vedio
-
'బతికే ఉన్న..' వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ కొత్త వీడియో వైరల్..
వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మరణానికి ముందు ఆఫ్రికాలో ఉన్నట్లు చెప్పుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెలిగ్రామ్ ఛానల్లో విడుదలైన వీడియోలో ప్రిగోజిన్ తన యోగక్షేమాల గురించి అలాగే తన భద్రతపై ఉన్న అనుమానాలపై మాట్లాడారు. ఆర్మీ దుస్తులు ధరించి, చేతికి వాచ్ పెట్టి ఉన్న ఆయన మృతికి ముందు ఆగష్టు 21నాటి వీడియోగా భావిస్తున్నారు. వీడియోలో ప్రిగోజిన్ మాట్లాడుతూ..' నేను బతికానా? ఇంకా చనిపోయానా..? ఎలా ఉన్నాను.. ఏం చేస్తున్నాను? అని చర్చించుకునేవారి కోసమే ఈ వీడియో. ఇది వీకెండ్ ఆగష్టు 2023 చివరి భాగంలో ఉన్నాం. నా జీవితాన్ని అంతం చేయడానికి నిరంతరం చర్చించుకుంటున్నారు. నా వ్యక్తిగత జీవితం, సంపాదన అంతా బాగానే ఉన్నాయ్' అని ప్రిగోజిన్ చెప్పారు. ఈ వీడియోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారు అంటోన్ గెరాష్చెంకో షేర్ చేయగా.. ట్విట్టర్(ఎక్స్) లో విపరీతంగా చర్చ జరుగుతోంది. ప్రిగోజిన్ ఇంకా బతికే ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భూగర్భంలో ఉన్నట్లు కామెంట్ బాక్స్‌లో తమ అభిప్రాయాలను రాసుకొచ్చారు. ప్రిగోజిన్‌కు సంబంధించిన మరిన్ని వీడియోలు షేర్ చేయండని మరొక నెటిజన్ స్పందించాడు. A video of Prigozhin appeared that is reportedly filmed in Africa not long before his death. "So, fans of discussing my death, intimate life, earnings, etc., I am doing fine," Prigozhin says. pic.twitter.com/UcIKpgLNZi — Anton Gerashchenko (@Gerashchenko_en) August 31, 2023 రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ప్రిగోజిన్ తిరుగుబాటు చేసిన రెండు నెలల తర్వాత ఆయన విమాన ప్రమాదంలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది అనుయాయులు కూడా మృతి చెందారు. వీరి మరణ వార్తను రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించినట్లు స్పష్టం చేసింది. ప్రమాదం వెనుక పుతిన్ హస్తం ఉందనే ఆరోపణలపై క్రెమ్లిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవన్ని అవాస్తవాలని పేర్కొంది. ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్ -
వీడియో రిలీజ్ చేసిన ఎమ్మెల్యే రోజా
-
వీడియో రిలీజ్ చేసిన ఎమ్మెల్యే రోజా
సాక్షి, తిరుపతి: ఆపరేషన్ల కారణంగా ఇంకో నెల రోజులు విశ్రాంతి అవసరమని పేర్కొంటూ ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒక వీడియో విడుదల చేశారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న జగనన్నకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్ధులను భారీ మెజారిటీతో గెలిపించి.. సీఎం జగన్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతోందని రోజా పేర్కొన్నారు. రెండు మేజర్ సర్జరీలు చేసుకొని చెన్నై మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోజా.. గత శనివారం డిశ్చార్జ్ అయ్యారు. సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకొని సంతోషంగా చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకు ఆమె చెన్నై ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటారని ఆర్కేసెల్వమణి తెలిపారు. చదవండి: ఇతను కాస్త డిఫరెంట్... ఆటోలో గార్డెన్ ‘జగనన్న స్మార్ట్ టౌన్’కు దరఖాస్తు చేసుకోండి -
స్మైల్ ప్లీజ్.. కరోనాతో క్లోజ్..!
కరోనా... ప్రపంచాన్నే కకావికలం చేస్తోంది. ఉద్యోగాలను ఊడదీస్తోంది. బతుకులను ఛిద్రం చేస్తోంది. జీవనాన్ని ప్రశ్నార్థకంగా మార్చుతోంది. కారి్మకులు, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, రైతులపై ప్రభావం చూపిన కరోనా.. ఫొటో, వీడియో గ్రాఫర్లకూ పనిలేకుండా చేసింది. మూడు నెలలుగా కెమెరాకు ‘క్లిక్’ను దూరం చేసింది. వారి కుటుంబాల్లో ఆకలి కేకలు పుట్టిస్తోంది. స్మైల్ ప్లీజ్ అంటూ సందడిగా కనిపించే ఫొటో, వీడియో స్టూడియోలను కరోనా క్లోజ్ చేయించింది. ఫొటో, వీడియో గ్రాఫర్ల కష్టాలు.. వారి ఆవేదనకు ‘సాక్షి’ అక్షర రూపం. చీపురుపల్లి/ఎస్.కోట రూరల్: హలో మాస్టారు... ఏమండీ... ఒక్కసారి ఇటు చూడండి... స్మైల్ ప్లీజ్ అంటూ క్లిక్ మనిపిస్తూ పది కాలాలు పాటు గుర్తుండిపోయే జ్ఞాపకాలు అందించే ఫొటో, వీడియో గ్రాఫర్లకు కరోనా కోలుకోలేని దెబ్బతీసింది. వివాహం, రిసెప్షన్, జన్మదినోత్సవం, రజస్వల కార్యక్రమం, పదవీ విరమణ, పాఠశాల వార్షికోత్సవం, పండగ ఇలా ఏదైనా సరే ప్రస్తుత రోజుల్లో ఫొటోలు, వీడియో తప్పనిసరి. మార్కెట్లోకి మొబై ల్స్, చేతి కెమేరాలు అందుబాటులోకి వచ్చినా ఫొటోగ్రాఫర్లు, వీడియోలకు గిరాకీ తగ్గలేదు. అయితే, మార్చి నెలలో ప్రారంభమైన కరోనా మహమ్మారి వారి జీవితాలను దయనీయంగా మార్చింది. నాలుగు నెలలుగా శుభ కార్యాలు లేకపోవడంతో కెమేరాలకు పనికరువైంది. స్టూడియోల్లో పని చేస్తున్న వర్కర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టూడియోల అద్దెలు, మంత్లీ వాయిదాలు, వర్కర్లకు జీతాలు చెల్లించలేక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఉన్న దాదాపు 7 వేల మంది ఫొటోగ్రాఫర్లు, మరో 5 వేల మంది వర్కర్లు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కరోనాతో కనీస ఆదాయం లేక అవస్థలు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు సోమవారం రాష్ట్రంతో బాటు జిల్లా వ్యాప్తంగా శాంతి ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 5 వేల స్టూడియోలు... జిల్లా కేంద్రమైన విజయనగరంతో పాటు మిగిలిన 33 మండలాల్లో ఫొటో, వీడియో గ్రాఫర్లు సంక్షేమ సంఘం లెక్కలు ప్రకారం 5 వేల స్టూడియోలు ఉన్నాయి. అందులో 7 వేల మంది ఫొటోగ్రాఫర్లు, మరో 5 వేల మంది వర్కర్లు పని చేస్తున్నట్టు సమాచారం. మార్చి 24 నుంచి ఏర్పడిన లాక్డౌన్ కారణంగా అంతవరకు జరగాల్సిన పెళ్లిల్లు తాత్కాలికంగా నిలిచిపోవడంతో ఉన్న బుకింగ్‌లు అన్నీ రద్దయ్యాయి. దీంతో వేలాది మందికి పని లేకపోవడంతో వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అప్పటికే ఉన్న బుకింగ్‌లు రద్దవ్వడం, కొత్త కార్యక్రమాలు లేకపోవడం, దాదాపు నెలన్నర వరకు లాక్డౌన్ ఉండడంతో ఫొటో స్టూడియోలు తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. కరోనా కష్టాలు తెచ్చింది.. కరోనా వైరస్ పుణ్యమాని జిల్లాలో ఫొటో, వీడియో గ్రాఫర్లకు తీవ్ర కష్టాలు ఏర్పడ్డాయి. లాక్డౌన్ కారణంగా మొత్తం వ్యాపారం మూతపడింది. ఎప్పటికి కోలుకుంటుందో తెలియని పరిస్థితి. – అరవింద్, కార్యదర్శి, జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్, విజయనగరం ప్రభుత్వం సాయమందించాలి... ఫొటో, వీడియో గ్రాఫర్లకు పనులు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. నాలుగు నెలలుగా స్టూడియో తెరుచుకోక, అవుట్డోర్ బుకింగ్‌లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నాం. మాతో పాటు స్టూడియోల్లో పని చేస్తున్న వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. – మల్లెంపూడి నర్శింగరావు, చందు ఫొటో స్టూడియో, చీపురుపలి కష్టాలు నుంచి గట్టెక్కించాలి.... లాక్‌డౌన్‌తో నాలుగు నెలలుగా పని లేదు. ఆర్థికంగా కుదేలయ్యాం. అద్దెలు చెల్లించలేక, వాయిదాలు కట్టలేక, ఇంటి నిర్వహణ భారమై చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వం తమను ఆదుకోవాలి. – లాభాన శ్రీను, సీనియర్ ఫొటోగ్రాఫర్, గర్భాం, మెరకముడిదాం రూ.70 కోట్ల వ్యాపారం నష్టం సీజన్లో జరిగే వివాహాలు, గృహప్రవేశాలు, ప్రారం¿ోత్సవ కార్యక్రమాలకు ఫొటోలు, వీడియోలు, ఆల్బమ్‌ల ద్వారా జిల్లాలో రూ.70 కోట్ల వ్యాపారాన్ని స్టూడియో, ల్యాబ్ నిర్వాహకులు కోల్పోయారు. కరోనాతో కేవలం 50 మందితోనే వివాహ వేడుకలను జరుపుకోవాలనే నిబంధనలు విధించడంతో ఫొటోలు తీయించుకునేవారు కరువయ్యారు. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడడంతో పాస్‌ఫొటోలు అడిగేవారు కనిపించడం లేదు. ప్రస్తుతం కొద్దిపాటి సడలింపులతో అక్కడక్కడ అతి తక్కువ మందితో వివాహాలు, ఇతర వేడుకలు జరుగుతున్నా ఫొటోగ్రాఫర్లు, హంగూఆర్భాటం లేకుండా తంతును జరిపించేస్తున్నారు. దీంతో స్టూడియోలకు అద్దెలు, కరెంట్ బిల్లులు సైతం కట్టలేని దుస్థితిలో ఫోటోగ్రాఫర్లు కాలం వెళ్లదీస్తున్నారు. -
రాళ్లు రువ్వి వర్సిటీలోకి వెళ్లారు
సాక్షి, న్యూఢిల్లీ: జామియా యూనివర్సిటీ వద్ద సీఏఏకు వ్యతిరేక ఆందోళనల సందర్భంగా డిసెంబర్ 15న జరిగిన హింసాత్మక ఘటనలపై తాజాగా విడుదలైన వీడియో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. పోలీసులపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు యూనివర్సిటీలోకి వెళ్లారు. లైబ్రరీ వద్దకు చేరుకున్నట్లు ఆ సీసీ కెమెరా వీడియోలు వెల్లడిస్తున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పావాయుగోళాలను ప్రయోగించారు. (‘వీడియోతో.. వాళ్లకు వాళ్లుగా దొరికిపోయారు!’) యూనివర్సిటీ వర్సిటీలోని ఓ భవనం వద్ద, భవనం లోపల భారీ సంఖ్యలో ఉన్న విద్యార్థులు, ఆందోళనకారులు బయటికి పరుగులు తీసుకుంటూ వచ్చారు. ముసుగులు ధరించిన వారు లైబ్రరీలోకి పారిపోయారు. అయితే, లైబ్రరీలోకి వచ్చిన పోలీసులు అక్కడ ఉన్న విద్యార్థులను ఇష్టానుసారంగా కొట్టారని ఫిర్యాదు చేసిన విషయం విదితమే. (జామియాలో దాడి; కీలక వీడియో విడుదల) తాజాగా విడుదల చేసిన ఈ వీడియో ద్వారా ఆందోళనకారులే ఆ లైబ్రరీలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రాళ్లు రువ్వినవారిని తరుముకుంటూ పోలీసులు వెళ్లారని అధికారులు చెబుతున్నారు. అయితే, లైబ్రరీలోకి వెళ్లలేదని చెప్పారు. యూనివర్సిటీ యాజమాన్యం అనుమతి లేకుండా పోలీసులు ఏ యూనివర్సిటీలోకి వెళ్లలేరని సీనియర్ పోలీస్ అధికారి ఎంఎస్ రంధ్వా తెలిపారు. కాగా, ఆ రోజున పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పావాయుగోళాలను ప్రయోగించడం.. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడం జరిగింది. ఆందోళనకారులు మూడు బస్సులకు నిప్పుపెట్టారు. మరో రెండు ద్విచక్ర వాహనాలను తగలబెట్టారు. అయితే, పోలీసులు లైబ్రరీలోకి వచ్చి దాడి చేశారంటూ ఓ వీడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఆందోళనల నేపథ్యంలో పదిమంది వర్సిటీ విద్యార్థులకు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. -
చిన్నపాము పట్టు.. పెద్దపాము విలవిల!
భువనేశ్వర్ : పెద్ద పాముకు ఆకలేసినపుడు చిన్న పాముల్ని వేటాడటం కామన్.. కానీ చిన్న పాము పెద్ద పామును వేటాడితే.. ఇదే డిఫరెంట్. ఒడిశాలో జరిగిన ఘటన ఎంత డిఫరెంటంటే చిన్న పాము ఓ పెద్ద పామును పట్టిన పట్టుకు పెద్ద పాము విలవిలలాడిపోయింది. చావు నుంచి తప్పించుకోవటానికి శతవిధాల ప్రయత్నించింది. వివరాలలోకి వెళితే.. ఒడిసా రాష్ట్రంలోని కోరపుత్ జిల్లా సునబేదా పట్టణంలోని ఓ ఇంటి ఆవరణంలో పాములు ఉన్నట్లు జంతు సంరక్షణా సిబ్బందికి సమాచారం అందింది. ఇంటి ఆవరణలోకి చేరుకున్న సిబ్బంది అక్కడి దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురైయ్యారు. 3 అడుగుల పాము తన కంటే పరిమాణంలో రెండు రెట్లు పెద్దదైన రాట్ స్నేక్‌ను గట్టిగా పట్టుకుంది. అంత పెద్ద పాము ఆ పట్టు నుంచి తప్పించుకోవటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.. గిలగిలలాడింది. చివరకు జంతు సంరక్షణా సిబ్బంది రెండింటిని వేరుచేయటంతో చావు తప్పి బయటపడింది. జంతు సంరక్షణా సిబ్బంది మాట్లాడుతూ.. మామూలుగా అయితే పెద్ద పాములు చిన్న పామును చూడగానే తినటానికి ప్రయత్నిస్తాయని అన్నారు. కానీ ఇలా చిన్న పాము పెద్ద పామును పట్టి తినాలనుకోవటం చాలా అరుదని తెలిపారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఎంటంటే ఆ రెండు పాములు విషపూరితమైనవి కాకపోవటం. ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. -
రక్షకుడు కాదు.. భక్షకుడు
సాక్షి, కర్ణాటక(బళ్లారి): కంచె చేను మేస్తే.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ మహిళ రెండేళ్లుగా నరకం అనుభవించింది. ఏదైనా నేరాలు, ఘోరాలు, ఎక్కడైనా అత్యాచారాలు, హత్యలు తదితర నేరాలకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయడం సహజమే. అయితే అదే పోలీసు తప్పుటడుగులు వేయడంతో జిల్లా పోలీసుల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని హొస్పేట పోలీసు స్టేషన్లో పని చేస్తున్న వెంకటేశ్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అయితే పటేల్ నగర్‌లోని తన పక్కంటిలో నివాసం ఉంటున్న ఓ మహిళ స్నానం చేసే, బట్టలు మార్చుకునే దృశ్యాలను వీడియో తీశాడు. వాటిని అడ్డుపెట్టుకొని తనను కలవకపోతే ఆ వీడియోను అందరికీ షేర్ చేస్తానని బెదిరించసాగాడు. ఈ విషయాన్ని సదరు మహిళ భర్తకు తెలపడంతో అతను పోలీసును నిలదీశాడు. దీంతొ మీ షాపులో అక్రమంగా గంజాయి అమ్ముతున్నట్లు కేసు పెడతానని బెదిరించి అతనిని నోరు మూయించాడు. నీచ పోలీసు ఆగడాలు పేట్రేగిపోవడంతో సదరు మహిళ పోలీసు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేసింది. ఈ విషయంతెలియగానే బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన వెంకటేశ్ పరారయ్యాడు. -
‘హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించినా నో యూజ్’
ప్రస్తుత కాలంలో ఆడ, మగ, చిన్నా పెద్ద ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. దీని కోసం ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత డబ్బు వెచ్చించినా.. ఫలితం లేకుండా పోతుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందటానికి ఇటీవల పాకిస్థాన్‌కి చెందిన ప్రముఖ నటుడు సయీద్ సాజిద్ హసన్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స చేయించారు. అయితే ఆ చికిత్స వికటించిదంటూ ఓ వీడియో ద్వారా తెలియజేశారు. చికిత్స మొదలు పెట్టినప్పటినుంచి తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని సయీద్ సాజిత్ ఆ వీడియాలో పేర్కొన్నారు. చికిత్స వికటించి తలపై ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. వైద్యులతో ఈ విషయం చెబితే ఇలాంటి సమస్య సాధారణమే అని చెప్పి, తలపై వచ్చిన ఇన్ఫెక్షన్ను సెలైన్ వాటర్‌తో శుభ్రం చేశారని వాపోయారు. చికిత్స వికటించి తలపై వచ్చిన గాయాలను హసన్ చూపిస్తూ.. ‘ఇప్పడు ఇది నా పరిస్థితి.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల చాలా బాధపడుతున్నాను. కొంతకాలంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. వృత్తిపరంగా కూడా ఇబ్బందిపడాల్సి వస్తోంది’ అని తెలిపారు. అదేవిధంగా ఇలా చికిత్స చేయించుకోవాలనుకునే వారు మంచి సర్జన్ దగ్గరికి వెళ్లండి అంటూ.. లేకపోతే నాలాంటి పరిస్థితి మీకు వస్తుందని సందేశమిచ్చారు. -
భర్త నచ్చలేదు.. కట్నం వెనక్కి తీసుకోండి
సాక్షి, తాడేపల్లిగూడెం: సెల్ఫీ తీసుకుని ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. పట్టణంలోని కొండయ్య చెరువు వద్ద గల తిరుమల అపార్టుమెంట్స్‌లో ఉంటున్న మౌనిక(24) అనే మూడు నెలల గర్భిణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఉరి వేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నది. ఆగస్టులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ నరేంద్రతో వివాహం అయింది. అమ్మానాన్న నన్ను క్షమించండి.. భర్త నచ్చలేదు.. కట్నం వెనక్కి తీసుకోండి అని ఆ వీడియోలో తల్లిదండ్రులను కోరింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రెండున్నర ఏళ్లుగా కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతోన్న పరోక్ష యుద్ధం తారాస్థాయికి చేరింది. నిన్నటివరకు కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. బుధవారం ఏకంగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో నరేంద్ర మోదీ నన్ను హత్య చేయిస్తారేమోనంటూ సంచలనాత్మక ఆరోపణలు చేశారు. వీడియోలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలను ఉద్దేశించి దాదాపు 10 నిమిషాలు మాట్లాడిన కేజ్రీవాల్.. జైలుకు వెళ్లేందుకు, హత్యలకు గురయ్యేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిపై పై ఈ స్థాయిలో విమర్శలకు దిగడం దేశరాజకీయాల్లో అరుదు. ఢిల్లీలో మ్మెల్యేలు వరుసగా అరెస్టుకావడం, చిన్నాచితకా లేదా బలమైన సాక్ష్యాధారాలు లేని కేసుల్లో సైతం జైళ్లకు వెళ్లాల్సి రావడంతో ఆప్ అనేక ఇబ్బందులు ఎదుర్కొటున్న సంగతి తెలిసిందే. వీటన్నింటిపై ఇప్పటివరకు ఒకస్థాయిలో స్పందించిన ఆప్ అధినేత.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో, ప్రధాని మోదీతో అమీతుమీకి సిద్ధమయినట్లు వీడియో సందేశాన్ని బట్టి తెలుస్తోంది. -
స్నానం చేస్తుండగా మహిళను వీడియోతీశారు..
అమలాపురం: తూర్పుగోదావరి జిల్లాలో మరో కీచకపర్వం చోటుచేసుకుంది. కన్నూమిన్నూకానని ముగ్గురు యువకులు.. ఓ వివాహిత స్నానం చేస్తుండగా మొబైల్ ఫోన్ లో వీడియో తీసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఆమె గుర్తించి కేకలు వేయడంతో పరారయ్యాయి. అయితే మరో వ్యక్తి ఆ దుండగులను గుర్తించడంతో వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదయింది. అమలాపురం పట్టణంలోని వానపల్లివారి వీధిలో శనివారం జరిగిన ఈ సంఘటనలో నిందితులను బాధితురాలి సోదరి గుర్తించంది. బాత్ రూమ్ లో తన సోదరి కేకలు వేయగానే తాను పరుగున వెళ్లానని.. అప్పుడే తమ కాలనీకే చెందిన యెరుబండి బాలాజి, వెంకటగిరి బాబు, బుదిరెడ్డి రాజశేఖర్ లు పారిపోతూ కనిపించారని పోలీసులకు చెప్పింది. స్థానికుల సహాయంతో పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ యువకులు పారిపోయారు. ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన పట్టణ సీఐ వైఆర్కే. శ్రీనివాస్.. నిందితులపై నిర్భయ కేసు (సెక్షన్-451, 509, 354(సీ), 354(డీ)) నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. -
విద్యార్థినిపై డాక్టర్, కానిస్టేబుళ్ల అత్యాచారం!
రాయ్‌పూర్: ఓ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఆరోపణలతో చత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్ జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు, ఇద్దరు కానిస్టేబుళ్లు గురువారం అరెస్టయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ గౌతం పండిట్‌తో పాటు కానిస్టేబుళ్లు చంద్రప్రకాశ్ పాండే, సౌరబ్ భక్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే గత సంవత్సరం జూన్ 19న రోడ్డు ప్రమాదంలో గాయపడిన 22 ఏళ్ల విద్యార్థిని లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. ఆ సమయంలో డాక్టర్‌తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ సన్నివేశాలను చిత్రీకరించారు. ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత కూడా కానిస్టేబుళ్లు ఇద్దరూ వేధించడం మొదలు పెట్టారు. వీడియో చూపించి బెదిరిస్తూ, ఆమెను శారీరకంగా వాడుకుంటున్నారు. మంగళవారం కూడా ఆమెను నగర శివార్లలోకి తీసుకువెళ్లారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరంచడంతో పోలీసులు పారిపోయారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో నగర శివారులోని ఒక పవర్ హౌస్ వద్ద విద్యార్థినిని చూసిన పోలీసులు ప్రశ్నించారు. ఆమె మొత్తం జరిగిన సంఘటనను పోలీసులకు వివరించింది. విద్యార్థిని, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ డాక్టర్‌ను, ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ రాజేష్ అగర్వాల్ చెప్పారు.