ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహంతో కంట్రోల్ తప్పారు. ఖర్గే ఆవేశంలో బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. నేను మీ తండ్రి సహచరుడిని.. మీరు నాకు చెప్పేదేంటి.. నోరు మూసుకుని కూర్చోండి అంటూ కౌంటరిచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నేడు రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తున్న సమయంలో మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనై, సహనం కోల్పోయిన ఖర్గే.. ఆయనపై విరుచుకుపడ్డారు. అనంతరం, ఖర్గే మాట్లాడుతూ..‘నేను మీ తండ్రి సహచరుడిని. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్?. నేను నిన్ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. నోరు మూసుకుని కూర్చో’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఖర్గే వ్యాఖ్యల కారణంగా రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కల్పించుకున్నారు. ఇరు వర్గాలను ప్రశాంతంగా ఉండాలని కోరారు. మాజీ ప్రధానమంత్రి గురించి తన ప్రస్తావనను ఉపసంహరించుకోవాలని ఖర్గేకు సూచించారు. అలాగే, చంద్రశేఖర్ ఎంతో ప్రజాదరణ కలిగిన నేత అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నీరజ్ శేఖర్ 2019లో బీజేపీలో చేరారు. ఆయన తండ్రి చంద్ర శేఖర్ దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన సోషలిస్ట్ నాయకులలో ఒకరిగా పరిగణించబడతారు. చంద్ర శేఖర్.. అక్టోబర్ 1990 నుండి జూన్ 1991 వరకు ఆరు నెలలు ప్రధానమంత్రిగా పనిచేశారు.
Kharge ji 🤣🤣🔥
pic.twitter.com/7YKfvkwgad— Darshni Reddy (@angrybirdtweetz) February 3, 2025
Comments
Please login to add a commentAdd a comment