Nirbhaya act
-
‘నిర్భయ’కు 11 ఏళ్లు... మహిళల భద్రతకు భరోసా ఏది?
అది దేశరాజధాని ఢిల్లీ.. 2012, డిసెంబరు 16.. రాత్రివేళ ఓ ప్రైవేట్ బస్సులో చోటుచేసుకున్న దారుణ అత్యాచార ఘటన భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నీ కుదిపేసింది. ఈ నేపధ్యంలో ఢిల్లీని అత్యాచారాల క్యాపిటల్‌గా అభివర్ణించారు. నాడు అత్యంత క్రూరంగా జరిగిన అత్యాచార ఘటన దేశంలోని ప్రతీఒక్కరినీ కంటతడి పెట్టించింది. డిసెంబరు నాటి వణికించే చలిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయ కామాంధుల చేతుల్లో చిగురుటాకులా వణికిపోయింది. ఈ నేపధ్యంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశంలోని ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. ఈ దారుణ అత్యాచారం దరిమిలా దేశంలో మహిళల రక్షణ విషయంలో పెను మార్పులు వచ్చాయి. దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం అనేక చర్యలు చేపట్టారు. నిర్భయ అత్యాచార ఘటన దర్యాప్తు అనంతరం జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సిఫార్సులు అమలయ్యాయి. దేశంలోని ప్రతీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యాచార బాధితుల కోసం వన్ స్టాప్ సెంటర్లు, హెల్ప్లైన్లు ప్రారంభించారు. నిర్భయ ఫండ్ విడుదల చేశారు. నిర్భయ స్క్వాడ్, నిర్భయ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల పాటు నిర్భయ కేసు విచారణ కొనసాగగా దోషులైన ముఖేష్, పవన్, అక్షయ్, వినయ్‌లను 2020, మార్చి లో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. ఒక మైనర్‌కు విముక్తి లభించగా, మరో నిందితుడు రామ్ సింగ్ విచారణ సమయంలో జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్భయ ఘటన, కేసు దర్యాప్తు, దోషులకు శిక్ష అమలు తర్వాత దేశంలో అత్యాచార ఘటనలు తగ్గుముఖం పట్టివుంటాయని అందరూ భావించివుంటారు. అయితే దీనికి భిన్నమైన పరిస్థితులు దేశంలో తాండవిస్తున్నాయి. ప్రముఖ జాతీయ ఏజెన్సీ ఎన్సీఆర్బీ.. నిర్భయ ఘటన అనంతరం గత 11 ఏళ్లలో దేశంలో చోటుచేసుకున్న అత్యాచార గణాంకాల వివరాలను విడుదల చేసింది. ఇవి మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయని పలువురు అంటున్నారు. సంవత్సరం అత్యాచారం కేసులు 2022 31,516 2021 31,677 2020 28,046 2019 32,032 2018 33,356 2017 32,559 2016 38,947 2015 34,651 2014 36,735 2013 33,707 2012 24,923 నిర్భయ లాంటి హృదయ విదారక అత్యాచార ఘటనల తర్వాత కూడా దేశంలో మహిళల భద్రత విషయంలో ఆశించినంత మార్పు రాలేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదిక ప్రకారం.. గత ఏడాది దేశంలో మొత్తం 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజూ దాదాపు 87 మంది , ప్రతి గంటకు మూడు నుంచి నలుగులు బాలికలు లేదా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఈ నివేదిక ప్రకారం అత్యాచార ఘటనల విషయంలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. గత ఏడాదిలో అత్యధికంగా 5,399 అత్యాచార కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ఢిల్లీలో 1212 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ.. -
హ్యాపీ బర్త్‌డే అన్నాడు.. నమ్మి వెళితే యువతికి నరకం చూపించాడు
సాక్షి,తూర్పుగోదావరి (కరప): కామంతో కన్నుమిన్ను కానని ఓ యువకుడు యువతిపై లైంగిక దాడికి యత్నం చేసి, విచక్షణారహితంగా గాయపరచిన ఘటన కరప మండలం వేళంగిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరప ఎస్సై డి.రమేష్‌బాబు, స్థానికుల కథనం ప్రకారం.. వేళంగికి చెందిన యువతి ఇంటర్మీడియెట్ చదివింది. తల్లిదండ్రులతో కలిసి ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తోంది. ఈ నెల 13 రాత్రి ఆమె ఇంటి పక్కనే ఉంటున్న విత్తనాల రమేష్ తన మొబైల్ ఫోన్ నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి కృతజ్ఞతలు తెలిపిన ఆ యువతి.. కొద్దిసేపటికి రూ.2 వేలు అప్పుగా ఇస్తే, నాలుగు రోజుల్లో ఇచ్చేస్తానని అడిగింది. ఇదే అదునుగా నగదు ఇస్తానని నమ్మించిన రమేష్.. ఇంటి పక్కన ఉన్న సందులోకి ఆమెను రమ్మ న్నాడు. తెలిసిన వ్యక్తే కదా అని డబ్బుల కోసం అక్కడకు వెళ్లగా అతడు ఆ యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో ఆగ్రహించిన రమేష్.. ఆ యువతి గొంతు పట్టుకుని గోడకు గుద్దించాడు. విచక్షణా రహితంగా కొట్టి గాయపర్చాడు. భయపడిన ఆ యువతి కేకలు వేయడంతో ఆమె గొంతు, ఎడమ చేతిని కొరికి గాయపరిచాడు. మెడ పట్టుకొని ముఖా న్ని గోడకు బలంగా కొట్టి పరారయ్యాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు, బంధువులకు బాధితురాలు తెలిపింది. ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి కుడి కన్ను పూర్తిగా దెబ్బతింది. అపస్మారక స్థితిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ చట్టం, ఇతర సెక్షన్లతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రమేష్‌బాబు వివరించారు. -
దారుణం: మైనర్‌పై 38 మంది అత్యాచారం
తిరువనంతపురం: నిర్భయ చట్టం.. దాని కంటే కఠిన చట్టాలు.. ఆఖరికి ఎన్కౌంటర్ వంటి ఘటనలు జరిగినప్పటికి ఇవేవి కామాంధులను భయపెట్టలేకపోతున్నాయి. దేశంలో రోజురోజుకు అత్యాచారాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో దారుణం వెలుగు చూసింది. కేరళలో ఓ మైనర్ బాలికపై గత కొద్ది నెలలుగా 38 మంది మృగాళ్లు రాక్షస క్రీడ కొనసాగించారు. నిర్భయ కేంద్రంలో కౌన్సెలింగ్ సందర్భంగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బాలిక 13వ ఏట ఉండగా.. ఈ అత్యాచారాల పర్వం మొదలయ్యింది. అలా ఓ ఏడాది పాటు నరకం అనుభవించిన బాలికను చైల్డ్ హోమ్‌కు తరలించారు అధికారులు. కొద్ది రోజుల తర్వాత బాలికను ఆమె తల్లి, అన్నతో ఇంటికి పంపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బాలిక కనిపించకుండా పోయింది. ఇక ఆమెని వెతగ్గా గతేడాది డిసెంబర్లో పాలక్కడ్‌లో ఆచూకీ లభ్యం అయ్యింది. ఆమెని నిర్భయ సెంటర్‌కి తరలించి.. కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించగా.. బాలిక హృదయం ద్రవించే విషయాలు వెల్లడించింది. (చదవండి: అత్యాచారం చేయలేదు.. రిలేషన్లో ఉన్నాం: మంత్రి) దాదాపు 38 మంది మృగాళ్లు ఆమెపై రాక్షస క్రీడ కొనసాగించారని తెలిపింది. బాధితురాలు చెప్పే విషయాలు విని అధికారుల కళ్లు చెమర్చాయి. మరో దారుణం ఏంటంటే.. బాలికపై అత్యాచారం చేసిన వారంతా ఆమెకి తెలిసిన వారే కావడం గమనార్హం. ఇక బాధితురాలు వెల్లడించిన వివరాల మేరకు అధికారులు నిందితులందరి లైంగిక దోపిడితో సహా ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మలప్పురం సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) ప్రెసిడెంట్ షాజేశ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘బాధితురాలిని ఏడాది క్రితం చైల్డ్ హోం నుంచి బయటకు పంపినప్పుడు ఆమె భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అయితే ఒక్కసారి బాధితులను వారి సంరక్షకులకు అప్పగించిన తర్వాత సమస్యలు తలెత్తుతున్నాయి. సంరక్షులు బాధితులను సరిగా పట్టించుకోవడం లేదు. అందువల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి’ అని తెలిపారు. -
మహిళల భద్రత కోసం అభయం ప్రాజెక్ట్: సీఎం జగన్
-
ఆ విషయంలో ఏమాత్రం రాజీపడం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. రవాణాశాఖ పర్యవేక్షణలో అమలయ్యే ఈ ప్రాజెక్టును సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం అభయం ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నామన్నారు. మహిళల కోసం ఇప్పటికే అమ్మ ఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. నామినేటెడ్ పదవులు,పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించామని పేర్కొన్నారు. హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించిట్లు స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తున్నామన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటంలేదని అన్నారు. (అవినీతిపై తిరుగులేని అస్త్రం) అక్కాచెల్లెమ్మలకు అండగా తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యం కల్పించాలని ఆదేశాలు ఇచ్చాం. దేశంలోనే తొలిసారిగా దిశా బిల్లును ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచాం. ప్రతి జిల్లాలో దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. దిశా ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. దిశా యాప్ ద్వారా అక్కాచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం. ప్రతి గ్రామ/వార్డు సచివాలయాల్లో మహిళా పోలీస్‌ను కూడా నియమించాం. రవాణా శాఖ ఆధ్వర్యంలో అభయం యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఆటోలు, క్యాబ్‌ల్లో నిర్భయంగా ప్రయాణించేందుకు యాప్ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఆటో, క్యాబ్‌లో అభయం యాప్ డివైజ్ ఏర్పాటు చేస్తాం. తొలిసారిగా వెయ్యి వాహనాల్లో డివైజ్ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే నవంబర్ నాటికి లక్ష వాహనాలకు డివైజ్ ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138.48 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీం కింద 2015లో రాష్ట్రానికి రూ.80.09 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.55.39 కోట్లు కేటాయించాల్సి ఉంది. దశలవారీగా రాష్ట్రంలో లక్షరవాణా వాహనాలకు ట్రాకింగ్ డివైస్‌లు బిగించి వచ్చే ఏడాది నవంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయాలని రవాణాశాఖ లక్ష్యం పెట్టుకుంది. తొలిదశలో విశాఖపట్టణంలో వెయ్యి ఆటోల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత తిరుపతిలో అమలు చేస్తారు. ‘అభయం’ అమలు ఇలా.. ► రవాణా వాహనాల్లో ట్రాకింగ్ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు. ► రవాణా వాహనాలకు దశలవారీగా ఐవోటీ బాక్సులు అమర్చాలి. ► తొలుత వెయ్యి ఆటోల్లో సోమవారం ఈ పరికరాలు ఏర్పాటు చేస్తారు. వచ్చే ఫిబ్రవరి 1 నాటికి ఐదువేల వాహనాలు, జూలై 1కి 50 వేల వాహనాలు, వచ్చే ఏడాది నవంబరు 31కి లక్ష వాహనాల్లో ఈ పరికరాలు అమరుస్తారు. ప్రాజెక్టు నిర్వహణ 2025 వరకు ఉంటుంది. ► ఆటోలు, క్యాబ్‌ల్లో ప్రయాణించే వారు తమ మొబైల్లో ‘అభయం’ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. వాహనంఎక్కేముందు వాహనానికి అంటించిన క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ► స్కాన్ చేయగానే డ్రైవరు ఫోటో, వాహనం వివరాలు మొబైల్‌కు వస్తాయి. ► స్మార్ట్ ఫోన్ వినియోగించే మహిళలు తమ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. ► స్మార్ట్ ఫోన్ లేని ప్రయాణికులు వాహనానికి బిగించిన ఐవోటీ పరికరంలోని ప్యానిక్ బటన్ నొక్కితే సమాచారం కమాండ్ కంట్రోల్ సెంటరుకు చేరుతుంది. క్యాబ్/ఆటో వెంటనే ఆగిపోతుంది. ఆ వెంటనే సమీపంలోని పోలీస్ అధికారులకు సమాచారం పంపి పట్టుకుంటారు. ► ఐవోటీ ఆధారిత బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ) కార్డులు ఇస్తారు. ► ఆటోలు స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఆర్ఎఫ్ఐడీ లైసెన్సు కార్డులను ఇంజన్ల వద్ద అమర్చిన ఐవోటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. -
పెరుగుతున్న రేప్‌లు, తగ్గుతున్న శిక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ అనంతరం దేశంలో ఎన్నో కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ అత్యాచార ఘటనలు తగ్గక పోవడం, పైగా అటువంటి కేసుల్లో శిక్షలు తగ్గి పోవడం శోచనీయం. మహిళల భద్రత కోసం ‘నిర్భయ నిధి’ని ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం కలిగించక పోవడం బాధాకరం. ఇందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు, దర్యాప్తు సంస్థలకు చిత్తశుద్ధి లేకపోవడమే ప్రధాన కారణం. 2019, డిసెంబర్ నెల నాటికి ‘నిర్భయ నిధి’లో కేవలం 9 శాతం నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టాయి. 2018 ఏడాదితో పోలిస్తే 2019 సంవత్సరానికి మహిళలపై అత్యాచారాలు ఏడు శాతం పెరగ్గా, రేప్ కేసుల్లో శిక్షలు 27.8 శాతానికి పడిపోయాయి. 2018లో నమోదైన అత్యాచార కేసుల్లో 15 శాతం కేసుల్లో నేరారోపణలే ఖరారు కాలేదు. దేశంలో అకృత్యాలు నియంత్రించడంలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన కఠిన చట్టాల ప్రకారం పోలీసులు, వైద్యులు, న్యాయస్థానం పాత్ర, బాధ్యతలు పెరిగాయి. ఈ మూడు వ్యవస్థలు చిత్తశుద్ధితో పని చేసినట్లయితేనే దేశంలో మహిళలపై అత్యాచారాలు తగ్గుముఖం పడతాయి. కొత్త చట్టాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలి. అయితే దేశంలో ఎక్కడా ప్రైవేటు ఆస్పత్రులు అత్యాచార బాధితులను చేర్చుకోవడం లేదు. -
కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!
(వెబ్ స్పెషల్): రేపిస్టుల పాలిట సింహ స్వప్నం, బ్రహ్మాస్త్రమంటూ ‘నిర్భయ’ చట్టాన్ని తెచ్చుకున్నాం.. ఖబడ్దార్... అత్యాచారం చేస్తే మరణ శిక్షే అన్నాం.. ఎన్కౌంటర్లూ చూశాం.. కానీ ఏం జరిగింది. చరిత్ర పునరావృతమైంది. ఘోరాతి ఘోరంగా.. మరింత హేయంగా...దిగ్భ్రాంతికరంగా.. పుణ్య భారతంలో మరో నిర్భయ బలైపోయింది. పసిగుడ్డునుంచి 90 ఏళ్ల వృద్దురాలి దాక, ఆఖరికి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా బాధితులను కూడా విడిచిపెట్టకుండా ప్రజాస్వామ్య దేశంలో హత్యాచార పర్వం కొనసాగుతూనే ఉంది. ఇపుడు ఏకంగా పోలీసులే సాక్ష్యాలను కాల్చి బూడిద చేసేశారు. ఇదీ మన నవభారతం. దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిన 2012 నిర్భయ ఘటనతో వచ్చిన ‘నిర్భయ’ చట్టం తరువాత హత్యాచారాలకు ఏమాత్రం అడ్డకట్ట పడటం లేదు. బాధితులకు ముప్పు పెరిగిందే తప్ప తగ్గలేదు. నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా అత్యాచారాలు ఆగలేదు సరికదా గుజరాత్‌లోని సూరత్, ఉత్తరప్రదేశ్ ఉన్నావ్, జమ్మూకశ్మీర్ కథువా, తెలంగాణాలో దిశ, మరో దళిత మహిళ.. ఇలా దేశంలో పలు హత్యాచార ఘటనలు మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మరో అమానుష ఘటన ఆందోళన పుట్టిస్తోంది. తల్లితో కలిసి పొలాలకు వెళ్లిన 19 ఏళ్ల దళిత బాలికను ఎత్తుకెళ్లి ఆధిపత్య కులానికి చెందిన నలుగురు నాలుగు రోజులపాటు సామూహిక అత్యాచారం, తీవ్ర చిత్రహింసల పాలు చేశారు. ఏకంగా నాలుక కోసేశారు. ఇక ఈ హింస తన వల్ల కాదంటూ ఈ లోకం నుంచి నిష్ర్రమించింది బాధితురాలు. బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ వ్యవహారంలో యోగి సర్కార్ వైఖరి మరువక ముందే మరో అమానుష ఘటన కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులే బాధితురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. అతిదారుణమైన పరిస్థితుల్లో బిడ్డను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న ఆ కుటుంబానికి ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం చివరి చూపు దక్కుకుండా, ఈ తంతును ముగించడం వెనక అంతర్య మేమిటి? తొలుత ఫిర్యాదు తీసుకోవడంలోనూ నిర్లక్ష్యం, ఆ తరువాత రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా బాధితురాలి శవ దహనం చేయడం ఎవరిని రక్షించడానికి? కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించి, బయటకు రాకుండా పోలీసులు ఎందుకు వ్యవహరించాలి? పోలీసుల రక్షణ వలయంగా ఏర్పడి మరీ ఈ దారుణానికి పాల్పడిన దృశ్యాలు హృదయాలను పిండేస్తున్నాయి. దోషులను కాపాడేందుకు, సాక్ష్యాధారాలు మాయం చేసేందుకే ఇలా చేశారా? ఈ ప్రశ్నలకు అక్కడి ప్రభుత్వం సమాధానం చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 'నిర్భయ' నిందితుల ఉరికోసం ఆరాటపడిన బీజేపీ అధినాయకత్వం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నాయి. మరీ ముఖ్యంగా మైనర్ బాలికలను, కూలి పనులకు వెళ్లిన దళిత బలహీన వర్గాల అమ్మాయిలే లక్ష్యంగా మృగాళ్లు రెచ్చిపోతున్నారు. బేటీ బచావో నినాదాన్ని అపహాస్యం చేస్తూ పైశాచికత్వంతో అన్నెంపున్నెం ఎరుగని పసివాళ్లను, అమ్మాయిలను బలి తీసుకుంటున్నారు. దీనికి తోడు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని, మరింత రాక్షసంగా వికృతంగా ప్రవర్తిస్తున్నారు. చంపేస్తామనే బెదిరింపులు, హత్యలూ పెరుగుతున్నాయి. కఠిన శిక్షలు భయంతో మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అత్యాచార దృశ్యాలను సెల్ఫోన్లలో చిత్రీకరించి...విషయం బయటికి చెబితే బయటపెడతాం అంటూ.. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో తీరని అవమానంతో, సమాజానికి భయపడి చాలామంది బాధితులు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కడంలేదు. చాలా కేసుల్లో దర్యాప్తుల జాప్యంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. మరోవైపు నేరస్తులతో పోలీసు అధికారులు కుమ్మక్కవ్వడం, బేరసారాలు, ఒప్పందాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. 2012లో రోజుకు 68 అత్యాచార సంఘటనలు రికార్డయ్యాయి. 2013లో ఈ సంఖ్య 92కు పెరిగింది. 2014లో 100, 2016లో రోజుకు 106 కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలా అత్యాచార కేసులు నమోదు కావడం లేదు. తాజాగా హత్రాస్‌లో సామూహిక హత్యాచార ఘటన అమ్మాయిల భద్రతపై ప్రశ్నల్ని లేవనెత్తింది. హైదరాబాద్ దిశ కేసు మాదిరిగానే తక్షణ న్యాయం కావాలని, నేరస్థులను ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ‘చట్టం’ తన పని చేస్తోందా? అత్యాచారం, కిడ్నాప్ లాంటి ఘటనల్లో పోలీసుల నిర్లక్ష్యానికి సంబంధించి అనేక నిదర్శనాలు వెక్కిరిస్తున్నాయి. ఆడపిల్ల కనిపించడం లేదు అనగానే వారినోటి నుంచి ముందు "లేచిపోయిందేమో.. రెండు రోజుల్లో వస్తుంది.. లేదంటే ఏదైనా శవం దొరికితే కబురు చేస్తాం'' అనే మాటలే వినిపిస్తాయి. చాలా కేసుల్లో ప్రాథమింగా ఎదురవుతున్న ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. వ్యవహారం కాస్తా తీవ్రంగా మారి మేలుకొనే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీనికితోడు నిర్భయ చట్టం ప్రకారం నేరం తీవ్రతను బట్టి మరణశిక్ష నుంచి యావజ్జీవ శిక్షలు పడే అవకాశముంది. కఠిన శిక్షలు పేరుతో కొందరు పోలీసు అధికారులు సొమ్ము చేసుకుంటున్నారనీ, నిందితులతో లాలూచీ పడుతున్నారనీ పలువురు మానవహక్కుల నేతలు, ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బలహీన సెక్షన్లతో కేసు వీగిపోయేలా వ్యవహరిస్తున్నారనీ, భారీ ముడుపులు అందుకొని కేసులను నీరు గారుస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పలు కేసుల్లో నిందితులుగా ఉండటం గమనార్హం. సమాజంలో స్త్రీలను ఒక పౌరురాలిగా కాకుండా కేవలం సెక్స్ సింబల్ గా, విలాస వస్తువుగా చూసే దృక్పథం మారనంత వరకూ, చట్టాలు, పోలీసులు సక్రమంగా తమ విధి తాము నిర్వర్తించనంతవరకు, పాలకులు ప్రజలు, మహిళల భద్రత పట్ల చిత్తశుద్ధిగా ఉండనంతవరకూ ఈ అమానుష హింసాకాండ కొనసాగుతూనే ఉంటుంది. -
నిర్భయ కేసులో జేడీఏ హబీబ్‌బాషా అరెస్టు
అనంతపురం క్రైం: నిర్భయ కేసులో భాగంగా అగ్రికల్చరల్ జేడీఏ హబీబ్‌బాషాను దిశ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం అనంతపురంలోని జేడీఏ ఇంటి వద్ద డీఎస్పీ ఈ.శ్రీనివాసులు నేతృత్వంలో పోలీసులు అరెస్టు చేసి, దిశ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 3న కళ్యాణదుర్గం అగ్రికల్చరల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహిళా ఉద్యోగిని జేడీఏ హబీబ్ బాషా లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఎస్పీ బి.సత్యయేసు బాబుకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సీసీఎస్ డీఎస్పీ, దిశ పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు ఆదేశాలతో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ: దిశ పోలీసు స్టేషన్లో జేడీఏ హబీబ్‌బాషాను డీఎస్పీ శ్రీనివాసులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10 గంటలకు జేడీఏను ఆయన ఇంటి నుంచి స్టేషన్‌కు తరలించారు. లైంగింక వేధింపులకు సంబంధించి లోతుగా ఆరా తీశారు. ‘జూనియర్ అసిస్టెంట్ తన సొంత పనులపై వచ్చినప్పుడు మీ క్యాబిన్‌కు ఎందుకు పిలిపించి అసభ్యంగా ప్రవర్తించారని? ఆమెకు ఎన్నిసార్లు కాల్ చేశారు తదితర విషయాలపై ప్రశ్నించారు. కార్యాలయంలో సిబ్బందితో మాట్లాడితే అసభ్య పదజాలం ఉపయోగించారని బాధితురాలు ఆరోపించిందని, దీనిపై మీరేం సమాధానం చెబుతారంటూ హబీబ్‌బాషాను డీఎస్పీ ప్రశ్నించినట్లు తెలిసింది. హబీబ్‌బాషా కాల్ డేటాను పోలీసులు సేకరించి, జూనియర్ అసిస్టెంట్‌కు ఫోన్లు ఏమైనా చేశారా? అని ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలాఉంటే విచారణలో హబీబ్‌బాషా తనకేం తెలియదని చెప్పినట్లు తెలిసింది. -
తల్లిలాంటి వదినే బాలికను..
నిర్భయ, దిశ వంటి అనేక కఠినమైన చట్టాలు వస్తున్నా మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులపై సైతం కామాంధులు కన్నేస్తున్నారు. మైనర్లని కూడా చూడకుండా వారి జీవితాలను బుగ్గి చేస్తున్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దిశ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయడంతో బాలికలపై జరుగుతున్న అకృత్యాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే జిల్లాలో ముగ్గురు బాలికలపై జరిగిన అఘాయిత్యాలు బయటపడటం కలవరపెడుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు :కంటికి రెప్పలా కాపాడాల్సిన అయిన వారే వారి పాలిట యమపాశాలుగా మారుతున్నారు. రక్షించాల్సిన వారే తమ జీవితాలను ఛిద్రం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోదిస్తున్నారు. విషయం బయటపడితే తమతో పాటు కుటుంబ పరువు పోతుందనే భయంతో పంటి బిగువున బాధను భరిస్తూ నరకయాతన పడుతున్నారు. ఒక పక్క కరోనా మహమ్మారి మానవాళి జీవితాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో అంతకంటే భయంకరమైన కొన్ని మానవ మృగాలు అభం శుభం తెలియని మైనర్ బాలికలపై తమ కామ వాంఛను తీర్చుకుంటూ వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా జరుగుతున్న అమానవీయ ఘటనలు వింటే ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళన, మనోవేదనలకు గురవ్వాల్సిన దుస్థితి దాపురించింది. తమ జీవితాలను బాగు చేయాల్సిన తల్లిదండ్రులు, అన్న వదినలు, అక్కాచెల్లెళ్లు ఇలా పేగుబంధాలనే నమ్మలేని దుర్భర పరిస్థితి నెలకొంది. జిల్లాలో మైనర్ బాలికలపై జరుగుతున్న వరుస దుర్ఘటనలు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ♦ జిల్లాలో గత వారం రోజుల్లో మూడు దుర్ఘటనలు జరిగాయి. వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కావలి సమీపంలోని ముసునూరు ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక వారి వద్ద నుంచి వచ్చి అన్న, వదినల వద్ద ఉంటుంది. అయితే తల్లి తరువాత తల్లిలా భావించే వదినమ్మే ఆ బాలికను డబ్బు కోసం ఓ వ్యభిచార ముఠాకు రూ.27 వేలకు అమ్మివేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికను డబ్బిచ్చి కొన్న వ్యభిచార ముఠా కందుకూరు శివారు ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ బాధ భరించలేక వారి నుంచి తనకు రక్షణ కల్పించమంటూ సదరు బాలిక డయల్ 100 కు ఫోన్ చేయడంతో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు కందుకూరు పోలీసులు బాలికను వ్యభికార కూపం నుంచి రక్షించి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలికతో వ్యభిచారం చేయించే ముఠాతో పాటు ఆమె వదినపై కూడా దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ ఘటన అయిన వారి అండ కోరుకునే బాలికలకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ♦ ఒంగోలు నగరంలో జరిగిన మరో ఘటన అమ్మతనానికే మచ్చ తెచ్చేలా ఉంది. బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళ భర్తతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఏడేళ్లుగా అతనికి దూరంగా ఉంటోంది. కొంతకాలం పాటు కుమార్తెలిద్దరూ తల్లి వద్దే ఉన్నారు. అయితే తల్లి ప్రవర్తన నచ్చని చిన్న కుమార్తె అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. పెద్ద కుమార్తె మాత్రం తల్లివద్దనే ఉంటూ 9వ తరగతి చదువుతోంది. అయితే తల్లి బలరాం కాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పరచుకుని సహజీవనం సాగిస్తోంది. అయితే ఆ కామాంధుడి కన్ను తన కూతురులాంటి మైనర్ బాలికపై పడింది. ఈ క్రమంలో మైనర్ బాలికను బెదిరించి రెండుసార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పగా కామాంధుడిని చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన ఆమె గోల చేయవద్దంటూ కూతురికి నచ్చజెప్పి ఇద్దరికి పెళ్లి చేస్తానంటూ చెప్పింది. అయితే తల్లితో సహజీవనం చేసే వ్యక్తితో తనకు పెళ్లి ఏంటని భావించిన బాలిక బేస్తవారిపేటలోని అమ్మమ్మ ఇంటికి చేరుకుని విషయం తెలియజేసింది. దీంతో బాధితులు దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా కామాంధుడితో పాటు అతనితో సహజీవనం చేస్తున్న బాలిక తల్లిపై సైతం కేసు నమోదైంది. కంటికి రెప్పలా చూడాల్సిన తల్లి కన్న కూతురినే తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని చూసిన ఆమెను విషయం తెలిసిన వారంతా ఛీత్కరించుకుంటున్నారు. ♦ కొత్తపట్నంలో ఆలస్యంగా మరో ఘటన వెలుగు చూసింది. తల్లి చనిపోయి, తండ్రికి చూపు సరిగా కనిపించక ఉన్న బాలికపై ఓ కామాంధుడి కన్ను పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ప్రస్తుతం ఏడు నెలల గర్భిణిగా ఉంది. అయితే కామాంధుడు చేసిన పాపానికి శాపమై తన కడుపులో బిడ్డగా పెరుగుతున్న విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను మథనపడుతూ మౌనంగా రోదిస్తున్న తరుణంలో దీనిని గమనించిన మేనత్త గట్టిగా ప్రశ్నించడంతో మృగాడి దాష్టీకాన్ని బయటపెట్టింది. దీంతో దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో కామాంధుడిపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ♦ ఇలా చెప్పుకుంటూ పోతే మైనర్ బాలికలపై వరుసగా లైంగిక దాడులు, అమానవీయ ఘటనలు అనేకం జరుగుతున్నాయి. అయితే గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ బాధితులు ఫిర్యాదు చేసేందుకు బయటికి వచ్చేవారు కాదు. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరగదనే భయంతో పరువు పోతుందనే ఆందోళనతో రహస్యంగా ఉంచేవారు. అయితే దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు మైనర్ బాలిక, మహిళలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి కేసులు నమోదు చేయడంతో పాటు బాధితులకు అండగా నిలుస్తుండటంతో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. -
‘దమ్ముంటే అయ్యన్నను తొలగించండి’
సాక్షి, అమరావతి: టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యముంటే అయ్యన్న పాత్రుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ సవాల్ చేశారు. నిర్భయచట్టం కింద అయ్యన్నపై కేసు నమోదైతే ఎందుకు వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘మహిళా అధికారిణితో అయ్యన్న అవమానకరంగా మాట్లాడారు. ఆడియో, వీడియో సాక్షిగా అయ్యన్నపాత్రుడు దొరికారు. అలాంటి వ్యక్తిపై కేసు పెడితే వెనుకేసుకొస్తారా? మహిళా ఉద్యోగులంటే టీడీపీకి చులకనా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేశారో?మహిళా అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే మిగతా మహిళలు ఎలా పని చేస్తారు’అని ప్రశ్నించారు. కాగా, విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనలో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. కమిషనర్ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: కరోనా: ఆంధ్రప్రదేశ్‌లో 8 వేలు దాటిన కేసులు) -
అయ్యన్నపై మొదలైన విచారణ
నర్సీపట్నం: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదైన కేసుపై విచారణ కొనసాగుతుందని ఏఎస్పీ తుహన్ సిన్హా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు అసభ్య పదజాలంతో దూషించి, తన విధులకు భంగం కలిగించారని మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకున్యాయసలహా తీసుకుని ఐపీసీ సెక్షన్ 354–ఎ(4), 500, 504, 505(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేశామని ఏఎస్పీ తెలిపారు. బుధవారం ప్రాథమిక విచారణ ప్రారంభించామన్నారు. కేసును పట్టణ సీఐ దర్యాప్తు చేస్తున్నారన్నారు. విచారణ అనంతరం తీసుకునే చర్యలు గురించి వివరిస్తామన్నారు. -
అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనకు సంబంధించి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. కమిషనర్ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ స్వామినాయుడు తెలిపారు. బట్టలూడదీసే పరిస్థితి వస్తుందంటూ... మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తాత లత్సాపాత్రుడు చిత్రపటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్ గదిలోకి మార్చారు. అయితే తన తాత ఫోటోను యథాస్థానంలో ఉంచాలంటూ అయ్యన్నపాత్రుడు ఈనెల 15న మున్సిపల్ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలతో నిరసనకు దిగారు. హాల్‌కు రంగులు వేస్తున్నామని నెల రోజుల్లో చిత్రపటాన్ని యథాస్ధానంలో ఉంచుతామని కమిషనర్ వివరణ ఇచ్చినా అయ్యన్నపాత్రుడు నోటి దురుసుతో ఫోటో తొలగించే అధికారం కమిషనర్‌కు ఎవడిచ్చాడంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేకు ఆమె తొత్తుగా మారారంటూ నోరు పారేసుకున్నారు. పోలీసులు, పెద్దల సమక్షంలో ఇచ్చిన మాట ప్రకారం చిత్రపటాన్ని నెల రోజుల్లో యథా«స్థానంలో పెట్టకపోతే కమిషనర్ బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ‘కమిషనర్ ఆడ ఆఫీసర్ అయిపోయింది.. అదే మగవాడైతే వేరే విధంగా ట్రీట్మెంట్ ఉండేది...’ అంటూ బెదిరించారు. అయ్యన్నపాత్రుడి దుర్భాషలతో మనస్తాపం చెందిన కమిషనర్ పట్టణ పోలీసు స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేయడంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. -
ఇంటర్ విద్యార్థినితో అసభ్య ప్రవర్తన
సాక్షి,హైదరాబాద్: ఇంటర్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేశారు. కోట్‌పల్లి మండలం లింగంపల్లికి చెందిన ఓ బాలిక వికా రాబాద్లోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. బుధవారం ఆమె కాలేజీకి వెళ్లేందుకు కోట్‌పల్లి పెట్రోల్ పంపు వద్ద బస్సు కోసం చూస్తుండగా కోట్‌పల్లి నివాసి ఉప్పరి రమేశ్ బైక్‌పై అటుగా వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. రమేశ్‌పై పోక్సో, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటనారాయణ తెలిపారు. మరో ఘటనలో.. మాడ్గుల: మద్యం మత్తులో ఓ వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. మండలంలోని చంద్రాయన్‌పల్లికి చెందిన ఓ బాలిక (9) తన ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన బైకని వెంకటయ్య(45) ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి దుస్తులు విప్పేసి అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురై న బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి నిందితుడికి దేహశుద్ధి చేశారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బుధవారం వెంకటయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బద్యానాయక్ తెలిపారు. -
నిర్భయ చట్టం తెచ్చినా..
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలపై వేధింపుల నిరోధానికి నూతన చట్టాలు తీసుకురావడం పరిష్కారం కాదని, రాజకీయ సంకల్పం, పాలనాపరమైన చర్యలు అవసరమని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, నిర్భయ చట్టం తీసుకువచ్చినా మహిళలపై నేరాలు ఆగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఉన్నావ్‌లో జరిగిన ఇటీవలి సంఘటలను ప్రస్తావిస్తూ కొద్దిరోజులుగా జరుగుతున్న ఘటనలు సిగ్గుచేటని, ఇలాంటి ఘటనలు తక్షణమే నిలిచిపోయేలా మనమంతా ప్రతినబూనాలని పిలుపు ఇచ్చారు. సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఆదివారం జరిగిన 16వ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మహిళలపై నేరాల నియంత్రణకు నూతన చట్టాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం కాదని చెప్పారు. -
వారికి క్షమాభిక్ష కోరే అర్హత లేదు
మౌంట్ అబూ: మహిళలపై జరుగుతున్న వరుస పైశాచిక దాడులు దేశాన్ని వణికిస్తున్నాయని, నైతికంగా దెబ్బ తీస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రాజస్తాన్‌లోని అబూరోడ్‌లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై శుక్రవారం జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు. లైంగిక వేధింపులు, దాడుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి తీసుకువచ్చిన ది ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద ఉరిశిక్ష పడిన వారికి క్షమాభిక్ష కోరే హక్కు లేకుండా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్‌లో దిశ హత్యాచారం, ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని తగులబెట్టడం వంటి ఘటనల నేపథ్యంలో రాష్ట్రపతి మహిళల భద్రత గురించి మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘అత్యాచార నేరాల్లో ఉరి శిక్ష పడిన వారందరూ క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తారు. వారికి రాజ్యాంగం ఆ హక్కుని కల్పించింది. అయితే పోక్సో చట్టం కింద శిక్ష పడిన వారికి ఆ హక్కు ఉండకూడదు. ఆ దిశగా కేంద్రం అడుగులు వెయ్యాలి. చట్టాలను పునఃసమీక్షించాలి’అని సూచించారు. నిర్భయ గ్యాంగ్ రేప్ దోషి క్షమాభిక్ష పెట్టుకున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘దిశ’ ఘటన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చడాన్ని అభినందిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో రూపొందించిన సైకత శిల్పం -
నిర్భయ నిధుల పరిస్థితేంటి?
న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఏ విధంగా స్పందిస్తున్నారు? నిర్భయ నిధుల వినియోగం ఎలా ఉంది? అనే వివరాలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) ప్రభుత్వాలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతుండటంపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ.. గత మూడేళ్లలో నిర్భయ నిధులను వినియోగించిన తీరును, ప్రస్తుతం ఆ నిధులు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని తెలుపుతూ ఆరు వారాల్లోగా తమకు నివేదిక అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. తమ పిల్లలో, ఇంట్లోని మహిళలో కనిపించడం లేదని, వారి ఆచూకీ తెలుసుకోవాలని ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. ఎవరితోనైనా వెళ్లిపోయిందేమోనన్న నిర్లక్ష్యపూరిత జవాబే ఎక్కువగా పోలీసుల నుంచి వస్తోందని ఎన్హెచ్ఆర్సీ వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆలోచన తీరును మార్చుకోవాలని సూచించింది. ‘హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు రేప్‌చేసి, చంపేసి, మృతదేహాన్ని కాల్చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదేమో’ అని ఎన్హెచ్ఆర్సీ అభిప్రాయపడింది. నిర్భయ నిధి సహా మహిళల రక్షణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, నిబంధనలను.. రాష్ట్రాలు, యూటీల్లో వాటి అమలును సమగ్ర నివేదిక రూపంలో తమకు అందించాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. కేంద్రం, రాష్ట్రాలు, యూటీలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు -
నిర్భయతో అభయం ఉందా?
‘ఒక హంతకుడు శరీరాన్ని మాత్రమే చంపుతాడు, కానీ ఒక రేపిస్టు ఆత్మను చంపేస్తాడు. బాధితురాలిపైనా, ఆ కుటుంబం పైనా శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా పడే ప్రభావం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది’అని ఓ కేసు విచారణ సమయంలో జస్టిస్ కృష్ణ అయ్యర్ అన్నారు. ఇవాళ, రేపు మహిళలపై జరిగే నేరాలు ఘోరాల్లో శరీరాన్ని, ఆత్మని రెండూ చంపేయడం ఎక్కువైపోయింది. దీనికి కారణం నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయకపోవడమే. తర్వాత కాలంలో నిర్భయ చట్టానికి మరింత పదును పెట్టారు కానీ ఆ చట్టం కింద శిక్షలు వేయడంలో అలసత్వం కనిపిస్తోంది. పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంతో నేరాలకు అడ్డుకట్ట పడలేదన్న విమర్శలున్నాయి. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడిన 4.5 లక్షల మంది వివరాలను డిజిటలైజ్ చేసింది. అయితే అత్యాచార కేసుల్లో శిక్షలు పూర్తిగా పడటం లేదు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. అత్యాచార కేసుల్లో 1973లో 44శాతం మందికి శిక్షలు పడ్డాయి. అదే 2016 నాటికి శిక్షలు పడిన కేసులు 18.9 శాతానికి పడిపోయాయి. ప్రతీ 4 కేసుల్లో 1 కేసులో మాత్రమే శిక్ష పడుతోంది. ఇక కోర్టులు తగిన సంఖ్యలో లేకపోవడం, కోర్టుల్లో న్యాయమూర్తులు, సిబ్బంది కొరతతో పెండింగ్ కేసులు ఎక్కువైపోతున్నాయి. కేవలం అత్యాచార కేసులు విచారించడానికి వెయ్యికి పైగా ప్రత్యేక కోర్టులు ఏర్పరచాల్సిన అవసరం ఉందని సర్వేలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 727 జిల్లాల్లో ఏకకాలంలో అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు విధిస్తేనే భారత్‌లో మహిళల భద్రత ఒక గేమ్ ఛేంజర్‌గా మారుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నీరుకారిపోతున్న నిర్భయ నిధులు నిర్భయ ఘటన తర్వాత అప్పడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం మహిళలకు అండ దండగా ఉండటానికి రూ.వెయ్యి కోట్ల నిధులతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. అదిప్పుడు రూ.3,600 కోట్లకు చేరుకుంది. ఈ నిధుల విడుదల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుంటే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిధుల వాడకాన్ని నీరు కారుస్తున్నాయి. 2013లో ఈ ని«ధుల్ని ఏర్పాటు చేసినప్పటికీ విడుదల మాత్రం 2015 నుంచే జరుగుతోంది. కేంద్రం విడుదల చేసిన నిధులే 42 శాతమైతే.. రాష్ట్రాలు వాటిని 20 శాతం కూడా వాడకపోవడంతో మహిళల భద్రత గాల్లో దీపంలా మారింది. మహిళల రక్షణకు నిధుల్ని విడుదల చేస్తున్న పథకాలివీ... ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ సెంట్రల్ విక్టిమ్ కాంపన్సేషన్ ఫండ్ సైబర్ క్రైమ్ అగైనెస్ట్ వుమెన్ అండ్ చిల్డ్రన్ వన్ స్టాప్ స్కీమ్... మహిళా పోలీసు వాలంటీర్ యూనివర్సలైజేషన్ ఆఫ్ వుమెన్ హెల్ప్‌లైన్ స్కీమ్ పైసా కూడా వినియోగించని రాష్ట్రాలు మణిపూర్ మహారాష్ట్ర లక్షద్వీప్ -
రాయచూరులో మరో నిర్భయ ఘటన?
సాక్షి, రాయచూరు: ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవితను అందుకుంటుందని ఆశించిన ముద్దుల కూతురు అనాథ శవమవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. ప్రేమపేరుతో వెంటాడి వేధించిన ఓ యువకుడే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మధుకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. నగరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యార్థిని మధు పత్తార్ (23) అనుమానాస్పద మృతి కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మరో నిర్భయ ఘోరాన్ని తలపించే ఈ విషాదంపై సినీ, ఇతర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తుండడం, తల్లిదండ్రులు తమ బిడ్డది ముమ్మాటికి హత్యేనని చెబుతుండడంతో చర్చనీయాంశమైంది. ఏం జరిగింది వివరాలు.. మధు పత్తార్ రాయచూరు నగరంలో ఐడీఎస్ఎంపీ లేఔట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె తండ్రి నాగరాజు పత్తార్ స్వర్ణకారుడు, తల్లి రేణుక గృహిణి. నగరంలోని నవోదయ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతోంది. నిత్యం కాలేజీకి వచ్చి వెళ్లేది. ఈ నెల 13న ఇంటర్నల్ పరీక్షలకు వెళ్లిన అమ్మాయి సాయంత్రమైనా ఇంటికి రాలేదు. మొబైల్‌కు ఫోన్ చేస్తే స్పందన రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అదేరోజు సాయంత్రం మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లి బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఎక్కడికీ పోదు, వస్తుందిలే అని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు తప్ప కేసు నమోదు చేసుకుని గాలించలేదు. మూడురోజులు గడిచిపోయాయి. 16వ తేదీన నగరంలోని మాణిక్ ప్రభు దేవాలయం వెనుకభాగంలో నిర్మానుష్యంగా వున్న గుట్టలపై యువతి శవం కనిపించింది. పోలీసులు ఆరా తీయగా అది మధు పత్తార్దేనని తల్లిదండ్రులు, స్నేహితులు గుర్తించారు. పలు అనుమానాలు ‘నేను ఇంజనీరింగ్ కోర్సులో పలు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. నా మరణానికి నేనే బాధ్యురాలిని’ అని ఉత్తరం మృతదేహం దగ్గర దొరికిందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఎండిపోయిన చెట్టుకు ఉరి వేసుకోవడానికి ఆస్కారం లేదు. ఆమె కూర్చున్న స్థితిలో ఉరివేసుకుని ఉంది. ఇది ఎలా సాధ్యమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సూసైడ్ నోట్ కన్నడలో రాసి ఉంది. తమ కూతురికి కన్నడ రాయడం అంతగా రాదని, హంతకుడే ఆ లేఖను రాసి ఆమెతో సంతకం చేయించి ఉంటాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆత్మహత్య కాదు హత్యే.. న్యాయం చేయాలి: మధు తల్లి మొర అనుమానాస్పద రీతిలో మరణించిన తమ కూతురు, విద్యార్థిని మధు పత్తార్ విషయంలో ప్రభుత్వం న్యాయం చేయాలని తల్లి రేణుక కోరారు. శనివారం ఇక్కడ పాత్రికేయల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన కూతురుని చిత్రహింసలకు గురిచేసి, హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిన హంతకులకు కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ నెల 25వ తేదీన నగరంలో విద్యార్థులు, ప్రజలు, సంఘ సంస్థల సహకారంతో భారీ ఆందోళన నిర్వహిస్తామని ఆమె తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరారు. మధు తండ్రి నాగరాజు, విశ్వకర్మ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అతనిపైనే సందేహాలు సుదర్శన్ యాదవ్ అనే యువకుడు ఐదు నెలల నుంచి ప్రేమపేరుతో మధు పత్తార్‌ను వెంబడిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడని ఒత్తిడి చేసేవాడు. మధు అంగీకరించకపోవడంతో తనకు దక్కని ఆమె ఇంకొకరికి దక్కరాదని కక్ష పెంచుకున్నాడు. అర్జంటుగా మాట్లాడాలనే నెపంతో గుట్టలపైకి పిలుచుకెళ్లి చంపి చెట్టుకు వేలాడ దీసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లిదండ్రలు, సంఘ సంస్థల నాయకులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక రావాలి 13వ తేదీనే మధు విగతజీవిగా మారింది. 16న మృతదేహం బయటపడింది. ఎండలకు మృతదేహం కమిలిపోయి గుర్తుపట్టలేనంతగా మాడిపోయింది. నేతాజి నగర్ పోలీసులు కేసు నమెదు చేసుకున్నారు. ఇది హత్యేనని, హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, నిందితుడు సుదర్శన్ యాదవ్ ఇప్పటికే పోలీసులకు లొంగిపోయాడని, అతన్ని విచారిస్తున్నారని తెలిసింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే హత్య, ఆత్మహత్యనా? అనేది చెప్పగలమని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. -
డీఎస్ తనయుడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
అజ్ఞాతంలోకి సంజయ్.. పోలీసుల గాలింపు
సాక్షి, నిజామాబాద్: సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తనయుడు సంజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైంగిక వేధింపుల కేసులో అతన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు నమోదుకాగా, అరెస్ట్ చేయడానికి శుక్రవారం సాయంత్రం పోలీసులు సంజయ్ ఇంటికి వెళ్లారు. అయితే సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. (శాంకరి కాలేజీ వేరే వాళ్లకు ఇచ్చాం) సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 11 మంది నర్సింగ్ విద్యార్థినులు గురువారం తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాయిని సూచన మేరకు ఈ ఉదయం నిజామాబాద్ సీపీని కలిసి విద్యార్థులు మరోసారి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో సంజయ్‌పై నిర్భయ యాక్ట్ కింద కేసును పోలీసులు నమోదు చేశారు. సంజయ్‌ను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే తాను ఎవరినీ వేధించలేదంటూ సంజయ్ ఆ ఆరోపణలను ఖండించిన విషయం విదితమే. విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు కూడా. 'అది టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం' -
ఏళ్లు గడిచాయి.. ఇంకెన్నిసార్లు చెప్పాలి...?
న్యూఢిలీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనను అంత తేలికగా మర్చిపోలేం. నిర్భయ మరణ వాంగ్ములాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ ఘటనను నేరపూరిత కుట్రగా ధ్రువీకరించి.. దోషులకు గతేడాది ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే నిర్భయ కేసులో తీర్పు వచ్చింది కానీ ఇంకా న్యాయం మాత్రం జరగలేదంటూ ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీకి తాము ఓటు వేయబోవడం లేదని వెల్లడించారు. ఈ సందర్భంగా 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాన ప్రచారకర్తగా ఉన్న ప్రధాని మోదీ.. ‘మీరు ఓటు వేయడానికి వెళ్లేటపుడు నిర్భయను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని’ పిలుపునిచ్చిన విషయాన్ని నిర్భయ తల్లి ఆశాదేవి గుర్తు చేస్తూ.. ‘వచ్చే ఎన్నికల్లో నేను ఎవరికీ ఓటు వేయను. నాకు ఇంకా ఎవరిపై నమ్మకం, ఆశలు లేవు’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ తీర్పు కాగితాలకే పరిమితం.. ‘నా కూతురి చావుకి కారకులైన మృగాళ్లకు సంబంధించిన తీర్పు కాగితాలకే పరిమితమైంది. అంతేకాదు గత ఆరేళ్లుగా నిర్భయ నిధులను సీసీటీవీల కొనుగోలు కోసం వెచ్చించాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం ఆ నిధులను ఏ విధంగా ఉపయోగిస్తుందో కూడా మేము ప్రశ్నిస్తూనే’ ఉన్నామని ఆశాదేవి పేర్కొన్నారు. ‘ఎంతో మంది తల్లిదండ్రులు, అమ్మాయిలు చట్ట పరమైన సలహాల కోసం తనను ఆశ్రయిస్తున్నారని.. ఆ సమయంలో ఆరేళ్లుగా తన కూతురు కోసం తానెలా పోరాడానో వారికి చెప్పగలుగుతున్నానే తప్ప.. కానీ పూర్తి న్యాయం జరిగినట్లు నాకు అనిపించడం లేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలెన్ని వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు.. ‘సరిగ్గా ఏడాది క్రితం అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును మేము స్వాగతించాం. కానీ శిక్ష మాత్రం అమలు కావడం లేదు. న్యాయం జరగడానికి ఇంకెన్నాళ్లు పడుతుందో.. మా కూతురుని కోల్పోయి ఆరేళ్లు గడిచింది. ఇప్పటికీ ఆమె అత్యాచారానికి గురైందని మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సి వస్తుంది’ అంటూ నిర్భయ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాలు ఎన్ని తెచ్చినా కథువా, ఉన్నావ్ వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని నిర్భయ తండ్రి బద్రీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 2017లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా నిర్భయ కేసులో ఇద్దరు దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా తరపు లాయర్లు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ‘ఒక వ్యక్తి మరణించాలా లేదా జీవించాలా అనే అంశం కోర్టు నిర్దారించలేదని.. శిక్ష వల్ల నేరస్థులను చంపగలమే కానీ నేరాన్ని కాదని’ వారు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌ను రిజర్వులో పెట్టింది. 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు బస్సులో నలుగురితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. -
కఠిన చట్టాలే పరిష్కారమా?
అత్యంత అమానుషమైన ఘటనలు చోటు చేసుకున్నప్పుడు సమాజం మొత్తం కదిలిపోతుంది. తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. వాటికి తగ్గట్టుగానే ప్రభు త్వాలు కూడా స్పందిస్తాయి. ఆరేళ్లక్రితం దేశ రాజధాని నగరంలో దుండగులు ఒక యువతిని క్రూరంగా హింసించి సామూహిక అత్యాచారం చేసినప్పుడు ఏ స్థాయిలో నిరసనలు, ఆందోళనలు చెలరేగాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. పర్యవసానంగా నిండా రెండు నెలలు తిరగకుండా ఆనాటి యూపీఏ ప్రభుత్వం లైంగిక నేరాలపై తీవ్ర చర్యలకు వీలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అంతే వేగంగా ఆ తర్వాత దాని స్థానంలో నిర్భయ చట్టం కూడా వచ్చింది. ఇప్పుడు జమ్మూ–కశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో దుండగులు ఎనిమిదేళ్ల బాలికను అపహరించి, ఆరు రోజులపాటు సామూహిక అత్యాచారం జరిపి ఆమె ఊపిరి తీసిన ఉదంతం వెల్లడయ్యాక మరోసారి దేశం అట్టుడికిపోయింది. అన్ని వర్గాల ప్రజలూ ఆ ఉదంతంపై స్పందించారు. దుండగులకు అనుకూలంగా ఆ రాష్ట్రంలోని బీజేపీ మంత్రులు ప్రకటనలివ్వడం, ఆ పార్టీ కార్యకర్తలు జాతీయ జెండాలతో ఊరేగి సంఘీభావం ప్రకటించడంలాంటి చర్యలపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకున్నాకే తీరు మారింది. ఆ వెంబడే బాలికలపై అత్యాచారాలకు పాల్పడే నేరగాళ్లకు యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్ష విధించేందుకు వీలు కల్పిస్తూ, అందుకోసం భారత శిక్షాస్మృతికి, లైంగిక నేరగాళ్లనుంచి పిల్లలను పరిరక్షించడానికుద్దేశించిన పోక్సో చట్టానికి సవరణలు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. అంతకంతకు పెరుగుతున్న లైంగిక నేరాలపై అందరిలో ఆందోళన నెలకొంది. ఏం చేస్తే దీనికి అడ్డుకట్ట పడుతుందన్న అంశంలో ప్రభుత్వాలకు స్పష్టత లేకుండా పోయింది. విపక్షంలో ఉన్నవారు ప్రభుత్వంపై విరుచుకుపడటం, ‘మీ హయాంలో ఇలాంటివి జరగలేదా’ అంటూ అధికార పక్ష నేతలు జవాబివ్వడం రివాజైంది. పౌర సమాజ కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు ఈ అంశంలో ఎన్నోసార్లు ప్రభు త్వాలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కేవలం చట్టాలు చేసినంత మాత్రాన వాటికవే ఏ అన్యాయాన్నయినా రూపుమాపలేవని చెబుతూనే ఉన్నారు. కానీ ఆ వైపుగా పాలకులు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. నిర్భయ చట్టం వచ్చినప్పుడు ఇకపై లైంగిక నేరాలు అదుపులోకొస్తాయని అనేకులు విశ్వసించారు. కానీ అందుకు విరుద్ధంగా అవి పెరుగుతున్నాయి. 2016 నాటి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం మహిళలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు అంతక్రితం కంటే 2.9 శాతం పెరిగాయి. బాలికలపై లైంగిక నేరాలు సైతం గణనీయంగా పెరిగినట్టు ఆ నివేదిక తెల్పింది. 2015తో పోలిస్తే 2016లో ఈ తరహా నేరాలు 82 శాతం ఎక్కువయ్యాయని వివరించింది. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒదిశా, తమిళనాడుల్లో ఈ కేసులు అత్యధికంగా జరిగాయని పేర్కొంది. మెట్రో నగరాల్లో ఈ బెడద ఎక్కువని తెలిపింది. మరోపక్క పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలున్నా అవి నత్తనడకన సాగుతున్నాయని తేల్చింది. నేరాలపై సత్వర దర్యాప్తు, నిందితుల అరెస్టు, పటిష్టమైన సాక్ష్యాధారాల సేకరణ, న్యాయస్థానాల్లో చకచకా విచారణ, త్వరగా వెలువడే తీర్పు నేరగాళ్లను భయకంపితుల్ని చేస్తాయి. నిర్భయ ఉదంతం తర్వాత జస్టిస్ జేఎస్ వర్మ నేతృ త్వంలో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ దేశవ్యాప్తంగా వచ్చిన 80,000 సూచనల్ని అధ్యయనం చేసి, వాటిపై చర్చించి విలువైన సిఫార్సులు చేసింది. అదే స్థాయిలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం వాటిని సమగ్రంగా అధ్యయనం చేసి ఉంటే నిర్భయ చట్టంతోపాటు లైంగిక నేరాల కట్టడి కోసం ప్రత్యేక చర్యలు అమలయ్యేవి. పసివాళ్లపై అత్యాచారాలు నిరోధించడానికై ఆ నేరాలకు ఉరిశిక్ష విధించాలని కోరుతూ మొన్న జనవరిలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైనప్పుడు ‘అన్నిటికీ మరణశిక్షే జవాబు’ అనే ధోరణి సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ అభిప్రాయపడ్డారు. ఇంతలోనే వైఖరి మార్చుకోవడానికి కారణం కథువా ఉదం తంపై జనంలో వెల్లువెత్తిన ఆగ్రహావేశాలను గమనించడం వల్లనేనని సులభంగానే చెప్పవచ్చు. సమాజంలో నిస్సహాయులుగా ఉండేవారిపైనే అత్యధికంగా నేరాలు జరుగుతాయి. వీటిల్లో అణగారిన వర్గాలవారు, మహిళలు, పిల్లలే బాధితులు. వీరి రక్షణకు ఉద్దేశించిన వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటికప్పుడు తనిఖీ నిర్వహించాలని, అలసత్వాన్ని ప్రదర్శించేవారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జస్టిస్ వర్మ కమిటీ సూచించింది. బాధితులపట్ల పోలీసులు, ఆసుపత్రులు ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పింది. అత్యవసర సమయాల్లో స్పందించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించింది. నేరగాళ్లకు రాజకీయ రంగం అండదండ లందించడాన్ని ప్రస్తావించి దాన్ని సరిచేయాలని కోరింది. ఈ సూచనలన్నీ పట్టిం చుకుని ఉంటే... బూతు చిత్రాల పరివ్యాప్తిని అరికట్టకలిగి ఉంటే మహిళలపై, పసివాళ్లపై అత్యాచారాలు ఈ స్థాయిలో పెచ్చరిల్లేవి కాదు. అందుకు భిన్నంగా నేరగాళ్లకు పోలీసులు మొదలుకొని రాజకీయ నేతలవరకూ అందరి అండదండలూ లభిస్తున్నాయి. బాధితుల గోడు వినిపించుకునేవారే కరువవుతున్నారు. వీటిని చక్క దిద్దకుండా కఠిన శిక్షలు అమల్లోకి తీసుకురావడంవల్ల ఎంతవరకూ ప్రయోజం ఉంటుంది? అది మరో నిర్భయ చట్టంలా మారే అవకాశం లేదా? పైగా పసివాళ్లపై అత్యాచారానికి పాల్పడేవారిలో 95 శాతంమంది వారికి తెలిసినవారేనని గణాం కాలు చెబుతున్నాయి. ఆ నేరానికి గరిష్టంగా మరణశిక్ష విధించడం వల్ల బాధిత కుటుంబాలపై ఒత్తిళ్లు ఎక్కువై అసలు కేసే బయటికి రాకుండా చూసే ప్రమాదం లేదా? ఇప్పుడు ఆర్డినెన్స్ ఎటూ తీసుకొచ్చారు. దీని స్థానంలో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడైనా సమగ్ర చర్చ జరిగి ఇతరత్రా నివారణ చర్యలపై దృష్టి పెట్టడం ముఖ్యమన్న ఎరుక కలగాలి. సమాజంలో పతనమవుతున్న విలువల పరి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలేమిటో ఆలోచించాలి. -
అత్యాచార బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు ?
నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకువచ్చినా, అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినా రోజు రోజుకి ఈ పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అత్యాచార బాధితులకు న్యాయం ఎండమావిగానే మిగిలిపోతోంది. కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులతో దేశవ్యాప్తంగా మహిళలు దోషులకు కఠిన శిక్షలు విధించాలని, సత్వర న్యాయం జరిగేలా చూడాలని గళమెత్తుతున్నా పట్టించుకునే వారే లేరు. 2012 నిర్భయ ఘటనతో యావత్ భారతదేశం చలించిపోయింది. యువతీ యువకులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మరో ఆడపిల్లకి ఇంత దుర్భర స్థితి రాకూడదని, అత్యాచారం కేసుల్లో కఠిన శిక్షలు విధించాలంటూ డిమాండ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని కిరాతకమైన కేసుల్లో ఉరిశిక్ష కూడా విధించేలా నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చింది. కేసుల విచారణను కూడా త్వరితగతిని పూర్తి చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చింది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో ఎన్ని చట్టాలు వచ్చినా తమను ఏం చేయలేవన్న ధీమా రేపిస్టుల్లో పెరిగిందనే అభిప్రాయం ఏర్పడుతోంది. 2012 నిర్భయ కేసు తర్వాత దేశంలో అత్యాచార కేసులు 60 శాతం పెరిగితే, చిన్నారులపై రేప్ కేసులు 40 శాతం పెరిగాయి. అయితే 25శాతం కేసుల్లో మాత్రమే అరెస్టులు జరిగాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం 2016 చివరి నాటికి లక్షా 33 వేల అత్యాచార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2012 నాటికి లక్ష కేసులు పెండింగ్‌లో ఉంటే అప్పట్నుంచి పెండింగ్ కేసుల సంఖ్య ప్రతీ ఏడాది 85 శాతం పెరుగుతూ వస్తోంది. 2012, 16 మధ్య నమోదైన వాటిలో మూడో వంతు కేసులు పోలీసు స్టేషన్ పరిధిలోనే నీరు కారిపోతున్నాయి. ఉన్నావ్ వంటి కేసుల్లో ప్రజల నుంచి తీవ్ర నిరసన, ఒత్తిడి రావడం వల్లే కేసు నమోదైంది తప్పితే ఎంత ఘాతుకం జరిగినా పోలీసుల్లో కాస్త కూడా చలనం కనిపించడం లేదు. అత్యాచార కేసులపై రాజకీయ ప్రభావం ఉండడంతో వాటి అతీ గతీ ఎవరికీ పట్టడం లేదు. కేవలం అత్యాచార కేసుల పరిశీలన కోసం దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పోలీసు అధికారుల నియామకానికి కేంద్రం అనుమతినిచ్చింది. అయినా ఆ పోస్టుల్లో నాలుగో వంతు ఖాళీగానే ఉండడంతో చాలా కేసులు కోర్టు వరకూ కూడా చేరడం లేదు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్ కేసుల విచారణకు కనీసం 20 ఏళ్లు పడుతుందని ఒక స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసుల విచారణ ఇంత నత్తనడకన సాగుతూ ఉంటే ఎన్ని రకాలు చట్టాలు తీసుకువచ్చి ప్రయోజనమేముందనే అభిప్రాయం వ్యక్తం సర్వత్రా అవుతోంది. -
పట్టపగలే మరో ప్రేమోన్మాదం!
హైదరాబాద్: రాజధానిలో పట్టపగలే మరో ప్రేమోన్మాదం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులకు దిగిన యువకుడు ఆమె తిరస్కరించడంతో కక్షకట్టాడు. యువతి ఇంట్లోనే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టి పరారయ్యాడు. 60 శాతం కాలిన గాయాలైన ఆమె ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. హైదరాబాద్ గోల్నాక గంగానగర్‌లో నివసించే అర్షియాబేగం భర్త రియాజుద్దీన్ అన్సారీ కొంతకాలం క్రితం మృతిచెందారు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కూలీగా పని చేస్తున్న అర్షియా.. తన కుమార్తె తబస్సుమ్ బేగం (17), ఇద్దరు కుమారుల్ని పోషిస్తోంది. పదో తరగతితో చదువు మానేసి, ఇంట్లోనే ఉంటున్న తబస్సుమ్‌ను గోల్నాక మార్కెట్లో కూరగాయల వ్యాపారైన సోహెల్ ప్రేమ పేరుతో వేధించడం మొదలెట్టాడు. తబస్సుమ్‌కు ఇటీవలే మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఇది తెలుసుకున్న సోహెల్ మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంట్లోకి ప్రవేశించి ప్రేమించాలంటూ వేధించాడు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి, యువతి ఇంట్లోని కిరో సిన్ తీసుకొని ఆమెపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. మంటలు తాళలేకపోయి న ఆమె కేకలు వేసింది. చుట్టుపక్కలవారు మంటలార్పి ‘108’ సాయంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడు సోహెల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. తబస్సుమ్‌కు నిప్పంటించే క్రమంలో అతనికీ గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడి, హత్యాయత్నం చేసిన నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. -
కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్ అరెస్ట్
సాక్షి, కాకినాడ : ఎంటెక్ విద్యార్థినులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్టీయూకే ఐఎస్టీ డైరెక్టర్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ప్రొఫెసర్ కె.బాబులును సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. వైవా పరీక్షల సందర్భంగా ఎంటెక్ ఈసీఈ ప్రథమ సంవత్సరం విద్యార్థినుల పట్ల బాబులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణాలు ఉన్నాయి. కాగా ఈ వ్యవహారంపై వర్శిటీ... ఇప్పటికే ప్రొఫెసర్ బాబులుపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. ప్రొఫెసర్ బాబులుపై విద్యార్థులు ఇచ్చిన లేఖ ఆధారంగా రిజిస్ట్రార్ సుబ్బారావు కాకినాడ సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దీనిపై 254, 254ఎ, 509 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు అయ్యాయి. ఇవాళ ప్రొఫెసర్ బాబులును అదుపులోకి తీసుకున్నారు. -
ఇంత ఘోరమా!
నిర్భయ చట్టంలాంటి కఠినమైన చట్టం తీసుకొచ్చినా దేశంలో మహిళలపై అఘా యిత్యాలు ఎందుకు ఆగటం లేదో తెలియాలంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) ఉదంతాన్ని చూడాలి. ఆ విశ్వవిద్యాలయం గత మూడు నాలుగు రోజులుగా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ ఆందోళనకు దారితీసిన ఉదంతాన్ని, దానిపై యూనివర్సిటీ స్పందననూ గమనిస్తే దిగ్భ్రమ కలుగుతుంది. ఆ ప్రాంగణంలో ఒక విద్యార్థినిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన దుండగులను అరెస్టు చేయాలని, భద్రత కట్టుదిట్టం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇందులో అసహజమైనదీ, విపరీతమైనదీ ఏం లేదు. కానీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జీసీ త్రిపాఠీకి ఇదంతా సహించలేని అంశమైంది. ఎందుకంటే ప్రధాని నరేంద్రమోదీ అదే సమయంలో నగరంలో పర్యటిస్తున్నారు. అందుకే విద్యార్థులపై ఆయనగారు కన్నెర్రజేశారు. ఆందోళన చేస్తున్న పిల్లలపై లాఠీలు విరిగాయి. బాష్పవాయుగో ళాలు ప్రయోగించారు. దుర్భాషలాడారు. మగపోలీసులే విద్యార్థినులను ఈడ్చిపారే శారు. యూనివర్సిటీ పరిస్థితులు సరిగా లేవని, ఇక్కడ ఆడపిల్లలకు భద్రత లేదని చెప్పడానికి వెళ్తే ‘అంతే...అలాగే ఉంటుంది. ఏం చేసుకుంటారో చేసుకోండ’న్నట్టు యూనివర్సిటీ అధికారులు వ్యవహరించారు. వైస్ చాన్సలర్ త్రిపాఠీ తీరు తిన్నగా ఉంటే ఇంత ఉద్రిక్తత ఏర్పడేది కాదు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కొందరు దుండగులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేయడానికొచ్చిన విద్యార్థినికి... జరిగింది మర్చిపోవడం మంచిదని హితబోధ చేయడమే కాదు, సాయంత్రం 6 తర్వాత ఆడపిల్లలు బయటికి ఎందుకొస్తారని ఆయన ప్రశ్నించారు. ‘ఎంతైనా మగపిల్లలు మగపిల్లలే, మీరు వారిని అనుకరించే ప్రయత్నం ఎందుకు చేస్తార’ని కూడా అడిగారట. బయటి సమాజంతో పోలిస్తే విశ్వవిద్యాలయం ఎన్నో రెట్లు ఉన్నత స్థితిలో ఉండాలి. అది కేవలం పిల్లలకు చదువు చెప్పే పాఠశాలనో, కళాశాలనో కాదు. అక్కడుండే విద్యార్థినీవిద్యార్థుల మేధకు పదునుబెట్టి, కొత్త ఆలోచనలకు స్ఫూర్తి నిచ్చి, వారి సృజనాత్మకతను వెలికితీయాల్సిన అద్భుత కేంద్రం. కానీ బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థితిగతులు బయటి సమాజంతో పోలిస్తే మరింత అధ్వా న్నంగా ఉన్నాయని అక్కడ వరసబెట్టి జరగుతున్న ఉదంతాలను గమనిస్తే అర్ధమ వుతోంది. మహిళల విషయంలో ఏదైనా జరిగిందంటే బయటి సమాజంలో కనీసం నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛయినా ఉంటుంది. మహిళలు ఫలానావిధంగా ఉంటే ఇవి జరగబోవని ఏ నాయకుడైనా నోరు పారేసుకుంటే అలాంటివారికి వెనువెంటనే చీవాట్లు పడతాయి. ‘నా ఉద్దేశం అది కాదం’టూ ఆ నాయకులు పలాయనం చిత్త గించక తప్పదు. కానీ బాధిత విద్యార్థినికి హితబోధ చేసిన వైస్ చాన్సలర్ తన తప్పు సరిదిద్దుకోలేదు సరిగదా ప్రశ్నించిన విద్యార్థినీవిద్యార్థుల సంగతి చూడమని పోలీసులకు అప్పగించారు. అంతేకాదు... ఆందోళనలో పాల్గొన్నారని ఆరోపిస్తూ వేయిమందికిపైగా విద్యార్థినీవిద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ప్రాంగణంలోని విద్యార్థులను బయటికి రాకుండా చూసి వెలుపల జైలు బోర్డు తగి లిస్తే అక్కడ నెలకొన్న దుస్థితికి చక్కగా అతుకుతుంది. బీహెచ్‌యూ దేశంలోనే మూడో అతి పెద్ద యూనివర్సిటీ. ఎంతో చరిత్రగలది. అలాంటి యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి వారిని శాంతింపజేయాలన్న స్పృహే వైస్ చాన్సలర్‌కు లేకపోయింది. బీహెచ్‌యూలో ఏం జరిగిందో, ఏం జరుగుతున్నదో తెలియనంత అయోమ యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని అక్కడి పరిణామాలు రుజువు చేస్తున్నాయి. విశ్వవిద్యాలయంలో వెల్లువెత్తిన నిరసన యాదృచ్ఛికంగా ఇప్పటికిప్పుడు పెల్లుబి కింది కాదు. అక్కడ లైంగిక వేధింపులు ఎన్నెళ్లుగానో రివాజుగా మారాయి. విద్యార్థి నుల ఫిర్యాదులను స్వీకరించి చర్య తీసుకోవాల్సిన విభాగం ఎక్కడుందో, అసలు ఉందో లేదో ఎవరికీ తెలియదు. చీకటి పడితే బయటికెళ్లొద్దని ఆడపిల్లలకు చెప్పడం తప్ప వారి హాస్టళ్ల వద్ద చక్కర్లు కొడుతూ అసభ్యంగా ప్రవర్తించే రౌడీ మూకలపై చర్యలుండవు. కనీసం సీసీ కెమెరాలనైనా ఏర్పాటు చేయమని కోరుతుంటే అలా ఉన్నంత మాత్రాన వేధింపులుండవన్న గ్యారెంటీ ఏమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రాంగణంలో క్రమశిక్షణ వ్యవహారాలు చూసే మహిళా ప్రొఫెసర్ ఒకరు విద్యార్థినుల సంగతలా ఉంచి, తమపైనే పోకిరీ మూకలు రెచ్చిపోతుంటాయని చెప్పా రంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో ఊహించుకోవచ్చు. యూనివర్సిటీలు చాన్నాళ్లుగా దీనస్థితిలో ఉంటున్నాయి. బయటి సమా జంలాగే అక్కడకూడా ఆడ, మగ వివక్ష ఉంటున్నది. అక్కడ కులజాడ్యం రాజ్యమే లుతున్నది. ప్రశ్నించడాన్ని అసలే సహించని తత్వం పెరుగుతున్నది. మానవ నాగరికత అభివృద్ధి చెందే క్రమంలో విశ్వవిద్యాలయ భావన అంకురించింది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో ప్లేటో, అరిస్టాటిల్ నడిపిన విశ్వవిద్యాలయాలు, అయిదో శతాబ్దంనాటి మన నలందా విశ్వవిద్యాలయం ఆధునిక విశ్వవిద్యాలయా లకు మాతృకలు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించి, వారిని ఉన్న తులుగా తీర్చిదిద్ది వివిధ రంగాల్లో సమాజ ఉన్నతికి తోడ్పడగల మెరికలను తయారు చేయడం వాటి మౌలిక ఉద్దేశం. కానీ ఇప్పుడంతా తలకిందులైంది. పాల కపక్షాల దయతో వైస్‌చాన్సలర్ పదవులకు ఎగబాకడం, అక్కడ కర్రపెత్తనం చేస్తూ సమర్థులన్న పేరు తెచ్చుకోవాలని తహతహలాడటం ఎక్కువైంది. పాలకుల మన సెరిగి మసులుకుంటే చాలు... తమకు తిరుగుండదని భావించేవారు పెరిగారు. అందుకే విశ్వవిద్యాలయాల ప్రమాణాలు పడిపోతున్నాయి. అవి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులతో, కాంట్రాక్టు అధ్యాపకులతో, పనికిరాని పరిశోధనలతో కొరగాకుండా పోతున్నాయి. ఈ స్థితి మారాలి. ప్రధాని ప్రాతినిధ్యంవహించే నియోజకవర్గంలోని విశ్వవిద్యాలయమే ఇన్ని అరాచకాలతో, ఇంత అశాంతితో కొనసాగుతున్నదంటే సిగ్గుచేటు. బీహెచ్‌యూను ప్రక్షాళన చేసి దాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి అవ సరమైన చర్యలు తీసుకోవడం తక్షణావసరమని గుర్తించాలి. -
నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదు
ఎమ్మిగనూరురూరల్ : మండల పరిధిలోని మల్కాపురం గ్రామానికి చెందిన బోయ తిక్కయ్యపై నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ ఆదివారం రాత్రి తెలిపారు. తిక్కయ్య రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఓ వివాహితపై అత్యాచార యత్నం చేయగా ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
ఉద్యోగిపై లైంగిక వేధింపులు
బసవతారకం ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌పై నిర్భయ కేసు హైదరాబాద్: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్. సత్యనారాయణపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు నిర్భయ చట్టం కింద ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం సంబాల్పూర్కు చెందిన సందీప్త నాయక్(43) బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో క్వాలిటీ అస్యూరెన్స్ డిపార్ట్మెంట్లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆస్పత్రి పక్కనే వసతి గృహంలో ఆమె ఉంటోంది. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్. సత్యనారాయణ తరచూ ఆమెకు ఫోన్ చేసి తన చాంబర్‌కు పిలిపించుకునేవాడు. కమిటీ షెడ్యూల్ క్వాలిటీ రౌండ్స్, ఆడిట్ మెడికల్ రికార్డ్స్ తదితర పనులపై ఆమెకు కాల్చేసేవాడు. తనతో డిన్నర్‌కు రావాలని, సినిమాలకు రావాలని, వారాంతపు సెలవుల్లో బయటకు వెళ్దామంటూ వేధింపులకు గురి చేసేవాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధింపులకు పాల్పడేవాడు. దీనికి ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడంతో మానసికంగా, ఉద్యోగరీత్యా వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఆమె కార్మిక శాఖ అధికారులతోపాటు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సిహెచ్. సత్యనారాయణపై ఐపీసీ సెక్షన్ 354(ఏ), 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అభయమివ్వని నిర్భయ!
చట్టం చేసి చేతులు దులుపుకున్న యంత్రాంగం మహిళలకు అవగాహన కల్పించని వైనం.. అధికారులకూ తెలియని విషయాలెన్నో నీరుగారుతున్న ‘నిర్భయ-2013’ చట్టం మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రవేశపెట్టిన నిర్భయ చట్టంపై సరైన అవగాహన లేక...ఎంతో మంది బాధితులు దాన్ని వినియోగించుకోవడం లేదు. చట్టాన్ని చేసిన యంత్రాంగాలు తమ పని అరుుపోరుుందన్నట్లు చేతులు దులుపుకొన్నారుు. ఫలితంగా ‘నిర్భయ’ అంటే ఏమిటి? అందులో ఏముంది? అది ఎన్ని రకాలుగా రక్షణ ఇస్తుంది? ఎలాంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని ప్రయోగించాలి? అనే అంశాలు మహిళలకే కాదు చివరకు దర్యాప్తు అధికారుకూ తెలియవు. దీంతో నిర్భయ చట్టం ఆశించిన ఫలితాలివ్వట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: కూకట్పల్లి పరిధిలోని శ్రీనివాసకాలనీ మెడికల్ సొసైటీలో నివసించే సుజాత ఇంటి యజమాని వేధింపులు, వ్యవహారశైలి భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ‘నిర్భయ’ చట్టమంటే కేవలం అఘారుుత్యాలకు, లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టమనే భావన అనేక మందిలో ఉంది. ఈ కారణంగానే చట్ట పరిధిలో తమకు ఉన్న రక్షణ విషయం తెలియక అర్ధాంతంరంగా తనువు చాలిస్తున్నారు. సుజాత ఉదంతం ఈ కోణంలోనిదే. ఆమెకు ఎదురైన వేధింపులను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడింది. నిర్భయ చట్టం గురించి పూర్తిగా తెలిసి...ధైర్యంగా ఫిర్యాదు చేసి ఉంటే సుజాతకు న్యాయం జరిగి ఉండేది. ఏదైనా కొత్త చట్టం తీసుకురావడంలో నిందితుల్ని కఠినంగా శిక్షించడానికి అనేది పైకి కనిపించే అంశమైతే...అంతర్గతంగా ఉండే దీని ప్రధాన ఉద్దేశం ఆ తరహా నేరాలు పునరావృతం కాకుండా చూడటం. ‘ఢిల్లీ ఉదంతం’తో కదిలిన కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నిర్భయ చట్టం-2013 ఈ కోణంలో ఆశించిన స్థారుు ఫలితాలు ఇవ్వట్లేదు. దీనిపై అతివలకు పూర్తిస్థారుులో అవగాహన ఉండట్లేదు. ‘నిర్భయ’ ప్రకారం ఆయా నేరాలకు శిక్షలు ఇలా... ►ఉద్దేశపూర్వకంగా యాసిడ్ దాడి చేసి గాయపరిస్తే ఐపీసీ సెక్షన్ 326-ఎ ప్రకారం పదేళ్లు లేదా జీవితఖైదు, జరిమానా ►ఉద్దేశపూర్వకంగా యాసిడ్ దాడికి ప్రయత్నిస్తే ఐపీసీ సెక్షన్ 326-బి ప్రకారం ఐదు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా ► స్త్రీ తత్వానికి భంగం కలిగించేలా, అవమానించేలా, దౌర్జన్యం/బలప్రయోగం చేస్తే ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ఏడాది నుంచి ఐదేళ్ల వరకు శిక్ష, జరిమానా ►లైంగిక వేధింపులు (ఫోన్ ద్వారా అరుునా), అశ్లీల చిత్రాలు చూపించడం చేస్తే ఐపీసీ సెక్షన్ 354-ఎ ప్రకారం మూడేళ్ల జైలు, జరిమానా ►దౌర్జన్యం/బలప్రయోగం ద్వారా వివస్త్రను చేస్తే ఐపీసీ సెక్షన్ 354-బి ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా ► స్త్రీల రహస్యాంగాలను చాటుగా చూసినా, ఫొటోలు తీసినా ఐపీసీ సెక్షన్ 354-సి ప్రకారం ఏడాది నుంచి ఏడేళ్ల జైలు ►దురుద్దేశంతో స్త్రీని భౌతికంగా కానీ, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా కానీ పదేపదే వెంబడిస్తే ఐపీసీ సెక్షన్ 354-డి ప్రకారం ఐదేళ్ల జైలు, జరిమానా ►మహిళల్ని అక్రమ రవాణా చేసి వ్యభిచారం చేరుుస్తే ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం ఏడు నుంచి పదేళ్ల జైలు, జరిమానా ►ఒకరి కంటే ఎక్కువ మందిని/మైనర్‌ను అక్రమ రవాణా చేసి వ్యభిచారం చేరుుస్తే గరిష్టంగా 14 ఏళ్లు లేదా జీవితఖైదు విధిస్తారు ►{పభుత్వ ఉద్యోగి లేదా పోలీసు అధికారి అక్రమ రవాణాకు పాల్పడితే మరణించే వరకు జీవిత ఖైదు ►అక్రమ రవాణాకు గురైన వారిని వ్యభిచారంలోకి దింపితే ఐపీసీ సెక్షన్ 370-ఎ ప్రకారం ఐదు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా ►అత్యాచారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష లేదా చనిపోయే వరకు జీవిత ఖైదు ►అత్యాచారం కారణంగా లేదా గాయపరిచిన కారణంగా సదరు మహిళ చనిపోతే ఐపీసీ 376-ఎ ప్రకారం 20 ఏళ్ల జైలు లేదా మరణించే వరకు జీవిత ఖైదు ►న్యాయబద్ధంగా విడిపోరుు వేరుగా నివసిస్తున్న భార్యను బలాత్కరిస్తే ఐపీసీ సెక్షన్ 376-బి ప్రకారం రెండు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా ►అధికారాన్ని వినియోగించి స్త్రీలను లొంగదీసుకుంటే ఐసీపీ సెక్షన్ 376-సి ప్రకారం ఐదు నుంచి పదేళ్ల జైలు, జరిమానా ►మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 376-డి ప్రకారం 20 ఏళ్ల జైలు లేదా చనిపోయే వరకు జీవితఖైదు ►ఒకటి కంటే ఎక్కువ సార్లు అత్యాచారం చేస్తే ఐపీసీ సెక్షన్ 376-ఇ ప్రకారం మరణించే వరకు జీవితఖైదు ►మహిళల్ని అల్లరిపెట్టి అవమానపరిస్తే..వేధింపులకు గురిచేస్తే ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం మూడేళ్ల జైలు, జరిమానా వాటన్నింటి సమాహారమే... 2012 డిసెంబర్లో దేశ రాజధానిలో చోటు చేసుకున్న నిర్భయ ఉదంతంతో యావత్ భారతావనీ గళం విప్పింది. ఢిల్లీ వీధులు దద్దరిల్లే స్థారుులో జరిగిన ఉద్యమంతో కంగుతిన్న కేంద్ర ప్రభుత్వం ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు వర్మ కమిటీ ఏర్పాటు చేసింది. ఆపై దీన్ని పట్టించుకోని కేంద్రం ఆ కమిటీ సిఫార్సుల్ని పొందు పరచకుండా ‘ఉరి’తో కూడిన ఆర్డినెన్సను అమలులోకి తెచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో పార్లమెంట్లో చర్చించి నిర్భయ చట్టం తీసుకువచ్చింది. 2013 ఏప్రిల్ 2 నుంచి అమలులోకి వచ్చిన ఈ యాక్ట్‌లో ప్రత్యేకించి ఏర్పాటు చేసినవంటూ పెద్దగా లేవు. అప్పటికే ఐపీసీలో ఉన్న యాసిడ్ దాడులు, ఆత్మగౌరవానికి, స్త్రీ తత్వానికి భంగం కలిగించడం, అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి మహిళా సంబంధిత నేరాలను క్రోడీకరించి ఒకే గొడుకు కిందికి తెస్తూ విసృ్తత పరిచింది. ఒక్కో సెక్షన్‌కు ఎ,బి,సి,డి,ఇ... ఇలా క్లాజ్లు చేరుస్తూ విపులీకరించారు. అధికారులకూ తెలియని అంశాలెన్నో... నిర్భయ చట్టంలో ఉన్న కీలకాంశాలపై సాక్షాత్తు పోలీసు అధికారులకే అవగాహన ఉండట్లేదు. ఫలితంగా దీని పరిధిలోకి వచ్చే కేసుల్ని సైతం మూస ధోరణిలోనే పాత సెక్షన్ల కిందే నమోదు చేస్తున్నారు. ‘నిర్భయ’లో ఉన్న మూడు అత్యంత సున్నితాంశాల కారణంగా దీని కింద నమోదయ్యే కేసుల్లో శిక్షలు పడే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో వైద్యుల నివేదిక సైతం న్యాయస్థానంలో ఆధారంగా మారుతుంది. ఈ కేసుల దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. న్యాయస్థానం సైతం దీని విచారణను ఆరు నెలల్లో పూర్తి చేసి తీర్పు ఇవ్వాలి. సాధారణ కేసుల్లో నిందితులకు ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ అనే అంశం కలిసి వచ్చి నిర్దోషులుగా బయటపడుతుంటారు. అరుుతే నిర్భయ చట్టం కింద నమోదైన కేసులకు మాత్రం ఇది వర్తించదు. బాధితురాలు చెప్తోంది కాబట్టి కచ్చితంగా నేరం చేసి ఉంటాడనే అంశం పరిగణలోకి వస్తుంది. సాంకేతికంగా దీన్ని ప్రిజెమ్షన్ అంటారు. వీటివల్ల ఈ కేసుల్లో శిక్షల శాతం పెరిగి మరొకరు నేరం చేయడానికి భయపడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇవి గుర్తుంచుకోండి... మహిళలపై జరుగుతున్న దారుణాల్లో సగం కూడా పోలీసుల వరకు రావడం, రికార్డుల్లోకి ఎక్కడం జరగట్లేదు. కొన్ని సందర్భాల్లో అనేక మంది ‘సుజాత’లుగా మారుతున్నారు. దీనికి పరువు, కుటుంబ నేపథ్యం వంటి ఎన్నో కారణాలు ఉంటున్నారుు. ఓ బాధితురాలి మౌనంతో వస్తున్న ఈ ఉదాసీనత మరింత మంది ముష్కరులు రెచ్చిపోవడానికి ఊతం ఇచ్చినట్లేనని గుర్తుంచుకోండి. ఈ అంశానికి సంబంధించి చట్టం, పోలీసులు బాధితులకు కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించారు. ► మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి పరిధితో సమస్య లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. ► ఎట్టిపరిస్థితుల్లోనూ బాధితుల పేర్లు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారు. ► అవసరమైతే నిందితుల అరెస్టు సంబంధించిన అంశాన్నీ మీడియాకు తెలపరు. ► ఇలాంటి కేసుల్లో వీలున్నంత వరకు మహిళా అధికారిణులకే దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తారు. ► కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీరు పోలీసుస్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా దర్యాప్తు అధికారులు మీ వద్దకే వస్తారు. ► న్యాయస్థానం కూడా బాధితుల్ని ప్రత్యేకంగా పరిగణిస్తుంది. ►వాదోపవాదనలన్నీ ఇన్ కెమెరా (రహస్య పద్దతి)లోనే జరుగుతారుు. -
నిర్భయ చట్టం పక్కా అమలుకు చర్యలు
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి గుంటూరు వెస్ట్: నిర్భయ చట్టం అమలులో ఉన్నా మహిళలపై దాడులు ఎక్కువగానే జరుగుతున్నాయని, చట్టం పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. కమిషన్ ప్రథమ సమావేశం రాజకుమారి అధ్యక్షతన గుంటూరులోని ఒక ప్రైవేట్ హాస్పటల్లో సోమవారం జరిగింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారానికి షీ టీమ్స్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. మహిళా కమిషన్‌కు వెబ్సైట్ రూపొందిస్తామన్నారు. బాల్య వివాహాలతో సమాజం అనారోగ్యంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నచిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. మహిళా కమిషన్‌కు ప్రభుత్వ కార్యాలయం, సిబ్బంది కొరత ఉందని, ఇంకా బడ్జెట్ కేటాయింపు జరగలేదని చెప్పారు. ప్రస్తుతం వికాస్‌నగర్ రెండో లైన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయాన్ని గుంటూరులోనే పెద్ద భవనంలోకి మార్చే ప్రయత్నంలో ఉన్నామని ఆమె వెల్లడించారు. సమావేశంలో మహిళా కమిషన్ సభ్యులు పర్వీన్‌భాను, ఎం మణికుమారి, శ్రీవాణి, డాక్టర్ ఎస్ రాజ్యలక్ష్మి, టీ రమాదేవి, కమిషన్ డైరెక్టర్ సూయెజ్, సెక్రటరీ భాను తదితరులు పాల్గొన్నారు. -
కాకినాడ ఎంపీ తోట పీఏపై నిర్భయ కేసు
కాకినాడ రూరల్: కాకినాడ ఎంపీ తోట నరసింహం పర్సనల్ అసిస్టెంట్(పీఏ) శర్మపై సర్పవరం పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ రాయుడుపాలేనికి చెందిన పేరూరు రాణి అనే మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వినయ్‌ప్రతాప్ బుధవారం తెలిపారు. రాణి రాయుడుపాలెంలో శర్మ బంధువైన రామమోహన్ ఇంట్లో అద్దెకు ఉంటోంది. కొంతకాలంగా ఆమె అద్దె ఇవ్వకపోవడంతో రామమోహన్, శర్మ ఎన్నోసార్లు వెళ్లి ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. ఈ క్రమంలో శర్మ మంగళవారం అక్కడికెళ్లి ఇళ్లు ఖాళీ చేయాలంటూ రాణితో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో రాణి మంగళవారం రాత్రి రాయవరపు సత్యభామ అనే స్వచ్ఛంద సేవకురాలి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
యువతిని వేధించిన యువకులపై నిర్భయ కేసు
తిరుపతి : ప్రేమ పేరుతో వేధించి, యువతిని తీవ్రంగా గాయపరిచిన ఇద్దరు యువకులపై చిత్తూరు జిల్లా తిరుపతిలోని అలిపిరి పోలీసులు మంగళవారం నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. (చదవండి... తిరుపతిలో మృగాళ్ల అకృత్యం) అలిపిరి సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. నగరంలోని కేపీ లేఅవుట్లో నివాసముంటున్న విద్యార్థినిని గతంలో ఆమెతో పాటు చదువుకున్న నవీన్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు. అతని ప్రేమను విద్యార్థిని అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్న నవీన్ తన స్నేహితుడు యశ్వంత్‌తో కలిసి జూన్ 1న మద్యం తాగి..ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థిని, ఆమె స్నేహితురాలిని బైక్‌తో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన్ ముందస్తు ప్రణాళికతోనే వాహనాన్ని ఢీకొట్టాడని దర్యాప్తులో తేలడంతో కేసును అలిపిరి పోలీసు స్టేషనుకు బదిలీ చేశారు. వెన్నెముకకు తీవ్ర గాయమవడంతో బాధితురాలు మంచానికే పరిమితమైంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
తిరుపతిలో మృగాళ్ల అకృత్యం
ప్రేమించలేదని ద్విచక్రవాహనంతో ఢీకొట్టిన వైనం వెన్నుముక గాయాలతో మంచం పట్టిన యువతి ప్రేమోన్మాదులపై నిర్భయ కేసు తిరుపతి క్రైం: తిరుపతిలో మృగాళ్ల రాక్షసకృత్యాలు మితిమీరుతున్నాయి. తనను ప్రేమించలేదని ఓయువకుడు కక్షగట్టి కిరాతకంగా వాహనంతో యువతిని ఢీకొన్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలిపిరి సీఐ శ్రీవానివాసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు నగరంలో ఓ లేఔట్‌కు చెందిన యువతిని ఇంటర్ చదువుతున్న సమయంలో నవీన్ అనే తోటి విద్యార్థి ప్రేమపేరుతో వేధించేవాడు. నవీన్ ఇంటర్ ఫెయిలయ్యాడు. ఈనెల 1న సాయంత్రం బాధితురాలు తన స్నేహితురాలి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా నవీన్, స్నేహితుడు యశ్వంత్‌తో కలసి మద్యం సేవించి తమ వాహనంతో వెనుకనుండి ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు యువతులు కిందపడిపోయారు. తన మాట వినకుంటే చంపేస్తానని బెదిరించాడు. దీన్ని గమనించిన స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. వీరు తప్పించుకుని పారిపోయారు. తీవ్రంగా గాయపడిన బాధిత యువతిని రుయా ఆస్పత్రికి తరలించారు. తర్వాత తప్పతాగి నవీన్, యశ్వంత్ రుయా ఆస్పత్రికి వచ్చారు. వీరిని గమనించిన అమ్మాయి తండ్రి ఆస్పత్రి సిబ్బందికి, అవుట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేయగా తమకు సంబంధం లేదని చేతులెత్తేశారు. దీంతో బాధితురాలి తండ్రి ఈనెల 2వ తేదీన అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో సంఘటనపై ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో బాధితురాలి తండ్రి సోమవారం రాత్రి 9గంటలకు మీడియాకు విషయాన్ని తెలిపారు. దీనిపై పోలీసులను సంప్రదించగా నిందితులపైముందు రోడ్డు ప్రమాదం కేసు పెట్టి ఈనెల 6నే అరెస్ట్ చేశామని, అనంతరం నిర్భయకేసు నమోదు చేశామని చెబుతున్నారు. బాధితురాలికి వెన్నుముక తీవ్రంగా గాయపడంతో మంచానికే పరిమితమైంది. -
చెల్లెమ్మా అంటూనే..
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... ఎన్టీఆర్నగర్కు చెందిన బాలిక (12) సమీపంలో ఉండే పెద్దమ్మ ఇంటికి వెళ్తుండేది. అదే కాలనీలో నివసించే ఆంజనేయులు అనే యువకుడు ఆమెను చెల్లి అని పిలుస్తూ మాట్లాడుతుండేవాడు. ఆ చనువుతోనే బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె అరవడంతో ఆంజనేయులు అక్కడి నుంచి పారిపోయాడు. జరిగిన విషయాన్ని తెలపడంతో శుక్రవారం కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆంజనేయులుపై నిర్భయ కేసుతో పాటు బాలలపై లైంగిక నేరాల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త మీద కూడా నిర్భయ కేసు పెట్టవచ్చు!
లీగల్ కౌన్సెలింగ్ మా పెళ్లయ్యి సంవత్సరం దాటింది. మాది పెద్దలు కుదిర్చిన సంబంధమే. నా భర్తకు నాపై చాలా అనుమానం. ప్రతిరోజూ నా సెల్‌ఫోన్ చెక్ చేస్తాడు. నేను ఎవరికి కాల్ చేశానో వారందరికీ రీ కాల్ చేస్తాడు. వారెవరో, నాకెలా పరిచయమో కనుక్కుంటాడు. ఇక వాళ్లు మగవాళ్లయితే వారితో అక్రమ సంబంధం అంటగట్టి నన్ను విపరీతంగా తిడతాడు. ఆడవాళ్లయితే వారి క్యారక్టర్ మంచిది కాదని, మాట్లాడవద్దని కట్టడి చేస్తాడు. ఎప్పుడు తీశాడో తెలీదు కానీ, నేను దుస్తులు మార్చుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు వీడియోలు తీసి, వాటిని నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు. ఇక నన్ను సెక్స్‌పరంగా కూడా విపరీతంగా హింసిస్తున్నాడు. అన్నట్టు ఈ దుర్మార్గుడికి మా వాళ్లు కట్నకానుకల కింద 20 లక్షల దాకా ముట్టచెప్పారు. నేను ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్నయినా, ఉద్యోగం చెయ్యనివ్వట్లేదు. ఈ శాడిస్ట్ భర్తతో కాపురం చేయలేక నాలుగు నెలల క్రితం పుట్టింటికి వచ్చాను. నాపై యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు. నేను ఏం చేయాలి? - అరుణ, జహీరాబాద్ మీరు బాగా చదువుకున్నవారయి ఉండీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా? మొదట మీరు వీడియోల గురించి, నెట్లో పెడతాననే బెదిరింపుల గురించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. వారు వెంటనే చర్య తీసుకుంటారు. తర్వాత, మీ కాళ్లమీద మీరు నిలబడేందుకు వీలుగా ఏదయినా ఉద్యోగం చూసుకోండి. ఇక రెండవ విషయం మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి 498 ఎ కేస్ వేయండి. ఫిర్యాదును వివరంగానూ చాలా జాగ్రత్తగానూ రాయండి. ఇంకా ఓపిక ఉంటే (ఉండాలి కూడా) డొమెస్టిక్ వయొలెన్స్ కేస్ వేసి, రక్షణ ఉత్తర్వులు పొందండి. ముందు ఈ కేసులన్నీ నంబర్ అయి, నోటీసులు వెళ్తే దెబ్బకు దెయ్యం వదులుతుంది. నిర్భయ చట్టం కింద కూడా బుక్ అయ్యే అవకాశం ఉంది. మీ వారికి మీ వాళ్లు కట్నంగా ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి వస్తాయి. ఇందుకు మీ తలిదండ్రుల సహకారం చాలా అవసరం. నా వివాహమై ఐదేళ్లయింది. నాకు ఒక బాబు. పెళ్లినాటికి మా వారు దుబాయిలో ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లి కాగానే నన్ను అక్కడికి తీసుకెళ్లారు. నేను కన్సీవ్ అయ్యాను. డెలివరీకి ఇండియా వచ్చాను. బాబుకు 6 నెలలు రాగానే ఆయన వచ్చి చూసి వెళ్లారు. వాడికి ఏడాది నిండగానే వచ్చి మమ్మల్ని దుబాయికి తీసుకెళతానన్నారు. అంతా సజావుగా ఉందని అనుకునేలోగా మా వారు తీవ్ర అనారోగ్యంతో మరణించారు. అతను చేసేది చాలా చిన్న ఉద్యోగం కావడం వల్ల మాకు పెద్దగా ఆర్థిక సాయం ఏమీ అందలేదు. అయితే మా అత్తమామలు బాగా ఉన్నవాళ్లు. స్థిరచరాస్తులు చాలా ఉన్నాయి. మా వారి మరణం తర్వాత నన్నూ, బాబునూ ఆదరించకపోగా, బయటికి గెంటి వేశారు. నేను పెద్దగా చదువుకోలేదు. పైగా బాబు చిన్నవాడు. ఇప్పట్లో ఏ పనీ చేయగలిగే పరిస్థితులు లేవు. మా వారికి రావలసిన ఆస్తిలో నాకూ, బాబుకూ వాటా వస్తుందా? - మానస, రాజమండ్రి తప్పకుండా వస్తుంది. చనిపోయిన మీ వారికి తండ్రి ఆస్తిలో చట్టప్రకారం ఎంత ఆస్తి రావాలోఅంత వాటా మీకు వస్తుంది. ఒక వితంతువైన కోడలికి మెయింటెనెన్స్ ఇవ్వవలసిన బాధ్యత చట్టప్రకారం మీ మామగారిదే. మీకు, బాబుకు మెయింటెనెన్స్ వస్తుంది. మీరు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించి ప్రీ లిటిగేషన్ కేస్ (పిఎల్సీ) వేయండి. దీనికి ఖర్చులేం ఉండవు. మీ మామగారిని పిలిపించి (నోటీసుల ద్వారా) మీ విషయం సెటిల్ చేస్తారు. వినకుంటే కేసును కోర్టుకు పంపుతారు. మేడమ్, ఇటీవలే నేను ఎంబిఏ పూర్తి చేశాను. అయితే నేను ఫస్ట్ ఇయర్లో ఉండగా నా క్లాస్మేట్ రాఘవను ప్రేమించాను. అతనూ నన్ను ఇష్టపడ్డాడు. మా కులాలు వేరు కావడం వల్ల పెద్దలు అంగీకరించరని తెలుసు. అందుకని మేము రహస్యంగా వివాహం చేసుకోవాలనుకున్నాము. కొందరు మిత్రుల సమక్షంలో దండలు మార్చుకున్నాము. సంప్రదాయబద్ధంగా మంగళసూత్రం కూడా కట్టాడు. స్నేహితులంతా దాన్ని వీడియో కూడా తీశారు. మా పేరెంట్స్‌కు ఈ విషయాన్ని చెప్పకుండా దాచాము. ఎవరి హాస్టల్లో వాళ్లం ఉంటూ, అప్పుడప్పుడు కలుసుకునేవాళ్లం. ఒక రూమ్ అద్దెకు తీసుకుని అందులో గడిపేవాళ్లం. ఓనర్స్ కూడా పక్కనే ఉండేవాళ్లు. ఇలా సంవత్సరం గడిచింది. మా చదువులైపోయాయి. మధ్యలో కన్సీవ్ అవడం, తనే దగ్గరుండి అబార్షన్ చేయించడం జరిగింది. తనకు మంచి ఉద్యోగం దొరికింది. అయితే అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. నాకూ మొన్ననే ఉద్యోగం వచ్చింది. ఇపుడు నా భర్త వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు. మా వివాహం గురించి పెద్దలకు తెలియదు. ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. - రాగిణి, హైదరాబాద్ మీరు చేసింది తప్పు. అంతేకాకుండా మోసపోయారు కూడా. ఎవరినైనా ఈరోజుల్లో ఇలాంటి పెళ్ళిళ్లు చేసుకుంటారా? ఒకవేళ అంత అవసరమైతే రిజిస్టర్ పెళ్లి ఉండనే ఉంది కదాఐ. కాకుంటే మీరు అతని భార్య అనే ఆధారాలు మీ వద్ద చాలు ఉన్నాయి. ఫొటోలు, వీడియోలూ, స్నేహితుల సాక్ష్యాలు పనికి వస్తాయి. మీ ఓనర్స్ కూడా మీరు ఆ రూమ్‌కి ఒక సంవత్సరం పాటు వస్తూ, వెళుతూ ఉన్నారని చెబుతారు. హాస్పిటల్లో కూడా మీవారు సంతకం చేసే ఉంటారు కదా! ఇక మీవారు వివాహాన్ని నిరాకరించలేరు. కాదనలేరు. మీరు వెంటనే మీ తలిదండ్రులను సంప్రదించి ఈ విషయాలు వివరించండి. మీ మిత్రులను, పేరెంట్స్‌ను తోడు తీసుకుని వెళ్లండి. వారు అర్థం చేసుకుని ఆశీర్వదిస్తే మంచిది. లేదంటే క్రిమినల్ కేసు పెట్టొచ్చు. చీటింగ్, నమ్మకద్రోహం, బైగమీ మొదలైన కేసులు పెట్టవచ్చు. రెండో వివాహం చేసుకోకుండా కోర్టునుండి ఇంజన్క్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఏది ఏమైనా ఇలాంటి రహస్యపు పెళ్లిళ్లు అనేక అనర్థాలకు దారితీస్తాయి. - ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
బాలికపై అత్యాచారం
- నిందితుడిపై నిర్భయ చట్టం టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడిపై నిర్భయ కేసు నమోదు చేసిన సంఘటన టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి పంచాయతీలో గురువారం రాత్రి జరిగింది. బొమ్మనపల్లి పంచాయతీ బిల్లుడుతండా గ్రామానికి చెందిన బానోతు వీరన్న(20) అదే గ్రామానికి చెందిన బాలిక(15)పై గురువారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితరాలు ఫిర్యాదు మేరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
యువకుడిపై నిర్భయ కేసు
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన బాలిక(14) మంగళవారం రాత్రి ఇంట్లో ఉండగా గ్రామానికి చెందిన ఒక యువకుడు ఆమె చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలు తల్లిదండ్రులతో కలసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై అట్రాసిటీ, నిర్భయ కేసులు నమోదు చేశారు. -
సీఐడీ సీఐపై నిర్భయ కేసు
కరీంనగర్: విచారణ పేరుతో ఓ మహిళా ఉద్యోగిని వేధించిన సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. దయాకర్ రెడ్డి తరచూ ఫోన్లు చేయడంతో పాటు అభ్యంతరకర మెసేజ్‌లు పంపి అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌లోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఈ మహిళ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. భర్త చనిపోవడంతో కుమారుడితో కలిసి నివాసముంటున్నారు. అక్రమ ఫైనాన్స్ కేసులో అరెస్ట్ అయిన ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసు దర్యాప్తులో భాగంగా అతడి బంధువులను సీఐడీ అధికారులు కరీంనగర్ హెడ్‌క్వార్టర్స్‌కు పిలిపించి విచారణ చేశారు. బాధిత మహిళ కూడా మోహన్‌రెడ్డి బంధువు కావడంతో ఆమెను కూడా విచారణకు పిలిపించారు. విచారణ బృందంలో సభ్యుడిగా ఉన్న సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డి మహిళ ఫొన్ నంబర్ తీసుకున్నాడు. తర్వాత నుంచి తరచూ ఫోన్లు చేస్తూ పరిచయం పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఎదైనా అంటే విచారణలో భాగమే అంటూ ఇబ్బంది పెట్టేవాడు. కొద్ది రోజుల తర్వాత రోజుకు వందలాది కాల్స్ చేయడం, వాట్సప్ మెసేజ్‌లు పంపడం మొదలు పెట్టాడు. మూడు నెలలుగా నిరంతరంగా వచ్చి పడుతున్న మెసేజ్‌లతో మహిళ చాలా ఇబ్బంది పడింది. ఫోన్ చేయొద్దని, మెసేజ్‌లు పెట్టొద్దని కోరినా సీఐ మారలేదు. అసభ్యకరమైన బొమ్మలతో కూడిన మెసేజ్‌లు బయటకు చెప్పుకోలేని మెసేజ్‌లు పెట్టేవాడు. వారం రోజుల నుంచి సీఐ చేష్టలు శ్రుతిమించడంతో భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దయాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. పోలీసులు సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దయాకర్‌రెడ్డికి చెందిన వాట్సప్ నంబర్లు, మరో ఫొన్ నంబర్‌కు చెందిన పలు వివరాలు, కాల్‌లిస్టు సేకరించారు. బాధిత మహిళకు సెల్ ద్వారా, వాట్సప్ నంబర్ ద్వారా పంపించిన మెసేజ్‌లకు సంబంధించిన డేటా సేకరించారు. సీఐడీ విభాగంలో సీఐగా పని చేస్తూ విచారణకు వచ్చిన మహిళను వేధించడంపై మహిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
పోలీసుల ముందు హాజరైన రావెల సుశీల్
ఓ మైనారిటీ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి నిర్భయ చట్టం కింద కేసులో బుక్కయిన మంత్రి రావెల కిశోర్ తనయుడు సుశీల్, అతని కారు డ్రైవర్ రమేష్‌లు ఆదివారం బంజారాహిల్స్ పోలీసుల ముందు హాజరయ్యారు. షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉన్న వీరు కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేశారు. ఈ నెల 3న బంజారాహిల్స్ అంబేద్కర్ నగర్లో ఓ మహిళా టీచర్ నడుచుకుంటూ వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న రావెల సుశీల్ ఆమె పట్ల అసభ్యకరంగా వ్యవహరించి, కారులో లాగేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
9నెలల చిన్నారిపై లైంగికదాడికి యత్నం
నిర్భయ చట్టం కింద కేసు నమోదు రిమాండ్‌కు నిందితుడి తరలింపు వెల్దండ : కామంతో ఉన్న అతడికి కన్నుమిన్ను కానరాలేదు. తొమ్మిది నెలల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. ఈ ఘటన వెల్దండలో బుధవారం వెలుగులోకి వచ్చింది. నింది తుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కల్వకుర్తి సీఐ వెంకట్, ఎస్ఐ జానకీరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తన తొమ్మిది నెలల చిన్నారికి తల్లి స్నానం చేయించి ఉయ్యాలలో పడుకోబెట్టింది. అనంతరం అరుబయట దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. అంతకుముందు పాప తండ్రి, బంధువు అయిన 26ఏళ్ల లక్ష్మణ్ (పాపకు వరుసకు మామ) ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అనంతరం తండ్రి పనిమీద బయటకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో లక్ష్మణ్ ఉయ్యాలలో ఉన్న పాపను బయటకు తీసి లైంగికదాడికి యత్నించాడు. పాపకు రక్తస్రావం కావడంతో గుడ్డతో తుడిచి పడుకోబెట్టి వెళ్లిపోయాడు. పాప ఏడుపును గమనించిన తల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తస్రావం కావడంతో వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించగా లైంగికదాడి యత్నానికి గురైనట్లు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులకు లక్ష్మణ్‌పై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు..సైకోగా అనుమానం నిందితుడు లక్ష్మణ్ది తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామం. అతని అమ్మమ్మ గ్రామం వెల్దండ. ఆమెకు జ్వరం రావడంతో నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. అయితే ఇతనికి..పాప తండ్రి బావ అవుతాడు. దీంతో రోజూ వీరి ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు. లక్ష్మణ్‌కు పెళ్లి అయింది. ఇతని చేష్టలతో విసిగిపోయిన భార్య వదిలిపెట్టి పోయినట్లు బంధువులు తెలిపారు. సైకోగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తి సీఐ విచారణ కల్వకుర్తి సీఐ వెంకట్ బుధవారం సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలి త ల్లిదండ్రుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
స్నానం చేస్తుండగా మహిళను వీడియోతీశారు..
అమలాపురం: తూర్పుగోదావరి జిల్లాలో మరో కీచకపర్వం చోటుచేసుకుంది. కన్నూమిన్నూకానని ముగ్గురు యువకులు.. ఓ వివాహిత స్నానం చేస్తుండగా మొబైల్ ఫోన్ లో వీడియో తీసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఆమె గుర్తించి కేకలు వేయడంతో పరారయ్యాయి. అయితే మరో వ్యక్తి ఆ దుండగులను గుర్తించడంతో వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదయింది. అమలాపురం పట్టణంలోని వానపల్లివారి వీధిలో శనివారం జరిగిన ఈ సంఘటనలో నిందితులను బాధితురాలి సోదరి గుర్తించంది. బాత్ రూమ్ లో తన సోదరి కేకలు వేయగానే తాను పరుగున వెళ్లానని.. అప్పుడే తమ కాలనీకే చెందిన యెరుబండి బాలాజి, వెంకటగిరి బాబు, బుదిరెడ్డి రాజశేఖర్ లు పారిపోతూ కనిపించారని పోలీసులకు చెప్పింది. స్థానికుల సహాయంతో పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ యువకులు పారిపోయారు. ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన పట్టణ సీఐ వైఆర్కే. శ్రీనివాస్.. నిందితులపై నిర్భయ కేసు (సెక్షన్-451, 509, 354(సీ), 354(డీ)) నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. -
పరిచయస్తులే కీచకులు
కామపిశాచులు రెచ్చిపోతుండటంతో బాలికలతో పాటు మహిళలకు రక్షణ కొరవడుతోంది. కీచకులు అభం శుభం ఎరుగని చిన్నారులనూ బలితీసుకొంటున్నారు. నిర్భయ, పోక్సాయాక్ట్ వంటి చట్టాలు ఉన్నా.. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దీంతో ఒంటరిగా వెళ్లడానికి మహిళలే కాదు బాలికలూ భయపడుతున్నారు. పరిచయస్తులు తమ శరీరాన్ని తడమడం, ఏదో చేయడాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. నగరంలో కొన్నేళ్లుగా ఈ విష సంస్కృతి క్రమంగా పెరుగుతోంది. నెల్లూరు (క్రైమ్) : జిల్లాలో ఆరు నెలల వ్యవధిలో సుమారు 38 లైంగిక దాడులు జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మరోవైపు అనేక మంది లైంగిక వేధింపులకు గురవుతున్నా పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసుల వరకు రావడం లేదు. ఇలా అనేక ఘటనలు బాహ్య ప్రపంచంలోకి రాకుండానే మరుగునపడి పోతున్నాయి. కన్నతండ్రులే కడుపున పుట్టిన బిడ్డలపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటనలు సభ్య సమాజాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. బాలల రక్షణ, సంరక్షణ కోసం పని చేయాల్సిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు సంఘటన జరిగిన అనంతరం హడావుడితోనే సరిపెట్టుకుటున్నారు. పలు సంఘటనలు.. ఈ ఏడాది జనవరి 27న నగరంలోని చాణుక్యపురి వద్ద ఐదేళ్ల చిన్నారిపై శ్రీనివాసులు అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 4న వెంకటాచలం మండలంలో గిరిజన బాలికపై లైంగికదాడి యత్నం జరిగింది. ఫిబ్రవరి 6న నగరంలోని సిఆర్పిడొంకలో మూడేళ్ల చిన్నారిపై శేఖర్ అనే వ్యక్తి లైంగికదాడికి యత్నించాడు. ఫిబ్రవరి 8న కొండాపురం మండలంలోని ఓ గ్రామంలో గడ్డికోసుకొనేందుకు వెళ్లిన బాలికపై లైంగికదాడి యత్నం జరిగింది. జూలై 7న వెంగళరావనగర్ ఎన్సీసీ కాలనీకి చెందిన ఓ బాలికను ప్రేమపేరిట సాజిద్ అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆగస్టు 13న నగరంలోని నక్కలోళ్ల సెంటర్‌కు చెందిన నక్కల కన్నా తన అక్క కుమార్తె 13 ఏళ్ల బాలికపై లైంగికదాడి చేసి గర్భవతిని చేశాడు. గతంలో బుచ్చిరెడ్డిపాళెంలో, వెంకటాచలం మండలంలో కన్నతండ్రులే కడుపున పుట్టిన బిడ్డలపై లైంగికదాడి చేశారు. చిన్నారులపైనే ఎందుకు... ఐదేళ్ల వయస్సున్న పిల్లలకు తమను ఇతరులు వేరే భావంతో తాకుతున్నారున్న ఆలోచన రాదు. తల్లిదండ్రులు స్నానం చేయిస్తున్నప్పుడు తాకినట్లుగా ఉందన్న భావనతో వారు మిన్నకుండిపోతున్నారు. ఆరేళ్ల నుంచి ఎనిమిదేళ్ల పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లతో పాటు సెల్ఫోన్లో గేమ్‌లు చూపిస్తే చాలు పరిసరాలనే మర్చిపోతున్నారు. ఆ సమయంలో దుర్మార్గులు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా అర్థం చేసుకోవడం లేదు. ఐదేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లల్లో కొందరు టీచర్లు, ఇంటిపక్కన ఉన్నవారు శరీరాన్ని గట్టిగా వత్తినప్పుడు మాత్రమే ఏడుస్తున్నారు. ఈవిషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం లేదు. పదేళ్ల నుంచి పన్నెండేళ్ల పిల్లపై టీచర్లు, పరిచయస్తులు, ఆటోడ్రైవర్లు మీదపడినా వారు పొరపాటున పడి ఉంటారన్న భావనతో పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. లైంగికదాడికి గురైన కొందరు చిన్నారులు 40 శాతం మంది మాత్రమే తీవ్రంగా భయపడిపోతున్నారు. మిగిలిన వారు ఈ విషయాన్ని కన్నవారికి వివరిస్తున్నారు. పదమూడు, పద్నాలుగేళ్ల విద్యార్థినులు పరిచయస్తులు, టీచర్లు, ఇతరులు తమను లైంగికంగా వేధించే ఉద్దేశంతో తాకినప్పుడు జాగ్రత్త పడుతున్నారు. వారికి ఎవరి స్పర్శ ఎలా ఉంటుందో అర్థం చేసుకునే జ్ఞానం ఉంటుంది. ఫోక్సాయాక్ట్ ఏం చెబుతోందంటే.. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్ (ఫోక్సా) చట్టం ఉంది. నిర్భయ చట్టం కంటే ఇది కఠినమైనది. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 2012లో ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం కింద కేసు నమోదు అయితే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. సామాన్యులకన్నా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే వారికి మరింత ఎక్కువ శిక్షపడేలా ఈ చట్టాన్ని రూపొందించారు. బాలికలు లైంగిక వేధింపులకు గురైతే ఈ కేసులను ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేస్తారు. 18 ఏళ్ల పైబడిన బాధితులకు అండగా నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. ఐపీసీ సెక్షన్ 376తో పాటు ఇతర సెక్షన్ల కింద ఈ కేసులను నమోదు చేస్తారు. -
అసభ్యంగా మాట్లాడి...కటకటాల పాలయ్యారు
నిర్భయ చట్టం కింద ఇరువురికి ఏడు నెలల జైలు విజయనగరం లీగల్: యువతిపై అసభ్యకర వ్యాఖ్య చేసిన ఇరువురు కటకటాల పాలయ్యారు. విజయనగరం జిల్లాలో నిర్భయ చట్టం కింద నమోదైన ఈకేసు తీర్పు శుక్రవారం వెలువడింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం...విజయనగరం పట్టణానికి చెందిన ఓ యువతి తనతల్లిదండ్రులతో గత ఏడాది జూలై 30న జ్యూయలరీ షాపునకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడున్న గొలగాన శ్రీను, వారాడ సతీష్‌లు ఆ యువతిని చూసి అసభ్యంగా వ్యాఖ్య చేశారు. ఆమె తల్లిదండ్రులు వారిని నిలదీయగా ఏమైపోయింది ఇప్పుడు అంటూ తగాదాకు దిగారు. దీంతో యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. విచారణ అనంతరం శ్రీను, సతీష్‌లకు ఏడు నెలల జైలుశిక్షతో పాటు చెరో వేయి రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ అదనపు జిల్లా జడ్జి కె.వి.రమణాజీరావు తీర్పు చెప్పారు. 2012లో ఢిల్లీలో జరిగిన సంఘటన తరువాత లైంగిక వేధింపులకు గురి చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు ‘పోక్సా’ (లైంగిక వేధింపుల నుంచి బాలబాలికలకు రక్షణ కల్పించే చట్టం) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఆ చట్టం ప్రకారమే జిల్లాలో తొలితీర్పు వెలువడింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పీపీ మల్లికార్జున్ వాధించారు. -
తేజశ్విని బంధువుల రాస్తారోకో
♦ ప్రత్యేక వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ ♦ నలుగురు నిందితులను అరెస్ట్ చేయాలని పట్టు రేపల్లె : ఇంటర్ విద్యార్థిని బొమ్మిడి తేజశ్విని (16) మృతిపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తేజశ్విని మృతదేహానికి ప్రత్యేక వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించాలని, హత్య చేసిన నాగరాజుతో పాటు మరో ముగ్గురిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్లో బైటాయించి జోరున వర్షంలోనూ రాస్తారోకో నిర్వహించారు. తేజశ్వినికి జరిగిన అన్యాయం వేరొకరికి జరగకుండా హంతకులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. హత్య చేసిన వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు గంట పాటు సాగిన రాస్తారోకోతో ట్రాఫిక్ స్థంభించింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఎం.ఆనందరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంటూరు నుంచి ప్రత్యేక వైద్యులను మధ్యాహ్నానికల్లా రప్పించి తేజశ్విని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందిస్తామని, నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు. అయితే పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యులు సాయంత్రం వరకు రాకపోవటంతో తేజశ్విని కుటుంబ సభ్యులు, బంధువులు మరోమారు ఆందోళణకు సిద్ధమవుతుండటంతో పోలీసులు వారితో చర్చించారు. ఆదివారం ఉదయం వైద్యులు వస్తున్నారని, 9 గంటలకు మృతదేహాన్ని బంధువులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దీంతో బంధువులు శాంతించి ఆందోళనను విరమించారు. -
యువతితో అసభ్య ప్రవర్తన : యువకుడి అరెస్టు
బంజారాహిల్స్ (హైదరాబాద్) : ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల ప్రకారం.. మిజోరం రాష్ట్రానికి చెందిన ఓ యువతి(23) బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లోని ఓ రెస్టారెంట్లో పని చేస్తోంది. ఎప్పటిలానే గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని ఆటోలో బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో దిగి నందినగర్‌లోని తన గదికి నడిచి వెళ్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి నూర్‌నగర్‌కు చెందిన ఎస్కె. మౌలాలి ఆమెను వెంబడిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఒంటరిగా వెళ్తున్న యువతిని అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె భయాందోళనలకు గురై అరవడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై మౌలాలిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడు మౌలాలి పంజగుట్టలోని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో హౌస్‌కీపింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. -
యువతిపై ప్రియుడి హత్యాయత్నం
►దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు ►హత్యాయత్నం, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు గుంటూరు ఈస్ట్ : యువతిపై ఆమె ప్రియుడు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం గుంటూరు నగరంలో తీవ్ర కలకలం రేపింది. లాలాపేట సీఐ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం నల్లచెరువు జీరో లైనులో నివసించే చెంచేటి మణికంఠ నగరంలోని ఓ బంగారు తయారీ షాపులో పనిచేస్తుంటాడు. మణికంఠ తనతో పాటు పదో తరగతి చదివిన నల్లచెరువు 8వలైనుకు చెందిన కారసాల విజయతో గతేడాది ఆగస్టు నెలలో ప్రేమ వ్యవహారం ప్రారంభించాడు. మణికంఠకు అప్పటికే కొత్తపేటకు చెందిన శివపార్వతితో వివాహమై ఒక కుమార్తె కూడా ఉంది. ఈ సంగతి ప్రియురాలు విజయ వద్ద గోప్యంగా ఉంచాడు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కారణంగా కాకుమానులోని మలినేని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విజయ గత సంవత్సరం చదువుమానేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. విజయ తండ్రి రాజు తన కుమార్తె కనిపించకుండా పోయిందని కాకుమాను పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నల్లచెరువుకు సమీపంలోని శ్రీనివాసరావుతోటలో ఇద్దరూ సహజీవనం చేస్తున్న విషయం తెలిసి మణికంఠ భార్య శివపార్వతి ఈనెల 5వ తేదీన కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు మణికంఠ, విజయలను ఇరు కుటుంబాల పెద్దలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి విజయను ఆమె తల్లిదండ్రుల వెంట పంపించారు. ఈనెల 18వ తేదీ రాత్రి మణికంఠ మేడమీద నిద్రిస్తున్న విజయను కలిసేందుకు యత్నించాడు. ఇంట్లోని వారు గమనించి కేకలు వేయడంతో పరారయ్యాడు. తిరిగి శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మేడమీద నిద్రిస్తున్న విజయను లేపి తనతో రావాల్సిందిగా కోరాడు. ఆమె నిరాకరించి ప్రతిఘటించింది. దీంతో కత్తితో విజయపై దాడిచేసి చేతిపై తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. మణికంఠను అబ్దుల్లా అనే వ్యక్తి అడ్డుకోగా అతనిని కూడా గాయపరిచాడు. స్థానికులు అతనిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మణికంఠ బ్యాగులో బట్టలతోపాటు, సుమారు రూ. 2 లక్షల డబ్బు ఉండడాన్ని గుర్తించారు. మణికంఠపై హత్యాయత్నం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
గర్భిణిపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
ఏలూరు అర్బన్ : గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డ వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మంత్రి పీతల సుజాత ఆదేశించారు. ఏలూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏలూరు డీఎస్పీ కెజీవీ సరితతో గర్భిణిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెదపాడు శివారు రామచంద్రపురంలో5 నెలల గర్భిణిపై నలుగురు యువకులు బెదిరించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడడమే కాకుండా సెల్ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఈ ఘటనలో పాల్గొన్న వారందరినీ సాయంత్రంలోగా పట్టుకుని శిక్షించాలని మంత్రి ఆదేశించారు. బాధితురాలికి అన్ని విధాల అండగా ఉంటామని అవసరమైన వైద్యసేవలు అందించి ఆరోగ్యపరంగా ఆ మహిళ తేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. సమాజంలో మహిళలను గౌరవిస్తూ సోదరిలా ఆదరించే పరిస్థితులు నెలకొల్పడానికి పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగించాలని మంత్రి డీఎస్పీని కోరారు. ఈ కేసు పురోగతిలో ఉందని నిందితులను గుర్తించామని త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. -
అత్యాచారం, హత్య కేసులో అధికార పార్టీ మద్దతుదారులు ?
చిత్తూరు : ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అత్యాచారం, ఆపై హత్యకు గురైన దళిత యువతి(18) కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వివరాలు..పెనుమూరు మండలం కలవకుంట పంచాయతీ ఎగువపూనేపల్లె దళితవాడకు చెందిన యువతి శనివారం గ్రామ సమీపంలో మేకలు మేపుతుండగా కొంత మంది దుండగులు ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారు. మృతిరాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కలవకుంటకు చెందిన ఉదయకుమార్ మొదలియార్(23)ను సోమవారం అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే గ్యాంగ్ రేప్ జరిగినప్పటికీ పోలీసులు ఒక్కడిపైనే కేసు నమోదు చేయడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు అధికార పార్టీకి చెందినవారని పోలీసుల విచారణలో తేలడంతో ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. హైదరాబాద్ స్థాయిలో జిల్లా పోలీసులపై ఒత్తిడి పెంచారు. పలువురిని తప్పించి ఈ కేసును నీరుగార్చేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో సిద్ధమైనట్లు సమాచారం. -
బాలికను వేధించిన ఇద్దరిపై ‘నిర్భయ’ కేసు
రంగారెడ్డి జిల్లా : ఓ బాలికను వేధించిన ఇద్దరిపై రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి బుధవారం రిమాండుకు తరలించారు. జవహర్‌నగర్‌లోని మార్వాడిలైన్ కాలనీకి చెందిన బాలిక(14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే కాలనీకి చెందిన భానుగడ్డ తరుణ్‌కుమార్ (22), అతడి స్నేహితుడు కీసర గ్రామానికి చెందిన నిఖిల్(19)లు కొంతకాలంగా బాలికను వేధించసాగారు. తనను ప్రేమించాలని నిఖిల్ నిత్యం విద్యార్థినిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. వేధింపులు తాళలేని బాలిక ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
మళ్లీ అదే దుర్మార్గం
(సాక్షి సంపాదకీయం) దేశ రాజధాని నగరంలో నిర్భయ ఉదంతం చోటు చేసుకుని సరిగ్గా రెండేళ్లవుతున్నది. ఆ సమయంలో వెనువెంటనే రెండు నెలల వ్యవధిలో హడావుడి ఆర్డినెన్స్... అటు తర్వాత నిర్భయ చట్టమూ అమల్లోకి వచ్చాయి. లైంగిక నేరాలకు పాల్పడేవారికి విధించే శిక్షలు కఠినంగా ఉండేలా నిబంధనలు రూపొందించారు. అప్పటినుంచీ ఆ స్థాయి దుర్మార్గం జరిగినట్టు మీడియాలో రాలేదు గనుక ఆ చట్టం ప్రభావం గట్టిగానే ఉన్నదని...అంతా సవ్యంగా సాగుతున్నదని పాలకులు, అధికార యంత్రాంగమూ, పోలీసులు అనుకుని ఉంటారు. కానీ న్యూఢిల్లీలో ఎప్పటిలానే అరాచకం అలముకుని ఉన్నదని, మహిళల భద్రత కోసం అమల్లోకి తెచ్చిన సర్వ వ్యవస్థలూ మొద్దు నిద్రపోతున్నా యని రెండురోజుల క్రితం జరిగిన మరో అత్యాచార ఘటన రుజువుచేసింది. రాత్రి 9గంటల సమయంలో క్యాబ్ ఎక్కిన మహిళ ఆ మహా నగరంలో సురక్షితంగా గమ్యస్థానం చేరుకోలేక పోయిందంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఆమె ఏదో నాసిరకం సర్వీసుకు సంబంధించిన క్యాబ్ ఎక్కలేదు. అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు గడించిన ఉబెర్ సంస్థ మొబైల్ యాప్ ద్వారా ఆమె క్యాబ్ మాట్లాడుకున్నారు. ప్రతి క్యాబ్కూ జీపీఎస్ అనుసంధానమై ఉండాలని, దాని కదలికలను ఎప్పటికప్పుడు గమనించి అవసరమైతే డ్రైవర్‌తో మాట్లాడే వ్యవస్థ 24 గంటలూ పనిచేయాలని నిబంధనలున్నాయి. కానీ అవన్నీ సక్రమంగా అమలవుతున్నాయో, లేదో చూసే నాథుడు లేడు. ఉబెర్ సంస్థ సొంతంగా అమలు చేస్తున్న నిబంధన వేరు. డ్రైవర్ దగ్గరున్న సెల్ఫోన్లో ఉబెర్ యాప్ ఉంటే సరిపోతుంది. దానితో జీపీఎస్ అనుసంధానమై ఉంటుంది. నేర స్వభావం ఉన్న ఏ డ్రైవరైనా తన ఫోన్‌ను స్విచాఫ్ చేస్తే అతని ఆచూకీ తెలిసే అవకాశం లేదు. ఇక ఏ సంస్థ అయినా డ్రైవర్‌ను చేర్చుకునేటపుడు పోలీసుల సాయంతో అతని పూర్వాపరాలను ఆరా తీయాలని కూడా నిబంధన ఉన్నది. అలా ఆరా తీయడం మాట అటుంచి అతనికి ఢిల్లీలో వాహనం నడిపేందుకు అవసరమైన లెసైన్స్ కూడా లేదు. పోలీసుల నుంచి ఒక ధ్రువీకరణ పత్రం తెచ్చుకుంటే చాలు... రెండు గంటల నామమాత్ర శిక్షణనిచ్చి చేర్చుకుంటోంది. ఇదే సంస్థ అమెరికాలో అమలు చేస్తున్న నిబంధన వేరు. పోలీసులిచ్చే నివేదికలకు తోడు తాము సొంతంగా క్యాబ్ డ్రైవర్ల పూర్వాపరాలను తెలుసుకుని, అన్నీ సక్రమంగా ఉన్నవారి సేవలను మాత్రమే వినియోగించుకుంటున్నామని అక్కడి వినియోగదారులకు హామీ ఇస్తోంది. అందుకు అదనంగా మరో డాలర్ చార్జి చేస్తుంది. కానీ, మన దేశం వచ్చేసరికి ఇలాంటి ఏర్పాటు లేదు. ఒకే సంస్థ ఇలా రెండు దేశాల్లో వేర్వేరు ప్రమాణాలను పాటిస్తున్నదంటే ఇక్కడి పౌరుల భద్రతపై ఆ సంస్థకున్న నిర్లక్ష్యం ఏపాటో అర్థమవుతుంది. పైగా తాము క్యాబ్ సర్వీస్ నిర్వాహకులం కాదని...క్యాబ్‌లో వెళ్లదల్చుకున్నవారికి, క్యాబ్ డ్రైవర్లకూ సంధానకర్తలం మాత్రమేనని ఉబెర్ చెబుతోంది. అనుకోని ఘటన ఏదైనా సంభవిస్తే తప్పించుకోవడానికి అన్ని మార్గాలను సిద్ధం చేసుకున్నదని దీన్నిబట్టే అర్థమవుతుంది. కానీ, అర్థంకానిది ఢిల్లీ పోలీసు యంత్రాంగానికే. ఇప్పుడు ఢిల్లీ ఉదంతంలో అరెస్టయిన శివ్‌కుమార్ యాదవ్ పాత నేరస్తుడు. రెండేళ్లక్రితం జరిగిన అత్యాచారం కేసులో అతను నిందితుడు. ఆ కేసులో దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందో, విచారణ ఏ స్థాయిలో ఉందో ఎవరికీ తెలియదు. కనీసం ఢిల్లీ పోలీసులు కూడా దాని సంగతి చెప్పలేకపోతున్నారు. ఆ తర్వాత ఎంతమందిపై ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడో తెలియదు. ఎందుకంటే బాధితులు ధైర్యంగా బయటకొచ్చి చెప్పినప్పుడు మాత్రమే ఈ తరహా కేసులు బయటి ప్రపంచానికి తెలుస్తాయి. ఢిల్లీ పోలీసులు ఇచ్చినట్టు చెబుతున్న ధ్రువీకరణపత్రం శివ్‌కుమార్ యాదవ్ సత్ప్రవర్తనగలవాడని చెబుతోంది. అయితే, అది తాము ఇచ్చింది కాదని, ఫోర్జరీదని పోలీసులంటున్నారు. నిర్భయ ఉదంతం జరిగిన ఢిల్లీ మహానగరంలోనే నేర స్వభావం గల ఒక వ్యక్తి అసలైనదో, ఫోర్జరీదో ధ్రువీకరణ పత్రం తెచ్చుకుని ఒక సంస్థ పేరిట ఇన్నాళ్లపాటు క్యాబ్‌ను నడిపాడంటే సమస్త యంత్రాంగమూ ఎంత నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదో తెలుస్తుంది. అటు పోలీసులుగానీ, ఇటు రవాణా విభాగంగానీ జవాబుదారీ తనంతో వ్యవహరించివుంటే... బాధ్యతను గుర్తెరిగితే ఈ ఘటన జరిగేది కాదు. నిర్భయ ఉదంతం అనంతరం ఏర్పాటుచేసిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ మహిళల భద్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పింది. ముఖ్యంగా వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిర్ణీత కాలవ్యవధిలో తనిఖీ చేస్తుండాలని, అలసత్వాన్ని ప్రదర్శించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. కానీ, ఏ స్థాయిలోనూ దాన్ని అమలు చేసిన దాఖలా లేదు. నిర్భయ ఘటన జరిగినప్పుడు దేశవ్యాప్తంగా వేలాదిమంది నిరసన ప్రదర్శనలు జరిపారు. ఢిల్లీలో అయితే అలాంటి ప్రదర్శనలు రోజుల తరబడి సాగాయి. కానీ అవన్నీ ఢిల్లీలో ఒక పార్టీని అధికారం నుంచి దించడానికి ఉపయోగపడినట్టుగా అధికార యంత్రాంగం ఆలోచనా సరళిని మార్చడానికి తోడ్పడలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా మహిళల భద్రత చుట్టూ తిరిగాయి. ఇప్పుడు మరోసారి ఎన్నికలు వస్తున్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఢిల్లీ ఏ కొంచెమూ మారలేదని తాజా ఘటన రుజువు చేస్తున్నది. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం 2012లో దేశవ్యాప్తంగా 24,923 అత్యాచారాలు జరిగితే గత ఏడాది వాటి సంఖ్య 33,707కు చేరుకున్నది. కఠిన చట్టాలు మాత్రమే పరిస్థితిని మార్చలేవు. నిరంతరం అప్రమత్తంగా, జవాబుదారీతనంతో వ్యవహరించే అధికార యంత్రాంగమూ, సత్వర విచారణ జరిపి నేరస్తులను దండించగలిగే వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే సత్ఫలితా లుంటాయి. -
అత్యాచార ఘటనలో నిందితులకు రిమాండ్
నిర్భయ చట్టం కింద కేసు నమోదు హైదరాబాద్: హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేట శివార్లలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలి పిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన యువతి (22) నగరంలోని హాస్టల్లో ఉంటూ ‘లా’ చదువుతోంది. ఎల్బీనగర్కు చెందిన యువకుడు రెం డేళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ సోమవారం మధ్యాహ్నం పెద్దఅంబర్‌పేటలోని శబరిహిల్స్ వెంచర్‌లోని ఓ పాడుబడ్డ గదిలోకి వెళ్లారు. ఇది గమనించిన నల్లబోలు శ్రీనివాస్‌రెడ్డి (32), బండి లింగారెడ్డి (27) తమ సెల్ఫోన్లో వారి ఏకాంత దృశ్యాలను చిత్రీకరించారు. తర్వాత యువకుడిపై దాడి చేసి అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం ఫోన్లోని దృశ్యాలను యువతికి చూపించి బెదిరించారు. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టారు. యువతి ఫోన్ నంబర్ తీసుకొని పిలిచినప్పుడుల్లా వచ్చి తమ కోరిక తీర్చాలని లేకుంటే దృశ్యాలను బయట పెడతామని హెచ్చరిం చారు. మరుసటి రోజు నిందితులు యువతికి ఫోన్ చేసి తమ వద్దకు రావాలని వేధించారు. వారి వేధింపులు తాళలేక యువతి బుధవారం పోలీసులను ఆశ్రయించింది. దీనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులు శ్రీనివాస్‌రెడ్డి, లింగారెడ్డిలను పెద్దఅంబర్‌పేట చౌరస్తాలో అరెస్టు చేశారు. గురువారం హయత్‌నగర్ 7వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా మేజి స్ట్రేట్ నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుల్లో ఒకరైన శ్రీనివాస్‌రెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా మర్రిపెడ గ్రామం. కొన్నాళ్లుగా పెద్దఅంబర్‌పేటలో వెల్డింగ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. లింగారెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా హుజూర్నగర్ మండలం పెద్దవీడు. ప్రస్తుతం పెద్ద అంబర్‌పేటలో బైకు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాగా, యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు ఫోన్లలో ఉన్న దృశ్యాలను తొలగించారని ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపారు. ఎఫ్ఎస్ఎల్కు వారి ఫోన్లను పంపించి ఆ దృశ్యాలు ఇంకా ఎవరికైనా పంపారా అనే విషయాలను తెలుసుకొని చర్యలు తీసుకుంటామన్నారు. శివారులోని నిర్మానుష్య ప్రదేశాలలో గస్తీని మరింతగా పెంచుతామని చెప్పారు. -
యువతిపై యాసిడ్ దాడి
నిర్మల్: తెలంగాణలో మహిళల భద్రతకు ‘షీ’, ‘హెల్ప్‌డెస్క్’ వంటి వాటితో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ఒకవైపు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. యువతులపై దాడులు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. పెళ్లికి నిరాకరించిందంటూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో యువతిపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మణచాంద మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన గజ్జెల హంసపై కడెం మండల కేంద్రానికి చెందిన మునీర్ యాసిడ్‌దాడికి పాల్పడ్డాడు. బీఈడీ పూర్తి చేసిన హంసకు ఐదేళ్లుగా మునీర్‌తో పరిచయం ఉంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నర్సాపూర్‌లో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా నిర్మల్ బస్టాండ్ సమీపంలో మునీర్ తారసపడ్డారు. ఈ క్రమంలో వారి పెళ్లికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. తనను పెళ్లి చేసుకునేందుకు జాప్యం చేస్తోందనే అక్కసుతో మునీర్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను ఆమెపై చల్లాడు. దీంతో ఆమె ముఖానికి, తలకు, భుజానికి తీవ్ర గాయాల య్యాయి. దీంతో వెంటనే ఆమెను నిర్మల్‌లోని ఓ ప్రైవే టు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడు మునీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. మునీర్‌పై నిర్భయ కేసు నమోదు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ మాధవరెడ్డి విలేకరులతో తెలిపారు. మునీర్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. -
చట్టాలు కాదు.. భరోసా ఇవ్వండి
- లైంగిక దాడులపై మహిళల గళం - శిక్షల అమలులో వేగం అవసరమని అభిప్రాయం కుత్బుల్లాపూర్: ‘మహిళా రక్షణ’ అనేది చర్చించుకోవడానికే గాని, ఆచరణలో మాత్రం విఫలమవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారిపై దాడులు జరుగుతునే ఉన్నాయి. ‘మహిళా రక్షణకు రాజీలేని చర్చలు, చట్టంలో సమూల మార్పులు చేసి వారికి పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామ’ని ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మన హైటెక్ నగరంలో మహిళలకు హైటెక్ లెవల్ సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పి.. అందుకు భరోసాగా ఈ మధ్యే ఐటీ కారిడార్‌లో మహిళా పోలీస్‌స్టేషన్‌ను సైతం ప్రారంభించారు. కానీ ఇవేవీ మహిళల భద్రతకు భరోసా ఇవ్వలేక పోతున్నాయి. మహిళా హెల్ప్‌లైన్, మహిళా భద్రత చట్టాలు, మహిళా పోలీస్స్టేషన్లు.. ఎన్ని ఉన్నా మృగాళ్ల వికృత చేష్టలు సాగుతునే ఉన్నాయి. వ్యవస్థలో లోపాలు, చట్టంలోని లొసుగులతో శిక్షల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉండడంతో వారి ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. నగర శివారులో స్నేక్ గ్యాంగ్ ఆగడాలు మరవక ముందే.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో తల్లీ కూతుళ్లపై సామూహిక లైంగిక దాడి జరగడం శోచనీయం. ఈ విషయంపై పలు మహిళా సంఘాల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇలాండి ఘటనల్లో దాడికి పాల్పడ్డవారికి కఠిన శిక్షలు వేగంగా అమలు చేయాలన్నారు. శిక్షలు వేగవంతం చేయాలి రెండేళ్ల కిందట ఢిల్లీలో మెడికల్ విద్యార్థినిపై జరిగిన ఘటన దేశాన్ని కుదిపేసింది. తర్వాత నిర్భయ లాంటి చట్టాలను తీసుకువచ్చినా ఉపయోగం లేదు. పాలకులకు మహిళల పట్ల ఉండే చిత్తశుద్ధి తాత్కాలికమే అని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి, ఇప్పటికైనా లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. శిక్షలు కఠినంగా వేగంగా అమలు చేయాలి. - అనురాధ, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షురాలు కౌన్సెలింగ్ సెంటర్లు అవసరం ‘నిర్భయ చట్టం’ అమల్లోకి వచ్చిన తర్వాత లైంగిక దాడుల సంఖ్య మరింత పెరిగింది. వావి వరసలు మరిచి వేధిస్తున్నారు. చట్టాలు చుట్టాలుగా ఉండకుండా ఉండాలంటే నిందితులకు కఠిన శిక్షలు పడాలి. పూనం మాలకొండయ్య ఆధ్వర్యంలో కమిటీ వేసినా లైంగిక వేధింపులు ఆగకపోవడం సిగ్గుచేటైన విషయం. అన్ని చోట్లా కౌన్సెలింగ్ సెంటర్లు పెట్టి పురుషులకు శిక్షలపైన, తదుపరి పరిణామాలపైనా అవగాహన కల్పించాలి. - శివపార్వతి, జాగృతి సొసైటీ అధ్యక్షురాలు స్వేచ్ఛ కూడా లేదు.. అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగినపుడే మనకు స్వాతంత్య్రం వచ్చినట్టు.. అని ఆనాడు గాంధీ చెప్పారు. కానీ ప్రస్తుత పాలక వర్గాల నిర్లక్ష్యం వల్ల మహిళ ఇంట్లో ఉన్నా లైంగిక దాడులు జరుగుతున్నాయి. మార్కెట్, బడికి, గుడికి వెళ్లినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. యాసిడ్ దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు బాధాకరం. స్వాతంత్య్రం కాదు కదా.. స్వేచ్ఛగా తిరిగే అవకాశం కూడా లేదు. - చెరుకు లావణ్య గౌడ్, పట్టణ స్లమ్ సమాఖ్య ఉపాధ్యక్షురాలు బహిరంగ శిక్షలు తప్పనిసరి లైంగిక దాడులకు పాల్పడుతున్న వారు కూడా ఓ తల్లికి పుట్టిన వారే. వారు ఏం చేస్తున్నారో గుర్తు చేసుకుంటే ప్రతి వ్యక్తిలో మార్పు వస్తుంది. లైంగిక దాడులకు పాల్పడేవారిని బహిరంగంగా శిక్షించాలి. - కృష్ణవేణి, ఉజ్వల మహిళా మండలి అధ్యక్షురాలు -
యువతిని వేధిస్తున్న యువకులు అరెస్ట్
ఆదిలాబాద్: ఎస్ఎంఎస్లతో యువతిని వేధిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. పోలీసుల కథనం... ఓ యువతికి గత కొంత కాలంగా ఆమె సెల్ ఫోన్‌కు అసభ్యకర ఎస్ఎంఎస్లు వెల్లువెత్తాయి. ఆ ఎస్ఎంఎస్లు ఎవరు పంపుతున్నారో అర్థంకాక ఆమె తీవ్ర మానసిక క్షోభ అనుభవించింది. అదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా జిల్లాలోని లక్ష్మణ్‌చాందా మండలం వడ్యాల గ్రామం నుంచి ఆ అసభ్యకర ఎస్ఎంఎస్లు వస్తున్నట్లు గుర్తించారు. దాంతో ఆ గ్రామంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో వారు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
బలి జరిగితేనే కానీ....
ప్రస్తుత పరిస్థితులలో మనిషి ప్రాణాలు గాలిలో దీపంలా తయారయ్యాయి. ఆ ప్రాణాలు ఎక్కడ ఎప్పుడు ఏలా పోతాయో ఎవరికి ఏరుకా. ఏదైన ప్రమాదం జరిగి మనుషులు మరణిస్తే ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరీ చేతులు కాలాక అకులు పట్టుకున్న చందంగా తయారైంది. అందుకు తాజా ఉదాహరణ.... మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మరో 15 మంది వరకు గాయపడ్డారు. దేశంలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న సంఘటన ఇదే మొదటిది కాదు... గతంలో పలు రాష్ట్రాలలో ఇటువంటి తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లు, స్కూల్ బస్సు ప్రమాదాల నివారణ.... నిర్భయ అత్యాచారం వరకు ప్రభుత్వం ఏన్నో కమిటీలు వేసింది. ప్రభుత్వం కూడా ఆ కమిటీలు అందించిన నివేదికలు భద్రంగా అటకెక్కించింది. అదేమిటో ప్రమాదం జరిగినప్పుడే ప్రభుత్వ అధికారుల్లో స్పందన వస్తుంది. తనిఖీల పేరిట నానాహడావుడి చేస్తారు. అందుకు పాలెం బస్సు దుర్ఘటన అందుకు ఉదాహరణ. ఆ తర్వాత నాలుగైదు రోజులకు వారు మొద్దు నిద్రలోకి జారుకుంటారు. ప్రమాదం జరిగి ప్రజలు బలి అయితేనే అటు రాష్ట్ర ప్రభుత్వంలోకానీ ఇటు కేంద్ర ప్రభుత్వంలో కానీ చిరు కదలిక వస్తుంది. అంతలోనే మళ్లీ ఇలాంటి వన్ని మాములే అని ప్రభుత్వ పెద్దలు సర్థి చెప్పుకుని కామ్‌గా ఉంటారు. ప్రజలకు ఎక్కడ,ఎలా ప్రమాదం జరిగే వీలు ఉంది... అటువంటి సంఘటనలు జరగకుండా ఏలాంటి చర్యలు తీసుకోవాలి... ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బందితో సహా అందరిని భాగస్వామ్యం చేసుకుంటు ముందుకు వెళ్లితే ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవడం ఇలాంటి చర్యలు పునరావృతం కావు. ఏదైన ప్రమాదం జరిగి మనుషుల ప్రాణాలు బలి అయితేనే కానీ ప్రభుత్వం స్పందించదు. ఓ వేళ ప్రభుత్వం స్పందించిన... ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ చర్యలు తీసుకుంటాం... కమిటీ వేస్తున్నం ... నష్టపరిహారం కింద లక్షలు ఇస్తామని ప్రకటిస్తుంది. అంతే ఆ తర్వాత ప్రమాదంపై ప్రభుత్వం ఓ కమిటీ వేస్తుంది. ఆ కమిటీ నివేదక ఇస్తుంది. దాన్ని తీసుకువెళ్లీ అటకెక్కిస్తారు. అంతే ఆ తర్వాత మళ్లీ ఏదో ప్రమాదం సంభవించి... ప్రజలు పెద్ద సంఖ్యలో మృతి చెందితే... ప్రభుత్వం మళ్లీ ఇదే చిలకపలుకు పలుకుతుంది. అంతే కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా శాశ్వత నివారణ కోసం తీసుకుంటున్న చర్యలు ఏంటి అన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద ఉన్న జవాబు మాత్రం శూన్యం. -
తమిళనాడులో కీచకం
ప్రేమికుడిని చితక్కొట్టి యువతిపై గ్యాంగ్‌రేప్ కృష్ణగిరి(తమిళనాడు): దేశంలో మృగాళ్ల ఘాతుకాలకు తెరపడడం లేదు. కోర్టులు శిక్షలు వేస్తున్నా, ప్రభుత్వాలు ‘నిర్భయ’ లాంటి కఠిన చట్టాలు తెస్తున్నా అబలలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడులో నలుగురు కామాంధులు ఓ కళాశాల విద్యార్థినిపై శుక్రవారం రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కృష్ణగిరి జిల్లా కావేరి పట్టణానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(19) కృష్ణగిరిలోని కళాశాలలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతోంది. కావేరి పట్టణ సమీపం గ్రామానికి చెందిన ప్రేమికుడి(24)తో శుక్రవారం సాయంత్రం కారులో రాయకోట సమీపంలోని బోడంపట్టికి వెళ్లింది. అక్కడ రాయకోట హెచ్చంపట్టికి చెందిన సుబ్రమణి(28), రాఘవేంద్రనగర్‌కు చెందిన ప్రకాష్(24), రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన మణి(22), గిడ్డం బట్టికి చెందిన ప్రకాశ్(24) అనే నలుగురు యువకులు ఆ జంటపై దాడిచేశారు. యువకుడిని చితక్కొట్టారు. యువతి కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఫొటోలు తీసుకున్నారు. ఎవరికైనా చెబితే వాటిని బయట పెడతామని బెదిరించారు. ఈ ఘోరాన్ని చూసిన ఓ పశువుల కాపరి బోడంపట్టి గ్రామస్తులకు సమాచారమిచ్చాడు. గ్రామస్తులు అక్కడికొచ్చేలోగా నిందితులు పారిపోయారు. పోలీసులు శుక్రవారం రాత్రే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో పెల్లుబికిన ఆగ్రహం: బెంగళూరులో ఇటీవల ఓ స్కూల్లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం పట్ల నగర ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. శనివారం బాలిక తల్లిదండ్రులతోపాటు వందలాది విద్యార్థులు, తల్లిందడ్రులు, ప్రజలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. దారుణానికి పాల్పడిన వారిని శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. -
‘చున్ని’కృష్ణులు
ఉత్త(మ)పురుష అలనాడు దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలను లాగేస్తుంటే శ్రీకృష్ణుడు ఆమెకు చీరలిచ్చాడన్న విషయం అందరికీ తెలిసిందే. అన్నయ్యంటే ఆయనే మరి. అప్పుడెప్పుడో ఆ సంఘటన జరిగింది కాబట్టి సరిపోయిందిగానీ... ఇప్పుడు జరిగుంటేనా... దుశ్శాసనుడి మీద ‘నిర్భయ’ చట్టం కింద కేసు బుక్ చేసి ఉండేవాళ్లం. పీడా వదిలిపోయి ఉండేది. సదరు దుశ్శాసనుడు ఇప్పుడు లేడనే బాధ కంటే ఇప్పుడు మన అమ్మాయిల మానమర్యాదలు కాపాడేందుకు కంకణం కట్టుకున్న శ్రీకృష్ణులు ఎక్కువయ్యారన్న బాధ ఎక్కువైంది. అరే... చెల్లెళ్ల మానమర్యాదలను కాపాడే అన్నయ్యలూ, కన్నయ్యలూ ఎక్కువైతే ఆనందించాలి గానీ... బాధపడాల్సిన అవసరమేముందంటారా? చెబుతా. సరదాగా మా శ్రీవారితో సైకిల్ మోటర్ మీద వెళ్దామని బయల్దేరుతానా... ఇక దాంతో పాటే మా కన్నయ్యల తాకిడి పెరిగిపోతోంది. సరదాగా సినిమాకు తీసుకెళ్లమని శ్రీవారిని అడిగా. ఎందుకో ఆయన మూడ్ బాగుంది. ‘సరే బయల్దేరు’ అన్నారు. మోటర్‌సైకిల్ స్టార్ట్ చేశాక ఆయన వెనక కూర్చున్నా. బయల్దేరిన కాసేపటికి మన మోటార్‌సైకిల్‌కి ప్యారలల్‌గా మరో బైక్ కాసేపు అదేపనిగా నడుస్తూ ఉంటుంది. మనం చీర కట్టుకుని ఉంటే... ‘చీర... చీర’ అంటూ హెచ్చరిస్తాడా బైకు మీది అపర కృష్ణుడు. అదే మనం గానీ చుడీదార్ వేసుకుని ఉంటే... ‘చున్నీ చున్నీ’ అంటూ జాగ్రత్త చెబుతాడు. పైగా ఆ మాట చెప్పాక... వాడేదో మనల్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడేసిన ఫీలింగును ముఖంలో పలికిస్తాడు. మనల్ని పెను విపత్తు నుంచి రక్షించిన అలసటను ఫేసులో ఒలికిస్తాడు. గతంలో ఇంటిదాకా దిగబట్టే బాడీగార్డుల్లాగే ఇటీవల ఈ తరహా ‘శారీగార్డు’లు ఎక్కువయ్యారు. అయితే తీరా చూసుకుంటే మన చీరో, చున్నీయో అంతా సక్రమంగానే ఉంటుంది. అప్పట్లో అమ్మాయిలను ఏదో వంకతో పలకరించాలంటే... మగాళ్లు తమ వాచీ దాచుకుని ‘టైమెంత’ అని అడిగేవాళ్లట. నాకనిపిస్తున్నదేమిటంటే... ఇప్పుడు ఆ మగాళ్లే కాసేపు వివాహితతో అధికారికంగానూ, తమకు ఎలాంటి దురాలోచనా లేదనే దృక్పథాన్ని చాటుకుంటూనో.... దాంతోపాటు ఏదో పెజాసేవను ఎగస్ట్రాగా ఒరగబెట్టామనే ఫీలింగిచ్చుకునే త్యాగిష్ఠిలా పోజిచ్చుకునేందుకో ఈ ‘చున్నీ’ హెచ్చరికలను చేస్తున్నారనే అనుమానం నా మనసులో ఓ మూలన ఉంది. వాస్తవంగా అతివ తాలూకు అంగవస్త్రం చక్రంలో చుట్టుకుపోతుందనే ఉద్దేశంతో ఆ ప్రమాదానికి చక్రం అడ్డేయడానికీ, మగువ మానాన్ని కాపాడటానికే హెచ్చరిక చేస్తే... ఆ మగాళ్లు నిజంగానే చెల్లెలి మానాన్ని కాపాడేందుకు సిద్ధపడ్డ అపర శ్రీకృష్ణులే. అదే... ఏదో ఒక ఒంకతో కాసేపు అమ్మాయి చీరనో, చున్నీనో సర్దుకునేలా చేసేందుకు పరోపకారి వేషం వేస్తే మాత్రం వాళ్లనేమని పిలవాలి? నా మటుకు నాకు అనిపిస్తుందేమిటో తెలుసా! నేను వాళ్లకు పెట్టిన పేరేమిటో తెలుసా... వాళ్లు కన్నయ్యల్లాంటి మా అన్నయ్యలైన ‘చున్ని’కృష్ణులు!! - వై! -
సోమిశెట్టి హరికృష్ణ కోసం గాలింపు
మారేడుపల్లి(హైదరాబాద్): బాలికపై లైంగికదాడి ఘటనలో నిందితుడిపై నిర్భయ చట్టంతో పాటు ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు, నిందితుడిని పట్టుకొనేందుకు రెండు ప్రత్యేక బృందాలను బెంగళూరు, కర్నూలుకు పంపినట్టు మారేడుపల్లి ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి బుధవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. వెస్ట్‌మారేడుపల్లిలోని శివఅరుణ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలికపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తమ్ముడి కుమారుడైన సోమిశెట్టి హరికృష్ణ ఈనెల 11వ తేదీన అత్యాచారం జరిపినట్లు బాధితురాలు మారేడుపల్లి పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న సోమిశెట్టి హరికృష్ణ అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. అయితే మారేడుపల్లి పోలీసులు ఫిర్యాదును గోప్యంగా ఉంచారు. ఈ వార్తను సాక్షి బుధవారం ప్రచురించింది. దీంతో మారేడుపల్లి పోలీసులపై ఉన్నతాధికారుల ఒత్తిడి పెరిగింది. చేసేదిలేక పోలీసులు నిందితుని కోసం ప్రత్యేక బృందాలను పంపారు. ఇదిలా ఉండగా సోమిశెట్టి హరిక్రిష్ణను ఈ కేసును తప్పించడానికి మాజీ మంత్రులు, సీనియర్ రాజకీయ నాయకులు ప్రయత్నిస్తునట్లు సమాచారం. ఇప్పటికే పోలీసు బాస్‌పై వత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం. -
చిన్నారులపై గోపీకృష్ణ కీచకపర్వం
-
చిన్నారులపై గోపీకృష్ణ కీచకపర్వం
విజయవాడ : అనాథ బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న షిర్డీ సాయి ఆశ్రమ నిర్వాహకుడిని సత్యనారాయణపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యర్రంశెట్టి గోపీకృష్ణ అనే వ్యక్తి గతంలో రైల్వేలో టీటీఈగా పనిచేశాడు. ఏలూరులో ఇతడిపై హత్యాయత్నం కేసు నమోదవడంతో 2005లో ఉద్యోగం నుంచి తొల గించారు. ఇతడికి ముగ్గురు భార్యలు. గోపీకృష్ణ ఖుద్దూస్‌నగర్ మట్టిరోడ్డులో ఆరేళ్ల కిందట శ్రీ షిరిడీ సాయిబాబా ఆశ్రమాన్ని స్థాపించాడు. ముగ్గురు భార్యలకు పుట్టిన పిల్లలతో పాటు కొందరు అనాథ బాలలను చేర్చుకుని ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. అందులోని అనాథలకు భోజనం పెట్టి పాఠశాలకు పంపిస్తుంటాడు. వారు రాత్రిళ్లు ఆశ్రమంలోనే ఉంటారు. దీని నిర్వహణకు నలుగురు ఉద్యోగులను ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా చందాలు సేకరించి, ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. అందులోని బాలికలతో పనులు చేయిస్తుంటాడు. రాత్రివేళల్లో వారితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. దీనిపై చైల్డ్‌లైన్‌కు కొంతమంది సమాచారం అందించారు. వారు ఆశ్రమానికి వచ్చి బాలబాలికల నుంచి వివరాలు సేకరించారు. అ నంతరం చైల్డ్‌లైన్‌కు తరలించారు. గోపీకృష్ణపై జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ పి.లక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
కామాంధుడికి దేహశుద్ధి
అనంతపురం జిల్లాలో బస్సులో మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి దేహశుద్ధి చేశారు తోటి ప్రయాణికులు. ఒళ్లు హూనం చేసిన తర్వాత ఆ ఘనుడిని పోలీసులకు అప్పగించారు. జమ్మలమడుగు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లెగ్జరీలో వైఎస్సార్‌జిల్లాకు చెందిన దంపతులు ప్రయాణిస్తున్నారు. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న కర్నాటకకు చెందిన శంకర్ అనే వ్యక్తి బస్సులోని ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఈ విషయంపై భర్తకు తెలియచేసింది. కొంతసేపు ఓపిక పట్టిన ఆమె భర్త.. బస్సు కదిరి బస్టాండ్‌కు రాగానే శంకర్ కి బాగా దేహశుద్ది చేశాడు. తోటి ప్రయాణికులు సైతం తలో చేయివేసి అతగాడికి కామశుద్ధి చేశారు. ఆ తరువాత నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఫిర్యాదు నందుకున్న కదిరి పోలీసులు నిందితుడిపై నిర్భయచట్టం కింద కేసునమోదు చేశారు. -
మహిళా సాధికారత ఎక్కడ!
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: మహిళా సాధికారత సాధిస్తున్నామని అనేక మంది వేదికలెక్కి ఉపన్యాసాలు చేస్తున్నా వాస్తవానికి మహిళలు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ మహిళలకు నానాటికీ రక్షణ లేకుండాపోతోంది. జిల్లాలో ఏ మూల చూసినా ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళపై లైంగిక దాడులు, హత్యలు, వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. పాలు తాగే పసి పాప మొదలుకొని స్కూలుకు వెళ్లే బాలిక, కళాశాలకు వెళ్లే యువతి, ఉద్యోగానికి వెళ్లే మహిళ వరకు బయటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు నమ్మకం లేకుండా పోతోంది. ఇక అత్తవారింట్లో మహిళలపై భర్త, అత్తామామల వేధింపులు సర్వసాధారణం. ఇలా జిల్లాలో ఏదో ఒక చోట మహిళలపై ఏదో ఒక రూపంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంఘటనలు పోలీస్‌స్టేషన్ మెట్లెక్కినప్పటికీ మరికొన్ని మరుగునే ఉంటున్నాయి. గత రెండేళ్లలో జిల్లాలో మహిళలపై చోటు చేసుకున్న సంఘటనలను పరిశీలిస్తే సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. 2013 సంవత్సరంలో వరకట్నం కోసం 25 మంది మహిళలు హత్యలకు గురయ్యారు. అలాగే వరకట్న కేసులు 476, అత్యాచారా కేసులు 64, రెండో పెళ్లి చేసుకున్నారంటూ నమోదైన కేసులు 52, వెకిలి చేష్టలు, ఇతర వేధింపులకు సంబంధించి 169 కేసులు నమోదయ్యాయి. చట్టాలను సక్రమంగా అమలైనప్పుడే మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, వేధింపులను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని మహిళా సంఘాలు పేర్కొంటున్నాయి. నిర్భయ తదితర చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై లైంగిక దాడి పెరుగుతోందంటున్నారు. శిక్షలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మహిళల కోసం ఏర్పాటైన చట్టాల్లో కొన్ని.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడితే సెక్షన్ 354 ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. లైంగిక దాడి చేసిన వారిపై నిర్భయ చట్టం కిందకేసు నమోదవుతుంది. చిన్నపిల్లలను లైంగికంగా వేధిస్తే ప్రివెన్షన్ యాక్టు ఫర్ చిల్డ్రెన్ సెక్సువల్ అఫెన్సెస్ కింద కేసు నమోదు చేస్తారు. వరకట్నం కోసం భార్యను వేధిస్తే 304(బి) సెక్షన్ కింద భర్తకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష అమలువుతుంది. మహిళలను ఆత్మహత్యకు కారణమైన వారికి ఐపీసీ సెక్షన్ 306 కింద పదేళ్ల వరకు జైలు విధించే అవకాశం ఉంది. వివాహిత మహిళలను వేధింపులకు గురిచేస్తే ఐపీసీ 498 ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. రెండో వివాహం చేసుకున్న భర్తకు సెక్షన్ 494 కింద కేసు నమోదవుతుంది. -
నిర్భయ చట్టం కింద ఇద్దరికి జీవితాంతం ఖైదు
దేశంలోనే మొదటిసారిగా వరంగల్‌లో తీర్పు వరంగల్, న్యూస్‌లైన్: ఢిల్లీలో యువతిపై జరిగిన లైంగిక దాడి అనంతరం పురుడు పోసుకున్న నిర్భయచట్టం అమలైన నాటి నుంచి దేశంలోనే మొదటిసారిగా వరంగల్‌లో ఇద్దరికి శిక్ష పడింది. ఓ బాలికపై లైంగిక దాడి చేసిన ఇద్దరికి వరంగల్‌లోని బాలికలపై లైంగిక దాడుల పరిరక్షణ కేసులను విచారించే ప్రత్యేక కోర్టు మొదటి అదనపు జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం నాగారానికి చెందిన బాలిక(15) తల్లి, అన్నావదినలు గతేడాది మార్చి14న కరీంనగర్ జిల్లా వేములవాడకు వెళ్లారు. మరుసటి రోజు తండ్రి రాత్రి తన చిన్న అత్త ఇంటి వద్ద కూతురిని వదిలి పొలానికి వెళ్లాడు. ఆ రోజు రాత్రి ఆమె బంధువులు సంజీవ్, బండారి విజయ్‌లు బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయమై బాధితురాలు హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి సీఐ మనోహర్ నిందితులపై ఐపీసీ 366, 376డీ, 506 రెడ్ విట్, సెక్షన్(5) సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా నేరం రుజువు కావడంతో వరంగల్ బాలికలపై లైంగిక దాడుల పరిరక్షణ కేసులను విచారించే ప్రత్యేక కోర్టు మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కేబీ.నర్సింహులు.. నిర్భయ చట్టం కింద నిందితులిద్దరు జీవితాంతం (తుదిశ్వాస విడిచే వరకు) కారాగారంలో శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చారు. కాగా, ఈ తీర్పుపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. -
చిన్నారిపై అత్యాచారయత్నం
కందుకూరు, న్యూస్‌లైన్: అభంశుభం తెలియని చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆకులమైలారం గ్రామానికి చెందిన అచ్చన భిక్షపతి(31) స్థానికంగా మేస్త్రీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి ఇంటి సమీపంలో ఉంటున్న ఓ బాలిక(8) తల్లి చనిపోవడంతో నాయనమ్మ దగ్గర ఉంటూ స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. బుధవారం మధ్యాహ్నం సమయంలో పాఠశాల నుంచి వచ్చిన బాలికను భిక్షపతి తినుబండారాల కోసం దుకాణానికి పంపించాడు. వాటిని తీసుకుని చిన్నారి ఇంట్లోకి రాగానే అతడు తలుపులు వేసి అత్యాచారానికి యత్నించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక కేకలు వేస్తూ బయటికి పరుగెత్తి స్థానికులకు విషయం తెలిపింది. గ్రామస్తులు భిక్షపతిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని కందుకూరు పోలీసులకు అప్పగించారు. సీఐ జానకీరెడ్డి ఆధ్వర్యంలో నిందితుడిపై ‘నిర్భయ’ చట్టం కింద కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు. -
యువతిపై బ్లేడ్‌తో దాడిచేసిన ఉన్మాది
ప్రకాశం జిల్లా: యువతులపై, మహిళలపై దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆడవాళ్లకు రక్షణ కల్పించేందుకు నిర్భయ వంటి చట్టాలను ప్రభుత్వం తెచ్చిన కూడా ఈ ఘటనలు ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. యువతిపై బ్లేడ్‌తో యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పోలవరంలో చోటుచేసుకుంది. యువతిపై బ్లేడ్‌తో దాడిచేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు తెలిసింది. ఆ యువతి పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సింది వుంది. -
నిర్భయ చట్టంలో సారం లేదు: వి. సంధ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: మహిళల రక్షణకు చేసిన నిర్భయ చట్టంలోని అంశాలు ఆశాజనకంగా లేవని, జస్టిస్ వర్మ చేసిన ప్రధాన సిఫారసులను పక్కనపెట్టి సారం లేని చట్టాన్ని తయారు చేశారని ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) ఆరోపించింది. రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని నియంత్రించాలని, డిఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న పీవోడబ్ల్యూ 6వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ముగిసాయి. మహాసభల చివరిరోజు సోమవారం సంస్థాగత కార్యక్రమాలపై చర్చించి పలు నిర్ణయాలు, తీర్మానాలు చేశారు. మహిళా ఉద్యమాలతో సాధించుకున్న 498ఏ చట్టాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని, అలాంటి ఆలోచనను విరమించుకుని వరకట్న వేధింపులు, హత్యల నిరోధానికి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని తీర్మానించారు. మత రాజకీయాలు ప్రభుత్వ ఏర్పాటులో జోక్యం కల్పించుకోకూడదని, ఆదివాసీ మహిళల ఉపాధి, నివాస హక్కులను పరిరక్షించే 5వ షెడ్యుల్‌ను అమలు చేయాలని, అటవీ భూములపై ఆదివాసీలకే హక్కులు కల్పించాలని, బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కుగా గుర్తించాలని, స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని తీర్మానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రెండు కమిటీలు వేయాలనే ప్రతిపాదనకు మహాసభలో ప్రతినిధుల నుంచి ఏకగ్రీవంగా ఆమోదం లభించినట్టు సమాచారం. అయితే గెజిట్ నోటిఫికేషన్ వచ్చే వరకు రెండు కమిటీలకు కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పూర్తి స్థాయి కమిటీని మంగళవారం ప్రకటించనున్నారు. మహాసభలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వి.సంధ్య, ప్రధాన కార్యదర్శి విష్ణు, రాష్ట్రనేతలు బి.పద్మ, నర్సక్క, రమాసుందరి, సూర్యకుమారి, అనురాధ పాల్గొన్నారు. -
ఈ శోకం...ఇంకెన్నాళ్లు?
సాక్షి, కొత్తగూడెం: చట్టాలు ఎన్నో...ఇప్పటికే ఉన్నవి, కొత్తగా వచ్చినవి...అయినా, ఏటికేడాది మహిళకు రక్షణ లేకుండా పోతోంది. లైంగికదాడులు, హత్యలు, వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంటా బయటా ఎక్కడ చూసినా ‘ఆమె’ అఘాయిత్యాలు, అవమానాల బారిన పడుతోంది. ముక్కుపచ్చలారని పసికందు నుంచి ముదుసలి వరకూ మృగాళ్ల పాశవిక చర్యలకు గురవుతూనే ఉన్నారు. ప్రతి రోజు జిల్లాలో ఏదో చోట మహిళలపై ఏదో ఒక రూపంలో దాడి జరుగుతూనే ఉంది. కొన్ని పోలీసు కేసుల వరకు వెళ్తే.. మరికొన్ని కుటుంబ పరువుపోతుందన్న ఉద్దేశంతో బయట పడడం లేదు. గత మూడేళ్లలో పరిశీలిస్తే 2013లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. జిల్లాలో గత ఏడాది అత్యధికంగా 97 లైంగికదాడి కేసులు, 245 లైంగికదాడి యత్నం, 298 వేధింపుల కేసులు నమోద య్యాయి. అలాగే నిర్భయ చట్టం కింద గత ఏడాది 26 కేసులను నమోదు చేశారు. తగ్గుతున్న ఆడపిల్లల సంఖ్య.. జిల్లాలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. ఆధునికయుగంలోనూ ఆడపిల్ల పుట్టిందంటే పెదవి విరుస్తున్నారు. జన గణనను చూస్తే ఇవి ప్రమాద ఘంటికలే అని చెప్పవచ్చు. 2001లో జిల్లాలో ప్రతి వెయ్యిమంది మగ పిల్లలకు ఆడపిల్లల సంఖ్య 971 ఉంది. అయితే 2011 నాటికి ఇది 958కి పడిపోయింది. అలాగే 2001లో ఆరేళ్లలోపు ఆడపిల్లల సంఖ్య 1,72,470 ఉంటే.., 2011లో 1,37,966కు చేరుకుంది. 2001లో మహిళాజనాభా పెరుగుదల 16.39శాతం కాగా 2011లో 8.47 శాతానికి పడిపోయింది. ఈ గణాంకాలు జిల్లాలో ఆడపిల్లల శాతం ఏస్థాయిలో పడిపోతుందో చెబుతున్నాయి. భ్రూణ హత్యలు, పుట్టిన తర్వాత చిదిమేయడం గుట్టుగాసాగుతోంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఆడపిల్ల ఇంటికి ముద్దు .. అని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రచార కార్యక్రమాలు ప్రణాళిక లేక ప్రజల్లో అవగాహన కల్పించలేకపోతున్నాయి. -
హర్యానాలో ఘోరం.. కారులో అత్యాచారం
రెవాడి: ఢిల్లీలో నిర్భయ ఉదంతం ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే.. శుక్రవారం అదే తరహాలో హర్యానాలోని లోహానా గ్రామంలో ఒక 20 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం జరిగింది. బుధవారం ఆ యువతి పాఠశాలకు వెళుతుండగా... ముగ్గురు యువకులు బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అనంతరం కారులో తిప్పుతూ ముగ్గురూ వరుసగా అత్యాచారం చేసి.. మహేందర్‌గఢ్ జిల్లాలోని కనినా ప్రాంతంలో రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
‘నిర్భయ’మేదీ..?
సాక్షి, ఒంగోలు: ‘ఇటీవల గుడ్లూరు మండలం శాలిపేట గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికపై సుబ్బారావు అనే కామాంధుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. హనుమంతునిపాడు మండలం లింగంగుంటలో ఎనిమిదేళ్ల చిన్నారిపై బ్రహ్మనాయుడు అనే రాక్షసుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పొదిలి మండలం జువ్వలేరు గ్రామంలో ఇటీవల మానసిక స్థితి సరిగా లేని ఓ యువతిపై ఇద్దరు లైంగికదాడి చేశారు. పొదిలి పట్టణం విశ్వనాథపురంలో పట్టపగలే ఇంట్లో ఉన్న ఒక మహిళను గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్యచేసి ఆమె మెడలో ఉన్న ఆభరణాలు, చేతి గాజులు అపహరించుకెళ్లాడు. ఒంగోలు నగరంలోని త్రోవగుంట వద్ద బిహ ర్భూమికి వెళ్లిన సుశీలమ్మ అనే మహిళను దారుణంగా హతమార్చారు.’ ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇటువంటి దారుణాలు జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఊహ తెలియని చిన్నారులపై సైతం కామాంధులు లైంగికదాడులకు పాల్పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ప్రేమ పేరుతో వేధింపులు నిత్యకృత్యం. నిర్భయ వంటి చట్టాలు ఎన్ని వచ్చినా ‘మేమింతే..మారమంతే’ అంటూ కొన్ని మానవ మృగాలు బరితెగిస్తున్నాయి. నిత్యం ఎక్కడోచోట మహిళల మెడల్లో గొలుసుల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. పసిబిడ్డకు అన్నం పెడుతున్నా... ఇంటి ముంగిట ముగ్గు వేస్తున్నా.... చిన్నారులను బడి నుంచి తీసుకువెళుతున్నా.. చైన్‌స్నాచింగ్ దొంగలు కళ్లు మూసి తెరిచే లోగా బంగారు గొలుసులు తెంపుకుని మాయమవుతున్నారు. ఉద్యోగినులకూ తప్పని వేధింపులు: ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఇక గృహ హింసకు కొదవే లేదు. వరకట్న వేధింపులు తాళలేక ఎంతోమంది యువతులు విగతజీవులవుతున్నారు. మరోవైపు అనుమానపు మృగాళ్లతో సంసారాలు ఛిద్రమవడమేకాక పిల్లలు అనాథలవుతున్నారు. తల్లి, తండ్రి తరువాత స్థానంలో ఉండే గురువులు సైతం కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన చిన్నారులపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా మహిళల రక్షణకు ఉద్దేశించిన చట్టాలు చట్టుబండలవుతున్నాయే తప్ప వారికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు. జిల్లాలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులు తదితర కేసులు పోలీసు రికార్డుల్లో నమోదయ్యేవి కొన్నే. పరువు మర్యాదల సమస్యతో వెలుగులోకి రానివి కోకొల్లలు. గతేడాది 72 మంది మహిళలపై లైంగికదాడులకు పాల్పడిన వారు జిల్లా జైలులో రిమాండ్‌కు వచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రక్షక భటులే భక్షకులైతే..? మహిళలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే భక్షకులుగా మారుతున్నారు. తెనాలి రైల్వే పోలీసుగా పనిచేస్తున్న నగరానికి చెందిన ఓ ప్రబుద్ధుడు సౌత్‌బైపాస్ రోడ్డు సమీపంలో తన స్నేహితుడితో మాట్లాడుతున్న ఒక ఇంజినీరింగ్ విద్యార్థినిని ఇంటి వద్ద దింపుతానంటూ నమ్మకంగా మోటార్ బైక్ ఎక్కించుకుని జన సంచారం లేని ప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవల నాగులుప్పలపాడు పోలీసుస్టేషన్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీమన్నారాయణ అనే హోంగార్డు తన సహచర హోంగార్డుతో ఐదేళ్లపాటు సహజీవనం చేస్తూ తాను మరో పెళ్లి చేసుకునేందుకు అడ్డుతగులుందనే కారణంగా నిర్దాక్షిణ్యంగా ఆమె గొంతు నులిమి చంపాడు. -
సోదరిపై అత్యాచారయత్నం, రిమాండ్‌కు తరలింపు
హైదరాబాద్ : సభ్య సమాజం సిగ్గుపడేలా సొంత చెల్లెలిపై లైంగిక దాడికి యత్నించిన కీచక సోదరుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ రవి కథనం ప్రకారం... ఇందిరా నెహ్రూ నగర్‌కు చెందిన నర్సింగ్ (30) బైక్ మెకానిక్. అతను తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుండగా... ఇంటి పక్కనే చెల్లెలి కుటుంబం కూడా నివాసం ఉంటోంది. కాగా ఏడాది నుంచి చెల్లెలు ఉంటున్న ఇంటి స్థలం విషయంలో అన్నాచెల్లెలి మధ్య గొడవ జరుగుతోంది. ఈ సందర్భంగా పలుమార్లు చెల్లెలు అని చూడకుండా అసభ్యంగా ప్రవర్తించటమే కాకుండా సొంత బావను ఇంట్లో నుంచి బయటకెళ్లగొట్టాడు. గత నెల 29న చెల్లెలు ఒక్కటే ఇంట్లో ఉండగా టీవీ సౌండ్ పెంచి ఆమెపై నర్సింగ్ లైంగిక దాడికి యత్నించటంతో ఆమె ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నర్సింగ్పై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
సమాజంలో మార్పు రాలేదు:మీరా కుమార్
కోల్‌కతా: నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటినా సమాజంలో మార్పు రాలేదని, మహిళలపై అకత్యాలు కొనసాగుతూనే ఉన్నాయని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారమిక్కడ జరిగిన ఓ ఆధ్మాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో గ్యాంగ్‌రేప్ బలైన నిర్భయం చివరకంటూ మృత్యువుతో పోరాడి సింగపూర్ లో మరణించిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల తర్వాత సమాజంలో మంచి దిశగా ఏమైనా మార్పు కనిపించిందా అని విలేకరులు అడగ్గా.. ఈ తరహా ఘటనలపై ఇంకా మార్పు రాకపోవడం దురదృష్టకరంగా ఆమె పేర్కొన్నారు. -
13ఏళ్ల బాలికపై ఆరునెలలుగా అత్యాచారం
హైదరాబాద్: నగరంలో కీచకుల పరంపర కొనసాగుతోంది. బాలికలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒకవైపు అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్న అత్యాచార ఘటనలు ఆగడం లేదు. నిర్భయ, అభయ వంటి చట్టాలున్న కామాంధుల ఆగడాలకు కళ్లెం వెయ్యలేని పరిస్థితి నెలకొంది. ఇష్టారాజ్యంగా వీరు చిన్నారులపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. కామాంధుల కబంధహస్తాలలో చిన్నారులు నలిగిపోతున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ 13ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని యాలాల్ మండలం దౌలాపూర్‌లో ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలో బాలికపై జగదీష్ అనే వ్యక్తి ఆరునెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఆ బాలిక ఇంటి ప్రక్కనే ఉంటున్న జగదీష్ రోజూ ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అత్త సాయంతో ఆ నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే కుటుంబీకులను చంపుతానని జగదీష్ బెదరించడంతో ఆ చిన్నారి భయపడి చెప్పలేదు. దీంతో ఆ బాలిక ప్రస్తుతం నాలుగు నెలల గర్భాన్ని దాల్చింది. గత మూడు రోజులుగా బాలిక తీవ్ర కడుపునొప్పి అనడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు బాలిక గర్భవతిని చెప్పడంతో తల్లిదండ్రులు నివ్వెరపోయారు. తన కూతురిపై జరిగిన ఈ ఘటనపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి అత్తను అరెస్టు చేశారు. నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పరారీలో నిందితుడు జగదీష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
'నిర్భయ'తో 'అభయ'మేది?
దేశ రాజధానిలో 2012 డిసెంబర్లో చోటు చేసుకున్న నిర్భయ ఉదంతంతో యావత్ భారతావనీ గళం విప్పింది. ఢిల్లీ వీధులు దద్దరిల్లే స్థాయిలో జరిగిన ఉద్యమంతో కంగుతిన్న కేంద్ర ప్రభుత్వం ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు వర్మ కమిటీని ఏర్పాటు చేసింది. ఆపై దీన్ని పట్టించుకోని కేంద్రం ఆ కమిటీ సిఫార్సుల్ని పొందుపరచకుండా ‘ఉరి’తో కూడిన ఆర్డినెన్స్‌ను అమలులోకి తెచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో పార్లమెంట్లో చర్చించి నిర్భయ చట్టం తీసుకువచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి అమలులోకి వచ్చిన ఈ యాక్ట్‌లో ప్రత్యేకించి ఏర్పాటు చేసినవంటూ పెద్దగా లేవు. అప్పటికే ఐపీసీలో ఉన్న యాసిడ్ దాడులు, ఆత్మగౌరవానికి, స్త్రీ తత్వానికి భంగం కలిగించడం, అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి మహిళా సంబంధిత నేరాలను క్రోడీకరించి ఒకే గొడుకు కిందికి తెస్తూ విస్తృత పరిచింది. ఒక్కో సెక్షన్ కు ఎ,బి,సి,డి, ఇ... ఇలా క్లాజ్లు చేరుస్తూ విపులీకరించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి, నిందితుల్ని కఠినంగా శిక్షించడానికి ఇది ఉపకరిస్తుందని కేంద్రం ప్రకటించింది. అధికారులకూ తెలియని అంశాలెన్నో.. నిర్భయ చట్టంలో ఉన్న కీలకాంశాలపై సాక్షాత్తు పోలీసు అధికారులకే అంతగా అవగాహన ఉండట్లేదు. ఫలితంగా దీని పరిధిలోకి వచ్చే కేసుల్ని సైతం మూస ధోరణిలోనే పాత సెక్షన్ల కిందే నమోదు చేస్తున్నారు. ‘నిర్భయ’లో ఉన్న మూడు అత్యంత సున్నితాంశాల కారణంగా దీని కింద నమోదయ్యే కేసుల్లో శిక్షలు పడే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో వైద్యుల నివేదిక సైతం న్యాయస్థానం లో ఆధారంగా మారుతుంది. ఈ కేసుల దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. న్యాయస్థానం సైతం దీని విచారణను ఆరు నెలల్లో పూర్తి చేసి తీర్పు ఇవ్వాలి. సాధారణ కేసుల్లో నిందితులకు ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ అనే అంశం కలిసి వచ్చి నిర్దోషులుగా బయటపడుతుంటారు. అయితే నిర్భయ చట్టం కింద నమోదైన కేసులకు మాత్రం ఇది వర్తించదు. బాధితురాలు చెప్తోంది కాబట్టి కచ్చితంగా నేరం చేసి ఉంటాడనే అంశం పరిగణలోకి వస్తుంది. సాంకేతికంగా దీన్ని ప్రిజెమ్షన్ అంటారు. వీటివల్ల ఈ కేసుల్లో శిక్షల శాతం పెరిగి మరొకరు నేరం చేయడానికి భయపడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇన్ని అవకాశాలు ఉన్నా... అవగాహన లేమి కా రణంగా అనేక కేసులు ‘నిర్భయ’ కింద నమోదు కావట్లేదు. ఇవన్నీ పట్టేదెవరికి? కేంద్ర ప్రభుత్వం అత్యంత శక్తివంతమైందని చెప్పుకున్న నిర్భయ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ రోజు రోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ‘నిర్భయ’పై అవగాహన కల్పించడంలో సర్కారు విఫలం కావడమైతే... మరో కారణం మిగిలిన అంశాలను పట్టించుకోకపోవడం. కేవలం ఓ చట్టాన్ని తీసుకురావడం ద్వారా కుటుంబ, సామాజిక తదితర పరిస్థితుల్లో పూర్తి మార్పు తీసుకురావడమనేది దుర్లభం. ఇవి మారాలంటే సమస్యని లోతుల నుంచి అధ్యయనం చేసి దానికి, పునరావృతం కావడానికి కారణాలను గుర్తించాలి. వాటిని సాధ్యమైనంత వరకు వేళ్లతో సహా పెకిలించి వేయడానికి ప్రయత్నం చేయాలి. మహిళలు, యువతులపై అఘాయిత్యాలకు ప్రధానంగా ఎనిమిది కారణాలు ఉంటున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. చట్టం తీసుకువచ్చి చేతులు దులుపుకున్న యంత్రాంగాలు ఈ కీలకాంశాలను పట్టించుకుని మార్పు కోసం ప్రయత్నం చేయకపోవడం కూడా నిర్భయ తర్వాత కూడా అనేక మంది బలికావడానికి కారణంగా మారుతున్నాయి. ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండాలి.. కేవలం అఘాయిత్యాలు మాత్రమే కాదు స్నేహం, ప్రేమ పేరిట ఆడపిల్లల్ని లోబరుచుకుని, మోసం చేసి, బ్లాక్‌మెయిల్‌కు దిగి వారి జీవితాలతో ఆటలాడటం నిత్యకృత్యంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలి అంటే ప్రతి స్థాయిలోనూ అది చోటు చేసుకోవాలి. ప్రాథమికంగా ప్రతి ఒక్కరి ఇంటి నుంచే ప్రారంభం కావాలి. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు మాత్రం అంతా రోడ్లపైకి వచ్చి తమ వాణి వినిపిస్తున్నారు. ఆ తర్వాత ఆ విషయాన్ని, అవసరమైన మార్పు చేర్పుల్ని మర్చిపోతున్నారు. ఫలితంగానే అఘాయిత్యాల పరంపర కొనసాగుతోంది. అయితే ఎవరికి వారు తమ ఇళ్లల్లో పిల్లలపై శ్రద్ధ పెట్టి పెంచాలి. ఆడపిల్లల్ని గౌరవించడం, మహిళలతో మర్యాదగా ప్రవర్తించడం, సమాజంలో వారికి ఉండాల్సిన సముచిత స్థానం తెలియజేస్తూ సభ్యత, సంస్కారాలు నేర్పించాలి. మహిళలపై అఘాయిత్యాలు జరిగిన తర్వాత బాధపడేకంటే... జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శిక్షలు ఇలా ఉద్దేశపూర్వకంగా యాసిడ్ దాడి చేసి గాయపరిస్తే ఐపీసీ సెక్షన్ 326-ఎ ప్రకారం పదేళ్లు లేదా జీవిత ఖైదు, జరిమానా ఉద్దేశపూర్వకంగా యాసిడ్ దాడికి ప్రయత్నిస్తే ఐపీసీ సెక్షన్ 326-బి ప్రకారం ఐదు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా స్త్రీ తత్వానికి భంగం కలిగించేలా, అవమానించేలా, దౌర్జన్యం/ బలప్రయోగం చేస్తే ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ఏడాది నుంచి ఐదేళ్ల వరకు శిక్ష, జరిమానా లైంగిక వేధింపులు (ఫోన్ ద్వారా అయినా), అశ్లీల చిత్రాలు చూపించడం చేస్తే ఐపీసీ సెక్షన్ 354-ఎ ప్రకారం మూడేళ్ల జైలు, జరిమానా దౌర్జన్యం/బలప్రయోగం ద్వారా వివస్త్రను చేస్తే ఐపీసీ సెక్షన్ 354-బి ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా స్త్రీల రహస్యాంగాలను చాటుగా చూసినా, ఫొటోలు తీసినా ఐపీసీ సెక్షన్ 354-సి ప్రకారం ఏడాది నుంచి ఏడేళ్ల జైలు దురుద్దేశంతో స్త్రీని భౌతికంగా కానీ, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా కానీ పదేపదే వెంబడిస్తే ఐపీసీ సెక్షన్ 354-డి ప్రకారం ఐదేళ్ల జైలు, జరిమానా మహిళల్ని అక్రమ రవాణా చేసి వ్యభిచారం చేయిస్తే ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం ఏడు నుంచి పదేళ్ల జైలు, జరిమానా ఒకరి కంటే ఎక్కువ మందిని/మైనర్‌ను అక్రమ రవాణా చేసి వ్య భిచారం చేయిస్తే గరిష్టంగా 14 ఏళ్లు లేదా జీవితఖైదు విధిస్తారు {పభుత్వ ఉద్యోగి లేదా పోలీసు అధికారి అక్రమ రవాణాకు పాల్పడితే మరణించే వరకు జీవిత ఖైదు అక్రమ రవాణాకు గురైన వారిని వ్యభిచారంలోకి దింపితే ఐపీసీ సెక్షన్ 370-ఎ ప్రకారం ఐదు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా అత్యాచారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష లేదా చనిపోయే వరకు జీవిత ఖైదు అత్యాచారం కారణంగా లేదా గాయపరిచిన కారణంగా సదరు మహిళ చనిపోతే ఐపీసీ 376-ఎ ప్రకారం 20 ఏళ్ల జైలు లేదా మరణించే వరకు జీవిత ఖైదు న్యాయబద్ధంగా విడిపోయి వేరుగా నివసిస్తున్న భార్యను బలాత్కరిస్తే ఐపీసీ సెక్షన్ 376-బి ప్రకారం రెండు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా అధికారాన్ని వినియోగించి మహిళలను లొంగదీసుకుంటే ఐసీపీ సెక్షన్ 376-సి ప్రకారం ఐదు నుంచి పదేళ్ల జైలు, జరిమానా మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 376-డి ప్రకారం 20 ఏళ్ల జైలు లేదా చనిపోయే వరకు జీవితఖైదు ఒకటి కంటే ఎక్కువ సార్లు అత్యాచారం చేస్తే ఐపీసీ సెక్షన్ 376-ఇ ప్రకారం మరణించే వరకు జీవితఖైదు మహిళల్ని అల్లరిపెట్టి అవమానపరిస్తే ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం మూడేళ్ల జైలు, జరిమానా అఘాయిత్యాలకు ప్రధాన కారణాలివి.. 1. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం 2. విదేశీ సంస్కృతి మోజులో యువత దారి తప్పడం 3. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సరైన సత్సంబంధాలు లేకపోవడం 4. మత్తుమందులు, వ్యసనాలకు బానిసైన యువకులు 5. సినిమా, మాస్ మీడియాల్లో మితిమీరుతున్న అశ్లీల ప్రభావం 6. మహిళల్ని వ్యాపార వస్తువుగా చిత్రీకరిస్తున్న ప్రకటనలు 7. చదువుకునే వయస్సులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఆకర్షణ, ప్రలోభాలకు లోను కావడం 8. విపత్కర పరిస్థితుల్లో యువతులు, మహిళలు ఆత్మవిశ్వాసం కోల్పోవటం -
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు మైనర్ బాలుర్లతో పాటు ఓ వ్యక్తిపై నిర్భయ చట్టం కింద భవానీనగర్ పోలీసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.... బాలికను నమ్మించి బయటకు తీసుకువెళ్లిన స్నేహితుడు.... ఓ వాహనంలో తిప్పుతూ తన స్నేహితులతో పాటు ఓ వ్యక్తి సహా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిపై నిర్భయ చట్టంతో పాటు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మల్కాజ్‌గిరిలో కూడా ఓ బాలికపై ఇంటి పక్కన ఉండే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతి 20 నిమిషాలకో అత్యాచారం!!
మన దేశంలో ప్రతి 20 నిమిషాలకు ఓ మహిళ అత్యాచారానికి గురవుతోంది. ప్రతి 53 నిమిషాలకు ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్భయ చట్టం కింద ఈ ఏడాది 110 కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధికం విద్యాధికులు, ఉన్నత ఉద్యోగులు ఉండే మాదాపూర్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. మొత్తం 110 కేసులకు గాను 15 కేసులు మాదాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోనే నమోదయ్యాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరోతో పాటు మన రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న నేరాల తీరు నానాటికీ పెచ్చుమీరుతోంది. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధించడం, అవకాశం దొరికితే అత్యాచారాలకు పాల్పడటం లాంటివి ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో ఆపదసమయంలో ఆత్మరక్షణకోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా అనేక వాటి మీద హైదరాబాద్‌లో సంకల్ప్ ఉమెన్ స్పోర్ట్స్ అలయన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. మహిళలపై జరిగిన లైంగిక దాడుల్లో 80 శాతం పోలీస్ స్టేషన్ వరకు రావు. నిర్భయ ఘటన తర్వాత ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దారుణాలు తగ్గడం లేదు. ఈ పరిస్థితిలో మహిళలకు కరాటే, కుంగ్ ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మంచిదని మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ బాబు అన్నారు. -
కరీంనగర్ జిల్లాలో బాలికపై యువకుడి అత్యాచారం
కరీంనగర్: మహిళలపై, బాలికలపై ఆకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఓ వైపు అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఈ ఘటనలు ఆగడం లేదు. వీరి ఆగడాలను రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకవచ్చిన నిర్భయ, అభయ వంటి చట్టాలు ఉన్నా మహిళలకు, బాలికలకు రక్షణ కరువైంది. తాజాగా కరీంనగర్ జిల్లాలోని కోరుట్లో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ బాధితురాలి బంధువులు అక్కడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బీజేపీ నేత ప్రేమ్‌సింగ్ రాథోడ్‌పై నిర్భయ కేసు
హైదరాబాద్: బీజేపీ నేత ప్రేమ్‌సింగ్ రాథోడ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.... కంటోన్మెంట్లో అక్రమ కట్డడాల కూల్చివేతల్లో భాగంగా గత నెల 21వ తేదీన ప్యారడైజ్ సమీపంలోని అగ్రసేన్ భవన్లో ఇటీవల నిర్మించిన భననాన్ని అధికారులు కూల్చివేసారు. దీనికి నిరసనగా మాజీ ఎంపీ గిరిష్సంఘీ సహా, ప్రేమ్‌సింగ్‌రాథోడ్ మరి కొందరు అగ్రసేన్భవన్లో అనుమతి లేకుండా సమావేశం నిర్వహించారు. దీంతో పాటు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ విషయమై వీరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో కీలక పాత్ర వహించిన కంటోన్మెంట్ సీఈవో సుజాతాగుప్తా వ్యక్తిగత, వైవాహిక జీవితంపై ప్రేమ్‌సింగ్ వివాదస్పదవ్యాఖ్యలు చేశారు. ప్రేమ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 26వ తేదిన ప్రేమ్‌సింగ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘రంజితం' కాని వ్యాఖ్యలు!
సంపాదకీయం: ఆడపిల్లలపై సమాజంలో నెలకొన్న వివక్షపై దేశం నలుమూలలా లోతైన చర్చకు కారణమైన నిర్భయ ఉదంతం జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. న్యూఢిల్లీ రాజవీధుల్లో నడుస్తున్న బస్సులో ఒక యువతిపై అమానుషంగా నలుగురు దుండగులు సాగించిన హింసాకాండ, సామూహిక అత్యాచారం అందరినీ కదిలించాయి. ఆగ్రహోదగ్రులను చేశాయి. ఇకపై ఇలాంటివి జరగనీయరాదన్న పట్టుదలను పెంచాయి. అందుకు ఏంచేయాలో రోడ్లపైకి వచ్చిన ప్రజానీకమే ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేసింది. ఆడపిల్లల విషయంలో కనబడుతున్న ఈ ఆదుర్దా, ఈ ఆందోళన ఒక మంచి మార్పునకు దారితీయగలదని అందరూ అనుకున్నారు. మహిళలను సాటి పౌరులుగా చూసే ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడటానికి ఇది దోహదపడుతుందని భావించారు. ఆ ఆందోళనలపై అప్పట్లో నోరుజారిన కొందరు నేతలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమై చివరకు వారు క్షమాపణలు చెప్పేదాకా కూడా వచ్చింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఇకపై నోరు సంబాళించుకుంటారని అనుకున్నారు. కానీ, పరిస్థితేమీ మారలేదని సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా మంగళవారం చేసిన వ్యాఖ్య తెలియజెబుతోంది. బెట్టింగ్‌ను చట్టబద్ధం చేస్తే నష్టమేమీ లేదని, ఇంచుమించు అదే తరహాలో సాగుతున్న లాటరీ, కేసినోల వంటివాటిని అనుమతిస్తూ బెట్టింగ్‌ను మాత్రమే నిషేధించడం సరికాదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. అక్కడితో ఊరుకుంటే బాగుండేది. కానీ, ఆయన ఇంకాస్త ముందుకెళ్లి... బెట్టింగ్‌పై నిషేధాన్ని అమలుచేయలేకపోవడం ఎలాంటిదంటే ‘రేప్‌ను నిరోధించలేకపోతే దాన్ని ఆస్వాదించండి’ అని చెప్పడం లాంటిదని ఉదహరించారు. ఇందులో అత్యాచారానికి సంబంధించిన అంశాన్ని లాక్కొచ్చి చెప్పిన మాటలు సహజంగానే అందరికీ అభ్యంతకరంగా తోచాయి. చట్టం ఉన్నా అమలు చేయలేకపోవడమనే స్థితిని గురించి చెప్పడానికి ఇంతకన్నా ఆయనకు వేరే మంచి మాటలేవీ దొరకలేదా అని ఆవేదన వ్యక్తం చేసినవారున్నారు. అత్యాచారానికి సంబంధించి చెప్పిన మాటలతో ఆయనకు ఏకీభావం ఉన్నట్టు కనబడకపోయినా ... మహిళలపై జరిగే అత్యంత హేయమైన నేరాన్ని ఉదాహరణగా ఎందుకు చెప్పాల్సివచ్చిందన్న ప్రశ్న తలెత్తుతుంది. న్యూఢిల్లీ ఘటన తర్వాత జరిగిన ఆందోళనల పర్యవసానంగా మహిళలపై జరిగే అన్ని రకాల నేరాలకూ కాస్తయినా అడ్డుకట్ట పడగలదని ప్రజలంతా భావించారు. కానీ, అది అడియాసే అయింది. ఢిల్లీలోనే గతంతో పోలిస్తే ఆ తరహా నేరాల సంఖ్య పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఎప్పటిలాగే మహిళలపై జరిగే నేరాల్లో శిక్షల శాతం 24 కంటే తక్కువుంది. దాదాపు 76 శాతం కేసుల్లో ఆరోపణలు రుజువుకాకపోవడంతో ఎప్పటిలాగే దోషులు తప్పించుకుంటున్నారు. ఎఫ్ఐఆర్ల నమోదు దగ్గరనుంచి దర్యాప్తుల వరకూ ఎప్పటిలాగే అంతా నత్తనడకే నడుస్తోంది. పరిస్థితులు ఎప్పటిలాగే ఉన్నాయి గనుక మహిళలపై నేరాలు కూడా యథాతథంగానే సాగుతున్నాయి. ఇంకా పెరిగాయి కూడా. మహిళలపై సాగుతున్న నేరాలకు మూలాలు ఎక్కడున్నాయో ఇప్పుడు స్పష్టంగానే తెలుస్తుంది. సమాజాన్ని సరైన దోవలో నడిపించాల్సినవారిలో అందుకు అవసరమైన పరిణతి లేకపోవడం, ఆ తరహా కేసుల విషయంలో వ్యవహరించడానికి అవసరమైన సున్నితత్వం వారిలో లోపించడం ఇందుకు ప్రధాన కారణాలు. సరిగ్గా నిర్భయ ఉదంతంపై దేశమంతా ఆగ్రహోదగ్రమై ఉన్న వేళ ఢిల్లీలోని ఒక హోటల్లో తనపై సుప్రీంకోర్టు జడ్జి ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని యువ మహిళా న్యాయవాది వెల్లడించి అందరినీ దిగ్భ్రాంతిపరిచారు. రంజిత్ సిన్హా దేశంలోని అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థ సీబీఐకి అధిపతి. పైగా ఆయన ఇలా మాట్లాడింది ‘క్రీడల్లో నైతిక విలువలు-విశ్వసనీయత’ అనే అంశానికి సంబంధించిన సదస్సులో. క్రీడల్లో ఉండాల్సిన నైతిక విలువలగురించి ప్రబోధించే పోలీసు అధికారి అంత సులభంగా అత్యాచారం గురించి ప్రచారంలో ఉన్న మాటల్ని ప్రయోగించడం దిగ్భ్రాంతికరమైన విషయం. అత్యాచారంపై సమాజంలో వేళ్లూనుకున్న పితృస్వామిక భావజాలం ఈ తరహా ఆలోచనకు మూలం. నిర్భయ ఘటనకు ముందూ తర్వాత కూడా చాలాచోట్ల రాజకీయ నాయకులు, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు అత్యాచారాల విషయంలో మహిళలపై నిందలేయడానికి తాపత్రయపడటం వెనకున్న ప్రధాన కారణం ఇదే. మహిళలు ధరించే దుస్తులే వారిపై నేరాలకు పురిగొల్పుతున్నాయని ఒకరంటే, ఆ విషయంలో ఇంకొంచెం ముందుకెళ్లి మహిళలకు డ్రెస్ కోడ్ నిర్దేశించినవారు మరొకరు. ఉన్నత విలువలను, ఉత్తమ సంస్కారాన్ని పెంపొందించాల్సినవారే ఇలావుంటే సాధారణ వ్యక్తులు మహిళల విషయంలో ప్రజాస్వామిక ధోరణితో వ్యవహరిస్తారని ఆశించలేం. చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నా మహిళలను సాటి వ్యక్తిగా గుర్తించి గౌరవించే ధోరణి పెరగకపోవడానికి పురుషుల ఆలోచనా ధోరణిలో ఉన్న వెనకబాటుతనమే కారణమని విశ్లేషకులు చెబుతారు. మహిళలకు అన్నిరంగాల్లోనూ సమానావకాశాలు కల్పించినప్పుడే ఈ వెనకబాటుతనం పోతుందంటారు. అందుకు నార్వే పెద్ద ఉదాహరణ. అక్కడ శతాబ్దం క్రితం మహిళల పరిస్థితి దయనీయంగా ఉండేది. అప్పట్లో వారికి కనీసం ఓటు హక్కు కూడా లేదు. కానీ, వర్తమాన నార్వేలో వారిది గౌరవప్రదమైన స్థానం. పార్లమెంటులో 39.6 శాతం మంది మహిళా ప్రతినిధులుండగా, స్థానిక సంస్థల్లో వారి శాతం 40. ఇందువల్ల వచ్చిన ఫలితాలు కూడా సామాన్యమైనవి కాదు. స్త్రీ, శిశు సంక్షేమ పథకాల్లో ఆ దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. గతంలో నోరుజారినవారిలాగే ఇప్పుడు రంజిత్‌సిన్హా కూడా క్షమాపణ కోరారు. అయితే, సమస్య అది కాదు. ఇలాంటి ఆలోచనాధోరణిని మార్చడానికి ఏంచేయాలన్న విషయంపై అందరూ దృష్టిపెట్టాలి. లోటుపాట్లను గమనించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. -
మైనర్ బాలికపై వేధింపులు: నిందితులు అరెస్ట్
గుంటురు జిల్లా బాపట్లలోని పటేల్ నగర్లో మైనర్ బాలికపై ప్రేమ వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. స్థానిక పటేల్ నగర్‌లోని మైనర్ బాలికను తమను ప్రేమించాలంటూ గత కొద్దికాలంగా గోపికృష్ణ, కొండరెడ్డిలు వేధిస్తున్నారు. ఆ క్రమంలో తమను ప్రేమించకుంటే ముఖంపై యాసిడ్ పోస్తామని వారిరువురు గురువారం మైనర్ బాలికను బెదిరించారు. దాంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు వెల్లడించింది. దీంతో వారు బాపట్ల పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ మైనర్ బాలిక తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు గోపికృష్ణ, కొండారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిపై నిర్భయ కేసు నమోదు చేశారు. -
వివాహితపై సామూహిక అత్యాచారం
సాక్షి, విజయవాడ : విజయవాడ రైల్వే అప్‌యార్డులో మంగళవారం ఓ ప్రయాణికురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. రైల్వే ఎస్పీ డాక్టర్ సీహెచ్ శ్యామ్‌ప్రసాద్ కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఈడిగ గ్రామానికి చెందిన వివాహిత (27) హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి వెళ్లడానికి సోమవారం రాత్రి పిడుగురాళ్లలో రెలైక్కింది. రైలు విజయవాడకు చేరుకున్న తర్వాత రాజమండ్రికి ప్యాసింజర్ రైలులో వెళ్లే ఉద్దేశంతో డీజిల్ మల్టీ యూనిట్ (డీఎంఈ) ఎక్కి కూర్చుంది. ఈలోగా రైలును శుభ్రపరిచే నిమిత్తం అప్ యార్డుకు తరలించారు. రైలు వెళ్తున్న సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు రైలు డ్రైవర్‌కు మొరపెట్టుకోగా ఇటువంటి సంఘటనలు సహజమని అతనికి సహకరించాలంటూ ఉచిత సలహా ఇచ్చాడు. రైలులోనే పడిఉండగా క్లీనింగ్ సిబ్బంది తనను పొదల్లోకి తీసుకువెళ్లి వారు కూడా అత్యాచారం చేసినట్లు వాపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. చిన్నారిపై బాలుడి అఘాయిత్యం ఖమ్మం: అయిదేళ్ల చిన్నారిపై ఓ బాలుడు(13) లైంగిక దాడి చేశాడు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంలోని చిన్నారి మంగళవారం పక్కింటికి వెళ్లింది. ఆ ఇంటిలోని బాలుడు చాక్లెట్ ఇస్తానంటూ చిన్నారిని లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కొద్దిసేపటి తరువాత చిన్నారి ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులు తీవ్రంగా రక్తస్రావమవడాన్ని గమనించి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, బాలుడు పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. కీచక ఉపాధ్యాయుడి సస్పెన్షన్ చిలుకూరు: పదో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడిపై నల్లగొండ జిల్లా విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ప్రాథమిక విచారణ జరిపించిన అనంతరం పీఈటీ విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో జగదీష్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడిపై నిర్భయ చట్టంకింద కేసు నమోదు చేశారు.