సాక్షి, విజయవాడ : సుగాలి ప్రీతి కేసుపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో సుగాలి ప్రీతి కుటుంబసభ్యులతో సవాంగ్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీబీఐకి కేసు అప్పగించడంలో జాప్యానికి గల కారణాలను లా అండ్ ఆర్డర్ ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీకి తెలిపారు. కేసు విషయంలో సుగాలి ప్రీతి తల్లి అనుమానాలను రవిశంకర్ నివృత్తి చేశారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇప్పటికే సీబీఐ ఎస్పీ విక్రమాధిత్యకు కేసు వివరాలు అందించామని రవిశంకర్ తెలిపారు. డీవోపీటీ నుంచి అనుమతి రాగానే సీబీఐ కేసు విచారణ మొదలుపెడుతుందని పేర్కొన్నారు. కేసుని సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్రప్రభుత్వం ఎక్కడా జాప్యం చేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment