
సాక్షి, నిజామాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫీవర్ పట్టుకుందని అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్‌జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..ఇఫ్తార్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. తెలంగాణ అంటే గంగా జమునా తహిజిబ్.ఇతరులకు తెలంగాణ ఇక రాజకీయం. బీఅర్ఎస్‌కు తెలంగాణ ఒక టాస్క్. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫీవర్ పట్టుకుంది..గౌరవం,అభిమానం అనేది కొంటే రాదు.
ముఖ్యమంత్రి మాటలు గౌరవ ప్రదంగా లేవు. తెలంగాణ హిస్టరీ కేసీఆర్ .. ఆయనతో రేవంత్‌కు అస్సలు పోలిక లేదు. కాంగ్రెస్ పార్టీ రంజాన్ తోఫా నిలిపివేయటం బాధాకరం. సంవత్సరం కాంగ్రెస్ పాలనలో ఎవరు ఎంటి అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు.ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని విమర్శలు గుప్పించారు.

Comments
Please login to add a commentAdd a comment