
హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించారు. తను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు. ఆరోగ్యం విషమించిందనే వార్తల్లో నిజం లేదని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘మిత్రులకు, శ్రేయాభిలాషులకు, పాట అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి నమస్కారం. మీ అందరి ప్రేమ వల్ల, ప్రభుత్వ సహాయ, సహకారాల వల్ల కాలేయ మార్పిడి చికిత్స అనంతరం.. రోజురోజుకు కోలుకుంటున్నాను.(చదవండి : నిర్మాతగా మారిన మెగాస్టార్ కుమార్తె)
ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. మళ్లీ పాటలు రాస్తున్నాను. కరోనా నేపథ్యంలో అందరిలాగే జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నా ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే అశోక్ తేజ ఆరోగ్యం విషమంగా ఉందని కొన్ని వార్తలు వినబడుతున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment