కోల్‌కతా: నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటినా సమాజంలో మార్పు రాలేదని, మహిళలపై అకత్యాలు కొనసాగుతూనే ఉన్నాయని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారమిక్కడ జరిగిన ఓ ఆధ్మాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో గ్యాంగ్‌రేప్ బలైన నిర్భయం చివరకంటూ మృత్యువుతో పోరాడి సింగపూర్ లో మరణించిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల తర్వాత సమాజంలో మంచి దిశగా ఏమైనా మార్పు కనిపించిందా అని విలేకరులు అడగ్గా.. ఈ తరహా ఘటనలపై ఇంకా మార్పు రాకపోవడం దురదృష్టకరంగా ఆమె పేర్కొన్నారు.
సమాజంలో మార్పు రాలేదు:మీరా కుమార్
Published Sun, Dec 29 2013 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
Advertisement
Advertisement