స్నానం చేస్తుండగా మహిళను వీడియోతీశారు.. | 3 youth booked under nirbhaya act, for capturing women's bathig vedio | Sakshi
Sakshi News home page

స్నానం చేస్తుండగా మహిళను వీడియోతీశారు..

Published Sun, Aug 23 2015 4:57 PM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

స్నానం చేస్తుండగా మహిళను వీడియోతీశారు..

స్నానం చేస్తుండగా మహిళను వీడియోతీశారు..

అమలాపురం: తూర్పుగోదావరి జిల్లాలో మరో కీచకపర్వం చోటుచేసుకుంది. కన్నూమిన్నూకానని ముగ్గురు యువకులు.. ఓ వివాహిత స్నానం చేస్తుండగా మొబైల్ ఫోన్ లో వీడియో తీసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఆమె గుర్తించి కేకలు వేయడంతో పరారయ్యాయి. అయితే మరో వ్యక్తి ఆ దుండగులను గుర్తించడంతో వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదయింది.


అమలాపురం పట్టణంలోని వానపల్లివారి వీధిలో శనివారం జరిగిన ఈ సంఘటనలో నిందితులను బాధితురాలి సోదరి గుర్తించంది. బాత్ రూమ్ లో తన సోదరి కేకలు వేయగానే తాను పరుగున వెళ్లానని.. అప్పుడే తమ కాలనీకే చెందిన యెరుబండి బాలాజి, వెంకటగిరి బాబు, బుదిరెడ్డి రాజశేఖర్ లు పారిపోతూ కనిపించారని పోలీసులకు చెప్పింది.

స్థానికుల సహాయంతో పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ యువకులు పారిపోయారు. ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన పట్టణ సీఐ వైఆర్కే. శ్రీనివాస్‌.. నిందితులపై నిర్భయ కేసు (సెక్షన్-451, 509, 354(సీ), 354(డీ)) నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement