తెలంగాణ బీజేపీకి షాక్‌.. మాజీ మంత్రి చంద్రశేఖర్‌ రాజీనామా | Former Minister Chandrashekhar Resigned From Bjp | Sakshi
Sakshi News home page

తెలంగాణ బీజేపీకి షాక్‌.. మాజీ మంత్రి చంద్రశేఖర్‌ రాజీనామా

Published Sun, Aug 13 2023 8:28 AM | Last Updated on Sun, Aug 13 2023 12:35 PM

Former Minister Chandrashekhar Resigned From Bjp - Sakshi

సాక్షి, వికారాబాద్‌: జిల్లాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కొంతకాలం అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్‌ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. పార్టీలో పనిచేసే వారిని ప్రోత్సహించడం లేదని చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లోకి చేరనున్నట్లు సమాచారం.

గతంలో టీడీపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో పనిచేసిన చంద్రశేఖర్‌.. మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లనున్నారు. గత కొంత కాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న చంద్రశేఖర్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆయన.. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు.
చదవండి: 17 తర్వాత ఎప్పుడైనా.. బీఆర్‌ఎస్‌ జంబో లిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement