సాక్షి, ఢిల్లీ: యూజీసీ నిబంధనల మార్పు గురించి తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఇందులో భాగంగానే తాము కేసీఆర్ సూచన మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసినట్టు కేటీఆర్ తెలిపారు. ఇదే సమయంలో వీసీలుగా నిష్ణాతులు ఉండాలని సూచించినట్టు వెల్లడించారు.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఈరోజు కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నేతలు కలిశారు. భేటీ అనంతరం ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ సూచన మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశాం. యూజీసీ నిబంధనల మార్పు గురించి మా పార్టీ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలిపాము. యూజీసీ నిబంధనల మార్పు గురించి మాకు అభ్యంతరాలు ఉన్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా సెర్చ్ కమిటీలను రాష్ట్ర గవర్నర్‌కి బాధ్యతలు ఇవ్వడం సరికాదని చెప్పాము. వీసీలుగా నిష్ణాతులు ఉండాలని సూచించినట్టు తెలిపారు.
గిరిజన విద్యార్థులకు నష్టం జరిగే విధంగా మార్పులు చేస్తున్నారు. నో సూటబుల్ క్యాండిడేట్ నిబంధన రాజ్యంగ విరుద్ధంగా ఉంది. ఫ్యాకల్టీ ఎంపికలో సీనియారిటీ ప్రకారమే కాకుండా సబ్జెక్టుపై అవగాహన ఉన్నవారికి సరైన విధానాలు పాటించాలని కేంద్రమంత్రిని కోరాం. NH-365బీ సిరిసిల్ల నుంచి కోరుట్ల వరకు పొడిగించాలని, టూరిజం అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కోరడం జరిగిందన్నారు.
ఇదే సమయలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్ సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 10వ తేదీన విచారణ జరగబోతుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే. ప్రజలు ఉప ఎన్నికలు కోరుకుంటున్నారు. అనర్హత వేటు పిటిషన్లపై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నాం అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment