సాక్షి, వరంగల్ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కీలక ఆధారం లభ్యమయింది. ఈ కేసులో జూనియర్ మెడికో వాంగ్మూలం కీలకంగా మారనుంది. పోలీస్ విచారణ, యాంటీ ర్యాగింగ్ కమిటీలో కీలక విషయాలను బయట పెట్టిన జూనియర్ డాక్టర్.. ప్రీ అనస్థిషియా రిపోర్ట్ వివాదంలో డాక్టర్ సైఫ్ చెప్పిన అభిప్రాయానికి భిన్నమైన విషయాలను వెల్లడించారు.
పీఏసీ రిపోర్ట్ విషయంలో డాక్టర్ సైఫ్ ఫిజికల్‌గా లేకున్నా డాక్టర్ ప్రీతిని బ్లేమ్ చేసినట్టు నిర్ధారణ అయింది. జీఎంహెచ్‌లో జూనియర్ విద్యార్థినికి డిక్టేట్ చేస్తూ పీఏసీ రిపోర్ట్‌ని డాక్టర్ ప్రీతి ఫైండింగ్స్ పొందుపరిచినట్లు విచారణలో వెలుగు చూసింది.
డాక్టర్ సైఫ్ తనను కావాలని వేధిస్తున్నాడని, పీఏసీ రిపోర్ట్ వివాదం వివరించి తనకు సపోర్ట్ చేయాలని అర్ధించిన డాక్టర్ ప్రీతి.. తనపై కుట్ర జరుగుతోందని మానసిక సంఘర్షణకు లోనైంది. ఇదే విషయం లాస్ట్ కాల్‌లో సహ విద్యార్థికి తన ఆవేదన వెలిబుచ్చింది.
డాక్టర్ ప్రీతి లాస్ట్ కాల్‌పై పూర్తి స్థాయి సమాచారాని విచారణ బృందం సేకరిస్తోంది. పీఏసీ రిపోర్ట్ విషయంలో నిందితుడు డాక్టర్ సైఫ్ వాదన అవాస్తవమని పోలీస్ విచారణ రుజువు చేస్తోంది. డాక్టర్ సైఫ్, డాక్టర్ ప్రీతి మధ్య వివాదంగా మారిన ప్రశ్నించే తత్వం, దానికి సంబంధించిన చాట్స్ లభ్యమైంది. మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ ఆధారాల ఆధారంగా కేసును పోలీసులు అధికారులు బిల్డప్ చేయనున్నారు.
సైఫ్ వేధింపులపై సాంకేతిక పరమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. నాలుగు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్న సైఫ్ చెప్పిన వివరాలతో అనస్తీషియా డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నాయి.
కౌన్సిలింగ్‌లో ప్రీతి కన్నీరు పెట్టడంపై పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జీఎంహెచ్‌లో సైఫ్, అనస్తిషియా డిపార్ట్‌మెంట్‌లో హెచ్‌వోడీ వ్యవహారం, ప్రీతి ఆడియోల్లో హెచ్‌వోడి పేరు ప్రస్తావించడాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. సైఫ్, హెచ్‌వోడి నాగార్జున రెడ్డి వ్యవహారాన్ని పోలీసులు ర్యాగింగ్ కోణంలో చూస్తున్నారు.
లీవ్, కౌన్సిలింగ్ విషయంలో నాగార్జున్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదమయింది. ఇప్పటికే హెచ్‌వోడీని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ రోజుతో సైఫ్ నాలుగు రోజుల పోలీసుల కస్టడీ ముగుస్తుంది. కాగా, రేపు(సోమవారం) కోర్టులో సైఫ్‌ను హాజరు పరిచి జైలుకు తరలించనున్నారు.
చదవండి: కాలేజీ యాజమాన్యమే మా కొడుకును చంపేసింది: సాత్విక్ పేరెంట్స్
Comments
Please login to add a commentAdd a comment