health condition
-
సుప్రీంకోర్టుపైనే దుష్ప్రచారమా?
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్సింగ్ దలేవాల్ ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని పంజాబ్ ప్రభుత్వంపై మండిపడింది. పైగా సుప్రీంకోర్టు వల్లే దలేవాల్ దీక్ష కొనసాగిస్తున్నారంటూ పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నాయకులు మీడియాలో తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. దలేవాల్ దీక్షను భగ్నం చేయాలని తాము చెప్పడం లేదని, ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలని మాత్రమే సూచిస్తున్నామని వెల్లడించింది. దలేవాల్ గత ఏడాది నవంబర్ 26న దీక్ష ప్రారంభించారు. గురువారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. ఆయనకు వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వ అధికారులు లెక్కచేయడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల∙ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అలాగే రైతుల ఉద్యమంలో కోర్టు జోక్యం చేసుకోవాలని, కేంద్రానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దలేవాల్ దాఖలు చేసిన తాజా పిటిషన్‌నూ విచారించింది. ‘‘పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నేతలు మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దలేవాల్ దీక్షను భగ్నం చేయడానికి సుప్రీంకోర్టు ప్రయతి్నస్తోందని, అందుకు ఆయన ఒప్పుకోవడం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలి్పస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారు. దలేవాల్ పట్ల రైతు సంఘాల నాయకుల వ్యవహారాల శైలి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన దీక్షను భగ్నం చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని మేము ఏనాడూ ఆదేశించలేదు. దలేవాల్ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఆసుపత్రి తరించాలని మాత్రమే చెబుతున్నాం. ఆసుపత్రిలో ఆయన దీక్ష కొనసాగించుకోవచ్చు. దలేవాల్ ఆరోగ్యంపై మేము ఆందోళన చెందుతున్నాం. ఆయన రాజకీయ సిద్ధాంతాలకు సంబంధం లేదని నాయకుడు. కేవలం రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. రైతు నాయకుడిగా దలేవాల్ ప్రాణం ఎంతో విలువైంది. ఆసుపత్రిలో చికిత్స పొందేలా దలేవాల్‌ను ఒప్పించడానికి పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. మంత్రులు గానీ, అధికారులు గానీ ఒక్కసారైనా దీక్షా శిబిరానికి వెళ్లారా? రైతు సంఘాలతో సఖ్యత కుదుర్చుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు’’ అని ధర్మాసనం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
Sakshi Little Stars: ఆశీస్సులే ఆయువు
ఆశ తొణుకుతున్నప్పుడుఆశీస్సు దానిని నిలబెట్టవచ్చు. ఔషధం ఓడుతున్నప్పుడు ప్రార్థన దానిని గెలిపించవచ్చు. అశ్రువు ఉబుకు తున్నప్పుడు ఆర్ద్రత దానిని మందస్మితం చేయవచ్చు. డబ్బు ఖర్చు లేని అనంత దయ, సేవ, ఆర్ద్రత, సాంత్వన మన వద్ద ఉంటాయి. నిజ హృదయంతో వెచ్చిస్తే పని చేస్తాయి. ఈ పిల్లలకు అవన్నీ కావాలి. ఈ పిల్లలు చిరంజీవులై వెలగాలి. ‘సాక్షి’ మీడియా చైల్డ్ సెలబ్రిటీలతో తనదైన ప్రయత్నం చేసింది. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలలు ఒక పూట కువకువలాడారు. పకపక నవ్వారు.నవంబర్ 14 ‘బాలల దినోత్సవం’ నేపథ్యంలో ఎం.ఎన్.జె. కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 150 మంది చిన్నారులను పలకరించే ప్రయత్నం చేసింది సాక్షి మీడియా. ‘పొట్టేల్’. ‘సరిపోదా శనివారం’, ‘మన్మథుడు–2’ వంటి సినిమాల్లో నటించిన బాలతారలు ఖ్యాతి, సాన్విక, స్నితిక్, జాతీయ క్రీడాకారిణి కార్తీకలను తీసుకొచ్చి వారితో ముచ్చటించేలా చేసింది. చైల్డ్ సెలబ్రిటీలు వారి కోసం ఆటలు, పాటలు, డ్యాన్సులతో అలరించారు. అలాగే తమ ఆరోగ్యస్థితిని చైల్డ్ సెలబ్రిటీలతో పంచుకున్నారు.నాకు ప్రస్తుతం బాగానే ఉంది. డాక్టర్లు బాగా చూసుకుంటున్నారు. నాకు అల్లు అర్జున్ సినిమాలంటే ఇష్టం. నన్ను కలవడానికి వచ్చిన సెలబ్రిటీల కోసం పుష్ప సినిమా పాట పాడాను. నా కోసం సాన్విక కూడా పాట పాడింది. వారితో కలిసి మాట్లాడటం హ్యాపీగా ఉంది.– జశ్వంత్మేం సిద్దిపేట నుంచి వచ్చాం. హాస్పిటల్ అంటే నాకు భయం.. కానీ ఇక్కడ బాగానే ఉంది. సినిమాల్లో నటించే వారు మా కోసం రావడం సంతోషంగా ఉంది. నాకు కూడా సినిమాలంటే ఇష్టం. చివరగా శ్యాం సింగరాయ్ సినిమా చూశాను. త్వరగా నయమైతే స్కూల్‌కు వెళ్లాలనుంది. – రిషి ప్రియ, సిద్దిపేటచాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు చదువంటే చాలా ఇష్టం, ముఖ్యంగా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. స్పైడర్‌మ్యాన్ నా ఫేవరెట్. సాన్విక అక్కతో ఆడుకున్నాను, లెక్కలు చెప్పాను. – ఓ చిన్నారి, జహీరాబాద్ బద్దీపూర్నాకు ఫుట్‌బాల్, దాగుడుమూతలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అవన్నీ ఆడుకోలేకపోతున్నాను. ఇలా బాధ పడుతున్న సమయంలో వీరంతా వచ్చి నాతో ఆడుకున్నారు. చాలా ముచ్చట్లు చె΄్పారు. నన్ను షూటింగ్‌కు తీసుకెళతానని కూడా చె΄్పారు. – చేతన్విభిన్న పేర్లతో పలు రకాల కేన్సర్లు ఉన్నప్పటికీ అవన్నీ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సెస్, సాలిడ్ ట్యూమర్స్ అనే రెండు విభాగాల కిందకు వస్తాయి. చిన్నారుల్లో దీర్ఘకాలం పాటు హై ఫీవర్, చలి జ్వరం, బ్లీడింగ్, చిగుర్లలో రక్తస్రావం.. శరీరంలో, చాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వయసుకు తగ్గట్టు బరువు పెరగక పోవడం లేదా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. సాలిడ్ ట్యూమర్స్‌లో పిల్లలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడం జరుగుతుంది. చికిత్స పొందుతున్న చిన్నారులకు క్యాన్సర్‌కు సంబంధించిన అవగాహన అంతగా ఉండకపోవడం వల్ల ఎక్కువగా భయం ఉండదు. కానీ నిత్యం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం వల్ల మానసిక ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో వారికోసం ప్రత్యేకంగా ప్లే స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇలాంటి వ్యాధితోనే ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారులతో మమేకం చేస్తాం. – అనుదీప్, మెడికల్ ఆంకాలజిస్ట్అవగాహన వచ్చిందికేన్సర్ గురించి కొంచెం అవగాహన ఉంది. అందుకే గతంలోనే ఇలాంటి చిన్నారుల కోసం నేను రెండుసార్లు నా హెయిర్ డొనేషన్ చేశాను. కానీ ఇలాంటి ప్లేస్‌కు రావడం ఇదే మొదటి సారి. వీరి విల్ పవర్ చూశాక సమస్య ల నుంచి ఎలా రాణించాలో ఒక అవగాహన వచ్చింది. మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చి ఈ చిన్నారులతో ఆడుకోవాలనుంది.– కార్తీక, నేషనల్ ప్లేయర్హెయిర్ డొనేట్ చేస్తానుఈ హాస్పిటల్లో చిన్నారులను చూశాకే కేన్సర్ ఎంత ప్రమాదకరమైనదో తెలిసింది. వారిని చూస్తుంటే ఏడుపొచ్చేసింది. నేను కూడా గతంలో ఇలాంటి వారి కోసం హెయిర్ డొనేట్ చేశాను. మళ్లీ కూడా చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. –ఖ్యాతి, సరిపోదా శనివారం ఫేమ్వీరిని చూశాక లోపల ఎంతో బాధ కలిగినప్పటికీ దానిని దాచి వీరందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశాను. పాటలు పాడాను, నాటు నాటు డ్యాన్స్ చేశాను. – సాన్విక, సరిపోదా శనివారంవీరందరినీ ఇలా చూస్తుంటే భయమేసింది. అందరికీ నయం అయి త్వరగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నాను. అందరితో ఆడుకున్నాను, డ్యాన్సులు చేశాను. – స్నితిక్, పొట్టేల్ ఫేమ్భయం లేదు చికిత్సలు ఉన్నాయిఅనారోగ్యం అని తెలిశాక పరీక్షల నిర్థారణతో పాటు చికిత్సలో భాగంగా అన్ని సేవలు ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో ఉచితంగానే అందుతాయి. వ్యాధి దశను బట్టి చికిత్స కొనసాగుతుంది. ఈ చిన్నారులకు న్యూట్రిషన్ చాలా అవసరం. దీనికోసం కడల్స్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో మంచి న్యూట్రిషన్ అందిస్తున్నారు. చిన్నారుల వయస్సు, బరువును బట్టి ్రపొటీన్ ΄్యాకెట్స్, డ్రై ఫూట్స్ తదితరాలను అందిస్తున్నారు. కీమో, రేడియేషన్ వంటి చికిత్సల కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్న వారికి చుట్టుపక్కల విడిదికి కూడా సహాయం చేస్తున్నారు. కేన్సర్ వ్యాధి జన్యుపరంగా కూడా వస్తున్నప్పటికి అది 15 నుంచి 20 శాతం మాత్రమే. కేన్సర్లకు పలు రకాల కారణాలున్నాయి. కేన్సర్‌కు ఇతర దేశాల్లో అందిస్తున్న అధునాతన చికిత్సకు మనకు వ్యత్యాసం పెద్దగా ఏమీ లేదు. మన దగ్గర కూడా లేటెస్ట్ ట్రయల్స్ మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి QR కోడ్‌ను స్కాన్ చెయ్యండి – డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళన
-
కవిత ఆరోగ్య పరిస్థితి.. ఢిల్లీకి కేటీఆర్..?
-
సీఎం జగన్‌కు నేతల సంఘీభావం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో సోమవారం కేసరపల్లి క్యాంపునకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రికి సంఘీభావం తెలిపారు. హత్యాయత్నం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేసి, సీఎం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని, బస్సుయాత్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని పార్టీ నేతలు ముఖ్యమంత్రితో అన్నారు. ప్రజల ఆశీర్వాదంవల్లే అదృష్టవశాత్తూ దాడి నుంచి సీఎం తప్పించుకున్నారన్నారు. ఇలాంటి దాడులు యాత్రను, వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేవని ముఖ్యమంత్రి జగన్ నేతలతో అన్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని ఆయన వారితో అన్నారు. ధైర్యంగా అడుగులు ముందుకువేద్దామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరంలేదన్నారు. ఇక సీఎంను కలిసిన వారిలో మండలి చైర్మన్ మోషేన్‌రాజు, మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు కేశినేని నాని, అయోథ్యరామిరెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, మొండితోక జగన్మోహన్రావు, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కైలే అనిల్‌కుమార్, వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, కల్పలతారెడ్డి, విజయవాడ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్, మైలవరం అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, పెడన అభ్యర్థి ఉప్పాల రాము, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, డాక్టర్ దుట్టా రామచంద్రరావు తదితరులున్నారు. -
విషమంగానే తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి
-
ఆసుపత్రిలో కేసీఆర్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయమైన నేపథ్యంలో సీఎం రేవంత్ స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు రేవంత్ తెలిపారు. కేసీఆర్‌ను మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా, సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా..‘మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. అంతకుముందు, కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రి వద్ద ప్రభుత్వం భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని… — Revanth Reddy (@revanth_anumula) December 8, 2023 ఇదిలా ఉండగా.. కేసీఆర్ గురువారం అర్ధరాత్రి తన ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్లో కాలు జారి పడిపోవడంతో ఎడమ కాలి తొంటికి తీవ్ర గాయమైంది. తుంటికి రెండు చోట్ల గాయమైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో, తుంటి భాగంగాలో స్టీల్ ప్లేట్ వేసే అవకాశం ఉంది. ఇక, కేసీఆర్ ఆరోగ్యంపై యశోద డాక్టర్లు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. సిటీ స్కాన్ అనంతరం.. ఎడమ హిప్ రీప్లేస్మెంట్ అవసరమని వైద్యులు సూచించారు. ఇలాంటి కేసుల్లో కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమది వారాల రెస్ట్ అవసరమన్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సర్జరీ చేయనున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. -
కత్తిపోటుతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చిన్ని పేగుకు గాయం
-
చంద్రబాబుకు వచ్చింది స్కిన్ అలర్జీ మాత్రమే..కిడ్నీ, హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండదు
-
జైల్లో చంద్రబాబు ఆరోగ్యంపై నారా కుటుంబం, టీడీపీ నేతల అబద్దాలు
-
నారా ఫ్యామిలీ నటనా చాతుర్యం
-
చంద్రబాబు ఆరోగ్యంపై పచ్చ డ్రామాలు
-
చంద్రబాబు ఆరోగ్యాంగా ఉన్నారు: జైలు అధికారులు
-
అస్వస్థతకు గురైనట్లు చెప్పి చంద్రబాబు సింపతీ కోసం ప్రయతిస్తున్నారు
-
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై లాయర్ ఇచ్చిన సర్టిఫికెట్
-
చంద్రబాబు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి..
-
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ పరిస్థితి విషమం
లక్నో: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(79) ఆరోగ్య పరిస్తితి ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు వుడ్‌ల్యాండ్ హాస్పిటల్స్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ ఉదయం బుద్ధవేవ్ ఛాతీ భాగానికి సీటీ స్కాన్ తీసినట్లు వైద్యులు పేర్కొన్నారు. సీనియర్ వైద్య నిపుణల బృందం భట్టాచార్యకు చికిత్స అందిస్తుందని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. అయితే మొత్తం మీద బుద్దదేవ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ ప్రాణాపాయం నుంచి బయటపడలేదని వైద్యులు తెలిపారు. రక్తపోటు అదుపులోకి రావడంతో చికిత్సకు ఆయన సహకరిస్తున్నారని చెప్పారు. కాగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో శనివారం కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటట్‌లో చేరని విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా భట్టాచార్య పనిచేశారు. చదవండి: పార్లమెంట్లో ఆరని మణిపూర్ మంటలు.. -
డాన్స్ లో గ్రేస్, మాటల్లో మార్పుపై క్లారిటీ ఇచ్చిన సాయి తేజ్
-
శరత్‌బాబుకు సంతాపం తెలిపిన కమల్‌హాసన్.. కాసేపటికే ట్వీట్ డిలీట్
సీనియర్ నటుడు శరత్‌బాబు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన మరణించారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆరోగ్యం విషమించడంతో శరత్‌బాబు కన్నుమూశారంటూ ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై శరత్‌బాబు సోదరి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ శరత్‌బాబు బతికే ఉన్నారని, ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దంటూ విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ఆమె పేర్కొంది. అయితే అప్పటికే శరత్‌బాబు చనిపోయాడంటూ వార్తలు బాగా వైరల్ కావడంతో పలువురు ఆయనకు సంతాపం కూడా వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ఇలాగే తప్పులో కాలేశారు. శరత్‌బాబుకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. 'నా ప్రియమైన పెద్దన్నయ్య శరత్‌బాబు నాకు మంచి స్నేహితుడు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన్ని కోల్పోవడం దురదృష్టకరం'.. అంటూ ట్వీట్ చేసి కాసేపటికే డిలీట్ చేశారు. అయితే అప్పటికే కమల్ చేసిన ఆ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: హీరోయిన్ మెహ్రీన్‌కు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి? -
వివేకా హత్యకేసులో సాక్షి రంగన్నకు తీవ్ర అస్వస్థత
పులివెందుల: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వివేకా హత్య జరిగిన రోజు అక్కడే ఉన్న వాచ్మెన్ రంగన్న కోర్టుకు ఇచ్చిన 164 స్టేట్మెంట్లో కూడా వివేకాను ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరి హత్యచేశారని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, వయసు రీత్యా పలు అనారోగ్య కారణాల వల్ల వాచ్మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి దెబ్బతింది. దీంతో రంగన్న ఇంటివద్ద ఉన్న సెక్యూరిటీ పోలీసులు, కుటుంబసభ్యులు మంగళవారం పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో రంగన్నను అంబులెన్స్‌లో తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా.. సీబీఐ విచారణకు హాజరైన వివేకా పీఏ కృష్ణారెడ్డి సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు వివేకా పీఏ కృష్ణారెడ్డిని మంగళవారం ప్రశి్నంచారు. హత్యకు ముందు వివేకానందరెడ్డి రాసిన లేఖను కృష్ణారెడ్డి దాచిపెట్టిన విషయంపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన కృష్ణారెడ్డిని ఐదు గంటలకు పైగా ప్రశి్నంచారు. హత్య జరిగిన ప్రాంతంలో లభించిన కీలక ఆధారమైన ఆ లేఖను ఎందుకు దాయాల్సి వచి్చంది? ఎవరు ఆదేశాలిచ్చారు?. లేఖను ఎవరు తొలుత గుర్తించారు? తర్వాత దాన్ని ఎక్కడ దాచిపెట్టారు? లేఖ విషయం తొలుత ఎవరెవరితో పంచుకున్నారు? లేఖను ఎన్ని గంటలకు పోలీసులకు అప్పగించారు? అప్పటి వరకు లేఖను గోప్యంగా ఉంచడానికి ప్రత్యేక కారణాలేవైనా ఉన్నాయా?.. ఇలా అనేక అంశాలపై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అధికారుల ప్రశ్నలకు కృష్ణారెడ్డి ముక్తసరిగా సమాధానాలిచ్చినట్లు తెలిసింది. ఇటీవల పులివెందులలోని కృష్ణారెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లగా, ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యుల నుంచే వివరాలు సేకరించారు. ఆ తర్వాత విచారణకు హాజరుకావాలని కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన మంగళవారం సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: వివేకా కేసులో సునీత భర్తను విచారించిన సీబీఐ -
వరల్డ్ కప్ కి కొత్త వికెట్ కీపర్ ఎవరంటే...?
-
నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమం
-
జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి సీరియస్? ఐసీయూలో చికిత్స!
జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కమెడియన్ చంటి. చలాకీతనం, తనదైన కామెడీ టైమింగుతో అలరించిన చంటి కొంతకాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. పలు కామెడీ షోస్ చేసిన చలాకీ చంటి సినిమాల్లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. బిగ్‌బాస్ సీజన్-6లోనూ పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. కానీ బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక ఏ షోలోనూ పెద్దగా కనిపించలేదు. అయితే ప్రస్తుతం ఆయన తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఐసీయూలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. -
శరత్‌బాబుకు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు
ప్రముఖ నటుడు శరత్‌బాబు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బెంగళూరులో చికిత్స పొందిన ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం శరత్‌బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూ నుంచి జనరల్ రూంకు షిఫ్ట్ చేశామని వైద్యులు తెలిపారు. కాగా 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమల్లో 200కి పైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలతో అలరించారు. -
నేనే కిడ్నీ ఇద్దామనుకున్నా.. కానీ వద్దన్నారు: పంచ్ ప్రసాద్ భార్య
జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే చికిత్స తీసుకుంటున్నా ఆయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో సహకరించడం లేదు. ఇటీవల రోజు రోజుకు కొత్త అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముడుతున్నాయి. అయితే ప్రస్తుతం పంచ్ ప్రసాద్ అభిమానులకు ఓ శుభవార్త చెప్పింది ఆయన భార్య. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉండగా.. ఒక కిడ్నీ దొరికిందని ఆమె తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించింది. పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ.. 'ఫస్ట్ నేనే కిడ్నీ ఇద్దామనుకున్నా. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ముందు నాకు అన్ని టెస్టులు చేశారు. అన్నింటిలోనూ మ్యాచ్ అయ్యాయి. కానీ ఆయనది వయసు చిన్నది కావడంతో డాక్టర్లు వద్దన్నారు. బయట నుంచి తీసుకుందాం అని చెప్పారు. మళ్లీ భవిష్యత్తులో సమస్యలు వస్తే మీ కిడ్నీ తీసుకునేలా ప్లాన్ చేద్దాం అన్నారు. ప్రస్తుతమైతే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్తున్నాం. మీ అందరికీ చెప్పడానికి కారణం ఏంటంటే.. ఆయన ఆరోగ్యం కోసం ఇప్పటికీ చాలా టెస్టులు జరిగాయి. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఆయన అభిమానులందరికీ తెలియజేయడం కోసం వీడియో చేశా. మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీతో పంచుకుంటూ ఉంటా. ఇలాంటి వీడియోలు పెడుతున్నందుకు ఏం అనుకోవద్దు. ఇది కేవలం మా ఛానెల్ ఆదరిస్తున్న వారందరికీ తెలియజేయడం కోసమే. మీ అందరీ ఆశీర్వాదంతోనే ఆయన కోలుకుంటున్నారని భావిస్తున్నా' అని అన్నారు.