పార్లమెంట్‌లో నీట్‌ మంటలు.. ధరేంద్ర ప్రధాన్‌పై రాహుల్‌ ఫైర్‌ | MP Rahul Gandhi Serious Comments On Dharmendra Pradhan | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో నీట్‌ మంటలు.. ధరేంద్ర ప్రధాన్‌పై రాహుల్‌ ఫైర్‌

Published Mon, Jul 22 2024 11:47 AM | Last Updated on Mon, Jul 22 2024 1:50 PM

MP Rahul Gandhi Serious Comments On Dharmendra Pradhan

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. సభలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వాడీవేడీ చర్చ జరిగింది.

సభలో నీట్‌ అంశంపై రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. నీట్‌ పేపర్‌ లీక్ చాలా పెద్ద సమస్య. ఈ సమస్యను మూలాల నుంచి పెకిలించాల్సి ఉంది. మంత్రి(ధర్మేంద్ర ప్రధాన్‌) తనను తప్ప అందరినీ తప్పుపడుతున్నారు. డబ్బునోళ్లు పేపర్లు కొని వ్యవస్థను అపహాస్యం పాలు చేస్తున్నారు. డబ్బులు ఉన్న వాళ్లు విద్యా వ్యవస్థనే కొనేస్తున్నారు. పేపర్‌ లీక్‌ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 

 

ఈ క్రమంలో రాహుల్‌కు ధర్మేంద్ర ప్రధాన్‌ కౌంటరిచ్చారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ..‘నీట్‌ పరీక్ష పేపర్‌లీక్‌పై సీబీఐ విచారణ జరుపుతోంది. నీట్‌ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకువచ్చింది. విద్యావ్యవస్థను రాహుల్‌ అపహస్యం చేయడం దారుణం’ అంటూ కామెంట్స్‌ చేశారు.

 

మరోవైపు.. నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంపై పార్లమెంట్‌లో విపక్షాలు నిరసనలకు దిగాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ప్రతిపక్షనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్‌ లీకేజీల్లో ఈ ప్రభుత్వం రికార్డు సృష్టించిందంటూ విపక్షాలు ఎద్దేవా చేశాయి. అలాగే, ధర్మేంద ప్రధాన్‌ ఎంపీగా ఉన్న నియోజకవర్గంలోని కొన్ని సెంటర్లలో రెండు వేల మందికిపైగా విద్యార్థులు పాసయ్యారు. దీనిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని విపక్ష నేతలు కామెంట్స్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement