chandrashekar
-
రాజ్యసభలో నోరుపారేసుకున్న ఖర్గే.. బీజేపీ ఎంపీ సీరియస్!
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహంతో కంట్రోల్ తప్పారు. ఖర్గే ఆవేశంలో బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. నేను మీ తండ్రి సహచరుడిని.. మీరు నాకు చెప్పేదేంటి.. నోరు మూసుకుని కూర్చోండి అంటూ కౌంటరిచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నేడు రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తున్న సమయంలో మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనై, సహనం కోల్పోయిన ఖర్గే.. ఆయనపై విరుచుకుపడ్డారు. అనంతరం, ఖర్గే మాట్లాడుతూ..‘నేను మీ తండ్రి సహచరుడిని. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్?. నేను నిన్ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. నోరు మూసుకుని కూర్చో’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఖర్గే వ్యాఖ్యల కారణంగా రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కల్పించుకున్నారు. ఇరు వర్గాలను ప్రశాంతంగా ఉండాలని కోరారు. మాజీ ప్రధానమంత్రి గురించి తన ప్రస్తావనను ఉపసంహరించుకోవాలని ఖర్గేకు సూచించారు. అలాగే, చంద్రశేఖర్ ఎంతో ప్రజాదరణ కలిగిన నేత అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నీరజ్ శేఖర్ 2019లో బీజేపీలో చేరారు. ఆయన తండ్రి చంద్ర శేఖర్ దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన సోషలిస్ట్ నాయకులలో ఒకరిగా పరిగణించబడతారు. చంద్ర శేఖర్.. అక్టోబర్ 1990 నుండి జూన్ 1991 వరకు ఆరు నెలలు ప్రధానమంత్రిగా పనిచేశారు.Kharge ji 🤣🤣🔥pic.twitter.com/7YKfvkwgad— Darshni Reddy (@angrybirdtweetz) February 3, 2025 -
ఇది ఆజాద్ పార్క్..!
ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) పేరు వినగానే త్రివేణి సంగమం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ఇందిరా గాంధీ పుట్టిన ఇల్లు ఆనందభవన్ గుర్తు వస్తుంది. గూగుల్‌లో వెతికితే అలహాబాద్‌లో చూడాల్సిన ప్రదేశాల్లో ఆజాద్ పార్క్ కనిపిస్తుంది. టూర్ ప్లాన్‌లో పార్కులెందుకు, టైమ్ వేస్ట్ అని కొట్టిపారేస్తుంటాం. కానీ ఆజాద్ పార్కును చూసి తీరాలి. నగరం మధ్యలో 133 ఎకరాల విశాలమైన పార్కు, పచ్చదనం పరిఢవిల్లుతుంటుంది. వాహనాల రణగొణ ధ్వనులు వినిపంచనంత ప్రశాంత వాతావరణం అలరించి తీరుతుంది. టికెట్ తీసుకుని లోపలికి వెళ్లగానే కళ్లు చంద్రశేఖర్ ఆజాద్ మెమోరియల్ కోసం వెతుకుతాయి. ఆజాద్ పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారామ్ తివారీ, ఆజాద్ అనేది ఆయన బిరుదు. స్వాతంత్య్రం కోసం పోరాడుతూ ప్రాణత్యాగం చేశాడు. ఆయన ప్రాణత్యాగం చేసిన ప్రదేశమే ఈ పార్కు.చదువరుల పార్కుఆజాద్ పార్క్ బ్రిటిష్ హయాంలో ఏర్పాటైంది. అప్పుడు దాని పేరు ఆల్ఫ్రెడ్ పార్క్. జాతీయోద్యమవాదులు ఈ పార్కులో తలదాచుకుని ఉద్యమవ్యూహాలు రచించేవారు. అలా చంద్రశేఖర్ ఈ పార్కులో ఉన్న సమయంలో ఆ సమాచారం తెలుసుకున బ్రిటిష్ పోలిస్ అధికారి, తన బృందంతో మోహరించాడు. ఆజాద్ తన తుపాకీతో ముగ్గురు పోలీసులను చంపేశాడు. ఆ కాల్పుల్లో ఆజాద్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పోలిసుల చేతిలో చిక్కకుండా తన తుపాకీతో కణత మీద కాల్చుకుని ప్రాణత్యాగం చేశాడు ఆజాద్. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆజాద్ విగ్రహాన్ని స్థాపించి ఆజాద్ మెమోరియల్‌గా తీర్చిదిద్దారు. ఆ పార్కుకు ఆజాద్ పేరు పెట్టారు. విగ్రహం దగ్గర నిలబడి ఆజాద్‌కి సెల్యూట్ చేసి మౌనంగా నివాళి అర్పించి బరువెక్కిన గుండెతో ముందుకు సాగిపోతారు పర్యాటకులు.పార్కులో లైబ్రరీ!ఆజాద్ పార్కులో ఆజాద్ మెమోరియల్తోపాటు విక్టోరియా మెమోరియల్ కూడా ఉంది. అయితే అందులో ఇప్పుడు విక్టోరియా స్టాచ్యూ లేదు. ప్రయాగ్‌రాజ్ సంగీత్ సమితి, మదన్ మోహన్ మాలవ్యా స్టేడియం, అలహాబాద్ మ్యూజియం ఉన్నాయి. అలహాబాద్ పబ్లిక్ లైబ్రరీ బిల్డింగ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు బ్రిటిష్ కాలం నాటి యూరోపియన్ స్లైట్ నిర్మాణాలు. రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో 5వేల మందికి పైగా సందర్శిస్తారని అంచనా. టికెట్ ఐదు రూపాయలు మాత్రమే. ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. ఇక్కడకు నగరవాసులు రెగ్యులర్‌గా వస్తుంటారు. మంత్లీ టికెట్ వంద రూపాయలు. ఏడాదికి పాస్ తీసుకుంటే వెయ్యి రూపాయలు. పార్కులోపల ఒక ప్రత్యేకమైన ప్రపంచం. రెగ్యులర్‌గా వాకింగ్‌కి వచ్చే మహిళలు, రిటైర్ అయిన వాళ్లు ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకుంటూ నడక వేగం తగ్గకుండా ముందుకు వెళ్తుంటారు. కోచ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. లైబ్రరీలో సివిల్స్‌కి ప్రిపేరయ్యే వాళ్లు కనిపిస్తారు. ఆవరణలో ఒక్కొక్కరు ఒక్కో చోట దుప్పటి పరుచుకుని పుస్తకాలు పక్కన పెట్టుకుని చదువుకుంటూ ఉంటారు. వారి ఏకాగ్రత స్థాయి ఎంతలా ఉంటుందంటే పర్యాటకులు వారి పక్కనే నడిచి వెళ్తున్నా సరే... పుస్తకంలో నుంచి తలతిప్పి చూడరు. వారి చదువుకు భంగం కలిగించకూడదనే పర్యాటకులే ఒకరికొకరు సైగ చేసుకుంటూ శబ్ధం చేయకుండా దూరంగా వెళ్లిపోతుంటారు. ఈ పార్కులోకి ఎంట్రీ ఫీజు ఐదు రూపాయలే కానీ పార్కు గేటు దగ్గర కొబ్బరిబోండా డెబ్బై రూపాయలు. లైట్ అండ్ సౌండ్ షో సాయంత్రం ఏడు గంటలకు మొదలవుతుంది. 45 నిమిషాలపాటు సాగే ఈ షోలో మోతీలాల్ నెహ్రూ ఇల్లు ఆనందభవన్, అందులో సాగిన స్వాతంత్య ఉద్యమ రచన వివరాలు, ఆజాద్ పార్కులో సాగిన ఉద్యమ ఘట్టాలతో షో నడుస్తుంది. ఆజాద్ మరణంతో ముగిసే ఈ షో మరోసారి మనసును బరువెక్కిస్తుంది. ఈ రోజు మనం పీలుస్తున్న స్వేచ్ఛావాయువుల వెనుక ఎన్ని ప్రాణత్యాగాలో? లైట్ అండ్ సౌండ్ పూర్తయి పార్కులో నుంచి బయటపడేటప్పటికి ఎనిమిది గంటలవుతుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: 'టీ' సంస్కృతికి పుట్టినిల్లు ఆ దేశం..! ఇంట్రస్టింగ్ విషయాలివే..) -
వైఎస్సార్సీపీ పూనూరు గౌతమ్ రెడ్డిపై అక్రమ కేసు.. తాడిపత్రి చంద్రశేఖర్ సీరియస్ రియాక్షన్
-
ఏపీ బడ్జెట్ పై చంద్రశేఖర్ ఫైర్
-
చంద్రబాబు పాలనకు భయపడి ప్రజలు ఊర్లు వదిలి పారిపోతున్నారు
-
‘ఈ ఎన్నికల్లో గెలుపు నాదే’.. శశి థరూర్ ‘ఇంగ్లీష్’పై కేంద్రమంత్రి సెటైర్లు
సాక్షి, తిరువనంతపురం : ఈ సారి జరిగే లోక్‌సభ ఎన్నికలు..‘పాలిటిక్స్ ఆఫ్ ఫర్మామెన్స్..15 ఇయర్స్ ఆఫ్ నాన్ - పర్మార్మెన్స్’ మధ్య జరుగుతున్నాయంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి తిరువనంతపురం బీజేపీ లోక్‌సభ అభ్యర్ధి చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తున్న చంద్రశేఖర్ ఎన్నికలపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్రత్యర్ధి, తిరువనంతపురం సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ నేత శశి థరూర్‌పై విరుచుకు పడ్డారు. ఈ ఎన్నికలు ‘పనితీరు రాజకీయాలకు..15 సంవత్సరాల పనితీరు లేని రాజకీయాల మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా శశిథరూర్ ఇంగ్లీష్ వాక్చాతుర్యంపై సెటైర్లు వేశారు. ‘ఇది థరూర్, ఎన్డీఏల మధ్య జరిగే పోరాటం కాదు. ఇది కొంత వ్యక్తిత్వానికి సంబంధించినదని నేను అనుకోను. ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం గురించి లేదా మరేదైనా అని నేను అనుకోను. ప్రజలే డిసైడ్ చేస్తారు. ఈ ఎన్నికలు గెలుపు కూడా నాదేనంటూ.. ‘‘తిరువనంతపురం ప్రజలకు దీని గురించి బాగా తెలుసు. నేనుకూడా అదే నమ్ముతున్నాను. ఆ ఫలితం ఎన్నికల జయాపజయాల్ని నిర్ధేశించేలా ఉంటుంది. ఈ ఎన్నికల పోరు వ్యక్తుల మధ్య పోరుగా భావించడం లేదు. ఈ ఎన్నికలు గత 10ఏళ్లలో జరిగిన అభివృద్ది రాబోయే ఐదేళ్లలో కొనసాగించడమే’ అని పునరుద్ఘాటించారు. నో విజన్ ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు విజన్ లేదని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రతిపక్షం అంటే ‘అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు నరేంద్ర మోదీని ఓడించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో కలిసి రావడమే’ అని వ్యాఖ్యానించారు. నా నియోజకవర్గ ప్రజలకు నేను ఎక్కడి వాడినో ఎన్నికల ఫలితాలు వచ్చాక తేలిపోతుందన్నారు. ఆ విషయం నేను చెప్పనవసరం లేదు. (మీడియాను ఉద్దేశిస్తూ) మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఇది ఖచ్చితంగా తెలుసు’ అని చంద్రశేఖర్ అన్నారు. తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలో కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్‌ని తొలిసారి కేరళ రాజధాని తిరువనంతపురం లోకసభ స్థానం నుంచి బరిలోకి దించింది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ వరుసగా మూడు సార్లు ఎంపీగా విజయం సాధించారు. -
TS Electon 2023: కమలం వీడి.. కాంగ్రెస్ గూటికి.. అయోమయంలో కేడర్..
వికారాబాద్: మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ కమలంను వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన శనివారం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. కాంగ్రెస్ పెద్దల నుంచి సీటు కేటాయింపుపై స్పష్టమైన హామీ లభించిన తర్వాతే ఆయన బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో చురుగ్గా పని చేసిన ఆయన కొంతకాలంగా స్థబ్దుగా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాల్లోగానీ.. కేడర్ బలోపేతం చేయడంగానీ కనిపించలేదు. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన ప్రధాని మోదీ సభకు సైతం ఆయన గైర్హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు, బీఆర్ఎస్ అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడం, ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ ఆయన సొంతపార్టీపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుబెడుతూ వచ్చారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఐదు పార్టీలు.. ఐదుసార్లు విజయం.. ఇప్పటి వరకు ఐదు పార్టీలు మారిన మాజీ మంత్రి ఏసీఆర్ టీడీపీ, బీఆర్ఎస్ మినహాయిస్తే ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై న ఆయన్ను మూడు సార్లు మంత్రి పదవి వరించింది. 2009 ఉప ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ చేతిలో ఓటమి పాలైన ఆయన అనంతరం ఏ ఎన్నికల్లోనూ గెలువలేకపోయారు. 18న కాంగ్రెస్ తీర్థం.. మాజీ అమాత్యుడు ఎ.చంద్రశేఖర్ ఈ నెల 18న జహీరాబాద్‌లో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పార్టీ కుండువా కప్పుకోను న్నట్లు తెలుస్తోంది. తన తండ్రి స్వగ్రామం జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం సైతం స్పష్టమైన హామీ ఇచ్చినందునే ఆయన పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు చర్చించుకుంటున్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం.. రాష్ట్రంలో బీజేపీ ఒడిదొడుకులు.. కాంగ్రెస్‌తో ఆయనకున్న సత్సంబంధాల నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయోమయంలో కేడర్.. ఏసీఆర్ బీజేపీకి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్‌లో చేరడం ఖరారు కావడంతో ఆయన అనుచరులు అయోమయానికి గురవుతున్నారు. తరచూ పార్టీలు మారుతుండటం.. ఏ పార్టీలోనూ ఎక్కువ రోజులు నిలకడగా ఉండకపోవటంతో ఆయన వెంట వెళ్లాలా వద్దా..? అనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బలమైన నాయకుడు మరో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఉండటంతో ఏసీఆర్ కాంగ్రెస్‌లో చేరినా మరో నియోజకవర్గానికి వెళ్లాల్సిందే. జహీరాబాద్ లేదా చేవెళ్ల రెండింటిలో ఏదో స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆయన వికారాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం లేనందున మరో పార్టీ చూసుకుందామనే ఆలోచనలో అనుచరులున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఆయన పార్టీ మారిన ప్రతీసారి ఆయనతో వెళ్లడం.. అక్కడ ఆయన నిలదొక్కుకోకపోవడం.. నియోజకవర్గంలో సమయం ఇవ్వకపోవడంతో కేడర్ అసంతృప్తికి గురవుతున్నారు. పీసీసీ చీఫ్‌తో ఏసీఆర్ భేటీ.. ఇప్పటికే బీజీపీకి రాజీనామా చేసిన ఎ.చంద్రశేఖర్ ఆదివారం నగరంలోని తన నివాసంలో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డితో కలిసి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరే విషయంపై చర్చించినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. వికారాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై న మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ నెల 18న జహీరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదే విషయమై ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో జిల్లా నాయకులతో తన నివాసంలో చర్చలు జరిపారు. -
బీజేపీకి రాజీనామా చేసిన మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్
-
తెలంగాణ బీజేపీకి షాక్.. మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా
సాక్షి, వికారాబాద్: జిల్లాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కొంతకాలం అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. పార్టీలో పనిచేసే వారిని ప్రోత్సహించడం లేదని చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లోకి చేరనున్నట్లు సమాచారం. గతంలో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పనిచేసిన చంద్రశేఖర్.. మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లనున్నారు. గత కొంత కాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న చంద్రశేఖర్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆయన.. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. చదవండి: 17 తర్వాత ఎప్పుడైనా.. బీఆర్ఎస్ జంబో లిస్ట్ -
విందామా... ప్రకృతి గీతం
ప్రకృతి నుండి వచ్చే వివిధ వైవిధ్యభరితమైన ధ్వనులు...... పక్షుల కువకువలు, నదీ ప్రవాహాలు, గాలి వీచికలు, సాగర ఘోషలు, జలపాత జోరులు, తుమ్మెద ఝంకారాలు, కీటక శబ్దాలు... వెరసి భూమి మనకు అందించే సంగీత కచేరి. ఆ దృష్ట్యా చూసేవారికీ భూమి అద్భుత సంగీతకారిణిగా గోచరిస్తుంది. నదులు, వాగులు, సాగరాలను, సెలయేళ్ల గలగలలను వివిధ సంగీత సాధనాలను వాయించే సంగీతకారులుగా చేసి, పక్షుల కుహూ కుహూలను గాత్రధారులను చేసి, ఈ అద్భుత మేళవింపుతో మనకు సంగీతాన్ని వినిపించే గొప్ప సంగీతవేత్త. శోధించ గలిగేవారికి మరెన్నో వివిధ సంప్రదాయ సంగీతాలు, అనేక రాగాలను శ్రవణానందకరంగా వినిపించే గొప్ప సంగీత దర్శకురాలు. అవును. భూమికి సంగీతం ఉంది. వినగలిగేవారికి అది సంగీతాన్ని వినిపిస్తుంది. అయితే మనం దృష్టి సారించి చూసి, తెలుసుకోగలగాలి. వినగలగాలి. అసలు మనకు జిజ్ఞాస, వినే మనస్సుండాలి. ఈ భూమి, దీని మీద నివసించే మానవులు, ప్రకృతి జంతుకోటి చేసే కదలికలకు, శబ్దాలకు లేదా ధ్వనులకు, ఓ తూగు, ఊగు, లయ ఉంటుంది. వాటికి మనస్సును పులకింపచేసే ఒక శక్తి ఉంది. అవి వీనులకు విందు కలిగిస్తాయి. ఓ హాయినిస్తాయి. మనస్సుకు ఒక ప్రశాంతతనిచ్చి, ఒక అలౌకిక ఆనందానికి లోను చేస్తాయి. అనేకమంది కవులు, రచయితలు భూమి వినిపించే సంగీతం గురించి చక్కగా వర్ణించారు విశ్వవ్యాప్తంగా. అది వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, షేక్స్పియర్, కీట్స్, వర్డ్స్‌వర్త్ లాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. నదులు ప్రవాహపు తీరు వినసొంపుగా ఉంటుంది. ప్రవహించే భూ విస్తీర్ణాన్ని బట్టి వివిధ రకాలుగా నది ధ్వనిస్తుంటుంది. అవన్నీ చెవులకు హాయినిస్తాయి. నదులను తనలో కలుపుకునే సముద్రం నిరంతరం గర్జిస్తూనే ఉంటుంది. పర్వతాల, కొండల మీదనుండి భూమి ఒడిని చేరాలని తహతహలాడుతూ దుందుడుకుగా దూకే ఝరులు వీక్షకుల గుండెలను ఝల్లుమనిపిస్తూ విభ్రాంతిని కలిగించినా శ్రవణాలకు ఒకే సంగీత వాద్యాన్ని వందలమంది వాయించినంత అనుభూతినిస్తాయి. ఇహపరమైన ఇక్కట్లను, బాధను కొద్దిసేపైనా మనం మరిచేటట్టు చేస్తుంది. శ్రవణానందకరమైన ఏ శబ్దమైనా మనసును రసమయం చేయగల మహత్తును కలిగి ఉంటుంది. గాలి ఈలలు వేస్తుందని, ఎన్నెన్నో ఊసులు చెప్పగలదని ఎంతమందికి తెలుసు? వేసవి తాపాన్ని తొలగిస్తూ మనస్సులను ఝల్లుమనిపిస్తూ భూమిని ముద్దాడటానికి అనూహ్యమైన వేగంతో వచ్చే తొలకరిజల్లు శ్రవణ పేయమై మన ఉల్లాన్ని ఆనందలహరిలో ప్రవహింప చేయదూ! తెలతెలవారుతుండగానే చెట్ల మీద ఉండే పక్షులు బద్ధకాన్ని వదిలించుకునే క్రమంలో ఒళ్ళు విరుచుకుంటూ, రెక్కల సవరింపులో చేసే విదిలింపులు, టపటపలు, గొంతు సవరించుకుంటూ చేసే కిల కిలకిలలు ఉదయపు నడకలో ఉన్నవారికి నిత్యానుభవమే. తెల్లవారుతోందన్న సంగతిని సూచిస్తూ... కొక్కోరో కో.. అని కుక్కుటం చేసే శబ్దం మేలుకొలుపుకు చిహ్నం. సూర్యాస్తమయాన్ని సూచించే ఇంటికి వడివడిగా చేరుకునే పశువుల గిట్టల శబ్దాలు ఒక వింత ధ్వనిని చేస్తూ... ముచ్చటను కలుగచేస్తాయి. ఈ భూమి మీద జంతువులు కూడ నివసిస్తున్నాయి. మనుషుల స్వరాలలోని వైచిత్రి వాటిలో కూడ చూస్తాము. అడవికి రాజుగా భాసిల్లే సింహం చేసే గర్జన, మదమెక్కిన గజరాజు పెట్టే ఘీంకారం, చెడు భావనను కలిగించే నక్కల ఊళలు, పాము బుసలు, శిరోభారాన్ని, చికాకును కలిగించే కీచురాళ్ళ ధ్వనులు మనలను భీతిల్లేటట్లు చేస్తాయి. మానవ ప్రమేయం లేక ప్రకృతి చేసే శబ్దాలను అనాహతమని, మానవ ప్రేరితంగా వచ్చే శబ్దాలను లేదా ఆహతమని అంటారు. మన ఊపిరి నిలిపేందుకు నిరంతరం పరిశ్రమించే ఊపిరితిత్తుల ఉచ్వాస నిశ్వాసాలలో ఓ లయ ఉంది. శ్రుతి ఉంది. ఇవి సంగీత ధ్వనులే. మన ప్రాణాన్ని నిలిపే గుండె లబ్.. డబ్ ల ధ్వనిని ఎంత లయబద్ధంగా చేస్తుంది! శ్రుతి లయలలో రవ్వంత అపశ్రుతి వచ్చినా ఫలితం మరణమే కదా! మన శరీరాన్ని.. నాదమయం.. అన్నారు ప్రాజ్ఞలు. నాదం ఒక ప్రాణశక్తి. సంగీతానికి మనసును పరవశింపచేసే శక్తి ఉంది. ఒక గొప్ప సంగీత గాత్రధారి ఆలాపన చాలు మనల్ని తన్మయులను చేయటానికి. మాటను చక్కగా ఉచ్చరిస్తూ, కావలసిన ఊనికనిస్తూ మాటలలోని భావాన్ని గొంతులో పలికిస్తూ భాషించే వ్యక్తి సంభాషణ శ్రోతలనలరిస్తుంది. ఈ పోహళింపులకు మాధుర్యాన్ని జోడిస్తూ పాడగల పశువుల కాపరి పాట మనలను ఎంతగా అలరించగలదో, అంతగానే ఉన్నత శ్రేణి కి చెందిన సంగీతకళాకారుని త్యాగరాజ కీర్తన కూడ. ఇంతటి మహత్తును కలిగి ఉన్న సంగీతాన్ని భూమి మనకు నాదరూపంలో అందిస్తుంది. దీన్ని ఆనందించి పరవశించి, దాన్ని ఒక అనుభూతి చేసుకుని మనసు పొరల్లో పొదవుకోగల ఏకైక బుద్ధిజీవి మానవుడు ఒక్కడే. భూమి తన సంగీతంతో మన మనస్సుకు ఎంతో ప్రశాంతతను, సాంత్వన చేకూర్చి మనలను ఆనంద రసజగత్తులోవిహరించేయగల ఓ గొప్ప సంగీతజ్ఞురాలు. ఈ ఆనందస్థితిలో మనిషి తన విధిని చక్కగా నిర్వర్తించగలడు. ఈ ఆనందమే స్వర్గమైతే దీన్ని మనకు అందచేసే భూమి స్వర్గ తుల్యమే. దీన్ని మనం కాపాడుకోవాలి. సంరక్షించుకోవాలి. జీవనశైలి, నాగరికత, సాంకేతికతలనే పేరుతో దీన్ని విధ్వంసం చేసే హక్కు మనకెక్కడుంది? ఇప్పటికే ఈ గ్రహం మీద మన జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నాం. ఈ భూ గ్రహాన్ని పూర్తిగా ఓ అగ్నిగుండంగా మార్చి భావితరానికి కానుకగా ఇద్దామా! ప్రస్తుతానికి మనిషి నివసించే, నివసించగల ఒకే ఒక గ్రహం ఈ భూమి. మన ముందు తరాలు, మన తరం నివసించిన ఈ.. ఆనందనిలయాన్ని... ముందు తరాలకు అందించే బాధ్యత మనందరిదీ. పక్వానికొచ్చిన పంటను పడతులు ఒకచేత ఒడుపుగా పట్టుకుని మరొక చేత కొడవలితో కోసే వేళ అది చేసే శబ్దంలో క్రమముంటుంది. అది సంగీతమే! కోసిన కంకులను మోపులుగా కళ్లాలలో కర్రలతో కొడుతున్నవేళ, తూర్పార పట్టే వేళ చేట చెరుగుళ్ల శబ్దాలు ఒక వింత ధ్వనిని చేస్తాయి. ఎంత ఆహ్లాదాన్నిస్తాయి! ఒకనాటి పల్లెటూళ్లు చక్కని సంగీత కచేరిలు చేస్తుండేవి. పాలు పితికే క్షణాన ఆ ధార పాత్రను తాకుతున్నప్పుడు వచ్చే ధ్వనికి ఓ లయ ఉంది. తరుణులు పెరుగును చిలికే వేళ కవ్వం, కవ్వపు తాడు చేసే ధ్వని, కవ్వపు గుత్తి కుండను తాకే శబ్దానికి ఎంత లయ! వీటికి తోడు అ ఆ మగువల చేతిగాజులు చేసే ధ్వని ఓ నాదమే. –బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
హుజురాబాద్ ఉపఎన్నికల్లో తెలంగాణ ద్రోహులను తరిమికొట్టాలి : ఏ .చంద్రశేఖర్
-
బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ మంత్రి
సాక్షి, వికారాబాద్ : కాంగ్రెస్ మాజీ మంత్రి డా.ఏ.చంద్రశేఖర్ బీజేపీలోకి చేరారు. వికారాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు కేసీఆర్ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని, మోడీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని తెలిపారు. సర్పించ్‌ని కలెక్టర్ సస్పెండ్ చేసే జీవో తెచ్చిన కేసీఆర్..సీఎంను కూడా సీఎస్ సస్పెండ్ చేసే జీవో తేవాలని డిమాండ్ చేశారు. తలనరుక్కుంటా అని గతంలో స్టేట్మెంట్ ఇచ్చిన కేసీఆర్ ఆత్మహత్య చేసుకుంటా అన్నారు..ఆత్మహత్య నేరం.. 309 సెక్షన్ కింద కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని తెలిపారు. వికారాబాద్‌ని చార్మినార్ జోన్లో కలపాలని డిమాండ్ చేశారు. -
మా ప్రాణాలను పణంగా పెట్టలేం: చంద్రశేఖర్ రెడ్డి
-
'ఉద్యోగుల ఉసురు టీడీపీకి తగులుతుంది'
సాక్షి, విజయవాడ : శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లు పాస్ కాకపోవడం వల్లనే ఉద్యోగులకు జీతాలు రాలేదని, అందుకు టీడీపీ ఎమ్మెల్సీలే కారణమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ' టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడంతోనే మాకు జీతాలు రాలేదు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మా ఉద్యోగుల ఉసురు టీడీపీ ఎమ్మెల్సీలకు తగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 1 తేదీన జీతాలు రావాలి. జీతాలు రాక ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో మూడు నెలలకు ఆర్డినెన్స్ తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారు.. పది లక్షల మంది ఉద్యోగులు పెన్సర్స్ జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు.యాబై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలా మండలిలో జరగలేదు.. మాజీ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కౌన్సిల్ లో ఉండి కూడ ఉద్యోగులు మేలు జరలేదు.. అశోక్ బాబు ఉద్యోగులకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా ద్రవ్యవినిమాయ బిల్లును అడ్డుకున్నారు.' అంటూ తెలిపారు. (ఈఎస్ఐ స్కాంతో సంబంధం లేదని చెప్పగలరా ?) ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ' పథకం ప్రకారం మండలి చైర్మన్ ద్రవ్యవినిమయ బిల్లును అడ్డుకున్నారు. బిల్లును అడ్డుకోవడానికి టీడీపీ ఎమ్మెల్సీలు పావుగా వాడుకున్నారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించారు. జీతాలు రాక ఉద్యోగులు అనేక ఇబ్బంది పడుతున్నారు..కౌన్సిల్ లో టీడీపీ ఎమ్మెల్సీ లు వ్యవహరించిన తీరును తీవ్రంగా కండిస్తున్నాము. బిల్లు పాస్ కాకపోతే జీతాలు రావని తెలిసి కూడా అశోక్ బాబు మాట్లాడకపోవడం దారుణం.' అంటూ వెల్లడించారు. (ఏపీలో 845 కొత్త పాజిటివ్ కేసులు) -
లోకోపైలట్ ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్ లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ (35) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు నాంపల్లి కేర్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నామన్నారు. ఎంఎంటీఎస్ కేబిన్‌లో ఇరుక్కొనిపోవడం వల్ల తీవ్రంగా గాయపడినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ సుష్మ తెలిపారు. ఈ మేరకు మంగళవారం చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కిడ్నీ దెబ్బతినడంతో డయాలసిస్ చేస్తున్నట్లు చెప్పారు. కాళ్లకు రక్తప్రసరణ తగ్గిందని, ఇప్పటికిప్పుడు సర్జరీ చేసే పరిస్థితి లేనందున ప్రధాన విభాగాలకు చెందిన వైద్య నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. చంద్రశేఖర్ శరీరమంతా గాయాలతో నిండి ఉందని, పక్కటెముకలు విరిగాయని చెప్పారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగానే ఒకసారి కార్డియాక్ అరెస్ట్ అయినట్లు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తే తప్ప పరిస్థితి చెప్పలేమన్నారు. మరోవైపు రైలుప్రమాదంలో గాయపడి నాంపల్లి కేర్ ఆసుపత్రిలో మరో ఆరుగురు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. బేబి సుష్మిత సహా సాజిద్ అబ్దుర్ రషీద్ షేక్, పి. శేఖర్, రాజ్‌కుమార్, పి.బాలేశ్వరమ్మ, మహ్మద్ ఇబ్రహీంకు వైద్యసేవలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం రైల్వేలో చేరిన చంద్రశేఖర్... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిరంగుల దిబ్బకు చెందిన లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ డెక్కపాటి 2011లో ఉద్యోగంలో చేరాడు. కాచిగూడ నెహ్రూనగర్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్ రైల్వే డివిజన్ మెకానిక్ విభాగంలో చేరి లోకోపైలట్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య సలై, కుమారుడు ఇమ్మాన్యుయెల్ రాజ్ (3) ఉన్నారు. 15 రోజుల క్రితం మరో బాబు పుట్టాడు. భార్య, పిల్లలు ఏలూరులో ఉన్నారు. -
లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉంది
-
వీఆర్వోలను వెంబడించి మరీ దాడి చేశారు..
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో ఇసుకు మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు రెవెన్యూ సిబ్బందిని వెంబడించి మరీ తలలు పగులగొట్టారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా నైరాలో చోటుచేసుకుంది. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వరావు గతరాత్రి సంఘటనా స్థలానికి వెళ్లారు. దీంతో ఇసుక మాఫియా దుండగులు ఒక్కసారిగా రెచ్చిపోయి కర్రలతో మూకుమ్మడిగా దాడికి చేశారు. ఈ ఘటనలో వీఆర్వోలు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఇసుక మాఫియా దాడులపై జిల్లా కలెక్టర్ జె.నివాస్ సీరియస్ అయ్యారు. రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసినవారిని వదిలేదని లేదని ఆయన స్పష్టం చేశారు. రాత్రి, పగలు అనకుండా రెవెన్యూ సిబ్బంది ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నారని కలెక్టర్ ప్రశంసించారు. రాజకీయ ఒత్తిడికి లొంగకుండా కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ ఆదేశించారు. కాగా ఇసుక మాఫియా దాడిలో గాయపడి, రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీఆర్వోలను జిల్లా కలెక్టర్ నివాస్, జాయింట్ కలెక్టర్ చక్రధర్ బాబు పరామర్శించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శ్రీకాకుళం జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా -
తన హత్యకు తానే గొయ్యి తీసుకున్నాడు
అంబర్‌పేట : గుప్త నిధుల ఆశ అతని ప్రాణం తీసింది. హత్యకు గురయ్యే వరకు అతను గుప్త నిధుల మైకంలోనే ఉన్నాడు. తనను పూడ్చిపెట్టేందుకు గొయ్యి తీయడంలోనూ నిందితులకు సహాయపడ్డాడు. తననే గోతిలో వేసి హత్య చేస్తారని పసిగట్టలేక పోయాడు.30 రోజులు తర్వాత హత్య కేసులో మిస్టరీ వీడిన సంఘటన అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిదిలో గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల సమీపంలోని కోడిమామిళ్లకు చెందిన చంద్రశేఖర్(47) దివ్యాంగుడు బతుకు దెరువు నిమిత్తం భార్య వరలక్ష్మితో నగరానికి వలసవచ్చి అంబర్‌పేట చెన్నారెడ్డి నగర్లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం అతడికి రైలులో సుల్తాన్ బజార్ సీఎస్‌లో హోం గార్డుగా పని చేస్తున్న గిద్దలూరుకు చెందిన వెంకటరామిరెడ్డితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. తరచూ చంద్రశేఖర్ ఇంటికి వచ్చి వెళేకల వెంకటరామిరెడ్డి, చంద్రశేఖర్ భార్య వరలక్ష్మితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. దీనిని పసిగట్టిన చంద్రశేఖర్ భార్యను మందలించాడు. బంధువుల వద్ద పంచాయితీ పెట్టడంతో వరలక్ష్మి ఈ విషయాన్ని వెంకటరామిరెడ్డి చెప్పడంతో ఇద్దరూ కలిసి చంద్రశేఖర్ హత్యకు పథకం రచించారు. గుప్త నిధుల బలహీనత ఆసరాగా... చంద్రశేఖర్‌కు గుప్త నిధుల ఆశ ఉన్నట్లు తెలుసుకున్న వెంకటరామిరెడ్డి గత నెల జనవరి 11న అతడిని మంచాల పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతాలోకి తీసుకువెళ్లి అక్కడ గుప్త నిధులు ఉన్నట్లు చెప్పడంతో ఇద్దరూ కలిసి గొయ్యి తవ్వారు. అనంతరం అదే నెల 13న నిధులను తీసుకుందామని అదే ప్రాంతానికి తీసుకెళ్లాడు. పథకంలో భాగంగా వెంకటరామిరెడ్డి తన బంధువు రమేష్‌రెడ్డిని ఎల్బీ నగర్‌కు పిలుపించుకున్నాడు. ముగ్గురు కలిసి అక్కడే మద్యం కోనుగోలు చేసి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న చంద్రశేఖర్‌ను హత్య చేసి, మంచాల పోలీసు స్టేషన్ పరిధిలో గోతిలో పుడ్చిపెట్టారు. తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు... అనంతరం చంద్రశేఖర్ భార్య వరలక్ష్మి తన భర్త కనిపించడం లేదని జనవరి 24న అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరలక్ష్మి, ఆమె ప్రియుడు వెంకటరామిరెడ్డిపై చంద్రశేఖర్ బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వెంకటరామిరెడ్డిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి పూడ్చిపెట్టి మృత దేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన నగరంలోని అంబర్‌పేట, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మంచాల పోలీసు స్టేషన్ల పరిధిలో చోటు చేసుకోవడం గమనార్హం. -
ఏపీఎన్జీవో కొత్త అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌రెడ్డి
-
కాంగ్రెస్‌కు గుడ్‌బై
బరంపురం:బరంపురం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 10 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికార బీజేడీలో ఆదివారం చేరారు. అధికార బీజేడీ ఆపరేషన్ ఆకర్‡్ష పేరుతో ఇతర పార్టీ నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటుంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర్ సాహు ఇటీవలే అధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆయన వెంట వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. బీజేడీలో చేరిన వారు 4వ వార్డు కార్పొరేటర్ అనిల్ నాయక్, 5వ వార్డు కార్పొరేటర్ మురళీకృష్ణ, 6వ వార్డు కార్పొరేటర్ రంజిత్ నాయక్, 20వ వార్డు కార్పొరేటర్ లిల్లి బెహరా, 21వ వార్డు కార్పొరేటర్ గీతా మాధురి, 29వ వార్డు కార్పొరేటర్ సంజుక్త్ పాత్రో, 32వ వార్డు కార్పొరేటర్ ప్రియాంక చౌదరి, 33వ వార్డు కార్పొరేటర్ ఎమ్.మీనాక్షి, 34వ వార్డు కార్పొరేటర్ శ్రీనివాసరావు, 40వ వార్డు కార్పొరేటర్ మినతి బిశాయిలు కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర్ సాహు సమక్షంలో అధికార బీజేడీలో చేరారు. వీరంతా ఈ నెల 4వ తేదీన స్థానిక కళ్లికోట్ మైదానంలో నిర్వహించే మిశ్రమ సమ్మేళన పర్బ్‌లో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో అధికారికంగా బీజేడీలో చేరనున్నారు. -
సినీ పరిశ్రమలో మరో విషాదం
సాక్షి, బెంగళూరు: కన్నడ సీనియర్ నటుడు ఈడకల్లు చంద్రశేఖర్ (63) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా కెనడాలోని ఒట్టావాలో ఆయన తల్లి, భార్య, కుమార్తెతో కలసి ఉండేవారు. శనివారం తెల్లవారుజామున ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మరణించినట్లు కుమార్తె తాన్య నిర్ధారించారు. చంద్రశేఖర్ బాలనటుడిగా సినిమాల్లోకి ప్రవేశించారు. పుట్టన్న కనగల్ దర్శకత్వం చేపట్టిన ఈడకల్లు గుడ్డమెలే చిత్రం ద్వారా ఆయన అందరికీ సుపరిచితుడు అయ్యాడు. ఆ సినిమా విజయం తర్వాత అదే ఆయన ఇంటి పేరుగా మారింది. సంపంతిగె సవాల్, హంసగీతె, రాజా నన్న రాజ, శివలింగ, అస్తిత్వ, మొగ్గియ కనసు, శంకర్ గురు వంటి కొన్ని సినిమాలు చేశారు. పూర్వపర అనే చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఈ సినిమాను పలు విదేశీ చిత్రోత్సవాల్లో ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు. ఆయన సినీ ప్రస్థానంలో 60 చిత్రాల్లో నటించారు. ఆయన చివరి చిత్రం.. 3 గంటె 30 దిన 30 సెకండ్. ఈ సినిమా ఈ నెలలోనే విడుదలయింది. ఆయన చాలాఏళ్ల కిందటే కెనడాకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కెనడాలోని భారత రాయబార కార్యాలయంలో వీసా అధికారిగా పనిచేశారు. చంద్రశేఖర్ అంత్యక్రియలు కెనడాలో నిర్వహిస్తున్నటు సన్నిహితులు తెలిపారు. బెంగళూరులో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటించారు. -
కూకట్‌పల్లిలో డ్రగ్స్ కలకలం!
సాక్షి, హైదరాబాద్ : ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో ఓ కంపెనీ యజమానిని మరో కంపెనీకి చెందిన వ్యక్తులు దారుణంగా హత్యచేసి పూడ్చివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లి సీఐ ప్రసన్నకుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన నేరెళ్ల చంద్రశేఖర్(40) ప్రశాంత్‌నగర్‌లో గాజు గ్లాస్‌ల కంపెనీ నిర్వహిస్తున్నాడు. గ్లాస్ తయారీ పరిశ్రమ ముసుగులో అతడు డ్రగ్స్‌సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2017 జనవరిలో డ్రగ్స్ కేసులో చంద్రశేఖర్ జైలుకు వెళ్లివచ్చాడు. కాగా డ్రగ్స్ కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన కెమికల్ కంపెనీ నిర్వాహకుడు భూషణ్‌పాండే, సంతోష్‌సింగ్, మత్స్యగిరిలతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గత నెల 16న చంద్రశేఖర్ వద్ద నుంచి డబ్బులు రాబట్టేందుకుగాను వారు తమ అనుచరులతో కలిసి పథకం పన్నారు. చంద్రశేఖర్‌ను స్థానిక కార్పొరేషన్ బ్యాంక్ వద్దకు రప్పించి అక్కడి నుంచి కారులో కొంపల్లికి తీసుకువెళ్లారు. తమకు రూ. రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వద్ద డబ్బులేదని చంద్రశేఖర్ చెప్పడంతో ఆగ్రహానికి గురైన మత్సగిరి, భూషణ్‌ఫాండే, సంతోష్‌సింగ్ తమ అనుచరులు మరో 9 మందితో కలిసి అతడిని చితకబాదడంతో మృతి చెందాడు. అనంతరం వారు మృతదేహాన్ని కొర్రేముల గ్రామ సమీపంలోని ఔటర్‌రింగ్ వద్ద పూడ్చిపెట్టారు. తన భర్త కనిపించడంలేదని చంద్రశేఖర్ భార్య శోభ సెప్టెంబర్ 18న కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టగా హత్య విషయం వెలుగుచూసింది. దీంతో మత్సగిరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఎంటెక్ విద్యార్థి మృతి
-
రోడ్డు ప్రమాదంలో ఎంటెక్ విద్యార్థి మృతి
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఎంటెక్ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం ఉదయం కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తాకొట్టడంతో.. బైక్‌పై అరుణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ చంద్రశేఖర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గుంతల కారణంగా నగరంలో ఇప్పటివరకూ ఏడుగురు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా ఉద్యోగినులకు లైంగిక వేధింపులు