న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలుఈ నెల 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జులై 21న (ఆదివారం) పార్లమెంట్ ఉభయసభల్లోని అన్నీ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ సెషన్, సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్రం సమావేశానికి ఆహ్వానించింది.
జూలై 21న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని ప్రధాన కమిటీ రూమ్‌లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్) హాజరు కావడం లేదు. జులై 21న రాష్ట్ర అమరవీరుల దినోత్సవం నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరుకావడం లేదని టీఎంసీ ని ర్ణయించుకుంది.
కాగా ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకావడం ఇదే తొలిసారి కానుంది. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఈ నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment