హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు మైనర్ బాలుర్లతో పాటు ఓ వ్యక్తిపై నిర్భయ చట్టం కింద భవానీనగర్ పోలీసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.... బాలికను నమ్మించి బయటకు తీసుకువెళ్లిన స్నేహితుడు.... ఓ వాహనంలో తిప్పుతూ తన స్నేహితులతో పాటు ఓ వ్యక్తి సహా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిపై నిర్భయ చట్టంతో పాటు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మల్కాజ్గిరిలో కూడా ఓ బాలికపై ఇంటి పక్కన ఉండే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.