జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఏపీ పోలీస్‌శాఖ‌ | Andhra Pradesh Police Department Won 10 Awards At National Level | Sakshi
Sakshi News home page

ఏపీ పోలీస్‌ శాఖ‌కు అవార్డుల పంట‌

Published Tue, Aug 25 2020 3:05 PM | Last Updated on Tue, Aug 25 2020 3:33 PM

Andhra Pradesh Police Department Won 10  Awards At  National Level - Sakshi

సాక్షి, అమ‌రావ‌తి : టెక్నాలజీ వినియోగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్  పోలీస్ శాఖకు అవార్డుల పంట పండింది. జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్‌శాఖ పది అవార్డులను సొంతం చేసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 26 అవార్డులను దక్కించుకోగా తాజాగా వివిధ విభాగాల్లో మరో పది అవార్డులను కైవసం చేసుకుంది. దీంతో ఏడాది వ్యవధిలో రికార్డు స్థాయిలో 36 అవార్డులను గెలుచుకొని పోలీస్ శాఖ స‌త్తా చాటింది. టెక్నాల‌జీ వినియోగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీస్ శాఖ దేశానికే ఆద‌ర్శంగా నిలిచింది. ఈ అవార్డుల ప్రదానోత్స‌వానికి డీజీపీ గౌతమ్‌ సవాంగ్ వెబినార్ ద్వారా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పోలీస్‌ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే స‌త్ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని వివ‌రించారు. (చ‌ద‌వండి : స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement