
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం డిమాండ్‌చేస్తూ వైఎస్సార్‌సీపీ సహా పలు పార్టీలు ఇచ్చిన నోటీసులు ముందుకురానుండగా లోక్‌సభ వాయిదాపడింది. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కానీ అప్పటికే పోడియం వద్దకు వెళ్లిన అన్నాడీఎంకే ఎంపీలు.. కావేరి బోర్డు ఏర్పాటుచేయాలంటూ గట్టిగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పలుమార్లు చేసిన విజ్ఞప్తులు విఫలం కావడంతో స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు.
నిరవధిక వాయిదా వేస్తా..: అవిశ్వాసతీర్మానంపై చర్చ లేకుండానే పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడొచ్చన్న వార్తల నేపథ్యంలో నేడు సభలో స్పీకర్ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోడియం వద్ద నినాదాలు చేస్తోన్న ఏఐఏడీఎంకే ఎంపీలను ఉద్దేశించి స్పీకర్ సుమిత్రా.. ‘సభను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు.. వెంటనే వెళ్లి మీమీ స్థానాల్లో కూర్చోండి.. సభను జరుగనివ్వండి.. లేకుంటే సమావేశాలను ముగించేస్తాను.. మీరు సహకరించకుంటే సభను నిరవధికంగా వాయిదావేస్తాను..’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment