'నన్ను చూసి ప్రభుత్వం భయపడుతోంది'
న్యూఢిల్లీ: తనను చూసి మోదీ సర్కారు భయపడుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం తనను పార్లమెంట్ లో మాట్లాడనీయడం లేదని విమర్శించారు. బుధవారం పార్లమెంట్ వెలుపల విలేకరులతో ఆయన మాట్లాడారు. 'అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. కానీ పార్లమెంట్ లో నన్ను మాట్లాడనీయడం లేదు. నేను మాట్లాడేటప్పుడు మీరే చూడండి. పార్లమెంట్ లో గళం విప్పకుండా నన్ను ప్రభుత్వం అడ్డుకుంటోంది. నేనేం మాట్లాడతానోనని ప్రభుత్వం భయపడుతోంద'ని రాహుల్ గాంధీ అన్నారు.
జేఎన్ యూ వివాదం, హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని పార్లమెంట్ లో కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జేఎన్ యూ వివాదంపై మధ్యాహ్నం 2 గంటలకు లోక్ సభలో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.