
సాక్షి, వరంగల్: తాను వ్యక్తిగతంగా ఫిరాయింపులను సమర్థించనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ నోటీసులపై స్పందించారు. నోటీసులపై తన సమాధానం స్పీకర్ ముందు ఉంచుతానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సొంత అభిప్రాయాలు పక్కనపెట్టాల్సి వస్తుందని కడియం శ్రీహరి అన్నారు.
తన రాజీనామాపై ఎవరి ఆశలు వాళ్లవి అని.. రిప్లై కోసం స్పీకర్ నోటీస్‌లో ఈ నెల చివరి వరకు గడువు ఇచ్చారని ఆయన తెలిపారు. తప్పనిసరిగా తన సమాధానం స్పీకర్ ముందు ఉంచుతానని.. నేను ఏ పార్టీలో ఉన్నానో అప్పుడే స్పీకర్ తేలుస్తారన్నారు. ఎప్పుడైనా.. పార్టీ మారి నేను సెటిల్‌మెంట్, కబ్జాలు, అక్రమాలు చేయలేదు. తాను అక్రమాలు చేసి ఉంటే ఈ స్థాయికి వచ్చేవాణ్ణి కాదని నా నిజాయితీ అనుభవం చూసే కేసీఆర్ నన్ను పిలిచి డిప్యూటీ సీఎం చేశారు. నేను ఎన్నడూ ఎవరికీ పాదాభివందనాలు చేయలేదు’’ అని కడియం చెప్పుకొచ్చారు.