పార్లమెంట్ వెలుపల సోమవారం గందరగోళం ఏర్పడింది.
న్యూఢిల్లీ : పార్లమెంట్ వెలుపల సోమవారం గందరగోళం ఏర్పడింది. తృణమూల్ ఎంపీ తపస్ పాల్‌ను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలంటూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు పార్లమెంట్ ఎదుట ఆందోళనకు దిగారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎంపీకి చట్టసభలో కొనసాగే అర్హత లేదని ఉద్యమకారులు మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం తపస్‌పాల్ సీపీఐ మహిళ నేతలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.