సాక్షి, తిరుపతి: ఆపరేషన్ల కారణంగా ఇంకో నెల రోజులు విశ్రాంతి అవసరమని పేర్కొంటూ ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒక వీడియో విడుదల చేశారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న జగనన్నకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్ధులను భారీ మెజారిటీతో గెలిపించి.. సీఎం జగన్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతోందని రోజా పేర్కొన్నారు.
రెండు మేజర్ సర్జరీలు చేసుకొని చెన్నై మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోజా.. గత శనివారం డిశ్చార్జ్ అయ్యారు. సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకొని సంతోషంగా చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకు ఆమె చెన్నై ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటారని ఆర్కేసెల్వమణి తెలిపారు.
చదవండి:
ఇతను కాస్త డిఫరెంట్... ఆటోలో గార్డెన్
‘జగనన్న స్మార్ట్ టౌన్’కు దరఖాస్తు చేసుకోండి
Comments
Please login to add a commentAdd a comment