
సాక్షి, అమరావతి: సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. మూడేళ్ల కిందట పాఠశాలకు వెళ్లిన ప్రీతి అత్యాచారం, హత్యకు గురైందని, ఆమె తల్లిదండ్రులు కడుపు కోత, ఆవేదనకు గురయ్యారని పేర్కొన్నారు. తమ బిడ్డ కేసులో న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు పడిన కష్టం పగవాడికి కూడా రాకూడదన్నారు.