న్యూఢిల్లీ: మోదీని కౌగిలించుకున్నందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ రాహుల్‌ను మందలించారు. సభ్యులంతా సభా మర్యాదలు పాటించాలని ఆమె కోరారు. రాహుల్ ఎవరిని కౌగిలించుకున్నా తానేమీ వ్యతిరేకిని కాననీ, అయితే సభలో మర్యాదతో నడచుకోవాలని ఆమె కోరారు. తనకెవరూ శత్రువు కాదనీ, రాహుల్ తన కొడుకులాంటి వాడని ఆమె పేర్కొన్నారు. ఆయన మోదీని కౌగిలించుకోవడం తనకు ఓ డ్రామాలా అనిపించిందన్నారు.
హోదాపై మాట లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని రాహుల్ తన ప్రసంగంలో కనీసం ప్రస్తావించలేదు. గంటకుపైగా ప్రసంగించినా ఎక్కడా ఏపీకి ఇచ్చిన విభజన హామీల గురించి చిన్న మాట కూడా ఎత్తలేదు. కేవలం గల్లా జయదేవ్ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీ తీరును ఆయన వివరించారని చెప్పి ముగించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకిచ్చిన అన్ని హామీలనూ బీజేపీ సమ్మతించిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడం, ఆర్థిక లోటు భర్తీ హామీలను అమలు చేసేందుకు బీజేపీ అంగీకరించిందని అన్నారు. ఏపీకిచ్చిన హామీలను 2016లో మాజీ ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో తిరిగి ప్రస్తావించారన్నారు.
సభా మర్యాదలు పాటించాలి
Published Sat, Jul 21 2018 5:05 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment