preethi
-
ఎనిమిదేళ్లు గడిచినా నా బిడ్డకు న్యాయం చేయరా?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై నిందితులు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హతమార్చి 8 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకూ న్యాయం జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వం ముంబై నటి జత్వానీ కేసుపై పెట్టిన శ్రద్ధను సుగాలి ప్రీతి కేసులో చూపిస్తే మాకు ఎప్పుడో న్యాయం జరిగేది. మమ్మల్ని చంపేయడం మినహా.. కేసును నీరుగార్చేందుకు ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టాలో, హింసించారో అన్ని రకాలుగా చేశారు. ‘న్యాయం’ చేయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను అర్థించినా ఫలితం లేదు. ఈ కేసును సీబీఐతో విచారించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలు చేయాలి’ అని బాధితురాలు సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి కేసును విచారణకు స్వీకరించేందుకు విముఖత వ్యక్తం చేస్తూ సీబీఐ తరఫు న్యాయవాదులు ఈ నెల 12న హైకోర్టుకు లిఖితపూర్వకంగా నివేదించిన నేపథ్యంలో పార్వతీదేవి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన కుమార్తె హత్యోదంతం, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. వ్యవస్థలు నిర్వీర్యం.. 2017లో చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ఘటన జరిగింది. నా బిడ్డ 14 ఏళ్ల ప్రీతిపై లైంగిక దాడికి పాల్పడి హాస్టల్లో చంపేశారు. ఆర్థికంగా అత్యంత బలవంతులైన నేరస్తులకు రాజకీయ పార్టీల అండదండలున్నాయి. పోక్సో కేసులో 90 రోజులు బెయిల్ రాకూడదు. కానీ 8 రోజుల్లోనే బెయిల్ వచ్చిందంటే వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయ్యాయో, వారు ఎంత బలవంతులో అర్థమవుతోంది. ఈ కేసును నిర్వీర్యం చేయడం వెనుక పోలీసుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు. 2017లో అప్పటి ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు. హక్కుగా రావల్సిన రూ.8,12,500 మాత్రమే ఇచ్చారు. మాకు న్యాయం చేయాలని, ఏ గిరిజన బాలికకూ ఇలా అన్యాయం జరగకూడదని అప్పటి నుంచి నుంచి మేం పోరాడుతున్నాం. సీబీఐతో ఎందుకు విచారించలేదు? చంద్రబాబు హయాంలో 2017 నుంచి 2019 వరకూ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అప్పటి విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పాదయాత్రలో కలిసి కేసు గురించి వివరించడంతో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో 2019లో హైకోర్టులో కేసు వేశాం. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2020లో కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు ఆయన్ను కలసి సీబీఐతో విచారణ చేయించాలని కోరడంతో సానుకూలంగా స్పందించారు. జగన్ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. 2021లో కర్నూలు సిటీలో ఐదు సెంట్ల స్థలం, 5 ఎకరాల పొలంతో పాటు నా భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత సీబీఐ స్పందించకపోవడంతో ఢిల్లీ వెళ్లి అధికారులను కలిశాం. ఆ తర్వాత జీవోను అమలు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. కేసును ఎందుకు విచారణకు తీసుకోలేదని సీబీఐపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. దీంతో ఈ కేసును స్వీకరించేందుకు తగిన వనరులు లేవని, అయినా ఇది సీబీఐ పరిశోధించేంత సున్నితమైనది కాదని, స్థానిక పోలీసులే తేల్చవచ్చు’ అని ఈ నెల 12న హైకోర్టుకు వారి న్యాయవాది చెప్పారు. దీనిపై మేం కౌంటర్ దాఖలు చేస్తాం.డిప్యూటీ సీఎం, హోంమంత్రిని కలిసినా..పవన్ కళ్యాణ్ గతంలో కర్నూలులో ర్యాలీ నిర్వహించినప్పుడు మమ్మల్ని పరామర్శించి న్యాయం చేస్తామన్నారు. డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తర్వాత 2024 జూలై 27న మరోసారి కలిశాం. ఆయన సూచన మేరకు హోంమంత్రి వద్దకు వెళ్లగా సీబీఐతో కాకుండా సీఐడీతో విచారణ చేయిస్తామన్నారు. అయితే ఈ కేసులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నందున విచారణ అధికారులుగా సీనియర్లను నియమించాలని కోరాం. అనంతరం కేసును విచారణకు స్వీకరిస్తామంటూ కర్నూలు సీఐడీ ఆఫీసు నుంచి మాకు నోటీసు వచ్చింది. అయితే ఇందులో ‘పెద్దల ప్రమేయాన్ని’ మీరు తేల్చలేరని, ఐపీఎస్‌లను మీరెలా విచారిస్తారని, ఉన్నతాధికారులైతేనే మేం విచారణకు సిద్ధమని చెప్పాం. డీఎస్పీ స్థాయిలో అయితే సీఐడీ విచారణ వద్దు అని లిఖిత పూర్వకంగా తెలియచేశాం.జత్వానీ, ప్రీతి కేసుల్లో ఏది తీవ్రమైంది?ముంబై నటి జత్వానీని వేధించారని ఈ ప్రభుత్వం వచ్చాక కేసు పెట్టారు. ఆవిడ ప్రాణాలతోనే ఉంది. కానీ సుగాలి ప్రీతి 14 ఏళ్ల బాలిక. ఘోరంగా అత్యాచారం చేసి చంపారు. నా బిడ్డ ప్రాణాలతో లేదు. జత్వానీ కేసులో ఈ ప్రభుత్వం ఐపీఎస్‌లను సస్పెండ్ చేసి అత్యంత ప్రాధాన్యత కేసుగా విచారిస్తోంది. ప్రాణాలు కోల్పోయిన ఓ గిరిజన బాలిక కేసును ఇంతే సీరియస్‌గా ఎందుకు తీసుకోవడం లేదు? ఈ కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయి. బాధితురాలిపై అత్యాచారం జరిగిందని, ‘వై’ క్రోమోజోమ్ గుర్తించామని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లు కూడా నిర్ధారించాయి. కానీ ఇలాంటి కేసును సీబీఐతో విచారణ చేయించడం లేదు. కూటమి ప్రభుత్వం జత్వానీ కేసుపై పెట్టిన శ్రద్ధను సుగాలి ప్రీతి కేసులో పెట్టి ఉంటే మాకు ఎప్పుడో న్యాయం జరిగేది’ అని పార్వతీ ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వడం, న్యాయం చేయడం రెండు వేర్వేరు అంశాలని, ఈ కేసులో న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. -
సముద్రమంత ఆత్మవిశ్వాసం
‘ఎగిసే అలలతో పోరాటం.. అమ్మాయిలకు సాధ్యమయ్యే పనేనా’ అనే చిన్నపాటి ఆలోచనలను కూడా దరిచేరనివ్వడం లేదు నవతరం. ఆకాశమే హద్దుగా నీటి మీదనే తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. క్లిష్టమైన సెయిలింగ్ క్రీడా పోటీలలో తమ సత్తా చాటుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. హైదరాబాద్ వాసులైన ఈ యువ సెయిలర్ల సాహసం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తుంది.హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉండే పూతన మాన్య రెడ్డి మొదట స్కూల్ స్థాయిలో స్విమ్మింగ్ నేర్చుకుంది. స్విమ్మింగ్ పోటీలో పాల్గొంటూ సెయిలింగ్‌పై ఆసక్తి కలిగి, శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. సెయిలింగ్‌కి అనుకూలమైన వాతావరణం కోసం గోవా, మైసూర్..లలో ప్రాక్టీస్ చేసింది. సీనియర్లు ఉపయోగించే బోటుకు మారి, జాతీయ స్థాయిలో ఇప్పటికే 5 పతకాలు సొంతం చేసుకుంది. షిల్లాంగ్ నేషనల్ ర్యాంకింగ్ రెగెట్టా, తెలంగాణ జాతీయ జూనియర్ రెగెట్టాలోనూ కాంస్యాలను సాధించింది. థాయ్‌లాండ్, పోర్చుగల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నుంచిప్రాతినిధ్యం వహించింది. ఇటీవల మలేషియాలోని లంకాగ్వి అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొని, బంగారు పతకాన్ని సాధించింది.సాహసాలు చేసే శక్తిని ఇస్తుంది ఈ క్రీడల్లో పాల్గొనడానికి చాలా శక్తి కావాలని, ఆరోగ్యసమస్యలు వస్తాయని, ఆడపిల్లలకు సరైనది కాదని చాలామంది నిరాశ పరిచారు. కానీ, సెయిలింగ్ ఎంత ఉత్సాహవంతమైన క్రీడనో, సాహసాన్ని ప్రదర్శించడమే కాదు సముద్రమంత ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుందని తెలిసింది. అంతేకాదు భవిష్యత్తు ఎంతో ఉత్తమంగా మార్చుకునే అవకాశాలనూ ఇస్తుంది. ఒలింపిక్స్ సెయిలింగ్ పోటీలో పాల్గొని పతకాలని సాధించేందుకు కృషి చేస్తున్నాను. ట్రైనింగ్, పోటీలు.. అంటూ నీళ్లతోనే మా సావాసం కాబట్టి అందుకు తగిన వ్యాయామం, సమతుల ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకుంటాను. లెవన్త్ గ్రేడ్ చదువుతున్నాను. వాయిలెన్ మరో ఇష్టమైన హాబీ, స్కూల్ ఎన్జీవోలో యాక్టివ్ మెంబర్ని.– పూతన మాన్యరెడ్డినీళ్లు చూస్తే భయం వేసిందినాలుగేళ్ల క్రితం మా స్కూల్లో ‘సెయిలింగ్‌లో శిక్షణ ఇస్తున్నార’ని చెబితే, ఆసక్తితో నా పేరు ఇచ్చాను. మొదట నీళ్లను చూస్తే భయం వేసింది. కానీ, ఒక్కసారి నీటిలో ప్రయాణించాక, మరోసారి పాల్గొనేలా ఆసక్తి కలిగింది. సెయిలింగ్ ఖర్చుతో కూడుకున్న క్రీడ. యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మాకు సపోర్ట్ చేస్తోంది. మా అమ్మ వంటలు చేస్తూ మమ్మల్ని చదివిస్తోంది. మా చదువుకు క్రీడలు కూడా తోడయితే మరిన్ని విజయాలు సాధించవచ్చు.. అని తెలుసుకున్నాం. అందుకే ధైర్యంగా నీటి అలలపై మమ్మల్ని మేం నిరూపించుకుంటున్నాం.– కొమరవెల్లి దీక్షితఅక్కను చూసి...అక్కను చూసి నేనూ సెయిలింగ్ స్పోర్ట్స్‌లోకి వచ్చేశాను. అండర్–15 కేటగిరీలో పాల్గొంటున్నాను. మలేషియాలో జరిగిన సెయిలింగ్ పోటీలో వివిధ దేశాల నుంచి వచ్చిన 102 మంది సెయిలర్స్ పాల్గొన్నారు. ఒమన్‌లో జరిగిన పోటీలో రజత పతకం సాధించాను. – కొమరవెల్లి లహరిభారత్తో పాటు సౌత్కొరియాలలో జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొని స్వర్ణ, ర జిత పతకాలు సాధించిన ఈ అక్కాచెల్లెళ్లకు హైదరాబాద్‌లోని సెయిలింగ్ యాట్ క్లబ్ మద్దతునిస్తోంది.హైదరాబాద్ ఈస్ట్మారేడ్పల్లిలో ఉంటున్న ప్రీతి కొంగర ఓపెన్ డిగ్రీ చేస్తూ సీనియర్ సెయిలింగ్ స్పోర్ట్స్‌లో సంచనాలు సృష్టిస్తోంది. చైనాలో జరిగిన ఏషియన్ క్రీడలో పాల్గొంది. హైదరాబాద్, ముంబైలలో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లలో రజత, స్వర్ణ పతకాలు సాధించింది.పేదరికం అడ్డుకాదు‘11 ఏళ్ల వయసులో సెయిలింగ్‌లోకి అడుగుపెట్టాను. సెయిలింగ్ అనేది చాలా ఓర్పుతో కూడుకున్న క్రీడ. దీనికి ఫిట్నెస్ చాలా అవసరం. ట్రైనింగ్‌లో భాగంగా రోజూ 4–5 గంటలుప్రాక్టీస్ చేస్తాను. ఈ క్రీడలో అబ్బాయిలు ఎంత కష్టపడాలో, అమ్మాయిలూ అంత కష్టపడాల్సిందే. అన్ని స్పోర్ట్స్ కన్నా ఇది చాలా భిన్నమైంది. సవాల్‌తో కూడుకున్నది. అందుకే సెయిలింగ్ని ఎంచుకున్నాను. ఏప్రిల్‌లో జరగబోయే ఒలింపిక్ సెయిలింగ్‌లో పాల్గొనడానికి శిక్షణ తీసుకుంటున్నాను.– ప్రీతి కొంగర– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సుగాలి ప్రీతి కేసు ఇక మూలకే!
-
సుగాలి ప్రీతి కేసు ఇక మూలకే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదో తరగతి దళిత విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు ఇక మూలకు చేరనుంది. గత చంద్రబాబు పాలనలో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు తూతూమంత్రంగా విచారించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని తల్లిదండ్రులు కోరగా, ఆమేరకు వైఎస్ జగన్ ఉత్తర్వులిచ్చారు. అయినా సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడంతో తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి సాగదీస్తూ వచ్చిన సీబీఐ.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రావడంతో పూర్తిగా యూటర్న్ తీసుకుంది. ఈ కేసులో అంత సంక్లిష్టత లేదని హైకోర్టుకు తెలిపింది. వనరుల కొరత కారణంగా చూపుతూ తాము దర్యాప్తు చేయలేమని తేల్చి చెప్పింది. ప్రీతి తల్లిదండ్రుల పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును కోరింది. చంద్రబాబు హయాంలో తూతూ మంత్రంగా దర్యాప్తుకర్నూలు నగర శివార్లలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతీబాయ్ 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్‌కి ఉరేసుకుని చనిపోయినట్లు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పింది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు లైంగిక దాడి చేసి చంపేశారని తల్లిదండ్రులు సుగాలి రాజు నాయక్, పార్వతిదేవి ఆరోపించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరిగింది. అదే రోజు కర్నూలు పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పోక్సో చట్ట నిబంధనల కింద కూడా కేసు పెట్టినా, అప్పటి ప్రభుత్వ పెద్దల తీరుతో తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆ స్కూలు కరస్పాండెంట్, ఆయన కుమారులను అరెస్ట్ చేశారు. తరువాత కొద్ది రోజులకే వారు బెయిల్‌పై బయటకు వచ్చేశారు. చంద్రబాబు హయాంలో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.సీబీఐ స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, సీబీఐ కూడా స్పందించలేదు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ 2020 సెప్టెంబర్ 11న హైకోర్టులో ప్రీతి తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ రఘురామ రాజన్ ఈ నెల 13న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ప్రీతి మృతి కేసులో అంతర్రాష్ట్ర పర్యవసానాలు, తాము జోక్యం చేసుకోవాల్సినంత చట్టపరమైన సంక్లిష్టత లేవని అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సీబీఐ ప్రధాన కార్యాలయానికి కూడా తెలిపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన, సున్నిత కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.అందువల్ల తమకున్న పరిమిత వనరులతో ఈ కేసు దర్యాప్తు చేపట్టడం సాధ్యం కాదని హైకోర్టుకు వివరించారు. సీబీఐ దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోరుతూ ప్రీతి తల్లిదండ్రులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును కోరారు. ప్రీతి మృతి కేసును అప్పట్లో రాజకీయంగా వాడుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఎలా స్పందిస్తారో చూడాలి. న్యాయం చేసిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డివైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీతి కేసులో తదుపరి దర్యాప్తునకు ఆదేశించింది. అనంతరం ఓసారి కర్నూలు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. తమ కుమార్తె మృతి విషయంలో న్యాయం చేయాలని కోరారు. వారికి న్యాయం చేస్తానని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ప్రీతి మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ 2020 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాక 2021లో ప్రీతి తల్లిదండ్రులకు రూ. 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదెకరాల పొలాన్ని కూడా జగన్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది. అయినా చంద్రబాబు కనీస చర్యలు కూడా తీసుకోకపోయినా, వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే టీడీపీ, జనసేన నేతలు ఈ కేసుపై నానా రాద్ధాంతం చేశారు. -
రెండో పెళ్లి చేసుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.. అమ్మాయి ఎవరంటే? (ఫోటోలు)
-
‘పతంగ్’.. ఇదో కొత్తరకమైన స్పోర్ట్స్ డ్రామా
ఇప్పటి వరకు తెలుగు తెరపై చాలా స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి. కబడ్డి, ఖోఖో, వాలీబాల్, క్రికెట్..ఇలా పలు ఆటలకు సంబంధించిన సినిమాలను చూశాం. కానీ ఇప్పుడు ఓ కొత్తరమైన స్పోర్ట్స్ డ్రామాను చూడబోతున్నాం. పతంగులతో పోటీ పడే సినిమా రాబోతుంది. అదే ‘పతంగ్’. ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 27నప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన పాటలకు చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబరు 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'ఈ సినిమా థియేటర్లో యూత్‌ఫెస్టివల్‌లా వుంటుంది. కొత్తవాళ్లతో చేసిన మా సినిమా కొత్తగా వుండటంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో వుంటుంది అన్నారు. ఈ సినిమాకు కథే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుతమైన పాటలు ఇచ్చాడు. పాట వింటూంటే అందరిలో పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. తప్పకుండా మా పతంగ్ చిత్రం అన్నివర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం ఉంది. కొత్త కంటెంట్‌ను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. డిసెంబరు 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని తెలిపారు. -
ఈమె.. డ్రోనాచార్యులే
‘నేను బాగుండాలి’ అని ఎంతోమంది అనుకుంటారు. కొందరు మాత్రం ‘అందరూ బాగుండాలి... అందులో నేనుండాలి’ అనుకుంటారు. ప్రీత్ సంధూ రెండో కోవకు చెందిన మహిళ.అగ్రీ–డ్రోన్ స్టార్టప్ ‘ఏవీపీఎల్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన కలను నెరవేర్చుకోవడమే కాదు వందలాదిమందికి ఉద్యోగావకాశాలను కల్పించింది. ఎంతో మందికి మైక్రో–ఎంటర్ప్రెన్యూర్లుగా కొత్త జీవితాన్ని ఇచ్చింది. హరియాణాలోని హిస్సార్‌కు చెందిన జ్యోతి మాలిక్ ఆదర్శవాద భావాలతో పెరిగింది. స్వతంత్రంగా ఉన్నతస్థాయికి ఎదగాలనేది ఆమె కల. ముంబైలో చదువుకోవడంతో ఆమె కలలకు రెక్కలు వచ్చాయి. ఉద్యోగంలో చేరింది. అయితే తన సంతోషం ఎంతోకాలం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండేళ్ల తరువాత ఉద్యోగం కోసం వస్తే నిరాశే ఎదురైంది. ‘ఈ జీవితం ఇంతేనా!’ అనే నిరాశామయ కాలంలో ‘ఏవీపీఎల్’ జ్యోతి మాలిక్‌కు మైక్రో–ఎంటర్‌ప్రెన్యూర్‌గా కొత్త జీవితాన్ని ఇచ్చింది.‘ఇప్పుడు నేను ఇండిపెండెంట్. ఎవరైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తమ కలను నిజం చేసుకోవచ్చు’ అంటుంది ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో జ్యోతిమాలిక్.అమృత్‌సర్‌లోని ఖాల్సా కాలేజిలో చదువుకున్న ప్రీత్ సంధూకు కల్పనా చావ్ల రోల్ మోడల్. రాకెట్లు అంటే ఆసక్తి. కాలేజీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అగ్రి–డ్రోన్ స్టార్టప్ ‘ఏవీపీఎల్’ను మొదలుపెట్టింది.వ్యాపార, వ్యవసాయ రంగాలకు అవసరమైన డ్రోన్ ఆపరేషన్లలో నైపుణ్యం కోసం గ్రామీణ ప్రాంతాలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది ఏవీపీఎల్. ది రిమోట్ పైలట్ సర్టిఫికెట్(ఆర్పీసీ), అగ్రికల్చర్ స్ప్రే కోర్సులు గ్రామీణ ప్రాంతాలలో ఎంతోమందికి ఉపకరించాయి. ఈ కోర్సులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడానికే పరిమితం కాలేదు. విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా చేశాయి. మైక్రో–ఎంటర్‌ప్రెన్యూర్‌గా అడుగు వేయడానికి ఉపకరించాయి. ‘ఫీట్ ఆన్ ది స్ట్రీట్’ నినాదంతో ‘ఏవీపీఎల్’ 12 రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాలు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాయి. ప్రీత్ సంధూ నాయకత్వంలో ‘ఏవీపీఎల్’ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్మెంట్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. ‘ఏవీపీఎల్’ శిక్షణా కార్యక్రమాల వల్ల ఒక్క హరియాణాలోనే 800 మంది డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్లుగా మారారు.‘ఆశావాదమే కాదు అవసరమైన సమయంలో ఆత్మవిశ్లేషణ కూడా అవసరం’ అంటుంది ప్రీత్.ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో తమ స్కిల్లింగ్ వెంచర్‌లోని లోపాలను విశ్లేషించింది.‘మా కంపెనీ తరఫున ఎంతోమందికి శిక్షణ ఇచ్చాం. ఇక అంతకుమించి ఆలోచించలేదు. అయితే చాలామందికి గ్రామీణ నేపథ్యం ఉండడం వల్ల పట్టణాల్లో ఉండలేక తిరిగి సొంత ఊళ్లకు వెళ్లి΄ోయేవారు. ఈ నేపథ్యంలో అసలు వారు పట్టణం ఎందుకు రావాలి? గ్రామాల్లోనే ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది ప్రీత్.‘మన దేశంలో పట్టణాల్లోనే కాదు ఎక్కడైనా సరే ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చు’ అనే ఆమె నమ్మకం నిజమైంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన నవీన సాంకేతిక పరిజ్ఞానంతో రూ΄÷ందించిన శిక్షణ కార్యక్రమాలు, రిమోట్ పైలట్ సర్టిఫికెట్, అగ్రికల్చర్ స్ప్రే కోర్సుల ద్వారా యువతరం ఊరు దాటి పట్టణం వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది.‘1.5 లక్షల విలేజ్ ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయాలనేది మా లక్ష్యం. డ్రోన్లు వారి జీవితాలను మార్చివేస్తాయి అనే నమ్మకం నాకు ఉంది’ అంటుంది ‘ఏవీపీఎల్’ కో–ఫౌండర్, సీయీవో ప్రీత్ సంధూ. -
Raj Tarun - Lavanya Case: వేధిస్తోందంటూ లావణ్యపై ఫిర్యాదు
మణికొండ: తనను మోసం చేశాడంటూ నటుడు రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్యపై ప్రీతి అనే మహిళ పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. లావణ్య తనను ఫోన్ చేసి వేధిస్తోందని, తనకు డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ప్రీతి శుక్రవారం రాత్రి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై నార్సింగి అడ్మిన్ ఎస్ఐ సుఖేందర్‌రెడ్డిని వివరణ కోరగా ప్రీతి అనే మహిళ ఇచి్చన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, అది తమ పరిధిలోకి వస్తుందా లేదా అనే అంశంతోపాటు..అందులోని ఆధారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిపై ఇపుడే ఏమి చెప్పలేమన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే ఈ ఫిర్యాదుపై వివరాలను వెల్లడిస్తామన్నారు. ఫిర్యాదుదారు ప్రీతితో పాటు ఆర్జే శేఖర్ బాష, న్యాయవాది శర్మ ఉన్నారు. -
UPSC: యూపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్‌గా ప్రీతిసుదాన్
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదన్.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రీతిసుదాన్.. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.కాగా, ఆగస్టు ఒకటో తేదీన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 316ఏ ప్రకారం ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని ఓ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం యూపీఎస్సీ కమిషన్‌లో సభ్యురాలిగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సోని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2029 మే 15 వరకూ పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన ఐదేళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రీతి సుదన్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.ఇక, ప్రీతిసుదాన్.. 29 ఏప్రిల్ 2025 వరకు సేవలందిస్తారు. కాగా, సుడాన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎకనామిక్స్ అండ్ సోషల్ పాలసీ అండ్ ప్లానింగ్‌లో ఆమె డిగ్రీలు పొందారు. వాషింగ్టన్లో పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో శిక్షణ తీసుకున్నారు. మరోవైపు.. ఆంధ్రా కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రీతిసుదాన్. సుడాన్ గతంలో ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ వంటి వివిధ కేంద్ర, రాష్ట్ర స్థాయి స్థానాల్లో పనిచేశారు. అలాగే విపత్తు నిర్వహణ, పర్యాటక రంగానికి సంబంధించిన హోదాలో పనిచేశారు. ఆమె ప్రపంచ బ్యాంకులో సలహాదారుగా కూడా పనిచేశారు. అలాగే కరోనా సమయంలో ఆమె క్రియాశీలకంగా విధులు నిర్వహించారు. ~ 1983 batch IAS officer Preeti Sudan will be the new UPSC Chairperson, with effect from 1st August 2024. ~ President Droupadi Murmu approves the appointment@rashtrapatibhvn #UPSC pic.twitter.com/parkcQUv9f— DD News Odia (@DDNewsOdia) July 31, 2024 -
లిప్‌లాక్ సీన్స్ వద్దని మా నాన్న చెప్పారు: హీరోయిన్
ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల సోషల్ మీడియాలో తన యూజర్స్‌కు బాగా టచ్‌లో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలు, వీడియోలతో అభిమానులకు మరింత దగ్గరవుతుంది. అమెరికన్ యాసెంట్లో తెలుగు మాట్లాడుతున్న ఈ బ్యూటీ వీడియోలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలా నెట్టింట ఆమె పేరు బాగానే వైరల్ అయింది. తాజాగా ఈ బ్యూటీ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. పతంగ్ అనే సినిమాతో టాలీవుడ్లో అడుగుపెడుతుంది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు పెట్టిన కండీషన్స్ గురించి ఆమె పంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతి పగడాలకు ఒక ప్రశ్న ఎదురైంది. అవకాశం వస్తే ఇంటిమేట్ సీన్లతో పాటు లిప్‌లాక్ వంటి వాటికి ఓకే చెప్తావా అని అడిగితే.. అందుకు ఆమె నో అంటూనే ఇలా చెప్పింది. ' సినిమాల్లోకి అడుగుపెడుతున్నప్పుడు మా నాన్నగారు ఒక కండీషన్ పెట్టారు. లిప్‌లాక్ సీన్లు వద్దన్నారు. నేను అడిగిన ప్రతిదానికి వారు అంగీకరించారు. అలాంటప్పుడు నాన్నగారు పెట్టిన ఆ ఒక్క కండీషన్‌ను దాటకూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే ఇంటిమేట్ సీన్లు చేస్తారా అని ఆఫర్లు వచ్చాయి కానీ నేను ఒప్పుకోలేదు. ఒకవేళ పరిమితిమేరకు ఇంటిమేట్ సీన్లు ఉంటే చేస్తాను. గ్లామర్‌గా కనిపిండంలో ఎలాంటి కండీషన్లు లేవు. ఎందుకంటే ఈరోజుల్లో ఎటూ షార్ట్‌గా ఉన్న డ్రస్‌లను ఉపయోగించడం సాధారణం.' అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ప్రీతి పగడాల తాజాగా నటించిన చిత్రం పతంగ్. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణీత్ ప్రత్తిపాటి పతంగ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా ఉన్నారు. ప్రముఖ సింగర్ ఎస్పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Preethi 💜 (@preethipagadala) -
పొలిటికల్ ఎంట్రీపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ..
-
పెట్రోల్ ట్యాంకు మీద కిట్ పెట్టి.. ఆ తర్వాత నన్నూ కూర్చోబెట్టి!
R Ashwin's Emotional Tribute On 100th Test: ‘‘క్రికెట్ టోర్నీల్లో ఐపీఎల్‌కు ఉన్న ఆదరణ వేరు. అందుకే చాలా మంది టీ20 క్రికెట్ ఆడి ఐపీఎల్‌లోకి రావాలని భావిస్తారు. వాళ్ల కలలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే, ఒక్క విషయం మాత్రం ఆశావహ క్రికెటర్లందరూ గుర్తుపెట్టుకోవాలి. టెస్టు ఫార్మాట్ అనేది జీవితం నేర్పలేని పాఠాలెన్నింటినో నేర్పిస్తుంది. నా దృష్టిలో టెస్టు క్రికెట్ అంటే.. జీవితానికి సరికొత్త అర్థాన్నిచ్చే మంత్రం. ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి.. ప్రతికూలతలను ఎలా అధిగమించాలన్న విషయాలను బోధిస్తుంది. నా మనసులో ఎన్నో భావోద్వేగాలు చెలరేగుతున్నాయి. నాతో పాటు చెన్నైలో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి కూడా ఉద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటాడు. నా క్రికెట్ కిట్ బైక్ పెట్రోల్ ట్యాంకు మీద పెట్టి.. దురదృష్టవశాత్తూ ఆయన ఇక్కడ లేరు. చిన్నతనంలో.. నా క్రికెట్ కిట్ బైక్ పెట్రోల్ ట్యాంకు మీద పెట్టి.. ఆ తర్వాత నన్ను కూడా ముందు కూర్చోబెట్టుకుని.. కోచింగ్ క్యాంపునకు తీసుకువెళ్లేవాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన.. తన కుమారుడు జీవితంలో.. కెరీర్లో ముందుకు వెళ్లాలని బలంగా కోరుకున్నారు. మా అమ్మ, మా తాతయ్య సహకారంతోనే ఆయన నన్ను ఈ స్థాయికి తీసుకురాగలిగారు. ప్రతి అడుగులోనూ నా వెన్నంటే ఉంది ఇక నా భార్య.. నన్ను పెళ్లి చేసుకునే సమయంలో నా ఈ ప్రయాణం ఎక్కడిదాకా వెళ్తుందో ఆమెకు తెలియదు. అయినా.. ప్రతి అడుగులోనూ నా వెన్నంటే ఉంది. నాకు ఇద్దరు ముద్దులొలికే పిల్లలు ఉన్నారు. వాళ్లు కూడా గత కొన్నేళ్లుగా నా క్రికెట్ జర్నీని అర్థం చేసుకుంటూ ఆస్వాదించగలుగుతున్నారు’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. భారత్ తరఫున 100వ టెస్టు బరిలో దిగిన తరుణంలో.. తాను క్రికెటర్‌గా ఎదగడంలో తన తండ్రి రవిచంద్రన్ పాత్ర.. సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించడంలో తన భార్య ప్రీతి అండదండగా నిలిచిన తీరును గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆఖరిదైన టెస్టు గురువారం మొదలైంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ అశ్విన్ కెరీర్లో వందో టెస్టు. ఇక ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా చెన్నై ఆల్‌రౌండర్ అశూ చరిత్రకెక్కాడు. చదవండి: టీమిండియా స్టార్ సంచలన నిర్ణయం?! Number 9⃣9⃣ gets ready for his 💯th Test Match! 👏👏 📽️ WATCH 🔽 - Life, Cricket & Beyond ft. @ashwinravi99#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank — BCCI (@BCCI) March 7, 2024 -
తనని చూసేందుకు గోడ దూకి వెళ్లేవాడిని! రెండేళ్లు ఓ మినీ యుద్ధమే.. ఇప్పుడిలా..
Hanuma Vihari About His Love Story: ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది.. ప్రొఫెషన్తోతో సంబంధం లేకుండా.. కోతి పనులైనా సరే చేయించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంది.. టీమిండియా క్రికెటర్ హనుమ విహారి విషయంలో ఇదే జరిగింది.. కులాంతర ప్రేమ వివాహం కోసం విహారి పడిన పాట్లు వింటే ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లకు గత జ్ఞాపకాలు గుర్తుకురావాల్సిందే. తన నెచ్చెలి ప్రీతి ప్రేమ కోసం ఎదురుచూపులు.. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులను ఒప్పించేక్రమంలో రెండేళ్ల ఎడబాటు.. ఆపై పెళ్లితో శుభం కార్డు.. విహారి వీర ప్రేమగాథను తెలుసుకోవాలంటే ఇటు వైపు ఓ లుక్ వెయ్యండి! ఘ ఐపీఎల్లో.. టీమిండియా టెస్టు క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్యాటర్ హనుమ విహారి. ఐపీఎల్లో.. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడిన ఈ అతడు.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు మొత్తంగా 23 ఇన్నింగ్స్ ఆడిన హనుమ విహారి.. 14.2 సగటు, 88.47 స్ట్రైక్ రేట్‌తో 284 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో ఇక టీమిండియా తరఫున 16 టెస్టుల్లో 839 పరుగులు సాధించడంతో పాటు 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్. అత్యధిక స్కోరు 111. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో కీలక ఆటగాడైన విహారి అనేక మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలున్నాయి. జాతీయ జట్టుకు ఆడే అవకాశం వచ్చినపుడల్లా తనను తాను నిరూపించుకుంటున్న విహారి.. విమర్శకుల ప్రశంసలతో పాటు క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ మెప్పు కూడా పొందాడు. ఇలా ఓవైపు క్రికెటర్‌గా కెరీర్ కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రేమాయణాన్ని కూడా సాగించాడీ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. తల్లే మొదటి గురువు కాకినాడలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన విహారి.. చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయాడు. తల్లి ఇచ్చిన మనోధైర్యంతో ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగాడు. ఇప్పటికీ తన మొదటి గురువు తన తల్లి అని గర్వంగా విహారి చెబుతున్నాడు. ప్రీతి అంటే మహాప్రీతి.. ఇక విహారి ప్రేమ విషయానికొస్తే.. తన స్నేహితురాలు ద్వారా ప్రీతి అతడికి పరిచయమైంది. స్నేహం పెరిగి కాస్త ప్రేమగా మారింది.. ఎలాంటి లవ్ స్టోరీలో అయినా కొన్ని కష్టాలు తప్పవు.. విహారికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రేమ కోసం మినీ యుద్ధమే విహారి, ప్రీతి సామాజిక వర్గాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో పెళ్ళికి నిరాకరించారు. దీంతో.. రెండేళ్ల పాటు కష్టపడి.. వారిని ఒప్పించి చివరికి 2019లో ఇద్దరూ ఒకటయ్యారు. అయితే.. ఈ రెండేళ్ల పాటు ఓ మినీ యుద్ధమే చేశానని ‘సాక్షి’తో చెప్పుకొచ్చాడు విహారి. ఎప్పుడైనా ప్రీతిని చూడాలనిపిస్తే గోడ దూకి మరి వెళ్లి చూసేవాడిని సిగ్గుపడుతూ అప్పటి జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకున్నాడు. కాగా హనుమ విహారి- ప్రీతి ప్రేమకు గుర్తుగా వారికి కొడుకు జన్మించాడు. కాగా విహారి భార్య ప్రీతికి క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేనప్పటికీ భర్త కోపసం మ్యాచ్‌లు చూస్తుందట. ఏపీ ప్రభుత్వం సూపర్ ఇదిలా ఉంటే.. ఇటీవల విహారి ఆంధ్రప్రీమియర్ లీగ్‌లో ఆడిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ నుంచి తిరిగి మళ్ళీ సొంతరాష్ట్రంలో ఏపీఎల్ సీజన్-2లో ఆడటం ఎంతో ఆనందంగా ఉందని విహారి పేర్కొన్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడున్న కొత్త క్రీడాకారులకు ఎంతగానో సహాయపడుతోందని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయిలో పోటీ పడేవిధంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లను పూర్తి చేశారని ప్రశంసించాడు. మొదటి సీజన్లో తాను ఆడకపోయినా టీవీలో చూసి ఎంతో గర్వపడ్డానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో గానో ప్రోత్సహిస్తున్నది అని హనుమ విహారి హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఏపీఎల్ సీజన్-2లో రాయలసీమ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హనుమ విహారి జట్టుకు టైటిల్ అందించిన విషయం తెలిసిందే. నరేష్, కరస్పాండెంట్, సాక్షి టీవీ, విశాఖపట్నం View this post on Instagram A post shared by Hanuma vihari (@viharigh) -
ప్రీతి కేసు నిందితుడు సైఫ్ ఏడాదిపాటు సస్పెండ్
సాక్షి, వరంగల్: వరంగల్‌లో కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్‌ను కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారు. సైఫ్ ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా బెయిల్‌పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే. సైఫ్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్థీషియాలజీలో పీజీ సెకండియర్ స్టూడెంట్. కులం తక్కువ అంటూ హేళన చేస్తూ మానసికంగా వేధించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రీతి ఎంజీఎంలో మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి నిమ్స్‌లో చికిత్స పొందుతూ 26న మృతి చెందింది. సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ర్యాగింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ సిఫారసుల మేరకు సైఫ్‌ను గత మార్చి 4 నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సంవత్సర కాలంలో సైఫ్‌కు అకడమిక్స్, థియరీ ప్రాక్టికల్ క్లాసులు, లైబ్రరీ, హాస్టల్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. చదవండి: తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. మళ్లీ తెరపైకి పంచాయితీ -
మెడికో ప్రీతి కేసులో ఎట్టకేలకు ఛార్జ్‌షీట్
సాక్షి, వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో సంచలన చర్చకు దారితీసిన.. మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో ఎట్టకేలకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. కులం పేరుతో దూషించినందువల్లే ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించిందని పేర్కొన్న పోలీసులు.. సైఫ్ వేధింపులే అందుకు ప్రధాన కారణమని 970 పేజీలతో కూడిన ఛార్జిషీట్లో ప్రస్తావించారు. ప్రీతి గత నవంబర్‌లో కేఎంసీలో జాయిన్ అయినప్పటి నుంచి సైఫ్ నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు అందులో పేర్కొన్నారు. కులం పేరుతో హేళన చేస్తూ.. ప్రీతిని సైఫ్ దూషిస్తూ వచ్చాడు. అది ఆమె భరించలేకపోయింది. మానసికంగా ఇబ్బందికి గురయ్యింది. చివరకు ఫిబ్రవరి 22వ తేదీన ఎంజీఎంలోనే ప్రీతి ఆత్మహత్యకు యత్నించింది. ఫిబ్రవరి 26వ తేదీన నిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసింది అని ఛార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 70 మంది సాక్షులను విచారించినట్లు తెలిపారు. అలాగే.. సైఫ్ వేధింపులే కారణమని ఛార్జిషీట్లో పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ప్రీతి, సైఫ్ సెల్‌ఫోన్ ఛాటింగ్‌లను సైతం ఛార్జిషీట్లో ప్రస్తావించారు. ‘‘ప్రీతి మృతిపై U/s.306, 354 IPC, Sec .4(v) TS Prohibition of Ragging Act, Sec.3(1)(r), 3(1)(w)(ii), 3(2)(v) SC/ST (POA) Act క్రింద మట్వాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. సైంటిఫిక్ , టెక్నికల్ , మెడికల్ , ఫోరెన్సిక్ నిపుణల సహకారంతో మృతురాలు(బాధితురాలు).. నిందితుడు, వాళ్ల వాళ్ల మిత్రులు వాడిన సెల్ ఫోన్ డాటా వెలికి తీసి సాక్ష్యాధారాలు సేకరించాం. ప్రీతీని పలు రకాలుగా ర్యాగ్గింగ్ పేరుతో వేధించి.. ఆత్మహత్య చేసుకునేలా సైఫ్ ప్రేరేపించారని ఆధారాలతో సహా చార్జిషీట్ దాఖలు చేశాం అని ప్రకటించారు సీపీ రంగనాథ్. కాకతీయ మెడికల్ కాలేజీలో మెడికో(పీజీ) చదువుతున్న ధారవత్ ప్రీతి నాయక్.. సీనియర్ సైఫ్ నుంచి వేధింపులు భరించలేక పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. ఆమెను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించి చికిత్స అందించగా.. పరిస్థితి విషమించడంతో ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురై కన్నుమూసింది. ఈ కేసులో పోస్ట్‌మార్టం నివేదిక కీలకం కాగా.. దాని ఫలితాన్ని ఏప్రిల్‌లో ప్రకటించారు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. ప్రీతిది ఆత్మహత్యేనని స్పష్టం చేసిన ఆయన.. ఇందుకు సీనియర్ విద్యార్థి సైఫ్ ప్రధాన కారణమని వెల్లడించారు. వారం పదిరోజుల్లో చార్జి షీట్ దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్ ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు జూన్‌లో ఛార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉండడం గమనార్హం. -
మెడికో ప్రీతి సోదరికి హెచ్ఎండీఏలో ఉద్యోగం
సాక్షి, హైదరాబాద్: సీనియర్ వేధింపులు భరించలేక పాయిజన్ ఇంజెక్షన్‌తో ఆత్మహత్య చేసుకున్న కేఎంసీ మెడికో ప్రీతి ఉదంతం అందరికీ తెలిసిందే. అయితే ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రీతి సోదరికి ఇప్పుడు ఉద్యోగం ఇప్పించింది తెలంగాణ ప్రభుత్వం. డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ సోదరి పూజకు hmda(హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ)లో సపోర్ట్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూజకు ఐటీ సెల్లో కాంట్రాక్ట్ బేసిస్‌లో ఈ ఉద్యోగం ఇచ్చినట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది హెచ్ఎండీఏ. ఈ సందర్భంగా.. ప్రభుత్వం తరపున ఇచ్చిన మాట నిలుపుకున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని నాడు చెప్పింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పరిహారంతో పాటు పార్టీ తరపున సేకరించిన విరాళాలను కలిపి ప్రీతి కుటుంబానికి అందించాం. అదే సమయంలో తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించమని వాళ్లు కోరారు. ఈ విషయాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. సానుకూలంగా స్పందించిన ఆయన.. ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తన పరిధిలోని హెచ్ఎండీఏలో ప్రీతి సోదరికి ఉద్యోగం ఇప్పించారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. -
ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం: తండ్రి నరేందర్
సాక్షి, వరంగల్: కేఎంసీ మెడికో ప్రీతి మృతి విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయంటూ మొదటి నుంచి చెబుతూ వస్తున్న ఆమె కుటుంబ సభ్యులు.. తాజాగా ఇవాళ మరో ప్రకటన చేశారు. ఆమెది ఆత్మహత్యేనని నమ్ముతున్నట్లు ప్రీతి తండ్రి నరేందర్ మీడియా ముందు ప్రకటించారు. వరంగల్ సీపీతో భేటీ అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి మృతి కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా ఆమెది ఆత్మహత్యేనని శుక్రవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. వారం, పదిరోజుల్లో ఛార్జ్‌షీట్ వేయనున్నట్లు కూడా తెలిపారాయన. అయితే.. ఈ ప్రకటన తర్వాత కూడా ప్రీతి మృతిపై కుటుంబ సభ్యులు పాత మాటే చెప్పుకొచ్చారు. కానీ, శనివారం ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ వరంగల్ సీపీ రంగనాథ్‌ను కలిశారు. ప్రీతి మృతిపై వాళ్ల అనుమానాలను ఆయన నివృత్తి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం బయటకు వచ్చిన వాళ్లు.. మీడియాతో మాట్లాడారు. ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం. ఛార్జ్‌షీట్‌లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారు. కేఎంసీ ప్రిన్సిపాల్, హెచ్‌వోడీల బాధ్యతా రాహిత్యం ఉందని భావిస్తున్నాం అని ప్రీతి తండ్రి నరేందర్ మీడియాకు తెలిపారు. ప్రీతి మృతికి కారణమైన సిరంజీ దొరికింది. ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో వచ్చిందని సీపీ మాతో అన్నారు. రిపోర్ట్ మాత్రం చూపించలేదు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలని మేం కోరాం అని ప్రీతి తండ్రి నరేందర్ తెలిపారు. -
వీడిన మిస్టరీ.. డాక్టర్ ప్రీతిది ఆత్మహత్యే
సాక్షి, వరంగల్: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ధారావత్ ప్రీతి కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆమెది ఆత్మహత్యేనని, ఆమె శరీరంలో పాయిజన్ ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ప్రకటించారు. ప్రీతి మృతికి సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్ వేధింపులే కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతను బెయిల్‌పై ఇటీవలే బయటికి వచ్చాడు. డాక్టర్ ప్రీతిది హత్యేనని ఆమె కుటుంబసభ్యులు ప్రకటించడంతో ఈ కేసుకు మరింత ప్రాధాన్యత చోటుచేసుకుంది. అయితే రెండు నెలలు గడుస్తున్నా పోలీసులు ప్రీతి కేసు విషయంలో ఎటూ తేల్చకపోవడంతో పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ‘సాక్షి’జిల్లా పేజీలో ‘ప్రీతి మృతిపై వీడని మిస్టరీ’శీర్షికన శుక్రవారం ప్రత్యేక కథనం కూడా ప్రచురితమైంది. దీంతో శుక్రవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రీతిది ఆత్యహత్యేనని ప్రకటించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల్లో ప్రీతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని తెలిపారు. ప్రీతి ఆత్మహత్యకు డాక్టర్ సైఫ్ వేధింపులే కారణమన్నారు. ఘటనాస్థలిలో ఆత్మహత్యకు కారణమైన సిరంజీ ఉందని, సూది మాత్రం కనిపించలేదన్నారు. వారం, పది రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. సాక్షి వరంగల్ జిల్లా పేజీలో శుక్రవారం ప్రచురితమైన కథనం.. చదవండి: వీడిన సనత్ నగర్ బాలుడి హత్య కేసు మిస్టరీ.. అదే కారణం! -
ప్రీతి సూసైడ్‌కు అతడే కారణం: సీపీ రంగనాథ్
సాక్షి, వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజీ మెడికో ధారవత్ ప్రీతి నాయక్ మృతి కేసులో సస్పెన్స్ వీడింది. ఆమెది ఆత్మహత్యేనని ప్రకటించారు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. ఈ మేరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని ప్రకటించారాయన. ప్రీతిది ఆత్మహత్యేనని స్పష్టం చేసిన ఆయన.. ఇందుకు సీనియర్ విద్యార్థి సైఫ్ ప్రధాన కారణమని శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చింది. ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకున్నట్లు భావిస్తున్నాం. ఐపీసీ సెక్షన్ 306 కింద చర్యలు తీసుకుంటున్నాం. ప్రీతి ఆత్మహత్య కు సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ప్రధాన కారణం. వారం పదిరోజుల్లో చార్జి షీట్ దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్‌కు వరంగల్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య 16వారాల పాటు కేసు విచారణ అధికారి వద్ద హాజరు కావాలని సైఫ్ బెయిల్ ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. సైఫ్‌కు బెయిల్‌పై విడుదలైన మర్నాడే ప్రీతి సూసైడ్ కేసులో వరంగల్ సీపీ కీలక ప్రకటన చేయడం గమనార్హం. ఇదీ చదవండి: నరబలి కాదు.. ఆర్థిక వివాదాలే కారణం -
ప్రీతి మృతి కేసు.. ఖమ్మం జైలు నుంచి సైఫ్ విడుదల
సాక్షి, ఖమ్మం: వరంగల్ ఎంజీఎంలో మెడికో ప్రీతి మృతి కేసు తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రీతి మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ఖమ్మం జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే, సైఫ్‌కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పది వేల బాండ్, ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తుపై ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర నిందితుడు సైఫ్‌కు బెయిల్ మంజూరు చేశారు. దీంతో, సైఫ్ గురువారం సాయంత్రం జైలు నుంచి విడులయ్యాడు. ఇదిలా ఉండగా.. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య సంబంధ విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతులు కోర్టు విధించింది. అయితే ప్రీతి డెత్ కేసులో సైఫ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను మూడుసార్లు న్యాయస్థానం తిరస్కరించింది. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో 56 రోజుల తరువాత నిందితుడు సైఫ్ ఖమ్మం జైలు నుంచి విడుదలయ్యాడు. -
మెడికో ప్రీతీ మృతిపై వీడని మిస్టరీ
-
మెడికో ప్రీతి మృతిపై వీడని మిస్టరీ
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి మృతి మిస్టరీగానే మిగిలింది. రెండు నెలలు కావస్తున్న ప్రీతి డెత్ ఆత్మహత్యనా.. హత్యనా తేలక అనుమానస్పద మృతిగానే పోలీసులు పరిగణిస్తున్నారు. ప్రీతి ఏలా చనిపోయిందో స్పష్టమైన ఆధారాలు లభించకపోయినప్పటికి ర్యాగింగే ప్రీతి డెత్‌కు కారణమని పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అందుకు కారణమైన సీనియర్ వైద్య విద్యార్ధి సైఫ్‌ను అరెస్టు చేసి జైల్ కు పంపగా 56 రోజుల అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరయ్యింది. ఈ ఏడాది పిబ్రవరి 22న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పీజీ మెడికల్ విద్యార్థి ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయింది. నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించినా ప్రీతి ప్రాణాలు కోల్పోయారు. ప్రీతి మృతిపై అనేక అనుమానాలు ఆందోళనలు వ్యక్తం కావడంతో పోలీసులు విచారణ చేపట్టి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు ర్యాగింగే కారణమని తేల్చారు. ముందుగా ప్రీతి మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుందని భావించినప్పటికీ టాక్సికాలజీ రిపోర్టులో ఎలాంటి మత్తు రసాయనాలు తీసుకున్నట్లు ఆధారాలు లభించలేదు. ఎవరైనా హత్య చేశారా అంటే అందుకు సంబంధించి ఎవిడెన్స్ దొరకలేదు. హత్య కాదు... ఆత్మహత్య చేసుకోలేదు.. మరి ప్రీతి ఎలా చనిపోయిందనేది అందరి మదిని తోలుస్తున్న ప్రశ్న. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా బావిస్తూ అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా సాగిస్తున్న విచారణలో ఏమి తేలలేదు. పోలీసులకు సవాల్‌గా మారిన ఈ కేసులో కీలకంగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స విబాగంలో ప్రీతి పడిపోయిన విశ్రాంతి గది సీజ్‌ను తొలగించారు. ఘటన జరిగిన రోజున మట్టెవాడ పోలీసులు ఈ గదిని సీజ్ చేసి పలుమార్లు సిపి రంగనాథ్ సందర్శించి స్వయంగా విచారణ చేశారు. ఇప్పటి వరకు కేసులో ఏలాంటి పురోగతి కనిపించకపోగా, మట్టెవాడ పోలీసులు సీజ్ చేసిన గది తాళాలను తొలగించి ఎంజీఎం అధికారులకు అప్పగించారు. ఈ కేసును పోలీసులు ఎటు తేల్చకుండానే గది తాళాలను ఎంజీఎం అధికారులకు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ప్రీతి డెత్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా క్రమంగా కేసు తీవ్రతను తగ్గిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలను ప్రీతి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు జరుగుతున్న తీరు సరిగాలేదని, ఇప్పటివరకు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ లేకుండా కేఎంసీ ప్రిన్సిపల్ హెచ్ఓడీపై చర్యలు తీసుకోకుండా హాస్పిటల్ లో రూమ్ ఎందుకు సీజ్ తొలగించారని ప్రీతి సోదరుడు పృథ్వి ప్రశ్నిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయిందని ఇండైరెక్ట్ గా చెబుతున్నారని, అదే నిజమైతే ఎందుకు రక్తం ఎక్కించారు.. కడుపుకు ఆపరేషన్ ఎందుకు చేశారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయిన గది సీజ్‌ను తొలగించడానికి కారణం పీజీ వైద్య విద్యార్థులు, సిబ్బందికి అత్యవసర చికిత్స కోసం అవసరం కావడంతోనే సీజ్ తొలగించి ఆసుపత్రికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రీతి తల్లిదండ్రుల అనుమానాలను నివృత్తి చేస్తూ ఏ ఒక్క చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని సిపి రంగనాథ్ తెలిపారు. తప్పు చేసిన వారు తప్పించుకోవడానికి వీలు లేకుండా జాగ్రత్తగా లోతైన విచారణ చేస్తున్నామని చెప్పారు. ఫైనల్‌గా పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ నిర్ణయానికి రాలేమన్నారు సిపి రంగనాథ్. ఒకవేళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినా, సాధారణ మరణమే అయినా అందుకు ర్యాగింగే కారణమని స్పష్టం చేశారు. సైఫ్, ప్రీతి సెల్ ఫోన్ మెసేజ్‌లు, వాట్సాప్ గ్రూప్ చాటింగ్‌ల ఆధారంగా ప్రీతి ర్యాగింగ్‌కు గురైందని నిర్ధారించామని, ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం సైఫ్ కు పదేళ్ళ శిక్షతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు శిక్ష అదనంగా ఉండే అవకాశం ఉందని ఇటీవల సీపి ప్రకటించారు. మరోవైపు సైఫ్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా.. మూడుసార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికాగా 56 రోజుల అనంతరం షరతులతో కూడిన బెయిల్ లభించింది. పది వేల బాండ్, ఇద్దరు పూచీకత్తుపై ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర బెయిల్ ఇచ్చి, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతు విధించారు. చార్జిషీటు దాఖలు చేసే వరకు లేదా 16 వారాల వరకు విచారణ అధికారి ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. ఇక దాదాపు రెండు నెలలు కావస్తున్న ఇంకా పోస్ట్ మార్టమ్ రిపోర్టు రాకపోవడం, కేసు మిస్టరీ వీడకపోవడంతో కన్నవారు మానసిక ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. తన కూతురు ఎలా చనిపోయిందో స్పష్టం చేసి ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునఃరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ప్రీతి హత్య కేసు.. సైఫ్‌కి బెయిల్ మంజూరు
సాక్షి, వరంగల్: కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి హత్య కేసులో నిందితుడు సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్‌కి ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి సత్యేంద్ర షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. 60 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ బుధవారం నాటికి 58 రోజులు అవుతున్న సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాదులు కోర్టు ఎదుట వాదనలు విన్పించారు. వాదనల అనంతరం కోర్టు సైఫ్‌కి బెయిల్ మంజూరు చేసింది. అయితే చార్జి షీట్ దాఖలు చేసేనాటికి లేదా 16 వారాల వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య సంబంధిత విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని షరతు విధించింది. వ్యక్తిగతంగా రూ.10 వేల బాండ్, ఇద్దరు జమానత్దారుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాక్షులపై కానీ, మృతురాలి కుటుంబ సభ్యులపై కానీ ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని, నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో ప్రాసిక్యూషన్ వారికి బెయిల్ రద్దు కోరే అవకాశం ఇస్తూ కోర్టు ఆదేశించింది. చదవండి: లండన్‌లో హైదరాబాద్ యువతి మృతి.. సెలవు తీసుకుని ఇంటికొస్తానని చెప్పి.. -
కేటీఆర్‌ను కలిసిన ప్రీతి కుటుంబసభ్యులు
సాక్షి, మహబూబాబాద్/ వరంగల్ లీగల్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాకతీయ వైద్య కళాశాల విద్యార్థి ని ప్రీతి కుటుంబసభ్యులు మహబూబాబా ద్ జిల్లా తొర్రూరులో బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ప్రీతి స్వగ్రామం పాలకుర్తి నియోజకవ ర్గంలోని గిరిజన తండా. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు.. ప్రీతి తల్లిదండ్రులు నరేందర్, శారద తదితరులను ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. అంతకు ముందు ప్రీతి చిత్రపటానికి కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రీతి తల్లిదండ్రులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సైఫ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను వరంగల్ రెండో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి జడ్జి సత్యేంద్ర బుధవారం తిరస్కరించారు. నిందితుడు సైఫ్‌ను పోలీస్ కస్టడీ కోరుతూ ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించింది. రెండు గంటలకుపైగా సాగిన సుదీర్ఘ వాదనల అనంతరం ఉభయుల పిటిషన్లను తిరస్కరిస్తూ జడ్జి సత్యేంద్ర ఆదేశాలు జారీ చేశారు. బాధితులు నేరుగా కోర్టుకు విన్నవించే అవకాశంతో ప్రీతి తండ్రి నరేందర్.. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎం.సత్యనాయణగౌడ్‌ను కలిశారు. కేసు పురోగతి, తన సందేహాలపై ఆయనతో చర్చించారు. -
ప్రీతి కేసు: కోర్టుకు సైఫ్.. డీజీపీ ఆఫీసుకు ప్రీతి పేరెంట్స్
సాక్షి, వరంగల్: ప్రీతి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో నిందితుడు సైఫ్‌ను సోమవారం.. పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ సందర్బంగా ప్రీతి మృతి కేసులో సైఫ్.. పోలీసు కస్టడీని పొడిగించాలని కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు పోలీసుల పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇక, ఇప్పటి వరకు ఇచ్చిన నాలుగు రోజుల పోలీసు కస్టడీ నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలో రేపటి విచారణ ఉన్న కారణంగా సైఫ్ మళ్లీ ఖమ్మం జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా, ప్రీతి కేసు విషయమై.. తెలంగాణ డీజీపీ ఆఫీసుకు ప్రీతి కుటుంబ సభ్యులు వచ్చారు. ప్రీతి కేసు గురించి డీజీపీ అంజనీ కుమార్‌తో వారు చర్చించారు. అనంతరం, ప్రీతి తండ్రి నరేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యే. ప్రీతి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము. టాక్సికాలజీ రిపోర్టు మాకు ఇవ్వలేదు. నిందితులకు తగిన శిక్ష పడేలా చూడాలి. కఠినంగా శిక్షించాలి. బ్లడ్ ఎక్కించిన తర్వాత శాంపుల్స్‌ను టాక్సికాలజీ కోసం పంపించారు. అప్పటికే డయాలసిస్ కూడా పూర్తి అయ్యింది’ అని అన్నారు. -
ప్రీతి కేసులో ట్విస్ట్.. కళ్లకు టేప్ ఎందుకు వేశారు: ప్రీతి సోదరుడు
సాక్షి, హైదరాబాద్: మెడికల్ విద్యార్థిని ప్రీతీ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. తాజాగా ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌లో ఎలాంటి విషపదార్థాలు డిటెక్ట్ కాలేదని రిపోర్ట్‌లో వెల్లడైంది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్ట్ స్పష్టం చేసింది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని రిపోర్ట్‌లో తేలింది. దీంతో, కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇక, ఆసుపత్రిలో ప్రీతి ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలిసిందే. ఇక, టాక్సికాలజీ రిపోర్టుపై ప్రీతి కుటుంబ సభ్యులు స్పందిస్తున్నారు. ప్రీతిది హత్యే అని వారు చెబుతున్నారు. ఇక, ప్రీతి సోదరుడు పృధ్వీ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. ‘ప్రీతికి నిమ్స్‌లో బ్లడ్ డయాలసిస్ చేసి, ప్లాజ్మా కూడా చేశారు. దీని వల్లే రిపోర్టులో విష పదార్ధాలు ఏమీ లేదని వచ్చింది. శరీరం మొత్తం క్లీన్ చేసి రిపోర్టు తీస్తే ఏం ఉంటుంది. గవర్నర్ రాక ముందే డయాలసిస్ చేశారు. మాకు తెలియని విషయాలు కూడా పోలీసులు మాకు చెప్పారు. ప్రీతి కళ్లకు టేప్ ఎందుకు వేశారు. ఆ నాలుగు గంటల పాటు ఏమైందో మాకు ఎందుకు చెప్పడం లేదు. మాకు ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి’ అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఇప్పటికే డీజీపీ వరంగల్ సీపీ రంగనాథ్‌కు ఫోన్ కూడా చేశారు. -
మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో కొత్త మలుపులు
-
మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో ట్విస్టులు
-
మెడికో ప్రీతి కేసు.. ఆ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
మెడికో ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌లో ఎలాంటి విషపదార్థాలు డిటెక్ట్ కాలేదని రిపోర్ట్‌లో వెల్లడైంది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్ట్ స్పష్టం చేసింది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని రిపోర్ట్‌లో తేలింది. ఇప్పటికే ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్ వరంగల్ సీపీ రంగనాథ్ సీపీ చేతికి చేరింది. దీంతో ఆత్మహత్యాయత్నం కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నారు. ప్రీతిది హత్యా, ఆత్మహత్యా తేల్చుకోలేక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రీతిది ముమ్మాటికీ హత్యేనని ఆమె కుటుంబసభ్యులు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్‌కు వరంగల్ సీపీ ప్రీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఇప్పటికే డీజీపీ వరంగల్ సీపీ రంగనాథ్‌కు ఫోన్ కూడా చేశారు. ప్రీతి కేసు కొత్త మలుపు మెడికల్ విద్యార్థిని ప్రీతీ ఉదంతం కొత్త మలుపు తిరగబోతోంది. సైఫ్ హోమ్ మంత్రికి సమీప బంధువు అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసు మరిన్నీ మలుపులు తిరగనుంది. తాజా నివేదికతో ఆత్మహత్య కేసును అనుమానాస్పద మృతి గా కేసు మార్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
మెడికో ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యే: బండి సంజయ్
సాక్షి, వరంగల్ జిల్లా: మెడికో ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది ప్రీతి కాదని, ఒకవేళ ఆత్మహత్య చేసుకుందని ప్రభుత్వం భావిస్తే అందుకు సంబంధించిన ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జీచే న్యాయ విచారణ జరిపించాలని కోరారు. తప్పు లేకపోతే ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో ప్రీతి తల్లిదండ్రులను బండి సంజయ్ పరామర్శించారు. ఆయన రాకతో బీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రీతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన దిగారు. అడ్డుకునే ప్రయత్నం చేయగా బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. బండి సంజయ్ ముందు ప్రీతి తల్లిదండ్రులు నరేందర్ శారద తమ గోడును వెల్లబోసుకున్నారు. న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించేలా చూడాలని సంజయ్‌ని ప్రీతి తండ్రి కోరారు. న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని సంజయ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రీతి ఘటనపై ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. చదవండి: ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కీలక ఎవిడెన్స్.. రాష్ట్ర ప్రభుత్వం ప్రీతి విషయాన్ని డైవర్ట్ చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ప్రీతి మృతికి కారకులైన వారందరికీ కఠిన శిక్షపడే వరకు బీజేపీ పోరాడుతుందని తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రిలోనే ప్రీతి చనిపోయిందని, డెడ్ బాడీని నిమ్స్ తరలించి ట్రీట్ మెంట్ చేస్తున్నట్లు డ్రామాలాడారని విమర్శించారు. సైఫ్‌ను కాపాడేందుకే కేసీఆర్ ప్రభుత్వం డ్రామాలాడుతుందని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా న్యాయ పోరాటం చేస్తామన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటలపాటు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. -
ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కీలక ఎవిడెన్స్..
సాక్షి, వరంగల్ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కీలక ఆధారం లభ్యమయింది. ఈ కేసులో జూనియర్ మెడికో వాంగ్మూలం కీలకంగా మారనుంది. పోలీస్ విచారణ, యాంటీ ర్యాగింగ్ కమిటీలో కీలక విషయాలను బయట పెట్టిన జూనియర్ డాక్టర్.. ప్రీ అనస్థిషియా రిపోర్ట్ వివాదంలో డాక్టర్ సైఫ్ చెప్పిన అభిప్రాయానికి భిన్నమైన విషయాలను వెల్లడించారు. పీఏసీ రిపోర్ట్ విషయంలో డాక్టర్ సైఫ్ ఫిజికల్‌గా లేకున్నా డాక్టర్ ప్రీతిని బ్లేమ్ చేసినట్టు నిర్ధారణ అయింది. జీఎంహెచ్‌లో జూనియర్ విద్యార్థినికి డిక్టేట్ చేస్తూ పీఏసీ రిపోర్ట్‌ని డాక్టర్ ప్రీతి ఫైండింగ్స్ పొందుపరిచినట్లు విచారణలో వెలుగు చూసింది. డాక్టర్ సైఫ్ తనను కావాలని వేధిస్తున్నాడని, పీఏసీ రిపోర్ట్ వివాదం వివరించి తనకు సపోర్ట్ చేయాలని అర్ధించిన డాక్టర్ ప్రీతి.. తనపై కుట్ర జరుగుతోందని మానసిక సంఘర్షణకు లోనైంది. ఇదే విషయం లాస్ట్ కాల్లో సహ విద్యార్థికి తన ఆవేదన వెలిబుచ్చింది. డాక్టర్ ప్రీతి లాస్ట్ కాల్‌పై పూర్తి స్థాయి సమాచారాని విచారణ బృందం సేకరిస్తోంది. పీఏసీ రిపోర్ట్ విషయంలో నిందితుడు డాక్టర్ సైఫ్ వాదన అవాస్తవమని పోలీస్ విచారణ రుజువు చేస్తోంది. డాక్టర్ సైఫ్, డాక్టర్ ప్రీతి మధ్య వివాదంగా మారిన ప్రశ్నించే తత్వం, దానికి సంబంధించిన చాట్స్ లభ్యమైంది. మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ ఆధారాల ఆధారంగా కేసును పోలీసులు అధికారులు బిల్డప్ చేయనున్నారు. సైఫ్ వేధింపులపై సాంకేతిక పరమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. నాలుగు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్న సైఫ్ చెప్పిన వివరాలతో అనస్తీషియా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నాయి. కౌన్సిలింగ్లో ప్రీతి కన్నీరు పెట్టడంపై పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జీఎంహెచ్‌లో సైఫ్, అనస్తిషియా డిపార్ట్మెంట్లో హెచ్‌వోడీ వ్యవహారం, ప్రీతి ఆడియోల్లో హెచ్‌వోడి పేరు ప్రస్తావించడాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. సైఫ్, హెచ్‌వోడి నాగార్జున రెడ్డి వ్యవహారాన్ని పోలీసులు ర్యాగింగ్ కోణంలో చూస్తున్నారు. లీవ్, కౌన్సిలింగ్ విషయంలో నాగార్జున్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదమయింది. ఇప్పటికే హెచ్‌వోడీని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ రోజుతో సైఫ్ నాలుగు రోజుల పోలీసుల కస్టడీ ముగుస్తుంది. కాగా, రేపు(సోమవారం) కోర్టులో సైఫ్‌ను హాజరు పరిచి జైలుకు తరలించనున్నారు. చదవండి: కాలేజీ యాజమాన్యమే మా కొడుకును చంపేసింది: సాత్విక్ పేరెంట్స్ -
మెడికో ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం
-
ప్రీతి ఘటనపై వివరాలివ్వండి
ఎంజీఎం: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ) పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై కళాశాల ప్రిన్సిపల్ మోహన్‌దాస్‌ను ఆదేశించారు. ప్రీతి ఆత్మహత్యకు ముందు కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రిలో ఏం జరిగింది? ప్రీతికి కౌన్సెలింగ్ నిర్వహించిన వైద్యులు ఎవరు? ప్రీతి ఆత్మహత్యకు అనస్తీషియా తీసుకోవడమే కారణమా? ఎంజీఎంలో ఎలాంటి వైద్యం అందించారు? ఎవరి సూచన మేరకు ఆమెను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు? అనే అంశాలను కూడా నివేదించాలని ఆదేశించారు. అలాగే, ఐదేళ్ల కాలంలో కళాశాలలో ఏమైనా ర్యాగింగ్ ఘటనలు జరిగాయా? కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.. లాంటి వివరాలు కూడా ఇవ్వాలని గవర్నర్ లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు అన్ని వివరాలను నివేదిస్తామని కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ పేర్కొన్నారు. ఎంజీఎంలో రెఫరల్ వైద్యమా? ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో రెఫరల్ వైద్యం పేరుతో హైదరాబాద్‌కు తరలిస్తున్నారనే విషయంపై గవర్నర్ లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఆస్పత్రిలో సదుపాయాలు, వైద్యుల కొరత ఉందా? అనే అంశంపైనా ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, బాధితులను హైదరాబాద్‌కు తరలించే విధానంపైనా నివేదిక పంపాలని కోరారు. -
మెడికో ప్రీతి ఘటన.. హెచ్ఓడీపై బదిలీ వేటు.. పనిష్మెంటా? ప్రమోషనా?
సాక్షి, వరంగల్: మెడికో ప్రీతి ఘటన నేపథ్యంలో కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆసుపత్రి అనస్తీసియా హెచ్ఓడీ నాగార్జున రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను భూపాలపల్లి మెడికల్ కాలేజీకి అనస్తీసియా ప్రొఫెసర్‌గా బదిలీ చేస్తూ తెలంగాణ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీతి ఆత్మహత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాగార్జున రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనను వేధించిన సైఫ్‌పై ప్రీతి ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే నాగార్జున రెడ్డి గత కొంతకాలంగా భూపాలపల్లి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన కోరుకున్నట్లే భూపాలపల్లికి బదిలీ కావడంతో ఇది ప్రమోషనా? లేక పనిష్మెంటా అనే చర్చ జరుగుతోంది. చదవండి: నిందితుడు హరిహరకృష్ణకు వారం రోజుల పోలీస్ కస్టడీ.. -
ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సైఫ్ ఫోన్లో 17 వాట్సాప్ చాట్స్‌ను పోలీసులు పరిశీలించారు. అనుషా, భార్గవ్, ఎల్డీడీ+నాక్ అవుట్స్(LDD+knockout) గ్రూప్ చాట్స్ స్వాధీనం చేసుకున్నారు. అనస్థీషియా విభాగంలో ప్రీతి సుపర్ వైజర్‌గా సైఫ్ ఉండేవాడని.. రెండు ఘటనల ఆధారంగా ఆమెపై కోపం పెంచుకున్నట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. డిసెంబర్లో ఓ యాక్సిడెంట్ కేసులో ప్రీతిని సైఫ్ గైడ్ చేసినట్లు తెలిసింది. ఆ ఘటనలో ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టు రాయగా.. ఆమె రాసిన రిపోర్టును వాట్సాప్ గ్రూపుల్లో హేళన చేశాడు. రిజర్వేషన్లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ అవమానించాడు. తనతో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే హెచ్ఓడీకి చెప్పాలని ప్రీతి.. సైఫ్‌కు వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రీతిని వేధించాలని సైఫ్.. భార్గవ్‌కు చెప్పాడు. ఆర్ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని చెప్పాడు. దీంతో గత నెల 21న హెచ్ఓడీ నాగార్జునకు ప్రీతి ఫిర్యాదు చేసింది. డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలోప్రీతి సైఫ్‌లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది’ అని సైఫ్ రిమాండ్ రిపోర్టులో తేలింది. కాగా, సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయిదు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. మరోవైపు నిందితుడు మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. -
ప్రీతి ఆత్మహత్య వ్యవహారంపై గవర్నర్ తమిళి సై సీరియస్
సాక్షి, హైదరాబాద్: ప్రీతి ఆత్మహత్య వ్యవహారంపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని మొదట తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై గవర్నర్ మండిపడ్డారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని వీసీకి లేఖ రాశారు. ప్రీతి మరణం భయంకరమైనదని, సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీల్లో యాంటి ర్యాగింగ్ చర్యలు పకడ్బందీగా తీసుకోవాలన్నారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, తక్షణం స్పందించి కాలేజీల్లో కఠిన చర్యలు చేపట్టాలన్నారు. మెడికల్ కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న గవర్నర్.. పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, విశ్రాంతి లాంటి అంశాలపై శ్రద్ధ పెట్టాలని తెలిపారు. మహిళా మెడికోలకు కౌన్సెలింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని గవర్నర్ పేర్కొన్నారు. -
ప్రీతి మృతిపై సమగ్ర విచారణకు బంధువుల డిమాండ్
-
కాలేజీల్లో కాలనాగులెన్నో
-
ప్రీతి ఘటనపై స్పందించిన కేటీఆర్.. 'తప్పు చేసినవారు ఎవరైనా వదలం'
సాక్షి, వరంగల్: ప్రీతి ఆత్మహత్య ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. తప్పుచేసినవారు సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రీతి ఘటనను కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ ప్రీతి ఎపిసోడ్‌పై స్పందిస్తూ ఈమేరకు మాట్లాడారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఆమె ప్రమాదకర ఇంజెక్షన్లు తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూసింది. ప్రీతి ఎపిసోడ్‌పై పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా స్పందించారు. చదవండి: ప్రీతి విషయంలో అసలేం జరిగింది.. గదిలో దొరికిన ఇంజెక్షన్స్ ఇవే.. -
ప్రీతి మృతి కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి(26) మృతి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ఓయూ జేఏసీ మానవ హక్కుల కమిషన్‌ను (హెచ్ఆర్సీ) ఆశ్రయించింది. ప్రీతిది ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలపై విచారణ చేయాలని జేఏసీ కోరింది. ప్రీతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని హెచ్‌ఆరీసీలో పిటిషన్ దాఖలు చేసింది. ప్రీతి మృతదేహానికి జూనియర్ డాక్టర్లతో పోస్టుమార్టం చేయించారని ఫిర్యాదు చేసింది. నిమ్స్, గాంధీ ఆసుపత్రిలో పోలీసుల వ్యవహర తీరుపై విచారణ చేపట్టాలని తెలిపింది. మరోవైపు తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె తండ్రి నరేందర్ ఆరోపించారు. తన కూతురు ఎలా చనిపోయిందో సమగ్ర నివేదిక కావాలని కోరారు. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌తో పాటు అనస్థీషియా హెచ్ఓడీని సస్పెండ్ చేసిన తర్వాతే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. కన్నీటి వీడ్కోలు కాగా సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయిదు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన ప్రీతి అంత్యక్రియలు ఆమె స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాలో సోమవారం ముగిశాయి. ప్రీతికి బంధువులు, స్థానికులు కన్నీటీ వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సందర్భంగా ప్రీతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఖమ్మం జైలులో సైఫ్.. ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రీతి ఘటనపై ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇప్పటికే విచారణ నివేదికను డీఎంఈకి పంపింది. చదవండి: ప్రీతి విషయంలో అసలేం జరిగింది.. గదిలో దొరికిన ఇంజెక్షన్స్ ఇవే.. -
మెడికో ప్రీతికి కన్నీటి వీడ్కోలు
-
ఇక సెలవు.. ముగిసిన ప్రీతి అంత్యక్రియలు
సాక్షి, జనగామ: గిర్నితండాలో మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. ప్రీతికి బంధువులు, స్థానికులు కన్నీటీ వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సందర్భంగా ప్రీతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక, ప్రీతి అంత్యక్రియలకు గ్రామస్తులు, స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అటు, వివిధ పార్టీల నాయకులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రీతి అంత్యక్రియల సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. -
సమగ్ర విచారణ జరపాలని ప్రీతి తండ్రి డిమాండ్
-
పీజీ వైద్య విద్యార్ధిని ప్రీతి మృతి
-
జనగామ జిల్లా గిర్ని తండాలో ప్రీతి అంత్యక్రియలు
-
ప్రీతి విషయంలో అసలేం జరిగింది.. గదిలో దొరికిన ఇంజెక్షన్స్ ఇవే..
వైద్యవృత్తితో పది మందికి సేవా చేయాలనే కోరికతో, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మెడికల్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి(26) మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం ప్రీతి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ విషాదకర ఘటనపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రీతి ఇలా చేయడానికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలేం జరిగింది? జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాకు చెందిన ధరావత్ నరేందర్ వరంగల్‌లోని ఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య శారద, ముగ్గురు కుమార్తెలు పూజ, ఉష, ప్రీతి, కుమారుడు వంశీ ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే వారు హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు వలస వచ్చారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రీతి.. 2022 నవంబర్ 18న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో అనస్తీషియా పీజీ కోర్సులో చేరింది. థియట్రికల్ క్లాస్‌లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్ విద్యార్థులతో కలిసి ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వర్తించాలి. ఈ క్రమంలోనే సీనియర్ విద్యార్థి సైఫ్ ఆమెపై వేధింపులకు దిగాడు. దీనిపై ప్రీతి తండ్రి నరేందర్ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ విషయాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాసు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అనస్తీషియా విభాగాధిపతి నాగార్జునరెడ్డి సమక్షంలో గత మంగళవారం (21వ తేదీన) ప్రీతికి, సైఫ్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. డ్యూటీలో ఉండగానే అపస్మారక స్థితికి.. మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ప్రీతి.. రాత్రి 12 గంటల వరకు రెండు శస్త్రచికిత్సల్లో పాల్గొంది. బుధవారం తెల్లవారుజామున తలనొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటూ జోఫర్, ట్రెమడాల్ ఇంజెక్షన్ కావాలని స్టాఫ్ నర్సును అడిగింది. అయితే, ఉదయం ఏడు గంటల సమయంలో వైద్యుల గదిలో ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటాన్ని తోటి వైద్యులు గమనించారు. గుండెపోటుకు గురైందని గుర్తించి, సీపీఆర్‌తో గుండె పనిచేసేలా చేసి.. చికిత్స ప్రారంభించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్‌గా ఉండటంతో.. ఉన్నతాధికారులు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రీతిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే తొలుత ట్రెమడాల్ ఇంజక్షన్ ఓవర్‌డోస్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు భావించారు. అయితే ప్రీతి అపస్మారక స్థితిలో కనిపించిన గదిలో సక్సినైల్‌కోలైన్, మెడజోలం, పెంటనీల్ ఇంజక్షన్ వాయిల్స్ దొరికాయి. దీంతోపాటు ప్రీతి గూగుల్‌లో సక్సినైల్‌కోలిన్ ఇంజెక్షన్ గురించి సెర్చ్ చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఏ మందు తీసుకుందన్నది తేల్చేందుకు ఆమె బ్లడ్ శాంపిల్స్‌ను ట్యాక్సికాలజీ పరీక్షలకు పంపారు. ఐదు రోజుల పాటు వెంటిలేటర్‌పైనే.. వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ చేస్తూ, గుండె తిరిగి కొట్టుకునేలా చేశారు. నిమ్స్‌కు చేరుకున్న తర్వాత ఆమెకు పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న పరిస్థితుల్లో ఐదుగురు ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షించింది. హానికర ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల శరీరంలో చాలా అవయవాలు దెబ్బతిన్నాయని (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్), మెదడుపైనా ప్రభావం పడిందని గుర్తించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు ఐదు రోజులపాటు అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రీతి బాధ చెప్పుకొన్న ఆడియో కలకలం ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు రోజు ప్రీతి తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ..సైఫ్ తనను వేధిస్తున్న విషయాన్ని వివరించింది. తనలాంటి చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని.. సీనియర్లు అంతా ఒకటేనని వాపోయింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే తనకు నేర్పించకుండా దూరం పెడతారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం బయటపడిన ఆడియో కలకలం రేపింది. నిమ్స్ వైద్యుడి వ్యాఖ్యలపై నిరసన నిమ్స్ ఐసీయూ వద్దలో ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగడంపై వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. ఐసీయూలోకి వచ్చి మృతదేహాన్ని చూసి, సంతకం చేయాలని వైద్యులు కోరగా.. ప్రీతి మృతికి కారణమేంటో చెప్పేదాకా, తగిన న్యాయం జరిగేదాకా రాబోమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఓ వైద్యుడు కల్పించుకుంటూ ‘అయితే.. డెడ్ బాడీని ఇలాగే ప్యాక్ చేసి పంపించేయాలా?’ అని వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. దీనిపై ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర నిరసన తెలిపారు. రిమాండ్‌లో ఉన్న నిందితుడు ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రీతి ఘటనపై ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇప్పటికే విచారణ నివేదికను డీఎంఈకి పంపింది. -
చర్చలు సఫలం.. గాంధీ ఆస్పత్రికి ప్రీతి మృతదేహం తరలింపు
వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూసింది. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ప్రీతి మృతికి గల కారణాలను వెల్లడించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ప్రీతి మరణానికి గల కారణాలు వివరించాలని.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రీతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మంత్రులు వారితో చర్చలు జరిపారు. చివరికి బాధిత కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో అయితే ఎట్టకేలకు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు అంగీకరించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రీతి డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి చేయనున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రీతి తల్లిదండ్రులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసును విచారణ చేపడతామని తెలిపింది. -
ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం : నిమ్స్ వైద్యులు
-
వేధింపులు నిజమే..మనస్తాపంతోనే ఆత్మహత్యాయత్నం!
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్ కాలేజీ, ఎంజీఎం హెచ్ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్‌ఫోన్, వాట్సాప్ గ్రూపులలో చాటింగ్‌ల ఆధారంగా విచారణ జరిపారు. ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో నిందితుడైన సైఫ్‌ను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. వాట్సాప్ గ్రూపులో వేధింపులతో.. 2022 నవంబర్‌లో పీజీ వైద్య విద్యార్థినిగా చేరిన ప్రీతిపై డిసెంబర్ నుంచే సైఫ్ వేధింపులకు పాల్పడినట్టు వాట్సాప్ గ్రూపుల పరిశీలనలో తేలింది. డిసెంబర్ 6న సైఫ్, ప్రీతి మధ్య చాటింగ్ వార్ నడిచింది. తర్వాత కూడా రెండు, మూడుసార్లు చిన్న గొడవలు జరిగినా సద్దుమణిగాయి. అయితే అనస్తీషియా విభాగానికి సంబంధించి 31 మందితో ఏర్పాటు చేసిన ఓ వాట్సాప్ గ్రూపులో ఈనెల 18న చేసిన పోస్టుతో గొడవ ముదిరింది. ఓ హౌస్ సర్జన్ విద్యార్థితో కేస్ షీట్ రాయించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ప్రీతికి సరైన బ్రెయిన్ లేదు.. బుర్ర తక్కువ మనిషి’అంటూ సైఫ్ కామెంట్ పెట్టాడు. దీనిని అవమానంగా భావించిన ప్రీతి.. ‘యు మైండ్ యువర్ ఓన్ బిజినెస్’అంటూ వ్యక్తిగతంగా సైఫ్‌కు మెసేజ్ పెట్టింది. ఏదైనా ఉంటే తమ హెచ్ఓడీకి ఫిర్యాదు చేయాలని, గ్రూపులో తనపై మెసేజ్‌లు పెట్టవద్దని సూచించింది. అంతటితో ఆ వివాదం సమసిపోకపోవడంతో.. ఈ నెల 20న విషయాన్ని తన తండ్రి నరేందర్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన ఏసీపీకి, మట్టెవాడ ఎస్సైలకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచన మేరకు 21న ఉదయం మొదట సైఫ్‌తో, తర్వాత ప్రీతితో మెడికల్ కాలేజీ హెచ్ఓడీలు మాట్లాడారు. కానీ ప్రీతి అవమానభారంతోనే ఉండిపోయింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శైలేష్ అనే సహ విద్యార్థితో ప్రీతి మాట్లాడుతూ.. ‘‘సైఫ్ వేధింపుల విషయంలో నాకు ఎవరూ సపోర్టు చేయడం లేదేం’’అని అడిగింది. ఆ తర్వాత 7.30 గంటల సమయంలో ఆత్మహత్యాయత్నం చేసింది. నిందితుడి అరెస్టు.. రిమాండ్ ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనకు సంబంధించి నిందితుడు ఎంఏ సైఫ్‌ను మట్టెవాడ పీఎస్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. సైఫ్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఆధారాల కోసం పరిశీలించారు. పలు అంశాలపై ప్రశ్నించారు. తర్వాత వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. అయితే బాధితురాలికి వరంగల్ ఎంజీఎంలో చేసిన చికిత్స రిపోర్టులు, ఆమె ఆరోగ్య స్థితిపై తాజా వైద్య నివేదికలు సమర్పించలేదంటూ.. నిందితుడిని రిమాండ్‌కు పంపేందుకు జడ్జి చాముండేశ్వరీ దేవి తొలుత తిరస్కరించారు. తర్వాత పోలీసులు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ జారీ చేసిన పత్రికా ప్రకటనను జడ్జికి సమర్పించారు. బాధితురాలి తల్లిదండ్రుల అంగీకారంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించినట్టు వివరించారు. అయితే ఈ సమయంలో జడ్జికి తన వాదన వినిపిస్తానని నిందితుడు సైఫ్ కోరాడు. జడ్జి పోలీసులు, న్యాయవాదులు అందరినీ కోర్టు హాల్‌నుంచి బయటికి పంపి నిందితుడు చెప్పిన వివరాలను విని, నోట్ చేసుకున్నారు. తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు సైఫ్‌ను ఖమ్మం జైలు తరలించేందుకు ప్రయత్నించినా.. అప్పటికే రాత్రికావడంతో తాత్కాలికంగా పరకాల జైలుకు తీసుకెళ్లారు. శనివారం ఉదయం ఖమ్మం జైలుకు తరలించనున్నారు. డీఎంఈకి సీల్డుకవర్లో నివేదిక? ఎంజీఎం ఆస్పత్రి, కేఎంసీలో జరిగిన ఘటనలపై గురు, శుక్రవారాల్లో విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ.. తమ నివేదికను వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ)కు సీల్డ్ కవర్లో సమర్పించినట్టు తెలిసింది. ఇక ఈ ఘటనపై ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజన్‌కుమార్ శుక్రవారం ఆరా తీసినట్టు తెలిసింది. ప్రీతి ప్రశ్నించేతత్వాన్ని తట్టుకోలేక వేధింపులు: సీపీ రంగనాథ్ మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్‌లో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్, హెచ్ఓడీలతో మాట్లాడి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టామని తెలిపారు. ప్రీతి తెలివైన అమ్మాయి అని, ఇటీవలే వైద్య విభాగానికి సంబంధించి యూపీఎస్సీ ఇంటర్వూ్యకు కూడా హాజరైందని వివరించారు. ఆమెకు ప్రశ్నించే తత్వం ఉందని.. దీనిని తట్టుకోలేకనే సీనియర్ అయిన సైఫ్ ఆమెను టార్గెట్ చేసి వేధించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తనకు తోటి విద్యార్థులు సపోర్ట్ చేయడం లేదని మనస్తాపానికి గురైన ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తేలిందని వివరించారు. నిందితుడు సైఫ్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, సోషల్ మీడియాలో దీనిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం: నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని.. ఆమెకు ఎక్మో, సీఆర్ఆర్టీ చికిత్స అందిస్తున్నామని నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. ఆమె బ్రెయిన్ ఎంత చురుగ్గా ఉందో తెలుసుకునేందుకు బ్రెయిన్ మ్యాపింగ్ కూడా చేస్తున్నామని వివరించారు. మంత్రి హరీశ్‌రావు ప్రీతి ఆరోగ్యంపై నిరంతరం ఆరా తీస్తున్నారని చెప్పారు. ఇక మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం ప్రీతి తల్లిదండ్రులు శారద, ధరావత్ నరేందర్‌లతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి ఉష ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
పూల మాలతో నిమ్స్‌కు గవర్నర్ తమిళిసై.. రాజ్‌భవన్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌కు చెందిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రీతి ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, గవర్నర్ తమిళిసై నిమ్స్ పర్యటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. నిమ్స్‌కు గవర్నర్ తమిళిసై వచ్చినప్పుడు వాహనంలో పూలమాల ఉందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై గవర్నర్ కార్యాలయం స్పందించి వివరణ ఇచ్చింది. గవర్నర్ తమిళిసై ఇతర ప్రాంతాల నుంచి రాజ్‌భవన్‌కు వచ్చిన ప్రతీసారి ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రీతి త్వరగా కోలుకోవాలని ఆలయంలో ప్రార్థించారు. ఆలయం నుంచి గవర్నర్ తమిళిసై నేరుగా నిమ్స్‌కు వచ్చారు. గవర్నర్ నిమ్స్ పర్యటనలో ఎలాంటి దురుద్దేశం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. -
విషమంగానే ప్రీతి ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్/హైదరాబాద్: వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అంతర్గత అవయవాలు ఫెయిలైన స్థితిలో ఆమెను నిమ్స్‌కు తెచ్చారని, గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరిచేందుకు ఎక్మో, సీఆర్ఆర్టీలతో ప్రయత్నం చేస్తున్నామని నిమ్స్ వైద్యులు వివరించారు. అన్ని విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఈమేరకు గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. సీనియర్ విద్యార్థి చేతిలో వేధింపులకు గురైన ప్రీతి బుధవారం ఎంజీఎం ఆస్పత్రిలో ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. పోలీసుల అదుపులో సైఫ్? ప్రీతి తండ్రి నరేందర్ నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు, సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సైఫ్‌పై ర్యాగింగ్, వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఏసీపీ బోనాల కిషన్ గురువారం కేఎంసీ, ఎంజీఎంలో విచారణ జరిపారు. ప్రీతి, సైఫ్‌ల సెల్ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు.. కాల్‌డేటా ఆధారంగా కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సైఫ్ వేధింపులే కారణమా..? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా ఆరా తీశారు. మరోవైపు, ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ప్రీతి సహచర విద్యార్థులు, అనస్థీషియా విభాగ వైద్యులతో మాట్లాడి ప్రాథమిక నివేదిక తయారుచేసింది. ఈ నివేదికను శుక్రవారం డీఎంఈకి పంపనున్నట్లు ఎంజీఎం పరిపాలనాధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రీతి, సైఫ్ ఇద్దరి కుటుంబాలదీ రైల్వే బ్యాక్ గ్రౌండే కావడం గమనార్హం. ప్రీతి తండ్రి ధరావత్ నరేందర్ నాయక్ వరంగల్ రైల్వే ప్రొటెక్షన్స్ ఫోర్స్‌లో ఏఎస్ఐగా పని చేస్తుండగా, సైఫ్ తండ్రి సలీం కాజీపేటలో రైల్వే డీజిల్ లోకోషెడ్‌లో పని చేస్తున్నారు. సరస్వతీ పుత్రిక ఎంజీఎం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి సర్వసతీ పుత్రిక అని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెబుతున్నారు. ఎస్ఎస్సీలో 600కు గాను 526 మార్కులు సాధించింది. ఇంటర్లో వెయ్యి మార్కులకు 970 సాధించింది. ఎంసెట్ ఎంట్రన్స్‌లో 5 వేల ర్యాంకు సాధించి కామినేని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. 2013లో వైద్యవిద్యను ప్రారంభించి 2019లో పూర్తిచేసింది. పీజీ ఎంట్రన్స్‌లో ఆలిండియా 1161 ర్యాంకు సాధించి కేఎంసీలో అనస్థీషియా విభాగంలో అడ్మిషన్ పొందింది. అన్ని స్థాయిల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తూ వస్తున్న ప్రీతి ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు తలొగ్గేది కాదని, వైద్యవిద్య అంటే ఆమెకు ఇష్టమని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. -
డాక్టర్‌గా ప్రీతి హెల్త్ కండీషన్ నాకు తెలుసు: తమిళిసై కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌కు చెందిన పీజీ వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రీతికి ఎక్మో సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ప్రీతి ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఈ సందర్భంగా తమిళిసై.. నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒక డాక్టర్‌గా నేను ప్రీతి కండీషన్ అర్థం చేసుకోగలను. ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉంది.. ఆరోగ్యపరంగా తనకు ఎటువంటి సహాయం అందజేయాలో నిమ్స్ వైద్యులు అందిస్తున్నారు. ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేము. ప్రీతి ఆరోగ్యంతో బయటకు రావాలని అందరం ప్రార్థిద్దాము. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ ర్యాగింగ్ అని పేరెంట్స్ చెబుతున్నప్పటికీ ఇప్పుడే ఒక కంక్లూషన్కి రాలేము. ఆమె యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పాల్గొన్నట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఒక బెస్ట్ స్టూడెంట్ ఇలా అవ్వడం బాధాకరం. డాక్టర్లు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించిన గవర్నర్ తమిళిసై
-
ప్రీతి ఆత్మహత్యయత్నంపై ప్రీతి ఫ్రెండ్స్ రియాక్షన్
-
సీనియర్ల వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యా యత్నం : తండ్రి నరేందర్
-
Doctor Preeti Reddy: తనను తాను చెక్కుకున్న శిల్పం!
‘విద్య... వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి’ డాక్టర్ ప్రీతి తనకు తానుగా నిర్దేశించుకున్న లక్ష్యం ఇది. ఆమె లక్ష్యసాధనకు భరోసాగా నిలిచింది అత్తిల్లు. ఉచితంగా పురుడు పోసి డెలివరీ కిట్ ఇస్తోంది. ఆడపిల్లను కన్న... తల్లికి ప్రోత్సాహకం ఇస్తోంది. యోగసాధన... నాట్యసాధనతో... తనను తాను పరిపూర్ణం చేసుకుంటోంది. ఒక డాక్టర్ యోగసాధన చేస్తే యోగాసనం వల్ల దేహం ఏ రకంగా ప్రభావితమవుతుందో అధ్యయనం చేయగలుగుతారు. అలాగే ఓ డాక్టర్ శాస్త్రీయ నాట్యసాధన చేస్తే ఒక్కో నాట్య భంగిమ ఏరకంగా ఆరోగ్యకారకమో అవగాహన చేసుకోగలుగుతారు. ఈ రెండూ సాధన చేస్తున్నారు డాక్టర్ ప్రీతీరెడ్డి. వైద్యం చేసే డాక్టర్ ఎప్పుడూ ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉండాలి, అలాగే నిత్యచైతన్యంతో ఉత్సాహంగానూ ఉండాలి. అప్పుడే పేషెంట్లు ఆ డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడతారు. పేషెంట్ మనసు చూరగొనడమే డాక్టర్ అంతిమలక్ష్యం కావాలి. అందుకే డాక్టర్లకు యోగసాధన చాలా అవసరం అంటారామె. ఇక భరతనాట్యం ప్రాక్టీస్ గురించి చెబుతూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. సినీగీతాల భరతనాట్యం! ‘‘మాది కర్నాటకలోని హుబ్లి. అమ్మ సైంటిస్ట్, నాన్న డాక్టర్. ఇద్దరికీ పూనాలో ఉద్యోగం. నా ఎల్కేజీ నుంచి పీజీ వరకు పూనాలోనే. మా అమ్మకు భరతనాట్యం ఇష్టం. నాను చిన్నప్పటి నుంచి శిక్షణ ఇప్పించింది. ప్రాక్టీస్‌తోపాటు నాక్కూడా ఇష్టం పెరిగింది. కానీ మా పేరెంట్స్‌కి సమాజానికి ఉపయోగపడే సర్వీస్‌లనే వృత్తిగా ఎంచుకోవడం ఇష్టం. వారి జీవితలక్ష్యం అలాగే ఉండేది. శాస్త్రవేత్తగా పరిశోధనలు చేసినా, డాక్టర్‌గా వైద్యం చేసినా సమాజానికి సర్వీస్ ఇచ్చే రంగాలే. నాక్కూడా డాక్టర్ కావాలనే కోరిక స్థిరపడింది. కళాసాధనను అభిరుచిగా అయినా కొనసాగించాలనే ఆకాంక్ష అమ్మకి. నా డాన్స్ ప్రాక్టీస్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టేది. ఆమె ఆరోగ్యం దెబ్బతిని ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కూడా నా డాన్స్‌కు అంతరాయం రానిచ్చేది కాదు. నాకు పద్నాగేళ్లున్నప్పుడు అమ్మ ఈ లోకం వదిలి వెళ్లిపోయింది. అమ్మకు ఇష్టమైన కళ కాబట్టి భరతనాట్యం కొనసాగించాను. సంప్రదాయ భరతనాట్యంలో ప్రయోగాలు కూడా చేస్తున్నాను. తెలుగు సినిమా పాటలను భరతనాట్యంలో కంపోజ్ చేయడం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయోగం. నభూతో అని చెప్పగలను. మా యూనివర్సిటీకి అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గారొచ్చినప్పుడు ప్రదర్శన ఇచ్చాను. ఆయన పాటల్లో బాగా ఆదరణ పొందిన 29 పాటలను ఎంచుకుని చేసిన ఫ్యూజన్ అది. ఆ రోజు అక్టోబర్ 29. అందుకే 29 పాటల థీమ్ తీసుకున్నాను. 20 నిమిషాల్లో పూర్తయ్యేటట్లు పాటల పల్లవులను మాత్రమే తీసుకున్నాను. ఆ నాట్యసమ్మేళనాన్ని చిరంజీవిగారికి అంకితం చేశాను. ఆ పెర్ఫ్మార్మెన్స్ చిరంజీవి గారు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. నాకది గొప్ప ప్రశంస. అమ్మాయి పుడితే బహుమతి! డాక్టర్‌గా వైద్యం చేయడానికి మాత్రమే పరిమితం కాకూడదని, ఇంకా ఎక్కువగా ఏదైనా చేయాలనిపించింది. భగవంతుని దయ వలన వెసులుబాటు కూడా వచ్చింది. నా ఆలోచనలు, ఆశయాలను మా గ్రూప్‌లోని టీచింగ్ హాస్పిటళ్లలో ఒక్కటోక్కటిగా చేరుస్తూ వచ్చాను. అలా వచ్చినవే... ఫ్రీ ట్రీట్మెంట్, అమ్మాయి పుడితే ఐదువేలు నగదు బహుమతి. కరోనా సమయంలో మేము ఉచితంగా వైద్యం చేశాం. డెంటల్ హాస్పిటల్లో రోజుకు 250 మందికి ఉచిత వైద్యంతోపాటు 750 బెడ్లున్న టీచింగ్ హాస్పిటళ్లలో కూడా వైద్యం ఉచితమే. అలాగే తల్లీబిడ్డలకు అవసరమయ్యే వస్తువులతో కిట్ ఇవ్వడం కూడా. విద్యాసంస్థల డైరెక్టర్‌గా ఒక మహిళ ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా ఉమెన్ ఫ్రెండ్లీగా ఉంటాయనడానికి నిదర్శనం నేనే. ప్రతి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందనే నానుడి నూటికి నూరుశాతం నిజం. నా సక్సెస్‌లో తొలి అడుగులు వేయించింది మా అమ్మ. తెలుగింటి కోడలిగా హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత అత్తమ్మ నాకు అమ్మయింది. నన్ను, నా బిడ్డలను తన బిడ్డల్లాగా చూసుకుంటూ నాకు ప్రతి విషయంలోనూ కొండంత అండగా ఉన్నారు. కెరీర్ పరంగా నన్ను నేను మలుచుకోవడానికి తగిన భరోసా ఇచ్చారు’’ అన్నారు డాక్టర్ ప్రీతి. సమాజానికి తిరిగి ఇవ్వాలి! గ్రీన్ ఇండియా మూవ్మెంట్లో కూడా చురుగ్గా ఉంటారు డాక్టర్ ప్రీతి. పచ్చటి భారతావని కోసం మొక్కలు నాటడం సంతృప్తినిస్తుందన్నారు. వైద్యరంగానికి ఆమె అందిస్తున్న విశిష్టసేవలకు గాను డాక్టర్ ప్రీతి ‘బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ తెలంగాణ, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు’ అందుకున్నారు. ‘ప్రతి ఒక్కరూ తమవంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలి, అప్పుడే ఆరోగ్యకరమైన, సంతోషకరమైన భారతదేశాన్ని చూడగలం’ అన్నారామె. –వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోహనాచారి వైద్యయోగం! యోగసాధన దేహాన్ని, మైండ్‌ని కూడా శక్తిమంతం చేస్తుంది. సింపథిటిక్ నెర్వస్ సిస్టమ్తోపాటు పారాసింపథిటిక్ నెర్వస్ సిస్టమ్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మైండ్‌కి రిలాక్సేషన్నిస్తూ కామ్‌గా ఉంచుతుంది. పని ఒత్తిడితో వచ్చే పర్యవసానాలను నియంత్రిస్తుంది. ఇది మా డాక్టర్లకు మరీ ముఖ్యం. వైద్యం చేసే వృత్తిలోకి రావడమే ఒక యోగం. ఈ వృత్తికి నూటికి నూరుశాతం న్యాయం చేయడానికి ఉపయోగపడే దివ్యౌషధం యోగసాధన అని నా నమ్మకం. నేను యోగసాధన చేస్తాను. యోగ ఆవశ్యకతను తెలియచేస్తుంటాను. మా అమ్మానాన్నల ఆశయాలకు, అత్తమామల అభిరుచికి తగినట్లుగా నన్ను నేను మలుచుకోవడంలో నాకు యోగ చాలా దోహదం చేసింది. – డాక్టర్ ప్రీతీరెడ్డి, డైరెక్టర్, మల్లారెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద్ -
Preethi Manoj: రెండువారాలు మృత్యుపోరాటం
యశవంతపుర (బెంగళూరు): మంగళూరు నగరంలో ఈ నెల 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి మనోజ్ (47) అనే మహిళ శనివారం బ్రెయిన్‌డెడ్ అయ్యారు. ఇంత విషాదంలోనూ ఆమె కుటుంబ సభ్యులు అవయవ దానం చేయడం గమనార్హం. ఆమె నేత్రాలు, కిడ్నీలు, గుండె, లివర్‌ను మణిపాల్, బెంగళూరులోని పలు కార్పొరేట్ ఆస్పత్రులకు జీరోట్రాఫిక్ మధ్య తరలించారు. బల్లాల్‌బాగ్ వద్ద ఆమె స్కూటర్ మీద వెళ్తుండగా శ్రావణ్‌కుమార్ (30) అనే యువకుడు అవతలి రోడ్డులో బీఎండబ్ల్యూ కారులో వేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను దాటి ప్రీతిని ఢీకొన్నాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. స్కూటర్, కారు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయి వైరల్‌గా మారింది. సుమారు రెండువారాల పాటు ఆమె మృత్యువుతో పోరాడింది. తీవ్ర గాయాలు కావడంతో కోలుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రావణ్‌కుమార్‌పై హత్య తదితర నేరాల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చదవండి: (ఏ.. నా కొడుకూ విన్పించుకోడు అన్న యువకుడు.. లాగిపెట్టి కొట్టిన ఎమ్మెల్యే) -
సుగాలి ప్రీతిబాయి కుటుంబానికి ప్రభుత్వ సాయం.. 5 ఎకరాల పొలం పట్టా
కర్నూలు (సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుగాలి ప్రీతిబాయి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఇప్పటికే ప్రీతిబాయి తండ్రి రాజునాయక్‌కు రెవెన్యూ శాఖలో ఉద్యోగం ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు కాన్ఫరెన్స్ హాల్లో రాజునాయక్, పార్వతిదేవికి కల్లూరులో 5 సెంట్ల ఇంటి స్థలం స్థలం, దిన్నెదేవరపాడులో 5 ఎకరాల పొలానికి సంబంధించిన పట్టాలను అందజేశారు. దీంతో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వానికి ప్రీతిబాయి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీన్ అన్సారియా, డీఆర్వో పుల్లయ్య పాల్గొన్నారు. (చదవండి: న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం) -
న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం
కర్నూలు (సెంట్రల్): కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విద్యార్థిని సుగాలి ప్రీతిబాయి తల్లిదండ్రులను సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా ఆదివారం కలిశారు. ఈ కేసులో న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ప్రీతిబాయి కేసును విచారించాలని సీఎం వైఎస్ జగన్ కొంతకాలం క్రితం సీబీఐకి లేఖ రాశారు. అయితే ఈ కేసును సీబీఐ తీసుకోకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో తదుపరి ఏమి చేద్దామన్న విషయంపై మాట్లాడేందుకు సీఎం వైఎస్ జగన్ తన ప్రతినిధిగా దిశా ప్రత్యేక అధికారి కృతికా శుక్లాను ప్రీతిబాయి తల్లిదండ్రులైన పార్వతీదేవి, రాజునాయక్‌ల దగ్గరకు పంపారు. ఆమె ఆదివారం కర్నూలులో వారిని కలసి చర్చించారు. తమ బిడ్డ మరణంపై సీబీఐ విచారణే కావాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనికి కృతికా శుక్లా స్పందిస్తూ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
సుగాలి ప్రీతి కుటుంబసభ్యులతో డీజీపీ వీడియోకాన్ఫరెన్స్
సాక్షి, విజయవాడ : సుగాలి ప్రీతి కేసుపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో సుగాలి ప్రీతి కుటుంబసభ్యులతో సవాంగ్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీబీఐకి కేసు అప్పగించడంలో జాప్యానికి గల కారణాలను లా అండ్ ఆర్డర్ ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీకి తెలిపారు. కేసు విషయంలో సుగాలి ప్రీతి తల్లి అనుమానాలను రవిశంకర్ నివృత్తి చేశారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇప్పటికే సీబీఐ ఎస్పీ విక్రమాధిత్యకు కేసు వివరాలు అందించామని రవిశంకర్ తెలిపారు. డీవోపీటీ నుంచి అనుమతి రాగానే సీబీఐ కేసు విచారణ మొదలుపెడుతుందని పేర్కొన్నారు. కేసుని సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్రప్రభుత్వం ఎక్కడా జాప్యం చేయలేదన్నారు. -
మై బెస్ట్ ఫ్రెండ్
డబ్బు.. ప్రీతి బెస్ట్ ఫ్రెండ్! ‘నాకే కాదు.. ప్రతి స్త్రీకీ..’ అంటారు ప్రీతి. చేతిలో డబ్బుండటమే.. ఫెమినిజానికైనా ప్రీతి చెప్పే అర్థం. అదీ తన సొంత డబ్బు. భర్త ఇచ్చిందీ.. తండ్రిని అడిగితే వచ్చిందీ కాదు. తనే ఇంకొకరికి ఇవ్వగలిగింది. మహిళల్లో ఆర్థిక విశ్వాసాన్ని నాటి.. ‘లక్ష్మీ’కళను తెప్పిస్తున్నారు ప్రీతి. ప్రీతి రథి గురించి ఎప్పుడూ ఒక మంచి మాట వినిపిస్తుంటుంది. పందొమ్మిదేళ్లకు పెళ్లయింది ప్రీతికి. అప్పటికి ఏవో కలలు ఉండి ఉంటాయి కదా, వాటన్నిటినీ ఓ చోట కుదురుగా పార్క్ చేసి, కొంతకాలం తర్వాత మళ్లీ వెళ్లి ఆ స్టాండ్లోంచి తన కలలన్నిటినీ బయటికి తీశారని! ప్రస్తుతం ఆమెకు నలభై తొమ్మిదేళ్లు. పెళ్లయిన తొలి ఏళ్లలోనే చదవాలనుకున్నది చదివారు. చేయాలనుకున్నది చేశారు. ఇప్పుడామె రెండు మూడు కంపెనీలకు అధిపతి. ‘ఇష్కా ఫిల్మ్స్’ ఆమెదే. ‘ఆనంద్ రథి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్’ మేనేజింగ్ డైరెక్టర్. ఇక ముంబైలోని ఆమె మరో సొంత కంపెనీ ‘లక్ష్మి’.. (ఎల్.ఎక్స్.ఎం.ఇ.) డబ్బును జాగ్రత్తగా మదుపు చేయడం ఎలా అని మహిళలకు చిట్కాలు చెబుతూ ఉంటుంది. పురుషుల కన్నా, స్త్రీలే డబ్బును చక్కగా సంరక్షించి, సద్వినియోగ పరచగలరని ప్రీతి తరచు బిజినెస్ మీట్లలో చెబుతుంటారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివారు తను. స్త్రీకి తొలి నమ్మకమైన స్నేహితురాలు డబ్బే అంటారు ప్రీతి. ఆమెకైతే డబ్బుతోపాటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. కవిత్వం, వర్షం! ‘ఫోర్బ్స్ అడ్వయిజర్స్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధులు ఇటీవల ప్రీతిని ఇంటర్వూ్య చేసినప్పుడు ఆమెను రెండు ప్రశ్నలు అడిగారు. ఒక మహిళగా మీరు మీ జీవితంలో నేర్చుకున్నదేమిటి అనేది ఒక ప్రశ్న. ‘‘డబ్బును మగవాళ్ల కంటే కూడా మహిళలే భద్రంగా పెంచి పెద్ద చేయగలరని తెలుసుకున్నాను’’ అని చెప్పారు ప్రీతి. ఇక రెండో ప్రశ్న.. డబ్బు స్త్రీని ఎలా స్వతంత్రురాలిని చేస్తుందన్నది. ఇందుకు ఆమె చెప్పిన సమాధానం మహిళలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఉంది. ‘‘ఫెమినిజం అంటున్నాం కదా.. అది డబ్బుతోనే వస్తుంది. స్వశక్తితో డబ్బును సంపాదించడం, జాగ్రత్తగా దాచుకోవడం, ఇన్వెస్ట్ చేయడం.. ఇవి.. ‘నా జీవితానికి నేనే విధాతను’ అనే ధైర్యాన్ని మహిళకు ఇస్తాయి. ధైర్యాన్ని అర్థికంగా కలిగి ఉండటమే ఫెమినిజం’’ అన్నారు ప్రీతి! ఏమైనా చేతిలో డబ్బు ఉంటే ఆ ఆత్మవిశ్వాసమే వేరు. దండిగా డబ్బున్న పురుషుడు ఏ దిక్కు ఎక్కడో తెలియనట్లుగా ఉంటాడు. స్త్రీ మాత్రం ఎంతగా డబ్బు ఎక్కువవుతుంటే అంతగా ఆర్థిక క్రమశిక్షణతో ఉంటుంది. ఈ విషయాన్ని కళ్లతో చూసి తెలుసుకున్నారు ప్రీతి. ఆమె కంపెనీకి (లక్ష్మి) ప్రస్తుతం నాలుగువేల మంది మహిళా కస్టమర్లు ఉన్నారు. ఏ షేర్లు కొనొచ్చు, వేటిని అమ్మొచ్చు, ఇంకా.. ఎక్కడెక్కడ డబ్బును లాభాల కోసం పెట్టుబడిగా పెట్టొచ్చు అనే సూచనలను, సలహాలను ఆమె వాళ్లకు ఇవ్వడమే కాదు, వాళ్ల దగ్గర్నుంచీ తీసుకుంటుంటారు! మహిళల్లో ఉన్న విశేషం ఇదే అనిపిస్తుంది. నేర్పాల్సిన చోట నేర్పుతారు. నేర్చుకోవలసిన చోట నేర్చుకుంటారు. మదుపు అనే డబ్బు చెట్లు ఎదగడానికి ఈ నైపుణ్యం సరిపోదా! పదమూడేళ్ల వయసు నుంచే ప్రీతి ‘బిజినెస్ ట్రిప్పులు’ మొదలయ్యాయి. తండ్రి ఆనంద్ రథి బిజినెస్‌మ్యాన్. ఆయన తిప్పేవారు కుటుంబాన్ని.. ముంబై నుంచి ఢిల్లీ, కోల్‌కతా, వెరావల్ (గుజరాత్). అలా తనకెంతో ఇష్టమైన వర్షంలో అన్ని ఊళ్లలోనూ తడిచింది ప్రీతి. అక్కడి భాషల, సంస్కృతుల, సంప్రదాయాల జల్లులు అవి. డబ్బు ఎక్కడ ఎలా రొటేట్ అవుతోందో తండ్రి లెక్కల్లో, మాటల్లో ఆమెకు తెలిసేది. ఆయన పెద్ద ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ఆ అనుభవంతో భర్తను కూడా ‘డబ్బు వ్యాపారం’ లోకి దింపారు ప్రీతి. ‘నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ డెస్క్’ అనేదొకటి ఆయన చేత పెట్టించారు. లాభాలు చూపించారు. ఆ వరుసలో.. 2014 లో ఇంట్లో వాళ్లందరికీ షాక్ ఇచ్చారు. ‘ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ’ పెట్టబోతున్నట్లు చెప్పారు. డబ్బు కోసం డబ్బు పెట్టడం తప్ప కళ కోసం డబ్బు పెట్టడం ఆ వంశంలో లేదెప్పుడూ. ఆ ఆసక్తి ఆమెకు బహుశా తల్లివైపు నుంచి వచ్చినట్లుంది. ఇంట్లో అంతా డబ్బు లెక్కల్లో మునిగి తేలుతుంటే, ప్రీతి తల్లి సినిమాల్లోని మంచి మంచి సీన్ల గురించి ఇష్టంగా మాట్లాడుతుండేవారట. ప్రీతి ప్రొడక్షన్ కంపెనీ ‘ఇష్కా ఫిల్మ్స్’ తీసిన మొదటి సినిమా ‘వెయిటింగ్’. 2015లో రిలీజ్ అయింది. నజీరుద్దీన్ షా, కల్కీ కోక్లియన్ నటించారు. పిక్చర్ బాగుందని పేరొచ్చింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి కూడా వెళ్లింది. ‘కర్వాన్’ కూడా తనదే. 2018లో వచ్చింది. ఇర్ఫాన్ ఖాన్, దుల్కర్ సల్మాన్, మిథిలా పాల్కర్. రోడ్ కామెడీ డ్రామా అది. మంచి సినిమా అనిపించుకుంది. ‘‘రేపటి కోసం చూడొద్దు. ఈరోజే చేసెయ్. ఈరోజే చెప్పెయ్. చేయకుండా, చెప్పకుండా ఏ రోజూ సంపూర్ణం అవదు’’ అంటారు ప్రీతి. డబ్బు నిర్ణయాలకు, మానవ సంబంధాలకు.. రెండిటికీ ఈ మాటను వర్తింపజేసుకోవచ్చు. భర్త ప్రదీప్, కూతురు ఐశ్వర్య, కొడుకు కృష్ణవ్లతో ప్రీతి -
జగన్ ప్రభుత్వం నిర్ణయాన్ని అభినందిస్తున్నా
సాక్షి, అమరావతి: సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. మూడేళ్ల కిందట పాఠశాలకు వెళ్లిన ప్రీతి అత్యాచారం, హత్యకు గురైందని, ఆమె తల్లిదండ్రులు కడుపు కోత, ఆవేదనకు గురయ్యారని పేర్కొన్నారు. తమ బిడ్డ కేసులో న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు పడిన కష్టం పగవాడికి కూడా రాకూడదన్నారు. -
సీబీఐకి సుగాలి ప్రీతి కేసు
కర్నూలు (టౌన్): నగర శివారులోని కట్టమంచి రామలింగా రెడ్డి పాఠశాలలో చదువుతున్న సుగాలి ప్రీతి లైంగిక దాడికి, ఆపై హత్య చేయబడిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఈనెల 18న కర్నూలుకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు కలిశారు. తమ కూతురిపై జరిగిన అఘాయిత్యంపై వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసును సీబీఐకి అప్పగించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గురువారం ప్రభుత్వ కార్యదర్శి కుమార్ విశ్వజీత్ జీవో 37 జారీ చేస్తూ సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐకి అప్పగించడం ద్వారా కుటుంబ సభ్యులు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ నిర్ణయంపై పవన్ హర్షం
సాక్షి, అమరావతి: కర్నూలుకు చెందిన ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా పనిచేసిన కాలంలో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రీతి కుటుంబానికి ఒకింత ఊరట కలిగిస్తుందని పవన్ పేర్కొన్నారు. కాగా గురువారం పవన్‌కల్యాణ్ ఢిల్లీ వెళ్లుతున్నారని.. అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి తాను ప్రకటించిన రూ.కోటి విరాళాన్ని ఆయన సైనిక అధికారులకు అందజేస్తారని జనసేన పార్టీ వేరొక ప్రకటనలో పేర్కొంది. -
సుగాలి ప్రీతి కేసు సీబీఐకి
సాక్షి, కర్నూలు, అమరావతి : కర్నూలులో 2017లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి రిఫర్ చేయనుంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ప్రీతి కుటుంబ సభ్యులకు వెల్లడించారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు మంగళవారం కర్నూలులో సీఎం వైఎస్ జగన్‌ను కలుసుకుని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన్ను కలుసుకున్నారు. ఈ కేసును సీబీఐకి రిఫర్ చేస్తున్నామని సీఎం వారికి స్పష్టం చేశారు. తప్పక న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయమై మరోసారి మాట్లాడుతానని, తన వద్దకు రావాలని సీఎం వారికి సూచించారు. ప్రీతి కుటుంబాన్ని తన వద్దకు తీసుకురావాలంటూ తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. -
తండ్రి లేడు... అమ్మ టైలర్
పదేళ్ల అమ్మాయి మూడున్నరేళ్ల క్రితం సెయిలింగ్ నేర్చుకుంది. ఇది భూమి ఉపరితలంపై ఆడే ఆటకాదు. కొలనులో ఈది గెలిచే స్విమ్మింగ్ కాదు. అలలపై తేలియాడుతూ గాలి ఉదుటున తెరచాపను తెలివిగా తిప్పే సెయిలింగ్. అలాంటి క్రీడలో అచిర కాలంలోనే పట్టుసాధించింది. పద్నాలుగేళ్లకే జాతీయస్థాయిలో విజేతగా నిలిచింది. ఆ టీనేజ్ సంచలనమే ప్రీతి కొంగరి. ఒక రేసుతో ముగియదు. రెండో రేస్‌తో ఫలితం వచ్చేయదు. కనీసం ఏడెనిమిది రేసుల్లో నిలకడగా రాణిస్తేనే గెలిచే ఆట సెయిలింగ్. తెరచాపే స్టీరింగ్. అలా అని సీట్లో కూర్చొని తిప్పడం కుదరనే కుదరదు. ఒంటిని విల్లులా మార్చాలి. గాలి వేగానికి అనుగుణంగా పడవ (సెయిలింగ్ బోట్)ను నీటిపై పరుగెత్తించాలి. ఇలాంటి భిన్నమైన క్రీడలో 14 ఏళ్ల ప్రీతి ప్రతిభ అపారం. ఈస్ట్ మారేడ్‌పల్లిలోని నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న ప్రీతి కేవలం మూడున్నర ఏళ్ల కృషితోనే జాతీయ స్థాయిలో మెరిసింది. తాజాగా హుస్సేన్‌సాగర్‌లో నిర్వహించిన జాతీయ ర్యాంకింగ్ మాన్సూన్ రెగెట్టాలో హైదరాబాద్ యాట్ క్లబ్ (వైసీహెచ్)కు చెందిన ప్రీతి విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా 131 మంది యువ సెయిలర్లు బరిలో ఉన్న ఈ పోటీల్లో హైదరాబాద్ చిన్నది గెలవడం ఆషామాషీ కాదు. అనుకోకుండా అలలపైకి నీళ్లంటే ప్రీతికి భయం. అందుకే వాటర్‌స్పోర్ట్స్ వైపు కన్నెత్తి చూడలేదు. సెయిలర్ కావాలన్న ప్రణాళిక కూడా లేదు. కానీ ఇలాంటి భయభీతులున్న ఆమె అనుకోకుండా అలలకు పరిచయమైంది. పదేళ్ల వయసుదాకా ఇల్లే తన ప్రపంచం. అమ్మే ఆమెకు అందమైన లోకం. స్నేహితులతోనే సంతోషం. అలాంటి ప్రీతికి యాట్ క్లబ్ (వైసీహెచ్) కోచ్, వ్యవస్థాపకుడు సుహీమ్ షేక్ చేయూత నిచ్చారు. సెయిలింగ్‌లో నడిపించారు. ఇప్పుడామెకు నీళ్లంటే భయంలేదు. సెయిలింగే జీవితం. పోటీలే తనముందున్న ప్రపంచం. గెలుపే ఆమె లక్ష్యం. కోచ్ సుహీమ్ షేక్‌తో... ప్రీతి తండ్రి లేడు... అమ్మ టైలర్ పేదింటి అమ్మాయి ప్రీతి. తండ్రి లేడు. అమ్మ విజయలక్ష్మి టైలర్. ఇది చాలు ఆమె ఆర్థికస్థోమతేంటో తెలుసుకోడానికి..! కడుపునిండా తినడానికి, చదువుకోవడానికే అష్టకష్టాలు పడుతున్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె పట్టుదల ముందు ఆర్థిక నేపథ్యం ఓడిపోయింది. ఆమె లక్ష్యఛేదనలో ఎదురైన సవాళ్లన్ని నీట మునిగాయి. ఆమె మాత్రం జాతీయ చాంపియన్. అదికూడా అచిర కాలంలోనే! బెస్ట్ సెయిలర్ ప్రీతి జాతీయ ఈవెంట్లో అమె రెండు చాంపియన్‌షిప్ ట్రోఫీలు గెలుచుకుంది. ఆప్టిమిస్ట్లో చాంపియన్‌గా నిలిచిన ఆమె బాలికల ఆప్టిమిస్ట్ ఫ్లీట్ కేటగిరిలో ఓవరాల్ ట్రోఫీ కూడా గెలుచుకుంది. ఒక రేసులోనూ విఫలమవకుండా పూర్తి చేయడం ద్వారా ‘ఉత్తమ సెయిలర్’ అవార్డు కూడా అందుకుంది. అంతకుముందు ఈ నెలారంభంలో జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి సెయిలింగ్ రెగెట్టాలో ప్రీతి రెండు విభాగాల్లో విజేతగా నిలిచింది. ఇందులో వందమందికి పైగా సెయిలర్లు పాల్గొన్నారు. లక్ష్యమే నన్ను నడిపిస్తోంది ‘‘సెయిలింగే నా జీవితం. ప్రాక్టీస్ తప్ప మరో ఆలోచన లేదిపుడు. నీళ్లలో దిగిన ప్రతిరోజు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలన్న లక్ష్యమే నన్ను నడిపిస్తుంది. తప్పకుండా గత రేసుకు కొత్త రేసుకు తేడా చూపాలనుకుంటాను. పోటీకి దిగితే మెరుగైన ప్రదర్శన తప్ప మిగతా వాటి గురించి ఆలోచించను.’’ – ప్రీతి కొంగరి అంతర్జాతీయ పోటీలకు సెయిలింగ్ మెరిక అయిన ప్రీతి ఇప్పుడు అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది చివర్లోగానీ లేదంటే 2020 ఆరంభంలోగానీ ఆ పోటీలు జరుగుతాయి. అప్పటిదాకా క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌లో నిమగ్నం కావాలనుకుంటోంది. ప్రతీరేసులో విజయాన్ని ఆస్వాదించాలని ఆశిస్తోంది. అలాగే చదువును అలక్ష్యం చేయనని చెబుతోంది. కెరీర్‌ను ఉన్నత చదువులకు ఇబ్బంది కాకుండా మలచుకుంటానని చెప్పింది.– యెల్లా రమేశ్సాక్షి స్పోర్ట్స్ డెస్క్ -
ఓవరాల్ చాంపియన్ ప్రీతి
సాక్షి, హైదరాబాద్: మాన్సూన్ రెగెట్టా జాతీయ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ యాట్ క్లబ్‌కు చెందిన సెయిలర్ ప్రీతి కొంగర రికార్డు ప్రదర్శనతో అదరగొట్టింది. పలువురు మేటి సెయిలర్లు పాల్గొన్న ఈ జాతీయ స్థాయి టోర్నీలో ఏకంగా మూడు టైటిళ్లతో ఆమె సత్తా చాటింది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ప్రీతి 34 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్ ట్రోఫీని అందుకోవడంతో పాటు బాలికల విభాగంలోనూ చాంపియన్‌షిప్ టైటిల్‌ను, ఉత్తమ సెయిలర్ ట్రోఫీలను గెలుచుకుంది. ఓవరాల్ కేటగిరీలో ప్రీతి, రితిక డాంగి (61 పాయింట్లు), విజయ్ కుమార్ (67 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో ప్రీతి, రితిక డాంగి (61 పాయింట్లు) తొలి రెండు స్థానాలను దక్కించుకోగా... ఉమా చౌహాన్ (78 పాయింట్లు) మూడోస్థానంతో సరిపెట్టుకుంది. బాలుర కేటగిరీలో విజయ్ కుమార్ 67 పాయింట్లతో చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. రాజ్ విశ్వకర్మ (118 పాయింట్లు) రన్నరప్‌గా నిలిచాడు. అక్షయ్ (118 పాయింట్లు) మూడోస్థానంతో టోర్నీని ముగించాడు. ఆప్టిమిస్ట్ లైట్ ఫ్లీట్ బాలికల కేటగిరీలో మౌనిక (వైసీహెచ్), బాలుర విభాగంలో సోమనాథ్ రాథోడ్ (వైసీహెచ్), డెబ్యూటెంట్స్ కేటగిరీలో కె. రాజేశ్వరి టైటిళ్లను అందుకున్నారు. ఆరు రోజుల పాటు హుస్సేన్‌సాగర్‌లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 131 మంది సెయిలర్లు సందడి చేశారు. ఈ పోటీల న్యాయనిర్ణేతగా ఆస్ట్రేలియాకు చెందిన మార్క్ రికే వ్యవహరించారు. ముగింపు కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హైదరాబాద్ యాట్ క్లబ్ అధ్యక్షుడు, కోచ్ సుహేమ్ షేక్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
అలాంటి సినిమాలే చేస్తా అని అనను
మంచిర్యాలక్రైం : ‘మహిళలు అధైర్యపడొద్దు.. వారికి తమకిష్టమైన రంగాల్లో రాణించేందుకు చాలా అవకాశాలున్నాయి..’ అని స్టూవర్టుపురం సినిమా హీరోయిన్ ప్రీతి సింగ్ సోమవారం మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సాక్షి: సినిమా రంగంలోకి ఎలా అడుగు పెట్టారు? ప్రీతి: చదువుతూనే మోడలింగ్‌లో అడుగుపెట్టాను. అలా యాడ్స్ చేస్తున్నప్పుడే మొదటిసారి ‘మ్యాగ్నెట్’ చిత్రంలో సైడ్ క్యారెక్టర్ చేశాను. ఈ క్రమంలోనే గూఢచారి నంబర్ వన్ సినిమాలో సైడ్ హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఈ క్యారెక్టర్‌కు మంచి పేరు లభించింది. తర్వాత మంచిర్యాల జిల్లాకు చెందిన డైరెక్టర్ ఏకాకి సత్యనారాయణ, ప్రొడ్యూసర్ రంజిత్‌కుమార్ తీస్తున్న స్టూవర్టుపురంలో హీరోయిన్గా అవకాశమిచ్చారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. సాక్షి: మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది? ప్రీతి: నా చదువంతా చెన్నైలోనే సాగింది. డిగ్రీ తరువాత పీజీ, ఆ తర్వాత జర్నలిజం చేశాను. వ్యాపార నిమిత్తం అమ్మనాన్నలతో కలకత్తాకు వెళ్లిపోయా. ప్రస్తుతం అక్కడే స్థిరపడ్డాం. చిన్నతనం నుంచి జర్నలిజంపై మక్కువ ఉండేది. మోడలింగ్ చేస్తున్న సమయంలో అవకాశాలు రావడంతో సినిమాలపై దృష్టి పెట్టాను. సాక్షి: ఎలాంటి సినిమాలు చేయలనకుంటున్నారు? ప్రీతి:: ఇలాంటి సినిమానే చేయాలనేం లేదు. గుర్తింపు తెచ్చే ఏ క్యారెక్టరైనా చేస్తాను. ప్రేక్షకులను మెప్పించే ఏ పాత్ర చేయడానికైనా నేను సిద్ధం. సాక్షి: మొదటిసారి కెమెరా ముందు ఎలా ఫీలయ్యారు? ప్రీతి: మోడలింగ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి పెద్దగా భయం అనిపించలేదు. యూనిట్ సభ్యులు హీరో, హీరోయిన్ అందరూ చాలా ప్రోత్సహాన్నిచ్చారు. కొంచెం కష్టమైనా ఇష్టమైన రంగం కాబట్టి ఇష్టపడే చేశాను. సాక్షి: మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై మీరేమంటారు? ప్రీతి: మహిళలపై జరుగుతున్న దాడులు బాధాకరం. మహళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. చిన్నచూపు పోవడం లేదు. ఈ దాడులు నిరోధించడానికి చట్టాలు కఠినంగా అమలు చేయాలి. -
ప్రీతి మాజీ ప్రియుడిది ఆత్మహత్యే!
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో దారుణహత్యకు గురైన భారత సంతతి డాక్టర్ ప్రీతిరెడ్డి(32) కేసులో ప్రధాన నిందితుడు హర్ష్ నర్దే ఉద్దేశపూర్వకంగానే ట్రక్కును ఢీకొట్టి ప్రాణాలు తీసుకున్నాడని భావిస్తున్నట్లు న్యూ సౌత్‌వేల్స్ పోలీసులు తెలిపారు. కేవలం ప్రీతిని కలవడానికి హర్ష్ ఏకంగా 400 కిలోమీటర్లు ప్రయాణించి సిడ్నీలోని సెయింట్ లియోనార్డ్స్‌లో వైద్య సదస్సుకు హాజరయ్యాడని వెల్లడించారు. ప్రీతి మరో వ్యక్తితో డేటింగ్లో ఉన్న విషయం హర్ష్ కు ముందుగానే తెలుసన్నారు. ‘మనిద్దరి మధ్య బంధం ముగిసిపోయింది. నువ్వు నీదారి చూసుకో’ అని ప్రీతి హర్ష్‌కు స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. మరోవైపు ప్రీతి–హర్ష్‌ల కొలీగ్ ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ..‘తాను మరొక వ్యక్తితో సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నాననీ, త్వరలో మెల్బోర్న్కు వెళ్లిపోతున్నట్లు ప్రీతి హర్ష్‌కు చెప్పింది. శనివారం వైద్య సదస్సు ముగిశాక ప్రీతి–హర్ష్ ఇద్దరూ కొద్దిసేపు ఆగి సరదాగా మాట్లాడుకున్నారు. కానీ అదేరోజు రాత్రి హర్ష్ తన ఫోన్లో ఫేస్బుక్ యాప్‌ను డిలీట్ చేశాడు. ఎందుకిలా చేశాడో నాకు తెలియదు’ అని పేర్కొన్నారు. స్ట్రాండ్ ఆర్కేడ్ ప్రాంతంలో ఉన్న మెక్‌డొనాల్డ్ నుంచి ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటలకు బయటకొచ్చిన ప్రీతి.. ఐదు నిమిషాలకే తాను బసచేస్తున్న స్విస్సోటెల్ ఫోయర్ హోటల్‌కు చేరుకుందని తెలిపారు. కాగా, పెద్ద సూట్‌కేసును హోటల్ సిబ్బంది సాయంతో హర్ష్ ఆదివారం సాయంత్రం కారులోకి ఎక్కించినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయిందని డైలీ టెలిగ్రాఫ్ కథనాన్ని ప్రచురించింది. ఈ సూట్‌కేసులో ఉన్న ప్రీతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పింది. కేసుకు సంబంధించి ఏం జరిగిందో కచ్చితంగా తెలుసుకునేందుకు ప్రీతి–హర్ష్ కదలికల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రీతి మరణంపై ఆమె సోదరి నిత్యారెడ్డి స్పందిస్తూ..‘శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ ప్రీతి కదలికలపై ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు. ఈ విషయమై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని తెలిపారు. -
భారత సంతతి యువ వైద్యురాలు అదృశ్యం
మెల్బోర్న్: భారత సంతతికి చెందిన ఓ యువ వైద్యురాలు సిడ్నీలో అదృశ్యమైంది. అదృశ్యమైన వైద్యురాలు ప్రీతిరెడ్డి(32) ఆస్ట్రేలియాలో డెంటిస్ట్‌గా పనిచేస్తోంది. గత ఆదివారం వేకువజామున 2.15 గంటలకు జార్జ్ స్ట్రీట్‌లో ఉన్న మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో ఆమె దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రీతి రెడ్డి అదృశ్యంపై విచారణ జరుగుతోందని న్యూసౌత్‌వేల్స్ పోలీసులు తెలిపారు. ఆమె గురించి ఎలాంటి సమాచారం తెలిసినా తమకు తెలియజేయాలని స్థానిక పోలీసులు, స్నేహితులను సన్నిహితులను కోరారు. చివరి సారి ప్రీతిరెడ్డి తన కుటుంబసభ్యులతో గత ఆదివారం ఉదయం 11 గంటలకు మాట్లాడినట్లు తెలిసింది. ప్రీతిరెడ్డి అదృశ్యంతో కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు. -
14 దేశాలకు విస్తరించిన ‘ప్రీతి’
సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగు దశాబ్దాలుగా వంటింటి ఉపకరణాల్లో దిగ్గజ బ్రాండ్‌గా రాణిస్తున్న ఫిలిప్స్ ఇండియా అనుబంధ సంస్థ ‘ప్రీతి’ కిచెన్ అప్లయన్సెస్ ఉత్పత్తులు, ప్రస్తుతం 14 దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు సంస్థ ఎండీ సుబ్రమణియన్ శ్రీనివాసన్ చెప్పారు. 1978లో ఏర్పాటు చేసిన ప్రీతి సంస్థ 40వ వార్షికోత్సవం సందర్బంగా 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్రీతి ఉత్పత్తుల తయారీ ప్లాంట్‌ను ‘రాయల్ ఫిలిప్స్’ పర్సనల్ హెల్త్ చీఫ్ బిజినెస్ లీడర్ రాయ్ జాకబ్స్ చేతుల మీదుగా శుక్రవారం చెన్నైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో శ్రీనివాసన్ మాట్లాడుతూ... ప్రీతి నుంచి 13 రకాల ఉత్పత్తులు అందిస్తున్నట్లు తెలియజేశారు. మిక్సర్, గ్రైండర్ కేటగిరిలో ప్రీతి ఉత్పత్తులు దేశంలో పదేళ్లుగా ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాయని చెప్పారు. ‘‘దేశంలోని ఎనిమదిది రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు, 96 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. కిచెన్ ఉత్పత్తుల అమ్మకాల్లో 20 శాతం వాటా మాదే. ఇక్కడి నుంచే 14 దేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నాం’’ అని శ్రీనివాసన్ వివరించారు. ‘‘ఇప్పటిదాకా మా తయారీ సామర్థ్యం ఏడాదికి 80 వేల యూనిట్లు. తాజా ప్లాంటు పూర్తి సామర్థ్యం 2 మిలియన్లు. కొత్త ఫ్యాక్టరీ ద్వారా ప్రస్తుతం ఉత్పత్తిని 1.20 మిలియన్ యూనిట్లకు చేరుస్తాం’’ అని చెప్పారాయన. -
తండ్రయిన అశ్విన్
భారత ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తండ్రి అయ్యాడు. అతని భార్య ప్రీతి... అడయార్‌లోని ఓ ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. పాప బరువు 3.1 కిలోలు ఉందని... తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అశ్విన్ జింబాబ్వే పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అశ్విన్ దం పతులకు ధోని, సాక్షి అభినందనలు తెలి పారు. 2011లో అశ్విన్, ప్రీతిల వివాహం జరిగింది. -
నర్తనమే‘ప్రీతి’కరం
ప్రొఫెషన్కార్పొరేట్ జాబ్ అనుకున్నంత తేలికేం కాదు. పెద్దజీతం వెనుకే ప్రాజెక్టులు, టార్గెట్ల మానసిక ఒత్తిడి తప్పదు. శాస్త్రీయ నృత్యమంటే నల్లేరుపై నడక కాదు. దానికి కళాపిపాస మాత్రమే కాదు, కఠోర సాధన కావాలి. ఈ రెండు రంగాల్లోనూ ఏకకాలంలో రాణించాలంటే మనో నిబ్బరం, శారీరక సామర్థ్యం ఉండాలి. అవి ఉన్న వారికి వేదికలు నీరా‘జనాలు’ పడతాయి. కార్పొరేట్ సంస్థలు కళాభినందనలు కురిపిస్తాయి. నర్తనమే‘ప్రీతి’కరం ‘‘పని ఒత్తిడి ఎంత ఎక్కువుంటే అంత ఎక్కువగా డ్యాన్స్క్లాస్లో గడుపుతా’’ నన్నారు బేగంపేట నివాసి, ఎస్ అండ్ పి క్యాపిటల్ ఐక్యూ కంపెనీలో బిజినెస్ కన్సల్టెంట్‌గా చేస్తున్న ప్రీతి. ‘‘ డ్యాన్స్ చేస్తుంటే వచ్చే తృప్తి మరెందులోనూ రాదు’’ అంటున్నారు. పదేళ్లుగా నృత్యసాధనలో ఉన్న ప్రీతి, మూడేళ్ల క్రితమే జాబ్‌లో జేరారు. ఉద్యోగంలో చేరాక నృత్యసాధన కష్టం కాలేదా? అన్న ప్రశ్నకు ‘‘జాబ్ మొదలుపెట్టాక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు ఇవ్వడం పెరిగింది. చెన్నై, బెంగళూరు, తిరుపతి, ఒరిస్సా, పూరి ఇలా ఎన్నో చోట్ల లాస్ట్ త్రీ ఇయర్స్‌లో ప్రదర్శనలిచ్చా’’ అంటూ వివరించారు. ‘‘కొండాపూర్‌లో ఆఫీస్, దోమలగూడలో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్.. నేనుండేది బేగంపేట. రోజూ 3గంటల దాకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా. టైమ్ బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద కష్టం అనిపించడం లేదు’’ అంటూ చెప్పారామె. తనకు ఆఫీస్‌లో ప్రత్యేకమైన గౌరవం అందుతున్న వైనాన్ని చెబుతూ.. ‘‘నా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వర్కింగ్ అవర్స్‌ను దాని ప్రకారం సెట్ చేయడం అవీ మా బాస్‌లు చూస్తార’’న్నారు. అభిరుచి బలమైనది. సంప్రదాయం అంతకంటే బలమైనది. సంప్రదాయ కళలపై అభిరుచి ఏర్పడితే, ఎంతటి వ్యయప్రయాసలకైనా వెనుకాడరు కళాకారులు. ఒకవైపు ఊపిరి సలపని విధినిర్వహణలో సతమతమవుతూనే, మరోవైపు తమకు అభిరుచి గల సంప్రదాయ కళలో రాణిస్తున్నారు నగరానికి చెందిన ముగ్గురు యువతులు. మనసుంటే మార్గాలకు లోటుండదని వీరు రుజువు చేస్తున్నారు. ప్రసిద్ధ నర్తకి శోభానాయుడు అకాడమీలో సాధన చేసే వీరు ‘సిటీప్లస్’తో తమ ముచ్చట్లు చెప్పారు. డ్యాన్స్ ‘హోస్టెస్’ నాట్యం లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను.. ఈ మాట ఒక ఎయిర్‌హోస్టెస్ నోటి నుంచి వినిపిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. నిత్యం ఆకాశయానం చేసే లావణ్య మనసు గాల్లో విహరించేది మాత్రం కాళ్లకు గజ్జెలు కట్టినప్పుడే. గచ్చిబౌలి నివాసి అయిన ఆమె జీతం కోసం విమానాల్లో విధులు నిర్వర్తిస్తూ, జీవితాన్ని పరిపుష్టం చేసుకోవడం కోసం నాట్యంతో సహవాసం చేస్తున్నారు. ‘‘నృత్యసాధన 8వతరగతిలో స్టార్ట్ చేశాను. వందల కొద్దీ ప్రదర్శనలు ఇచ్చాను. డ్యాన్స్ ఒక వ్యసనం లాంటిది. టెన్షన్స్ అన్నీ పోతాయి. అకాడమీ ఒక టెంపుల్ లాంటిది. డ్యాన్స్‌తో నాకు డిసిప్లిన్, పంక్చువాలిటీ, కాన్సన్ట్రేషన్.. అన్నీ వచ్చాయి. అందుకే మంచి జాబ్ వచ్చినా డ్యాన్స్ వదలదలచుకోలేదు. 2005 నుంచి ఎయిర్ఇండియాలో జాబ్ చేస్తున్నా. రెండూ బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఫ్లయిట్ టైమింగ్స్‌తో ప్రతి రోజూ ప్రాక్టీస్‌కి వెళ్లలేను. అయితే మా ఆఫీసు వాళ్లు కూడా చాలా హెల్ప్ చేస్తారు. అప్పుడప్పుడు టైమింగ్స్ ఎడ్జస్ట్ చేస్తారు. తాజాగా ఢిల్లీలో ఎయిర్ఇండియా వాళ్ల ప్రోగ్రామ్‌లో నా ప్రదర్శన ఏర్పాటు చేశారు. బయటి నుంచి రాగానే మమ్మీ అన్నీ రెడీ చేసి పెడుతుంది. డ్యూటీ దిగిన వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చి, కాస్ట్యూమ్స్ తీసుకుని డ్యాన్స్ క్లాస్‌కి వెళతా. 3గంటలు సాధన చేస్తా’’ అంటూ వర్క్టైమింగ్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్న వైనాన్ని చెప్పారు లావణ్య. నృత్యమే ‘నిత్య’కృత్యం నృత్యమే తన నిత్యకృత్యం అంటున్నారు టీసీఎస్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిత్య. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలో నివసించే ఆమె.. ఆరేళ్ల వయసులో అమ్మ ప్రోత్సాహంతో నృత్యసాధన ప్రారంభించారు. ‘చదువు, వీణ, డ్యాన్స్.. ఇలా దాదాపు పదహారేళ్లు గడిచింది. చదువు దెబ్బతింటుందని చాలామంది టెన్త్‌క్లాస్‌లో పూర్తిగా పుస్తకాలకే అంకితమవుతారు. నేను అప్పుడు కూడా ఇవి మానలేదు. టెన్త్‌లో 92శాతం పైన మార్కులు సాధించాను. ఎంసెట్‌లో సిటీ పరిధిలో 21వ ర్యాంక్ తెచ్చుకున్నాను. జేఎన్టీయూలో ఫ్రీ సీట్ వచ్చింది. నా చదువంతా మెరిట్ స్కాలర్షిప్ మీదే సాగిందంటే అది డ్యాన్స్ పుణ్యమే. నృత్యం నాకు చాలా గుర్తింపు కూడా తెచ్చింది. ప్రతిష్టాత్మక డ్యాన్స్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్నాను. కంపెనీ తరఫున ముంబైలోని టాటా హౌస్‌లో జేఆర్డీ టాటా 157వ జయంతి సందర్భంగా ఫారిన్ డెలిగేట్స్ ముందు మేడమ్ శోభానాయుడు కొరియోగ్రఫీ చేసిన నృత్యం ప్రదర్శించాను. అకాడమీలో బైక్ పార్క్ చేసుకుని, ఆఫీసుకు వెళతాను. ఆఫీసు నుంచి అకాడమీకి తిరిగొచ్చి, ప్రాక్టీస్ అయ్యాక బైక్ మీద ఇంటికొస్తాను. రోజుకు గంటన్నర ప్రాక్టీస్ చేస్తాను. ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటుందో ముందే తెలియదు కాబట్టి ఆఫీసు వర్క్‌లో అడ్వాన్స్‌గా ఉంటాను’ అని తన నృత్య సాధనను వివరించారు నిత్య.