సాక్షి, హైదరాబాద్: వరంగల్‌కు చెందిన పీజీ వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రీతికి ఎక్మో సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. ప్రీతి ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఈ సందర్భంగా తమిళిసై.. నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒక డాక్టర్‌గా నేను ప్రీతి కండీషన్ అర్థం చేసుకోగలను. ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉంది.. ఆరోగ్యపరంగా తనకు ఎటువంటి సహాయం అందజేయాలో నిమ్స్ వైద్యులు అందిస్తున్నారు. ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేము.
ప్రీతి ఆరోగ్యంతో బయటకు రావాలని అందరం ప్రార్థిద్దాము. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ ర్యాగింగ్ అని పేరెంట్స్ చెబుతున్నప్పటికీ ఇప్పుడే ఒక కంక్లూషన్‌కి రాలేము. ఆమె యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పాల్గొన్నట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఒక బెస్ట్ స్టూడెంట్ ఇలా అవ్వడం బాధాకరం. డాక్టర్లు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment