Parliament Budget session
-
వక్ఫ్ బోర్డుపై జేపీసీ నివేదిక.. రాజ్యసభలో గందరగోళం
న్యూఢిల్లీ: ఈరోజు(గురువారం) పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి దశలోని చివరి రోజు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఉభయ సభల్లో హంగామా నెలకొంది. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) నివేదికను బీజేపీ ఎంపి మేధా కులకర్ణి ప్రవేశపెట్టారు. మరోవైపు లోక్‌సభలో ఇదేవిధమైన గందరగోళం నెలకొన్న నేపధ్యంలో సభా కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.రాజ్యసభలో జేపీసీ నివేదికపై ప్రతిపక్షాల ప్రశ్నలకు కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. తన మంత్రిత్వ శాఖ సభ్యులు జేపీసీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిపక్షాలు నివేదికను చదివి, ఆపై స్పందించాలని ఆయన కోరారు. ప్రశ్నలు లేవనెత్తే వారు కూడా జేపీసీ సభ్యులేనని ఆయన అన్నారు.వక్ఫ్ బిల్లుపై సభలో ప్రవేశపెట్టిన జేపీసీ నివేదికను ప్రతిపక్షం అంగీకరించబోదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దానిని చర్చ కోసం వెనక్కి పంపాలని ఆయన ఛైర్మన్‌ను అభ్యర్థించారు. వక్ఫ్ బిల్లుపై ఏ పార్టీ అభిప్రాయాన్నీ పరిగణలోకి తీసుకోలేదని ఖర్గే అన్నారు. వక్ఫ్ బోర్డుపై జేపీసీ నివేదికపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది.జేపీసీ జనవరి 30న ముసాయిదా నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఈ నివేదికను 655 పేజీలలో పొందుపరిచారు. 16 మంది సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 11 మంది సభ్యులు వ్యతిరేరించారు. కమిటీలోని ప్రతిపక్ష ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించారు. కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు(గురువారం) పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టం-1961ని సరళీకరించడం ద్వారా, ఆదాయపు పన్ను చట్టాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చేయడమే దీని లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రస్తుత ఆదాయపు పన్ను-1961 కంటే శరళమైనది. అయితే దీనిలో మరిన్ని విభాగాలు, షెడ్యూళ్లు ఉన్నాయి. 622 పేజీల కొత్త బిల్లులో 23 అధ్యాయాలు, 16 షెడ్యూల్లలో 536 విభాగాలు ఉన్నాయి. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలో 298 విభాగాలు, 14 షెడ్యూల్లు ఉన్నాయి. 880 పేజీలు. కాగా పార్లమెంటులో లోక్‌సభ కార్యకలాపాలు ఐదు నిమిషాలు మాత్రమే కొనసాగాయి. ప్రతిపక్షం గందరగోళం సృష్టించడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్ -
భారతీయుల తరలింపుపై కేంద్రం రియాక్షన్ ఇదే
Parliament Session Live Updates..అమెరికా నుంచి భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందించింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అక్రమ వలసలపై రాజ్యసభలో ప్రకటన చేశారు. అక్రమ వలసలను అరికట్టడానికి మేం ప్రయత్నిస్తున్నాం. కొందరు అక్రమంగా వలసలు వెళుతున్నారు. ఈ ప్రయాణంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డిపోర్టేషన్ అనేది కొత్త విషయం కాదు. 2009 నుంచి జరుగుతుంది. అన్ని దేశాల అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించి వేస్తోంది. ఈ జర్నీలో వారికి కావాల్సిన ఆహారం, మెడిసిన్ అందిస్తోంది. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడం అమెరికా విధానం’ అని జయశంకర్ వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటన..అమెరికా నుంచి భారతీయుల అమానవీయ తరలింపుపై పార్లమెంట్లో ప్రకటన చేయనున్న కేంద్రంమధ్యాహ్నం రెండు గంటలకి రాజ్యసభ, మూడు మూడు గంటలకి లోక్‌సభలో ప్రకటన చేయనున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్అమెరికా నుంచి భారతీయులను అమానవీయంగా తరలించడంపై ఉదయం నుంచి పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన చేస్తున్న విపక్షాలుపార్లమెంట్ వద్ద విపక్ష పార్టీ ఎంపీల నిరసన..అమెరికా నుంచి భారతీయుల రాక విషయంపై విపక్ష పార్టీల నేతలు నిరనసలకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. #WATCH | MPs of the opposition parties including Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, Congress National President Mallikarjun Kharge, Samajwadi Party chief Akhilesh Yadav hold a protest outside the parliament over the issue of deportation of alleged illegal Indian… pic.twitter.com/aUCpbEOK1Q— ANI (@ANI) February 6, 2025 పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాభారతీయులను అమానవీయంగా అమెరికా బహిష్కరించడం పై ఉభయసభల్లో సభలో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలుఅమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపడం, అగౌరవపరచడంపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. సభలో చర్చ జరపాలని వాయిదా తీర్మానాలు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలుకాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలను తిరస్కరించిన ఉభయసభల సభాపతులువాయిదా తీర్మానాలను తిరస్కరించడం పై కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీల ఆందోళనఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.👉పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేటి సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపడంపై ఉభయ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీంతో, లోక్‌సభలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది.Lok Sabha adjourned till 12 noon amid ruckus following Opposition MPs' demand to discuss the issue of deportation of Indian nationals who were allegedly illegally living in the US. pic.twitter.com/UTPMln1Mzp— ANI (@ANI) February 6, 2025 👉పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపడంపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. లోక్‌సభలో ఎంపీ మాణిక్యం ఠాగూర్, రాజ్యసభలో రేణుకా చౌదరి వాయిదా తీర్మానం అందజేశారు. దీనిపై ఉభయ సభల్లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.Congress MP Renuka Chowdhury gives Suspension of Business Notice in Rajya Sabha under Rule 267 to discuss the deportation of Indian nationals who were allegedly illegally living in the US. "The entire exercise of reportedly deporting 20,407 Indian immigrants could have… pic.twitter.com/rQoUbqReYY— ANI (@ANI) February 6, 2025 -
రాజ్యసభలో నోరుపారేసుకున్న ఖర్గే.. బీజేపీ ఎంపీ సీరియస్!
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహంతో కంట్రోల్ తప్పారు. ఖర్గే ఆవేశంలో బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. నేను మీ తండ్రి సహచరుడిని.. మీరు నాకు చెప్పేదేంటి.. నోరు మూసుకుని కూర్చోండి అంటూ కౌంటరిచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నేడు రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తున్న సమయంలో మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనై, సహనం కోల్పోయిన ఖర్గే.. ఆయనపై విరుచుకుపడ్డారు. అనంతరం, ఖర్గే మాట్లాడుతూ..‘నేను మీ తండ్రి సహచరుడిని. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్?. నేను నిన్ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. నోరు మూసుకుని కూర్చో’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఖర్గే వ్యాఖ్యల కారణంగా రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కల్పించుకున్నారు. ఇరు వర్గాలను ప్రశాంతంగా ఉండాలని కోరారు. మాజీ ప్రధానమంత్రి గురించి తన ప్రస్తావనను ఉపసంహరించుకోవాలని ఖర్గేకు సూచించారు. అలాగే, చంద్రశేఖర్ ఎంతో ప్రజాదరణ కలిగిన నేత అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నీరజ్ శేఖర్ 2019లో బీజేపీలో చేరారు. ఆయన తండ్రి చంద్ర శేఖర్ దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన సోషలిస్ట్ నాయకులలో ఒకరిగా పరిగణించబడతారు. చంద్ర శేఖర్.. అక్టోబర్ 1990 నుండి జూన్ 1991 వరకు ఆరు నెలలు ప్రధానమంత్రిగా పనిచేశారు.Kharge ji 🤣🤣🔥pic.twitter.com/7YKfvkwgad— Darshni Reddy (@angrybirdtweetz) February 3, 2025 -
ఈ అన్యాయాన్ని ఆంధ్రా ప్రజలు క్షమించరు: ఎంపీ మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే పార్టీలకతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో ఆయన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించవద్దు. ఒరిజినల్‌గా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 194 టీఎంసీలు. ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారు. ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేది ఉద్దేశం. కానీ, 41.15 మీటర్లకు ప్రాజెక్టును తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారు. దీనివల్ల పోలవరం కెపాసిటీ 194 నుంచి 115 టీఎంసీలకు పడిపోతుంది. ఈ తగ్గించడం వల్ల కేవలం 3.2 లక్షల ఎకరాలకి నీరు అందుతుంది. ఇది రైతులకు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్లే. ఈ అన్యాయం ఎదిరించేందుకు టిడిపి ఎంపీలతో కలిసి పోరాటానికి సిద్ధం. లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు’’ అని అన్నారాయన. ‘‘ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పుడు పోలవరం కెపాసిటీని తగ్గించారు. విభజన చట్టం మేరకు ఒరిజినల్ గా ఉన్న పోలవరం సామర్ధ్యాన్ని కొనసాగించాలి. కెపాసిటీ తగ్గించిన తర్వాత బనకచర్లకు నీరు ఎలా అందుతుంది?. రాయలసీమకు నీరేలా ఇస్తారు? అని ప్రశ్నించారాయన. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 👉ఏపీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని మెల్లగా రద్దు చేస్తున్నారు. ఇంగ్లీష్ చదివితేనే విదేశాల్లో కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉంది. ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు కొనసాగించాలి. 👉ఆర్బీఐ నిబంధనల విరుద్ధంగా మార్గదర్శి సంస్థ రూ. 2,600 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది. ప్రజల డబ్బును ఇతర కంపెనీలకు మళ్ళించారు. సహారా, శారద కుంభకోణం కంటే మార్గదర్శక కుంభకోణం పెద్దది. మార్గదర్శిపై రూ. 1,000 కోట్ల రూపాయల జరిమానా విధించారు. డిపాజిటర్ల డబ్బు తిరిగి చెల్లించకుండా వాటిని రెన్యువల్ చేస్తున్నారు. మార్గదర్శి కుంభకోణం పై దర్యాప్తు జరపాలి. ఈ అంశంపై ప్రధాని జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలి👉విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జిందాల్ గ్రూపును పిలిచి మాట్లాడాలి. 👉విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి -
భారత్‌పై అన్ని దేశాల కన్ను
-
వికసిత భారతమే ఏకైక లక్ష్యం..
-
Watch Live: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
-
భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మారుస్తాం: రాష్ట్రపతి
👉 వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయి. బడ్జెట్లో రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం ఉంటుంది. వికసిత్ భారత్ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. మూడోసారి మా ప్రభుత్వం మూడు రెట్లు అధిక వేగంతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. వ్యవసాయ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది ఇంటి కల నెరవేర్చాం. కోట్లాది మందిని ప్రభుత్వం పేదరికం నుంచి బయటపడేసింది. మూడు కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నాం.👉మహాకుంభమేళాలో కోట్లాది మంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. మహాకుంభమేళా భారత సంస్కృతికి చిహ్నం. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు నివాళి అర్పిస్తున్నాను.👉 ఇటీవల 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది సొంత ఇంటి కల నెరవేరబోతుంది. అమృత్‌భారత్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.👉 వందో ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఇస్రో భారత కీర్తి పతాకం ఎగురవేసింది. స్పేస్ డాకింగ్‌తో మరో అడుగు ముందుకేశాం. అంతరిక్షంలో భారతీయుడు అడుగుపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మేకిన్ ఇండియాతో అద్భుత విజయాలు సాధిస్తున్నాం. ఇండియా ఏఐ మిషన్‌ను ప్రారంభించాం. సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ నేరాలు, డిజిటల్ నేరాల నుంచి బయటపడేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రపంచస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం.👉 ఖేలో ఇండియా మన దేశ యువతకు ఎంతో ఉపయోగకరం. మన దేశ మహిళలు ఒలంపిక్స్‌లో పథకాలు సాధిస్తున్నారు. మహిళా సాధికారిత కోసం డ్రోన్ దీదీ పథకం తీసుకువచ్చాం. లక్షా 15వేల మంది మహిళలు లక్పతి దీదీలుగా మారారు. మూడు లక్షల మంది మహిళలను లక్పతి దీదీలుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. డ్రోన్ దీదీ స్కీమ్ మహిళలకు ఉపయోగపడుతోంది. మధ్య తరగతి కుటుంబాలకు హోం లోన్స్ ఇస్తున్నాం. దేశంలో 70 ఏళ్లు దాటిన ఆరు కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తాం. రైతులను ఆదుకునేందుకు, వారి ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. యువతను వారి వారి మాతృ భాషల్లో ఎడ్యుకేట్ అయ్యేలా ప్రోత్సహిస్తున్నాం. 👉 భారత ఆర్థిక వ్యవస్థకు చిరు వ్యాపారులే కీలకం. భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మారుస్తాం. టెక్నాలజీ రంగంలో భారత్ అద్భుతంగా దూసుకుపోతోంది. డిజిటల్ చెల్లింపుల్లో రికార్డులు సాధిస్తున్నాం. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. ఎంఎస్ఎంఈ కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీం తీసుకొచ్చాం. 👉 వైద్య, ఆరోగ్య రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నూతన టెక్నాలజీ తీసుకొచ్చాం. దేశవ్యాప్తంగా చాలా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాం. టీబీ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతున్నాం. తక్కువ ధరకే క్యాన్సర్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చాం.👉 ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జిని కశ్మీర్లో నిర్మించాం. దేశంలో మెట్రో వ్యవస్థలను వేగంగా విస్తరిస్తున్నాం. ఢిల్లీలో మెట్రో వ్యవస్థను విస్తరిస్తున్నాం. స్వచ్చమైన నీటి కోసం నదులను అనుసందానం చేస్తున్నాం. దేశంలో పౌరవిమానయాన రంగం అభివృద్ధి చెందుతోంది. రైతులు, పరిశ్రమలు, సైన్స్‌పై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.👉చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు. ఆదివాసీల్లో సికెల్‌సెల్ వ్యాధిని నివారించాం. మహిళలతోనే ఆర్థిక అభివృద్ధి అని మా ప్రభుత్వం నమ్ముతోంది. దళితుల కోసమే కొన్ని ప్రత్యేక పథకాలు తీసుకువచ్చాం. వన్ నేషన్-వన్ ట్యాక్స్ అభవృద్ధి చేశాం. 👉త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్ అవతరించబోతుంది. భారత రాజ్యాంగానికి నా సెట్యూట్. వక్ఫ్ బోర్డులో సంస్కరణపై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మహిళా సాధికారితకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందరికీ ఫలాలు అందాలన్నదే మా ఉద్దేశ్యం. 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తాం. దేశాభివృద్ధికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.70వేల కోట్లు కేటాయించాం. ట్యాక్స్ విధానాలను సరళీకరించాం. ఉద్యోగుల కోసం ఎనిమిదో వేతన సంఘాన్ని నియమించాం. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. పేదలకు లబ్ధి కలిగిస్తున్నాయి. President Murmu says, "My government is committed to fulfilling the dream of the middle class of having their own house..." pic.twitter.com/Y58sa0z61Z— ANI (@ANI) January 31, 2025 👉మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇటీవల మరణించిన పార్లమెంట్ సభ్యలకు ఉభయ సభలు సభ్యులు నివాళి అర్పించారు. 👉బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. President Droupadi Murmu to address the joint sitting of both Houses of Parliament, shortlySource: DD News pic.twitter.com/2RVQS79blX— ANI (@ANI) January 31, 2025👉కాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వద్ద ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. మూడోసారి దేశ ప్రజలు మాకు విజయాన్ని అందించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పాన్ని పరిపూర్ణం చేస్తాం. వికసిత్ భారత్‌కు ఈ బడ్జెట్ ఊతమిస్తుంది. దేశంలోని పేదలు, మధ్య తరగతిపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ప్రార్థిస్తున్నాను. 👉ఈ సమావేశాల్లో చర్చకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను. దేశాన్ని భౌగోళిక, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తాం. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాను. దేశాన్ని భౌగోళిక, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తాం. ఈ బడ్జెట్ భారతీయులకు నూతన శక్తిని ఇస్తుంది. ఈ బడ్జెట్ యువతకు ఆశాజనకంగా ఉంటుంది. చారిత్రాత్మక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెడతాం. వక్ఫ్, బ్యాంకింగ్, రైల్వేలు సహా 16 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నాం. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాను అని కామెంట్స్ చేశారు.#WATCH | #BudgetSession | PM Modi says, "I pray that Maa Lakshmi continues to bless the poor and middle class of our country. It is a matter of great pride that India completed 75 years as a democratic nation. India has established itself well on the global pedestal...This is the… pic.twitter.com/BF2dT2oTz9— ANI (@ANI) January 31, 2025 👉ఈరోజు సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్ధేశించి లోక్‌సభ హాల్లో ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను లోక్‌సభలో, రాజ్యసభలో ప్రవేశపెడతారు. శనివారం నిర్మల లోక్‌సభలో 2025–26 సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి రెండో తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ చర్చకు రాజ్యసభ, లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇస్తారు. బడ్జెట్ సమావేశాల తొలి సెషన్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 దాకా, రెండోసెషన్ మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ దాకా జరుగుతుంది. నిలదీసేందుకు విపక్షాల వ్యూహరచనమోదీ సర్కార్‌ను నిలదీసేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, కుంభమేళాలో అపశ్రుతి సహా కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, చైనా సరిహద్దు వివాదం వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని సైతం కొన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించి వాకౌట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై సీపీఐ, సీపీఎం పార్టీలు, చైనా సరిహద్దు వివాదాలు, రూపాయి పతనం, బడా కార్పొరేట్లకు మాత్రం అన్ని కాంట్రాక్టులు దక్కేలా కుట్ర వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధంచేశాయి. సహకరించాలన్న మోదీ సర్కార్శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు. దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలతో పాటు రాష్ట్రాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని పలు పార్టీలు డిమాండ్‌చేశాయి. మహాకుంభమేళాలో భక్తులను గాలికొదిలేసి వీఐపీ సంస్కృతికి యోగి ప్రభుత్వం జై కొట్టిందని, ఈ నిర్లక్ష్య ధోరణిపై చర్చ జరపాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పట్టుబట్టగా ఎజెండాలో ఏమేం ఉండాలో సభావ్యవహా రాల సలహా కమిటీ నిర్ణయిస్తుందని మంత్రి కిరెణ్ రిజిజు చెప్పారు.వక్ఫ్ సహా కీలక బిల్లులు ఈ సమావేశాల్లోనే.. ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును సమీక్షించేందుకు ఏర్పాటుచేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు గురువారం సమర్పించింది. వక్ఫ్ సవరణ బిల్లును గత ఏడాది లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టడం తెల్సిందే. కాగా గురువారం నాటి అఖిలపక్ష భేటీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను అఖిలపక్ష నేతలకు ప్రభుత్వం అందజేసింది. ఈ జాబితాలో వక్ఫ్ సవరణ బిల్లు సైతం ఉంది. 16 బిల్లులను ఈ సెషన్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉభయసభల ముందుకొచ్చే బిల్లుల జాబితాలో బ్యాంకింగ్ చట్టాల(సవరణ) బిల్లు, రైల్వే(సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ బిల్లు, చమురు క్షేత్రాల(సవరణ) బిల్లు, షిప్పింగ్ బిల్లు, వైమానిక వస్తువుల ప్రయోజనాల పరిరక్షణ బిల్లు, త్రిభువన్ సహకారీ యూనివర్సిటీ బిల్లు, వలసల, విదేశీయుల బిల్లు వంటివి ఉన్నాయి. -
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఢిల్లీ: రెండు విడతల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.ఫిబ్రవరి 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, బడ్జెట్లో ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి ప్రకటనలు చేయకూడదని.. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఏడాది చివరలో బీహార్ ఎన్నికలు జరగనున్నందున, రెండు మిత్రపక్షాలు జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) రెండూ రాష్ట్రానికి కీలకమైన ప్రకటనల కోసం ఆశిస్తున్నాయి.బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న వేతన జీవులు, రైతులు, కార్మికులు.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఎదురుచూస్తున్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ పరిమితి పరిధిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.7లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను పరిమితిని రూ. రూ.9 లక్షలకు పెంచనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.ఇదీ చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్: 16 మంది భారతీయులు మిస్సింగ్, 12 మంది మృతి -
పార్లమెంట్లో నీట్ మంటలు.. ధరేంద్ర ప్రధాన్‌పై రాహుల్ ఫైర్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే నీట్ పేపర్ లీక్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. సభలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వాడీవేడీ చర్చ జరిగింది.సభలో నీట్ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య. ఈ సమస్యను మూలాల నుంచి పెకిలించాల్సి ఉంది. మంత్రి(ధర్మేంద్ర ప్రధాన్) తనను తప్ప అందరినీ తప్పుపడుతున్నారు. డబ్బునోళ్లు పేపర్లు కొని వ్యవస్థను అపహాస్యం పాలు చేస్తున్నారు. డబ్బులు ఉన్న వాళ్లు విద్యా వ్యవస్థనే కొనేస్తున్నారు. పేపర్ లీక్ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. #WATCH | Congress MP and LoP in Rajya Sabha Rahul Gandhi says "It is obvious to the whole country that there is a very serious problem in our examination system, not just in NEET but in all the major examinations. The minister (Dharmendra Pradhan) has blamed everybody except… pic.twitter.com/GO76I0sLZt— ANI (@ANI) July 22, 2024 ఈ క్రమంలో రాహుల్‌కు ధర్మేంద్ర ప్రధాన్ కౌంటరిచ్చారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ..‘నీట్ పరీక్ష పేపర్‌లీక్‌పై సీబీఐ విచారణ జరుపుతోంది. నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకువచ్చింది. విద్యావ్యవస్థను రాహుల్ అపహస్యం చేయడం దారుణం’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | On NEET exam issue, Samajwadi Party MP Akhilesh Yadav says, "This government will make a record of paper leaks... There are some centres where more than 2,000 students have passed. As long as this minister (Education Minister Dharmendra Pradhan) is there, the students… pic.twitter.com/Sa95rPYZki— ANI (@ANI) July 22, 2024మరోవైపు.. నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో విపక్షాలు నిరసనలకు దిగాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ప్రతిపక్షనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీల్లో ఈ ప్రభుత్వం రికార్డు సృష్టించిందంటూ విపక్షాలు ఎద్దేవా చేశాయి. అలాగే, ధర్మేంద ప్రధాన్ ఎంపీగా ఉన్న నియోజకవర్గంలోని కొన్ని సెంటర్లలో రెండు వేల మందికిపైగా విద్యార్థులు పాసయ్యారు. దీనిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని విపక్ష నేతలు కామెంట్స్ చేస్తున్నారు. -
ఎల్లుండి నుంచే కేంద్ర బడ్జెట్ సమావేశాలు
బడ్జెట్ 2024 సమావేశాలు ఎల్లుండి (జులై 22) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025కి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను జూలై 23న ఉదయం 11:00 గంటలకు పార్లమెంట్లో సమర్పించనున్నారు. అంతకంటే ముందు జూలై 22న ఎకనమిక్ సర్వే విడుదల చేస్తారు.ఇప్పటికే 2024-25 బడ్జెట్ రూపకల్పన తుదిదశకు చేరుకుంది. దీనికి గుర్తుగానే ఇటీవల 'హల్వా' వేడుక ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని జరిగింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ హల్వాను బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న కార్యదర్శులు, అధికారులు, సిబ్బందికి పంపిణీ చేశారు.లోక్‌సభలో ఆర్థికమంత్రి ఈ నెల 23వ తేదీన మోదీ 3.0 ప్రభుత్వ మొదటి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇందులో ప్రధానంగా ఉద్యోగాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. వీటిపై కొన్ని ప్రత్యేక ప్రకటనలు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం ఉంది. ముడి పదార్థాలపై సుంకాలను తగ్గించడం వంటివి కూడా ఉండవచ్చు. లిస్టెడ్ ఈక్విటీ షేర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల ట్యాక్స్ కనీస హోల్డింగ్ వ్యవధిని ప్రస్తుత ఏడాది నుంచి 2 లేదా 3 సంవత్సరాలకు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర హరిత సాంకేతికతలలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు ట్యాక్స్ బెనిఫీట్ కల్పించే అవకాశం ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులలో గణనీయమైన పెట్టుబడులకు అవకాశం ఉంది. భారతదేశంలో కాలుష్య తీవ్రతను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద వికసిత భారత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. -
బడ్జెట్ పై మెగా కవరేజ్
-
జులై 21న అఖిలపక్ష సమావేశం.. టీఎంసీ డుమ్మా!
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలుఈ నెల 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జులై 21న (ఆదివారం) పార్లమెంట్ ఉభయసభల్లోని అన్నీ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ సెషన్, సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్రం సమావేశానికి ఆహ్వానించింది. జూలై 21న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని ప్రధాన కమిటీ రూమ్‌లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్) హాజరు కావడం లేదు. జులై 21న రాష్ట్ర అమరవీరుల దినోత్సవం నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరుకావడం లేదని టీఎంసీ ని ర్ణయించుకుంది.కాగా ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకావడం ఇదే తొలిసారి కానుంది. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఈ నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
PM Narendra Modi: మాకది దిష్టి చుక్క!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల పాలనా వైఫల్యాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టి చుక్కగా అభివర్ణించారు. దేశం అభివృద్ధి తాలూకు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని చెప్పారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు ధరించిన నల్ల దుస్తులు, ఆ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్ దేశ పురోగతి యాత్రకు దిష్టి తగలకుండా పెట్టిన ‘దిష్టి చుక్క’గా భావించవచ్చని పేర్కొన్నారు. రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీల పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారి వీడ్కోలుపై గురువారం సభలో జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. దారిచూపే దీపం మన్మోహన్ సింగ్ దేశానికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అందించిన సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. ఆయన ఆరుసార్లు రాజ్యసభ సభ్యులయ్యారని గుర్తుచేశారు. ‘‘మన్మోహన్ సింగ్ సుదీర్ఘకాలం పాటు దేశ ప్రజలకు అందించిన సహకారం, చేసిన మార్గదర్శకత్వం ఎప్పటికీ గుర్తుంటుంది. మన్మోహన్ వంటి విశిష్ట వ్యక్తులు దారి చూపే దీపం లాంటివారు. ఆయన నడవడిక నుండి సభ్యులంతా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి’’ అని సూచించారు. కొన్ని రోజుల క్రితం రాజ్యసభలో ఓ బిల్లుపై ఓటు వేసేందుకు మన్మోహన్æ చక్రాల కుర్చీలో వచ్చిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ‘‘పార్లమెంట్ సభ్యుడిగా తన కర్తవ్యాన్ని ఎంత బాధ్యతగా నిర్వహించారో చెప్పడానికి ఇదొక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలో వచ్చారు. ప్రజాస్వామ్యం గురించి ఎక్కడ చర్చ జరిగినా మన్మోహన్ పేరు ప్రస్తావనకు రావాల్సిందే’’ అని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్‌కు దీర్ఘాయుస్సు కలగాలని, ఆయన ఆరోగ్యప్రదమైన జీవనం సాగించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. పదవీ విరమణ చేస్తున్న ఇతర సభ్యులు పార్లమెంట్లో నేర్చుకున్న అంశాలను దేశ నిర్మాణం కోసం జరుగుతున్న కృషిని బలోపేతం చేయడానికి ఉపయోగించాలని కోరారు. రాజ్యసభ సభ్యులుగా పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సభ్యులకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మన్మోహన్ రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 3న ముగియనుంది. -
పార్లమెంట్ లో అడుగుపెట్టిన నిర్మలా సీతారామన్
-
ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది ?
-
మహిళలకు ప్రత్యేక వరాలు
-
నేడు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
-
నిర్మలమ్మ కరుణించేనా..
ఎదులాపురం: ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే జిల్లా అభివృద్ధికి తలమానికంగా నిలిచే సీసీఐ (సిమెంట్ ఫ్యాక్టరీ)ని పునరుద్ధరించాలని, ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్‌కు నిధులు కేటా యించాలని రాజకీయ అఖిల పక్ష నాయకులు డి మాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు నల్లా గణపతిరెడ్డి అధ్యక్షతన బుధవారం రాజకీయ అఖిల పక్ష స మావేశం నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఆదిలాబాద్ అభివృద్ధి సాధన పోరాట కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్ బండి దత్తాత్రి మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కోసం విమానా శ్రయం, గిరిజన యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు వంటివి వెంటనే చేపట్టాలన్నారు. ఇందుకోసం దశల వారీగా ఉద్యమాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కో కన్వీనర్లుగా బాలూరి గోవర్ధన్‌రెడ్డి (కాంగ్రెస్), విజ్జగిరి నారాయణ (బీఆర్ఎస్), ప్రభాకర్‌రెడ్డి (సీపీఐ), వెంకట్‌నారాయణ (న్యూడెమోక్రసీ), జగన్‌సింగ్ (ప్రజాపంథా), మల్యాల మనోజ్(టీఎమ్మార్పీఎస్), అగ్గిమల్ల గణేశ్ (ధర్మ సమాజ్‌పార్టీ), గుడుగు మహేందర్ (బీఎస్పీ), కొండా రమేశ్, గోవర్ధన్ యాదవ్, లోకారి పోశెట్టి (రైతు సంఘం), కమిటీ సభ్యులుగా పూసం సచిన్, బండి దేవిదాస్ చారి, రోకండ్ల రమేశ్, నంది రామ య్య, కుంటాల రాములు, దర్శనాల అశోక్, నక్క రాందాస్, నీరటి ఉదయ్ కిరణ్, మాడవి గణేశ్ ఎన్నికయ్యారు. కై లాస్‌నగర్: కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్‌ను పార్లమెంట్లో నేడు ప్రవేశపెట్టనుంది. సార్వత్రిక ఎన్నిక ల నేపథ్యంలో ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర పద్దు ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించే బడ్జెట్‌పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. రైల్వే ప రంగా జిల్లాకు కొత్త వరాలు ప్రకటిస్తారా..పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పిస్తారా అనే దానిపై ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే జిల్లాలో విద్య, వైద్యం పరంగా యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరుగుతుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో వస్తున్న బడ్జెట్ కావడంతో ప్రధానంగా రైతులకు మేలు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే జిల్లాకు ఏ మేర న్యాయం చేకూరుస్తారనే దానిపై అన్నదాతల్లో ఆసక్తి నెలకొంది. ►ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. అయితే దీన్ని ఏర్పాటు చేయాల్సిన కేంద్రం ఆదిలాబాద్–పఠాన్‌చెరు రైల్వేలైన్ ఏర్పాటుకు సంకల్పించింది. ఇందులో భాగంగా సర్వే సైతం పూర్తయింది. అయితే ఈ పనులను పఠాన్‌చెరు–ఆదిలాబాద్ చేపట్టాలని నిర్ణయించడంపై జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు ఆదిలాబాద్ నుంచి మొదలుపెడుతూ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ►ఆదిలాబాద్–గడ్చందూర్ బేల మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిధులు మంజూరు చేసింది. సర్వే కూడా పూర్తయింది. అయితే నిధులు కేటాయించాల్సి ఉంది. గత రెండు బడ్జెట్లలో నిధులు కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ►ఆదిలాబాద్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్, మహారాష్ట్రలోని ముంబై, ఢిల్లీ, బెంగుళూరు వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. పూర్తిస్థాయిలో రైళ్లు లేకపోవడంతో రవాణా పరంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నాందేడ్ వరకు నడుస్తున్న నాందేడ్– బెంగుళూరు, నాందేడ్–శ్రీ గంగానగర్, నాందేడ్–అమృత్సర్, ధర్మబాద్–ముంబై రైళ్లను ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వరకు పొడిగిస్తే జిల్లా వాసులు ఆయా ప్రాంతాలకు సునాయసంగా చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. రైళ్లను పొడిగించాలనే డిమాండ్ కొన్నేళ్లుగా వినిపిస్తోంది. ►ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక కేంద్రీయ విద్యాల యం ఉంది. మరిన్ని విద్యాలయాలు మంజూరు చేస్తే పేద విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్‌తో కూడిన నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది. ►జవహర్ నవోదయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలు జిల్లాలో లేవు. వాటిని ఏర్పాటు చేయాలని పదేళ్లుగా జిల్లావాసులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. వాటిని మంజూరు చేస్తే జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సైనికులుగా దేశ సేవ కోసం ముందుకొచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ►ఆదిలాబాద్.. ఆదివాసీలతో కూడిన జిల్లా. ఇలాంటి ప్రాంతంలో ఉన్నత విద్య అవకాశాలు అందాలంటే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. గిరిజన వర్సిటీని గతంలో మంజూరు చేసినప్పటికీ ఆ తర్వాత దాన్ని వరంగల్‌కు తరలించారు. దీనిపై ఇక్కడి ప్రజల్లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. ఈ బడ్జెట్లోనైనా గిరిజన యూనివర్సిటీని మంజూరు చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ►జిల్లాలో ఎయిర్‌పోర్టు, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ల కోసం అవసరమైన స్థలం అందుబాటులో ఉంది. అన్ని విధాలా అనుకూలతలున్నాయి. గతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి సర్వే చేపట్టి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. వీటిలో ఏఒక్క దానికై నా నిధులు మంజూరైతే ఆదిలాబాద్ అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంటుంది. ►జిల్లాలో సాగునీటిని అందించే ప్రాజెక్టులు మత్తడివాగు, సాత్నాల ప్రాజెక్టులు ఉన్నప్పటికీ వాటి ద్వారా ఇప్పటికీ పూర్తిస్థాయిలో రైతాంగానికి సా గునీరు అందడం లేదు. కాలువలు లేకపోవడంతో రైతులకు ప్రయోజనం చేకూరని పరిస్థితి. వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కోర్టా–చనాఖా బ్యారేజీ నిర్మాణం సైతం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇలాంటి పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుద ల చేస్తే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. -
నారీ శక్తిని కేంద్రం ప్రతిబింబిస్తోంది: మోదీ
-
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయనున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. తొలి రెండు రోజులు ఉభయసభల్లో జీవో అవర్, క్వశ్చన్ అవర్‌ను ఇప్పటికే రద్దు చేస్తూ బులిటెన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఆ తర్వాత రాజ్యసభ, లోక్‌సభలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసిన నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతిపాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూకశ్మీర్ బడ్జెట్‌నూ ఆర్థిక మంత్రి నిర్మల లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. వాడీవేడిగా చర్చలు సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. నిరుద్యోగిత, అధిక ధరలు, ఆర్థిక అసమానతల కారణంగా రైతాంగం, కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు, జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ అంశాలపై మోదీ సర్కార్‌ను విపక్షాలు నిలదీయనున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అంశం సైతం ప్రధానంగా విపక్షాలు ప్రస్తావించవచ్చు. ఢిల్లీలో మద్యం కేసులో ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్‌పై, భూమికి ఉద్యోగం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్‌పై ఈడీ, సీబీఐ కేసులనూ విపక్షాలు పార్లమెంట్లో లేవనెత్తనున్నాయి. జార్ఖండ్ సీఎంసోరెన్పై, తమిళనాడులో డీఎంకే నేతలపై ఈడీ, సీబీఐ వరుస దాడులను విపక్షాలు పార్లమెంట్లో ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. పశ్చిమబెంగాల్‌కు రావాల్సిన కేంద్ర నిధులను మోదీ సర్కార్ మంజూరుచేయకుండా ఆపేస్తోందని, ఈ అంశంలో కేంద్రాన్ని నిలదీస్తానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ్ చెప్పారు. 14 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత గత పార్లమెంట్ సమావేశాల్లో సస్పెండ్ అయిన వారిలో 14 మంది విపక్ష సభ్యులు ఈసారి సెషన్లో పాల్గొననున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సమావేశాల్లోకి రాకుండా గతంలో వీరిపై విధించిన నిషేధ కేసును సభాహక్కుల కమిటీలకు పంపామని, మా అభ్యర్థనతో ఆ కమిటీల చైర్మన్లు వీరి సస్పెన్షన్‌ను ఎత్తేశారని మంత్రి వెల్లడించారు. సస్పెన్షన్ ఎత్తేసిన 14 మందిలో 11 మంది రాజ్యసభ, ముగ్గురు లోక్‌సభ సభ్యులున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం అంశాన్ని ఎత్తిచూపుతూ లోక్‌సభ, రాజ్యసభ లోపల ప్లకార్డులు పట్టుకుని నినదించినందుకు కేంద్రం ఫిర్యాదుతో 100 లోక్‌సభ, 46 రాజ్యసభ సభ్యులు సస్పెన్షన్‌కు గురైన విషయం తెల్సిందే. ప్రతి ఒక్కరి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సభాపతులను కోరామన్నారు. వీరిలో 14 మంది క్షమాపణలు చెప్పడంతో వారికి మాత్రమే ఈ సెషన్లో పాల్గొనే అవకాశం కల్పించారు. బుధవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ ఇరు సభలకు తమ సభ్యులు ఎలాంటి ప్లకార్డులు తీసుకురారని విపక్ష పార్టీలు సమాచారం ఇచ్చాయని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. -
బడ్జెట్ వేళ.. 146 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత
ఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంట్ సమావేశాలను(బడ్జెట్) కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా 146 మంది విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేతకు కృషి చేసింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం అఖిల పక్ష భేటీ తర్వాత ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దుండగుల దాడితో అలజడి రేగిన విషయం తెలిసిందే. ఈ భద్రతా వైఫ్యలంపై కేంద్ర హోం శాఖ వివరణ ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించారనే కారణంతో లోక్‌సభ నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. అదే సమయంలో రాజ్యసభలోనూ ఇలా అవాంతరాలు కలిగిన సభ్యుల్ని సస్పెండ్ చేశారు చైర్మన్. అయితే బడ్జెట్ సమావేశాలు.. అదీ ఎన్నికలకు ముందు ఓటాన్ బడ్జెట్ కావడంతో సభ్యులంతా ఉండాలని కేంద్రం ఆశిస్తోంది. ‘‘అన్ని సస్పెన్షన్లను ఎత్తేస్తున్నాం. ఈ విషయమై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లతో మాట్లాడాం. ప్రభుత్వం తరఫున సస్పెన్షన్ ఎత్తివేయాలని వాళ్లను కోరాను. అందుకు వాళ్లు అంగీకరించారు అని తెలిపారాయన. లోక్‌సభ నుంచి 135 మంది, రాజ్యసభ నుంచి 11 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇక రేపటి నుంచి(జనవరి 31) ఫిబ్రవరి 9వ తేదీదాకా బడ్జెట్ సెషన్ జరగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. -
పార్లమెంట్లో రాహుల్ ప్రసంగంపై దుమారం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుందంటూ గతవారం లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తాజాగా పార్లమెంట్ ఉభయసభల్లో రాజకీయ దుమారం రేపాయి. రాహుల్ తన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలోనూ అధికార బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే దీనిని కాంగ్రెస్ వ్యతిరేకించింది. అదానీ-హిండెన్ బర్గ్ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు అధికార పార్టీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు విమర్శించారు. అదానీ గ్రూప్ సంక్షోభంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. లోక్‌సభ సభ్యుడైన రాహుల్ గాంధీ లండన్‌లో భారత్‌ను అవమానించారని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలను సభలోని సభ్యులంతా తీవ్రంగా ఖండించాలని.. దేశానికి కాంగ్రెస్ నేత క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. మరోవైపు రాజ్యసభలోనూ రాహుల్ గాంధీ అంశంపై ప్రకంపనలు రేగాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తూ.. విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని సీనియర్ నేత అవమానించడం సిగ్గుచేటని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు పలువురు బీజేపీ మంత్రులు కూడా మద్దతు పలికారు. అయితే దీనిపై స్పందించిన విపక్ష కాంగ్రెస్ మంత్రులు.. గతంలో నరేంద్ర మోదీ కూడా వీదేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని గుర్తు చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే గోయల్ వ్యాఖ్యలను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. సభలో సభ్యుడు కాని వ్యక్తిని పిలిచి క్షమాపణ చెప్పాలని అడగడం ఏంటని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే, నాశనం చేసే వారు దానిని రక్షించాలంటూ మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్, ఆప్ సైతం మద్దతు తెలిపాయి. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయసభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. -
బెట్టు వీడని విపక్షాలు.. ప్రధాని స్పందనకై డిమాండ్
సాక్షి, ఢిల్లీ: అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయి. సహకరిస్తామని చెప్పడంతో.. మంగళవారం ఇరు సభలు సజావుగా జరుగుతాయని అంతా భావించారు. అయితే టర్కీ, సిరియా భూకంప బాధితుల సంతాపం ప్రకటన అనంతరం.. పార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ) వేయాలంటూ ఇరు సభలను అడ్డుకునే యత్నం చేశాయి. దీంతో ఉభయ సభలు కాసేపటికి వాయిదా పడ్డాయి. తొలుత బీఆర్ఎస్, ఆప్‌లు మాత్రమే సమావేశాలకు దూరంగా ఉంటాయని అంతా భావించారు. ఈ క్రమంలో మిగతా పార్టీలలో దాదాపుగా అన్నీ పార్లమెంట్ వ్యవహారాలకు సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ జైరామ్ రమేశ్ ప్రకటించారు. అయితే.. లోక్‌సభలో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా రాజ్యసభలో మాత్రం విపక్షాలు కార్యకలాపాలను ఏమాత్రం ముందుకు కదలకుండా అడ్డుకున్నాయి. Rajya Sabha adjourned till 2 pm as Opposition MPs walked to the Well of the House and demanded that the PM come to the House and respond over #Adani row. pic.twitter.com/OR1nh85pO4 — ANI (@ANI) February 7, 2023 అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హౌజ్ వెల్‌లోకి వెళ్లాయి. దీంతో రాజ్యసభ మధ్యాహ్నాం రెండు గంటల దాకా సభ వాయిదా పడింది. మరోవైపు లోక్‌సభ ప్రారంభంలో ప్రతిపక్షాల నిరసనతో మధ్యాహ్నం 12 గంటలకు, ఆపై మరోసారి మధ్యాహ్నం 1.30 నిమిషాలకు వాయిదా పడగా.. ఆ తర్వాత ప్రారంభమైన సభ కాస్త సజావుగానే నడిచింది. అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ నివేదిక వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ దర్యాప్తుగానీ, సీజేఐ పర్యవేక్షణలో దర్యాప్తునకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రధాని మోదీ సైతం వివరణ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. -
Budget Session: పార్లమెంట్లో మారని సీన్..ఉభయసభలు వాయిదా
సాక్షి, ఢిల్లీ: అదానీ కంపెనీల అవకతవకలపై చర్చ జరపాలని, జేపీసీ దర్యాప్తు డిమాండ్లతో విపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలను సజావుగా సాగనివ్వడం లేదు. విపక్షాల వాయిదా తీర్మాన నోటీసులు.. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ల తిరస్కరణ.. ఆపై పార్లమెంట్లో నెలకొన్న గందరగోళంతో ఇరు సభలు కూడా సోమవారం కార్యకలాపాలు ప్రారంభించకుండానే మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైనా రెండు సభల్లో విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. దీంతో ఉభయసభలు మంగళవారం ఉదయం 11 గంటల వరకు వాయిదాపడ్డాయి. బడ్జెట్ సమావేశాల ఐదవ రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అదానీ కంపెనీపై హిండన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ( జేపీసీ)తో దర్యాప్తు జరిపించాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ మేరకు సభ ప్రారంభమైన కాసేపటికే నినాదాలతో గందరగోళం సృష్టించాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు కూడా విపక్షాలు అనుమతించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సుమారు 16 ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు.. శుక్రవారం ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో సమావేశమై జేపీసీ దర్యాప్తు అనే ఏకపక్ష డిమాండ్‌ను ఉభయ సభల్లోనూ లెవనెత్తాలని నిర్ణయించుకున్నారు. ఆపై శుక్రవారం ఎలాంటి వ్యవహరాలు జరగకుండానే.. సోమవారానికి(ఇవాళ్టికి) పార్లమెంట్ సెషన్ వాయిదా పడింది. అయితే సోమవారం ప్రారంభమైన తర్వాత కూడా అదే సన్నివేశం నెలకొంది. కేంద్రం మాత్రం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానానికి ఒక ప్రాధాన్యత ఉందనే విషయాన్ని గుర్తు చేస్తోంది.