![Cm Revanth Reddy Speech At Youth Congress Meeting In Gandhi Bhavan](/styles/webp/s3/article_images/2025/02/14/Revanthreddy1.jpg.webp?itok=NRkZOy6t)
సాక్షి,హైదరాబాద్:పుట్టుకతో ప్రధాని మోదీ బీసీ కాదని,ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం(ఫిబ్రవరి14) గాంధీభవన్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. సర్టిఫికెట్‌లలో మోదీ బీసీ కానీ మోదీ మనసంతా బీసి వ్యతిరేకి. మోదీ తొలిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారు. అన్నీ తెలుసుకునే మోదీ కులంపై మాట్లాడుతున్నా. కేంద్రానికి సవాల్ చేస్తున్నా.. జనగణనతో పాటు కులగణన చెయ్యాలి. కేంద్రం లెక్కలు మా ప్రభుత్వం చేసిన లెక్కలను సరిపోల్చుదాం. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్,కేటీఆర్,హరీష్ లను బహిష్కరణ చెయ్యాలి.
బహిష్కరణ కోసం మీ సమక్షంలో తీర్మానం చేస్తున్న. ప్రభుత్వ సర్వే తప్పుల తడక అని చెప్పే ప్రయత్నం బీఆర్‌ఎస్ చేసింది. భారత్ జోడో యాత్రలోనే రాహుల్ గాంధీ స్పష్టం గా కులగణన చేస్తాం అని హామీ ఇచ్చారు. దేశంలో ఉన్న అన్ని జాతులకు వారి ఫలాలు అందాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.డోర్ టు డోర్ వెళ్లిన సిబ్బంది ముందే డేటా ఎంట్రీ చేశాం. కేసీఆర్ సర్వే..కాకిలెక్కల సర్వే.
తెలంగాణ సమాజంలో తిరిగే హక్కే కేసీఆర్, కేటీఆర్,సంతోష్ రావ్ లకు లేదు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు కేసీఆర్ ఇచ్చి ఉంటే మాట్లాడే హక్కు ఉండేది.కులగణన సర్వేలో డేటా ఇవ్వని లిస్టులో ముందు వరుసలో కేసీఆర్ కేటీఆర్,సంతోష్ రావ్ గ్యాంబ్లింగ్ శ్రీనివాస్‌లు ఉన్నారు.కేసీఆర్ లెక్క తేలితే..వార్డు మెంబర్ పదవి కూడా ఆ కుటుంబానికి రాదు
గొప్పగొప్ప నేతలు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినవాళ్లే. చంద్రబాబు,కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. యూత్ కాంగ్రెస్ శక్తి ఏంటో మాకు తెలుసు. అనిల్‌యాదవ్,బల్మూరి వెంకట్ సేవలను గుర్తించి వారికి పదవులు ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం.
డబ్బుతో రాజకీయాలు సాధ్యాం కాదు. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో ఉన్నవారికే టికెట్లిస్తాం. ఢిల్లీ నుంచి కాదు గల్లీ నుంచి వారికే పదవులు వస్తాయి. పదేళ్లు కేసీఆర్ తప్పుడు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అని చెప్పి కేసీఆర్ అబద్ధాలు చెప్పాడు.
లిక్కర్ కేసు ద్వారా కేసీఆర్, కేజ్రీవాల్‌ను ఓడగొట్టిన కవిత ఇప్పుడు మాట్లాడుతోంది. కేసీఆర్‌నే గట్టిగా ఓడగొట్టాం నువ్వొచ్చి చేసేదేముంది. కేసీఆర్ గట్టిగా కొడతా అంటున్నాడు. కొట్టాలనుకుంటే నీ కొడుకు కేటీఆర్‌ను పిచ్చిపిచ్చిగా కొట్టు. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడగొట్టినందుకు నీ అల్లుడిని కొట్టు. డబ్బుతో గెలవాలనుకుంటే కేసీఆరే గెలిచేవాడు. కేసీఆర్,కేటీఆర్, కవిత దగ్గర వేల కోట్లున్నాయి
ప్రభుత్వ పథకాలను యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.ప్రజలకు అండగా ఉన్నవారికి మాత్రమే పదవులు ఇస్తాం.సామాన్యులకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా అవకాశాలు కల్పిస్తాం. డబ్బుతో ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు’అని రేవంత్‌రెడ్డి అన్నారు.
![కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్](https://www.sakshi.com/s3fs-public/inline-images/kt_18.jpg)
Comments
Please login to add a commentAdd a comment