నిర్మలమ్మ కరుణించేనా.. | - | Sakshi
Sakshi News home page

నిర్మలమ్మ కరుణించేనా..

Published Wed, Jan 31 2024 11:12 PM | Last Updated on Thu, Feb 1 2024 7:58 AM

- - Sakshi

ఎదులాపురం: ఈ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లోనే జిల్లా అభివృద్ధికి తలమానికంగా నిలిచే సీసీఐ (సిమెంట్‌ ఫ్యాక్టరీ)ని పునరుద్ధరించాలని, ఆదిలాబాద్‌–ఆర్మూర్‌ రైల్వేలైన్‌కు నిధులు కేటా యించాలని రాజకీయ అఖిల పక్ష నాయకులు డి మాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకుడు నల్లా గణపతిరెడ్డి అధ్యక్షతన బుధవారం రాజకీయ అఖిల పక్ష స మావేశం నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఆదిలాబాద్‌ అభివృద్ధి సాధన పోరాట కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌ బండి దత్తాత్రి మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కోసం విమానా శ్రయం, గిరిజన యూనివర్సిటీ, టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు వంటివి వెంటనే చేపట్టాలన్నారు. ఇందుకోసం దశల వారీగా ఉద్యమాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

కో కన్వీనర్లుగా బాలూరి గోవర్ధన్‌రెడ్డి (కాంగ్రెస్‌), విజ్జగిరి నారాయణ (బీఆర్‌ఎస్‌), ప్రభాకర్‌రెడ్డి (సీపీఐ), వెంకట్‌నారాయణ (న్యూడెమోక్రసీ), జగన్‌సింగ్‌ (ప్రజాపంథా), మల్యాల మనోజ్‌(టీఎమ్మార్పీఎస్‌), అగ్గిమల్ల గణేశ్‌ (ధర్మ సమాజ్‌పార్టీ), గుడుగు మహేందర్‌ (బీఎస్పీ), కొండా రమేశ్‌, గోవర్ధన్‌ యాదవ్‌, లోకారి పోశెట్టి (రైతు సంఘం), కమిటీ సభ్యులుగా పూసం సచిన్‌, బండి దేవిదాస్‌ చారి, రోకండ్ల రమేశ్‌, నంది రామ య్య, కుంటాల రాములు, దర్శనాల అశోక్‌, నక్క రాందాస్‌, నీరటి ఉదయ్‌ కిరణ్‌, మాడవి గణేశ్‌ ఎన్నికయ్యారు.

కై లాస్‌నగర్‌: కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో నేడు ప్రవేశపెట్టనుంది. సార్వత్రిక ఎన్నిక ల నేపథ్యంలో ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర పద్దు ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రకటించే బడ్జెట్‌పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. రైల్వే ప రంగా జిల్లాకు కొత్త వరాలు ప్రకటిస్తారా..పెండింగ్‌ ప్రాజెక్టులకు మోక్షం కల్పిస్తారా అనే దానిపై ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే జిల్లాలో విద్య, వైద్యం పరంగా యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరుగుతుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో వస్తున్న బడ్జెట్‌ కావడంతో ప్రధానంగా రైతులకు మేలు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే జిల్లాకు ఏ మేర న్యాయం చేకూరుస్తారనే దానిపై అన్నదాతల్లో ఆసక్తి నెలకొంది.

►ఆదిలాబాద్‌–ఆర్మూర్‌ రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ కొన్నేళ్లుగా ఉంది. అయితే దీన్ని ఏర్పాటు చేయాల్సిన కేంద్రం ఆదిలాబాద్‌–పఠాన్‌చెరు రైల్వేలైన్‌ ఏర్పాటుకు సంకల్పించింది. ఇందులో భాగంగా సర్వే సైతం పూర్తయింది. అయితే ఈ పనులను పఠాన్‌చెరు–ఆదిలాబాద్‌ చేపట్టాలని నిర్ణయించడంపై జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు ఆదిలాబాద్‌ నుంచి మొదలుపెడుతూ బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

►ఆదిలాబాద్‌–గడ్‌చందూర్‌ బేల మీదుగా రైల్వేలైన్‌ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిధులు మంజూరు చేసింది. సర్వే కూడా పూర్తయింది. అయితే నిధులు కేటాయించాల్సి ఉంది. గత రెండు బడ్జెట్లలో నిధులు కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు.

►ఆదిలాబాద్‌ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్‌, మహారాష్ట్రలోని ముంబై, ఢిల్లీ, బెంగుళూరు వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. పూర్తిస్థాయిలో రైళ్లు లేకపోవడంతో రవాణా పరంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నాందేడ్‌ వరకు నడుస్తున్న నాందేడ్‌– బెంగుళూరు, నాందేడ్‌–శ్రీ గంగానగర్‌, నాందేడ్‌–అమృత్‌సర్‌, ధర్మబాద్‌–ముంబై రైళ్లను ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం వరకు పొడిగిస్తే జిల్లా వాసులు ఆయా ప్రాంతాలకు సునాయసంగా చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. రైళ్లను పొడిగించాలనే డిమాండ్‌ కొన్నేళ్లుగా వినిపిస్తోంది.

►ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకే ఒక కేంద్రీయ విద్యాల యం ఉంది. మరిన్ని విద్యాలయాలు మంజూరు చేస్తే పేద విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో కూడిన నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది.

►జవహర్‌ నవోదయ విద్యాలయాలు, సైనిక్‌ పాఠశాలలు జిల్లాలో లేవు. వాటిని ఏర్పాటు చేయాలని పదేళ్లుగా జిల్లావాసులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. వాటిని మంజూరు చేస్తే జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సైనికులుగా దేశ సేవ కోసం ముందుకొచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

►ఆదిలాబాద్‌.. ఆదివాసీలతో కూడిన జిల్లా. ఇలాంటి ప్రాంతంలో ఉన్నత విద్య అవకాశాలు అందాలంటే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉంది. గిరిజన వర్సిటీని గతంలో మంజూరు చేసినప్పటికీ ఆ తర్వాత దాన్ని వరంగల్‌కు తరలించారు. దీనిపై ఇక్కడి ప్రజల్లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. ఈ బడ్జెట్‌లోనైనా గిరిజన యూనివర్సిటీని మంజూరు చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

►జిల్లాలో ఎయిర్‌పోర్టు, ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్ల కోసం అవసరమైన స్థలం అందుబాటులో ఉంది. అన్ని విధాలా అనుకూలతలున్నాయి. గతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి సర్వే చేపట్టి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. వీటిలో ఏఒక్క దానికై నా నిధులు మంజూరైతే ఆదిలాబాద్‌ అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంటుంది.

►జిల్లాలో సాగునీటిని అందించే ప్రాజెక్టులు మత్తడివాగు, సాత్నాల ప్రాజెక్టులు ఉన్నప్పటికీ వాటి ద్వారా ఇప్పటికీ పూర్తిస్థాయిలో రైతాంగానికి సా గునీరు అందడం లేదు. కాలువలు లేకపోవడంతో రైతులకు ప్రయోజనం చేకూరని పరిస్థితి. వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కోర్టా–చనాఖా బ్యారేజీ నిర్మాణం సైతం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇలాంటి పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు విడుద ల చేస్తే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement