
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని ఎద్దేవా చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్‌ను చూసి తెలంగాణ ప్రజలు జాలి పడాలన్నారు. అలాగే, ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారని తెలిపారు.
ఎమ్మెల్సీ కోటాలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నేడు అసెంబ్లీకి కేటీఆర్ వచ్చారు. నామినేషన్ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రవణ్‌ను 2023లోనే ఎమ్మెల్సీగా కేసీఆర్ నామినేట్ చేశారు. అప్పుడు బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంది. శ్రవణ్ బీఆర్‌ఎస్‌ను వదిలిపెట్టి వెళ్లి ఉంటే ఇప్పటికే చట్ట సభల్లో అడుగుపెట్టేవాడు. కానీ, బీఆర్‌ఎస్‌పై నమ్మకంతో పార్టీలోనే ఉన్నాడు.
రెండు జాతీయ పార్టీలదీ ఒకటే ధోరణి. రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తున్నాయి. రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే నలుగురు బ్రోకర్లు టీడీఆర్ ల్యాండ్ కొనే పనిలో తిరుగుతున్నారు. టీడీఆర్ అతి పెద్ద కుంభకోణానికి తెరలేపబోతున్నారు. రేవంత్ ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనల ద్వారా శిఖం భూముల ధరలు కృత్రిమంగా పెంచే యోచనలో రేవంత్ ఉన్నారు. తెలంగాణలో రేవంత్ అండ్ టీమ్ ప్రైవేటు దోపిడీ పెరుగుతోంది. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. ప్రభుత్వం లేని అప్పులు చూపించి.. ఎక్కువ మిత్తి చూపిస్తున్నారు. కేంద్రంతో మంచి సంబంధం ఉన్న రేవంత్.. తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలి. 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఒక్క పోరాటమైనా చేసిందా?. బీజేపీ హడావుడి సోషల్ మీడియాలో ఎక్కువ.. సొసైటీలో తక్కువ అంటూ సెటైర్లు వేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ అట్టర్ ప్లాప్‌గా ఉంది. అందుకే అటెన్షన్ కోసం డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు. ఈ-కారు రేసును ముందుకు తెచ్చారు. ప్రపంచ సుందరి పోటీలు పెట్టి సీఎం ఏం సాధిస్తారు?. 200 కోట్లు ఖర్చు పెట్టారు ఏం లాభం వస్తుంది?. ఎవరికి ఉద్యోగాలు వస్తాయి’ అని ప్రశ్నించారు.

Comments
Please login to add a commentAdd a comment