వికారాబాద్: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే దౌల్తాబాద్ అభివృద్ధి, సంక్షేమం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ కట్టిన బడి, గుడి, తాగునీరు తాను తీసుకొచ్చినవేనని చెప్పారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వికారాబాద్ జిల్లా దౌలతాబాద్‌లో నిర్వహించిన విజయభేరి యాత్రలో మాట్లాడారు.
డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, కాలేజీలు తెస్తామని బీఆరేస్ నేతలు చెప్పారు.. కానీ పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తామని పేర్కొన్నారు.
రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.' రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12 వేలు అందిస్తాం. ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తాం. చేయూత పథకం ద్వారా రూ.4వేలు పెన్షన్ అందిస్తాం.' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment