ముందే ముగియనున్న బడ్జెట్‌ తొలి దఫా సమావేశాలు! | Political parties seek early end to first half of Budget session | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ సమావేశాల తొలి దఫా.. ముగింపు ముందే! కారణం అదేనా?

Published Wed, Feb 1 2023 10:22 AM | Last Updated on Wed, Feb 1 2023 10:27 AM

Political parties seek early end to first half of Budget session - Sakshi

బడ్జెట్‌ సమావేశాల తొలి సెషన్‌ను.. ముందుగానే ముగించాలని.. స్పీకర్‌ కూడా సానుకూలంగా.. 

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల తొలి దఫా బడ్జెట్‌ సమావేశాలను ఫిబ్రవరి 13కు బదులు 10వ తేదీనే ముగించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను పలు పార్టీలు కోరాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ధృవీకరించారు.

‘‘లోక్‌సభ సభా కార్యకలాపాల సలహా కమిటీ(బీఏసీ.. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ) భేటీలో స్పీకర్‌ వద్ద వారీ విషయాన్ని ప్రస్తావించారు. వారి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుంటానని స్పీకర్‌ హామీ ఇచ్చారు’’ అని చెప్పారు. 

ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలు రెండు దఫాలుగా జరగనుంది. తొలి సెషన్‌ ఫిబ్రవరి 13వ తేదీతో ముగియనుంది. అయితే 11-12 తేదీలు వారాంతం కావడంతో ఎంపీలు ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక షెడ్యూల్‌ ప్రకారం.. రెండో దఫా సమావేశాలు మార్చి 13వ తేదీన మొదలై.. ఏప్రిల్‌ 6వ తేదీతో సమావేశాలు ముగుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement