
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇవాళ(సోమవారం) అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్రం. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సజావుగా సభలు సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా విపక్షాలను కోరింది.
2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదేకానుంది. అందుకే విపక్షాలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ భేటీకి హాజరైనట్లు తెలుస్తోంది
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి.మురళీధరన్ సైతం హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. మంగళవారం పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదలుకానున్నాయి. ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఇక బుధవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
Comments
Please login to add a commentAdd a comment