Dharmedra Pradhan
-
పార్లమెంట్లో నీట్ మంటలు.. ధరేంద్ర ప్రధాన్‌పై రాహుల్ ఫైర్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే నీట్ పేపర్ లీక్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. సభలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వాడీవేడీ చర్చ జరిగింది.సభలో నీట్ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య. ఈ సమస్యను మూలాల నుంచి పెకిలించాల్సి ఉంది. మంత్రి(ధర్మేంద్ర ప్రధాన్) తనను తప్ప అందరినీ తప్పుపడుతున్నారు. డబ్బునోళ్లు పేపర్లు కొని వ్యవస్థను అపహాస్యం పాలు చేస్తున్నారు. డబ్బులు ఉన్న వాళ్లు విద్యా వ్యవస్థనే కొనేస్తున్నారు. పేపర్ లీక్ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. #WATCH | Congress MP and LoP in Rajya Sabha Rahul Gandhi says "It is obvious to the whole country that there is a very serious problem in our examination system, not just in NEET but in all the major examinations. The minister (Dharmendra Pradhan) has blamed everybody except… pic.twitter.com/GO76I0sLZt— ANI (@ANI) July 22, 2024 ఈ క్రమంలో రాహుల్‌కు ధర్మేంద్ర ప్రధాన్ కౌంటరిచ్చారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ..‘నీట్ పరీక్ష పేపర్‌లీక్‌పై సీబీఐ విచారణ జరుపుతోంది. నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకువచ్చింది. విద్యావ్యవస్థను రాహుల్ అపహస్యం చేయడం దారుణం’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | On NEET exam issue, Samajwadi Party MP Akhilesh Yadav says, "This government will make a record of paper leaks... There are some centres where more than 2,000 students have passed. As long as this minister (Education Minister Dharmendra Pradhan) is there, the students… pic.twitter.com/Sa95rPYZki— ANI (@ANI) July 22, 2024మరోవైపు.. నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో విపక్షాలు నిరసనలకు దిగాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ప్రతిపక్షనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీల్లో ఈ ప్రభుత్వం రికార్డు సృష్టించిందంటూ విపక్షాలు ఎద్దేవా చేశాయి. అలాగే, ధర్మేంద ప్రధాన్ ఎంపీగా ఉన్న నియోజకవర్గంలోని కొన్ని సెంటర్లలో రెండు వేల మందికిపైగా విద్యార్థులు పాసయ్యారు. దీనిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని విపక్ష నేతలు కామెంట్స్ చేస్తున్నారు. -
బీజేపీ కొత్త సారథి ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో 303 లోక్‌సభ స్థానాలతో ఘన విజయం సాధించిన బీజేపీ.. కేంద్రంలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్దమవుతోంది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. గాంధీ నగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలకు రాజీనామా చేసి.. ఆయన స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొత్త అధ్యక్షడు ఎవరని ఆ పార్టీలో తీవ్ర చర్చజరుగుతోంది. రెండు సార్లు విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా స్థానాన్ని అందుకోవడం అంత సామాన్యమైన,సులువైన విషయం కాదు. పార్టీలో అంతటి శక్తీ, సామర్థ్యాలు ఉన్న సమర్థవంతమైన నేత కోసం కమళ దళం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ముందు వరుసలో.. ఆ పార్టీ ఎంపీ జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రథాన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం జేపీ నడ్డాకుంది. అలాగే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తర ప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా నడ్డా బాధ్యతలు చేపట్టి.. 62 ఎంపీ స్థానాల్లో గెలుపుకు కృషి చేశారు. అలాగే ధర్మేంద్ర ప్రథాన్‌పై కూడా బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. దక్షిణంలో అంత ప్రభావం లేకపోయినా 2014, 2019 ఎన్నికల్లో ఒడిశాలో పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రథాన్. 2014కు ముందు ఆ పార్టీకి కేవలం 21 శాతం ఓట్ బ్యాంకు ఉంటే దానిని 2019 వరకు 39శాతం వరకు తీసుకురాగలిగారు. దీంతో వీరిద్దరిలో ఒకరికి జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. పార్టీలోని సీనియర్ల పేర్లను కూడా పరిశీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుడంగా.. కేంద్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ కూర్పు, మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి తదితర అంశాలపై నాలుగు గంటల పాటు సుధీర్ఘంగా కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. దానిలో భాగంగానే బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలో చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో మోదీ, అమిత్ షా ఏం మాట్లాడుకున్నారనే దానిపై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనే దానిపైనే వీరు చర్చించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
డబ్బు గుట్టగా పోసుక్కుర్చున్నామా: కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్ : పెట్రోల్‌ను వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కిందకు తీసుకురావాలని ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం కోరారు. వినియోగదారులు పెట్రోల్‌ను జీఎస్టీ కిందకు తీసుకురావాలని కోరుకుంటున్నారని చెప్పారు. దేశమంతటా కూడా ఒకే రకమైన పన్ను వేయాలని కోరారు. ప్రస్తుతం జీఎస్టీ కింద సెంట్రల్ జీఎస్టీ, వ్యాట్ అని రెండు రకాలుగా పన్ను వసూలు చేస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి ఒకే రకమైన పన్ను వేయాలని ఆర్థిక శాఖకు పంపిన ప్రపోజల్లో ప్రధాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్లలో తగ్గుదల, పెరుగుదలలు అంతర్జాతీయ మార్కెట్లను అనుసరించి మాత్రమే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. కేంద్రానికి పన్ను ద్వారా వచ్చిన ఆదాయం ఆర్థిక సంఘం ప్రతిపాదనల మేరకు 42 శాతం రాష్ట్రాలకే పంచుతున్నామని వెల్లడించారు. అంతేకాక రాష్ట్రాలు అదనంగా విధించుకుంటున్న పన్ను వల్ల కూడా వాటికి ఆదాయం సమకూరుతోందని చెప్పారు. కేంద్రానికి వచ్చే నిధులను ప్రజల సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తున్నామని అన్నారు. 'మేం రోడ్లు నిర్మించాలని, ఇళ్లు కట్టించాలని మీరు(ప్రజలను ఉద్దేశించి) అనుకోవడం లేదా?' అని ప్రశ్నించారు. 'మాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?. మేమేమైనా డబ్బులు గుట్టగా పోశామనుకుంటున్నారా?' అని అన్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే తాము కృషి చేస్తున్నామని చెప్పారు. గతంలో ఒక ఇంటికి రూ. 75 వేలు ఖర్చు చేస్తే.. ప్రస్తుతం రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.