wargal
-
సరస్వతి దేవికి అంకితం.. వర్గల్ ఆలయం గురించి ఈ విశేషాలు తెలుసా? (ఫొటోలు)
-
ఫ్లెక్సీ వార్.. కొండా సురేఖ వర్సెస్ రేవూరి
సాక్షి, వరంగల్: గీసుకొండ పీఎస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మండలంలోని ధర్మారంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దసరా పండుగను పురస్కరించుకొని ధర్మారంలో కొండా వర్గీయులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని రేవూరి వర్గీయులు నిరసన తెలిపారు.ఈ క్రమంలో ఫ్లెక్సీని ధ్వంసం చేశారని రేవూరి వర్గీయులపై కొండా అనుచరులు దాడి జరిపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గీసుకొండ పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్‌కు వచ్చిన మంత్రి కొండా సురేఖ.. సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు కొండా సురేఖ వర్గీయులు భారీగా చేరుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.గీసుకొండ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. ఇక్కడి వ్యవహారం ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్లింది. పార్టీ వర్గాలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారం కాదు.. స్థానికతకు సంబంధించిన ఇష్యూ.. ఎవరు తొందరపడినా పార్టీకే నష్టం.. సమన్వయం పాటించడం మంచిందని రేవూరి అన్నారు.ఇదీ చదవండి: సునీల్ పోస్టులో తప్పేముంది?.. ఏపీ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ -
బురహాన్‌పల్లి మాజీ సర్పంచ్ హత్య కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ సర్పంచ్ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సుఫారి గ్యాంగ్ సహాయంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. రూ.30 లక్షల సుపారీ ఇచ్చి పథకం ప్రకారం దేవేందర్ హత్య జరిగిందని వర్ధన్నపేట ఏసీపీ నరసయ్య మీడియా సమావేశంలో వెల్లడించారు.రాయపర్తి మండలం బురహాన్‌పల్లిలో గతనెల 7న మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ హత్యకు గురయ్యాడు. భూ తగాదాలు, వ్యక్తిగత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందని.. ఈ హత్యలో పల్లె మల్లేశం అతడి కుమారుడు మురళి కీలకంగా వ్యవహరించి హైదరాబాద్‌కు చెందిన సుంకర ప్రసాద్, మర్నేని రాజు అనే సుపారి గ్యాంగ్ ద్వారా హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది అరెస్ట్ కాగా, ఇందులో A1గా సుంకర ప్రసాద్ నాయుడు, A2 గా మర్నేని రాజు సహా మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ తెలిపారు. -
బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేత వివాదం.. వేడెక్కుతున్న వరంగల్ పాలిటిక్స్
సాక్షి, వరంగల్: వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేత వివాదం ముదురుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. పార్క్ స్థలం ఎకరం భూమి ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించుకుని ప్రగల్భాలు పలుకుతున్నాడంటూ ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయానికి ఇంటి నంబర్ కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వరంగల్ బీఆర్ఎస్ నేతలను స్టువర్ట్ పురం చెడ్డి గ్యాంగ్ దొంగలుగా రాజేందర్ రెడ్డి అభివర్ణించారు. భూ ఆక్రమణలు చేసిన బీఆర్ఎస్ నేతల మీద రౌడి షీట్ ఓపెన్ చేసి చెడ్డిల మీద తిప్పాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలైనా వదిలిపెడతాను కానీ... వినయ్ భాస్కర్ చేసిన పాపాలను వదిలిపెట్టనంటూ ఎమ్మెల్యే నాయిని నిప్పులు చెరిగారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ పసునూరి దయాకర్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. విపక్ష పార్టీల్లో అసంతృప్త నేతలపై దృష్టి పెట్టింది. బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. దానం నాగేందర్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. -
‘మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడం బాధాకరం’
సాక్షి, ములుగు జిల్లా: సమ్మక్క సారలమ్మ జాతరలో రేపటి నుంచి మహాఘట్టం మొదలవుతుందని మంత్రి మంత్రి సీతక్క అన్నారు. మేడారం జాతర ఏర్పాట్లపై ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. గురువారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు అందరు దేవుళ్లు గద్దెలపై ఉంటారన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీళ్ల సౌకర్యం పెంచామని, భక్తులకు బంగారం(బెల్లం) చేరడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా కేంద్రం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ‘‘60 లక్షల మంది భక్తులు ఇప్పటికే అమ్మవార్లను దర్శించుకున్నారు. కోటి 50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతర సందర్భంగా సెలవులు ప్రకటించాము. సీఎం, గవర్నర్, స్పీకర్ అమ్మవార్ల దర్శనానికి వస్తారు. వీఐపీలు సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం పూర్తి చేసుకోవాలి. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలి. సమ్మక్క చరిత్రను శిలాశాసనం ద్వారా లిఖిస్తాం’’ అని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇదీ చదవండి: కుమారి ఆంటీని ఫాలో అవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు -
మేడారంలో ఆర్టీసీ బేస్ క్యాంప్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క
సాక్షి, ములుగు: సమ్మక్క సారలమ్మ జాతర సందర్బంగా భక్తుల సౌకర్యార్థం మేడారంలో ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ బేస్ క్యాంప్‌ను మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో భక్తులు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్స్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ నేతృత్వంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారన్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్‌తో కూడిన బేస్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బేస్ క్యాంప్‌లో 7 కిలో మీటర్ల పొడవునా 50 క్యూ లైన్లను నిర్మించినట్లు వివరించారు. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందని తెలిపారు. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల ఆదివారం నుంచి 25వ తేది వరకు 8 రోజుల పాటు ప్రత్యేక బస్సులను సంస్థ తిప్పుతున్నట్లు తెలిపారు. దాదాపు 15 వేల మంది ఆర్టీసీ సిబ్బంది ఈ జాతరకు పని చేస్తున్నారని స్పష్టం చేశారు. సిబ్బందికి సరిపడా విశ్రాంతి గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మేడారం జాతరకు అమల్లో ఉందని, మహిళలు పైసా ఖర్చు లేకుండా తల్లులను దర్శించుకోవచ్చన్నారు. గతంలో భక్తులు పెద్ద ఎత్తున కాలినడకన మేడారం జాతరకు వచ్చే వారని, ఉచిత ప్రయాణం వల్ల సురక్షింతంగా బస్సుల్లో వస్తున్నారని పేర్కొన్నారు. మేడారం జాతరకు బస్సుల్లో వచ్చే భక్తులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు నిబద్దత, క్రమ శిక్షణతో పని చేస్తున్నారని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శభరిష్, అదనపు కలెక్టర్ శ్రీజ, ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ రఘునాథ రావు, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్, తదితరులు పాల్గొన్నారు. -
ఈ గట్టున స్కీమ్‌లు.. ఆ గట్టున స్కామ్‌లు: మంత్రి కేటీఆర్
సాక్షి, వరంగల్: సంక్రాంతికి గంగిరెద్దుల వారి మాదిరిగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు వస్తున్నారంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. ఆ రెండు పార్టీలు చెప్పే మాటలు, ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని కోరారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో పశ్చిమ, తూర్పు రెండు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్.. సుమారు 900 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి ఆర్అండ్బి అతిథి గృహం, పోలీస్ భరోసా కేంద్రం, బస్తీ దవాఖానా, నీటి శుద్ధి కేంద్రం, సాప్ట్ వేర్ కంపెనీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. మోడర్న్ బస్ స్టేషన్, భద్రకాళి బండ్ పై సస్పెన్షన్ బ్రిడ్జి, మ్యూజికల్ ఫౌంటెన్, ఐటి టవర్, లాండ్రీ మార్ట్, స్మార్ట్ లైబ్రరీకి శంకుస్థాపనలు చేశారు. హన్మకొండ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ తీరు, బీజేపీ వైఖరిపై విమర్శలు గుప్పించారు. గతంలో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ అయితే వారికీ సహకరించింది బీజేపీ అంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణపై చిత్తశుద్ధితో ఆ రెండు పార్టీలు లేవని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ తెలంగాణపై విషం కక్కుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మాయమాటలతో మోసం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టం ఎంత ఉండేదో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఆ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాం.. బస్సులు పెడుతాం భోజన సౌకర్యం కల్పిస్తాం. ఎక్కడికైనా వెళ్లి కరెంట్ వైర్లు పట్టుకోవాలని సూచించారు. కరెంట్ కనిపించదు..కేసిఆర్ లెక్క సన్నగా ఉంటుంది... షాక్‌తో జాడిచ్చి తంతే అడ్రస్ లేకుండా పోతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకటా రెండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అద్బుతంగా కేసీఆర్ అమలు చేస్తున్నారని, కాంగ్రెస్ బీజేపీ నేతలకు అవి కన్పించడం లేదన్నారు. రంగస్థలం సినిమా పాటలా ఆ గట్టున ఉంటావా? ఈ గట్టున ఉంటావా తేల్చుకోవాలని సూచించారు. ఈ గట్టున స్కీమ్‌లు ఉన్నాయి.. ఆ గట్టున స్కామ్ లు ఉన్నాయి... ఈ గట్టున ప్రజాసంక్షేమం ఉంది.. ఆ గట్టున 60 ఏళ్లు జనాన్ని పీక్కు తిన్నవారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి మూల కేంద్రమైన ఓరుగల్లు గడ్డ కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచిందని అదే స్పూర్తితో బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. చదవండి: బీఆర్ఎస్కు రేఖా నాయక్ రాజీనామా.. కేటీఆర్‌పై షాకింగ్ కామెంట్స్ -
TS High Court: టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డిబార్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డిబార్‌ను తెలంగాణ హైకోర్టు ఎత్తివేసింది. కమలాపూర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థి హరీష్‌ను డీఈవో డీబార్ చేసిన విషయం తెలిసిందే.. దీనిపై విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో పదో పరీక్షలు హరీష్ రాశాడు. హరీష్ పదో తరగతి ఫలితాలను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. హరీష్‌పై డీబార్ ఉత్తర్వులు కొట్టివేస్తూ హైకోర్టు.. గురువారం తీర్పునిచ్చింది. హరీష్ రాసిన పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. వరంగల్ జిల్లాలోని కమలాపూర్ జడ్పీ బాలుర హైస్కూల్లో టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే టెన్త్ విద్యార్థి హరీష్ నుంచి పదో తరగతి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు తేలడంతో విద్యార్థిని అధికారురలు డీబార్ చేశారు. తన కుమారుడు హరీష్ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని తండ్రి హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడిని బెదిరించడంతోనే ప్రశ్నాపత్రం ఇతరులకు ఇచ్చాడని.. అదే వాట్సప్‌లో వచ్చిందన్నారు. తన కుమారుడిని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు హరీష్‌ను పదో తరగతి పరీక్ష రాసేందుకు అనుమతించింది. తర్వాత ఫలితాలు విడుదల సమయంలో హరీష్ ఫలితాలను వెల్లడించకుండా హోల్డ్‌లో పెట్టారు. దీంతో మరోసారి విద్యార్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విద్యార్థిపై ఉన్న డీబార్‌ను కొట్టివేస్తూ.. తక్షణమే ఫలితాలు వెల్లడించాలంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. చదవండి: ఎవరిది తప్పు.. ఎవరికి ముప్పు ? -
కూతురు ప్రేమపెళ్లి.. ఇటుకలపల్లిలో సర్పంచ్ వీరంగం..
సాక్షి, వరంగల్ జిల్లా: నర్సంపేట మండలం ఇటికాలపల్లి సర్పంచ్ మండల రవీందర్ వీరంగం సృష్టించారు. కూతురు కావ్యశ్రీ అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం ఇష్టంలేని అమ్మాయి తండ్రి సర్పంచ్ ఆగ్రహంతో తన బిడ్డను పెళ్ళి చేసుకున్న యువకుడి ఇంటితో పాటు వారి సహకరించిన ఇద్దరు స్నేహితుల ఇళ్లపై దాడి చేయించాడు. నిప్పంటించడంతో పర్నిచర్ దగ్ధమయ్యింది. ప్రేమజంట హసన్‌పర్తి పరిధిలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ప్రేమపెళ్లి అనంతరం సర్పంచ్ హసన్‌పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కావ్యను తనతో రమ్మని తండ్రి ఎంత బతిమలాడిన రాకపోవడంతో ఆగ్రహంతో స్వగ్రామానికి వెళ్లి రంజిత్ ఇంటితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు మిత్రుల ఇళ్లను దగ్ధం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు! -
మంత్రి సత్యవతి రాథోడ్ ఎందుకా శపథం చేశారు..?.. అసలు వ్యూహం ఏంటి?
ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాని మండలికి ఎన్నికయ్యారు.. ఎస్టీ కోటాలో మంత్రి పదవి పొందారు. తనను మంత్రిని చేసిన సీఎం కేసీఆర్‌పై స్వామిభక్తి చాటుకోవాలని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యేవరకు కాళ్లకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. చేతి మీద అధినేత పేరుతో పచ్చబొట్టు వేసుకుని సంబరపడుతున్నారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా చెప్పులు వేసుకోవడంలేదు. రాజకీయాల్లో పదవులు కాపాడుకోవడం, ఉనికి కాపాడుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. పదవులు పొందడానికి, ఉన్న పదవిని కాపాడుకోవడానికి అధినేత మెప్పు పొందడానికి ఎన్ని బాధలైనా పడతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ వ్యవహార సరళి గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి గులాబీ దళపతి కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టేవరకు కాళ్లకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. గత 4 నెలలుగా పాదరక్షలు లేకుండా తిరుగుతున్న మంత్రి సత్యవతి రాథోడ్.. తాజాగా తన చేతిపై కేసీఆర్ పేరును పచ్చ బొట్టు వేసుకుని స్వామి భక్తిని మరో సారి చాటుకున్నారు. స్వామి భక్తిని చాటుకోవడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవ్వరి అంచనాలకు అందకుండా తనను మంత్రిని చేసిన కేసీఆర్‌పై సత్యవతి రాథోడ్ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. శపథానికి కట్టుబడి నాలుగు మాసాలుగా చెప్పులు లేకుండా తిరగడంతో వేసవి ఎండల దృష్ట్యా అరికాళ్లకు బొబ్బలొచ్చి కంటతడి పెట్టారు. కేసీఆర్ పై ఉన్న అభిమానం ముందు కాళ్ల బొబ్బలు పెద్ద సమస్యే కాదని భావించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంజారా భవన్లో నిర్వహించిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో చేతిపై కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకురాలైన మంత్రి సత్యవతి రాథోడ్ తన పట్టును నిలుపుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. కేసీఆర్ దృష్టిని ఆకర్షించి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ పొందడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తోంది. కేసీఆర్ కోసం చెప్పులు వేసుకోవడం మానేసిన విషయాన్ని అందరూ మర్చిపోవడంతో పచ్చబొట్టు వేసుకొని తన ప్రతిజ్ఞను గుర్తుచేయడంతో పాటు.. కేసీఆర్ పట్ల ఎంతో అభిమానాన్ని చాటుకుంటున్నారని చెప్పే ప్రయత్నమని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. డోర్నకల్ లేదా మహబూబాబాద్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న సత్యవతి రాథోడ్ కేసీఆర్ కరుణ కోసమే ఇన్ని కష్టాలు పడుతున్నారని టాక్ నడుస్తోంది. చదవండి: జానారెడ్డి అసలు స్ట్రాటజీ ఇదేనా?.. సీఎం కుర్చీ కోసమేనా..? నియోజకవర్గం లేకుండా చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా కొనసాగుతున్న సత్యవతి, డోర్నకల్ టికెట్ ఆశిస్తున్నప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను కాదని సత్యవతికి టిక్కెట్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. మహబూబాబాద్‌లో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలోతు కవిత మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ పై స్వామిభక్తిని చాటుకుంటే ఎక్కడో ఓ చోట అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది. మంత్రి సత్యవతి రాథోడ్ తీసుకున్న నిర్ణయంపై తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో నొచ్చుకున్నారట. ఏమి అడగకుండానే ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్ పట్ల అభిమానాన్ని చాటుకుంటే ప్రత్యర్థులు లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారట. ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యే పదవి బెటర్ కావడంతో ఎట్టి పరిస్థితిలోనూ ఈసారి ఎమ్మెల్యే టికెట్ సాధించి తన రాజకీయ జీవితాన్ని పటిష్టపర్చుకునేందుకు సత్యవతి రాథోడ్ ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. -
వరంగల్ కేఎంసీలో మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం?
సాక్షి, వరంగల్: వరంగల్ కేఎంసీలో అస్వస్థతకు గురైన మెడికో స్టూడెంట్ లాస్య ఘటన తీవ్ర కలకలం రేపింది. మాత్రలు వేసుకొని అనారోగ్యానికి గురి కావడంతో సూసైడ్‌కు యత్నించిందని వదంతులు వ్యాపించాయి. మెడికో ప్రీతి సూసైడ్ ఘటన మరువకముందే మరో మెడికో అస్వస్థతకు గురికావడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పెడియాట్రిక్ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న లాస్య మైగ్రేన్ కారణంతో మెటాప్రోనాల్ మాత్రలు వేసుకుంది. మైగ్రేన్ కంట్రోల్ కాకపోవడంతో మరో టాబ్లెట్ వేసుకోగా ఓవర్‌డోస్ తో అనారోగ్యానికి గురైంది. మరో మెడికో అస్వస్థతకు గురై ఎంజీఎం లో చికిత్స పొందుతోందని తెలియగానే వైద్యవర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ప్రస్తుతం మెడికో లాస్య పరిస్థితి నిలకడగా ఉందని ఎంజీఎం సూపరిందెంట్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. ఆత్మహత్యాయత్నం ఘటన జరగలేదని, అనారోగ్యం కారణంతోనే ఎంజిఎంలో ప్రథమ చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించగా లాస్య హెల్త్ కండిషన్ ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న లాస్య పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చామని అన్నారు. మరోవైపు అనారోగ్యానికి గురైన లాస్య స్పందిస్తూ మైగ్రేన్ కారణంగానే మాత్రలు వేసుకోవడంతో ఓవర్‌డోస్ అయిందని, ఇతర కారణాలు ఏవీ లేవన్నారు. తన అనారోగ్య సమస్యను అనవసరంగా ఇష్యూ చేయొద్దని కోరారు. ఏదేమైనా మెడికో స్టూడెంట్ అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స తీసుకోవడం కేఎంసీ వర్గాల్లో కలకలం రేపింది. ప్రీతి ఘటన మరువకముందే మరో విద్యార్థి అనారోగ్యానికి గురికావడంతో కేఎంసీలో ఏదో జరిగిందని ప్రచారం మొదలైంది. మొత్తానికి లాస్య ఈ ఘటనపై స్పందిస్తూ తాను సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదని, స్వల్ప అస్వస్థతకు గురయ్యానని చెప్పడంతో కేఎంసీ యాజమాన్యం, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు -
ఎమ్మెల్యేగా సీతక్క కొడుకు పోటీ ఇక్కడి నుంచేనా..?
తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆదివాసీలతో మమేకమై వారి కోసమే శ్రమిస్తారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ తిరుగులేని నేతగా ఎదిగారు. ఇప్పుడామె తన వారసుడి కోసం నియోజకవర్గాన్ని రెడీ చేస్తున్నారు. పార్టీ పెద్దల మద్దతుతో పక్క జిల్లా నుంచి కొడుకుని ఎన్నికల బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క అంటే తెలియని వారు ఉండరు. రాజకీయాల్లో సీతక్క చెరగని ముద్ర వేసుకున్న ఆమె మావోయిస్టు ఉద్యమం నుంచి తెలుగుదేశం ద్వారా బహిరంగ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ములుగు నుంచి గెలిచాక ఒక వెనుదిరిగి చూడలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రజల తలలో నాలుకలా వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే సీతక్క కాంగ్రెస్ అగ్ర నేతలతో కూడా సాన్నిహిత్యం పెంచుకున్నారు. తన రాజకీయ జీవితం సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న దశలోనే తన కుమారుడు సూర్యను కూడా ఎమ్మెల్యే చేయాలని అనుకుంటున్నారు. ఇందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాకను ఎంచుకున్నారు. అక్కడి నుంచి కుమారుడిని పోటీ చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు. పినపాక నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన రేగా కాంతారావు గులాబీ గూటికి చేరడంతో అతనికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ దశలో సీతక్క కొడుకు సూర్య గత రెండేళ్లుగా పినపాక నియోజకవర్గంలోనే మకాం పెట్టారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులతో సీతక్కకు ఉన్న సత్సంబధాలతో ఎమ్మెల్యే పార్టీ మారినా కేడర్ దూరం కాకుండా కాపాడుకుంటు వచ్చారు. ఈ నేపథ్యంలో సూర్య పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌కు దగ్గరయ్యారు. సీతక్క సైతం తరచుగా పినపాకకు వెళ్లి వస్తున్నారు. ఒకదశలో సీతక్క పినపాక నుంచి పోటి చేస్తుందనే ప్రచారం జరిగింది. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావుకు చెక్ పట్టేందుకు రేవంత్ రెడ్డి వ్యూహత్మకంగా సూర్యను బరిలో దించే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినబడుతోంది. రేగా కాంతారావు బీఆర్ఎస్ లోకి రావటంతో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గులాబీ గూటిలో ఇమడలేక పోతున్నారు. ఆయననే కాంగ్రెస్ నుంచి బరిలో దించుతారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి సూర్యకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించే బాధ్యత కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తోంది. ములుగు ఎమ్మెల్యే సీతక్క దూకుడుకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల్లో సీతక్క ప్రభావం పెరుగుతుండటంతో గులాబీ పార్టీలో గుబులు రేపుతుంది. కనీసం పది, పదిహేను స్థానాల్లో సీతక్క ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యూహాత్మకంగా ములుగుకే సీతక్కను పరిమితం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. చదవండి: గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్ అయితే ములుగులో సీతక్కను ఢీ కొట్టగల సరైన అభ్యర్థి బీఆర్ఎస్కు కానరావడం లేదు. దీంతో ములుగు నుంచి రెండు సార్లు గెలిచి ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్న పోదెం వీరయ్యకు గులాబీ పార్టీ గాలం వేసింది. పలుమార్లు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడితో వీరయ్య వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ వీరయ్య బీఆర్ఎస్లోకి రాకపోతే మంత్రి సత్యవతి రాథోడ్‌ను ములుగు బరిలో దించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. అంతేకాకుండా మావోయిస్టు కుటుంబ నేపథ్యం ఉన్న ములుగు జడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పేరు కూడా వినిపిస్తోంది. ఏజెన్సీ ఏరియాలో సీతక్క ప్రభావం పెరుగుతుండటం.. ఆమె వారసుడు రాజకీయ అరంగేట్రం చేస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చదవండి: సిద్దిపేట: టీఆర్ఎస్ పేరుతో మరో కొత్త పార్టీ.. -
టెన్త్ పేపర్ లీక్ కేసులో కొత్త కోణం.. ఎగ్జామ్ సెంటర్లో జరిగింది ఇదేనా..?
సాక్షి, వరంగల్: పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసులో ఎవరో చేసిన తప్పిదానికి విద్యార్థి డిబార్ కావడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. కమలాపూర్ పరీక్ష కేంద్రం నుంచి హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన ఘటనతో ఐదేళ్ళు డిబార్ అయిన దండెబోయిన హరీష్ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థి హరీష్‌తో పాటు తల్లి లలిత పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుని డిబార్‌ను ఎత్తివేసి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కన్నీటిపర్యంతమై అధికారులను వేడుకున్నారు. హన్మకొండ జిల్లా కమలాపుర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదో తరగతి రాస్తున్న విద్యార్థి హరీష్ నుంచి శివ అనే బాలుడు రెండు రోజుల క్రితం హిందీ ప్రశ్నాపత్రం లాకెళ్లి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ కేసు సంచలనంగా మారి బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌తో పాటు పది మందిపై కేసు నమోదు చేశారు. డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసి ఇన్విజిలేటర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. విద్యార్థి హరీష్‌ను ఐదేళ్లు డిబార్ చేశారు. డిబార్ అయిన హరీష్ ఈ రోజు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుని బోరున విలపించారు. పరీక్ష రాస్తున్న సమయంలో హఠాత్తుగా తాను కూర్చున్న కిటికీ వద్దకు ఓ వ్యక్తి వచ్చి క్వశ్చన్ పేపర్ అడిగాడు.. తను ఇవ్వనని చెప్పాను కొంత సమయం గడిచాక వచ్చిన వ్యక్తి వెళ్లిపోయాడనుకుని క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టి ఆన్సర్ పేపర్ పై మార్జిన్ కొట్టుకుంటుండగా మళ్లీ ఆ వ్యక్తి వచ్చి ప్రశ్నపత్రం లాక్కుని ఫొటో తీసుకుని మళ్లీ పేపర్ నావైపు విసిరాడు ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు లేకుంటే చంపుతామని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: టెన్త్ పేపర్ లీక్ పెద్ద గేమ్‌ప్లాన్ అంత వరకే తనకు తెలుసని ఆ తరువాత ఎం జరిగిందో తనకు తెలియదని విద్యార్థి హరీష్ అంటున్నాడు. ఈ రోజు ఇంగ్లీష్ పరీక్ష రాయడానికి సెంటర్ వద్దకు రాగానే డిఈఓ హాల్ టికెట్ తీసుకుని సంతకం తీసుకున్నాడని ఎందుకు సంతకం తీసుకున్నారని అడిగితే హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఐదేళ్లు డిబార్ చేశామని తెలిపారని అన్నారు. తనకు తెలియకుండా జరిగిన తప్పుకు శిక్ష వేయడం అన్యాయమని కన్నీరుమున్నీరయ్యాడు. ఎవరో చేసిన తప్పుకు నేను బలి అయ్యానని, నా భవిష్యత్తును నాశనం చేయొద్దని శనివారం జరిగే గణితం పరీక్షకు అధికారులు అనుమతి ఇవ్వాలని వేడుకుంటున్నారు హరీష్‌తోపాటు తల్లి లలిత సైతం కన్నీరుమున్నీరుగా విలపిస్తూ నా కొడుకు భవిష్యత్తుతో ఆడుకోవద్దని వేడుకున్నారు. ఎలాంటి తప్పు చేయలేదు.. ఎవరో చేసిన తప్పును నాకొడుకు శిక్ష వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ కష్టం చేసుకుని బతికే కుటుంబం మాది.. ఏంజెపి గురుకుల్ పాఠశాలలో హాస్టల్లో చదివిస్తున్నామని, న్యాయం చేయాలని విద్యార్థి తల్లి కోరుతుంది. -
సంజయ్‌కు బెయిల్
సాక్షి ప్రతినిధి, వరంగల్/ వరంగల్ లీగల్: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు హనుమకొండ నాలుగో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం రాత్రి బెయిల్ మంజూరు చేసింది. కమలాపూర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి హిందీ పరీక్ష పత్రం లీక్, కాపీ కుట్ర కేసులో పోలీసులు బుధవారం బండి సంజయ్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంజయ్ తరఫు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్‌పై గురువారం సుదీర్ఘంగా విచారణ సాగింది. పలుమార్లు వాయిదాలతో.. సుమారు 8 గంటల పాటు జరిగిన వాదోపవాదాల అనంతరం రాత్రి 10 గంటల సమయంలో జడ్జి రాపోలు అనిత తీర్పు ఇచ్చారు. రూ.20 వేల చొప్పున ఇద్దరు జమానతుదారుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. దేశం విడిచి వెళ్లకూడదని, కేసు విచారణ నిమిత్తం ప్రాసిక్యూషన్‌కు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, సాక్ష్యాలను చెరిపివేయకూడదని షరతులు విధించారు. బెయిల్ ప్రక్రియ పూర్తయ్యేసరికి గురువారం రాత్రి అవడంతో.. బండి సంజయ్ శుక్రవారం ఉదయం కరీంనగర్ జైలు నుంచి విడుదల కానున్నారు. దురుద్దేశంతో ఇరికించారు..: సంజయ్ లాయర్లు బండి సంజయ్ బెయిల్ విషయమై కోర్టులో గురువారం లంచ్ విరామం తర్వాత మొదలైన వాదనలు రాత్రి 8 గంటల వరకు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా పోలీసులతో అక్రమ కేసు బనాయించిందని ఆయన తరఫు న్యాయవాదులు శ్యాంసుందర్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, రామకృష్ణ, సునీల్‌లు వాదించారు. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఆరోపణలుగానీ, ఫిర్యాదుదారు పిటిషన్లో ఆరోపించిన విషయాలుగానీ బండి సంజయ్‌కు వర్తించవని.. దురుద్దేశంతోనే కేసులో ఇరికించారని పేర్కొన్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించి విచారణ పూర్తయిందని, నివేదిక మాత్రమే కోర్టులో దాఖలు చేయాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. సాక్షులను ప్రభావితం చేయడంగానీ, సాక్ష్యాధారాలను చెరిపేయడంగానీ చేసే ఆస్కారం లేనందున సంజయ్‌కు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా ఎంపీగా, సంబంధిత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ ఆ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. బెయిలిస్తే శాంతిభద్రతల సమస్య: పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరోవైపు సంజయ్‌కు బెయిల్ ఇవ్వకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేవతిదేవి కోర్టును కోరారు. ‘‘తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇదే తీరుగా నేరాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాల్సి ఉంది. నిందితుడు బండి సంజయ్‌కు బెయిల్ ఇస్తే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయనపై తీవ్రమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. అది రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉంది. అంతేగాకుండా ఈ కేసులో మరికొందరు సాక్షులను విచారించాలి. నిందితులు ముందస్తుగా కుట్రపన్ని ప్రశ్నపత్రాల లీక్, కాపీకి పాల్పడ్డారు. వారి ఫోన్‌కాల్స్, వాట్సాప్ చాట్ల వివరాలను విశ్లేషించడం ద్వారా వారి పాత్ర బయటపడింది. ఇంకా సాంకేతిక ఆధారాలు లభించాల్సి ఉంది. వాస్తవాలను వెలికితీసేందుకు లోతైన దర్యాప్తు అవసరం. ఏ1 నిందితుడికి బెయిలిస్తే సాక్షులను బెదిరించి, దర్యాప్తునకు ఆటంకం కల్పించడంతోపాటు సాంకేతిక ఆధారాలను చెరిపేసే అవకాశం ఉంది. సంజయ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలి’’ అని కోరారు. బెయిల్ మంజూరు.. కస్టడీ పిటిషన్ వాయిదా ప్రాసిక్యూషన్, బండి సంజయ్ తరఫు న్యాయవాదుల వాదనల అనంతరం గురువారం రాత్రి 10 గంటల సమయంలో జడ్జి తీర్పు ఇచ్చారు. సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. జమానతుదారుల పూచీకత్తు పత్రాలను సంజయ్ తరఫు న్యాయవాదులు సమర్పించగా.. కోర్టు విడుదల ఆదేశాలు (రిలీజ్ ఆర్డర్) జారీ చేసింది. మరోవైపు సంజయ్‌ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌పై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. శనివారం ఉదయం విడుదల బండి సంజయ్ బెయిల్ పేపర్లు ఇంకా మాకు అందలేదు. అందినా రాత్రి పూట విడుదల చేసే అవకాశం లేదు. శుక్రవారం ఉదయం బెయిల్ పేపర్లు అందే అవకాశాలు ఉన్నాయి. రాగానే వాటిని పరిశీలించి సంజయ్‌ను విడుదల చేస్తాం. – సమ్మయ్య, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ చదవండి: బండి సంజయ్ చేసిన తప్పేంటి?.. అది లీకేజీ ఎలా అవుతుంది: హైకోర్టు -
బండి సంజయ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
సాక్షి, వరంగల్: టెన్త్ పేపర్ లీక్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ1గా బండి సంజయ్ పేరును చేర్చారు. ఏ2 ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా శివగణేష్, ఏ6గా పోగు సుభాష్, ఏ7గా పొగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్‌ను పోలీసులు పేర్కొన్నారు 120(బి) సెక్షన్ కింద సంజయ్‌పై కేసు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్ట్‌లో మొత్తం 10 మంది నిందితుల పేర్లు చేర్చారు. బండి సంజయ్ సహా ప్రశాంత్, మహేష్, శివగణేష్లను అరెస్ట్ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. టెన్త్ విద్యార్థికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరికొంతమంది కీలక సాక్షులను విచారించాల్సి ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ‘‘ఏ2 ప్రశాంత్ ఎమ్మెల్యే ఈటలకు 10:41కి పేపర్‌ను పంపించారు. బండి సంజయ్‌కు 11:24కి ప్రశ్నపత్రం చేరింది. 9:30కే ప్రశ్నాపత్రం లీకైందంటూ ప్రశాంత్ తప్పుడు వార్తలు ప్రచారం చేశాడు. ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. ఏ4గా మైనర్ ఉండటంతో వివరాలు వెల్లడించడం లేదు. టెన్త్ హిందీ పేపర్‌ను ప్రశాంత్ వైరల్ చేశాడు. ఈటల సహా చాలా మంది నేతలకు టెన్త్ పేపర్ వెళ్లింది. పరీక్షకు ముందు రోజు ప్రశాంత్, బండి సంజయ్ చాటింగ్ జరిగింది’’ అని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. ‘‘ప్రశాంత్, సంజయ్ మధ్య తరుచూ ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి. బండి సంజయ్ ఫోన్ ఇచ్చేందుకు నిరాకరించారు. మెసేజ్ షేర్ చేసినందుకు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని కుట్రపన్నారు. చాటింగ్ ఆధారంగానే బండి సంజయ్‌ను ఏ1గా చేర్చాం. టెన్త్ పేపర్ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది. పేపర్ లీక్‌పై మీడియాకు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇస్తున్నారు. బండి సంజయ్ ఫోన్ లభ్యమైతే మరింత సమాచారం తెలుస్తుంది’’ అని సీపీ పేర్కొన్నారు. చదవండి: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తలపించేలా.. కోర్టు ముందుకు బండి సంజయ్.. ‘‘వాట్సాప్ మెసేజ్‌లను రిట్రీవ్ చేస్తున్నాం. పేపర్ లీక్ అంతా గేమ్ ప్లాన్‌లా చేస్తున్నారు. నమో టీమ్‌లో ఏ2 ప్రశాంత్ పని చేస్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్‌ను లోక్‌సభ స్పీకర్‌కు తెలియజేశాం. మేం పక్కాగా లీగల్ ప్రొసీజర్‌నే ఫాలో అయ్యాం. బండి సంజయ్ డైరెక్షన్లోనే పేపర్ లీకేజీ వ్యవహారం జరిగింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగింది’’ అని సీపీ వెల్లడించారు. -
మెడికో ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యే: బండి సంజయ్
సాక్షి, వరంగల్ జిల్లా: మెడికో ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది ప్రీతి కాదని, ఒకవేళ ఆత్మహత్య చేసుకుందని ప్రభుత్వం భావిస్తే అందుకు సంబంధించిన ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జీచే న్యాయ విచారణ జరిపించాలని కోరారు. తప్పు లేకపోతే ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో ప్రీతి తల్లిదండ్రులను బండి సంజయ్ పరామర్శించారు. ఆయన రాకతో బీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రీతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన దిగారు. అడ్డుకునే ప్రయత్నం చేయగా బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. బండి సంజయ్ ముందు ప్రీతి తల్లిదండ్రులు నరేందర్ శారద తమ గోడును వెల్లబోసుకున్నారు. న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించేలా చూడాలని సంజయ్‌ని ప్రీతి తండ్రి కోరారు. న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని సంజయ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రీతి ఘటనపై ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. చదవండి: ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కీలక ఎవిడెన్స్.. రాష్ట్ర ప్రభుత్వం ప్రీతి విషయాన్ని డైవర్ట్ చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ప్రీతి మృతికి కారకులైన వారందరికీ కఠిన శిక్షపడే వరకు బీజేపీ పోరాడుతుందని తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రిలోనే ప్రీతి చనిపోయిందని, డెడ్ బాడీని నిమ్స్ తరలించి ట్రీట్ మెంట్ చేస్తున్నట్లు డ్రామాలాడారని విమర్శించారు. సైఫ్‌ను కాపాడేందుకే కేసీఆర్ ప్రభుత్వం డ్రామాలాడుతుందని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా న్యాయ పోరాటం చేస్తామన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటలపాటు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. -
ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కీలక ఎవిడెన్స్..
సాక్షి, వరంగల్ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కీలక ఆధారం లభ్యమయింది. ఈ కేసులో జూనియర్ మెడికో వాంగ్మూలం కీలకంగా మారనుంది. పోలీస్ విచారణ, యాంటీ ర్యాగింగ్ కమిటీలో కీలక విషయాలను బయట పెట్టిన జూనియర్ డాక్టర్.. ప్రీ అనస్థిషియా రిపోర్ట్ వివాదంలో డాక్టర్ సైఫ్ చెప్పిన అభిప్రాయానికి భిన్నమైన విషయాలను వెల్లడించారు. పీఏసీ రిపోర్ట్ విషయంలో డాక్టర్ సైఫ్ ఫిజికల్‌గా లేకున్నా డాక్టర్ ప్రీతిని బ్లేమ్ చేసినట్టు నిర్ధారణ అయింది. జీఎంహెచ్‌లో జూనియర్ విద్యార్థినికి డిక్టేట్ చేస్తూ పీఏసీ రిపోర్ట్‌ని డాక్టర్ ప్రీతి ఫైండింగ్స్ పొందుపరిచినట్లు విచారణలో వెలుగు చూసింది. డాక్టర్ సైఫ్ తనను కావాలని వేధిస్తున్నాడని, పీఏసీ రిపోర్ట్ వివాదం వివరించి తనకు సపోర్ట్ చేయాలని అర్ధించిన డాక్టర్ ప్రీతి.. తనపై కుట్ర జరుగుతోందని మానసిక సంఘర్షణకు లోనైంది. ఇదే విషయం లాస్ట్ కాల్లో సహ విద్యార్థికి తన ఆవేదన వెలిబుచ్చింది. డాక్టర్ ప్రీతి లాస్ట్ కాల్‌పై పూర్తి స్థాయి సమాచారాని విచారణ బృందం సేకరిస్తోంది. పీఏసీ రిపోర్ట్ విషయంలో నిందితుడు డాక్టర్ సైఫ్ వాదన అవాస్తవమని పోలీస్ విచారణ రుజువు చేస్తోంది. డాక్టర్ సైఫ్, డాక్టర్ ప్రీతి మధ్య వివాదంగా మారిన ప్రశ్నించే తత్వం, దానికి సంబంధించిన చాట్స్ లభ్యమైంది. మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ ఆధారాల ఆధారంగా కేసును పోలీసులు అధికారులు బిల్డప్ చేయనున్నారు. సైఫ్ వేధింపులపై సాంకేతిక పరమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. నాలుగు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్న సైఫ్ చెప్పిన వివరాలతో అనస్తీషియా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నాయి. కౌన్సిలింగ్లో ప్రీతి కన్నీరు పెట్టడంపై పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జీఎంహెచ్‌లో సైఫ్, అనస్తిషియా డిపార్ట్మెంట్లో హెచ్‌వోడీ వ్యవహారం, ప్రీతి ఆడియోల్లో హెచ్‌వోడి పేరు ప్రస్తావించడాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. సైఫ్, హెచ్‌వోడి నాగార్జున రెడ్డి వ్యవహారాన్ని పోలీసులు ర్యాగింగ్ కోణంలో చూస్తున్నారు. లీవ్, కౌన్సిలింగ్ విషయంలో నాగార్జున్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదమయింది. ఇప్పటికే హెచ్‌వోడీని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ రోజుతో సైఫ్ నాలుగు రోజుల పోలీసుల కస్టడీ ముగుస్తుంది. కాగా, రేపు(సోమవారం) కోర్టులో సైఫ్‌ను హాజరు పరిచి జైలుకు తరలించనున్నారు. చదవండి: కాలేజీ యాజమాన్యమే మా కొడుకును చంపేసింది: సాత్విక్ పేరెంట్స్ -
ప్రీతి ఫోన్ కాల్ ఆడియో వెలుగులోకి.. తల్లితో ఏం చెప్పింది?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. నిమ్స్‌లో ఐదు రోజులుగా చికిత్స కొనసాగుతోంది. కాగా, సైఫ్ వేధింపులపై మెడికో ప్రీతి ఫోన్ కాల్ ఆడియో బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి ముందు తల్లికి ప్రీతి ఫోన్ చేసి తన బాధను ఫోన్‌కాల్‌లో చెప్పుకుంది. ‘‘సైఫ్ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లు అంతా ఒక్కటే. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా లాభం లేకుండా పోయింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి’’ అంటూ తల్లితో ప్రీతి ఆవేదన వ్యక్తం చేసింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా ఒకటై నన్ను దూరం పెడతారని, ప్రిన్సిపాల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్‌వోడి నాగార్జునరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రీతి ఆవేదన చెందగా, సైఫ్‌తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని ప్రీతి తల్లి చెప్పింది. కాగా, ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్ కాలేజీ, ఎంజీఎం హెచ్ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్‌ఫోన్, వాట్సాప్ గ్రూపులలో చాటింగ్‌ల ఆధారంగా విచారణ జరిపారు. ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చదవండి: నవీన్ హత్యకేసు నిందితుడు హరిహర ఫోన్ కాల్ వైరల్ -
రక్తం సలసల మరుగుతోంది.. కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వరంగల్: బీజేపీ కార్యకర్తలను కేసులతో బెదిరించలేరని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాళాల మైదానంలో బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, బైంసాలో ఎంఐఎం కుట్రలను తట్టుకొని ధర్మం కోసం బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు బతికినన్నాళ్లు ధర్మం కోసమే బతుకుతారన్నారు. ట్రాఫిక్ నిబంధనల పేరుతో బీజేపీ సభలను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. చదవండి: తెలంగాణలో నయా నిజాం వచ్చారు.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జేపీ నడ్డా ‘‘బీజేపీ తెలంగాణ అభివృద్ధి కోసమే మాట్లాడుతుంది. నన్ను అరెస్ట్ చేసినా నా యాత్ర ఆపలేదు. కార్యకర్తలను, పార్టీ శ్రేణులను కేసులు, అరెస్టులతో ఇబ్బందులు పెట్టారు. ఎప్పుడు చస్తామో, ఎన్నాళ్లు బతుకుతామో చెప్పలేని పరిస్థితులు. కేసీఆర్‌ను వదిలే ప్రసక్తేలేదు.. రక్తం సలసల మరుగుతోంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో చర్చకు మేం సిద్ధం. కేసీఆర్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు’’ అని బండి సంజయ్ అన్నారు. -
అమెరికా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి.. పెళ్లి మామూలుగా లేదుగా..
సాక్షి, హన్మకొండ: అమెరికా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి ఒక్కటయ్యారు. మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు నడిచి ఆలుమగలయ్యారు. హిందూ సాంప్రదాయం పద్దతిలో ఓరుగల్లు వేదికగా ఖండాంతరం వివాహం చేసుకున్నారు. ఆదర్శ వివాహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు బంధుమిత్రులు హాజరై నవ దంపతులను అభినందించి ఆశీర్వదించారు. చదవండి: పెట్స్.. అదో స్టేటస్! అమెరికా కు చెందిన యువతి డాక్టర్ జెన్నా బ్లెమర్ను హనుమకొండకు చెందిన పుట్ట అరవింద్ రెడ్డి వివాహం చేసుకున్నారు. హనుమకొండలోని ఓ ఫంక్షన్ హాల్లో హిందూ సాంప్రదాయ పద్దతిలో ఇరు కుటుంబ సభ్యులు వివాహ వేడుక నిర్వహించారు. హన్మకొండకు చెందిన అనిత మోహన్‌రెడ్డి దంపతుల కుమారుడు అరవింద్ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లగా అక్కడ డాక్టర్ జెన్నా బ్లెమర్తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులకు తెలుపగా ఇరువురి పేరెంట్స్ ఓకే చెప్పారు. ఇంకేముంది ముహుర్తం ఖరారు చేసుకుని హిందు సాంప్రదాయ పద్దతిలో హన్మకొండలో వివాహం జరిపించారు. అచ్చం తెలుగింటి ఆడపడుచులా చీరకట్టులో అమెరికా అమ్మాయి, వారి పేరెంట్స్ ముస్తాబై ముచ్చటపడ్డారు. కన్యాదానం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు హిందూ వివాహ సాంప్రదాయాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియా, హిందుసాంప్రదాయాలు చాలా బాగున్నాయని నవవదువు జెన్న బ్లెమర్ తెలిపారు. ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నామని వరుడు అరవింద్ చెప్పారు. అమెరికాకు చెందిన వధువు పేరెంట్స్ అచ్చం తెలుగువారిలా పంచే, చీరకట్టులో అందరి దృష్టిని ఆకర్షించారు. హిందూ సంప్రదాయాలు పెళ్ళితంతు నచ్చిందని అమ్మాయి పేరెంట్స్ తెలిపారు. అబ్బాయికి నచ్చిన అమ్మాయితో వివాహం జరిపించడం సంతోషంగా ఉందని వరుడి పేరెంట్స్ తెలిపారు. -
రాహుల్ గాంధీకి మంత్రి ఎర్రబెల్లి కౌంటర్
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ రాజకీయ డ్రామా అంటూ మంత్రి ఎర్రబెల్లి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. ఆయన శుక్రవారం రాత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి మాట్లాడాలన్నారు. కాంగ్రెస్‌వి మోసపూరిత వాగ్ధానాలంటూ దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు ఛతీస్‌గడ్‌లో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. చదవండి: వరంగల్ సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు -
భక్తుల వద్దకే మేడారం బస్సులు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం 51 ప్రాంతాల నుంచి 3,845 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ బస్సులు అమ్మవారి గద్దెలకు చేరువగా వెళతాయని చెప్పారు. భక్తులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ఐదారు కిలోమీటర్ల దూరంలో వాటిని నిలిపి ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తు చేశారు. మేడారం జాతర నేపథ్యంలో శుక్రవారం ఆయన బస్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. చదవండి: మేడారంలో ‘గుడిమెలిగె’ 30 మంది భక్తులు ఒకేచోట ఉంటే.. వారి చెంతకే బస్సును పంపుతామని, కావాల్సిన వారు 040–30102829 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. మేడారంలో 50 ఎకరాల్లో బేస్ క్యాంపు, తాత్కాలిక బస్టాండ్, క్యూలైన్లు, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన టాయిలెట్ల వసతి ఏర్పాటు చేశామని వివరించారు. మేడారం జాతర వివరాలు, బస్సుల సమగ్ర సమాచారం, సమీపంలో ఉండేందుకు హోటల్ వసతి, చార్జీలు, ఇతర విభాగాల వివరాలతో.. కిట్స్ కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు. -
క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురి మృతి
మడికొండ: చీకట్లోనే విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కూలీలను క్వారీ గుంత మింగేసింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామశివారులోని లక్ష్మి గ్రానైట్ క్వారీలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చిత్రం చందు(20), జార్ఖండ్ రాష్టానికి చెందిన మహ్మద్ హకీమ్(22)లు హెల్పర్లుగా, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండకు చెందిన కొతల ముఖేశ్(23) లారీడ్రైవర్‌గా ఆరునెలల నుంచి లక్ష్మి గ్రానైట్‌లో పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత హకీమ్, చందులు క్వారీలోని వేస్ట్ మెటీరియల్‌ను టిప్పర్‌లో తరలిస్తుండగా అది అదుపుతప్పి క్వారీ గుంతలో బోల్తాపడింది. దీంతో మహ్మద్ హకీమ్ అక్కడిక్కడే మృతి చెందాడు. గాయపడిన చందు, డ్రైవర్ ముఖేశ్‌లను ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చందు చనిపోయాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ ముఖేశ్ మృతిచెందాడు. చదవండి: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి -
ఈటలపై భూకబ్జా ఆరోపణలు: కమలాపూర్‌లో హై టెన్షన్..
సాక్షి, వరంగల్: ఈటల రాజేందర్ స్వగ్రామం కమలాపూర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈటల భూ వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. కమలాపూర్‌లో ఈటల అభిమానులు ఆందోళనకు దిగారు. ఆయనకు వస్తున్న ప్రజాదరణచూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ నుంచి అభిమానులు హైదరాబాద్ బయలుదేరారు. ఈటలకు అన్యాయం చేస్తే సహించేది లేదని అభిమానులు అన్నారు. హైదరాబాద్‌లో కూడా మంత్రి ఈటలకు మద్దతుగా కార్యకర్తలు నిరసన చేపట్టారు. తమ నేతను అక్రమంగా భూ వివాదంలో ఇరికించారని ఆందోళనకు దిగారు. శామీర్‌పేట్‌లో కార్యకర్తల రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. ఈటల రాజేందర్.. 2004 నుంచి ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్‌గా, మంత్రిగా టీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుల్లో కీలక నేత ఈటల. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీ, అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన పలుమార్లు తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా చెపుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. అయితే.. ప్రజల పక్షాన మాట్లాడుతున్నానంటూ... కొన్ని సార్లు ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధించేందుకూ వెనుకాడలేదు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల చురుకైన పాత్ర పోషిస్తున్న ఈటల తన సమర్ధతను చాటుకున్నారు. వ్యాక్సిన్ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అంతా సర్దుకుంటుందనుకునే లోపే శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చిన మాసాయిపేట మండలంలోని అసైన్డ్ భూముల వివాదం కొత్త చర్చకు దారితీసింది. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరంగా మారింది. చదవండి: ఈటలపై భూకబ్జా ఆరోపణలు: వివరాలు వెల్లడించిన కలెక్టర్ ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..? -
వ్యాక్సిన్ : వరంగల్‌లో హెల్త్ వర్కర్ మృతి!
సాక్షి, వరంగల్ : కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల్లోనే 10 లక్షల మంది హెల్త్ వర్కర్స్, ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేశారు. రానున్న రోజుల్లో పోలీసులు, ప్రజాప్రతినిధులకు వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్ కోరల్లో నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వైద్యులతో పాటు ప్రభుత్వాలు సైతం చెబుతున్నాయి. ఈ క్రమంలో కరోనా టీకా తీసుకున్న కొందరు అస్వస్థతకు గురవుతుండగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. టీకా తీసుకున్న అనంతరం ఉత్తర ప్రదేశ్, కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఒక్కరు చొప్పున మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. చదవండి: వికటించిన వ్యాక్సిన్.. ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్! గుండెపోటుతో నిర్మల్‌లో విఠల్‌రావు చనిపోగా, గుంటూరులో ఆశ కార్యకర్త విజయలక్ష్మి బ్రెయిన్ డెడ్ అయింది. అయితే వీరి మరణాలకు కోవిడ్ టీకానే కారణమా అని ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున అనంతరం మరో మహిళ మృతి చెందడం కలకలం రేపుతోంది. వరంగల్ అర్బన్ శాయంపేట అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్ వనిత.. ఈ నెల 22న వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆమె మరణించారు. అయితే వ్యాక్సిన్ వల్లే ఆమె మృతి చెందిందని బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె వ్యాక్సిన్ రియాక్షన్ కారణంగానే మరణించిందని వైద్యులు నిర్థారించలేదు. చదవండి: ఒకవేళ విద్యార్థులకు కరోనా సోకితే.. ఘటనపై నివేదిక కోరిన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ వరంగల్ అర్బన్ జిల్లాలో హెల్త్ కేర్ వర్కర్ మృతిపై జిల్లా అధికారులను తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు నివేదిక కోరారు. హెల్త్ కేర్ వర్కర్ మరణంపై ఏఈఎఫ్ఐ నివేదికను సిద్ధం చేస్తోంది. కేంద్ర ఏఈఎఫ్ఐ బృందంతో చర్చించాకే తుది నివేదిక ఇవ్వనున్నారు. -
మొన్న తమ్ముడు.. నేడు అన్న
సాక్షి, వర్గల్(గజ్వేల్): వారిద్దరు అన్నదమ్ముల పిల్లలు.. ఒకే ప్రమాదం.. ఒక విషాదం నుంచి కోలుకోకముందే మరో విషాదం. మొన్న తమ్ముడు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు అన్న.. అయిదురోజుల వ్యవధిలో సోదరుల దుర్మరణం.. రెండు కుటుంబాలకు కడుపుకోత మిగిల్చిన రోడ్డు ప్రమాదం. వర్గల్ మండలం అనంతగిరిపల్లిలో పెనువిషాదాన్ని మిగగిల్చింది. ఈ నెల 15న మంగళవారం ఉదయం తూప్రాన్ మండలం అల్లాపూర్ చౌరస్తావద్ద ఈ ప్రమాదం జరగగా అనంతగిరిపల్లికి చెందిన తుమ్మల అరవింద్ కుమార్ (15) అక్కడికక్కడే మృతి చెందిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తుమ్మల కరుణాకర్ (19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అనంతగిరిపల్లిలో రైతు కుటుంబానికి చెందిన తుమ్మల రామకృష్ణ–లక్ష్మి దంపతుల కుమారుడు కరుణాకర్, అతడి చిన్నాన్న తుమ్మల లక్ష్మణ్–లత దంపతుల కుమారుడు(వరుసకు తమ్ముడు) అరవింద్ కుమార్‌లు 15న ఉదయం సమీప బంధువు కూతురును బైక్‌మీద తూప్రాన్ సమీప పరిశ్రమ వద్ద దింపేశారు. అక్కడి నుంచి గ్రామానికి తిరిగొస్తుండగా అల్లాపూర్ చౌరస్తావద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో అక్కడికక్కడే అరవింద్ మృతి చెందగా, తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన కరుణాకర్ సోమవారం తుదిశ్వాస విడిచాడు. ఇంటర్ చదివిన కరుణాకర్ అవివాహితుడు. చదువు కొనసాగిస్తున్న దశలోనే ఇద్దరు మృత్యుపాలవడం, ఎదిగిన కొడుకులు కానరాని తీరాలకు చేరడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. పోస్టుమార్టం అనంతరం పోలీసులు కరుణాకర్ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. -
విద్యుత్ షాక్‌తో దంపతుల దుర్మరణం
వర్గల్(గజ్వేల్): వ్యవసాయ బావి వద్ద సంపుహౌజ్‌లో కాళ్లు, చేతులు కడుక్కునేందుకు వెళ్లిన దంపతులు విద్యుత్ షాక్‌కు గురై అందులోనే పడి దుర్మరణం చెందారు. పెను విషాదం నింపిన ఈ ఘటన ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదరిపల్లిలో జరిగింది. వ్యవసాయ క్షేత్రం వద్ద బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. వివరాల్లోకి వెళ్తే..వర్గల్ మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు మానుక వెంకటేశ్‌గౌడ్(30), రేణుక(26)లకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి శరత్ (7), తనూష(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి గ్రామానికి పక్కనే వర్గల్ శివారులో 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయ పనులు చేసేందుకు దంపతులిద్దరూ ఆదివారం ఉదయం 7 గంటలకు మొక్కజొన్న కంకులు తెంపేందుకు వెళ్లారు. పొలానికి వెళ్లేముందు పిల్లలిద్దర్నీ వెంకటేశ్ తల్లికి అప్పగించారు. విక్రయానికి సరిపడా కంకులు కోసి ఆటోలో నింపి కాళ్లు, చేతులు కడుక్కునేందుకు దంపతులిద్దరూ వారి పొలంలోనే ఉన్న మోటారుపంపు దగ్గరకు వెళ్లారు. అప్పటికే మోటారు పంపు నుంచి వస్తున్న నీళ్లలో విద్యుత్ వస్తుండటంతో ఆవిషయం తెలియని దంపతులిద్దరూ అందులో కాలుపెట్టగానే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నీళ్ల కోసం వచ్చిన సమీప రైతు నీళ్లలో మునిగిపోయి కన్పిస్తున్న దంపతుల మృతదేహాలను చూసి కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారి తల్లిదండ్రులు, సోదరుడు, బంధుగణం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి పరామర్శించి ఓదార్చారు. -
ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి
సాక్షి, హన్మకొండ: గతంలో వరంగల్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హన్మకొండ గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టకుని వరంగల్‌కు వస్తున్నారో ప్రజలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. (వరంగల్‌లో అదృశ్యం.. కశ్మీర్లో ప్రత్యక్షం) గతంలో గ్రేటర్ వరంగల్‌కు ప్రతి ఏడాది రూ.300 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారని, కేంద్ర నిధులతో చేసిన అభివృద్ధి పనులే తప్ప, ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు.కేంద్రం ఇచ్చిన నిధులతో చేసిన పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుని ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
నేడు చిలకలగుట్ట నుంచి సమ్మక్క రాక
-
మేడారం.. అన్నీ ‘ప్రత్యేకం’
ఆదివాసీల అతి పెద్ద జాతర.. దక్షిణాది కుంభమేళ.. మేడారం జాతర ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. ప్రతి అంశం వెనుక ఓ చరిత్ర ఉంది. ప్రతి ప్రక్రియకు ప్రత్యేకత ఉంది. ఒక్కో ఊరికి ఒక్కో చరిత్ర. వనదేవతలుగా ప్రసిద్ధికెక్కిన ఒక్కొక్కరిదీ ఒక్కో వీరగాథ. మేడారంలోని కీలక అంశాలపై ప్రత్యేక కథనం.. పగిడిద్దరాజు గుడి.. పూనుగొండ్ల మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో పూనుగొండ్ల గ్రామం ఉంది. ఇక్కడ సమ్మక్క భర్త పగిడిద్దరాజు గుడి ఉంది. మేడారం, పూనుగొండ్ల మధ్య దూరం నలభై కిలోమీటర్లు. సమ్మక్క భర్త పగిడిద్దరాజును పూనుగొండ్ల నుంచి మేడారానికి తీసుకువస్తారు. పెనక వంశానికి చెందిన పగిడిద్దరాజును అదే వంశానికి చెందిన పెనక బుచ్చి రామయ్య అనే పూజారి పూనుగొండ్ల గ్రామం నుంచి కాలినడకన తీసుకువస్తారు. వెన్నెలక్క నెలవు.. కన్నెపల్లి తాడ్వాయి మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో కన్నెపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామంలోనే వెన్నెలమ్మగా పిలిచే సారలమ్మ ఆలయం ఉంది. జాతర సమయంలో ఇక్కడి నుంచి జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వరకు సారలమ్మను ఆదివాసీ పూజారులు తీసుకొస్తారు. ఈ ఊరి జనాభా 282 మంది. ఈ గ్రామ ప్రజలు ఏం చేయాలన్నా సారలమ్మ ఆశీర్వాదం తప్పనిసరి. ‘మా వెన్నెలక్కకు సెప్పకుంటే ఇగ అంతే.. అమ్మో.. సారక్కకు చెప్పే సేత్తం’అంటారు ఇక్కడి ఆదివాసీలు. మారేడు చెట్ల మేడారం 80 కుటుంబాలు ఉన్న చిన్న పల్లె ఇది. సమ్మక్క–సారలమ్మ జాతర ప్రధాన కేంద్రమైన గద్దెలు ఈ గ్రామంలోనే ఉన్నాయి. ఈ గ్రామంలో సమ్మక్కకు ఆలయం ఉంది. జాతరలో కీలక ప్రాంతాలైన చిలకలగుట్ట, జంపన్నవాగు సైతం ఈ గ్రామ సమీపంలోనే ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో మేడారం ఉంటుంది. అటవీ ప్రాంతంలోని తాడ్వాయి మండలం ఊరట్టం పంచాయతీ పరిధిలో ఈ ఊరు ఉంటుంది. మారేడు చెట్లు ఎక్కువగా ఉన్నందున ఈ ఊరికి మేడారం అని పేరు వచి్చనట్లు చెబుతుంటారు. ఇక్కడ కోయ వర్గానికి చెందిన గిరిజన కుటుంబాలే ఎక్కువ. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, ఉత్పత్తుల సేకరణ. విలుకాడు... గోవిందరాజు సారలమ్మ భర్త గోవిందరాజు. దబ్బగట్ల వంశానికి చెందిన గోవిందరాజు.. మేడారానికి వచ్చిన సమయంలోనే కాకతీయులతో యుద్ధం జరిగింది. విలువిద్యలో ఆరితేరిన గోవిందరాజు యుద్ధంలోనే వీరమరణం పొందారు. సారలమ్మ.. సమ్మక్క కూతురు సారలమ్మ. తల్లికి తగ్గ తనయ. కాకతీయులతో జరిగిన యుద్ధంలో మేడారం నుంచి కన్నెపల్లి వైపు వెళ్లిన సారలమ్మ ఆ ప్రాంతంలోనే వీరమరణం పొందారు. దీంతో అక్కడివారు తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు. సమ్మక్క ఆగమనానికి ముందురోజు కన్నెపల్లి గ్రామంలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజారి ప్రత్యేక పూజలు చేస్తారు. బయ్యక్కపేట, చందా వంశీయులు... ఇదో ఘట్టం కొందరి పరిశోధనల ప్రకారం... మేడారంలో కొలువు తీరిన సమ్మక్కకు బయ్యక్కపేటలోనూ చరిత్ర ఉంది. ఈ మేడారం జాతరను మొదట బయ్యక్కపేటలోనే నిర్వహించేవారు. ఈ బయ్యక్కపేట మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చందా వంశపు కోయ గిరిజనుల ఆడబిడ్డగా సమ్మక్క బయ్యక్కపేటలోనే జన్మించినట్లు ప్రచారంలో ఉంది. గోవిందరాజు ఇలాకా.. కొండాయి ఏటూరునాగారం మండలంలో కొండాయి గ్రామం ఉంది. సారలమ్మ భర్త గోవిందరాజు ఆలయం ఇక్కడే ఉంది. మేడారం, కొండాయి గ్రామాల మధ్య దూరం పన్నెండు కిలోమీటర్లు. జాతర సందర్భంగా వడ్డెలు, తలపతి, వర్తోళ్లు కలసి డోలు చప్పుళ్లతో కాలినడకన మేడారం చేరుకుంటారు. సంపెంగవాగే ‘జంపన్న’వాగు సమ్మక్క కుమారుడు జంపన్న. కాకతీయులతో జరిగిన యుద్ధంలో శుత్రువు చేతికి చిక్కి చావడం ఇష్టంలేని జంపన్న అక్కడికి సమీపంలోని సంపెంగవాగులో దూకి చనిపోయాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్న వాగుగా పిలుస్తారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ వాగులో స్నానాలు చేసిన తర్వాతే వన దేవతలకు మొక్కులు సమర్పిస్తారు. అందరి మాత.. సమ్మక్క కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని ‘పొలవాస’ను 12 శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించాడు. వేట కోసం ఒకసా రి అభయారణ్యం వెళ్లాడు. అక్కడ పులుల సంరక్షణలో, దివ్యకాంతులతో ఉన్న బాలికను చూసి గ్రామానికి తీసుకొచ్చారు. సమ్మక్క అని పేరు పెట్టారు. యుక్త వయసు వచ్చిన సమ్మక్క.. మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజును వివాహమాడిం ది. పగిడిద్దరాజు మేడరాజుకు మేనల్లుడు. పగిడిద్దరాజు – సమ్మక్కకు సారలమ్మ, నా గులమ్మ కుమార్తెలు, జంపన్న కుమారుడు. సారలమ్మకు గోవిందరాజుతో పెళ్లయింది. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, వరంగల్ -
కొలువుదీరిన కన్నెపల్లి వెన్నెలమ్మ
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర మొద లైంది. కోరుకున్న మొక్కులు తీర్చే సారలమ్మ మేడారం గద్దెపై బుధ వారం రాత్రి కొలువుదీరారు. అలాగే, కొత్తగూడ మండలం పూను గొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూ రునాగారం మండలం కొండాయి నుంచి గోవింద రాజులు సైతం సారలమ్మతోపాటే మేడారం గద్దెల పైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర అంబరాన్నం టింది. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం బుధవారం సాయంత్రం సారలమ్మ పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.50 గంటలకు గుడి నుంచి వెదురు బుట్ట (పట్టె మూకుడు)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయల్దేరారు. జంపన్నవాగులో కాళ్లు శుద్ధి చేసుకొని మేడారం గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజుతో కలసి వడ్డెలు ముగ్గురి రూపాలను అర్ధరాత్రి 12.24 గంటలకు మేడారం గద్దెలపై చేర్చారు. కన్నెపల్లి నుంచి 3.6 కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను చేర్చే అద్భుత సన్నివేశాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. దారి పొడవునా ఇరువైపులా ఎదురేగి దండాలు పెట్టారు. సారలమ్మను తీసుకొస్తున్న పూజారి దాటుకుంటూ వెళ్తే.. సంతాన భాగ్యం కలుగుతుందని, కోర్కెలు నెరవేర తాయని భక్తుల నమ్మకం. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను వెదురు బుట్ట (పట్టెమూకుడు) లో తీసుకొస్తుండగా ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవునా భక్తులు కింద పడుకుని వరం పట్టారు. సారల మ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు. సారలమ్మ గద్దెలకు రాక ను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ము బూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలుతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో పరవశించింది. తీసుకొచ్చారిలా.. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు లక్ష్మీబాయమ్మ, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, కాక కనుకమ్మ, కాక భుజంగరావులు సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకొచ్చారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరారు. ప్రత్యేక పోలీసుల బృందం రోప్‌పార్టీ (తాడు వలయం)గా ఏర్పడి వీరికి భద్రత కల్పించారు. ప్రభుత్వం తరఫున డీఆర్వో రమాదేవి, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, ఇటీవలే బదిలీపై వచ్చిన పీవో హన్మంతు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అడిషనల్ ఎస్పీలు దక్షిణమూర్తి, మురళీధర్, డీఎస్పీ విష్ణుమూర్తి మూడంచెలుగా 80 మందితో రోప్ పార్టీ, భారీ బందోబస్తును పర్యవేక్షించారు. భక్త జన సందోహం సారలమ్మ, తండ్రి పగిడిద్దరాజుతో పాటు గోవిందరాజు ప్రతిమలు గద్దెలపైకి చేరుకో వడంతో మేడారం ప్రాంతంలోని కన్నెపల్లి, రెడ్డిగూడెం, ఊరట్టం, జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిట లాడాయి. ఆర్టీసీ పాయింట్ మీదుగా, రెడ్డిగూడెం, ఊరట్టం, కాల్వపల్లి, నార్లాపూర్ మీదుగా లక్షలాదిగా వస్తున్న భక్తులతో అడవి దారులన్నీ పోటెతు ్తన్నాయి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడితో దారులన్నీ కిటకిటలాడాయి. సారలమ్మ గద్దెలపైకి రాగానే భక్తులు పరవశంతో దర్శనం కోసం ఒక్కసారిగా గద్దెల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. 6 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన క్యూలైన్లు సరిపోక రోడ్డుపై సైతం వరుసల్లో బారులు తీరారు. నేడు కొలువుదీరనున్న సమ్మక్క మేడారం జాతరలో కీలక ఘట్టంగా భావించే సమ్మక్కను గద్దెలపైకి గురువారం చేరుస్తా రు. మేడారం సమీపంలోని చిలకల గుట్టపై నుంచి సాయంత్రం 5 గంటల సమ యంలో ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగులో భద్రపర్చుకుని చిలకల గుట్టపై నుంచి తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న ములుగు జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ సమ్మ క్కను తీసుకొచ్చే కార్యక్రమాన్ని నిర్వహి స్తారు. ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటి ల్ ఏకే 47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలు కుతారు. లక్షలాది భక్తులు సమ్మక్కకు ఎదు రేగి.. కోళ్లు, మేక లను బలి ఇస్తారు. సమ్మక్కను ప్రతిష్ఠించాక భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివాసీ పద్ధతిలో సమ్మక్క పెళ్లి ఎస్ఎస్ తాడ్వాయి: వనదేవత సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం బుధవారం ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరిగింది. రెండేళ్లకోసారి ఈ తంతును సాగిస్తున్నారు. పగిడిద్దరాజు పూజారులు పసుపు–కుంకుమ, చీర సారెను, సమ్మక్క పూజారులు దోవతి, కండువాలను అందించారు. ఈ తతంగానికి మేడారం గ్రామం వేదికగా నిలిచింది. ఆదివాసీల విశ్వాసం ప్రకారం.. సమ్మక్క భర్త పగిడిద్దరాజు కాగా.. వారి సంతానం సారలమ్మ, జంపన్న. పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. ఆదివాసీల ఇలవేల్పులైన వీరు నాలుగు విభిన్న ప్రాంతాల్లో కొలువై ఉన్నారు. ప్రతీ రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమి రోజు అయిన బుధవారం సమ్మక్క – పగిడిద్దరాజుకు వివాహం జరిపిస్తారు. సమ్మక్క ఆలయమే వేదిక మాఘశుద్ధ పౌర్ణమికి ముందు లేదా తర్వాత వచ్చే బుధవారం రోజున వివాహం జరిపించడం ఆనవాయితీ. పెళ్లి తంతులో భాగంగా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో ఉన్న పగిడిద్దరాజు ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో çపడిగెను పగిడిద్దరాజుగా భావిస్తూ పెళ్లికొడుకుగా ముస్తాబు చేశారు. నలుగు పెట్టి, పసుపు కుంకుమలతో అలంకరించారు. అక్కడి నుంచి మ«ంగళవారం మధ్యాహ్నం 4.30 గంటలకు మేడారానికి బయలుదేరగా మేడారానికి బుధవారం రాత్రి చేరుకున్నారు. ప్రధాన పూజారులుగా పెనక వంశీయులు పెనక బుచ్చిరాములు, పెనక మురళీధర్ ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సమ్మక్క పూజారులు గుడికి చేరుకొని పగడిద్దరాజుతో వివాహ పూజలు చేశారు. అనంతరం సమ్మక్క గుడిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వడేరాల కుండల రూపంలో సమ్మక్క – పగిడిద్దరాజుకు కల్యాణం జరిపించారు. అనంతరం గోవిందరాజు, సారలమ్మతో కలసి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరారు. నేడు సమ్మక్క గద్దెపైకి కంకవనం ఎస్‌ఎస్‌తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టాల్లో కంకవనం(వెదురు) తీసుకురావడం కీలకమైనది. సమ్మక్క – సారలమ్మ గద్దెలపైకి చేరుకోకముందే అక్కడికి కంకవనం చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గురువారం సమ్మక్కతల్లిని గద్దెపై ప్రతిష్టించడానికి ముందు కంకవనాలను అక్కడ ప్రతిష్టిస్తారు. కంకవనాలను తీసుకురావడంలో పూజారులు ప్రత్యేక విధానాన్ని పాటిస్తారు. కంకవనాలను తెచ్చేందుకు సమ్మక్క పూజారులు కుటుంబీకులు రోజంతా ఉపవాసం ఉంటారు. సమ్మక్క పూజారులు, ఆదివాసీ యువకులు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మేడారానికి దక్షిణం వైపు ఉన్న అడవిలోకి వెళ్లారు. అక్కడ గద్దెలపైకి తీసుకురావాల్సిన కంకవనాన్ని ఎంపిక చేస్తారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు కంకవనానికి పూజలు నిర్వహించారు. ఈ పూజ వివరాలను బయటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకపోవడమే కాకుండా ఎవరినీ దగ్గరకు రానివ్వరు. వనంలో పూజ ముగిసిన తర్వాత బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయానికి అడవి నుంచి అందరూ మేడారం చేరుకుంటారు. గురువారం తలస్నానం చేసి మళ్లీ అడవిలోకి వెళ్తారు. అప్పటికే ఎంపిక చేసిన ఉన్న కంకను తీసుకుని మార్గమధ్యలో ఇంగ్లి ష్ మీడియం పాఠశాల దగ్గర ఉన్న గుడిలో పూజలు చేస్తారు. మేడారం ఆడపడుచులు ఎదురేగి కంకలకు ప్రత్యేక స్వాగతం పలుకుతారు. తొలి సూర్యకిరణాలు గద్దెలపై పడే సమయంలో కంకలను అడవి నుంచి మేడారంలో గద్దెల వద్దకు చేరుస్తారు. ఇక్కడ పూజలు నిర్వహించి కంకను ప్రతిష్టిస్తారు. సాయంత్రానికి సమ్మక్క గద్దెపైకి చేరుకుంటుంది. పూజారుల ఆగ్రహం ములుగు: భద్రత విషయంలో పోలీసులు అతి చేస్తున్నారని సమ్మక్క–సారలమ్మ పూజారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సమ్మక్క పూజారి రమేశ్‌ను గద్దెల ప్రధాన ప్రవేశ మార్గం నుంచి అనుమతించక పోవడంతో ఆయన ఏకంగా తాళాలను పగులగొట్టి మరీ గద్దెల వద్దకు వెళ్లారు. దీంతో పాటు బుధవారం ఉదయం కన్నెపల్లి ఆడపడుచులు మేడారంలోని గద్దెను అలక (అలంకరణ)డానికి వచ్చారు. ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. కాగా, బుధవారం సాయంత్రం 6.50కి సారలమ్మను ఆల యం నుంచి బయటికి తీసుకొచ్చారు. సమ్మక్క గుడి వరకు సాఫీగా సాగిన ప్రయాణం గుడి ప్రాంగ ణం వచ్చే సరికి గందరగోళంగా మారింది. ఒక వర్గం పూజారులు ఆలయం పక్కన ఉన్న విడిది స్థానంలో, మరో వర్గం పూజారులు ఐటీడీఏ క్యాంపు కార్యాలయం వద్ద ఉండిపోయారు. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలకు దిగింది. మొత్తానికి పూజారుల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమ్మక్క – సారలమ్మ గద్దెల తాళాలను తమ వద్దే ఉంచుకోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. -
వనమెల్లా.. జన మేళా!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర అసలు ఘట్టం కొన్ని గంటల్లో మొదలు కానుంది. కోరిన కోర్కెలు తీర్చే సారలమ్మ.. మేడారంలోని గద్దెపై కొలువుదీరే ఘడియలు దగ్గరపడుతున్నాయి. కార్లు, బస్సులు, వ్యాన్లు, ఆటోలు, ఎడ్ల బండ్లు.. అన్ని మేడారం బాటపడుతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు. కొన్ని గంటల్లో మొదలయ్యే మేడారం జాతరకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ ఆగమనం.. వనదేవత సారలమ్మ బుధవారం సాయంత్రం మేడారంలోని గద్దెపై కొలువు తీరనుంది. పూజారులు ఇందుకోసం వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం సమీపంలోని కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం గిరిజన పూజారులు సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం ఉదయం మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కన్నెపల్లి నుంచి గిరిజన పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపే ఏటూరునాగారం మండలం కొండాయిలో కొలువైన గోవిందరాజులు, గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిద్దరాజును సైతం మేడారం గద్దెల వద్దకు తీసుకొస్తారు. మంగళవారమే పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పయనమయ్యాడు. పూనుగొండ్ల నుంచి కాలిబాటన 50 కిలోమీటర్లు ఉండటంతో వడ్డెలు ముందుగానే బయల్దేరారు. మేడారానికి సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకొచ్చే వేడుకను చూసేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా ప్రసిద్ధి గాంచిన మేడారం జాతరకు ఈ సారి 1.4 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ప్రత్యేకాధికారులు వీపీ గౌతమ్, వరంగల్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ రవీందర్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ నేతృత్వంలో యంత్రాంగం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతరలో సౌకర్యాల కల్పనకు రాష్ట్రప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి టీఎస్ఆర్టీసీ 4,105 బస్సులను నడుపుతోంది. భక్తులకు సౌకర్యం కోసం పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లు చేశారు. గతంలో జాతరకు వెళ్లి వచ్చేందుకు రెండే ప్రధాన మార్గాలు ఉండేవి. ఈసారి ఆరు మార్గాలను ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లి రావచ్చు. మేడారం జాతర ప్రదేశంలో 300 సీసీ కెమెరాలతో భద్రతా చర్యలు, జాతర నిర్వహణ కోసం 12 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు సాంకేతికంగా ఉపయోగపడేం దుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందిం చింది. జాతరకు వచ్చే భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు జంపన్న వాగుకు ఇరువైపులా 3.6 కిలోమీటర్ల పొడవునా స్నానఘట్టాలు నిర్మిం చారు. వైద్య సేవల కోసం ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. వన దేవతల గద్దెల పక్కనే ఉన్న వైద్య శాఖ భవనంలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. అత్యవసర వైద్య సేవల కోసం 108, 104 వాహనాలను సిద్ధంగా ఉంచారు. -
మహాజాతరకు వేళాయె
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆదివాసీల అతిపెద్ద ఉత్స వం.. మేడారం జాతరకు వేళయ్యింది. బుధవారం సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలపైకి రావడంతో మహా జాతర ప్రారంభమవుతోంది. ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు సమ్మక్క– సారలమ్మ మహా జాతర నిర్వహణకు మేడారం సిద్ధమైంది. వనదేవతల వారంగా భావించే బుధవా రం రోజున.. మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకారం చుడతారు. 4 ప్రాంతాల్లోనూ వనదేవతల పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర లాంఛనంగా మొదలవుతోంది. ఈసారి 1.40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచే కీలక ఘట్టం మొదలు కోట్లాది మంది భక్తులు ఎదురు చూసే ఈ మహజాతరలో తొలి ఘట్టం మంగళవారం మొదలు కానుంది. సమ్మక్క భర్త పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా తయారు చేయడంతో ప్రారంభమవుతోంది. పెనక వంశానికి చెందిన పూజారులతో పాటు పూను గొండ్ల గ్రామస్తులు నిష్ఠతో ఈ పూజలు నిర్వహిస్తారు. ముందుగా తలపతి (పూజారుల పెద్ద) ఇంట్లో అమ్మవారికి తీసుకుని వెళ్లేపానుపు (పసుపు, కుంకుమ, కొత్త వస్త్రాలు) సిద్ధం చేస్తారు. ఉదయం పానుపును డోలి వాయిద్యాల నడుమ ఆలయానికి తరలించి పూజలు చేస్తారు. దేవుని గుట్ట నుంచి తీసుకువచి్చన వెదురు కర్రతో పగిడిద్దరాజు పడిగెను సిద్ధం చేస్తారు. శివసత్తుల పూనకాలు, దేవుని మహిమతో తన్మయత్వం పొందిన పూజారులు పడిగెను ఆలయ ప్రాంగణంలోని గద్దెపై ప్రతిíÙ్ఠస్తారు. సుమారు 2 గంటలు పెళ్లి కుమారుడిగా భక్తులకు దర్శనం ఇచ్చే పగిడిద్దరాజును దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అనంతరం పూజారులు తలపతి ఇంట్లో సిద్ధం చేసిన పానుపుతో పాటు పడిగెను తీసుకుని కాలినడకన అటవీ మార్గాన బయలు దేరుతారు. పస్రా చేరుకున్నాక పగిడిద్దరాజుకు నేరుగా సమ్మక్క కొలువుదీరిన చిలుకల గుట్టపైకి చేరుకుంటారు. ఇక్కడ వారి ఇరువురికి ఆదివాసీ సంప్రదాయంలో ఇరు పూజారులు ఎదుర్కోళ్లు, వివాహం జరిపిస్తారు. 5న సారలమ్మ, 6న సమ్మక్క సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు 3 కిలోమీటర్ల దూరం లోని ఈ కుగ్రామంలో చిన్న ఆలయంలో ప్రతిíÙ్ఠంచబడిన సారలమ్మ 5న బుధవారం సాయంత్రం మేడారం లోని గద్దె వద్దకు చేరుతుంది. కడుపు పండాలని కోరుకునేవారు.. దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వందలాది మంది తడి బట్టలతో గుడి ఎదుట సాష్టాంగ నమస్కారాలతో వరం పడతారు. సారలమ్మను మోస్తున్న పూజారిని దేవదూతగా భావిస్తారు. సారలమ్మ జంపన్నవాగు గుండా నేరుగా మేడారంలోని తల్లి సమ్మక్క దేవాలయానికి చేరుకుంటుంది. సారలమ్మ కొలువుదీరిన మరుసటి రోజున అంటే 6న గురువారం సాయంత్రం వేళ సమ్మక్క గద్దెపైకి వస్తుంది. ఆ రోజు ఉదయమే పూజారులు చిలకలగుట్టకు వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై పూజలు చేస్తారు. అనంతరం సమ్మక్క పూజామందిరం నుంచి వడరాలు, పసిడి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. సాయంత్రం వేళలో చిలకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. జాతర మొత్తానికి ప్రధానమైన సమ్మక్క ఆగమనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. తల్లికి ఆహ్వానం పలు కుతూ చిలకలగుట్ట వద్దకు వెళ్తారు. సమ్మక్క కొలువైన ప్రదేశానికి చేరుకున్న పూజారులు అక్కడ పూజలు చేస్తారు. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన పూజారి మైకంతో పరుగున గుట్ట దిగుతాడు. అక్కడ పోలీసులు రక్షణ ఏర్పాట్లు చేస్తారు. జిల్లా ఎస్పీ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపి అధికార వందనంతో స్వాగతం పలుకుతారు. మూడో రోజు మొక్కులు.. గద్దెలపై ఆశీనులైన సమ్మక్క–సారలమ్మ జాతరలో మూడో రోజు (7వ తేదీ) భక్తులకు దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చమని వేడుకుంటారు. కోర్కెలు తీరినవారు కానుకలు చెల్లిస్తారు. ఆడపడుచులుగా భావిస్తూ పసుపుకుంకుమలు, చీరె, సారెలు పెడతారు. ఒడి బియ్యం పోస్తారు. తలనీలాలు సమర్పించుకుంటారు. ఎత్తు బంగారం (బెల్లం) నైవేద్యంగా పెడతారు. ఆ రోజంతా లక్షలాది మంది గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకుంటారు. కనులారా వీక్షించి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన అశేష భక్తజనానికి దర్శనం ఇచి్చన సమ్మక్క–సారలమ్మ నాలుగో రోజున (8 శనివారం) సాయంత్రం తిరిగివన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగిసిపోతుంది. మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు గుండాల: అర్రెం వంశీయుల ఆరాధ్య దైవం, సమక్క భర్త అయిన పగిడిద్దరాజు సోమవారం మేడారం పయనమయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామం నుంచి అర్రెం వంశీయులు పగిడిద్దరాజును తీసుకుని కాలినడకన బయలుదేరారు. -
‘లోక కల్యాణార్థం కోసమే యాగాలు’
సాక్షి, హన్మకొండ: సీఎం కేసీఆర్ చేసిన యాగంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని.. వర్షాలు సమృద్ధిగా కురవడంతో కుంటలు, చెరువులు వాగులు నిండాయని దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హయాగ్రీవాచారి మైదానంలో ఆదివారం ప్రారంభమైన అతిరుద్రయాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో కోటిన్నర ఎకరాల మాగానికి సాగునీళ్లు అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఇలాంటి యాగాలు జరగడం లోక కల్యాణానికి దోహదపడతాయన్నారు. మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రులను కలిశామని చెప్పారు. మేడారం పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. రెండు జాతరలు నిర్వహించిన స్ఫూర్తితో ఈ సారి కూడా మేడారం జాతర వైభవంగా నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. -
డ్రైవర్ అంతిమ యాత్ర..పాడె మోసిన మంత్రి
సాక్షి, వరంగల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ చిలకమర్రి పార్థసారధి అంతిమయాత్రలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. అప్పటి వరకు తనతోనే ఉన్న అధికారిక వాహన డ్రైవర్ పార్థసారధి మృతి చెందడంతో మంత్రి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. డ్రైవర్ మృతదేహం వద్ద ఆయన విలపించారు. గోపాలపురంలోని పార్థసారధి ఇంటి వద్ద పాడె మోశారు. అంతిమ యాత్రలో మంత్రితో పాటుగా ఆయన సతీమణి ఉషా, కుమారుడు ప్రేమ్చందర్ రావు, సోదరుడు ప్రదీప్‌రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పాల్గొన్నారు. పద్మాక్షి సమీపంలో శివముక్తీ ధామ్‌లో పార్థసారధికి అంతిమ సంస్కారం నిర్వహించారు. తుపాకీ కాల్పులతో అధికార లాంఛనాలతో పార్థసారధి అంత్యక్రియలు ముగిశాయి. శనివారం అర్ధరాత్రి జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం చిటూరు శివారులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌లోని ఓ వాహనం పల్టీ కొట్టడంతో డ్రైవర్ పార్థసారధి, సోషల్ మీడియా ఇన్చార్జి పూర్ణేందర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. చదవండి: ఎర్రబెల్లి కాన్వాయ్‌లో వాహనం బోల్తా -
‘ఉమ్మడి వరంగల్‌ను సస్యశ్యామలం చేస్తాం’
సాక్షి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపారన్నారు. ఉచితంగా చేప పిల్లలతో పాటు, సబ్సిడీతో వాహనాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎస్సీల అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని తెలిపారు. ప్రతి కుటుంబానికి బర్రెలు ఇప్పించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం అభివృద్ధికి సహకారం అందిస్తానని వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి 60 రోజుల ప్రణాళికను కేసీఆర్ రూపొందించారని వివరించారు. వచ్చే నాలుగు నెలల్లో దేవాదుల నుంచి 365 రోజుల పాటు నీటిని ఎత్తిపోస్తామన్నారు.. మల్కాపూర్ రిజర్వాయర్ పనులను త్వరలో ప్రారంభించనునట్లు తెలిపారు. దేవాదుల నీటితో ఉమ్మడి వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. -
జయజయహే జగన్మాత
నేత్రపర్వంగా మూలా మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న పుష్పగిరి, తొగుట పీఠాధిపతులు అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు వర్గల్: వర్గల్ విద్యాధరి క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. శంభుని కొండ దేవీ నామస్మరణతో మార్మోగింది. మహా సరస్వతి రూపిణి అయిన అమ్మవారు నవరత్న ఖచిత స్వర్ణ కిరీటంతో భక్తులను కటాక్షించారు. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో ఎనిమిదో రోజు శనివారం ఈ మహోత్సవ ఘట్టం ఆవిష్కతమైంది. వర్గల్ క్షేత్రంలో శనివారం మూలా నక్షత్ర మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పుష్పగిరి, తొగుట పీఠాధిపతులు అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మాజీ గవర్నర్ కె. రోశయ్య, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడా అధికారి హన్మంతరావు తదితరులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఓవైపు అర్చనలు, అభిషేకాలు, మరోవైపు సారస్వత మండపంలో భారీగా చిన్నారుల అక్షరాభ్యాసాలతో మూలా నక్షత్ర మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు సామూహిక పుష్పార్చనలో పాల్గొన్నారు. విశేష పంచామతాభిషేకం..గిరి ప్రదక్షిణం తెల్లవారు జామున 5.30 గంటలకు ఆలయ వ్యవస్థాపకులు చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో గణపతి పూజతో మూలా నక్షత్ర మహోత్సవానికి తెరలేచింది. గర్భగుడిలో అమ్మవారి మూల విరాట్టుకు వేదమంత్రోచ్ఛారణలతో విశేష పంచామతాభిషేకం నిర్వహించారు. వివిధ రకాల పూలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. నవరత్న ఖచిత స్వర్ణకిరీటాది ఆభరణాలు ధరింపజేశారు. ఆ వెంటనే ప్రత్యేకంగా అలంకరించిన పూల పల్లకిలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఆసీనురాలిని చేశారు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన అమ్మవారి గిరి ప్రదక్షిణ ఊరేగింపు రెండు గంటల పాటు కన్నుల పండువ చేసింది. నేత్రపర్వంగా లక్ష పుష్పార్చన ఉదయం 10 గంటలకు మూలా పుస్తక రూపిణి సరస్వతి పూజ అనంతరం ఆలయ మహామంటపంలో సువాసినులు బారులు తీరి కూర్చుని అమ్మవారి నామం పఠిస్తూ వివిధ రకాల పూలతో సామూహిక లక్షపుష్పార్చన చేశారు. తరువాత చదువుల తల్లికి మహా పుస్తక పూజ జరిపారు. వేలాది పుస్తకాలను అమ్మకు సమర్పించి అర్చించారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు కొనసాగాయి. పీఠాధిపతులకు పూర్ణకుంభ స్వాగతం మూలామహోత్సవ వేడుకలకు హాజరైన పీఠాధిపతులు విద్యాశంకర భారతీ, మాధవానంద సరస్వతి స్వాములకు ఆలయ అర్చక పరివారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం విద్యాశంకర భారతీ స్వామి వారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. మాజీ గవర్నర్ రోశయ్య, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి సన్మానం వర్గల్ ఉత్సవాలకు వేర్వేరుగా హాజరైన మాజీ గవర్నర్ రోశయ్య, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని చంద్రశేఖర సిద్ధాంతి అధ్వర్యంలో వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ వర్గల్ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లాలని ఆకాంక్షించారు. భారీగా అక్షర స్వీకారాలు మూలా మహోత్సవం సందర్భంగా అక్షరస్వీకారానికి పెద్ద సంఖ్యలో చిన్నారులు తరలిరావడంతో అక్షరాభ్యాస ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దేవాలయ రజతోత్సవం సందర్భంగా పుష్పగిరి, తొగిట పీఠాధిపతులు విద్యాశంకర భారతీ స్వామి, మాధవానంద సరస్వతిల సమక్షంలో పలువురు ప్రముఖులకు ఆలయ కమిటి ఘన సన్మానంసింది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత వెంకట్రామన్ ఘనాపాఠి, దేవాలయ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత ఏకే శ్రీనివాసాచార్య సిద్ధాంతి తరఫున వారి కుటుంబ సభ్యులకు ఆలయం తరఫున పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా శాస్త్రుల రఘురామశర్మ, మంచినీళ్ల రాఘురామశర్మ, అయాచితం నటేశ్వరశర్మ, మూటకోడూరు బ్రహ్మం, డాక్టర్ రాధశ్రీ, మరుమాముల దత్తాత్రేయశర్మ, జీఎం రామశర్మ, చిల్లర భావనారాయణశర్మ, మరుమాముల వెంకటరమణశర్మకు పురస్కారాలు అందజేసారు. టీడీపీ నేత బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత మడుపు భూంరెడ్డి, టేకులపల్లి రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీ పోచయ్య తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. -
సైన్స్ మేళా.. భళా
సృజన చాటిన ప్రదర్శనలు వర్గల్ నవోదయలో రీజియన్ స్థాయి ఎగ్జిబిషన్ ప్రారంభించిన అదనపు జేసీ వెంకటేశ్వర్లు వర్గల్: ఓ ఆలోచన సరికొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తుంది. అందుబాటులో వనరులు, ప్రోత్సహించే వారుంటే ఆ ఆలోచనలు మరింత పదునెక్కుతాయి. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్ఫథం పెంపొందుతుంది. నిత్యజీవితంలో మానవాళికి ఉపయుక్తంగా నిలిచే కొంగొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయి. వర్గల్ నవోదయ వేదికగా దక్షిణాది రాష్ట్రాల నవోదయ విద్యార్థుల రీజియన్ స్థాయి సైన్స్ మేళాను మంగళవారం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రెండు రోజులపాటు కొనసాగే ఈ సైన్స్మీట్లో అత్యుత్తమంగా నిలిచిన 12 ప్రదర్శనలను జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారని విద్యాలయ ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. ఈ ప్రదర్శనలో తెలంగాణతోపాటు కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, యానామ్ ప్రాంతాల నవోదయ విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ఆకట్టుకున్నారు. సేంద్రియ సాగు, పర్యావరణ పరిరక్షణ, మానవరహిత రైల్వే క్రాసింగ్ వ్యవస్థ, సురక్షిత ప్రయాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆసక్తికరంగా గణితం నేర్చుకునే విధానం, సులభ పద్ధతిలో త్రికోణమితి, నిర్మాణాల్లో పైథాగరస్ సిద్ధాంతం, వృథా వస్తువులతో చక్కని ఆకృతుల తయారీ.. ఇలా ఎన్నో నిత్య జీవితంతో ముడిపడిన 98 అంశాలతో సందర్శుకులను అబ్బురపరిచారు. తొలిరోజు సందర్శకులను అనేక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యఅతిథి అదనపు జేసీ వాసం వెంకటేశ్వర్లు ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు కొన్ని.. ఊహా గణితంపై ఆదిలాబాద్ నవోదయకు చెందిన ఆకాంక్షరెడ్డి ప్రదర్శన ఆకట్టుకుది. తన ప్రయోగం ద్వారా స్థలం్వృథాకాకుండా ఎలాంటి ఆకృతి దోహదపడుతుందో వివరించింది. పైథాగరస్ సిద్ధాంతం ద్వారా తక్కువ స్థలంలో ఎత్తయిన కట్టడాలు ఎలా చేపట్టవచ్చో రంగారెడ్డి జిల్లా నవోదయ విద్యార్థి పి.వినయ్‌కుమార్ వివరించాడు. సులభంగా త్రికోణమితి నేర్చుకునే విధానాన్ని కర్ణాటకలోని చిక్మగళూర్ నవోదయ విద్యార్థి కేఎన్ జయంత్ తన ప్రయోగం ద్వారా నిరూపించాడు. పూసలతో వివిధ ఆకర్షణీయ వస్తువులు తయారు చేసుకోవచ్చని సూచిస్తూ నిజామాబాద్ విద్యార్థిని ఆర్.సహన పలు వస్తువులు ప్రదర్శించింది. వృథా వస్తువులను వినియోగించి విలువైన వస్తువులను తయారు చేసే చక్కని ప్రదర్శనను కేరళ రాష్ట్రం అలప్పీ విద్యార్థి ఎస్.వివేక్ ఏర్పాటు చేశాడు. వాడి పడేసిన పెన్నులతో పెన్ హౌస్, కాగితాలతో గుర్రపు బొమ్మలను తీర్చిదిద్దాడు. కాగితాలు, గుండీలు తదితర వస్తువులతో ఆకర్షణీయమైన రీతిలో చెవి దిద్దులు, ఆభరణాలు ఎలా తయారు చేయవచ్చో వెస్ట్ గోదావరి విద్యార్థిని కె.భారతి తన ప్రదర్శన ద్వారా చూపింది. గణితం ఆసక్తికరంగా నేర్చుకునే విధానాన్ని చూపుతూ అనంతపురం విద్యార్థి వీపీ వంశీకృష్ణ ప్రదర్శన ఆకట్టుకున్నది. -
కుంగుతున్న వంతెనలు
నెంటూరులో మున్నాళ్ల ముచ్చటగా నిర్మాణ పనులు వర్గల్: ఆర్అండ్బీ పనుల్లో నాణ్యత కొరవడుతోంది. వంతెనల నిర్మాణ పనులు మూన్నాళ్ల ముచ్చటగా మిగులుతున్నాయి. వర్గల్ మండలం నెంటూరు వద్ద బరువు తట్టుకోలేక కృంగిన వంతెనలు నాణ్యతా లోపానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోమటిబండ నుంచి నెంటూరు మీదుగా గోవిందాపూర్ వరకు దాదాపు రూ. 10 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో అనేక చోట్ల వంతెనలు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా గత నెలాఖరున నెంటూరు-గోవిందాపూర్ మార్గంలోని స్కూల్ సమీపంలో ఒక వంతెన నిర్మించారు. నాణ్యత లోపించిందో, సరిగా క్యూరింగ్ చేయలేదో తెలియదుగాని అది కుంగిపోయింది. అదేవిధంగా నెంటూరు-కోమటిబండ మార్గంలోని వంతెన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అక్కడ సైతం వంతెన కుంగిగిపోవడంతో సంబంధిత కంట్రాక్టర్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాడు. పనుల నాణ్యత విషయంలో ఆర్అండ్బీ అధికారుల ఉదాసీనత, పర్యవేక్షణ లోపం కారణంగానే రోడ్ల నాణ్యత ప్రశ్నార్థకమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీ వాహనాల ఒత్తిడి తట్టుకోలేకనే: ఏఈ శ్రీనివాస్ భారీ వాహనాల ఒత్తిడి తట్టుకోలేకనే నెంటూరు సమీపంలో కొత్తగా నిర్మించిన వంతెనలు కుంగిపోయాయి. వంతెన నిర్మాణం తరువాత కనీసం 20-28 రోజుల వరకు వాటర్ క్యూరింగ్ చేపట్టాలి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఈ రెండు వంతెనలపై తప్పనిసరిగా భారీ వాహనాలను అనుమతించాం. దీంతో అవి కుంగిపోయాయి. ఈ వంతెనలను మళ్లీ పటిష్ఠంగా నిర్మిస్తాం. నాణ్యతలో రాజీ పడబోం. -
దూప తీరినట్టే..
‘మిషన్ భగీరథ’పై మహిళల సంబురం వర్గల్: మిషన్ భగీరథ పథకాన్ని నియోజకవర్గ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇక తమకు దూప తీరినట్టేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం నీటికోసం కొట్లాటలు జరిగేవని, గుక్కెడు నీటికీ ఇబ్బందులు పడుతున్నామని మండల ప్రజలు చెబుతున్నారు. పనులు మానేసి బోర్ల వద్దకు పరుగులు తీశామంటున్నారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి నల్లాల ద్వారా నీళ్లొస్తయంటే తమ బాధలు తీరినట్టేనని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. తిప్పలు తప్పుతయ్ నిన్న మొన్నటి దాక ఊళ్లె నీళ్ల కోసం మస్తు గోసగోస ఉండె. దూరంగా బోర్ల దగ్గరికి పోయి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. సీఎం సారు ఓట్ల సమయంల ప్రతి ఇంటికి తాగు నీళ్లు ఇస్తమన్నడు. ఇయ్యాల ఆ మాట నిజం చేసుకున్నడు. మాకు ఇగ నీళ్ల బాధ తప్పినట్టే. - చిందం లక్ష్మి, మైలారం, మం: వర్గల్ శాన సవులత్ అయితది నీళ్ల కోసం పనులు బందు పెట్టే కాలం. బోర్లు మర్ల పడి నీళ్లకు శాన తిప్పలైతున్నది. గీసొంటి టైంలా సర్కారు ఇంటింటికి నీళ్లు వచ్చెటట్టు చేసింది. బోరు నీళ్లు తాగితె రోగాలు వస్తయంట. గిపుడు నల్లాల నుంచి శుభ్రమైన నీళ్లు వస్తున్నయ్. రోగాల భయం పోయింది. - గుర్రాల పోచమ్మ, మైలారం, మం: వర్గల్ కేసీఆర్ సారు సల్లంగుండాలె మాకు ఆ పొద్దటి నుంచి బోర్ల నీళ్లే దిక్కు. అవి తాగితె రోగాలొస్తయో, రొప్పులొస్తయో మా కైతే తెల్వది. బోరు కాడ తిప్పలు పడాలె. నీళ్లు మోసుకోవాలె. ఇపుడు సర్కార్ మాకు నీళ్ల కష్టాలు లేకుండ చేసింది. దూప తీర్చుతున్న కేసీఆర్ సారు సల్లంగుండాలె. - మాసాన్‌పల్లి కిష్టమ్మ, నెంటూరు, మం: వర్గల్ బిందెలతో ఉరుకెటోళ్లం కరువు కాలంల ఊళ్లె నీళ్ల బోర్లు, బావుల కాడ పొలానికి నీళ్లు పారపెట్టె బోర్లు మర్లపడ్డయ్. తాగెటందుకు నీళ్లు తెచ్చుకోవాలంటె ఓ పొంటె కూలీ పని బంద్ పెట్టుకోవాలె. నీళ్లు ఉన్న బోర్ల కాడికి బిందెలతోని ఉరుకాలె. ఆడికెల్లి నీళ్లు మోసుకోవాలె. కూలీ పని చేసే ప్యాదోళ్లకు శాన కష్టమయ్యేది. ఇపుడు చంద్రశేఖర్ సారు ఇండ్లకు నీళ్లు ఇచ్చుడుతోని మాకు బాధలు లేకుండ అయింది. ఆయన దేవుని లాంటి మనిషి. - ఎర్రోల్ల లక్ష్మి, నెంటూరు, మం: వర్గల్ -
హెలీప్యాడ్ నిర్మాణ పనుల పరిశీలన
వర్గల్: ప్రధాని పర్యటన నేపథ్యంలో వర్గల్ మండలం నెంటూరు శివారులో హెలిప్యాడ్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. కోమటిబండ మిషన్ భగీరథ పథకం సంప్‌నకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నెంటూరు శివారు ప్రభుత్వ భూమిలో మొత్తం నాలుగు హెలిప్యాడ్ నిర్మాణాలు చేస్తున్నారు. ఒకటి ప్రధాన మంత్రి కోసం, రెండోది ప్రధానమంత్రి కార్యాలయ అధికారులకు, మూడోది సిబ్బంది కోసం నిర్మిస్తున్నారు. వీటికి కొద్ది దూరంలో సీఎమ్ కోసం ప్రత్యేకంగా నాలుగో హెలిప్యాడ్ నిర్మిస్తున్నారు. ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ బాలప్రసాద్ పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఖాళీ స్థలంలో తుప్పలు తొలగించి చదును చేసారు. కంకర్, వెట్‌మిక్స్ వేసి రోలర్‌తో బాగా తొక్కించారు. సబ్‌రోడ్డు పనులను వేగవంతం చేసారు. ఆదివారం హెలిప్యాడ్లను తారుతో తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా డిప్యూటీ ఈఈ తెలిపారు. శనివారం గడా ఓఎస్డీ హన్మంతరావు నెంటూరు సందర్శించారు. హెలిప్యాడ్ నిర్మాణ పనులు పరిశీలించారు. డిప్యూటీ ఈఈ బాలప్రసాద్‌తో మాట్లాడి పనుల పురోగతి సమీక్షించారు. పలు సూచనలు చేసారు. -
నిన్న మునిగి.. నేడు శవమై..
చెరువులో లభ్యమైన కనకయ్య మృతదేహం వర్గల్: అన్నా.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. నా అంత్యక్రియలు బాగా చేయిండ్రి..అని గురువారం సోదరుడికి ఫోన్లో చెప్పిన జిలకర కనకయ్య(30) అన్నంత పని చేశాడు. జీవితంపై విరక్తి చెందాడో, మరే కారణమోగాని గ్రామ సమీపంలోని పటేల్ చెరువులో జేసీబీ గొయ్యి పక్కన దుస్తులు, చెప్పులు విడిచి అందులో దూకాడు. మండలంలోని ఇప్పలగూడ సమీప పటేల్ చెరువులో శుక్రవారం కనకయ్య గల్లంతైన విషయం తెల్సిందే. రాత్రి వరకు గొయ్యిలో గాలింపు జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో మృతదేహం గాలింపు ప్రక్రియను శుక్రవారానికి వాయిదా వేశారు. ఉదయం గాలింపులో మృతదేహం లభ్యమైంది. కనకయ్య అన్నంత పని చేస్తడని మేము అనుకోలేదని మృతుడి కుటుంబీకులు బోరుమన్నారు. అప్పుల బాధతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య జ్యోతి పేర్కొంది. మృతుడికి సాయి కిరణ్(9), సాయి తేజ(7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కూలీనాలీ పనులతో కాలం వెల్లదీసే కుటుంబంలో విషాదం అలుముకుంది. కాగా మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్‌కు తరలించినట్లు గౌరారం ఏఎస్సై దేవీదాస్ తెలిపారు. -
కడుపుకోత మిగిల్చిన ప్రమాదం
అక్కడికక్కడే మృతి చెందిన బాలుడు ఇద్దరికి తీవ్రగాయాలు వర్గల్: మండలంలోని నెంటూరు వద్ద గురువారం ఉదయం జరిగిన ప్రమాద సంఘటన కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. బాలుడి మృతితో పెను విషాదం అలుముకున్నది. టిప్పర్ వెనుక నుంచి బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి మృత్యువాతపడగా మరో ఇద్దరు గాయపడి చికిత్స పొందుతున్నారు. చిన్నారి తల్లి రోదనలతో ప్రమాదం జరిగిన ప్రాంతం దద్ధరిల్లిపోయింది. కన్నకొడుకును తలుచుకుంటూ ఆ తల్లి రోదించిన తీరు పలువురిని కలచివేసింది. నా వజ్రాల కొండ..నన్ను విడిచిపెట్టి పోయినవా బిడ్డా నాకు ఆస్తి లేదు..పాస్తి లేదు..మీరే నాకు ఆస్తి అని కంటికి రెప్పలెక్క కాపాడుకుంటున్న..ఇయాల తెల్లారంగనె పాలు తెచ్చెటందుకు పోయి మొత్తానికే కానరాకుండా పోయినవా బిడ్డా..అని కొడుకు మృతదేహం మీద పడి తల్లి సత్యలక్ష్మి రోదిస్తున్న తీరు అక్కడున్న వారి గుండెలు పిండేసింది. టిప్పర్ మీద మన్నుపొయ్య..వజ్రాల కొండ లెక్క చూసుకుంటున్న నా కొడుకును నాకు దూరం చేసిండ్రని టిప్పర్ యజమానులను ఆమె శాపనార్థాలు పెడుతూ బోరుమన్నది. ఓ వైపు తల్లి, మరోవైపు తండ్రి రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు. కాగా దౌల్తాబాద్‌కు చెందిన సుతారి సత్యనారాయణ, సత్యలక్ష్మి దంపతులు పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నెంటూరు వచ్చారు. అక్కడి రైస్‌మిల్‌లో పని చేస్తున్నారు. కూతురు కల్పన పెళ్లి చేశారు. వారి పెద్ద కొడుకు కృష్ణ నెంటూరు స్కూల్లో 9 వతరగతి, మృతుడు సురేష్ నాలుగో తరగతి చదువుకుంటున్నారు. మనవరాలు మహేశ్వరి(కల్పన కూతురు) నాలుగు రోజుల క్రితం తాతా అమ్మమ్మల వద్దకు వచ్చింది. అనూహ్యంగా ప్రమాదంలో గాయపడింది. విషాదంలో విద్యార్థి లోకం తమ తోటి విద్యార్థుల్లో ఒకరు మృతి చెందడం, మరొకరు మృత్యువు అంచులదాకా వెళ్లి గాయాల పాలవడంతో నెంటూరు స్కూల్ విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. సురేష్ మృ తికి సంతాప సూచకంగా గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అ నంతరం పాఠశాలలు మూసివేశారు. ఘటన స్థలం సందర్శించిన సీఐ నెంటూరు వద్ద ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే తొగిట సీఐ రామాంజనేయులు, బేగంపేట ఎస్సై అనీల్‌రెడ్డిలు ఘటన స్థలం సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లె ఓ చిన్నారి నిండు ప్రాణాలు కోల్పోయాడని, మరో ఇద్దరు గాయాల పాలయ్యారని ఈ సందర్భంగా సీఐ పేర్కొన్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్ మీద కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనీల్‌రెడ్డి తెలిపారు. కాగా ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కుక్కల దాడిలో 16 గొర్రెలు మృతి
వర్గల్ (మెదక్) : గొర్రెల మందపై ఊర కుక్కలు దాడి చేసి బీభత్సం సృష్టించాయి. దీంతో 16 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఈ సంఘటన గురువారం మెదక్ జిల్లా వర్గల్ మండలం తున్కిఖాల్సాలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన అయ్యల్లం గొర్రెల కాపరి. బుధవారం రాత్రి గొర్రెలను గ్రామంలోని తన కొట్టంలో ఉంచాడు. కొట్టంలోకి చొరబడిన ఊర కుక్కలు దాదాపు 100 వరకు ఉన్న గొర్రెల మందపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో 16 గొర్రెలు అక్కడికక్కడే చనిపోగా, 10 వరకు తీవ్రంగా గాయాలపాలయ్యాయి. గురువారం ఉదయం కొట్టం వద్దకు వెళ్లిన అయ్యల్లం గొర్రెలు మృతి చెంది కన్పించడంతో బోరుమన్నాడు. తనకు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందన్నాడు. -
వాట్ యాన్ ఐడియా!
కరువు కాలం.. మోరీ నీరూ వదలం వర్గల్: తీవ్ర వర్షాభావం.. తాగు నీటి కష్టాలు తెచ్చి పెట్టింది. భూగర్భజలం అడుగంటడంతో గుక్కెడు నీటికి పరితపిస్తున్న గడ్డు కాలం. ఇక నిర్మాణాలకు నీటితిప్పలు చెప్పనలవి కాదు. మురుగు నీటిని సైతం వదలని పరిస్థితి. ఇందుకు మెదక్ జిల్లా వర్గల్ మండలం నెంటూరులో ఏఎన్ఎం భవన నిర్మాణ పనులకు మోరీ నీటిని జాగ్రత్తగా వాడుకుంటున్న తీరే నిదర్శనం. ఊరు నుంచి వచ్చే మోరీ నీళ్లను నిర్మాణ పనులు జరుగుతున్న భవనం సమీపంలో అడ్డుకట్ట వేసి ఇలా ఆపేశారు. ఆ నిల్వ నీటిలో ఓ చిన్న సింగిల్‌ఫేజ్ మోటర్ పెట్టి తోడుకుంటున్నారు. నిర్మాణ పనులకు ‘నీటి’ కరువును అధిగమిస్తున్నారు. వాట్ యాన్ ఐడియా..!! -
ఊరికి బస్సొస్తుందా..?
పాములపర్తి వద్ద ఆగి, వాకబు చేసిన సీఎం కేసీఆర్ వర్గల్: హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం తన ఫాంహౌస్‌కు వెళ్తున్న సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా వర్గల్ మండలం పాములపర్తి రోడ్డు వద్ద ఆగారు. చేతితో సైగ చేసి రోడ్డు పక్కన ఉన్న బోయిని రాజు, పంచాయతీ కార్యదర్శి వికాస్ తదితరులను కారు దగ్గరకు పిలిపించుకున్నారు. ‘ఊళ్లోకి బస్సొస్తుందా..ఎన్ని ట్రిప్పులు వస్తుంది..ఊళ్లకు బస్సు తోవ బాగనే ఉన్నదా?’ అని వాకబు చేశారు. బస్సు వస్తున్నదని, అక్కడక్కడ రోడ్డు ఇరుకుగా ఉందని వారు బదులిచ్చారు. దీంతో.. బస్సు తోవ క్లియర్ చేసుకోండ్రి అని చెప్పి సీఎం ముందుకు సాగారు. సాయంత్రం 5 గంటలకు పాములపర్తి చేరుకున్న సీఎం కారులో నుంచే 3 నిమిషాల పాటు మాట్లాడి వెళ్లిపోయారు. సీఎం కాన్వాయ్ ఆగడంతో గ్రామస్తులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. సీఎం ఆగుతారని ఎవరూ ఊహించలేదు. ఊళ్లోనే ఉన్న పీఆర్ డిప్యూటీ ఈఈ ప్రభాకర్, ఎంపీడీఓ కృష్ణన్, ఏఈలు వివేక్‌రెడ్డి, రమేష్, అధికారులు ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. అధికారులతోపాటు టీఆర్ఎస్ నాయకులు ఈ సమాచారం తెలిసి పరుగెత్తుకుని వచ్చేలోపే సీఎం కేసీఆర్ స్థానికులతో మాట్లాడి వెళ్లిపోయారు. ఫాంహౌస్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జగదేవ్‌పూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం సాయంత్రం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తన వ్యవసాయక్షేత్రానికి వచ్చారు. సాయంత్రం 5:15 గంటలకు ఫాంహౌస్‌కు చేరుకున్న ఆయన కాన్వాయ్‌లోని తన వాహనం దిగి, గంటపాటు వ్యవసాయక్షేత్రంలో తిరుగుతూ పరిశీలించారు. కొత్త బావి నిర్మాణాన్ని పర్యవేక్షించారు. పనులెలా జరుగుతున్నయ్? అంటూ ఫాంహౌస్ సూపర్వైజర్ను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఖరీఫ్ సమీపిస్తోందని, వెంటనే పొలాల్లో ఎరువులను చల్లాలని సూచించినట్లు తెలిసింది. సీఎం శనివారం సాయంత్రం ఫాంహౌస్‌కు వస్తున్నారని సమాచారం ఉండడంతో ముందుగానే జిల్లా ఎస్పీ సుమతి, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ ఫాంహౌస్ వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం శనివారం రాత్రి ఇక్కడే బస చేసి ఆదివారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్తారని తెలుస్తోంది. -
వామ్మో ‘పులి’..!
వర్గల్: పులి తిరుగుతుందంటూ వదంతులు వ్యాపించడంతో మెదక్ జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామ రైతులకు మూడు రోజులుగా కంటికి కునుకులేకుండా పోయింది. బుధవారం ఉదయం పులిని చూసానంటున్న ప్రత్యక్ష సాక్షి మాటలు, వ్యవసాయ పొలాల పక్కన అడవి మార్గంలో పాద ముద్రలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వివరాలు.. గ్రామానికి దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలో అడవి సరిహద్దులో రైతుల వ్యవసాయ పొలాలు ఉన్నాయి. తోటలు, ఇతర పంటలు సాగు చేస్తూ తమ పశువులను అక్కడే కట్టేసి రాత్రిళ్లు ఇళ్లకు చేరుకుంటారు. మూడు రోజుల క్రితం అటవీ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు పుకార్లు వచ్చాయి. వీటికి తోడు సోమవారం మల్లన్నగుట్ట ప్రాంతంలో తిని వదిలేసిన ఓ అడవి పంది కళేబరాన్ని గమనించారు. మంగళవారం పటేల్ చెరువు సమీప అటవీ ప్రాంతంలో పులి గాండ్రింపులు వినపడినట్లు రైతులు చెప్పారు. తాజాగా బుధవారం ఉదయం బాపయ్య చెరువు అటవీ ప్రాంతం పక్కనే ఉన్న తన పొలానికి వచ్చిన రైతు ఉప్పరి నరసింహులుకు పులి కనబడడంతో భయంతో ఊళ్లోకెళ్లి చెప్పాడు. కొందరు అటవీ ప్రాంతంలో గాలింపు జరపగా పాద ముద్రలు కన్పించాయి. దీంతో ఇక్కడ పులి సంచా రం నిజమే అనే భయం రైతుల్లో ఆవరించింది. పాదముద్రలు పరిశీలించిన అటవీ బృందం వేలూరు వ్యవసాయ పొలాల ప్రాంతాన్ని ములుగు, మీనాజీపేట ఫారెస్టు బీట్ అధికారులు ఆజం హుస్సేన్, సాదత్ మియా పరిశీలించారు. పాద ముద్రలు తీసుకున్నారు. వీటిని పరిశీలిస్తే ‘హైనా’ను పోలి ఉన్నాయని వారు చెప్పారు. -
టార్గెట్ పూర్తయింది..వెళ్లండి!
వర్గల్: నిన్న మొన్నటి దాకా రివార్డులు, అవార్డులంటూ మహిళలను బతిమాలి కుటుంబ నియంత్రణ శిబిరానికి తరలించిన వైద్యులు తమ వైఖరి మార్చుకున్నట్లు తెలిసింది. మంగళవారం వర్గల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం వచ్చిన సగానికి పైగా మహిళలను టార్గెట్ పూర్తయిందని, మలి విడత క్యాంపులో ఆపరేషన్లు చేయించుకోవాలని తిప్పి పంపారు. ఉదయం నుంచి ఆస్పత్రి ఎదుట పసిపాపలతో పడిగాపులు గాసిన మహిళలు వైద్యాధికారుల వ్యాఖ్యలతో దిగ్భ్రాంతికి గురయ్యారు. శస్త్ర చికిత్స చేయించుకోకుండానే ఉసూరుమంటు వెళ్లిపోయారు. సాధారణంగా వర్గల్లో నిర్వహించే కుటుంబ నియంత్రణ ప్రత్యేక శిబిరానికి మండలంతోపాటు, ములుగు, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల నుంచి కూడా మహిళలు వస్తుంటారు. లక్ష్యాన్ని సాధించేందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్న మహిళలకు నగదు పారితోషికాన్ని ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందజేస్తోంది. మరోవైపు శిబిరానికి మహిళలను తరలించే విధంగా ఏఎన్ఎం, ఆశాజ్యోతి వర్కర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అర్హులైన తల్లులకు నచ్చచెప్పి, బతిమాలి శిబిరాలకు తరలిస్తుండడం ఏఎన్ఎం, ఆశ వర్కర్ల విధిలో ప్రధానమైంది. ఈ క్రమంలో మంగళవారం వర్గల్ శిబిరానికి 150 మందికి పైగా మహిళలు వచ్చారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఆర్టీసీ బస్సు సౌకరం లేకపోవడంతో తెల్లవారే సరికి ఆటోల్లో చంటిపిల్లలతో వర్గల్ చేరుకున్నారు. వారిలో 75 మందికి మాత్రమే ఆపరేషన్లు చేసేందుకు రిజిష్టర్ చేసుకున్నారు. క్యాంపునకు సరిపడిన సంఖ్య పూర్తయిందని, ఇక ఖాళీలు లేవని, తరువాత నిర్వహించే క్యాంపునకు రావాలని వైద్యులు వారితో కరాఖండిగా చెప్పారు. దీంతో జగదేవ్‌పూర్, గజ్వేల్ తదితర ప్రాంతాలనుంచి వచ్చిన మహిళలు కొద్దిసేపు వైద్య సిబ్బందితో వాదనకు దిగారు. ఉదయం నుంచి పడిగాపులు గాశామన్నారు. వారి బాధలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు. గింత అన్యాలమా..పద్మ (ఎర్రవల్లి) వర్గల్ క్యాంపుల ఆపరేషన్ చేస్తరంటె పొద్దుగాల పొద్దుగాలనే ఆటోల వర్గల్‌కు వచ్చినం. పగటాల్దాక దవాఖాన ముందర నిర్ర నీలిగినం. ఆపరేషన్లకు ఎక్కువ మంది ఒచ్చిన్రని నన్ను పట్టించుకోలె. చంటి పిల్లను పట్టుకుని గింత దూరం ఈడ్సుకుంట వస్తె మల్ల క్యాంపునకు రమ్మని ఎల్లగొట్టిండ్రు. పైసల్ ఖర్సాయే..కష్టం తప్పకపాయె. ఊరుగాని ఊరునుంచి వస్తే తమాం గింత అన్యాలమా. ముందే చెపితె గింత తిప్పల పడకపోతుంటిమి. గరీబోల్లను గిట్ల పరేషాన్ చేయకుండ్రి. అధికారుల ఆదేశాల మేరకే... - డాక్టర్ సిల్వియా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం వచ్చిన మహిళలను తిప్పిపంపిన మాట వాస్తవమే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కు.ని. ప్రత్యేక శిబిరాలు నిర్వహించి గతంలో 150కి పైగా శస్త్ర చికిత్సలు జరిపిన సందర్భాలున్నాయి. ఇటీవల జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సంఖ్యను 80కి మించకుండా జిల్లా అధికారులు కుదించారు. వారి ఆదేశాలకు అనుగుణంగానే వర్గల్ శిబిరంలో 75 మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు జరిపాం. మిగతా వారు తరువాతి శిబిరంలో శస్త్ర చికిత్స జరిపించుకోవాలని నచ్చచెప్పి పంపించాం. -
బాల్య వివాహానికి అధికారుల బ్రేక్
వర్గల్, న్యూస్‌లైన్: పసితనపు ఛాయలు ఇంకా వసివాడలేదు.. ఆ బాలికకు పెళ్లంటే ఏంటో తెలియదు.. అయినా ఆ బాలిక తల్లిదండ్రులు, బంధువులు వివాహం చేసేందుకు ప్రయత్నించడంతో అధికారులు అప్రమత్తమై అడ్డుకున్నారు. బాల్య వివాహానికి బ్రేక్ వేశారు. కలకలం రేపిన ఈ సంఘటన శుక్రవారం వర్గల్ మండల కేంద్రంలో జరిగింది. పేదరికం సాకుతో చదువుకు బదులు తన కూతురిని పనిబాట పట్టించి నాడు బాల కార్మికురాలిగా మార్చిన తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అధికారులు ఆ బాలికను కస్తూర్బా గురుకులంలో చేర్పించారు. నేడు అదే బాలికను భారం దించుకోవాలనే తపనతో తల్లిదండ్రులు పెళ్లి తంతు నడిపించే ప్రయత్నం చేశారు.వివరాల్లోకి వెలితే.. వర్గల్‌కు చెందిన హుస్సేన్, గోరీబీ దంపతులు కూలి పని చేస్తూ కాలం గడుపుతున్నారు. ఆడపిల్ల భారం దించుకోవాలనే తపనతో వర్గల్ కస్తూర్బా గురుకులంలో ఆరో తరగతి చదువుతున్న తమ కుమార్తెకు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ఖాజాతో వివాహ సంబంధం కుదుర్చుకున్నారు. శుక్రవారం వివాహం జరిపించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విషయం తెలిసిన స్థానిక గురుకుల అధికారి పరిస్థితిని జీసీడీఓ రమాదేవికి చేరవేసింది. ఆమె జిల్లా విద్యాధికారి రమేష్ దృష్టికి తీసుకెళ్లడంతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వెంటనే గజ్వేల్ సీడీపీఓ విమల, తహశీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ కృష్ణన్, ఎంఈఓ సుఖేందర్, వర్గల్ కస్తూర్బా గురుకుల ప్రత్యేకాధికారిణి రాధిక, గౌరారం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ జగదీశ్వర్ ఉదయం పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న బాలిక ఇంటికి చేరుకున్నారు. పేదరికం కారణంగా తాము చందాలు పోగుచేసి కూతురి పెళ్లి జరుపుతున్నామని తల్లిదండ్రులు అధికారులకు వివరించారు. బాల్యవివాహం నేరమని అధికారులు వారికి నచ్చజెప్పి పెళ్లి ప్రయత్నం విరమింపజేశారు. బాలిక భవిష్యత్తు దృష్ట్యా సంగారెడ్డిలోని బాల సదనానికి (చిల్డ్రన్ హోం) తరలిస్తున్నట్లు ఈ సందర్భంగా గజ్వేల్ సీడీపీఓ విమల తెలిపారు. అందరూ బలవంతం చేస్తేనే పెళ్లికి ఒప్పుకున్నానని, తనకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని, చదువుకుంటానని బాలిక ఈ సందర్భంగా విలేకరులకు తెలిపింది. నాడు బాల కార్మికురాలిగా.. వర్గల్ కస్తూర్బా గురుకులం ముందర కూలీ పని చేస్తూ గత సంవత్సరం సెప్టెంబర్ 25న బాల కార్మికురాలిగా జీసీడీఓ రమాదేవి దృష్టిలో పడింది. వెంటనే ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అదే రోజున వర్గల్ గురుకులంలో ఆరో తరగతిలో ప్రవేశం కల్పించారు. తాజాగా బాల్య వివాహం నుంచి అధికారులు విముక్తి కలిగించారు. -
పేలిన గ్యాస్‌బండ
వర్గల్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని గిర్మాపూర్ దళితవాడలోని ఓ ఇంట్లో మంగళవారం ‘గ్యాస్’ సిలిండర్ పేలింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆ కుటుంబంలోని వారంతా వంటగదికి దూరంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో పైకప్పు రేకులు ధ్వంసం కాగా, మంటలకు పలు వస్తువులు, చీరలు కాలిపోయాయి. ఈ ఘటనతో దళిత వాడ ప్రజలు భీతిల్లి పరుగులు తీశారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన డ్యాగ వెంకటయ్య ఇంట్లో మంగళవారం ఉదయం అతని భార్య మల్లమ్మ వంటావార్పు చేసింది. భర్త, కుమారుడితోపాటు తాను కూడా భోజనం ముగించింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మల్లమ్మ ఇంటిని శుభ్రం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఇంటి వెలుపల ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో వంట గదిలోని సిలిండర్‌కు మంటలు అంటుకున్నాయి. గది నిండా పొగ కమ్ముకోగా ఆ తర్వాత పేలిన శబ్ధం వినిపించింది. దీంతో వెంకటయ్య కుటుంబీకులతో పాటు ఇరుగుపొరుగు భయంతో పరుగులు తీశారు. ప్రమాద విషయం తెలుసుకున్న సమీప గ్రామంలో ఉన్న మరో గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని గ్యాస్ సిలిండర్‌ను బయటకు తీసుకువచ్చారు. సిలిండర్ అడుగున రంధ్రాలు పడడంతోనే ప్రమాదం సంభవించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదంలో ఇంట్లోని అనేక వస్తువులు కాలిపోయాయని, పైకప్పు రేకులు ధ్వంసమయ్యాయని ఇంటి యజమాని వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా భీతిల్లి పోయామని, ఘటనపై తహశీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తగు నష్ట పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్యాస్ ఏజెన్సీ సిబ్బందిపై మండిపాటు కాలం చెల్లిన పాత సిలిండర్లు సరఫరా చేయడం వల్లే ప్రమాదం జరిగిందని పలువురు స్థానికులు సంఘటనా స్థలంలో గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలంటే అంత అలుసా అంటూ నిలదీశారు. ఇకనుంచి కాలం చెల్లిన సిలిండర్లు ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ట్రాన్స్‌కో పంజా!
వర్గల్, న్యూస్‌లైన్: రబీ సీజన్ ప్రారంభ దశలో ట్రాన్స్‌కో బకాయిల పంజా విసురుతోంది. మండలాల వారీగా ఎక్కడికక్కడ వ్యవసాయ విద్యుత్ బకాయిల వసూళ్లు ముమ్మరం చేసింది. వసూళ్ల కోసం రైతులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నది. మున్నెన్నడూ లేని రీతిలో ట్రాన్స్ఫార్మర్ల వారీగా విద్యుత్ సరఫరా నిలిపేస్తూ రబీ సాగును ప్రశ్నార్థకంలో పడేస్తున్నది. పైర్లు ఎండుతున్నా కనికరించబోమన్నట్లు వ్యవహరిస్తున్న ట్రాన్స్‌కో అధికారుల తీరుపట్ల రైతులు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండ్రోజులుగా వర్గల్ మండలంలో వ్యవసాయ విద్యుత్ బకాయిలు వసూలును ట్రాన్స్‌కో అధికారులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ట్రాన్స్ఫార్మర్ పరిధిలో బకాయిదారులుంటే చాలు ఆ ట్రాన్స్‌ఫార్మర్‌కే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ఆ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో బకాయిలు చెల్లించిన రైతులు సైతం కరెంటు సరఫరాలేక ఇబ్బంది పడుతున్నారు. ఎండుతున్న పంటలు చూస్తూ కుమిలిపోతున్నారు. రాత్రిపూట కరెంటుతో కుస్తీలు పడుతుంటే ట్రాన్స్ఫార్మర్లు బంద్ చేయడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మజీద్‌పల్లి, గుంటిపల్లి గ్రామాల్లో అనేక ట్రాన్స్ఫార్మర్లకు ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపేశారు. అదేవిధంగా సోమవారం సైతం మల్లారెడ్డిపల్లిలో విద్యుత్ బకాయి వసూలు క్యాంపు నిర్వహించి నాలుగు ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. నిన్నమొన్నటిదాకా తుపాను కష్టాలు, అకాల వర్షాలతో నష్టాల పాలై రబీ సాగుకు వెళుతుంటే ఒక్కసారిగా బకాయి వేధింపులకు పాల్పడడం పట్ల రైతులు మండిపడుతున్నారు. పంట మొదట్లనే గివేం కష్టాలు సారూ.. నాకున్నది రెండెకరాలు. ఒక బోరున్నది. నీళ్లు కూడా బాగానే ఉన్నాయి. ఎకరం వరి, ఇంకో ఎకరంలో కూరగాయ పంటలు వేస్తాను. గట్లనే ఇప్పుడు కూడా నారు పోశాను. గింజలు వేసిన్నో లేదో కరెంట్ బంద్ పెట్టిండ్రు. ఇంకో ఎకరంలో పల్లికాయ వేసిన. దానికి కూడా నీటి తడి ఆగిపోయింది. శేను ఆగమాగమైతున్నది. నేను కరెంటు బకాయి కట్టిన. రాత్రి కరెంటు తోని ఇబ్బంది పడుతుంటే అది కూడా రాకుండా చేస్తే మాసొంటి గరీబోల పరిస్థితి ఏం కావాలె. కష్ట కాలం నుంచి బయట పడుదామంటె గిట్ల చేసుడు న్యాయం కాదు. - పెద్దోల్ల నర్సింలు (గుంటిపల్లి) బకాయిలు కట్టకుంటే సరఫరా నిలిపేస్తాం వ్యవసాయ విద్యుత్ బకాయలు రూ.లక్షల్లో పేరుకుపోయాయి. మండలంలో దాదాపు రూ.90 లక్షల దాకా బకాయలున్నాయి. బకాయ వసూలుపై స్పష్టమైన ఆదేశాలున్నాయి. రైతులు బకాయలు చెల్లించకుంటే ట్రాన్స్ఫార్మర్ల వారీగా సరఫరా నిలిపివేస్తున్నమాట వాస్తవమే. బకాయలు చెల్లిస్తేనే ఆయా ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తాం.గుంటిపల్లిలో బకాయలు కొంత మేర వసూలు కావడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం. రైతులు బకాయలు కట్టి సహకరించాలి. -ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్ -
రాయలకు ఒప్పుకోం
వర్గల్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణే కావాలని, రాయల తెలంగాణకు ఒప్పుకోబోమని మాజీ మంత్రి, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం గౌరారంలో జరిగిన వర్గల్, ములుగు మండలాల టీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కిరికిరి పెడితే మరో పోరాటానికైనా సిద్ధమని అన్నారు. తెలంగాణ కోసం అసెంబ్లీలో నోరు మెదపని, రాజీనామాలతో పదవీ త్యాగం చేయాలంటే పారిపోయినవారు తెలంగాణ పేరిట సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని నాయిని ధ్వజమెత్తారు. మద్రాస్ రాష్ట్రంలో తమకు అటెండర్ పోస్ట్ విషయంలో అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్రం కోరిన సీమాంధ్రులు తెలంగాణ ప్రాంతంలో రెండు లక్షల ఉద్యోగాలను అనుభావిస్తున్నారని అన్నారు. అందుకోసమే తాము ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబుకు ప్రేమ, అనురాగాల ప్రాధాన్యత తెలియదని, సీఎం పదవి కోసం పిల్ల నిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన ఘనుడని ఎదేవా చేశారు. టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమాలతోనే తెలంగాణ ఆవిర్భావం జరుగనుందన్నారు. హైదరాబాద్, భద్రాచలంతో కూడిన పది జిల్లాల తెలంగాణే మాలక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు సరేష్‌గౌడ్, ఎలక్షన్ రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.