినిధి విశ్వనాథ్, ఎంఈవో కృష్ణయ్య, పాఠశాల హెచ్ఎం పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
కుల్కచర్ల: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. షాద్‌నగర్ పట్టణానికి చెందిన క్షీరసాగర తారాబాయి కుమారుడు విజయ్‌కుమార్ ముజాహిద్పూర్కు చెందిన బొడికె నర్సుబా యిని వివాహం చేసుకొని ఇల్లరికం వచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు. విజయ్‌కుమార్ ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయాడు. తన కొడుకు కో డలు తరచూ గొడవ పడేవారని, కు మారుడి మరణంపై అనుమానం ఉందని తల్లి తారబా యి పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గిరి తెలిపారు. -
రాష్ట్రంలో బీజేపీదే అధికారం
బంట్వారం: రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బంట్వారం, కోట్‌పల్లి మండలాల్లోని బస్వాపూర్, తొర్మామిడి, సల్బత్తాపూర్, రాంపూర్ గ్రామాల్లో శక్తి కేంద్ర కార్నర్ సమావేశాలునిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అస్సెంబ్లీ పాలక్, సినీ నటి జీవితతో కలిసి మాట్లాడారు. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కష్టపడిన వారికి భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. యువత చేతిలోనే దేశ భవిత ఉందన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వికారాబాద్ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్, సీనియర్ నాయకులు బసిరెడ్డి పాల్గొన్నారు. -
ఆనకట్ట.. ఒట్టిమాటేనా?
ధారూరు: మండలంలోని దోర్నాల్ గ్రామ సమీపంలో పెద్ద వాగుకు అడ్డంగా ఆనకట్ట నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. మూడేళ్ల క్రితం మంత్రి సబితారెడ్డి ఇందుకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. భూగర్భ జలాలు వృద్ధి కోసం ఈ ప్రాజెక్టును నిర్మించాలని భావించారు. ఉద్దేశం మంచిదే అయినా పాలకులు, అధికారుల అలసత్వం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. 2020 జూన్ 11న మండలంలోని పెద్ద వాగుకు అడ్డంగా ఆనకట్ట నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి అరవై ఒక్క లక్షాయాభై వేల రూపాయలు మంజూరు చేసింది. వాగు అవతల ఉన్న పొలాలకు దారి సౌకర్యంతో పాటు భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని రైతులు భావించారు. కాంట్రాక్టర్ పునాది స్థాయిలో పనులు చేస్తుండగా వాగు ప్రవాహ కారణంగా పనులు ఆపేశాడు. 2 సంవత్సరాలు అవుతున్నా తిరిగి పనులు చేపట్టలేదు. 2020, 2021 సంవత్సరాల్లో ఎలాంటి పనులు మొదలుపెట్టలేదు. అయితే ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభం కాకముందే పనులు పూర్తవుతాయని రైతులు భావించడం, ఆ తర్వాత నిరాస చెందడం పరిపాటిగా మారింది. -
కదిలిన యంత్రాంగం
దోమ: కొత్త కలెక్టర్‌గా నారాయణరెడ్డి విధుల్లో చేరిన రోజునుంచి అధికారుల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గ్రామాలు, మున్సిపాలిటీల్లో చేప డుతున్న పనులను శుక్రవారం ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం దోమ మండలంలో పర్యటించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమై యంత్రాంగం విధుల్లో చురుగ్గా పాల్గొంటోంది. ప్రజా సమస్యల పరిష్కారంపై కిందిస్థాయి సిబ్బంది సైతం దృష్టిసారించారు. పనుల పురోగతికి ప్రత్యేక చర్యలు దోమ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ పర్యటించారు. పల్లెల్లో చేపట్టాల్సిన పనులపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. అర్ధంతరంగా ఆగిపోయిన పనుల వివరాలు సేకరించడంతో పాటు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దోర్నాల్పల్లిని సందర్శించిన కలెక్టర్ నర్సరీ నిర్వహణ, పల్లె ప్రకృతి వనంపై అసహనం వ్యక్తంచేయడంతో అధికారులు పనులు చేపట్టారు. నర్సరీలో ఎండిన మొక్కలను తొలగించి నూతన మొక్కలు నాటించారు. పల్లె ప్రకృతి వనంలో ఉన్న మొక్కలకు నీరందించి, కొత్త మొక్కలు నాటారు. ప్రజల సౌకర్యార్థం బెంచీలు, కుర్చీలు, రోడ్లు వేయాలని ఆదేశించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఐనాపూర్, మోత్కుర్, దోమ, పాలేపల్లి, దిర్సంపల్లి, మల్లేపల్లి తదితర గ్రామాలను సందర్శించి నర్సరీ, పల్లె ప్రకృతివనం,డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక పనులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. నర్సరీ నిర్వహణను అశ్రద్ధ చేయొద్దని సిబ్బందిని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలను పార్కుల్లా సుందరీకరించాలన్నారు. -
ప్రతి కూలీకి ఉపాధి పని కల్పిస్తాం
యాచారం: జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి ఉపాధి పనులు కల్పిస్తామని డీఆర్డీఓ పీడీ ప్రభాకర్ పేర్కొన్నారు. మండలంలోని చింతపట్ల గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఎన్ని గంటలకు పనులకు వస్తున్నారు, పనులు ప్రారంభించే సమయంలో, పనులు చేసే సమయంలో ఫొటోలు తీస్తున్నారా.. నింబంధనల ప్రకారం పనులు చేస్తున్నారా.. రికార్డుల నమోదు, కూలీల సంఖ్యపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనం, నర్సరీలను సందర్శించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా వారానికి మూడు రోజుల పాటు నీళ్లు అందించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రోజూ 7 వేల మందికి పైగా కూలీలకు ఉపాధి పనులకు వస్తున్నారని తెలిపారు. రాబోయే వారం, పది రోజుల్లో ప్రతి గ్రామంలో 250కి మించి కూలీలు ఉపాధి పనులు చేసేలా చైతన్యం కల్పిస్తామన్నారు. కూలీలకు వారం, వారం డబ్బులు అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఈజీఎస్ ఏపీఓ లింగయ్య, ఈసీ శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల రక్షణ గాలికి..!
పెద్దేముల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నీరుగారుతోంది. ఏటా ప్రభుత్వం గ్రామాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి.. వాటి సంరక్షణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల మొక్కలు ఎండిపోతున్నాయి. ప్రధాన రహదారులపై నాటిన మొక్కలకు రక్షణ లేకుండా పోయింది. అంతేకాకుండా నాటిన గుంతల్లోనే మళ్లీ మొక్కలు నాటి లెక్కలు చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మండల అధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లో 37 వన నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో 5 వేల మొక్కలకు తగ్గకుండా పెంచుతున్నారు. ఇందుకోసం ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా వన నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు సంరక్షణ గ్రామ పంచాయతీ అధికారులకు అప్పగించారు. కానీ పంచాయతీ అధికారులు మొక్కలు నాటడంపై చూపుతున్న శ్రద్ధ వాటి సంరక్షణపై పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయం వద్ద నాటిన మొక్కలు ఎండిపోయాయి. వాటి రక్షణ కోసం ఏర్పాటు చేసిన జాలీలు పడిపోయినా పట్టించుకునే నాథులే కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల వద్దే పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మండలంలోని హైదరాబాద్, జహీరాబాద్, సంగారెడ్డి ప్రధాన రహదారులపై, మంబాపూర్, ఇందూరు, కందనెల్లి, మన్సాన్పల్లి, ఆత్కూర్ గ్రామాల్లో నాటిన మొక్కలకు నీరు అందక ఎండిపోతున్నాయి. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణ, ప్రధాన రహదారులు, ప్రభుత్వ భూములు, ఆలయ స్థలాల్లో మొక్కలు నాటారు. వీటి బాధ్యతను పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. గత ఏడాది పలు గ్రామాల్లో రూ. 150నుంచి రూ.180 వరకు వెచ్చించి ఒక్కో మొక్కను కొనుగోలు చేసి రోడ్ల పక్క నాటారు. కానీ ఎక్కడా మొక్కలు పెరిగిన దాఖలాలు లేవు. ఈ విషయమై ఎంపీడీఓ లక్ష్మప్పను వివరణ కోరగా మొక్కలు ఎండిపోతే పంచాయతీ కారదర్శులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. -
‘సాక్షి’ సేవలు అభినందనీయం
కుల్కచర్ల: విద్యార్థుల సౌకర్యార్థం సాక్షి దినపత్రిక అందిస్తున్న పదో తరగతి మోడల్ టెస్ట్ పేపర్స్ ఎంతో ఉపయోగకరమని కుల్కచర్ల కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాల ప్రత్యేకాధికారి దేవి అన్నారు. శుక్రవారం పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు మోడల్ ప్రశ్న పత్రాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యార్థం సాక్షి దినపత్రిక ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టడం ఉపయోగకరమన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు ఇవ్వాలి బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా గౌరవాధ్యక్షుడు కృష్ణయ్య కొడంగల్ రూరల్: గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా గౌరవ అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. త్వరలో బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో పంచాయతీ ఉద్యోగులకు పెండింగ్ జీతాలు చెల్లించేలా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. టీచర్‌పై ఫిర్యాదు వికారాబాద్ అర్బన్: పట్టణంలోని భృంగీ ఇంటర్నేషనల్ స్కూల్లో నాలుగో తరగతి విద్యార్థులను సైన్స్ టీచర్ చితకబాదినట్లు పిల్లల తల్లిదండ్రులు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లలపై టీచర్ ఇష్టానుసారంగా కొట్టినట్లు వాపోయారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పవద్దని పాఠశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం పిల్లలను బయపెట్టినట్లు తెలిపారు. వేల రూపాయల ఫీజు తీసుకుంటున్న పాఠశాల యాజమన్యాం పిల్లల రక్షణపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత టీచర్‌పై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. స్వర్ణ రుద్రాక్ష మాల బహూకరణ షాద్‌నగర్ టౌన్: పట్టణంలోని శివమారుతీ ఆలయంలో కొలువుదీరిన అయ్యప్ప స్వామికి శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన మంజుల, ప్రతాప్‌కుమార్ దంపతులు స్వర్ణ రుద్రాక్ష మాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంతోష్, సునీల్, ఆలయ కమిటీ అధ్యక్షుడు గోలెపు చంద్రమౌళి, బసప్ప, విశ్వం, రాఘవేందర్, చింటు, ప్రవీణ్, ముత్యాలు, రాజావరప్రసాద్, హర్షవర్ధన్ గౌడ్, శశికుమార్, శ్యాం, శ్రీకాంత్, చరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
భూ వివాదంలో దోమ ఎస్ఐ!
దోమ: భూ వివాదంలో ఎస్ఐ విశ్వజన్ తలదూర్చారు. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ పట్టణానికి చెందిన యాదగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. నవాబుపేట మండలంలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఎస్ఐ విశ్వజన్కు యాదగిరితో పరిచయం ఏర్పడింది. ఎక్కడైనా భూమి ఉంటే చెప్పండి కొనుగోలు చేస్తానని ఎస్ఐ రియల్లర్ను కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలో నవాబుపేట మండలం కేశవపల్లిలో రైతు హన్మంతుకు చెందిన 21 గుంటల పొలం కొనేందుకు ఎస్ఐ రూ. 32 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా రూ. 9 లక్షలు ఇచ్చి తన స్నేహితుడిపై అగ్రిమెంట్ చేయించాడు. మిగత డబ్బు ఆరు నెలల తర్వాత నేరుగా రైతు అకౌంట్లో వేసి ఎస్ఐ తన స్నేహితుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇదిలా ఉండగా సదరు రైతు నవాబుపేటలో ఓ ప్లాట్ కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఇందుకోసం రియల్టర్ యాదగిరిని సంప్రదించాడు. రూ. 18 లక్షలకు ఆ ప్లాట్‌ను రైతుకు ఇప్పించేందుకు యాదగిరి ఒప్పందం కుదుర్చాడు. ఇందులో భాగంగా ఎస్ఐ ఇచ్చిన రూ. 9లక్షలతో పాటు రైతు వద్ద మరో రూ. రెండు లక్షలు తీసుకొని ప్లాట్ యజమానికి ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా రైతు ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఈ విషయమై రియల్టర్ యాదగిరి అడగ్గా తన వద్ద డబ్బు లేదని తాను ఇచ్చిన రూ. 11 లక్షలు తిరిగి ఇప్పించాలని కోరాడు. ఇదే విషయాన్ని రియల్టర్ ప్లాటు యజమానికి తెలిపాడు. అయితే పాట్లు యజమాని తన వద్ద ఇప్పుడు అంత డబ్బు లేదని రైతు ఇచ్చిన రూ.11 లక్షల్లో రూ. 5 లక్షలు తిరిగి ఇచ్చాడు. ఈ డబ్బును ఎస్ఐ స్నేహితుడి అకౌంట్లో వేసినట్లు రియల్టర్ తెలిపారు. ఈ విషయంపై ఎస్ఐ విశ్వజన్‌ను వివరణ కోరగా.. నవాబుపేటలో 20 గుంటల భూమిని తన స్నేహితుడికి రియల్టర్ యాదగిరి రూ.32 లక్షలకు ఇప్పించాడు. అందులో రూ. 8 లక్షలు రైతుకు ఇస్తానని తీసుకున్న రియల్టర్ తన స్నేహితుడిపై భూమి అగ్రిమెంట్ చేయించాడు. అగ్రిమెంట్ చేయించిన తర్వాత ఆరు నెలలైన తన స్నేహితుడికి భూమిని రిజిస్ట్రేషన్ చేయించలేదు. తన వద్దకు రాలేదు. దీంతో అనుమానం వచ్చి రైతును తాను ప్రశ్నించగా తనకు రియల్టర్ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పాడు. అగ్రిమెంట్‌కు ఇచ్చిన డబ్బులను రియల్టర్ యాదగిరి తన సొంత అవసరాలకు వాడుకొని రైతుకు ఇవ్వలేకపోయాడు. ఇట్టి విషయం గట్టిగా రియల్టర్‌ను అడుగగా రూ. 8 లక్షల్లో కొన్ని రైతుకు ఇచ్చాడు. మిగత రూ.3 లక్షల 50 వేలు ఇవ్వలేకపోయాడు. అట్టి డబ్బులను మీరు ఇప్పించండి అంటూ రైతు ఎస్ఐని కోరి భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడు. మిగత డబ్బులు రోజులు గడుస్తున్న రియల్టర్ ఇవ్వకపోవడంతో రైతు తనకు, తన స్నేహితుడికి కాల్ చేయడం ప్రారంభించాడు. దీంతో తాను ఈ విషయంపై రియల్టర్‌ను గట్టిన ప్రశ్నించానని ఎస్ఐ విశ్వజన్ తెలిపారు.